29, మే 2010, శనివారం

కూలిందా? కూల్చారా? రాజగోపుర రహస్యం


శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయింది. అయిదు శతాబ్దాల చరిత్ర అంతా చూస్తుండగానే నిట్టనిలువునా సమాధి అయిపోయింది. విజయనగర సామ్రాజ్య విజయ పతాక పతనమైపోయింది.. ఎందుకిలా జరిగింది? అత్యంత పురాతనమైన నిర్మాణం ఎలా కూలిపోయింది? అది సహజంగా కూలిపోయిందా? అసహజంగా కూల్చేశారా? రాజగోపురం కూలిపోవటానికి ముందు ఏం జరిగింది? అన్నీ అనుమానాలే.. అన్నీ సందేహాలే.. లోగుట్టు తెలిసేదెవరికి.. సాక్షాత్తూ వాయులింగేశ్వరునికైనా తెలుసా?

శ్రీకాళహస్తి రాజగోపురం ఎలా కూలిపోయింది?
కూలిందా? కూల్చేశారా?
ఒకవైపు మాత్రమే బీటలు వారిన గోపురం నిట్టనిలువునా ఎలా కూలింది?
గోపురం కూలిపోవటానికి పదిహేను నిమిషాలకు ముందు దానిపైకి ఎక్కిన ఇద్దరు ఎవరు?
గోపురం రెండో అంతస్థులోకి ప్రవేశించిన ఆ ఇద్దరు అక్కడ ఏం చేశారు?
గోపురం రెండో అంతస్థులో జరిగింది ఏమిటి?
గోపురం కూలేముందు ఎలాంటి శబ్దాలు వచ్చాయి?
గోపురంలో సౌండ్‌ప్రూఫ్‌ బాంబులు పెట్టి పేల్చారా?
శిథిలాల తొలగింపునకు అప్పటికప్పుడు చెనై్న నుంచి వాహనాలు ఎలా వచ్చాయి?
అంతా పథకం ప్రకారమే జరిగిందా?
కూల్చివేత పథకానికి సూత్రధారులు ఎవరు?

part-1
నిజం.. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని రాజగోపురం కూలిపోవటంపై అనుమానాలు తీవ్రమవుతూనే ఉన్నాయి.. దేవాలయ అధికారులు.. దేవాదాయశాఖ అధికారులు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అనుసరించిన విధానం గోపురాన్ని అసహజంగా కూల్చివేశారనే వాదనలకే బలం చేకూరుతోంది.. దీనికి ఎవరు బాధ్యులు.. ? ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందెవరు?

శ్రీకాళహస్తి పవిత్ర రాజగోపురం నిట్టనిలువునా కూలిపోవటానికి కారకులు ఎవరు? రాష్ర్టంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులను తొలుస్తున్న ప్రశ్న.. రాజగోపురం ఒక్కసారిగా కుప్పకూలటం సంచలనం సృష్టించింది.. ఎందుకు, ఎలా కూలిపోయింది? పరిరక్షించే ప్రయత్నాలు ఎందుకు జరగలేదన్నది జవాబులు దొరకని ప్రశ్నలు...

1517 తొలినాళ్లలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయలు గజపతులపై తన సమరాంగణ విజయ చిహ్నంగా కాళహస్తీశ్వరునికి కట్టిచ్చిన రాజగోపురం ఇది. ఇందులోని తొలి రెండు ప్రాకారాలు రాతితో నిర్మించినా.. మిగతా అయిదు ప్రాకారాలు ఇటుకతో నిర్మించారు.. 1979లోనే తొలిసారి రాజగోపురంపై పగుళ్లను గుర్తించారు.. దీన్ని పరిరక్షించే విషయంలో దేవాదాయ శాఖలో ఫైలు అటూ ఇటూ తెగ తిరిగింది.. 1990లలో మరోసారి దీనిపై పగుళ్లను పరిశీలించారు.. గోపురం కుడివైపు నెరల్రు వాచిన ప్రాంతంలో కొన్ని మరమ్మతులైతే చేశారు.. కానీ, గోపురాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ ఏనాడూ వహించలేదు..

గోపురం గురించి కొన్నాళ్ల క్రితం ప్రస్తుత ఇఓ ఎంతో గొప్పలు చెప్పారు.. పురాతన స్మృతి చిహ్నమైన కాళహస్తి రాజగోపురాన్ని కాపాడుకునేందుకు ఎంతో చేస్తున్నట్లు భుజాలు తడుముకున్నారు..
ఇదే పెద్ద మనిషి, వీర శివ భక్తుడు.. గోపురం కూలిన తరువాత వేదాంతం మాట్లాడటం మొదలు పెట్టారు..ఏ కట్టడానికైనా అంతం తప్పదంటున్నారు..కానీ, తమిళనాడులో వేల ఏళ్ల నాటి గుళు్ల, చారిత్రక ఆనవాళు్ల ఎలా పరిరక్షింపబడుతున్నాయో ఈయనగారికి కాస్తంతైనా తెలియదు..
ఇఓ మాటల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యమే రాజగోపురం కూలిపోవటానికి కారణం. గోపురాన్ని ఎలా రక్షించాలో తెలియక, దాని గురించి ఆలోచించనైనా ఆలోచించక నిష్కర్షగా కూల్చివేశారా? ఇది ప్రజల భావోద్వేగంతో ఆడుకున్నట్లు కాదా?
part-2

రాజగోపురాన్ని కూలిపోకముందే కూల్చేశారన్న వాదన ఎందుకు పెరుగుతోంది? దీని వెనుక వాస్తవాలు ఏమిటి? కూలిపోవటానికి ముందు కాళహస్తిలో ఏం జరిగింది? కేవలం ఒక వైపు మాత్రమే నెరల్రు వాచిన గోపురం మొత్తంగా కుప్పకూలటం సహజంగా జరిగిందేనా?
మే 26 న రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి రాజగోపురం నిట్టనిలువునా కూలిపోయింది? అంతకు ముందు నాలుగు రోజుల నుంచి రాజగోపురం శిథిలావస్థపై కథనాలు వినవస్తూనే ఉన్నాయి. ఐఐటి నిపుణులు, పురావస్తుశాఖ నిపుణులు వచ్చి పరిశీలించి మరీ వెళ్లారు.. ఏ క్షణానై్ననా కూలే అవకాశం ఉందంటూ నిపుణులు అప్పుడే చెప్పారు.
నిపుణులు హెచ్చరించిన మర్నాడే రాజగోపురం కూలిపోయింది.. మట్టిదిబ్బలా మారిపోయింది.. ఎలా సాధ్యమైందన్నదే అంతుపట్టని ప్రశ్న.. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి..
(అనుమానం నెం1)
రాజగోపురానికి కుడివైపున మూడు ఫీట్ల విస్తీర్ణంలో నిట్టనిలువునా పగులు ఏర్పడింది.. ఎడమ వైపున 75 శాతం గోపురం అంతా బాగానే ఉంది.. ఒకవేళ పగులు ఏర్పడిన భాగానికి ప్రధాన భాగానికి దూరం పెరిగితే కుడివైపు మొత్తం పడిపోవాలి. కానీ, గోపురం మొత్తం కూలిపోయింది.. ఇదెలా జరిగింది..?
కుడివైపున మాత్రమే పునాదులు కదిలినట్లు అధికారులే స్పష్టంగా చెప్తున్నారు..
(అనుమానం నెం2)
ఎడమ వైపు పటిష్ఠంగానే ఉందని చెప్పకనే చెప్తున్నారు.. అలాంటప్పుడు గోపురం మొత్తంగా నిట్టనిలువునా కూలే అవకాశాలు చాలా తక్కువని ఇంజనీర్లే అంటున్నారు.. కానీ, గోపురం పూర్తిగా పేకమేడలా ఎలా కూలిపోయింది?
(అనుమానం నెం.3)
రెండో అంతస్థు వరకు రాతికట్టడం ఉంది.. ఆ తరువాత ఇటుక కట్టడం ఉంది.. రెండో అంతస్థు పైనుంచి మిగతా గోపుర ప్రాకారాలన్నీ నిట్ట నిలువునా కూలిపోయింది...ఏం జరిగింది?
(అనుమానం నెం.4)
గోపురం కూలిపోవటానికి సరిగ్గా పదిహేను నిమిషాలకు ముందు ఇద్దరు వ్యక్తులు గోపురంలోని రెండో అంతస్థు లోకి వెళ్లి దాదాపు పదిహేను నిమిషాలు గడిపి వచ్చారు.. వారిద్దరు ఎవరు? రెండో అంతస్థులో వారేం చేశారు?

(అనుమానం నెం.5)
ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సెక్యూరిటీ చీఫ్‌లు ఇద్దరే లోపలికి వెళ్లి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షు్యల వాదన.. వాళ్లిద్దరు కానీ, ఇతర అధికారులు కానీ, ఎందుకు మౌనంగా ఉన్నారు?

(అనుమానం నెం. 6)
గోపురం కూలిపోయిన తరువాత తెల్లవారి ఉదయం దాకా శిథిలాలను తొలగించేందుకు ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు.. దేవాదాయ శాఖ కమిషనర్‌ వచ్చాక కానీ, తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేది లేదని అధికారులు చెప్పారు.. కమిషనర్‌ మధ్యాహ్నం రెండు గంటలకు కానీ రాలేదు.. కానీ, శిథిలాల తొలగింపును ఉదయం పదకొండు గంటలకు గుడి వెనుక వైపు నుంచి రహస్యంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమాన్ని కూడా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..?

(అనుమానం నెం.7)

దేవాదాయ శాఖ కమిషనర్‌ వచ్చి వెళ్లిన కొద్ది సేపటికే చెనై్న నుంచి మూడు పొక్లయినర్లు, 12 ట్రక్కులు వచ్చేశాయి.. ఎలాంటి పక్కా ప్రణాళిక లేకుండా ఇవి కాళహస్తికి ఎలా చేరుకున్నాయి..
గోపురం కూలినప్పుడు పిడుగులాంటి శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.. ఇది బాంబు పేల్చిన శబ్దమా? చారిత్రక ఆనవాలును ఎంతో అపురూపంగా కాపాడుకోవలసిన జాతి, బ్యూరోక్రసీ నిర్లక్ష్యానికి సమాధి అవుతున్న శిథిల చరిత్రను మౌనంగా చూసి రోదించాల్సిన స్థితి నెలకొంది..
part-3
శ్రీకాళహస్తి రాజగోపురం సహజంగా కూలిపోలేదనటానికి మరో బలమైన ఆధారం ఉంది.. గోపురం కూలిపోయిన నాటి నుంచి ముగ్గురు వ్యక్తుల జాడ తెలియటం లేదు.. శిథిలాల కింది నుంచి దుర్వాసన కూడా వస్తోంది.. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఎవరి దగ్గరా లేదు.. దీని వెనుక మతలబు ఏమిటి? అధికారులు ఏదైనా వ్యవహారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాళహస్తి రాజగోపురానికి అతి దగ్గరలో న్యూ గణేశ్‌ హోటల్‌ ఉంది.. ఈ హోటల్‌లో ఉన్న పనిచేసే రాజా అనే కార్మికుడు గోపురం కూలిన రాత్రి నుంచి కనిపించటం లేదు. అన్న జాడ వెతుక్కుంటూ రాజా తము్మడు రమేశ్‌ నెల్లూరు నుంచి కాళహస్తికి వచ్చి వాకబు చేస్తే, హోటల్‌ యజమాని తనకేం తెలియదన్నాడు.. మధ్యాహ్నమే వెళ్లిపోయాడన్నాడు..

నిజానికి హోటల్‌ వెనుక భాగంలో ఒక రేకుల షెడ్డు ఉంది.. గోపురం కూలినప్పుడు అది కూడా పూర్తిగా నేలమట్టమైంది.. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ముక్కు పుటాలు అదిరేలా దుర్గంధ వాసన బయటకు వస్తోంది.. ఈ శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు సమాధి అయినట్లు ప్రచారం జరిగింది.. అంతే కాదు.. అక్కడే ఉన్న స్టేట్‌బ్యాంక్‌ పరిసరాల నుంచి కూడా ఇదే రకమైన వాసన వస్తోంది. కానీ, అధికారులు మాత్రం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.. కారణం మాత్రం తెలియదు.. జాడ తెలియకుండా పోయిన వారిలో ఆలయ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నట్లు సమాచారం వస్తోంది.. వీరికి సంబంధించిన అన్ని రికార్డులనూ మాయం చేసినట్లు తెలుస్తోంది.. అధికారులు ఎందుకిలా చేశారు.? కారణం ఏమిటి? ఆలయ గోపురం ప్రమాద వశాత్తు కూలిపోవటం వాస్తవమే అయితే దుర్గంధం వస్తున్న చోట శిథిలాలను ఇంకా ఎందుకు తొలగించటం లేదు..? జాడ తెలియకుండా పోయిన వారి వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు?

గోపుర శిథిలాల కింద ఎవరైనా చనిపోవటం అంటూ జరిగితే అందుకు ఎవరు బాధ్యులు..? గోపురాన్ని అధికారులు కావాలనే కూల్చి వేసినట్లయితే, చుట్టుపక్కల ఎవరూ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తీరాలి... అలా కాకుండా అన్నీ చూసుకోకుండా తొందరపడి ఉంటే, ఎలాంటి అనర్థం జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. ప్రజల నుంచి, మిస్సింగ్‌ అయిన వారి బంధువుల నుంచి వెల్లువెత్తుతున్న అనుమానాలకు, ఆరోపణలకు జవాబు ఇవ్వలేని అధికార గణం రాజగోపుర రహస్యాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది..

22, మే 2010, శనివారం

సత్యానికి సంకెళ్లు

సత్యంబాబు తప్పించుకున్నాడు.. సత్యంబాబు దొరికిపోయాడు.. తప్పించకుకోవటమే ఒక విచిత్రం.. పారిపోయిన వాడు దొరకడం మరో విచిత్రం.. అయిదు గంటల హైడ్రామాలో విజయవాడ పోలీసులు నిర్వహించిన పాత్ర రిలీజ్‌ కంటే ముందే సంచలనం సృష్టిస్తున్న రాంగోపాల్‌వర్మ రక్తచరిత్రను మించిపోయింది.. అనేక ట్విస్ట్‌లు.. జవాబు లేని ప్రశ్నలు.. అనుమానాలు... ఆరోపణలు.. ఏం జరిగింది? దోషులెవరు? ఒక హత్య కేసులో నేరం రుజువు చేయటం కంటే ఇతర అంశాలపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలకు జవాబుదారీ ఎవరు?

ఉదయం పది గంటలు...
అయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు తప్పిపోయాడన్న వార్త దావానలంలా పాకింది...

ఉదయం 11 గంటలు..
మీడియాలో హడావుడి..

మధ్యాహ్నం 12గంటలు..
సత్యంబాబు తప్పించుకున్న కేసులో ఎస్కార్ట్‌ పోలీసుల సస్పెన్షన్‌

మధ్యాహ్నం 1 గంట..
సత్యంబాబును ఎన్‌కౌంటర్‌ చేశారన్న అనుమానాలు..

మధ్యాహ్నం 3 గంటలు..
సత్యంబాబు దొరికాడన్న వార్త...


మొత్తం అయిదు గంటలు.. శనివారం మధ్యాహ్నం పోలీసులు ఓ మ్యాట్నీ షోను చూపించారు.. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన సత్యంబాబు స్టోరీలో పోలీసులు మాత్రం ఫెయిలయ్యారు.. మొత్తం స్టోరీలో అన్నీ ట్విస్ట్‌లే.. అన్నీ సంచలనాలే.. మరెన్నో అనుమానాలే.. ? కొసమెరుపేమిటంటే పోలీసుల నుంచి తప్పించుకున్న సత్యంబాబు పోలీసులకే దొరకడం...

అయేషా హత్య కేసులో నడవలేని స్థితిలో ఉన్న నిందితుడు సత్యం బాబును మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెండు రోజుల క్రితం తీసుకువచ్చారు... నిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయిన తరువాత పోలీసులు తిరిగి విజయవాడకు బయలు దేరారు.. సూర్యాపేట దగ్గరకు వచ్చిన తరువాత భోజనం కోసం ఆగినప్పుడు సత్యం బాబు సంకెళ్లను తెంచుకుని పారిపోయాడు... వెంట ఉన్న పోలీసులందరినీ విజయవాడ సిపి సీతారామాంజనేయులు సస్పెండ్‌ చేశారు...
సత్యం ఎలా పారిపోయాడు? సంకెళ్లు తెంచుకుని పదిమంది పోలీసుల కళ్లు కప్పి పారిపోయే అవకాశం సత్యంకు ఉందా? సత్యం కేసులో సత్యానికి సంకెళ్లు వేస్తున్నది ఎవరు?
అయేషామీరా హత్యకేసులో అరెస్టు చేసిన తరువాత విచిత్ర పరిస్థితుల్లో సత్యం బాబు ఆరోగ్యం చెడిపోయింది... పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే విచిత్రమైన సిండ్రోమ్‌ అతణ్ణి పట్టుకుంది.. కనీసం నడిచే పరిస్థితిలో కూడా అతను లేడు.. కోర్డుకు సైతం పోలీసులు చేతుల మీద మోసుకురావలసిన పరిస్థితి. అంత అనారోగ్యంతో ఉన్న సత్యం బాబు చేతులకు ఉన్న సంకెళ్లు.. కాళ్లకు వేసుకున్న గొలుసులను తెంచుకొని ఎలా పారిపోగలిగాడు? అతనికి అంత శక్తి ఉందా? ఒక వేళ తెంచుకున్నాడే అనుకుంటే... నడిచే పరిస్థితిలోనే లేని వాడు.. పదిమంది పోలీసుల కళ్లు గప్పి ఎలా పారిపోగలిగాడు? ఇది సాధ్యమేనా? ఎలా జరిగింది..?
నిమ్స్‌లో ఉన్న రెండు రోజుల్లోనే సత్యం బాబు పూర్తి ఆరోగ్యవంతుడై పిటి ఉషలా పరిగెత్తే స్థాయికి చేరుకున్నాడా? అలా కానప్పుడు పారిపోవటం ఎలా సాధ్యపడింది? ఈ అనుమానాలే.. సత్యం పారిపోవటం వెనుక పోలీసుల పాత్రను అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.. సత్యంను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు పోలీసులు ఎత్తుగడ వేశారా? చివరకు పోలీసుల పాచిక ఫలించకుండా మీడియా అడ్డుపడటంతో సత్యంను తిరిగి వెలుగులోకి తెచ్చారా?

సత్యం బాబు సూర్యాపేటలో కళ్లు కప్పి ౮౦ కిలోమీటర్ల దూరంలోని నందిగామలోని డిఎస్‌పి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు.. సత్యం తప్పించుకుని ఎలా వెళ్లాడు? అతను మార్చుకున్న చొక్కా ఎవరిచ్చారు? సత్యం జిల్లా పరిధులు ఎట్లా దాటి వెళ్లగలిగాడు? అంటే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదా? పది మందిని మాత్రం సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారా? అయేషా హత్య కేసు మిస్టరీలాగానే, సత్యం పరారీ కూడా మిగలనుందా?

19, మే 2010, బుధవారం

గుర్తుకొస్తున్నాయి...

రాష్ట్ర రాజకీయాల్లో మే 20 , 2009 ఒక సంచలనాన్ని నమోదు చేసిన రోజు.. తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించి వరుసగా రెండోసారి వైఎస్‌ఆర్‌ అధికార ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. ఏడాది తిరిగిపోయింది.. అంతలోనే ఎంత మార్పు...వైఎస్‌ఆర్‌ అకాల మరణం రాష్ట్ర రాజకీయాల రూపు రేఖల్ని సమూలంగా మార్చేసింది.. అధికార పార్టీలో నిరుటి వెలుగులు ఇవాళ కనిపించటం లేదు..
ఆరేళ్ల పాటు ఏక వ్యక్తి నేతృత్వంలో విజయపరంపరలతో కొనసాగిన కాంగ్రెస్‌ ఇప్పుడు బేలగా ఎందుకు తయారైంది.....

సరిగ్గా ఏడాది క్రితం లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేష జనవాహిని సాక్షిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్న కలలను కల్లలు చేయటమే కాదు.. తెలంగాణా రాష్ట్ర సమితి తో సహా ప్రతిపక్షాలన్నింటినీ గుక్క తిప్పుకోకుండా చేసి చీలికలు, పేలికలు అయ్యే పరిస్థితిని తీసుకువచ్చారు..

వైఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతిపక్షాలకు ఊపిరి తీసుకోవటమే కష్టమైంది. ఆపరేషన్‌ ఆకర్ష కానీ, ఆపరేషన్‌ స్వగృహలు కానీ, మరే పేరు కానీ,,, రాజకీయాల్లో చాణుక్యుడనుకున్న చంద్రబాబులో సైతం కల్లోలం రేపిన రాజకీయం వైఎస్‌ఆర్‌ది..
తొలిసారి అధికారంలోకి వచ్చి అయిదేళ్లూ, మూడు సంక్షేమాలు.. ఆరు ప్రాజెక్టులన్న రీతిలో విజయవంతంగా పూర్తి చేశారు... సాధారణ మెజారిటీయే అయినా, వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి వైఎస్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు.. రాష్ట్రంలోనే సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రికార్డు సృష్టిస్తారనీ అంతా భావించారు. రెండో టర్మ్‌ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో విపక్షాలకు ఉనికే లేకుండా చేస్తారని భావించారు..కానీ అంతలోనే జరగరాని అనర్థం జరిగిపోయింది.. హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హఠాత్తుగా రాష్ట్ర ప్రజానీకానికి శాశ్వతంగా దూరమైపోయారు..
అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయాయి.. వైఎస్‌ఆర్‌ లేరన్న లోటు స్పష్టంగానే కనిపిస్తోంది. అటు ప్రజల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ.. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ను వైఎస్‌ లోటు చీలికలు పేలికలు చేసింది...

కాలం చక్రంలా తిరుగుతూనే ఉంది.. వైఎస్‌ లేకపోవటం అన్నది ఇవాళ్టికీ అనూహ్యమైంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు సంభవించిన ప్రతిసారీ, కొత్త సమీకరణాలు చోటు చేసుకున్న ప్రతిసారీ వైఎస్‌-- అధికార, విపక్షాలకు గుర్తుకురాని సందర్భం ఉండదు.. వైఎస్‌ అధికారంలో ఉన్నప్పటి రాజకీయానికీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ఎక్కడైనా పొంతన ఉందా?
వైఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించినప్పటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో ఆయన మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది.. ఆ తరువాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత వైఎస్‌కు ఎదురే లేకుండా పోయింది.. ౨౦౦౪లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 2009 సెప్టెంబర్‌ 2న ఆయన ప్రమాద వశాత్తూ మరణించేంత వరకూ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి అన్నదే లేకుండా చేశారు.. అధిష్ఠానానికి ఏపి వైపు కన్నెత్తి చూసే అవసరమే లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్‌కు అన్నీ తానే అయ్యారు..
కాంగ్రెస్‌లో వైఎస్‌ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ఆయన నాయకత్వంలో ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరం మచ్చుకైనా వినిపించలేదు.. ఆయన వినిపించనివ్వలేదు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు లేవు.. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనంలా మారిపోయింది..

కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలా ఉంటే విపక్షాల పరిస్థితి అయోమయంలా మారిపోయింది.. వైఎస్‌ ఉన్నంతకాలం టిడిపి, టిఆర్‌ఎస్‌ల నాయకత్వాలు దాదాపుగా నిద్రలేని రాత్రులనే గడిపాయని చెప్పవచ్చు. నిత్య అసమ్మతులు, రాజీనామాలతో రెండు ప్రధాన పార్టీలు గందరగోళంలో పడిపోయాయి..

ఇప్పుడు.........వైఎస్‌ లేరు.. విపక్షాలు పుంజుకుంటున్నాయి.. కాంగ్రెస్‌లో పాత సంస్కృతి పూర్తిగా జడలు విప్పుకుంది... అధిష్ఠానం ఆశీస్సులతో మాత్రమే కొనసాగే ముఖ్యమంత్రి.. సహకరించని మంత్రులు.. అసమ్మతులు... పరస్పర ఆరోపణలు.. కాంగ్రెస్‌లో ఇంతకాలం మౌనంగా ఉన్న గొంతులన్నీ ఇప్పుడు స్వరం పెంచాయి.. అధిష్ఠానానికి ఫిర్యాదుల పైన ఫిర్యాదులు వెళ్తున్నాయి.. మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటున్నా ఆపేవారు లేరు..
రాజకీయం ఇలా ఉంటే.. వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమం మరోదారిలో వెళ్తోంది.. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ప్రకటించిన సంక్షేమ పథకాలను ఏ విధమైన ఆర్థిక నిర్వహణతో ఆయన కొనసాగించారో.. ఆ విధమైన నిర్వహణ ఇప్పుడు కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు.. వైఎస్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన రోశయ్యే ఇప్పుడు సిఎంగా ఉన్నారు.. కానీ, ఆర్థిక నిర్వహణ మాత్రం భారంగా మారింది. వైఎస్‌ మొదలు పెట్టిన స్కీములన్నింటికీ క్రమంగా మంగళం పాడే పనిలో పడ్డారు.. ఎంతోమంది లబ్ధి పొందుతున్న ఈ స్కీములు ఆగిపోతే పరిస్థితి ఏమిటి అన్నది సామాన్యుల్లో మెదులుతున్న ప్రశ్న.. వైఎస్‌ ఒక నిర్దిష్టమైన దారిలో నడిపించిన కాంగ్రెస్‌ ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోతోంది.. వైఎస్‌ ఒక ప్రణాళిక ప్రకారం మొదలు పెట్టిన పథకాలు ఒక్కటొక్కటిగా కనుమరుగవుతాయని వినిపిస్తోంది.. వైఎస్‌ మాత్రం అందరికీ గుర్తుకు వస్తూనే ఉన్నారు...

17, మే 2010, సోమవారం

స్నేహితుడే హంతకుడు

నరహంతకుడు రామారావు హత్య కేసు మిస్టరీ వీడిపోతోంది.. పోలీసుల కళ్లు గప్పి ఇన్నాళ్లూ ఎవరి పంచన తలదాచుకుంటూ వస్తున్నాడో.. ఎవరి ద్వారా అన్ని రకాల సహాయాన్ని పొందుతూ వస్తున్నాడో.. ఇంతకాలం ఎవరిని అత్యంత విశ్వాస పాత్రుడిగా భావించాడో.. ఆ మిత్రుడే హంతకుడుగా స్పష్టమవుతోంది.. పోలీసులు ఈ విషయంలో దాదాపుగా నిర్థారణకు వచ్చేశారు..

నరహంతకుడు రామారావు ఎంత కిరాతకంగా మనుషుల్ని హతమార్చాడో.. అంతకంటే కిరాతకంగా అతను చనిపోయాడు.. రామారావు హత్య ఎవరినీ బాధపెట్టలేదు.. పైగా అందరినీ సంతోషపరిచింది.. చిక్కినట్లే చిక్కి ఎప్పటికప్పుడు పారిపోతూ, కనిపించిన చోటల్లా దోపిడీలు, హత్యలు చేస్తూ ఒకటిన్నర దశాబ్దంగా అల్లాడిస్తున్న రామారావు చనిపోవటం పోలీసులకు సైతం ఒకవిధంగా నమ్మశక్యం కావటం లేదు. రామారావు శవం ముందుగా కనిపించినప్పుడు పోలీసులే మట్టుబెట్టారని అంతా భావించారు. తమదైన రీతిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చి హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్న దన్న ఆరోపణపై ఆమె భర్తను విచారించినప్పుడు కేసు చిక్కుముడి నెమ్మదిగా వీడిపోవటం మొదలైంది..
పోలీసులు అరెస్టు చేసిన రాణి మేకల చలపతిరావుకు, రామారావుకు మొదట్నుంచీ స్నేహం ఉంది.. ఇద్దరూ కలిసి కొన్ని దొంగతనాలు కూడా చేసినట్లు సమాచారం.. దీని ప్రకారం.. జైలు నుంచి రామారావు పరారయి వచ్చిన ప్రతిసారీ, చలపతిరావే అతనికి షెల్టర్‌ ఇచ్చేవాడు.. మందు, మగువలను ఏర్పాటు చేసేవాడు.. అదే విధంగా ఈ నెల ౮న శ్రీకాకుళం జైలు నుంచి తప్పించుకున్న రామారావు కృష్ణా జిల్లా అగిరిపల్లికి నేరుగా చేరుకున్నాడు.. చలపతిరావు ఇంట్లోనే ఆశ్రయం పొందాడు.. కానీ, ఈసారి రామారావు స్నేహితుడికే ఎసరు పెట్టాడు.. తిన్నింటి వాసాలు లెక్కించాడు. చలపతి రావు భార్యపై రామారావు కన్నేయటంతో ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.. ఆ కారణంగానే చలపతిరావు రామారావును హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది..
విచిత్రమేమంటే రామారావు హత్య జరిగిన ౪౮ గంటల తరువాత అతని మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు.. కానీ, అతనికి అంత్యక్రియలు చేసే దిక్కు లేకుండా పోయింది.. మృతదేహాన్ని గుర్తించేందుకు వచ్చిన బంధువులు సైతం పోస్ట్‌మార్టమ్‌ తరువాత దాన్ని తీసుకుపోయేందుకు రానే లేదు.. ఇన్నేళ్ల పాటు కిరాతకుడుగా అందరినీ గడగడలాడించిన రామారావు చివరకు ఎవరికీ కాకుండా పోయాడు..

15, మే 2010, శనివారం

అమ్మతో మాట్లాడుతున్నారా?

అమ్మ.... రెండు అక్షరాలు.. నిఘంటు అర్థాలకు అతీతమైనవి... మనిషి పుట్టుకకు మరో పేరు అమ్మ. నిశ్శబ్దంలోనూ వినిపించే ఒకే ఒక్క శబ్దం అమ్మ.. అమె తనువు బిడ్డలది.. ఆమె తపన తీరనిది.. ఆమె మమత కాలం కంటే వేగంగా హృదయాలను తాకేది.. అమ్మ గురించి ఎందరు ఎన్ని రాసినా ఏం చాలుతుంది.. సృష్టే ఆమె అయినప్పుడు ఆమెను సంపూర్ణంగా చూసేందుకు ఎన్ని కళ్లు చాలుతాయి?
మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? భయంతో వణికిపోతున్నారా? జీవితంలో అన్నీ కోల్పోయానన్న ఆందోళనలో ఉన్నారా? ఏం చేయాలో తోచక.. దారి కనిపించక.. జీవితంపై విరక్తి కలిగినప్పుడు మీరేం చేస్తారు.. అర్థం కావటం లేదా? ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడండి.. ఒక్క క్షణం ఆప్యాయంగా ఆమె పలుకులు వినండి.. ఆమె మాట మీకు స్వాంతన చేకూరుస్తుంది.. అన్ని టెన్షన్లూ మటుమాయమవుతాయి.. ఎందుకంటారా? ఆమె అమ్మ కాబట్టి..

కాలంతో పోటీ పడి గెలిచే వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున చెప్పగలిగే ఒకే ఒక్క జవాబు అమ్మ..
జన్మనిచ్చినప్పటి నుంచీ అమ్మకు పిల్లలే లోకం.. పిల్లలే తనువు.. పిల్లలే సర్వస్వం...
అన్నం తినటం దగ్గర నుంచి అక్షరాలు నేర్చే దాకా ఆదిగురువు అమ్మ..
మాట నేర్పేది అమ్మ.. మంచి నేర్పేది అమ్మ.. తన కళ్లతో లోకాన్ని చూపించేది అమ్మ..
బుడిబుడి అడుగులతో నడవటానికి ప్రయత్నిస్తూ బిడ్డ తడబడ్డప్పుడు ఆ తడబాటును సరిదిద్దేది అమ్మ..
పెద్దగా పెరిగాక తప్పు చేస్తే, ఆ తప్పును కాచి బిడ్డను తన చాటున ఉంచుకుని కాపాడుకునే ఆత్మబంధువు అమ్మ
మోకాలిపైదాకా చీర కట్టి ఎంత కష్టమైనా పడుతుందేమో కానీ, కన్నబిడ్డ కష్టాన్ని ఒక్కక్షణం కూడా చూడలేదు అమ్మ..
తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు ఆమె స్పర్శ మనకు కలిగించే స్వాంతన ఎంత గొప్పది..
మనం ఆందోళనలో ఉన్నప్పుడు తలలో వేళ్లు ఉంచి సున్నితంగా నిమురుతూ అమ్మ ఇచ్చే ఓదార్పు మరెక్కడ లభిస్తుంది?
ఇవాళ ఉద్యోగాల కోసమో..వ్యాపారం కోసమో ఎక్కడెక్కడికో వలసలు వచ్చి బతుకుతున్న వాళ్లు ఎందరో ఉన్నారు.. ఎక్కడో సుదూరంగా ఊళ్లో ఉన్న తల్లి.. ఇంకెక్కడో నగరాల్లో క్షణమైనా తీరిక లేని సంతానం.. ఇద్దరి మధ్య పలుకే కరవైన పరిస్థితి.. ఈ దశలో ఒక్కసారి ఫోన్‌లోనైనా ఆమ్మ మాట వింటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఎంత ఉల్లాసంగా ఉంటుంది? ఇది ఎవరికి వారికే కలిగే అనుభవం...
విస్కాన్సన్‌ యూనివర్సిటీ దీనికోసం ఓ పెద్ద పరిశోధన చేసి మన ఒత్తిళ్లనుంచి దూరం చేసేది అమ్మ మాట అని తేల్చింది... ఇందుకోసం ఇంత పరిశోధన దేనికో అర్థం కాదు.. మన కల్చర్‌లోనే నరనరానా జీర్ణించుకుని పోయిన పదం అమ్మ... ఇంత గొప్ప సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.. ఇక్కడ అమ్మ అన్న మాట అత్యంత సాధారణంగా వినిపించేది..
కాస్త పక్కకు జరుగమ్మా..
ఏమ్మా బాగున్నావా
అలా కాదమ్మా ఇలా చేయి..
అనే మాటలు మన దగ్గర ఎక్కడైనా వినిపించేవి.. చిన్న దెబ్బ తగిలితే మొదట మన నోటి వెంట వచ్చే మాట అమ్మ.. అమ్మ ఆప్యాయతకు ఇంతకంటే అర్థం ఏం కావాలి.. అమ్మ.. తొలి అక్షరంతో పెదవి విచ్చుకుంటే.. మలి అక్షరంతో పెదవులు కలిసిపోతాయి.. మధ్యలో ఉన్న సమస్త సృష్టి రహస్యమే అమ్మ... అందుకే టెన్షన్‌లో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి.. హాపీగా ఉండండి..

టెర్రరిజం పాతబస్తీని క్యాన్సర్‌లా కాల్చేస్తోంది..

పాతబస్తీ... ఈ పేరు చెప్తేనే ఏదో గుబులు పుడుతోంది. శాంతి లేదు.. భద్రత లేదు.. ఎవరైనా.. ఎప్పుడైనా, యథేచ్ఛగా రావచ్చు. ఎన్నాళెユ్లనా ఉండవచ్చు. ఏమైనా చేయవచ్చు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులకు సేఫ్‌ జోన్‌గా మారిపోయింది పాతబస్తీ.. అక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ దాని ఉనికి నామమాత్రమే.. అందుకే టెర్రరిజం పాతబస్తీని క్యాన్సర్‌లా కాల్చేస్తోంది..

ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అమాయక కానిస్టేబుల్‌ అన్యాయంగా చనిపోవటానికి బాధ్యులు ఎవరు? పోలీసుల నిర్లక్ష్యం మాత్రమే కారణమా? టెర్రరిస్టులు పాతబస్తీలో తమ ఇష్టం వచ్చినట్లు మోటార్‌ సైకిళ్లపై తిరుగుతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదు..? అసలు వాళ్లు అలా ఎలా తిరగగలుగుతున్నారు? హుస్సేనీ ఆలం దగ్గర కానిస్టేబుల్‌ రమేశ్‌ను కాల్చి చంపి మహరాజుల్లా టెర్రరిస్టులు వెళ్లిపోయిన తరువాత ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్నలివి....
రాష్ట్ర రాజధానిలో మరెక్కడా లేని నిరంకుశత్వం పాతబస్తీలో రాజ్యమేలుతోంది. రాజధానిలో మరో ప్రాంతంలో ఎవరైనా కాస్త ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు వాళ్ల వెంట బడి తరిమి తరిమి పట్టుకుని జరిమానా విధిస్తారు.. నియమావళిని ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు.. కానీ, పాతబస్తీకి వచ్చేసరికి ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది.. అక్కడ ఏం చేసినా పోలీసులు ప్రశ్నించే సాహసం చేయరు.. నిలువరించే ప్రయత్నం చేయరు.. ఏకాస్త ప్రయత్నం జరిగినా అంతే సంగతులు..
పోలీసులకు కాళ్లూ చేతులూ కట్టేశారు.. నిఘా పూర్తిగా నీరుగారిపోయింది. అందువల్లే స్లీపర్‌సెల్స్‌ విజృంభిస్తున్నా ఏం చేయలేకపోయారు.. మానవబాంబులు ప్రవేశించాయని తెలిసినా ఏం చేయలేకపోయారు.. వీసా గడువు తీరిపోయిన తరువాత కూడా అక్రమంగా ఇక్కడ ఉంటున్న వాళ్ల సంగతి సరేసరి.. సెటిల్మెంట్లకయితే లెక్కే లేదు.. పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా పోలీసులు కానీ, పాలకులు కానీ, సీరియస్‌గా తీసుకోకపోవటానికి కారణం ఒక్కటే... మత సంప్రదాయం మాటున ఉగ్రవాదం పాతబస్తీలో రాజ్యమేలుతోంది. మొదట్నుంచీ పాలకవర్గం ఈ అంశంపై దృష్టి సారించలేకపోవటం వల్లనే ఉగ్రవాదులకు సేఫ్‌ డెన్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఉదారవాదులను ఎవరినీ ఎదగనీయకపోవటం, సంప్రదాయమే డామినేట్‌ చేయటం వల్ల దాని మాటున దాగున్న ఉగ్రవాదాన్ని నియంత్రించటం, నిరోధించటం సాధ్యం కావటం లేదు.. ఉగ్రవాదానికి మతం అంటూ ఉండదన్న వాస్తవాన్ని సామాన్య ప్రజానీకానికి తెలుసు. మతం వేరు.. టెర్రరిజం వేరు.. దురదృష్ట వశాత్తూ మన దేశంలో ఈ రెంటినీ ఒకే గాటన కట్టి చూడటం పాలకులకు, రాజకీయ పార్టీలకు అవసరమైంది కాబట్టే పాతబస్తీ టెర్రరిజం అనే క్యాన్సర్‌ బారిన పడి అల్లాడిపోతోంది.. దీనికి చికిత్స చేసేదెవరు? చేయటం సాధ్యమేనా?

12, మే 2010, బుధవారం

మండుతున్న నేల

నేల మండిపోతోంది.. కనీవినీ ఎరుగని పరిస్థితి.. అడుగు వేస్తే నిప్పుకణికలపైన వేస్తున్నాం.. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు మెట్రో నగరాల్లో జనం వెతలు చెప్పనలవి కాదు... ఆఫీసుకు వెళ్లాలంటే దడ పుట్టేంత పరిస్థితి...
సూర్యుడు కాల్చి పారేస్తున్నాడు.. రాష్ట్రంలోని నాలుగు మెట్రో నగరాలు నిప్పుల కొలుములుగా మారిపోయాయి.. ఉదయం ఏడు గంటలు కాకముందే ఎండ మంట మొదలైపోతోంది.. రాత్రి పది గంటలయినా రహదారులపై వేడి సెగలు తగ్గటం లేదంటే వేసవి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విశాఖపట్నంలో ౩౯ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ, ఉక్కబోత బీభత్సంగా జనాన్ని ఉడికిస్తోంది.. సముద్ర తీరంలో వేసవి కొంత చల్లదనాన్ని ఇస్తుందని వచ్చిన వారికి నిరాశే ఎదురవుతోంది..

విజయవాడ బ్లేజువాడగా మారిపోయింది.. మండుతున్న కొలిమిలో బతుకుతున్నామా అన్న పరిస్థితిలో జనం ఉన్నారు.. గత యాభై ఏళ్లలో చూడని ఎండలు ఈసారి చూస్తున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు.. ఒక పక్కన కృష్ణమ్మ... మరో పక్కన కొండలు.. మధ్యలో విజయవాడ ఎండ వేడితో అల్లాడిపోతోంది..

ఇక రాజధాని సంగతి చెప్పనే అక్కర్లేదు.. కాంక్రీటు గోడలు.. కంప్యూటర్లు.. వాహనాల పొగలు..రొదల మధ్యనే ఇక్కడి ప్రజల జీవితాలు...ఎండ వేడిని తట్టుకోవటానికి మధ్యాహ్నం షిఫ్ట్‌ అయినా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది..మళ్లీ రాత్రి పొద్దు పోయిన తరువాత కానీ, ఆఫీసు నుంచి బయటపడటం లేదు.. సూర్యుడి ప్రతాపానికి ఇదే నిదర్శనం.. రుతుపవనాలు త్వరగానే వస్తాయని వాతావరణ వేత్తలు ఎంతగా చెప్తున్నా, ఈ నెలాఖరు దాకా ఈ నేల చల్లబడే అవకాశాలు కనిపించటం లేదు...

7, మే 2010, శుక్రవారం

మావోయిస్టులకు మద్దతిస్తే పదేళ్ల జైలుశిక్ష

మావోయిస్టులను ఇరుకున పెట్టేందుకు కేంద్రం కొత్త ఎత్తుగడ వేసింది. మావోయిస్టుల వాయిస్‌గా ఉంటున్న సానుభూతి సంస్థలు, హక్కుల సంఘాలను నియంత్రించటం ద్వారా మావోయిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది... మావోయిస్టులకు మద్దతిచ్చినా, అనుకూలంగా మాట్లాడినా జైలు ఊచల వెనక్కి పదేళ్ల పాటు నెట్టేస్తామని కేంద్ర హోం శాఖ హెచ్చరించటం మావోలపై కేంద్రం జరుపుతున్న పోరులో ముఖ్యమైన మలుపు.. కేంద్రం హెచ్చరించినట్లు మావోలకు మద్దతిస్తే జైలు శిక్ష విధించటం సాధ్యమవుతుందా?

మావోయిస్టుల సమస్యను మరోవైపు నుంచి నరుక్కు రావటానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మావోయిస్టులపై నేరుగా దాడులు చేయటం కంటే... అజ్ఞాతానికి బయట ఉన్న మావోల సానుభూతిపరులను టార్గెట్‌ చేయాలని నిర్ణయించింది. మావోలకు బయటి నుంచి ఎలాంటి మద్దతిచ్చినా పదేళ్ల పాటు జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరిక జారీ చేయటం కేంద్రం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం..
మావోయిస్టుల దాడిలో దాంతేవాడలో ౭౬మంది పోలీసులను నష్టపోయిన కేంద్ర హోం శాఖ, ఇప్పుడు కొత్త దారులను వెతుక్కుంటోంది.. మావోయిస్టులను దెబ్బ తీసేందుకు గెరిల్లావార్‌ను కొనసాగిస్తూనే, మావోయిస్టులకు బలం గళం అన్నీ అయిన పౌర హక్కుల సంఘాలు, ఇతర సాంస్కృతిక సంఘాలను నిలువరించే ప్రయత్నాన్ని వ్యూహాత్మకంగా ప్రారంభించింది.. వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థించే సంస్థలు, పౌర హక్కుల సంఘాలు ఇక ముందు అలాంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. మావోయిస్టు పార్టీ వంటి ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి మద్దతునిచ్చినా పదేళ్ల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది..
నిజానికి కేంద్ర హోం శాఖ చెప్తున్న చట్టం ఇవాళ కొత్తగా చేసిందేమీ కాదు.. ౧౯౬౭ నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టంలోని ౩౯వ సెక్షన్‌ కిందనే చర్య తీసుకుంటామని చెప్తోంది. దీని ప్రకారం నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఎవరు ఏ
రూపంలో మద్దతిచ్చినా పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు..
మావోయిస్టులకు మద్దతిస్తే అరెస్టు చేస్తామని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలాకాలంగా చెప్తూనే ఉన్నాయి. కానీ, పెద్దగా అమలు చేసింది లేదు.. కానీ, ఇప్పుడున్న పరిస్థితి వేరు.. ఇంతకాలం రాష్ట్రాలు విడివిడిగా తమ తమ పరిధిలో మావోయిస్టులను ఎదుర్కొనేవి.. ఇప్పుడు కేంద్ర హోం శాఖ విషయాన్ని నేరుగా తన పరిధిలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మావో సానుభూతిపరులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టాన్ని ప్రయోగించటం ఎంతవరకు సక్సెస్‌ అవుతుంది? హక్కుల సంఘాల వారు ఈ హెచ్చరికను ఏ విధంగా స్వీకరిస్తారు?

6, మే 2010, గురువారం

ఉరి అమలవుతుందా? మరో కాందహార్‌ కోసం ఎదురు చూడాలా?

ఉరి.. ఈ దేశంలో అమలు కాని శిక్ష ఏదైనా ఉందంటే ఉరి అని ఠక్కున చెప్పేయవచ్చు.. క్షమించరాని నేరం చేసిన వారికి న్యాయస్థానం తీవ్రంగా మథనపడి కానీ విధించని శిక్ష మరణ దండన.. అలాంటి శిక్షను సైతం మన దేశంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు..కనీసం టెర్రరిస్టుల విషయంలోనైనా కఠినంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు?
అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే నేరస్థులకు ఉరిశిక్ష విధించాలంటూ సుప్రీంకోర్టు 1995లో రూలింగ్‌ ఇచ్చింది. హత్య, ముఠా దోపిడీలు, పసివాళ్లను హత్య చేయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి కుట్ర చేయటం వంటి వాటిల్లో మరణ దండన తప్పదని అత్యున్నత న్యాయస్థానం వివరించింది.. కానీ, అంతటి అరుదైన కేసుల్లో మరణ దండన విధించిన తరువాత కూడా అమలు కాకపోతే, న్యాయస్థానాల తీర్పులకు అర్థం ఏముంటుంది?

1947 నుంచి 2004 వరకు మన దేశంలో సుమారు ౫౬ మందికి ఉరిశిక్షను అమలు చేశారు.. ఆ తరువాత సేలంలో మహిళలపై కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన కేసుల్లో ఆటో శంకర్‌ అనే నేరస్థుణ్ణి ౧౯౯౫లో ఉరి తీశారు. తరువాత మైనర బాలికను రేప్‌ చేసి, హత్య చేసిన ధనంజయ చటర్జీని 2004లో ఉరి తీశారు..అంతకు మించి అమలు చేయటం లేదు.. ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద మొత్తం 29 క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2004లో ధనంజయ చటర్జీ పిటిషన్‌ను తిరస్కరించిన తరువాత ఒకే ఒక్క పిటిషన్‌ను రాష్ట్రపతి పరిష్కరించారు.. 1984 నాటి ఓ కేసులో ఆర్‌. గోవిందసామి అనే నేరస్థునికి పడిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చేశారు.. ఆ తరువాత ఏ ఒక్కపిటిషన్‌ వంకా రాష్ట్రపతి చూడలేదు..

పెండింగ్‌లో ఉన్న 29 కేసుల్లో 52 మందికి ఇంకా ఉరిశిక్ష అమలు కావలసి ఉంది..
ఇప్పుడు కసబ్‌ కూడా ఇదే కోవలో వెళ్తే.. అతను 53వ వాడవుతాడు.. అదే జరిగితే .. హాయిగా సర్కారీ ఖర్చుతో నరహంతకుడు ముంబయి ఆర్థర్‌ రోడ్డు జైల్లోనో,, ఇంకా మంచి సౌకర్యాలున్న మరో జైల్లోనో కొన్నేళ్ల పాటు ఎంజాయ్‌ చేస్తాడు..ఇప్పటికే కసబ్‌పై 31 కోట్లు ఖర్చు చేశారు.. మన వాళ్లను చంపిన కసాయికి ఇంకెన్ని కోట్లు మనం బాకీ ఉన్నామో సర్కారుకే తెలియాలి.

దేశంలో మరో కాందహార్‌ ఘటన పునరావృతం కావచ్చని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. 1999౯నాటి ఈ ఘటనలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేస్తే.. మౌలానా మసూద్‌ అజర్‌, ముష్తాక్‌ జర్గర్‌, ఒమర్‌ షేక్‌లను సర్కారు విడుదల చేసింది. దాని పర్యవసానం శ్రీనగర్‌ అసెంబ్లీ, పార్లమెంట్లపై దాడులు...ఇప్పుడు అఫ్జల్‌ గురు ఒకడు జైల్లో మగ్గుతున్నాడు.. అతడికి తోడు కసబ్‌ తోడయ్యాడు.. వీరిద్దరి విడుదలకు మరో హైజాక్‌ జరిగితే ఆశ్చర్యపోవలసిందేమీ ఉండదు..
ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద మొత్తం 29 క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి
ఆ వివరాలు ఇవి..
Cases of terrorist activities:
(Clemency of eight terrorists is to be disposed while Afzal’s file is pending with Delhi
government)

Murugan, Santhan and Arivu (Tamilnadu)

Former prime minister Rajeev Gandhi’s assassination case.
Terrorist activity

Crime: May 21, 1991
Trial court: January, 1998
Supreme Court: May, 1999

Death sentence awarded by trial court and confirmed by Supreme Court.
Mercy appeal: 2000

MHA’s final recommendation: June 21, 2005.

Devinderpal Singh (Delhi)

Causing death of 9 persons and injuring 29 persons by bomb blast.
Terrorist activity

Crime: September 11, 1993
TADA court: August, 2001
Supreme Court: December, 2002

Death sentence awarded by trial court and confirmed by Supreme Court.
Mercy appeal: 2003

MHA’s final recommendation: August 9, 2005.

Simon and three others (Karnataka)

Causing death of 22 police personnel by blasting the mines.
Terrorist activity

Crime: April 9, 1993
Trial court: September 29, 2001
Supreme Court: January 29, 2004

Life imprisonment awarded by trial court and Supreme Court enhanced it into death
sentence.
Mercy appeal: 2004
MHA’s final recommendation: May 2, 2005.


Mohd. Afzal (Delhi)
Parliament attack case.

Terrorist activity

Crime: December 13, 2001
Trial court: December 18, 2002
High court: October, 2003
Supreme Court: August 4, 2005

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2006

MHA’s final recommendation: Hanging between MHA and Delhi government.


Cases recalled and resubmitted by MHA recently:
(Three files concerning NINE convicts were recalled by the MHA and re-submitted after
re-examining)

Gurmeet Singh (UP)

Causing death to 13 persons of a family.

Crime: August 17, 1986
Trial court: September 20, 1992
High court: February 29, 1996
Supreme Court: September 28, 2005

Trial court awarded the death sentence. HC and SC confirmed it.
Mercy appeal: 2007

MHA’s first recommendation: May 18, 2007 then re-submitted on December 9, 2009.


Sonia and Sanjeev (Haryana)

Causing death of her step and her family which include three tiny tots, and her own
father, mother and sister.

Crime: August 23, 2001
Trial court: May 31, 2004 High court: April 12, 2005
Supreme Court: February 15, 2007 and August 23, 2007

Death sentence awarded by trial court but HC reduced it into life imprisonment while SC
confirmed the death sentence.
Mercy appeal: 2007

MHA’s final recommendation: February 11, 2008 then re-submitted on May 21, 2009.


Shyam Manohar and five others (UP)

Causing death of five persons of a family to take avenge.

Crime: June 23, 1990
Trial court: September 19, 1995
High court: January 28, 1997
Supreme Court: October 21, 1997

Trial court awarded the death sentence. HC and SC confirmed it.
Mercy appeal: 1998

MHA recommended in January 1999 and July 2005. Filed is called back again by MHA
and is now being re-considered

Other pending cases of death sentence for president’s approval
(20 files concerning 30 convicts are waiting for president’s decision)

Dharmendra and Narendra Yadav (UP)

Causing death of five persons of a family

Crime: May 26, 1994
Trial court: December 5, 1995
High court: August 19, 1997
Supreme Court: September 21, 1999

Trial court awarded death, HC did not confirm but SC confirmed it.
Mercy appeal: 1999

MHA’s final recommendation: April 22, 2004 and June 16, 2005

Piara Singh and three others (Punjab)

Murder of 17 persons during a marriage party.
Crime: November 21,1991
Trial court: January 15, 1996
High court: 11 Dec 96 and 20 Aug 96
Supreme Court: February 28, 1997, August 2003 and November 4, 2003.

Trial court awarded the death sentence. HC and SC confirmed it.
Mercy appeal: 1997 and 2003

MHA’s final recommendation: November 11, 1997, June 11, 1999 and July 12, 2005.


Shobhit Chamar (Bihar)

Causing murder of 6 persons.

Crime: January 1, 1989
Trial court: February 16, 1996
High court: September 26, 1997
Supreme Court: March 4, 1998

Trial court awarded death sentence and HC and SC confirmed.
Mercy appeal: 1998

MHA recommended: March 27, 2000 and May 25, 2005.


Mohan and Gopi (Tamilnadu)

Kidnapping of 10-year-old-girl for a ransom of Rs 10 lakh and murder her brutally.

Crime: June 28, 1993
Trial court: November 27, 1996
High court: May 27, 1997
Supreme Court: May 12, 1998 and July 22, 1998

Trial court awarded death sentence. HC and SC confirmed it.
Mercy appeal: 1999

MHA’s final recommendation: July 9, 1999 and August 9, 2005.


Molai Ram and Santosh (MP)

Causing rape and murder of a 10th class daughter of assistant jailor.

Crime: February 20, 1996 Trial court: February 18, 1997
High court: December 9, 1998
Supreme Court: October 26, 1999 and December 21, 1999

Trial court awarded life imprisonment, HC converted it in death sentence, SC confirmed
it.
Mercy appeal: 2000

MHA’s final recommendation: May 28, 2001 and May 2, 2005.


Dharampal (Haryana)

Causing murder of five persons during bail granted in rape case.

Crime: June 10, 1993
Trial court: May 5, 1997
High court: September 29, 1998
Supreme Court: March 18, 1999

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 1999

MHA’s final recommendation: February 7, 2000 and May 2, 2005.


Mahendra Nath Das (Assam)

Causing brutal murder while on bail in another murder case

Crime: April 24, 1996
Trial court: August 18, 1997
High court: February 3, 1998
Supreme Court: May 14, 1999

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2000

MHA’s final recommendation: June 21, 2001 and April 20, 2005.


SB Pingale (Maharashtra)

Causing two murders and attempt to murder on two persons.

Crime: April 2, 1991 Trial court: August 27, 1997
High court: July 18, 1998
Supreme Court: April 13, 1999 and June 28, 1999

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2001

MHA’s final recommendation: April 8, 2004 and June 2005.


Jai Kumar (MP)

Causing murder of his pregnant sister-in-law and one niece.

Crime: January 7, 1997
Trial court: September 30, 1997
High court: March 17, 1998
Supreme Court: May 11, 1999

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 1999

MHA’s final recommendation: July 21. 1999 and May 2, 2005.


Suresh and Ramji (UP)

Causing murder of 5 members of his younger brother’s family and injuring remaining
one for a plot.

Crime: NA
Trial court: December 19, 1997
High court: February 23, 2000
Supreme Court: March 2, 2001

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2002

MHA’s final recommendation: April 8, 2004 and June 21, 2005.


Sheikh Meeran and two others (Tamilnadu)

Causing murder of one person by exploding a bomb in court hall.

Crime: November 29, 1994 Trial court: October 5, 1998
High court: 30 April 99
Supreme Court: June 21, 1999 and July 5, 1999

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2000

MHA’s final recommendation: November 24, 2003 and August 8, 2005.


Praveen Kumar (Karnataka)

Causing death of 4 members of a family.

Crime: February, 1994
Trial court: February 4, 2002
High court: October 28, 2002
Supreme Court: October 15, 2003

Death sentence awarded by trial court, confirmed by HC and SC.
Mercy appeal: 2004

MHA’s final recommendation: September 8, 2005.


Satish (UP)

Causing death of a girl child.

Crime: August 16, 2001
Trial court: October 29, 2002
High court: October 14, 2003
Supreme Court: February 8, 2005

Death sentence awarded by trial court, HC acquitted him but SC confirmed the death
sentence.
Mercy appeal: 2007

MHA’s final recommendation: July 14, 2008.


Sushil Murmu (Jharkhand)

Brutally sacrificing a nine-year-old child at the altar of goddess Kali.

Crime: December 11, 1996 Trial court: November 30, 2002
High court: April 29, 2003
Supreme Court: December 12, 2003

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2004

MHA’s final recommendation: April 12, 2005.


Saibanna (Karnataka)

Causing death to his wife and daughter aged 1 and half year.

Crime: September 12, 1994
Trial court: January 8, 2003
High court: October 21, 2003
Supreme Court: April 21, 2005

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2007

MHA’s final recommendation: September 28, 2007.


Kunwar Bahadur Singh and Karan Bahadur Singh (UP)

Brutally killing five persons of a family.

Crime: April 24, 1999
Trial court: April 28, 2003
High court: October 31, 2003
Supreme Court: July 19, 2005

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2005

MHA’s final recommendation: January 5, 2006.


Laliya Doom and Shivlal (Rajasthan)

Brutally killing three persons of a family.

Crime: January 9, 1999
Trial court: June 21, 2003 High court: October 9, 2003
Supreme Court: February 20, 2004

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2004

MHA’s final recommendation: May 2, 2005.


Jafar Ali (UP)

Causing death of his wife and five daughters.

Crime: NA
Trial court: July 14, 2003
High court: January 27, 2004
Supreme Court: April 5, 2004

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2006

MHA’s final recommendation: August 18, 2006.

Bandu Baburao Tidake (Karnataka)

Causing death to a girl child aged 12 years.

Crime: November 26, 2002
Trial court: November 30, 2005
High court: January 20, 2006
Supreme Court: July 10, 2006

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2007

MHA’s final recommendation: October 23, 2008.

Cases which are under consideration of MHA
(Three files concerning to four convicts)

Bantu (UP)

Causing rape and murder of a child girl.
Crime: October 4, 2003
Trial court: December 24, 2005
High court: August 29, 2006
Supreme Court: July 23, 2008

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2009

MHA’s final recommendation: Under Examination in MHA.


Sattan and Guddu (UP)

Causing death of 6 persons of a family.

Crime: August 30, 1994
Trial court: August 25, 1999
High court: November 21, 2000
Supreme Court: February 27, 2009 and April 29, 2009

Death sentence awarded by trial court, HC had changed it into life imprisonment but SC
confirmed the death sentence.
Mercy appeal: 2009

MHA’s final recommendation: Under Examination in the MHA

Om Prakash (Uttarakhand)

Causing murder of 3 members and injuring one member of his master’s family.

Crime: November 15, 1994
Trial court: April 18, 2001
High court: September 19, 2001
Supreme Court: December 5, 2002 and March 4, 2003

Death sentence awarded by trial court and confirmed by HC and SC.
Mercy appeal: 2003

MHA’s final recommendation: May 14, 2004 and July 11, 2005. Later a petition was
filed by his mother which is under consideration

Latest disposal by the president
(It is first such case after 2004)
R. Govindsamy (Tamilnadu)

Causing death of five persons of his uncle’s family

Crime: May 30, 1984
Trial court: June 24, 1987
High court: September 9, 1997
Supreme Court: April 22, 1998

Trial court acquitted but death sentence awarded by HC and confirmed by SC.
Mercy appeal: 1998

MHA’s final recommendation: November 2009. Decision conveyed to Tamilnadu
Government on November 23, 2009.

5, మే 2010, బుధవారం

రక్త చరిత్ర ద్వారా వర్మ కోరుకుంటున్నదేమిటి?

రక్తచరిత్ర సినిమా నేపథ్యం ఏమిటి?


పగ, ప్రతీకారమే.. పరమ సోపానమా?


అనంతపురంలో ఇప్పుడు రక్తపుటేరులు పారుతున్నాయా?


రక్త చరిత్ర ద్వారా వర్మ కోరుకుంటున్నదేమిటి?


ప్రేక్షకులకు చెప్పదలచుకున్నదేమిటి?


ఫ్యాక్షన్‌ రాజకీయాలను వర్మ తిరగ దోడుతున్నారా?


మసకబారుతున్న గత చరిత్రకు మళ్లీ ఆజ్యం పోస్తున్నారా?

మరాట్వాడా రాజకీయ అధినేత బాల్‌ ఠాక్‌రే కథను తెరకెక్కించిన రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు అనంతపురం ఫ్యాక్షన్‌ పై దృష్టి పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఫ్యాక్షన్‌ నేతగా ముద్రపడ్డ పరిటాల రవి, మద్దెల చెరువుసూరి కుటుంబీకుల మధ్య నెలకొన్న ఫ్యాక్షన్‌ ఘర్షణలను ఇతివృత్తంగా తీసుకుని ‘రక్త చరిత్ర’ అనే పేరుతో రెండు భాగాలుగా సినిమాను చిత్రీకరించాడు. ఇంతకీ ఈ సినిమా ద్వారా వర్మ ఏం చెప్పబోతున్నాడు
రామ్‌గోపాల్‌ వర్మ తీసిన రక్తచరిత్రలో పరిటాల రవిగా వివేక్‌ ఓబెరాయ్‌, పరిటాల సునీతగా రాధికా ఆప్టే, మద్దెలచెరువుసూరిగా తమిళ నటుడు సూర్య, ఎన్‌టిఆర్‌ పాత్రలో శత్రుఘ్నసిన్హా , మొద్దుశ్రీను పాత్రలో బాలీవుడ్‌ కొత్త నటుడు నటించాడు. ఈ సినిమాలో గంగుల భానుమతి పాత్రతో పాటు మొద్దుశ్రీనును చంపిన ఓం ప్రకాష్‌ క్యారెక్టర్స్‌ కూడా ఉంటాయి. శ్రీరాములయ్య సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవం రోజు ఫిలింనగర్‌లో జరిగిన బాంబు బ్లాస్ట్‌ వంటి యధార్థ సంఘటనలతో తెరకెక్కిన ఈ రక్తచరిత్ర రెండు పార్టులుగా జనం ముందుకు రానుంది. మొదటి భాగంలో పరిటాల రవి, రెండవ పార్ట్‌లో మద్దెల చెరువు సూరి కథ కనిపిస్తుందని వర్మ చెబుతున్నాడు.
వర్మ తీసిన సినిమాలో నిజాంగానే అనంతపురం ఫ్యాక్షనిజం, రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాడా? పరిటాల రవి హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా ఈ సినిమాలో చూడవచ్చంటున్నారు.. ఇప్పుడీ చరిత్రను తెరకెక్కించటం అవసరమా? అనంతపురం జిల్లా ఇవాళ్టికీ రక్తపుటేర్లలలోనే మునిగి ఉందన్నట్లుగా వర్మ తన ట్రయిలర్‌లో చెప్పుకొచ్చారు.. కురుక్షేత్రాన్ని మించిన యుద్ధభూమిని అనంతపురం తలపిస్తోందన్నట్లుగా చెప్తున్నారు..
ఇవాళ అనంతపురం అలా ఉందా? పరిటాల రవి హత్య జరిగిన తరువాత అనంతపురంలో పరిస్థితులు చాలావరకు మారాయి.. ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. పరిటాల, సూరి కుటుంబాలు ఎవరికి వారుగానే ఉండిపోయాయి.. కక్ష్యలు, కార్పణ్యాలు అంతగా కనిపించటం లేదు.. అలాంటప్పుడు ఇప్పుడీ సినిమాను తీయటం ద్వారా రాం గోపాల్‌ వర్మ ఏం చెప్ప దలచుకున్నాడు.. ఫ్యాక్షనిజం గురించి తాను మాట్లాడటం లేదని వర్మ చెప్తున్నా... ఇప్పుడు రక్తచరిత్ర రవి, సూరిల కథ అని స్పష్టంగానే తేలిపోయింది. ఇప్పుడు సినిమాలో ఏ వైపు బ్యాలెన్స్‌ ఏ కాస్త తప్పినా, ఒక వర్గం అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉంది.. ఆ పరిస్థితి గత కక్ష లను మళ్లీ రాజుకునేందుకు అవకాశం ఇస్తుందా? అదే జరిగితే అనంత పురం మరోసారి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.. వర్మ దీనికి ఏం జవాబు చెప్తాడు..

4, మే 2010, మంగళవారం

చిరంజీవి పోలవరం యాత్ర

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మళ్లీ జనంలోకి వస్తున్నారు..ఎన్నికల్లో ఓటమి తరువాత చిరంజీవి నిర్వహిస్తున్న తొలి ప్రజాయాత్ర ఇది.. రాజకీయంగా ఇంకా కుదురుకోని పార్టీకి జవసత్వాలు అందించేందుకు.. వ్యూహాత్మకంగా చిరంజీవి ఈ యాత్రను చేపట్టారు..
౨౦౦౯ ఎన్నికల్లో ప్రచార యాత్ర మినహా ప్రజల్లోకి రాని మెగాస్టార్‌ మొదటిసారి పెద్ద పర్యటనను చేపట్టారు.. భారీ నీటిపారుదల ప్రాజెక్టు పోలవరం సాధన అన్నది ఆయన తన పర్యటనకు ఎంచుకున్న సమస్య.. పార్టీ ప్రారంభించిన తరువాత రాజకీయంగా ప్రజల సమస్య పట్ల వేసిన కీలక అడుగు.... గోదావరి, కృష్ణా డెల్టాలకు అత్యంత అవసరమైన పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ఉద్యమిస్తానని చిరంజీవి రెండు డెల్టాల ప్రజలకు ఇస్తున్న భరోసా....పోలవరం యాత్ర.


చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ఎన్నికల ప్రచార సభల కోసం అన్ని జిల్లాల్లో పర్యటించారు.. అంతకు ముందు సిరిసిల్లలో చేనేత కార్మికులను, పోలేపల్లి సెజ్‌ బాధితులను పరామర్శించటం, గుంటూరులో, కరీంనగర్‌లో ధర్నాలు చేపట్టడం మినహా ఉద్యమ స్థాయిలో పురోగమించిన సందర్భం ఏదీ లేదు.. .. సమైక్య ఆంధ్ర నిరసనల సందర్భంగా ఆంధ్రప్రాంతంలోని జిల్లాలకు వెళ్లారు.. కానీ, ప్రజాసంబంధమైన సమస్యలపై భారీ ఎత్తున ప్రత్యక్ష ఆందోళనల్లో ఆయన పాల్గొన్నది లేదు.. ప్రజల్లోకి వెళ్లిందీ లేదు..
ప్రజారాజ్యం పార్టీ చెప్పుకోదగ్గదిగా చేపట్టిన తొలి ఆందోళన ఇది.. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒక అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నది ఇదే మొదటిసారి.
విమర్శల మాట ఎలా ఉన్నా.. చిరంజీవికి పోలవరం యాత్ర రాజకీయ పరంగా చాలా అవసరం.. సాధారణ ఎన్నికల్లో ఊహించినంత ఫలితాన్ని ప్రజారాజ్యం పార్టీ సాధించలేకపోయింది.. ఎన్నికలకు ముందు.. ఎన్నికల తరువాత ఆ పార్టీ కి చిరంజీవే నాయకుడు.. చిరంజీవే కార్యకర్తగా మారిపోయిన పరిస్థితి. చిరంజీవి మినహా ఆ పార్టీని ముందుకు నడిపించ గలిగే ప్రజాదరణ ఉన్న నాయకుడే లేకుండా పోయాడు.. దీనికి తోడు సమైక్యాంధ్ర నినాదాన్ని అందిపుచ్చుకున్న తరువాత తెలంగాణాలో పిఆర్‌పి ఉనికి నామమాత్రమైంది..ఇప్పుడు పోలవరం సాధన పేరుతో మెగాస్టార్‌ నిర్వహిస్తున్న యాత్ర రాజకీయంగా రాష్ట్రంలో అత్యంత బలమైన ఆరు జిల్లాల్లో సాగుతోంది.. సమైక్య నినాదంతో చిరుకు కొంత పాజిటివ్‌గా మారిన ప్రజాభిప్రాయం, ఈ యాత్ర వల్ల మరింత సానుకూలంగా మారుతుందా? మెగాస్టార్‌ కోరుకుంటున్నదీ అదే.. కదా..


3, మే 2010, సోమవారం

నరహంతకుడి నేరం రుజువైంది.. ముంబైపై ఉగ్రవాదులు ప్రకటించిన యుద్ధంలో దొరికిన ఒకే ఒక్క ముష్కరుడు అజ్మల్‌ ఆమీర్‌ కసాబ్‌ను కరడుగట్టిన నేరగాడిగా న్యాయస్థానం నిర్ణయించింది.. ఉగ్రవాదాన్ని ప్రేరేపించటంలో పాకిస్తాన్‌ ఎలాంటి భూమిక నిర్వహిస్తోందో, మొట్టమొదటిసారిగా మన న్యాయస్థానంలో రుజువయింది..
ఉగ్రవాద పాకిస్తానీ నరహంతకుడని రుజువైంది.. 2008 నవంబర్‌ 26న ముంబయిలో ముష్కరులు నిర్వహించిన మహా మారణకాండకు బలైన బాధితులకు ఇన్నాళ్ల తరువాత కాస్తంత ఊరట లభించింది. ముంబయిపై యుద్ధం చేసిన ఉగ్రవాదుల్లో మన బలగాలకు చిక్కిన ఒకే ఒక్కడు అజ్మల్‌ అమీర్‌ కసాబ్‌ను నేరగాడిగా కోర్టు ప్రకటించింది..
కసాబ్‌పై దాదాపు ౮౬ ఆరోపణలు దాఖలయ్యాయి. మొత్తం పన్నెండు కేసుల్లో కసాబ్‌ను దోషిగా న్యాయమూర్తి నిర్ధారించారు. కసాబ్‌ చేసింది యుద్ధమేనని జడ్జి వ్యాఖ్యానించటం మన దేశంపై పాకిస్తాన్‌ ఇంతకాలంగా చేస్తున్నదేమిటో అర్థమవుతుంది..

26/11 దాడిలో కసాబ్‌ ఏమిటో న్యాయపరంగా కూడా తేలిపోయింది.. ఈ మొత్తం వ్యవహారంలో కసాబ్‌ ఒక పావు మాత్రమే.. అతని బాస్‌లు పాకిస్తాన్‌లో ఇంకా దర్జాగానే ఉన్నారు.. వీరిపై చర్య కోసం పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురాగలిగినప్పుడే, ముష్కరులపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితులు కల్పించగలిగనప్పుడే.. టెర్రరిజానికి, పాకిస్తాన్‌కు సిసలైన గుణపాఠం చెప్పినట్లవుతుంది...
కసాబ్‌పై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు బాధితులకు పూర్తిగా న్యాయం చేసిందా? అంటే లేదనే చెప్పాలి.. అజ్మల్‌ అమీర్‌ కసాబ్‌తో పాటు నిందితులైన మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేయటం దురదృష్టం.. కసాబ్‌ ను నేరస్థుడిగా నిర్ధారించిన న్యాయస్థానమే.. అతనికి సహకరించారన్న ఆరోపణలపై నిందితులైన ఫాహిమ్‌ అన్సారీ, షాబుద్దీన్‌లను నిర్దోషులుగా పేర్కొంది.. ౨౬/౧౧కు ముందు అన్సారీ, షాబుద్దీన్‌లు ఇద్దరూ తాజ్‌, ఓబెరాయ్‌లలో రెక్కీ నిర్వహించారని, కసాబ్‌, ఇతర ఉగ్రవాదులకు అవసరమైన సాయాన్ని అందించారని ప్రాసిక్యూషన్‌ చేసిన ఆరోపణలను బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద కొట్టివేసింది. ఈ ఇద్దరినీ కోర్టు విడుదల చేసింది.
ఆరోపణలను పూర్తిగా రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైంది.. దీనిపై పై కోర్టుకు వెళ్లవచ్చు. వాస్తవానికి షాబుద్దీన్‌, అన్సారీలు కరడుగట్టిన నేరగాళ్లు.. ౨౦౦౫ బెంగళూరు ఐఐఐఎంఎస్‌ పై టెర్రరిస్టు దాడిలో షాబుద్దీన్‌, ౨౦౦౮లో ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌ సిఆర్‌పిఎఫ్‌ క్యాంపుపై దాడి కేసులో అన్సారీ నిందితులుగా ఉన్నారు.. పాక్‌ టెర్రరిస్టు అబూ ఇస్మాయిల్‌ దగ్గర ముంబయి నగర ప్లాన్‌ దొరికింది. ఈ ప్లాన్‌ను షాబుద్దీన్‌, అన్సారీలే ఇస్మాయిల్‌కు అందించారని ఆధారాలు ఉన్నప్పటికీ, వారిని నిర్దోషులుగా విడుదల చేయటం అసంతృప్తికి గురి చేసింది.. భారత న్యాయ చరిత్రలో ౧౭ నెలల స్వల్పకాలంలో తీర్పు చెప్పి ఉండవచ్చు కానీ, న్యాయానికి పూర్తి న్యాయం జరిగిందా అంటే లేదనే భావించాలి..
ఇప్పుడీ తీర్పుతోనో.. కసాబ్‌కు వేసే శిక్షతోనో టెర్రరిజాన్ని జయించేశామని భారత సర్కారు చేతులు ముడుచుకు కూచుంటే పొరపాటే.. ఈ కేసులో మునుపెన్నడూ లేని విధంగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ పూర్తి సహకారాన్ని అందించినట్లే.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఏం చేయాలో దృష్టి సారించటం అవసరం..