19, జూన్ 2010, శనివారం

డెత్‌ డేట్‌

మరణం ఓ కామా అన్నాడు ఓ తెలుగు కవి.. మరణానికి కొద్దిసేపటికి ముందు.. మరణానికి తరువాత ఏం జరుగుతుంది? చనిపోయిన వాడు ఆత్మ అవుతాడా? స్వర్గానికి పోతాడా? నరకానికి పోతాడా? ఆత్మ అనేది ఉన్నదా? లేదా అన్న దానిపై అబ్బో బోలెడు డిస్కషన్సే జరిగాయి. చావు ఎలా వస్తుందన్న దానిపైనా ఎక్స్పరిమెంట్లు చేయని వాడు ప్రపంచంలో లేడు.. ఇక జ్యోతిష్యులు, కాలజ్ఞాన కర్తల గురించి చెప్పనే అక్కర్లేదు.. చావు గురించి కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడే వారు ఒకరైతే.. శాస్త్ర వాదాన్ని వినిపించేవారు మరొకరు.. వీళ్లలో చాలా మంది చనిపోయారు.. కానీ వీళ్లలో ఎంతమంది తాము ఏరోజు, ఏ క్షణానికి చచ్చిపోతామో ఆక్యురేట్‌గా కనుక్కోగలిగారా?
వాళ్లకా అవకాశం ఉందో లేదో కానీ, ఇప్పుడా అవకాశం అందరికీ లభించింది.. మీరెప్పుడు చచ్చిపోతారు? తెలుసుకోవాలని ఉందా.. అదెలా సాధ్యం? డేట్‌తో సహా ఎలా చెప్పగలరు?

మనిషిగానో, జంతువుగానో పుట్టిన తరువాత చావు రాకుండా పోదు.. ఒకరు ముందు.. మరొకరు వెనుక.. కానీ, సరిగ్గా ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎలా తెలుస్తుంది? కంగారేమీ వద్దు.. సెకన్లతో సహా డెత్‌ డేట్‌లను ప్రొవైడ్‌ చేసే వాళ్లున్నారు.. పైసా ఖర్చు లేకుండా మీరెప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు.. జ్యోతిష్యులకు కొన్ని వివరాలు అందించినట్లే... వీళ్లకూ మీ పర్సనల్‌ వివరాలు కొన్ని మాత్రం చెప్తే చాలు.. డెత్‌ డేట్‌ క్షణాల్లో మీ కళ్ల ముందు ప్రత్యక్ష మవుతుంది. ఎలాగంటారా? ఈ వెబ్‌సైట్‌ మీరే చూడండి..
ఇంటర్నెట్‌ ప్రపంచంలో చెప్పలేనన్ని హిట్లను అందుకుంటున్న ఒకానొక వెబ్‌సైట్‌ అందిస్తున్న ఫ్రీ సర్వీస్‌ ఇది... మతం, జ్యోతిష్యం పరంగానే కాక, అత్యంత శాస్త్రీయంగా కాలిక్యులేట్‌ చేసి మరీ డెత్‌ డేట్‌లను చెప్పేస్తున్నామంటోందీ వెబ్‌సైట్‌....
ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌...

మనుషుల భవిష్యత్తుకు లెక్కలు కడుతున్న వెబ్‌సైట్‌... మీరెన్నాళ్లు జీవిస్తారో ఇట్టే చెప్పేస్తుంది.. కాకపోతే అంతకు ముందు మిమ్మల్ని చక్కగా ఇంటర్వ్యూ చేస్తుంది.. మీ వ్యక్తిగత విషయాలు, అలవాట్లు అందులో మంచివీ, చెడ్డవీ, ఆరోగ్యాన్ని చెడగొట్టేవీ అన్నింటి గురించీ సవివరంగా కనుక్కుంటుంది.. చివరకు మీ వ్యక్తిత్వాన్నీ ప్రశ్నిస్తుంది..
ఓ ఉద్యోగానికి వెళ్తే అప్లికేషన్‌ ఫాం నింపినట్లే మీ డెత్‌ డేట్‌ తెలుసుకోవటానికీ అప్లికేషన్‌ ఫాం నింపాల్సిందే... అప్పుడే అది చెకచెకా లెక్కలు కట్టేసి.. బాల్చీ ఎప్పుడు తన్నేస్తారో చెప్పేస్తుంది....
జీవిత కాలానికి కొలమానం అంటూ ఏదీ లేదన్నది ఇంతవరకూ మనకు తెలిసిన నిజం.. కానీ, ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌ మాత్రం మనిషి ఆయుష్షును నిర్ణయించేస్తోంది. పోయేకాలం దగ్గర పడుతోందంటూ సెకన్లతో సహా డెత్‌క్లాక్‌ను కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూపిస్తోంది..
మనిషికి తన జీవితంలో ఏం కానుంది.. అని తెలుసుకోవటంపై ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. దాన్ని విశ్వసించటం విశ్వసించకపోవటం వేరే విషయం.. విశ్వసించకపోయినా.. తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం ఉంటుంది. అదిగో అలాంటి వారికోసమే ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌ లాంటి సైట్లు వచ్చాయి...
చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.. చూస్తారు.. సరదాగా నవ్వుకుంటారు.. రెండు రోజుల తరువాత మరిచే పోతారు.. కొందరికి మాత్రం మనసులో ఎక్కడో గుబులు పుడుతుంది. అది ఆందోళనగా మారితే.. అది స్లోపాయిజన్‌గా మారుతుంది.. ఈ రకమైన ట్రెండ్‌ భవిష్యత్తులో ఆ వ్యక్తి జీవితంపైనే ప్రభావం చూపుతుంది..
మానసికంగా ఆందోళన చెందేవారి పరిస్థితి ఏమిటి? వీళ్లు చెప్తున్న లెక్కలు ఏ ప్రాతిపదికన చేశారన్నది వెబ్‌ నిర్వాహకులు ఎక్కడా వివరించటం లేదు.. ఏవేవో లెక్కల ప్రకారం డెత్‌డేట్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారా? లేక నిజంగా శాస్త్రీయత అన్నది ఏమైనా ఉన్నదా?

ఇన్ని రకాల వివరాలను తెలుసుకుని ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ వెబ్‌సైట్‌ చేసిన లెక్కలన్నీ తప్పులయ్యాయి... వీళ్లు చెప్తున్న డెత్‌ డేట్‌ అంతా ఒఠ్ఠిదేనని తేలిపోయింది.. ఎందుకంటే మనకందరికీ మనందరికీ బాగా, బహుబాగా తెలిసిన వాళ్ల వివరాలు ఇస్తే వారు చనిపోయిన తరువాత కూడా ఇంకా ఆయుష్షు ఉందని చూపిసున్నది. మైకెల్‌ జాక్సన్‌ ఇంకా ఇరవై ఏళ్లకు పైగా బతుకుతాడంది.. వైఎస్‌ఆర్‌ మరో పాతికేళ్లు ఉంటారని చెప్పింది.. రాజీవ్‌ గాంధీ ఇంకో పదహారేళ్లు జీవిస్తారని చెప్పింది... ఈ అంచనాలు.. గణాంకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు..
భవిష్యత్తు గురించి, అదృష్టం గురించి, జాతకాల గురించి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ప్రపంచంలో జాతకాల పిచ్చి కాస్త ఎక్కువే.. జ్యోతిష్యాన్ని శాస్త్రమనే వాళ్లు కొందరు.. కాదనే వారు కొందరు.. జ్యోతిష్యం చెప్పేవాళ్లు ఇన్నేళ్లు బతుకుతారంటూ లెక్కలు చెప్పేవారు కొల్లలు.. కానీ, ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ మాదిరిగా క్షణాలతో సహా లెక్కలు కట్టి చెప్పిన వారు మాత్రం అరుదు.. లేరు..
మానసికంగా బలహీనుడికి నువ్వు ఫలానా అప్పుడు చనిపోతావని చెప్తే.. ఆ బాధతో అతను ఆ చెప్పిన రోజు దాకా కూడా బతకడు.. అదే ఆలోచనతో కుంగి కృశించిపోతాడు.. ఇలాంటి వెబ్‌సైట్లు ఇలాంటి అనర్థాలకే దారి తీస్తాయి.
సిగరెట్లు తాగితే ఇన్ని రోజులు ఆయుష్షు తగ్గిపోతుందనీ, మద్యం సేవిస్తే మరి కొన్ని రోజులు వయసు తగ్గుతుందని లెక్కలు కట్టిన వాళ్లూ ఉన్నారు.. వాటికీ మంచి ప్రచారమే వచ్చింది. కానీ, తక్కువ సిగరెట్లు, మద్యం తాగిన వాళ్లు చిన్నవయసులో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.. డబ్బాలకు డబ్బాలు చైన్‌ స్మోకింగ్‌ చేసిన వాళ్లు..ఎనభై ఏళ్లూ బతికిన సందర్భాలూ చూశాం.. అసలు ఎలాంటి అలవాట్లు లేని వాళ్లు సైతం చిన్నవయసులో హఠాత్తుగా కన్నుమూసిన సన్నివేశాలూ ఉన్నాయి.. అలాంటప్పుడు ఈ వెబ్‌సైట్లు, జ్యోతిష శాస్త్రాలు కట్టే లెక్కలకు హేతుబద్ధత ఎలా కట్టబెట్టగలం..
మనిషి శరీర తత్త్వాన్ని బట్టి.. అతని ఆరోగ్య స్థితిని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి అతడి జీవిత కాలం ఆధారపడి ఉంటుంది.. అంతే కానీ, ఏవేవే లెక్కలు గట్టి.. పిచ్చి పిచ్చి సూత్రాలను చూపించి దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చచ్చిపోతావంటే అంతకంటే పెద్ద జోక్‌ ఇంకోటి ఉండదు.. ఇలాంటి వెబ్‌సైట్‌లను చూస్తే సరదాగా చూసి నవ్వుకోవాలి.. అంతే కానీ, సీరియస్‌గా తీసుకుంటే దాని వల్ల మానసిక ఆందోళన తప్ప ఒరిగేదేమీ ఉండదు... సో.. బీ హ్యాపీ.. అండ్‌ ఎంజాయ్‌ యువర్‌ లైఫ్‌... బి కాజ్‌ వుయ్‌ హావ్‌ ఓన్లీ వన్‌ లైఫ్‌... జస్ట్‌ ఎంజాయ్‌.. నథింగ్‌ ఎల్స్‌..

పర్సులో ప్లాస్టిక్‌ బాంబ్‌

ప్లాస్టిక్‌ బాంబ్‌.. మీ పర్సులోనే ఉంది.. మీతో పాటు.. మీ వెంటనే నీడలా వస్తోంది.. తేనె పూసిన కత్తి లాంటిది.. మీకు తెలియకుండానే మీ గొంతు కోసేందుకు సిద్ధంగా ఉంది. మీకది ఓ సౌకర్యంగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ఉపకరణంగా అగుపిస్తోంది.. మీ పాలిట అది ప్లాస్టిక్‌ మనీ.. కానీ, మీకే తెలియని ప్లాస్టిక్‌ బాంబ్‌....
ఏమిటీ గోల..? ఎందుకింత భయపడాలి..? ప్లాస్టిక్‌ బాంబ్‌ అంటే ఏమిటి? అది జేబులో ఉండటం ఏమిటి? ఆశ్చర్యం వద్దు.. విస్మయం అంతకంటే వద్దు.. మీ పర్సులో ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డులే బాంబు ఘంటికలు మోగిస్తున్నాయి.. మీకే తెలియని కాస్తంత నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారి తీస్తోంది..
క్రెడిట్‌ కార్డు.. ఇవాళ ఓ ఫ్యాషన్‌... ఓ స్టేటస్‌ సింబల్‌.. ఓ సరదా.. పర్సులో డబ్బులు పెట్టుకుని వెళ్లటం నామోషీ.. హోటల్లోనో, పబ్బుల్లోనో, షాపింగ్‌లోనో సెユ్టల్‌గా పర్స్‌ నుంచి కార్డు ఇచ్చి బిల్లు పే చేయటం స్టేటస్‌.. ఇవాళ్టి కల్చరే అది.. నోట్ల కట్టలు జేబులో పెట్టుకుని తిరగటం కంటే సింపుల్‌గా ఓ కార్డు పట్టుకుని వెళ్లటం సుఖం...
కార్డు ఉండటం అవసరమే కావచ్చు. ఇవాళ అది సహజమై ఉండవచ్చు. కానీ, కార్డు ఉంటే మీ డబ్బు సేఫ్‌గా ఉన్నట్లేనా? జస్ట్‌ థింక్‌ ఎబౌట్‌ ఇట్‌.. ఇంట్లో కంటే బ్యాంకులో డబ్బులు దాచుకోవటం ఒకప్పుడు చాలా సురక్షితం.. ఇప్పుడు కూడా అంతేనా? బ్యాంకులో సొమ్ములు ఎంత భద్రంగా ఉంటున్నాయి..?
లేదు.. మీ సొమ్ముల కోసం ఎవరో కాచుకుని ఉన్నారు.. ఎల్లవేళలా డబ్బులు అందుబాటులో ఉంచే సౌకర్యం కల్పించటం కోసం మీ సొమ్ముల్ని తమ దగ్గరుంచుకుని, వాటికి బదులుగా మీ జేబులోకి బదిలీ చేసిన ప్లాస్టిక్‌ మనీ.. అదే. బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు ఇప్పుడు మీ ఆర్థిక నిర్వహణతో చెలగాటమాడుతున్నాయి..మీకు తెలియకుండానే మీ కార్డు మీ చెంతనే ఉంటుంది.. మీకు తెలియకుండా దాని డేటా మరొకరి చేతిలోకీ వెళ్తుంది..
అదెలా సాధ్యం? కార్డు జేబులోనే ఉంది.. సీక్రెట్‌ పిన్‌ నెంబర్‌ ఉంది.. వెనుక మూడు నెంబర్ల సీక్రెట్‌ కోడ్‌ కూడా ఉంది.. గ్రిడ్‌ ఉంది.. ఇన్ని రకాల చెక్‌ అవుట్‌ ఉండి కూడా కార్డును చోరీ అదే డేటాను చోరీ చేయటం ఎలా వీలవుతుంది? ఈజిట్‌ పాజిబుల్‌.. ఎస్‌..ఇటీజ్‌ పాజిబుల్‌..
కార్డులోని డేటాను చోరీ చేయటం ఏ విధంగా కుదురుతుంది.. ఒకవేళ నెంబర్‌ చోరీ అయినా, పిన్‌ నెంబర్‌ ఉంటుంది కదా.. కానీ, అదే పొరపాటు.. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం డెవలప్‌ అయితే.. దొంగలకు దొంగతనాలు చేయటం అంత ఈజీ అవుతుంది.. టెక్నాలజీ అనేది వాళ్లు ఉపయోగించినంతగా ఎవరూ ఉపయోగించుకోలేరు..
మీ క్రెడిట్‌ కార్డులు క్లోనింగ్‌ అవుతున్నాయి. మీ చేతులతో మీరు స్వయంగా ఇచ్చిన కార్డులతోనే దర్జాగా క్లోనింగ్‌ ప్రక్రియ సాగిపోతోంది.. ఇప్పటిదాకా ఎక్కడో అమెరికాకే పరిమితమైన ఈ క్లోనింగ్‌ టెక్నాలజీ ఇప్పుడు మన దేశాన్ని కుదిపేస్తోంది...
పెద్ద ఫ్యాక్టరీ, భారీ యంత్రసామాగ్రి దగ్గరకు మన క్రెడిట్‌ కార్డు ఎలా వెళ్లింది.. ? అదే విచిత్రం.. మీ కార్డును అదే.... నమూనాను మీరే అందించారు.. ఎలాగంటారా? సింపుల్‌.. మీరు హోటల్‌కు వెళ్లినప్పుడు, పబ్‌కు వెళ్లినప్పుడు బిల్‌ పే చేసేందుకు బేరర్‌కు కార్డు ఇస్తారే.. అదిగో అక్కడే ట్విస్ట్‌ ఉంది.. మీ కార్డు బిల్లు కోసమే కాదు.. మరో దానికోసమూ స్వాప్‌ అయిపోతుంది.. స్కిమ్మర్‌ మీ కార్డులోని డేటాను ఒకే ఒక్క సెకన్‌లో కొట్టేస్తుంది.
చేతిలో పట్టే చిన్న మిషన్‌.. అరచేతిలో పట్టుకుంటే కనీసం కనిపించనైనా కనిపించని యంత్రం.. మోసం చేయాలనుకునే వారు ఎవరైనా సరే శరీరంలో ఎక్కడైనా దాచుకోవచ్చు. ఎదుటి వాళ్ల నుంచి ఒక్క క్షణం కార్డు చేతిలోకి వస్తే.. మరుక్షణంలో స్వాప్‌ చేసేయవచ్చు.. అంతే సంగతులు.. మీ కార్డు క్లోనింగ్‌ అయిపోయినట్లే..స్వాప్‌ చేసిన స్కిమ్మర్‌ నుంచి కార్డులోని డేటాను ఎంత సింపుల్‌గా క్లోన్‌ చేయవచ్చో చూడండి..

బయట షాపింగ్‌లోనో, హోటళ్లలోనో, ఇతర పబ్బుల్లోనో క్రెడిట్‌ కార్డులను స్వాప్‌ చేస్తే అవి క్లోనింగ్‌ అవుతాయి... ఇంతటితో అయిపోయిందా? లేదు... మీ కార్డు చోరీ కావటానికి సవాలక్ష అవకాశాలు పొంచి ఉన్నాయి..
అవసరానికి డబ్బులు డ్రా చేయటానికి ఇప్పుడు ఎటిఎం చాలా కీలకమైన సౌకర్యం... కానీ, ఇప్పుడు అదే ఏటిఎం మన కొంపలార్చటానికి సిద్ధంగా ఉంది.. డబ్బులు డ్రా చేసుకోవటానికి ఎటిఎం సెంటర్‌కు వెళ్లితే అక్కడా ప్రమాదం రెడీగా ఉంటుంది.. ఏటిఎంలో మీ కార్డు యాక్సెస్‌ చేసే ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా దొంగ చిన్ని బాక్స్‌ను ఫిక్స్‌ చేసేయవచ్చు. ఓ గంట తరువాత తీరిగ్గా వచ్చి దాన్ని తీసుకుని వెళ్లిపోవచ్చు. కార్డ్‌ యాక్సెస్‌ ప్రాంతంలో మరో బాక్స్‌ ఉన్న సంగతి కూడా గుర్తించటం వీలు కాదు..

అంతే కాదు.. బ్రోచర్స్‌ బాక్స్‌లో సీక్రెట్‌ కెమెరాను ఉంచి దాని ద్వారానూ డేటాను సంపాదించేయవచ్చు..

ఒకటా, రెండా.. మీ కార్డు మీదగ్గరే ఉంచి డేటా దొంగిలించటానికి ఎన్ని అవకాశాలో... ఈ టెక్నాలజీని నిర్వీర్యం చేయటం పోలీసులకు సవాలుగా మారింది.. వీటి నుంచి తప్పించుకోవాలంటే కార్డు విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం తప్ప ప్రత్యామ్నాయం లేదు..

టెక్నాలజీ అంటారు.. ప్రపంచం ఓ కుగ్రామం అంటారు.. క్షణాల్లో కమ్యునికేషన్‌ చేర్చవచ్చంటారు.. కానీ, దేనికీ భద్రత లేదు.. ఎక్కడా ప్రెユవసీ లేదు..మరి టెక్నాలజీ వల్ల ఎవరికి ప్రయోజనం?
కార్డులు కొంప ముంచుతున్నాయి. ఫోన్లు ప్రెユవసీని కాజేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోకి వెళ్దామంటే ఫిషింగ్‌ సిస్టమ్‌ వచ్చేసింది.. బ్యాంకుల వెబ్‌సైట్లను కూడా క్లోన్‌ చేసే వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. మన బ్యాంకు వెబ్‌సైట్‌లాగే ఉంటుంది.. కానీ, సదరు బ్యాంకు సైట్‌ కాదు.. అక్కడ ఐడి, పాస్‌వర్డ్‌ కొట్టారో ఇక అంతే..
అందుకే ముందు జాగ్రత్త పడటం చాలా మంచిదని సైబర్‌ క్రెユం పోలీసులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
షాపులలో, హోటళ్లలో, పబ్‌లలో బిల్‌ పే చేసేందుకు కార్డులను ఎవరికీ ఇవ్వవద్దు.. మీ కళ్ల ముందే కార్డును స్వైప్‌ చేయించండి.. సంతకం చేయండి.. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కస్టమర్‌కేర్‌ను సంప్రతించండి..

ఏటిఎంలో డబ్బులు డ్రా చేసే ముందు అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా అని పరికించండి.. ఏటిఎం కీపాడ్‌కు చుట్టుపక్కల వస్తువులను జాగ్రత్తగా చూసి డ్రా చేయండి..

కాల్‌సెంటర్ల నుంచి అపరిచిత కాల్స్‌ను అటెండ్‌ చేయవద్దు.. వాళ్లు లోతుగా మీ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు.

మొబైల్‌ఫోన్‌లను ఎవరికీ ఇవ్వకండి.. బ్లూటూత్‌ ఆప్షన్‌ను అవసరమైనప్పుడు తప్ప ఆన్‌ చేయకండి.. అపరిచితులకు బ్లూటూత్‌ ద్వారా ప్రవేశించేందుకు అనుమతించవద్దు

ఆన్‌లైన్‌ లావాదేవీలను సైబర్‌ కేఫ్‌ల నుంచి చేయవద్దు .. కీలాగర్లు మీ సొమ్మును హారతికర్పూరం చేస్తాయి.

సెక్యూరిటీ ప్రమాదం లేదని ధృవీకరించుకున్నాకే ఆన్‌లైన్‌ లావాదేవీలకు పూనుకోండి..

జాగ్రత్త,, తస్మాత్‌ జాగ్రత్త.. మీకు కావలసింది అప్రమత్తత.. ఆందోళన వద్దు.. భయం వద్దు.. కించిత్‌ ఆలోచించండి.. ఇంకొంచెం జాగ్రత్త పడండి.. మీ సొమ్ముల్ని కాపాడుకోండి.

12, జూన్ 2010, శనివారం

నగ్న సత్యం అంటే నగ్నంగా చెప్పటమా?

పేరు సోషల్‌ సర్వీస్‌...
జంతువుల పరిరక్షణే ధ్యేయం..
పర్యావరణాన్ని రక్షించటమే తపన..
ప్రపంచశాంతి కోసం తెగ „పడి చస్తారు..
నిరసనల కోసం వలువలు విడుస్తారు..
నగ్నంగా ఆందోళనలు.. సమాజానికి సందేశాలు..
లాభసాటి వ్యాపారంగా సమాజ సేవ..
అంగడి సరుకు న్యూడిటీ..
పాపులారిటీ కోసం చీప్‌ ట్రిక్‌‌స
నిరసనలకు న్యూడిటీ అవసరమా?
నగ్న సత్యం అంటే నగ్నంగా చెప్పటమా?

ప్రపంచంలో అదో గొప్ప సంస్థ..పాపులారిటీలో దానికి సాటి లేదు.. యాడ్‌ కాంపెయిన్‌లో ఆ సంస్థ సిబ్బందిలో ఉన్న క్రియేటివిటీ అబ్బో ఎక్కడా కనిపించదు.. ఈ సంస్థ ఓ ఉద్యమ సంస్థ. అది చేసే ఉద్యమం సాదా సీదా ఉద్యమం కాదు.. ప్రపంచంలోని మనుషులందరినీ జంతు ప్రేమికులుగా మార్చేయటం.. అంతే కాదు.. వెజిటేరియన్‌లుగా మార్చేయటం.. ఇందుకోసం వారిలో చైతన్యం తీసుకురావటం కోసం ప్రచారం చేస్తుంటుంది..
దాని పేరు పెటా... పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్‌‌స...
అమెరికా లో జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న ఓ సంస్థ..
పేరులో గొప్ప ఆశయం?
జంతువుల సంరక్షణ ధ్యేయం..
వాటిని ఉద్ధరించటమే పరమావధి..
జంతు సంరక్షణ గురించి ప్రపంచానికి సందేశాన్ని అందించటం,
ప్రజలను జంతు ప్రేమికులుగా మార్చటం అ సంస్థ టార్గెట్‌..
ఓకే.. జంతువులను ప్రేమించటాన్ని ఎవరు మాత్రం కాదంటారు? జంతువులను కాపాడటం.. వారి యోగక్షేమాలను చూసుకోవటంపై ఎవరికి మాత్రం ఏం అభ్యంతరం? జంతు సంరక్షణ కోసం ప్రచారం చేయటమూ గొప్ప సంగతే... కానీ, పెటా ఇందుకోసం ఏం చేస్తుందో తెలుసా? దాని రూటే సపరేటు మరి..
జంతువుల పరిరక్షణ కోసం ప్రచారానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, పెటా మాత్రం అందుకు భిన్నంగా న్యూడిటీని ఎంచుకుంది. గొర్రెలను కాపాడాలంటూ ఓ నగ్న సుందరాంగి చేతిలో గొర్రెపిల్లను పెట్టి ఫోటో షూట్‌ చేస్తారు..
కోడిపిల్లలను కాపాడాలన్న ప్రకటనకు కూడా వలువలు లేని భామలే వారికి కావాలి..
జంతు చర్మాలతో తయారు చేసిన బట్టల వేసుకోవటం కంటే అసలు బట్టలే వేసుకోకుండా ఉండేందుకు ఇష్టపడతామంటూ నగ్న సుందరులను నిలబెడతారు..
ఈ సంస్థ తన ప్రచారాన్ని ఇంతటితో ఆపలేదు.. మనుషులంతా వెజిటేరియన్లుగా మారాలంటూ తెగ ఆరాటపడుతుంది.. దీనికి సంబంధించిన ప్రచారం విషయంలో పెటా మెంబర్లు కెమెరాకు ఇచ్చే పోజులే వేరు..
బాడీ పెయింటింగ్‌ వేసుకుంటారు.. రకరకాల వేషాలు వేసుకుంటారు.. ఆకులు కట్టుకుంటారు.. మాస్కులు వేసుకుంటారు.. అసలేమీ లేకుండా అడ్డగోలుగా ఫోటోషూట్‌లు చేసేసి ప్రపంచం మీదకు వదిలేస్తారు.. ఇంకేం ప్రచారానికి ప్రచారం... పాపులారిటీకి పాపులారిటీ...
2
వాళు్ల చేసేది సోషల్‌ సర్వీస్‌... ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వాళు్ల ఉద్యమిస్తారు.. ఆందోళనలు చేస్తారు.. నిరసనలు వ్యక్తం చేస్తారు.. పక్కా ప్రొఫెషనల్‌‌స... కాకపోతే వాళ్ల ఆందోళనలు వినూత్నంగా ఉంటాయి.. క్షణాల్లో ప్రపంచమంతటా పాపులర్‌ అవుతాయి.. ఎందుకింత పాపులారిటీ వస్తుంది? అందులోనే ట్విస్‌‌ట ఉంది..
కొన్నాళు్లగా ప్రపంచంలో తీవ్రవాదుల మారణకాండ, మావోయిస్టుల హింసాకాండ, ఆకలి చావులు, జాతి వివక్షలు.. యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న దేశాలు..ఈ ఉద్రిక్త వాతావరణంలో ప్రపంచ శాంతి సాధన కోసం ఆందోళన చెందుతున్న వారు ఎందరో ఉన్నారు.. కానీ, అదే ప్రపంచ శాంతిని కోరుకుంటున్న మరో జాతి ఉంది.. అందుకోసం ఆ జాతి చేసే ఫీట్లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉంటాయి... ఈ ఆందోళనకారులు ఉద్యమించిన తీరును చూడండి...ప్రపంచ శాంతి కావాలంటే ప్లకార్డులు పట్టుకుని నగ్నంగా ప్రదర్శనలు చేయాలి... రకరకాల విన్యాసాలు చేయాలి.. ఇంగ్లీషు అక్షరాల ఆకారాల్లో పోజులివ్వాలి.. వావ్‌.. వీళ్లకు ఇంతకంటే మంచి ఆలోచన రాలేదు..
ప్రపంచ శాంతికి, నగ్న ప్రదర్శనకు లింకేమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు..ఇలా చేస్తేనే శాంతి సాధ్యమని ఎవరి మెదడుకు తోచిందో కానీ, వారికి జోహారు.. కానీ, శాంతి కోసం వీళు్ల తెగ ఆరాటపడిపోతున్నారన్న పాపులారిటీ క్షణాల్లో విశ్వవ్యాప్తంగా వచ్చేస్తుంది..
ఇంతేనా.. మరో ప్రదర్శన ఉంది.. అది భూగోళాన్నే రక్షించటం కోసం.. గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటూ ఆడా మగా కలిసి చల్లని మంచు ప్రదేశంలో నగ్నంగా ప్రదర్శన చేస్తారు.. దాన్ని ఫోటోలు తీసేసి ప్రచారం చేసేసుకుంటారు..
ఇక్కడితోనూ తృప్తి పడలేదు, నగ్నప్రియులు.. సందర్భం, సమయోచితం, విలువలు అన్న తేడా లేకుండా, ఇషూ్య ఏదైనా సరే, న్యూడ్‌గా పోజులివ్వటానికి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు.. ఇదిగో బుల్‌ఫైట్‌ను నిషేధించాలంటూ ప్రదర్శన చేయటం ఇలాంటిదే...
నిస్సిగ్గుగా వీళు్ల చేసే ప్రదర్శనలకు, నిరసనలకూ అక్కడి సమాజాలూ అంగీకరిస్తాయి.. ప్రభుత్వాలూ పట్టించుకోవు.. నిర్వాహకులకు మాత్రం వారు చేసే ఈ సోషల్‌ సర్వీస్‌కు స్పాన్సరర్ల రూపంలో కాసులు మాత్రం సూపర్‌గా వచ్చిపడతాయి..
3
కాదేదీ వ్యాపారానికి అనర్హం.. కాసిన్ని సొము్మలు వచ్చి పడతాయంటే చాలు.. దేనికైనా బరితెగించే లోకంలో ఉన్నాం మనం.. డబ్బులతోనే అన్ని వ్యవహారాలు.. కాకపోతే ముసుగులే వేరు.. ఒకరు వ్యాపారం కోసం న్యూడిటీని అంగట్లో పెట్టి అము్మకుంటున్నారు.. మరొకరు సర్వీస్‌ ముసుగు వేసుకుని వ్యభిచారం చేస్తారు..

చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి వెకిలి చేష్టలు.. వీళ్ల పోస్టర్లపై చెప్పే మాటలు.. చేసే నినాదాలు.. ప్రతి మనిషికీ ఆదర్శంగా ఉంటాయి.. చూపించే బొమ్మలు మాత్రం జుగుప్స కలిగిస్తాయి.. గ్లోబల్‌ వార్మింగ్‌ కోసం, బుల్‌ఫైట్లను నిషేధించటం కోసం,
జంతు సంరక్షణ కోసం..విజిటేరియన్లుగా మార్చేయటం కోసం.. న్యూడిటీ అవసరమా? వలువలు లేని మనుషులతో ప్రచారం చేస్తే తప్ప ప్రపంచానికి సందేశం ఇచ్చే మార్గం ఇంకోటి లేదా?
వీళ్లంతా ఎందుకు న్యూడిటీనే ఆశ్రయిస్తున్నారు? వీళ్ల ప్రచారం కేవలం అడల్‌‌ట కోసమే కాదు కదా...జంతువుల సంరక్షణ గురించి, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి, విజిటేరియనిజం గురించి చిన్న పిల్లలకు తెలియజెప్పాల్సిన అవసరం లేదా? లేక పిల్లలకు సైతం ఇలాంటి పోస్టర్లను, ప్రదర్శనలను చూపించటం వల్ల నష్టం లేదని వీళు్ల భావిస్తున్నారా?
టూమచ్‌ సెక్‌‌స ఆరోగ్యానికి హానికరం అని కూడా వీళు్ల తెగ ప్రచారం చేసేస్తుంటారు.. మరి వీళ్ల పోస్టర్లు దేనికి సంకేతాలు..? దేనికి ఉత్ప్రేరకాలు..?
తక్కువ డబ్బులకు ఎక్కువ అందాలు ఆరబోసే వాళ్లను తీసుకొచ్చి ఇలాంటి ఫోటోషూట్‌లు, ప్రదర్శనలు చేయిస్తారు... వీరికి చేంతాడంత స్పాన్సరర్ల లిస్‌‌ట ఉంటుంది.. పేరుకు చేసేది సేవ.. స్పాన్సరర్ల ద్వారా వచ్చేది సంపాదన... అది పెటా గానీ, మరేదైనా సంస్థ కానీ.. ఎవరైనా ఇంతే.. అందినకాడికి అందినంత దోచుకోవటమే వారికి కావలసింది.. చేసేదంతా వ్యాపారం.. పక్కా వ్యాపారం... చూపేది సర్వీస్‌.. సోషల్‌ సర్వీస్‌... కాదు కాదు.. న్యూడ్‌ సర్వీస్‌.. ఇప్పటికే జనం పర్వర్‌‌ట అయ్యే పరిస్థితి.. సర్వీసు చేయాలనుకుంటే దాని పద్ధతిలో అది చేయాలి.. కానీ, పాపులారిటీ కోసం న్యూడ్‌ ట్రిక్‌‌స ప్లే చేయటం దారుణం.. ఇప్పుడిప్పుడే ఇండియాలోకీ ఇది పాకింది.. షెర్లిన్‌ చోప్రా, నేహా దూఫియా వంటి వారు పాపులారిటీ కోసం దేనికైనా సిద్ధమేనని ప్రకటించేశారు.. న్యూడిటీయే అందమని, అదే గ్లామరనీ కూడా ప్రకటించారు.. దీన్ని విపరీత పోకడలంటే కొందరికి కోపం రావచ్చు... కానీ, ఇండియాలో.. ఇంతగా బరితెగించిన వాతావరణంలోనూ ఎక్కడో ఒక చోట కొంతైనా విలువలంటూ మిగిలి ఉన్నాయి. అందుకే ఈ దేశాన్ని, ఇక్కడి జన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న వాళు్ల ఇంకా ఉన్నారు.. కాస్తో కూస్తో మిగిలి ఉన్న ఈ కాస్త విలువల వలువలు విప్పకుండా ఉంటే అదే పదివేలు.

1, జూన్ 2010, మంగళవారం

మహానటుడికి మహా పరాభవం...

తెలుగు సినిమా... ఈ పేరు చెప్పగానే ఇప్పటిదాకా మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు ఎన్టీరామారావు.. ఆయన్నే కొందరు అన్నగారు అని పిలుస్తారు.. పల్లెల్లో అభిమానులైతే ఎన్టోడు అని ముద్దుగా పిలుచుకుంటారు.. ఇదంతా ఇప్పటిదాకా ఉన్న మాట.. కానీ, ఇక ముందు ఈ మాట వినిపించదు.. ఆ బొమ్మ కనిపించదు.. ఆ పేరే మటుమాయం కానుంది.. ఎన్టీయార్‌ అంటే ఇప్పుడున్న కుర్ర ఎన్టీయార్‌ మాత్రమే కనిపిస్తాడు.. అతని మాటలే వినిపిస్తాయి.. సీనియర్‌ ఎన్టీరామారావు అంటే ఆయన అంటూ ఒకరున్నారా అన్న అనుమానమూ కలుగుతుంది...ఎందుకు? ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
తెలుగు చిత్రానికి ఆయన రారాజు.. 1949 దాకా తప్పటడుగులు వేస్తున్న తెలుగు సినిమా నడకను, నడతను తీర్చిదిద్ది స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టిన సినీ భోజుడు.. ఆయన పేరు నందమూరి తారక రామారావు.. మూడున్నర దశాబ్దాలు.. మూడు వందల ఇరవైకి పైగా సినిమాలు.. చలన చిత్ర సెల్యూలాయిడ్‌ కావ్యానికి అందమైన ముఖచిత్రం నుంచి చివరి పుట దాకా అంతా ఆయనే.. ఇవాళ సినీ పరిశ్రమలో ఆయన పేరు తలచే వారే లేరు.. మాట్లాడే వారే లేరు...

చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే సంస్కృతి తెలుగు సినిమా వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు. ఇదొక మాయా ప్రపంచం.. ఎవరికి ఎవరూ ఏమీ కారు.. అందరూ మొనగాళ్లకు మొనగాళ్లే.. కళామతల్లి ముద్దుబిడ్డలం అని చెప్పుకునే ప్రబుద్ధులంతా ఆ కళకు సేవలు అందించిన వారికి పంగనామాలు పెట్టడం కొత్తేమీ కాదు.. నాటి ఎన్టీయార్‌ నుంచి నేటి వేటూరి దాకా లివింగ్‌ లెజెండ్స్‌ పరిస్థితి అంతా ఇంతే..
ఒక మహోన్నత వ్యక్తికి జయంతి....వర్థంతి ఉత్సవాలు జరిగాయంటే... ఆ వ్యక్తిని జనం పది కాలల పాటు గుర్తు పెట్టుకున్నారని అర్థం.

తెలుగు సినిమాను, తెలుగు జాతి ఔనత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నటుడు, రాజకీయ వేత్త నందమూరి తారాకరామారావు జయంతి ఎప్పటిలాగే ఎన్‌టిఆర్‌ ఘాట్‌ వద్ద జరిగింది.

తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు రొటీన్‌గా వచ్చి నివాళులు అర్పించేసి వెళ్లిపోయారు..

పార్టీకి ఇంకా రామారావు పేరు అవసరం తీరిపోలేదు కాబట్టి వాళ్లు వచ్చారు.. కుటుంబసభ్యులకు తప్పదు కాబట్టి వారూ వచ్చారు..

కానీ, తెలుగు సినిమా పరిశ్రమ నెలకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా జరిగిందా? కనీసం ఆనవాలైనా కనిపించదు..
ఎన్టీయార్‌ జయంతిని జరుపుకోవలసిన అవసరం, బాధ్యత సినీ పరిశ్రమకు లేదు..
నందమూరి నట వారసులతో పాటు సినీ పరిశ్రమలో ఉన్న నందమూరి అభిమానులు కూడా పెద్ద ఎన్‌టిఆర్‌ను పూర్తిగా మరిచిపోయారు.. కాదు.. కావాలనే విస్మరించారు.. ఎందుకంటే ఇప్పుడు సినిరంగానికి చనిపోయిన ఎన్టీయార్‌తో అవసరం ఏముంది కనుక?
ఒక్క నాగేశ్వరరావు తప్ప ఒక్కరంటే ఒక్కరు సీనీపరిశ్రమకు చెందిన వాళ్లు ఎన్టీయార్‌ ఘాట్‌కు వచ్చిన పాపాన పోలేదు..ఫిలింనగర్‌ సంగతి సరేసరి..


సినిమా వాళ్లు వ్యక్తులను గుర్తు పెట్టుకుంటే ￧అదో విచిత్రం.. విశేషం.. మరచిపోవడం సహాజ లక్షణం. ఎన్టీయార్‌ దాకా ఎందుకు.. సినిమా పాటకు పల్లవి లాంటి వేటూరి సుందర రామ్మూర్తి మరణించి మూడు రోజులైనా కాలేదు.. ఆయన సంతాప సభ పెడ్తే ఆ సభలో సినీ పెద్దలెవరూ కనిపించని దుస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎప్పుడో వెళ్లిపోయిన ఎన్‌టిఆర్‌ జయంతిని మాత్రం సినిమా వాళ్లు ఏం గుర్తు పెట్టుకుంటారు లేండి.

తెలుగు సినిమాకు మోరల్స్‌ లేవా? ఇదీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.. వేదికలపైన సినీపెద్దలు పోచికోలు కబుర్లు చెప్పటానికి ఎలాగైనా సిద్ధపడతారు కానీ, వేదికలు దిగగానే చెవులు దులుపుకుని వెళ్లిపోతారు.. అందుకే ఇప్పుడు ఎన్టీయార్‌ గతకాలపు స్మృతి కాదు.. ఎన్టీయార్‌ అంటే అదే సినీప్రముఖులకే అర్థం కాని మాట..

సినిమా రంగానికి మిగతా వారంతా అక్కర్లేక పోవచ్చు. కానీ ఎన్టీయార్‌ ఒక లెజెండ్‌ సినీపరిశ్రమకే కాదు.. తెలుగు వారికి, సాంస్కృతికంగా, రాజకీయంగా కూడా దిశ, దశ చూపించిన వాడు.. అలాంటి మహానేతకు సినీరంగం ఎందుకు మంగళం పాడుతోంది. దీని వెనుక సినీ ప్రముఖులకు వేరే ఉద్దేశ్యాలు వేరే ఏమైనా ఉన్నాయా? ఒక పథకం ప్రకారమే చేస్తున్నారా? సినిమా ఒక కళ.. ఇదో కళారంగం.. మేమంతా కళాకారులం.. కళాకారులకు కళే జాతి.. కళామతల్లి ముద్దుబిడ్డలం మేమంతా...
ఇవన్నీ.. సినీ ప్రముఖులు ఎప్పుడూ చెప్పుకునే మాట.. భుజాలు తడుముకునే చేత.. ఇది ఒక విచిత్రమైన వ్యవస్థ.. చిత్రమైన రంగం.. తెలుగు సినిమా ఒక కళారంగం అని చెప్పుకునే దశను ఎప్పుడో దాటిపోయింది.. వీళ్లకు లాభసాటి వ్యాపారం జరగాలి.. ప్రభుత్వాల నుంచి రాయితీలు రావాలి.. ప్రేక్షకుల నుంచి కోట్లు వచ్చిపడాలి. ఫక్తు వ్యాపారం.. ఎవరు డామినేట్‌ చేస్తే వాళ్లదే రాజ్యం.. వీళ్లు వల్లించేవన్నీ ఒఠ్ఠిమాటలే.. ఇక చనిపోయిన వారిని గుర్తుంచుకుని స్మరించేంత తీరిక, ఓపికా వారికెక్కడుంటుంది?

సినిమా వాళ్లు చెప్పేదంతా నిజం కాదని జనాలకు ఇప్పుడిప్పుడే బుర్రకెక్కుతున్నది. నిజంగానే సినిమా వాళ్లకు వేటూరి మీద అంతటి అభిమానం ఉండి ఉంటే...ఫిలించాంబర్‌లో జరిగిన సంతాప సభకు సినీ పెద్దలెందుకు రాలేదు? ఎన్‌టిఆర్‌ జయంతిని ఫిలింనగర్‌లో ఎందుకు జరుపుకోలేదు? ఒకనాడు లెజెండ్స్‌గా ఉన్న వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఆలనాపాలనా పట్టించుకోవలసిన బాధ్యత సైతం సినీరంగానికి పట్టదు.. అప్పుడప్పుడూ పేద కళాకారులకోసం క్రికెట్టు మాత్రం తెగ ఆడేస్తారు.. డబ్బులు పోగేస్తారు.. కొందరికి పంచేస్తారు.. చిత్రమేమంటే ఈ హీరోలు, హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు పారితోషికంగా వసూలు చేస్తారు.. పేదకళాకారులకు సాయం చేసే విషయానికి వచ్చే సరికి మళ్లీ ప్రేక్షకుల దగ్గర నుంచే వసూలు చేస్తారు.. జేబులోనుంచి ఒక్క పైసా బయటకు తీయరు.. ఇలాంటి వ్యాపారులు ఇక ఎన్టీయార్‌ కోసం ఏం చేస్తారు? ఆయన్ను ఏం గుర్తుంచుకుంటారు?
ఎన్టీయార్‌ నట సార్వభౌముడు.. తెలుగు సినిమాకు ఒక ఐకాన్‌.. ఆయన నటించని పాత్ర లేదు.. జీవించని కేరెక్టర్‌ లేదు..ఇవాళ తెలుగు సినిమాలో ఎవరు ఎలాంటి కేరెక్టర్‌ చేయాలన్నా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఎన్టీయార్‌ అంతకు ముందు చేసిన ఆ కేరెక్టర్‌ను ఒక్కసారి చూస్తే చాలు.. అన్ని రకాల కేరెక్టర్లు చేసిన వాడు ఎన్టీయార్‌. అలాంటి ఎన్టీయార్‌ నటించిన కేరెక్టర్లకు సంబంధించి ఉపయోగించిన ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తువులు, దుస్తులు మ్యూజియం పేరుతో ఉన్న ఒక బిల్డింగ్‌లో దుమ్ముపట్టుకుని పోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిగొడవగా మారి కోర్టులో పెండింగ్‌ ఫైళ్ల మధ్య ఇరుక్కుపోయింది.. ఎన్టీయార్‌ మ్యూజియం అన్నది తెలుగు సినిమా ఆస్తి కనీసం దాన్నైనా పరిరక్షించేందుకు ప్రయత్నించిన పాపాన పోలేదు..
ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఎవరికీ ఎన్టీయార్‌ అక్కర్లేదు.. ఎందుకంటే ఇవాళ ఎన్టీయార్‌ వ్యాపార వస్తువు కాదు.. ఆయన పేరుతో కానీ, స్మరణతో కానీ పైసా లాభం రాదు.. ఆయన ఉన్నప్పుడు సినిమాపరంగా, రాజకీయ పరంగా ఆయన్ను ఉపయోగించుకున్నారు.. ఇప్పుడు ఆ అవసరం లేదు.. దానవీరశూర కర్ణలో ఎన్టీయారే చరిత మరువదు నీ చతురత అంటాడు.. కానీ, ఇప్పుడు అది రివర్స్‌ అయింది.. చరిత మరిచిన నీ నటనా చాతుర్యం..