బ్లూ టెర్రర్... ఇదో కొత్త తరహా టెర్రరిజం... వైట్ కాలర్ టెర్రరిజం... బాంబులు పేల్చకుండా.. కాల్పులు జరపకుండా, దాడులు చేయకుండానే భయాన్ని సృష్టించే కొత్త టెర్రరిజం... ఇది నిజం.. మీకు తెలియకుండానే మిమ్మల్ని మరొకరు గమనిస్తున్నారు.. మీ మాటల్ని వింటున్నారు.. మీ ప్రెユవసీని కాజేస్తున్నారు.. మీ సెల్‌ఫోన్‌లోని ఎస్‌ఎంఎస్‌లను చదివేస్తున్నారు.. మీ ఫోన్‌లోని పర్సనల్ ఫోటోలను దొంగిలిస్తున్నారు.. ఆశ్చర్యం కాదు.. విస్తు కొలిపే అంశం ఇది.. ఒళ్లు గగుర్పొడిచే విషయమిది..
సరి కొత్త ఫీచర్లతో కొత్త ఫోన్ కొన్నారా? హైఫై టెక్నాలజీ, ఐఆర్, ౫ ఎంపి కెమెరా, జిపిఆర్‌ఎస్, నావిగేషన్, ౩జి, బ్లూటూత్..మ్యూజిక్ ఎడిషన్... అబ్బో ఇన్ని ఫీచర్లు.. పోస్ట్ మోడ్రన్ సెల్‌ఫోన్... స్నేహితులంతా చూసి మెచ్చుకునే ఉంటారు.. కానీ, సంబరపడిపోకండి... మీరు ఎంతో ఆత్రంగా కొనుక్కున్న ఫోన్‌ను మీకు తెలియకుండానే ఎవరో వాడుకుంటున్నారంటే మీకొచ్చే కోపాన్ని ఆర్థం చేసుకోవాల్సిందే...
కానీ, నిజం.. మీ ఫోన్ మీ చేతుల్లోనే ఉంటుంది.. కానీ, మీ నెంబర్ నుంచి అవుట్‌గోయింగ్ కాల్స్ వెళ్తుంటాయి... ఎస్‌ఎంఎస్‌లూ వెళ్లిపోతాయి.. ఇంటర్నెట్ డౌన్‌లోడ్‌లు కూడా అవుతాయి.. ప్రీపెయిడ్ అయితే, క్షణాల్లో జీరో బ్యాలెన్స్‌లోకి వెళ్లిపోతారు.. పోస్ట్‌పెయిడ్ అయితే నెల తిరిగేసరికి వచ్చే బిల్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి...
ఇంకా అర్థం కాలేదా? ఇది నిజం.. టెక్నాలజీ అభివృద్ధి చెందిందని మనం తెగ ఆనందపడిపోతున్నామే కానీ, అదే మన కొంప ముంచుతోంది.. సెల్‌ఫోన్‌లలో ఉండే బ్లూటూత్ వంటి వైర్‌లెస్ టెక్నాలజీని ఎంచక్కా దొంగలిస్తున్నారు సెల్ హాకర్లు... ఇన్నాళ్లూ కంప్యూటర్ హాకింగ్ గురించి విన్నాం.. ఇప్పుడు సెల్ హ్యాకింగ్ మొదలైంది. మీ ఫోన్ డివైస్‌లో బ్లూటూత్ ఆప్షన్ ఆన్‌లో ఉంటే చాలు.. ఎవరైనా మీ ఫోన్‌ను ఎంచక్కా హాక్ చేయవచ్చు. మీ ఫోన్‌లో ఉన్న అన్ని ఎస్‌ఎంఎస్‌లు, ఇమేజెస్‌ను, వీడియోలను చూసుకోవచ్చు. మీ కన్వర్జేషన్‌ను వినేయవచ్చు..
ఇంతకీ బ్లూటూత్ ఆప్షన్‌ను ఎలా హాక్ చేస్తారు? మన ఫోన్‌ను మనకు తెలియకుండా ఇతరులు వాడటం సాధ్యమేనా? ఎస్..మన బ్లూటూత్‌ను యాక్టివేట్ చేసినప్పుడు అందులోకి పొరపాటున ఇతరులను అనుమతించామా.. ఇక అంతే సంగతులు.. సూపర్ బ్లూటూత్ హాక్ సాఫ్ట్‌వేర్ లాంటి ఆధునిక హాకింగ్ సాఫ్ట్‌వేర్లను మన డివైస్‌లోకి పంపించేస్తారు.. అంతే ఇక మన ఫోన్ హాకర్ల చేతులో పడినట్లే.. మన ఫోన్ మన చేతులోనే ఉంటుంది.. ఇతరులు దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు..
బ్లూటూత్ హాకింగ్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి...రకరకాల సమస్యలతో వినియోగదారులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు...
..................
మీ ఫోన్ మీ జేబులోనే ఉంది.. మీరే వాడతారు.. సాధారణంగా ఎవరికీ ఇవ్వరు.. కానీ, ఓరోజు మీకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది.. ఫలానా ఫోన్‌కు అసభ్యకరంగా కాల్స్ చేసి ఫలానా అమ్మాయిని వేదిస్తున్నావట? తమాషాగా ఉందా? అంటూ పోలీస్ హెచ్చరిస్తాడు.. ఇదేమిటని ఆశ్చర్యపోయే లోగానే.. ఏంటి బాస్.. మొన్న డబ్బులడిగావు...ఫలానా అకౌంట్‌లో వేయమని.. వేశాను చూసుకున్నావా అని మరో స్నేహితుడు వచ్చి పలకరించాడు... మీరు ఆ కాల్స్ చేయలేదు.. డబ్బుల కోసం ఎవరినీ అడగలేదు.. అయినా మీ ఫోన్ లోని బ్లూటూత్ ఆ పని చేసింది..
ప్రధానంగా వ్యాపారులకు ఈ పరిజ్ఞానం శాపంగా మారిపోయింది. అర్జెంట్ కాల్స్ అటెండ్ చేసేందుకు బ్లూటూత్‌ను ఎక్కువగా వాడేది వ్యాపారులే.. వీళ్ల లావాదేవీలన్నీ హాకర్ల కారణంగా గందరగోళంలో పడుతున్నాయి. ఈ హ్యాకర్లను పట్టుకోవటం అంత తేలికేమీ కాదు.. అందుకే ప్రజలే జాగ్రత్తగా ఉండటం అవసరం..
బ్లూటూత్‌ను అవసరమైనప్పుడే యాక్టివేట్ చేయాలి.
బ్లూటూత్ యాక్టివేట్‌లో ఉన్నప్పుడు తెలియని వాళ్లు లైన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయాలి.
తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో బ్లూటూత్ అనుమతి ఇవ్వవద్దు
యాంటీ హాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో లోడ్ చేసుకుంటే మంచిది.
2 కామెంట్లు:
Nice and useful info.
Chala Bagundi andi mee blog. plz check my site for Telugu Cinema News, Photos & Reviews
కామెంట్‌ను పోస్ట్ చేయండి