23, డిసెంబర్ 2020, బుధవారం

పసరిక ఎవరు? పామా..? పైరా? పసివాడా? వేయిపడగలు- ఎందుకు చదవాలి?

పసరిక ఎవరు? పామా? పైరా? పసివాడా? విశ్వనాథ వారి వేయిపడగలు ఎందుకు చదవాలి? దేవ మాతృకలు.. అదేవ మాతృకలు అంటే ఏమిటి? తప్పక వినండి.. డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగం ఏడవ భాగం

2, డిసెంబర్ 2020, బుధవారం

వేయిపడగలు సామాజిక జీవనం-6 డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగం

వేయిపడగలు  ఎందుకు చదవాలి? అన్న భూమికపై ప్రఖ్యాత పరిశోధకుడు డాక్టర్ కేవీఎన్ రాఘవన్ చేస్తున్న ప్రసంగ పరంపరలో ఇది ఆరోభాగం తప్పక చదవండి.. చదివించండి

15, నవంబర్ 2020, ఆదివారం

వేయిపడగలు-వర్ణ వ్యవస్థ డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగం

విశ్వనాథ వారి 125వ జయంతి సందర్భంగా వేయిపడగలు నవలపై సాగుతున్న డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ఉపన్యాస పరంపరలో ఐదవది. వేయిపడగలు.. వర్ణ వ్యవస్థ.. తప్పక వినండి

14, నవంబర్ 2020, శనివారం

3, నవంబర్ 2020, మంగళవారం

25, అక్టోబర్ 2020, ఆదివారం

వేయి పడగలు- సామాజిక జీవనం.. డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగం పార్ట్ -3

వేయి పడగలు ఎందుకు చదవాలి? అన్న శీర్షికన డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగాల పరంపరలో ఇది మూడో భాగం.. వేయిపడగలు-సామాజిక జీవనం. వినండి.. వినిపించండి

21, అక్టోబర్ 2020, బుధవారం

వేయి పడగలు - రాజ్య వ్యవస్థలు

వేయి పడగలు నవల ఎందుకు చదవాలి. 1934 లో విశ్వనాథవారు రాసిన ఈ నవల ఇవాల్టికీ ఎందుకు అవసరం? ఇందులోని సార్వకాలీనమైన విషయాలేమిటి.. డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ధారావాహిక ప్రసంగాలు.. వేయిపడగలు-రాజ్య వ్యవస్థలు.. వినండి.. వినిపించండి

19, అక్టోబర్ 2020, సోమవారం

జాతీయ పునరుజ్జీవనం- వేయి పడగలు.. డాక్టర్ కేవీఎన్ రాఘవన్ ప్రసంగం

విశ్వనాథవారి వేయి పడగలు ఎందుకు చదవాలి? దాని పూర్వ రంగం ఏమిటి? వేయిపడగల్లో ఉన్న అనేక అంశాలపై డాక్టర్ కేవీఎన్ రాఘవన్ గారు చేసిన ప్రసంగాల పరంపర లో ఇది తొలిభాగం. జాతీయ పునరుజ్జీవనం.. వేయిపడగలు.. తప్పక వినాల్సిన ప్రసంగం.

15, అక్టోబర్ 2020, గురువారం

errapragada ramakrishna on telugu padyam

తెలుగు పద్యం పై చర్చాగోష్టిలో శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు చేసిన ప్రసగంలోని ఒక భాగం. వినండి.. వినిపించండి

2, అక్టోబర్ 2020, శుక్రవారం

Telugu padyam a discussion by prof. tummapudi koteeshwarrao

తెలుగు పద్యంపై చర్చాగోష్టి కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పూర్వాచార్యులు, ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు ఆచార్య తుమ్మపూడి కోటీశ్వర్ రావు గారి అభిప్రాయం వినండి. పదిమందికి వినిపించండి.

1, అక్టోబర్ 2020, గురువారం

తెలుగు పద్యం.. చర్చా గోష్టి.. చేకూరి రామారావు ప్రసంగం

తెలుగు పద్యంపై చర్చాగోష్టి కార్యక్రమంలో ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు ఆచార్య చేకూరి రామారావు ప్రసంగం వినండి. వినిపించండి

30, సెప్టెంబర్ 2020, బుధవారం

A scholar's journey for research? where is the destiny? (suprasanna's jo...

పీహెచ్ డీ.. విశ్వవిద్యాలయాల్లో పిహెచ్ డీ చేస్తున్న విద్యార్థులు తమ పరిశోధనను ఎలా చేస్తున్నారు? వారి గైడ్ లు వారికి ఎలాంటి మార్గదర్శనం చేస్తున్నారు? చాలా చోట్ల తూతూ మంత్రంగా పరిశోధనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రోజూ వింటున్నాం. కానీ 1959లో ఒక పరిశోధక విద్యార్థి తన పరిశోధనకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం విజయనగరం నుంచి చెన్నై వరకు సుదీర్ఘ ప్రయాణంచేసి అనేక పండితులను, సాహిత్యవేత్తలను కలిసి.. చర్చలు జరిపి.. తద్వారా పరిశోధనను పూర్తిచేయడం ఈ రోజుకు ఒక అద్భుతమే. ఆచార్య కోవెల సుప్రసన్న.. రామరాజభూషణుడి కృతులపై చేసిన పరిశోధన నిమిత్తం చేసిన పరిశోధన యాత్రా విశేషాలు ఆయన నోటివెంటే వినండి. నేటితరం పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు సైతం తప్పక విని అనుసరించి ఆచరించాల్సిన స్ఫూర్తి దాయక అనుభవం ఇది.

తెలుగు పద్యం చచ్చిపోయిందా? చర్చ.. తొలి ప్రసంగం ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం

ఆధునిక తెలుగు సాహిత్యంలో తెలుగు పద్యం స్థానమేమిటి? ఈ నాటి అవసరాలకు తగినట్టుగా పద్యాన్ని రాయడం సాధ్యం కాదా? తెలుగుపద్యం పై ప్రముఖుల చర్చాగోష్టిలో ఇది తొలి ప్రసంగం. ఆచార్య జీవీ సుబ్రమహ్మణ్యం గారు చేసినది. వినండి.

28, సెప్టెంబర్ 2020, సోమవారం

discussion on kavi samrat vishwanatha satyanarayana.. by kovela sampatku...

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సమగ్ర సాహిత్యంపై ఆచార్య కోవెల సంపత్కుమార, శ్రీ జువ్వాడి గౌతమరావు చర్చాగోష్టి తప్పక వినండి.

23, సెప్టెంబర్ 2020, బుధవారం

prof suprasanna.. speech on intergrity between indian languages.. a vision

భారతీయ భాషల్లో సమన్వయ దృక్పథం - దార్శనికత అంశంపై ఆచార్య కోవెల సుప్రసన్న చేసిన ప్రసంగం... తప్పక వినండి. ఇది తెలుగు సాహిత్యలోకం చర్చించాల్సిన విషయం. స్వాధ్యాయ ఈ చర్చాగోష్టిని ఆహ్వానిస్తున్నది. దీనిపై తమ అభిప్రాయాలను వాట్సాప్ (9052116463) కి ఆడియో కానీ, వీడియో ద్వారా కానీ పంపించండి.. వాటిని మళ్లీ ఇదే చానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు

22, ఆగస్టు 2020, శనివారం

arudra nigama sharma.. by a pundarikakshaiah

 ప్రముఖ రచయిత ఆరుద్ర రచించిన ’నిగమశర్మ‘ వాక్చిత్రం ఇది. ఇందులో నిగమశర్మగా ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య తమ అపూర్వ స్వరదానంచేశారు. అరుద్ర రచనకు పుండరీకాక్షయ్య స్వరం.. ఆకాశవాణి మద్రాసు కేంద్రం ప్రసారం ఒక అద్భుతం. తెలుగు సాహిత్యాభిమానులు, ఆధునిక రచయితలు, కవులు తప్పనిసరిగా విని, పదిమందికి వినిపించాల్సిన వాక్చిత్రమిది. స్వాధ్యాయ మీకు అందిస్తున్నది.

19, ఆగస్టు 2020, బుధవారం

శ్రీ ధనికొండ హనుమంతరావు శతజయంతి సమాపన సమారోహంలో ప్రముఖ రచయిత, విమర్శకుడు, కవి పండితుడు.. శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారు చేసిన ప్రసంగం. ..

 ప్రఖ్యాత రచయిత శ్రీ ధనికొండ హనుమంతరావు శతజయంతి సమాపన సమారోహంలో ప్రముఖ రచయిత, విమర్శకుడు, కవి పండితుడు.. శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారు చేసిన అద్భుత ప్రసంగమిది. తప్పక వినాల్సిన ప్రసంగం. .. ఈరోజు ఏల్చూరి వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇది ప్రత్యేకం. 

17, ఆగస్టు 2020, సోమవారం

legendary theatre artists in telugu theatre మన రంగస్థల దిగ్గజాలు

తెలుగు రంగస్థలం అద్భుతమైంది. 1840 నుంచి వేలాది నటులు తెలుగు రంగస్థలాన్ని పునీతం చేశారు. అలాంటి రంగస్థల దిగ్గజాల అపురూప స్వరాలను వినడమే ఒక అపురూపం. మన పూర్వజన్మ సుకృతం. ఆకాశవాణి మనకు ఆ సదవకాశాన్ని కల్పించింది. మన రంగస్థల దిగ్గజాలైన మహానుభావుల స్వరాలను (బళ్లారి రాఘవ, రామతిలకం, బందా, వేమూరి, సూరిబాబు, పీసపాటి.. వంటి మరెందరో ప్రభృతుల స్వరాలు) ఒకే కార్యక్రమంలో జతపరచి మనకందించింది. ఈ స్వరాలను స్వాధ్యాయ మీకు అందిస్తున్నది. ఈ కార్యక్రమం లో ఆడియో కొంత మేరకు డిస్ట్రబెన్స్ గా ఉన్నది. అయినప్పటికీ.. ఈ స్వరాలను అందరికీ వినిపించడమే లక్ష్యంగా స్వాధ్యాయ అందిస్తున్నది. అందరి స్వరాలను వినండి.. పది మందికి వినిపించండి. మన నాటక వైభవాన్ని మరోసారి ఈ తరానికి వ్యాప్తిచేయండి.


15, ఆగస్టు 2020, శనివారం

 భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాధ్యాయ మీకు ప్రత్యేకంగా అందిస్తున్న డాక్యెమెంటరీ. భారతదేశం యొక్క సమగ్ర స్వరూపాన్ని, సాహిత్య, సాంస్కృతిక, సమస్త కళారూపాల విశ్వరూపాన్ని ప్రదర్శించిన లఘుచిత్రమిది. అందరూ తప్పక చూడాల్సినది. .. పదిమందికి చూపించాల్సినది.

10, ఆగస్టు 2020, సోమవారం

documentary on freedom fighter veersavarkar

 this is the documentary on freedom fighter veersavarkar. after his demise in (1966).. in 1970 than indira gandhi government permitted to produce this documentary . film division of information and broadcasting ministry produced this documentary. this is wonderful documentary. we can able experience of our freedom movement. we can see the cellular jail in andaman where savarkar jailed. look it. feel the proud movement

9, ఆగస్టు 2020, ఆదివారం

merger of princely states in indian union

  స్వాతంత్య్రానంతరం భారతదేశంలో వివిధ సంస్థానాలు విలీనమైన చరిత్ర మనలో చాలామందికి తెలియదు. ఒక్కో సంస్థానం ఏ రకంగా దేశంలో విలీనమైంది.. వారు రాజప్రముఖ్ లుగా ఏ విధంగా ప్రమాణం చేశారు.. కొన్ని సంస్థానాల విలీనం విషయంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఏ విధంగా కృషి చేశారు.. అత్యంత అరుదైన డాక్యుమెంటరీ ఇది. ప్రతి భారతీయుడు ఈ చరిత్రను తెలుసుకోవాలి. పలువురు సంస్థానాధీశులను ఈ డాక్యుమెంటరీలో మనం చూడవచ్చు. చక్కని డాక్యుమెంటరీ ఇది. స్వాధ్యాయ మీకు అందిస్తున్నది. మీరు చూడండి.. పదిమందికి పంచండి. స్వాధ్యాయను సబ్స్క్రైబ్ చేయండి

7, ఆగస్టు 2020, శుక్రవారం

reknowned writer ronanki appalaswamy interview by dr. ravuri bharadwaja

ప్రఖ్యాత సాహిత్యవేత్త, కవి, రోణంకి అప్పలస్వామితో జ్నానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ ఆకాశవాణికోసం చేసిన ఇంటర్వ్యూ. తప్పక వినండి. పదిమందికి వినిపించండి.

31, జులై 2020, శుక్రవారం

reknown poet boyi bheemanna interview

ప్రఖ్యాత కవి డా. బోయి భీమన్నతో గతంలో ఆకాశవాణి చేసిన ఇంటర్వ్యూ . అత్యంత అరుదైన వ్యక్తిత్వం.. అద్భుతమైన మనిషి.. ఆయన స్వగతమితి. ఆయన స్వీయ స్వరంలో.. తప్పక వినండి. స్వాధ్యాయ సమర్పణం.

28, జులై 2020, మంగళవారం

c narayanareddy radio interview on his jayanti

 ప్రముఖ కవి  శ్రీ డా.సి.నారాయణ రెడ్డి జయంతి
(29-07-2020)సందర్భంగా గతంలో ఆకాశవాణి   నిర్వహించిన జీవన పరిచయ కార్యక్రమం. పరిచయ కర్త శ్రీ డా. ఎన్.గోపి. తప్పక వినండి. swadhyaya presentation.

27, జులై 2020, సోమవారం

suptashila a radio play written by d balagangadhar tilak

ఆధునిక కవితావైతాళికుడు స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన సుప్తశిల కు రేడియో అనుసరణ ఈరేడియో నాటకం. అద్భుతమైన ఈ నాటకాన్ని ప్రతి ఒక్క సాహితీప్రియులు వినాల్సిందే. స్వాధ్యాయ ఈ సాహితీ రూపకాన్ని రేడియో సౌజన్యంతో మీకు అందిస్తున్నది.

24, జులై 2020, శుక్రవారం

నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా గారి అపూర్వ గళమిది

నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా గారి అపూర్వ గళమిది. అత్యంత అరుదైన స్వరమాధురి. ఈరోజు వారి వర్ధంతి. ఈ సందర్భంగా వారికి నివాళి సమర్పిస్తున్నా. నవయుగాది కవితాగానం చేసిన జాషువాగారి స్వరం వినండి. మిస్ కావద్దు. మరిన్ని స్వరాలను, వీడియోలను చూడటానికి ముందు చానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి.

19, జులై 2020, ఆదివారం

kinnerasani songs with analysys by sri vishwanatha him self.

విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు గతంలో ఆయన స్వీయ గళంలో విన్నాం. ఇప్పుడు ఆయన స్వయంగా వ్యాఖ్యానంచేస్తూ.. చేసిన కిన్నెరసాని గానాన్ని వినండి.

kinnerasani songs with analysys by sri vishwanatha him self.

విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు గతంలో ఆయన స్వీయ గళంలో విన్నాం. ఇప్పుడు ఆయన స్వయంగా వ్యాఖ్యానంచేస్తూ.. చేసిన కిన్నెరసాని గానాన్ని వినండి.

pv rajamannar's manorama radio play with legendery actors voices

మనోరమ.. ప్రఖ్యాత రచయిత పీవీ రాజమన్నార్ రచించిన రేడియో నాటకం.. అంతకుమించి ఇంత అద్భుతమైన నాటకానికి స్వరదానం చేసిన మహానుభావులు.. సావిత్రి గణేశన్, గుమ్మడి వెంకటేశ్వర్రావు, అల్లు రామలింగయ్య వంటి ప్రభృతులు. సినీతారలు చేసిన అత్యంత అరుదైన రేడియో నాటకాల్లో ఇది ఒకటి. అన్నింటికీ మించి ఈ నాటకాన్ని నిర్వహించిన వారు మహాకవి దాశరథి. తప్పక విని తీరాల్సిన నాటకమిది.

5, జులై 2020, ఆదివారం

"ME AND ABOUT ME" -sadguru sri sivanandamurti part-2

on this gurupurnima .. swadhyaya presenting the great saint of our times, mahamahopadhyaya, deshikoththama sadguru sri kandukuri sivanandamurti precious words "me and about me" very detailed indepth philosophy of sri guruji. in this documentary we can able to see all sacred places in our karma bhoomi.  guru is nothing but god. on this gurupurnima we have to listen sri guruji words nothing else. guru words listening is enough on gurupurnima. 

"me and about me" -sadguru sri sivanandamurti part-1



"me and about me" -sadguru sri sivanandamurti part-1



on this gurupurnima .. swadhyaya presenting the great saint of our times, mahamahopadhyaya, deshikoththama sadguru sri kandukuri sivanandamurti precious words "me and about me" very detailed indepth philosophy of sri guruji. in this documentary we can able to see all sacred places in our karma bhoomi.  guru is nothing but god. on this gurupurnima we have to listen sri guruji words nothing else. guru words listening is enough on gurupurnima. 

28, జూన్ 2020, ఆదివారం

opinion on formar prime minister pv narasimharao

మాజీ ప్రధానమంత్రి, మనకాలపు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ పీవీ నరసింహారావు శతజయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఆయన గురించి ప్రముఖ సాహితీవేత్త ఆచార్య సుప్రసన్న చెప్పిన కొన్ని అత్యంత అరుదైన, ఇప్పటికీ ఎవరికీ తెలియని కొన్ని సంఘటనలకు సంబంధించిన సమాచార సమాహారం.. stay with swadhyaya

26, జూన్ 2020, శుక్రవారం

prof suprasanna on prof. sampatkumara on his birth anniversary

ప్రముఖ సాహితీవేత్త, ఛంద:శాస్త్రవేత్త, కవి, విమర్శకుడు ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య జయంతి నేడు (26 జూన్). ఈ సందర్భంగా వారి అన్నగారి కుమారుడు ప్రముఖ పండితుడు, సాహితీవేత్త ఆచార్య కోవెల సుప్రసన్నగారి అభిప్రాయం. మీకోసం

14, జూన్ 2020, ఆదివారం

13, జూన్ 2020, శనివారం

sarojini naidu rare video

rare video of great writer, poet, politician, nightingale of india sarojini naidu.. which recorded long time ago in newyork, when she goes to united nations 

legendery artist kondapalli seshagirirao radio interview

ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు రేడియో ఇంటర్వ్యూ వినండి. మన తెలుగు ప్రముఖుల మహత్తరమైన స్వరఝరులలో అపూర్వమైన స్వరమిది. 

30, మే 2020, శనివారం

KANTABHARANAM radio play

పానుగంటి వారి ప్రసిద్ధ హాస్యనాటిక.. కంఠాభరణం.. ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిన నాటిక .. మీరు వినండి.. పదిమందికి వినిపించండి.

26, మే 2020, మంగళవారం

changiz khan radio play .. (thetre drama)

ప్రఖ్యాత రచయిత తెన్నేటి సూరి రచించిన ఛంఘీజ్ ఖాన్ .. చారిత్రక నవలను రేడియో నాటకం గా వినండి.

20, మే 2020, బుధవారం

ravuri bharadwaja interview for air hyderabad after jnanpeeth award anno...

ప్రఖ్యాత రచయిత రావూరి భరద్వాజ జ్నానపీఠ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై ఆకాశవాణి చేసిన ఇంటర్వ్యూ ఇది. తప్పక వినండి.

18, మే 2020, సోమవారం

viswanatha satyanarayana with rs sudarshanam vasundharadevi

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి అత్యంత అరుదైన వ్యక్తిగత అనుభవాలతో కూడిన ఇంటర్వ్యూ ఇది. ప్రముఖ సాహిత్య విమర్శకుడు ఆర్ ఎస్ సుదర్శనం, ప్రముఖ కథా రచయిత్రి ఆర్ వసుంధరాదేవి గార్లు గతంలో రెండు రోజులు విజయవాడలోని విశ్వనాథ వారి ఇంట్లో ఉన్నారు. ఆ సందర్భంలో వారిద్దరూ కలిసి చేసిన ఇంటర్వ్యూ ఇది. సాహిత్యం గురించి.. తన వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులను పంచుకొన్న ఇంటర్వ్యూ ఇదేనేమో.. ఈ ఆడియోను స్వాధ్యాయకు అందించింది పండితవరేణ్యులు ప్రొఫెసర్ ఏల్చూరి మురళీధర్ రావు గారు. వారికి ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే.. ఈ అత్యద్భుతమైన ఇంటర్వ్యూ ట్రాన్స్ స్క్రిప్ట్ త్వరలోనే sanchika.com లో యథాతథంగా ప్రచురించడం జరుగుతుంది. ఈ ఆడియోను తప్పక వినండి.

article on chitrakavita


16, మే 2020, శనివారం

soundaranandam radio play (karunasri)

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రాసిన సౌందరనందం (బుద్దుడి చరిత్రపై సంస్కృతంలో అశ్వఘోషుడి అద్భుతమైన కావ్యం) గతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఇటీవల ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారు దీన్ని పున:ప్రసారంచేశారు. దీనికి ప్రత్యేకత ఏమిటంటే.. ప్రఖ్యాత సంస్కృతాంధ్ర విద్వాంసులు శ్రీ ఏల్చూరి మురళీధర్రావు గారు ప్రశస్తమైన ముందుమాట చెప్పారు. ఈ ఆడియోను స్వాధ్యాయకు అందించింది కూడా వీరే. వారికి వేనవేల ధన్యవాదాలు. 

9, మే 2020, శనివారం

Indraganti Srikanta sharma Amrapali radio play

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచించిన ఆమ్రపాలి రేడియో నాటికం. నిర్వహణ శ్రీ కలగా కృష్ణ మొహన్.వినండి.

8, మే 2020, శుక్రవారం

legend writer samala sadishiva' opinion on writer anjanbee

ప్రఖ్యాత తెలుగు, ఉర్దూ రచయిత శ్రీ సామల సదాశివ గారి జయంతి సోమవారం. ఈ సందర్భంగా శ్రీ సదాశివ గారు  రచయిత్రి అంజన్ బీ పై ఆకాశవాణి లో వెలిబుచ్చిన అభిప్రాయం వినండి. 

5, మే 2020, మంగళవారం

Prahalada Bhakthi Vijaya AIR Vijayawada 19 Jan1959

Prahalada Bhakthi Vijaya AIR Vijayawada 19 Jan1959

‘ప్రహ్లాద భక్తి విజయం ’ఈ నాటకం త్యాగరాజస్వామి వారు రచించినది.  19 జనవరి 1959లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈ నాటకాన్ని నిర్వహించినవారు ప్రఖ్యాత వాగ్గేయకారులు డాక్టర్ మంగళం పల్లి బాలమురళీకృష్ణ. ఈ నాటకంలోని పాత్రలకు లబ్ధ ప్రతిష్ఠులైన మహానుభావులు స్వరాన్ని అందించారు. వోలేటి వెంకటేశ్వర్లు, ఏపీ కోమల,  బాలమురళీకృష్ణ, ఎం వీ రమణమూర్తి, వీ లక్ష్మీ, శ్రీరంగం గోపాలరత్నం, జూలూరి అరుంధతి, ఎంసీవీ జగన్నాథాచార్యులు, పాండురంగరాజు తదితరులు స్వరదానంచేశారు. ఈ క్లాసిక్ ను తప్పక వినాల్సిందే.

2, మే 2020, శనివారం

rare interview of kavisamrat sri vishwanatha satyanarayana (unknown source)

సాక్షాత్ సరస్వతి మూర్తి.. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంపై సమగ్రంగా సుదీర్ఘంగా జరిపిన చర్చ. తెలుగు సాహిత్య అభిమానులు తప్పనిసరిగా వినాల్సిన చర్చ ఇది.

25, ఏప్రిల్ 2020, శనివారం

bhagyanagaram radio play.. by narla chiranjeevi (courtesy all india radio)

కీర్తిశేషులు నార్ల చిరంజీవి రచించిన భాగ్యనగరం రేడియో నాటకం...
గతంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. తప్పక వినాల్సిన అపూర్వ నాటకం.

chola heritage an fdc newsreel 1980

this is news reel produced by film development corporation of india. 1980. on chola hiritage. news reels are famous on our time. when we go for thetre to watch a movie.. news reel coms first. news reels contains news, current affairs, history, and culture and so many other things. this is 15 min. news reel on chola heritage. pl. look it.

20, ఏప్రిల్ 2020, సోమవారం

voice of sri devulapalli ramanujarao. interviewed by prof.mudigonda siva...

దేవులపల్లి రామానుజరావు ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు.  ఆయన రేడియోకు ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూ ఇది. తప్పకుండా వినండి. స్వాధ్యాయలో భాగస్వాములు కండి.

12, ఏప్రిల్ 2020, ఆదివారం

vanijayaram the legend playback singer.. personal life

ప్రఖ్యాత గాయని వాణీజయరాం అత్యంత నిరాడంబరమైన జీవన వ్యక్తిత్వంపై ప్రత్యేక కార్యక్రమాన్ని చూడండి. మన కాలపు లివింగ్ లెజెండ్ గురించి తెలుసుకోవాలంటే తప్పక చూడాల్సిన వీడియో ఇది. పది మందికి చేరవేయండి. స్వాధ్యాయలో మీరూ భాగస్వాములు కండి. 

11, ఏప్రిల్ 2020, శనివారం

voice of sri elchuri subrahmanyam (poet of niagara)

ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు.. అన్నింటికీ మించి అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు.. నయాగరా కవుల్లో అగ్రగణ్యులు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు మహాకవి శ్రీశ్రీ గురించి చెప్పిన అభిప్రాయం వినండి. వీరందరూ మన మార్గదర్శకులు. స్ఫూర్తి ప్రదాతలు. తప్పక వినండి. పది మందికి వినిపించండి. స్వాధ్యాయలో మీరూ భాగస్వాములు కండి.

6, ఏప్రిల్ 2020, సోమవారం

welknown linguist chekuri ramarao's voice

ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త , కవి, విమర్శకుడు ఆచార్య చేకూరి రామారావు (చేరా) తో ప్రముఖ రచయిత సీహెచ్ రాంబాబు ఆకాశవాణిలో చేసిన ఇంటర్వ్యూ. తప్పక వినండి. పదిమందికి వినిపించండి. స్వాధ్యాయలో మీరూ భాగస్వాములు కండి.

5, ఏప్రిల్ 2020, ఆదివారం

chalam pururava radio play (చలం పురూరవ రేడియో నాటకం)

చలం పురూరవ రేడియో నాటకం.. అందరూ తప్పక వినాల్సిన నాటకం. కరోనా సెలవుల్లో .. తెలుగు భాష పిల్లలకు నేర్పాలని మా సీనియర్ జర్నలిస్ట్ అన్న సురావఝల రాముగారు ఒక వ్యాసం ద్వారా అద్భుతమైన సూచన చేశారు. మనము.. మన పిల్లలు తెలుగు భాష నేర్చుకోవడానికి ఇలాంటి రేడియో నాటికలు చక్కగా ఉపయోగపడతాయని భావిస్తున్నా. కొంత నాయిస్ ఉన్నప్పటికీ.. వాయిస్ స్పష్టంగానే ఉన్నది. నాయిస్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా. ఈ నాటకం తప్పక వినండి.. పది మందికి వినిపించండి. స్వాధ్యాయలో మీరూ భాగస్వాములు కండి

4, ఏప్రిల్ 2020, శనివారం

telugu linguist scientist bhadriraju krishnamurti voice

తెలుగు భాషాలోకం గర్వించదగ్గ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారి సాహిత్య వాంఒ్మయ ప్రస్థానం ఆయన స్వీయ స్వరంలో వినండి. పదిమందికి వినిపించండి. స్వాధ్యాయ సాహిత్య సాంస్కృతిక బాటలో అడుగులు కదపండి

1, ఏప్రిల్ 2020, బుధవారం

suprasanna's voice on vishwanathas controvercial poem

గత ఆదివారం (మార్చి 29)న స్వాధ్యాయ చానల్లో  పోస్ట్ చేసిన విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాల వెనుక అత్యంత వివాదాస్పదమైన సన్నివేశం ఉన్నదని ఆచార్య సుప్రసన్నగారు తెలిపారు. విజయవాడలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరి కవితలను కవితలు కావంటూ ఆశువుగా పద్యాలు చెప్పినట్టుగా వివరించారు. ఆ కవిసమ్మేళనంలో సుప్రసన్నగారు కూడా కవిత్వం చెప్పారట. ఆయన కవిత్వంలోనూ చివరి పంక్తులు చదివి ఇందులో చమత్కారమేమున్నదని అడిగారట. విశ్వనాథవారి పద్యం ఈ లింక్ తో పాటు ఇస్తున్నా.. సుప్రసన్నగారి అభిప్రాయమూ వినండి. తెలుగు సాహిత్య చరిత్రలో ఇదొక మరుపురాని సన్నివేశం. స్వాధ్యయలో మీరూ భాగస్వాములు కండి. పదిమందిని భాగస్వాములను చేయండి.

29, మార్చి 2020, ఆదివారం

vishwanatha poem in his voice

ఆకాశవాణి కవిసమ్మేళనంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యగానం. వినండి. పదిమందికి వినిపించండి. స్వాధ్యాయ లో భాగస్వాములు కండి.

28, మార్చి 2020, శనివారం

srisri poem on occation of gandhi centenery celebrations

శ్రీశ్రీ .. శ్రీరంగం శ్రీనివాసరావు 1969లో గాంధీ శతజయంతి సందర్భంగా ‘చూశావా గాంధీ’ పేరుతో ఆకాశవాణి కవిసమ్మేళనంలో చదివిన కవిత ఇది. ఈ అపూర్వ స్వరాన్ని పదిమందికి తప్పకుండా వినిపించండి. షేర్ చేయండి. ఇది స్వాధ్యాయ సమర్పణ.. కోవెల సంతోష్ కుమార్

voice of poet kundurti anjaneyulu

వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు . ఫ్రీవర్స్ ఫ్రంట్ ద్వారా వచనకవితావ్యాప్తికి కృషి చేసిన ఈ నయాగరా కవి..  కవిత్వము గతమని, వచన కవిత్వము వర్తమానమని చాటాడు. ఆయన అపూర్వ స్వరాన్ని వినండి. మన కవుల అపూర్వ గళాలు వర్ధమాన సాహితీవేత్తలకు కవులకు ప్రేరణలు . ఈ అపూర్వ స్వరాలను పదిమందికి పంచండి. ఇది స్వాధ్యాయ సమర్పణ.

25, మార్చి 2020, బుధవారం

voice of telugu poet ajanta

స్వప్నలిపికారుడు అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి). 1997లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆకాశవాణి చేసిన ఇంటర్వ్యూ ఇది. ఆయన అవార్డు స్వీకరించిన సమయంలో నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఆయన్ను కలిసే అవకాశం నాకు అలా లభించింది. ఆ సమావేశంలో ఆయన అనారోగ్యంతో మాట్లాడలేకపోతే శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారు ఆయన తరపున ప్రసంగించారు. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో సైతం ఆయన ప్రసంగం ఆయాసంతో కొనసాగింది. అవార్డు లభించిన తర్వాత కొన్నాళ్లకే 1999లో అజంతా కన్నుమూశారు. ఆడియో కొంత నాయిసీగా ఉన్నప్పటికీ.. ఆయన అపూర్వ స్వరాన్ని పదిలపరచడం కోసం స్వాధ్యాయ చేసిన ప్రయత్నమిది. ఆయన సాహిత్య ప్రస్థానాన్ని తప్పక వినండి. స్వాధ్యాయలో భాగస్వాములు కండి. చేతులు కలపండి. చేరండి. పదిమందికి సాహితీ ఆణిముత్యాలను పంచండి.

23, మార్చి 2020, సోమవారం

voice of devarakonda balagangadhara tilak

కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. అంతటి అద్భుత కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ స్వీయ కవితాగానం.. ఆయన అపూర్వ స్వరంలో వినండి. పదిమందికి పంచండి. ఇది స్వాధ్యాయ సగర్వ సమర్పణ

9, మార్చి 2020, సోమవారం

gurajada apparao kanyasulkam play.. part-1

తొలి తెలుగు ఆధునిక నాటకం గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం. 99 టీవీ గతంలో ప్లే చేసిన ఈ నాటకం మీకోసం స్వాధ్యయ తిరిగి అందిస్తున్నది. ఈ నాటకం మొత్తం ఆరు గంటల నాటకం. మొత్తం నాలుగుభాగాలుగా ఈ నాటకం స్వాధ్యాయ మీకు అందిస్తున్నది. ఇదిగో ఇది తొలి భాగం. తప్పక చూడండి.

7, మార్చి 2020, శనివారం

keshavareddy

ప్రముఖ రచయిత కేశవరెడ్డి తో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మూడుగంటలకు పైగా ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూను డాక్టర్ పతంజలి నిర్వహించారు. తన యావత్ సాహిత్యం గురించి వివరించిన ఈ ఆరుభాగాల ఇంటర్వ్యూ వర్ధమాన రచయితలకు ఎంతగానో దోహదపడుతుందని స్వాధ్యాయ అభిప్రాయం. తప్పక వినండి.

writer keshavareddy interview part-6

ప్రముఖ రచయిత కేశవరెడ్డితో డాక్టర్ పతంజలి చేసిన ఇంటర్వ్యూ ఆరోభాగం.. వర్ధమానరచయితలు తప్పకుండా అనుసరించాల్సిన వీడియో , ఆడియో ఇది.

writer keshavareddy interview part5

writer keshavareddy interview part 4

ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత కేశవరెడ్డి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మూడు గంటలకు పైగా చేసిన ఇంటర్వ్యూ.  తన సాహిత్యంపై తానే పూర్తిగా చర్చించిన ఇంటర్వ్యూ లో నాలుగో భాగం ఇది. డా. పతంజలి ఈ ఇంటర్వ్యూనుచేశారు.

keshavareddy interview part-3

ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత కేశవరెడ్డి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మూడు గంటలకు పైగా చేసిన ఇంటర్వ్యూ.  తాను రాసిన అతడు అడవిని జయించాడు నవలపై అనేక అంశాలు చర్చించిన భాగం ఇది. సాహిత్యంపై తానే పూర్తిగా చర్చించిన ఇంటర్వ్యూ లో మూడో భాగం ఇది. డా. పతంజలి ఈ ఇంటర్వ్యూనుచేశారు.

4, మార్చి 2020, బుధవారం

3, మార్చి 2020, మంగళవారం

interview with dr. keshavareddy part1

ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత కేశవరెడ్డి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మూడు గంటలకు పైగా చేసిన ఇంటర్వ్యూ.  తన సాహిత్యంపై తానే పూర్తిగా చర్చించిన ఇంటర్వ్యూ లో తొలి భాగం ఇది. డా. పతంజలి ఈ ఇంటర్వ్యూనుచేశారు.  

2, మార్చి 2020, సోమవారం

voice of cuttamanchi ramalingareddy

ప్రముఖ రచయిత, విద్వాంసుడు కట్టమంచి రామలింగారెడ్డి స్వరాన్ని వినండి

raktakanneeru by nagabhushanam

మహానటుడు నాగభూషణం సమర్పించిన రక్తకన్నీరు నాటకం ఒక అద్భుతం. తెలుగునాట రెండున్నరవేలకు పైగా ప్రదర్శనలు జరిగిన నాటకం ఇదొక్కటే అనడం అతిశయోక్తి కాదు. ఈ నాటకాన్ని మరొక్కసారి వినండి.  

shadow astrology

నీడ జ్యోతిషం గురించి విన్నారా? మహారాష్ట్రలో ఏడు తరాలుగా ఛాయా జ్యోతిషం చెప్తున్న వారు దాని గురించి ఏం చేప్తున్నారో చూడండి.


26, ఫిబ్రవరి 2020, బుధవారం

abinava potana vanamamalai varadacharyulu voice on potana

అభినవ పోతన.. మహాకవి డాక్టర్ వానమామలై వరదాచార్యులు సహజకవి పోతనామాత్యుడి వైశిష్ట్యంపై చేసిన ప్రసంగం వినండి. తెలుగు సాహిత్యంలో మకుటాయమానమైన మహాకవి అరుదైన స్వరమిది. తప్పక వినండి. స్వాధ్యాయను పది మందికి చేర్చండి. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి

20, ఫిబ్రవరి 2020, గురువారం

international mother language day (అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం)

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనమిది. తెలుగుభాషలో మన కవులు రచించిన పద్యాల తోరణాన్ని (గతంలో ఏఐఆర్ చేసిన మాలిక) మీకు స్వాధ్యాయ సమర్పిస్తున్నది.

తెలుగువారి పద్యాలతోపాటు.. వివిధ రంగాల్లో తెలుగు వెలుగుమూర్తుల చిత్రాలను కూడా ఈ సందర్భంగా ఈ కథనంతో అందిస్తున్నాం. మన తెలుగు కీర్తి వెలుగులను మననం చేసుకొనే మహత్తర సందర్భమిది. మన ప్రముఖులను చూస్తూ.. మన కవుల పద్యాలను వింటూ.. తెలుగు భాషలోని తీయందనాన్ని ఆస్వాదించండి. స్వాధ్యాయను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి

19, ఫిబ్రవరి 2020, బుధవారం

secret of the great destroyer


మహాశివరాత్రి ప్రత్యేక కథనాలు.. స్వాధ్యాయ చానల్లో .. మీకోసం ప్రత్యేకంగా.. ’ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్ డిస్ట్రాయర్‘.. తప్పక చూడండి.. స్వాధ్యాయను సబ్స్క్రైబ్ చేయండి.

https://www.youtube.com/playlist?list=PLtX2AmnMnIzJWuQLaVgSnnRTGfyrnRnNJ 


18, ఫిబ్రవరి 2020, మంగళవారం

varavikrayam radio play

గురజాడవారి కన్యాశుల్కం తర్వాత అంతగా ప్రసిద్ధి చెందిన నాటకం కాళ్లకూరి నారాయణరావు గారి వరవిక్రయం. వరకట్న దురాచారంపై హాస్య వ్యంగ్యోక్తులతో ఎక్కుపెట్టిన బాణమిది. గతంలో ఆకాశవాణి ప్రసారం చేసిన వర విక్రయం రేడియో నాటకం మీకోసం తప్పకుండా వినండి. ఈ తరం వారికి వినిపించండి. ఇందులో బందా కనకలింగేశ్వరరావు, నండూరి సుబ్బారావు గారి లాంటి ఉద్ధండులు గళాభినయంచేశారు. తప్పకుండా వినాల్సిన నాటకమిది. బందా కనకలింగేశ్వర్రావు గారు రేడియో శ్రోతలకు చిరపరిచితులు . పెళ్లిళ్ల పేరయ్య గా గళాభినయం చేసిన రామన్న పంతులుగారు కన్యాశుల్కం సినిమా లో అగ్నిహోత్రావధాన్లుగా నటించారు . నండూరి వారి గూర్చి వేరే చెప్పనక్కరలేదు. ఈ ఆడియో పండితవరేణ్యులు.. సాహిత్యవేత్త శ్రీ ఏల్చూరి మురళీధర్ రావుగారు స్వాధ్యాయకు అందించారు. వారికి ధన్యవాదాలు. pl. subscribe our youtube channel, share it, like it.

speeches on mahabharata adiparv-part3

సహృదయ సాహిత్య సంస్థ గతంలో నిర్వహించిన మహాభారత ప్రసంగాల్లో ఇది రెండవది. ఆదిపర్వం మూడోభాగం. మైలవరపు శ్రీనివాసరావుగారిచే. వినండి. చానల్ ను సబ్స్క్రైబ్  చేయండి

16, ఫిబ్రవరి 2020, ఆదివారం

speeches of mahabharata adiparva-2

సహృదయ సాహిత్య సంస్థ గతంలో నిర్వహించిన మహాభారత ప్రసంగాల్లో ఇది రెండవది. ఆదిపర్వం రెండోభాగం. మైలవరపు శ్రీనివాసరావుగారిచే. వినండి.

15, ఫిబ్రవరి 2020, శనివారం

mahabharat series ADIPARVA-1

ప్రముఖ సాహిత్య సంస్థ సహృదయ భారతీయ ఉత్కృష్ట సాహిత్య ఇతిహాసం మహాభారతంపై గతంలో పదిరోజుల పాటు ’మహాభారత ప్రసంగాలు‘ పేరిట సదస్సు నిర్వహించింది. ప్రఖ్యాత సాహిత్యవేత్తలు మహాభారతాన్ని విశ్లేషించారు. ఈ ప్రసంగాల పరంపరను వరుసగా స్వాధ్యాయ మీకు అందిస్తున్నది. మీరూ వినండి. తొలి ప్రసంగం శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు. ఆదిపర్వంపై చేసినది. వారి ప్రసంగంలో తొలిభాగం ఇది. SUBSCRIBE SWADHYAYA. SHARE IT.. LIKE IT.

12, ఫిబ్రవరి 2020, బుధవారం

ghantasala interview in air hyderabad

ఘంటసాల వారి వర్ధంతిని పురస్కరించుకొని వారు గతంలో ఆకాశవాణి కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు స్వాధ్యాయ చానల్ అందిస్తున్నది. ఈ అపూర్వ మాటలనూ మీరూ వినండి.

10, ఫిబ్రవరి 2020, సోమవారం

తెలుగునాట శిష్ట వ్యావహారిక భాషోద్యమసారథి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారి వారసత్వాన్ని కొనసాగించిన వారు గిడుగు సీతాపతిగారు. తమ తండ్రిగారి బాషోద్యమం గురించి సీతాపతిగారు స్వయంగా తెలిపిన విషయాలు వారి అపురూప స్వరంలో మీ కోసం... తప్పనిసరిగా వినండి.. పదిమందికి వినిపించండి. మరికొందరు మహానుభావుల స్వరాలను వినడానికి స్వాధ్యాయ చానల్ను సబ్ప్క్రైబ్ చేయండి. పదిమందిచేత సబ్స్క్రైబ్ చేయించండి. లైక్ చేయండి. షేర్ చేయండి. తెలుగువారందరూ తప్పక విని భద్రపరచుకోదగ్గ స్వరభాండాగారం స్వాధ్యాయ చానల్.

8, ఫిబ్రవరి 2020, శనివారం

ప్రముఖ కవి, సౌందర నంద ప్రబంధ కర్త.. పింగళి కాటూరి జంటకవులలో ఒకరుగా ప్రసిద్ధి చెందిన కాటూరి వెంకటేశ్వర్రావు గారు తెలుగు సాహిత్యపు వెలుగు దివిటీ.. వారి గురువుగారు శతావధాన చక్రవర్తి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు. ఒకానొక సందర్భంలో కాటూరి వారు వారి గురువుగారి గురించి ఆకాశవాణిలో చేసిన ప్రసంగ భాగమిది. తప్పక వినాల్సిన అపూర్వ స్వరమిది. మరిన్ని అరుదైన స్వరాల గురించి వినడానికి.. ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి స్వాధ్యాయ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి పది మందికి అందించండి. లైక్ చేయండి

1, ఫిబ్రవరి 2020, శనివారం

prof.suprasanna speach on satankura kavya

తెలుగు సాహిత్యంలో మహాకావ్యమనదగ్గ వాటిలో శతాంకుర ఒకటని నా గట్టి అభిప్రాయం. ఈ కావ్యం పై కావ్యకర్త సుప్రసన్నాచార్య అనుశీలనం వినండి. అన్ని వర్గాల వారు.. సంప్రదాయాలకు చెందిన వారు.. కవులు అందరూ తప్పకుండా వినాల్సిన ప్రసంగం ఇది. స్వాధ్యాయను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి. మీ అభిప్రాయాలు స్వతంత్రంగా తెలియజేయండి.

31, జనవరి 2020, శుక్రవారం

interview of pb srinivas

ఓహో గులాబి బాల.. అన్న స్వరం వినగానే పీబీ శ్రీనివాస్ గుర్తుకు రానివారుంటారా? సినీ చరిత్రలో అన్నిభాషల్లో పాటలు పాడిన పీబీ శ్రీనివాస్ ను సురభి హిందీ చానల్ వారు చేసిన అరుదైన ఇంటర్వ్యూ ఇది. మద్రాసులోని వారి ఇల్లు.. వారి కారు.. వారి కుటుంబ సభ్యులు.. అవార్డులు.. ఆయన కారు డ్రైవ్ చేసుకుంటూ షాపింగ్ చేయడం.. ఐస్ క్రీం పార్లర్ కు వెళ్లడం.. ఇవన్నీ అరుదైన సన్నివేశాలు. వీటితో కూడిన ఇంటర్వ్యూ ఇది. హిందీలో చేసిన ఇంటర్వ్యూ ఇది. మన మరుపురాని మహానుభావులకు సంబంధించిన స్మృతి ఇది. తప్పకుండా భద్రపరచుకోవలసినదని నా అభిప్రాయం. తప్పక చూడండి. హడావుడి అక్కరలేదు. ప్రశాంతంగా చూడండి. ఆహ్లాదంగా రిలాక్స్ కండి. స్వాధ్యాయను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయండి.
వేంకట పార్వతీశ కవుల్లో ఒకరు.. రవీంద్రుని గీతాంజలిని ‘ఏకాంతసేవ’ గా మనకు అందించిన వారు.. తెలుగువారికి అనేక బెంగాలీ నవలలను తొలిసారి అందించిన కవి, రచయిత, బాలాంత్రపు వెంకట్రావు గారు. వారి సాహిత్య వ్యాసంగం గురించి వారి స్వరంలోనే విందాం. స్వాధ్యాయ చానల్ ను షేర్ చేయండి. లైక్ చేయండి .. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వెలుగులను తరువాతి తరాలకు పంచండి.

25, జనవరి 2020, శనివారం

prof. suprasanna speach on literary history

తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణ పరిణామ క్రమంలో వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసుకోవాలంటే.. ప్రఖ్యాత విమర్శకుడు కవి, ఆచార్య సుప్రసన్న చేసిన ప్రసంగం ఇది. గత శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఎన్నిరకాల సంస్కరణోద్యమాలు పుట్టాయి. వాటి ప్రభావం తెలుగు సాహిత్యంపైన.. రచయితలపైన ఎలా పడ్డాయో సమగ్రంగా వివరించారు. ఈ తరం రచయితలంతా.. తప్పకుండా పూర్తిగా విని తీరాల్సిన ప్రసంగం ఇది. చాలామంది ఆదునిక కవులకు, రచయితలకు తెలియని సాహిత్య చరిత్ర ఈ ప్రసంగం. తప్పకుండా వినండి. సాహిత్య సేవ చేస్తున్న స్వాధ్యాయను ఆదరించండి. పదిమందికి ఈ సేవను పంచండి. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి.




21, జనవరి 2020, మంగళవారం

bilingual genius kasi krishnacharyulu voice on sanscrit lanuage


కాశీ కృష్ణాచార్యులు తెలుగువారంతా గర్వించదగ్గ మహా పండితులు. తిరుపతి వెంకటకవుల చేత అవధాన శిరోమణి బిరుదును పొందిన వారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి తరువాత ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవిని అలంకరించినవారు. సంస్కృత భాష ఎంత తేలికగా నేర్చుకోవచ్చో.. దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్తున్నారు. ఆయన ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు జాగ్రఫీ అర్థం కాకపోతే.. సంస్కృతంలో రాసుకొని గుర్తు పెట్టుకొని చదువుకున్నారట.. సంస్కృత అక్షరాలు పలికితే.. శరీరంలోని సంపూర్ణమైన నాడులు కదిలి ఏ రోగమూ రాదట. ఆ మహానుభావుడి అపూర్వ గళం మీరూ వినండి. స్వాధ్యాయ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి. తెలుగువారి అపూర్వ సారస్వత సంపదను పదిమందికి అందించడంలో మీవంతు చేయూతనివ్వండి.


14, జనవరి 2020, మంగళవారం

sripada krishnamurty sastry voice

రామాయణ, భారత, భాగవతాలను  ఒంటిచేత్తో రాసి.. అనేక కావ్యనాటక ప్రబంధాలను రచించిన కవిసార్వభౌముడు, మహామహోపాధ్యాయ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారు 95 వ ఏట తన సాహిత్య వ్యాసంగం.. రచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. వారి అపూర్వ గళాన్ని వినండి.  స్వాధ్యాయ తెలుగు సాహిత్య సరస్వతికి అందిస్తున్న మహానుభావుల అపూర్వ స్వరమాధురిలో ఇది కచ్చితంగా ఆణిముత్యం. తప్పకుండా వినండి.. చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి.

12, జనవరి 2020, ఆదివారం

jayanti ramayya pantulu voice

మీలో ఎవరైనా గుండెమీద చెయ్యి వేసుకొని ‘నాకు తెలుగులోని తెలియని పదం లేదు’ అని ధైర్యంగా చెప్పగలరా? ఇదిగో ఈయన చెప్తున్నాడు. తెలుగు భాషా సరస్వతికి అపూర్వమైన సేవచేసినవాడు. సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాత.. ఆంధ్ర సాహిత్య పరిషత్ వ్యవస్థాపకుడు.. 250 గ్రంథాలు రచించినవాడు.. జయంతి రామయ్య పంతులు.. ఈ పేరు ఈ తరం వారు విని ఉండరు. కానీ.. తెలుగు భాష ఇప్పటివరకు సుసంపన్నంగా ఉన్నదంటే.. ఈయనలాంటివారు పెట్టిన భిక్షే. వీరిని మనం మరువద్దు. మరుపురాని మహాత్ములు వీరు. వీరి అపూర్వ స్వరాన్ని ఒక్కసారి వింటేనే జన్మ ధన్యమవుతుంది. వినండి.
ఈ చానల్ ను సబ్స్క్రైబ్ చేయడం అంటే ... ఈ చానల్ ను పదిమందికి చేరవేయడం ద్వారా తెలుగు సరస్వతిని మనం మన తరంలోనూ.. మన తరువాతి తరంలోనూ కాపాడుకొనే చిన్న ప్రయత్నమిది. నేను దీపం వెలిగించాను. దీన్ని జాజ్వల్యమానం చేయాల్సిన బాధ్యత అందరిదీ. 

11, జనవరి 2020, శనివారం

poranki dakshinamurti interview by gollapudi marutirao

పోరంకి దక్షిణామూర్తి.. తెలుగు కథా సాహిత్యానికి ఎంతో సేవ చేసిన వారు. తెలుగు కథాసాహిత్యంపైన సాధికారికంగా వచ్చిన తొలి పరిశోధనా గ్రంథం వారిదే. తెలుగునాట మూడు మాండలికాల్లోనూ నవలలు రాసిన మహానుభావుడు. అంతేకాదు. ఈనాడు జర్నలిజం ద్వారా ఎంతో మంది పాత్రికేయులకు భాషా మెళుకువలను, పట్టును, పదజాలాన్ని అందించి గొప్ప పాత్రికేయులుగా తీర్చిదిద్దనవారు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. సరిగా గుర్తు పట్టడంలేదు. మాట కూడా స్పష్టంగా రావడంలేదు. ఆయన ఆరోగ్యం త్వరగా బాగుపడి కోలుకోవాలని మనస్పూర్తిగా స్వాధ్యాయ కోరుకుంటున్నది. హెచ్ ఎం టీవీ వారు చేసిన వందేళ్ల కథకు వందనాలు కార్యక్రమంలో భాగంగా పోరంకివారితో గొల్లపూడివారు చేసిన ఇంటర్వ్యూలోని కొంతభాగమిది. తప్పక చూడండి. ఈ చానల్ మనందరిది. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి.

kaloji narayanarao voice

అందరి బతుకు.. సందడి బతుకు.. అన్న్ ప్రజాకవి, పద్మవిభూషణ్  కాళోజీ నారాయణరావు అపూర్వ గళం. వీడియోతో సహా చూడండి. వీడియో రికార్డింగ్ సాధారణ టూల్స్ ద్వారా చేయడం వల్ల ఆడియో కొంత విండ్ డిస్ట్రబెన్స్ తో ఉన్నది. అయినప్పటికీ కాళోజీ స్వరం స్పష్టంగానే ఉన్నది. అనేక అంశాలను చర్చించారు. తప్పక చూడండి. ఈ చానల్ మనది. షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. 

10, జనవరి 2020, శుక్రవారం

arudra interview by prof gv subrahmanyam

ఆధునిక ఆంధ్ర సాహిత్య చైతన్యానికి ప్రతీకగా నిలిచిన అక్షరమాల. అభ్యుదయ కవిత్వ చైతన్యానికి సారథి, అపూర్వ ప్రయోగాలు నిర్మించిన కవి. పరిశోధకుడు, గేయకర్త,, వ్యాసకర్త,, మానవుడు.. సామాన్య ప్రజల ఉద్యమాలకు స్పందించిన సహృదయుడు.. తెలుగు సాహిత్యలోకంలో చిరంజీవి.. మహాకవి ఆరుద్రతో.. ప్రఖ్యాత విమర్శకుడు, కవి, ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం గారు చేసిన ఇంటర్వ్యూ ఇది. ఎప్పుడో దూరదర్శన్ వారు చేయించినది. అభ్యుదయ సాహిత్యం.. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రచించిన త్వమేవాహం, సినీవాలీ రచనలు.. వీటన్నింటి గురించి చర్చించిన అపూర్వ ఇంటర్వ్యూ ఇది. తప్పక చూడండి.. స్వాధ్యాయ తెలుగు సాహిత్యానికి, చరిత్రకు, భారతీయ చరిత్రకు, తాత్వికతకు, ఆధ్యాత్మికతకు, ఉద్యమ స్ఫూర్తికి.. సంస్కృతికి తనదైన భాగస్వామ్యం కోసం తపిస్తున్నది. ఈ చానల్ మీది. మనందరిది. దీని ద్వారా పదిమందికి మన సారస్వతాన్ని పంచాలనే తపన. మరింత సేవచేసేందుకు ప్రోత్సహించండి. చానల్ను సబ్స్క్రైబ్ చేయండి.. చేయించండి.. షేర్ చేయండి.. లైక్ చేయండి. ఇది ఎంతమందికి చేరితే అంత మందికి ఉపయోగపడాలనే సత్సంకల్పానికి మీరూ చేయూతనివ్వండి.

9, జనవరి 2020, గురువారం

nehru speech on kashmir and caa

Jawaharlal Nehru Speech on Ram Leela Ground, New Delhi 16 June 1948.. that is the time that indo pak war going on. he mentioned about war, and how much time to take to solve the kashmir issue. he mentioned about immegrants from pakistan. he mentioned hyderabad state independence.
Source: Nehru Memorial Museum
మన మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 16 జూన్ 1948న ఢిల్లీలోని రాంలీల మైదానంలో చేసిన ప్రసంగం ఇది. కశ్మీర్ లో భారత్ పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్న సమయమది. ఇందులో కాశ్మీర్ యుద్ధం గురించి.. కాశ్మీర్ సమస్య ఎంతకాలంలో పరిష్కారం అవుతుందనే అంశంపైనా.. హైదరాబాద్ రాష్ట్రం గురించి,..మాట్లాడారు. ప్రస్తుతం మనం ఇటీవల కాలంలో చర్చించుకొంటున్న శరణార్థుల సమస్యపైనా నెహ్రూ తన అభిప్రాయం చెప్పారు. వార్తా పత్రికల గురించీ వ్యాఖ్యానించారు. pl. share the video. subscribe the channel. like it.


7, జనవరి 2020, మంగళవారం

communist legend ravi narayana reddy voice

రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 - సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యుడు. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. అంతటి మహానుభావుడు తెలంగాణ వైతాళికుడు, గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డిపై వ్యక్తంచేసిన అభిప్రాయం వినండి. ఇది అత్యద్భుతమైనది. ఆనాటి చారిత్రకాంశాలను ప్రత్యేకంగా రావినారాయణ రెడ్డి ఈ ప్రసంగంలో చర్చించారు. తప్పక వినాల్సిన అపూర్వ గళమిది. మరికొందరు ప్రముఖుల స్వరమాధురిలో ఓలలాడేందుకు ఈ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి.

5, జనవరి 2020, ఆదివారం

TAJMAHAL (the hidden truth)



తాజ్ మహల్ యూనివర్సల్ లవ్ కు ప్రతీక. ఇప్పుడు ఎవరు కాదన్నా ఇది ప్రేమ మందిరమే. కానీ.. దీని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ఇందులోని జంట సమాధుల కింద సమాధి అయిపోయిన మొగలాయీల అరాచకమైన రహస్యాలేమిటి? సాధికారికంగా.. సాక్ష్యాధారాలతో సహా సహేతుకంగా నిరూపించిన లఘుచిత్రమిది. తప్పక చూడండి.. షేర్ చేయండి.. లైక్ చేయండి. చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.