5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

చరిత్రను మరచిన వారు అవే తప్పులను మళ్లీ మళ్లీ చేస్తారు. మన దేశంలో ఒక పద్ధతి ప్రకారం చరిత్రను మరుగు పరచి కొందరికి అనులమైన విషయాలే చరిత్రగా ప్రచారం అయ్యాయి. దాంతో దేశ విభజన జరిగిన తరువాత కూడా దేశమయితే విడివడింది కానీ, దేశ ప్రజల మనస్సులలో మొలచిన విద్వేష విష బీజాల, అనుమాన విష నాగుల రోజు రోజు అభివద్ధి చెంది శక్తిమంతమవటం తప్ప తరిగిపోవటం లేదు. ఇందుకు ప్రధాన కారణం నిజానిజాలను నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా, నిష్పాక్షికంగా చర్చించే బదులు అప్రియమైన సత్యాలను అట్టడుగున దాచి, ప్రియమైన అబద్ధాలకు మసిపూసి మారేడుకాయ చేయటమే. నిజం నిప్పులాంటిది. దాన్ని అణచివేయాలని  ప్రయత్నించటం ప్రమాదకరం. అలా అణచిపెట్టాలన్న ప్రయత్నం వల్ల, అలా అణచిపెట్టేవారు, వారి చుట్టూ ఉన్న వారు కూడా దగ్ధమవుతారు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నది అదే. ప్రతి ఒక్కరూ వారి వారి దృష్టిని అనుసరించి వ్యాఖ్యానిస్తున్నారు. అర్థ సత్యాన్ని,   అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. దాంతో ‘సత్యం’ కూడా అసత్యంగా భావించే పరిస్థితుల నెలకొంటున్నాయి. ఏది సత్యం? ఏది అసత్యం? కూడా నిర్ధారించుకోలేని దుస్థితి సమాజంలో స్థిరపడుతున్నది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో చేదు సత్యాలను ప్రజలు భరించగలరా? ఎందుకంటే విభజన సంఘటనలు ఒక రోగానికి లక్షణాలే తప్ప కారణం కాదు. కారణం విడిచి లక్షణాలను గుర్తు పెట్టుకుంటే ఫలితం ఉండదు. కాబట్టి లక్షణాల గురించి చర్చించే కన్నా ముందు కారణాలను లోతుగా చర్చించాలి, విశ్లేషించాలి. ఈ ఉద్దేశంతో దేశవిభజన నాటి భయానక స్మృతులకు దారి తీసిన కారణాలను మూలాల నించ పరిశోధించి, ప్రామాణికమైన చారిత్రక సత్యాలను, ఆధునిక పరిస్థితులకు అన్వయించి వ్యాఖ్యాన సహితంగా, ఆసక్తికరమైన చరిత్ర ఆధారిత వ్యాస పరంపర ‘దేశ విభజన విషవృక్షం’ రాసే బాధ్యతను కోవెల సంతోష్ కుమార్ స్వచ్ఛందంగా స్వీకరించాడు. అదే పరంపర ఇప్పుడు కల్లోల భారతం పేరుతో పుస్తక రూపంలో వస్తున్నది. 

కల్లోల భారతం పుస్తకం సెప్టెంబర్ 17వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తున్నది. పుస్తకాన్ని సాహితి ప్రచురణలు వారు ప్రచురిస్తున్నారు.

పుస్తకం వెల: రూ.300, 

ప్రీ పబ్లికేషన్ ఆఫర్: రూ.250+ 25 పోస్టల్ చార్జీలు అదనం.

పుస్తకం కావలసినవారు 9052116463 ఫోన్ నెంబర్ కు వాట్సప్ ద్వారా మీ చిరునామాను పిన్ కోడ్ తో సహా పంపించండి. ఇదే నంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అమౌంట్ పే చేయవచ్చు.




నా అసలు పేరు అందరూ మర్చిపోయారు: ప్రముఖ రచయిత సుధామతో..కస్తూరి మురళీకృష్ణ...



నా అసలు పేరు అందరూ మర్చిపోయారు: ప్రముఖ రచయిత సుధామతో..కస్తూరి మురళీకృష్ణ సంభాషణం