30, మే 2009, శనివారం

విదేశాల్లో భారతీయుల కష్టాలు

విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న దాడులు భారత్ లోని తెలుగు వారి మనస్సులని కలచి వేస్తున్నై. ఈ దాడులను నిరసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో సాంగ్ చూడండి.

28, మే 2009, గురువారం

కెసిఆర్‌ అను ఓ అసమర్ధుడి రాజకీయ యాత్ర!

తెలంగాణ మళ్లీ సశేషంగానే మిగిలిపోయింది. నాలుగు దశాబ్దాల ఉద్యమం ఇంకా గమ్యం కోసం చేరుకోవటానికి నానా కష్టాలు పడుతూనే ఉంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు లేక తెలంగాణ అనాధలా కన్నీరు పెడుతోంది. ఉద్యమానికి ఊపిరి పోసిన వారే ఉసురు తీస్తుంటే ఆ ఉరితాళ్ల నుంచి తప్పించుకోవటానికి పోరాడుతోంది. అగాధంలో పడిపోయిన తనను ఎవరు మళ్లీ పైకి తీస్తారా సహాయం కోసం చేతులు చాచి నిరీక్షిస్తోంది. ఆ చేతులను అందుకునేదెవరు? తెలంగాణాకు చేయూతనిచ్చేదెవరు? జవాబులేని ప్రశ్నలు ఇవి. తెలంగాణాను 1969లో భుజానికెత్తుకున్నవాళు్ల... తమ రాజకీయ ప్రయోజనం తీరగానే తెరమరుగైపోయారు.. తెలంగాణకు ముఖం చాటేశారు. నాడు వేలాది విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు. వందలాది విద్యార్థులు తమ ప్రాణాలను బలి చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. మరో ఆరు నెలలు అదే ఊపులో ఉద్యమం నడిచి ఉంటే తెలంగాణ రాష్ట్రం అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేది. సరిగ్గా అదే సమయానికి మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని హైజాక్‌ చేశాడు. ప్రజలు ఆయన్ని గుడ్డిగా నమ్మారు. ఉద్యమకారులూ విశ్వసించారు. ఆవేశంగా ఉన్న విద్యార్థులు ఆయన వెంట నడిచారు. ఓట్లు వేసి గెలిపించారు. గెలిచినోళ్లందరినీ వెంటబెట్టుకుని వెళ్లి నాటి ప్రధానమంత్రి ఇందిరమ్మ దగ్గరకు వెళ్లి కాంగ్రెస్‌లో చేరిపోయాడు... ఉద్యమానికి బలైపోయిన ఇన్ని ప్రాణాల విలువ గాల్లోనే కలిసిపోయింది. మళ్లీ నలభై ఏళ్ల తరువాత మరోసారి తెలంగాణ రాష్ట్ర నినాదం 2001లో వినిపించింది. రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణం చేతనో.. తెలుగుదేశం అధినేతతో విభేదాల కారణాల వల్లనో అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అనే బక్క ప్రాణి తెలంగాణ అనే ఒక బలమైన భావోద్వేగాన్ని ఊతంగా పట్టుకుని రాజకీయ యాత్ర ప్రారంభించాడు. 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. తాను అసమర్థుణ్ణని చంద్రశేఖర్‌ రావుకు బాగా తెలుసు. అందుకే తన ప్రమేయం లేకుండానే తనకు ఓ తిరుగులేని అస్తిత్వాన్ని కట్టపెట్టగల నినాదాన్ని ఒడిసి పట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమం అనే నిప్పుపై ఉన్న నివురును నెమ్మదిగా తొలిగించాడు. ఒక్కసారిగా 1969 నాటి ఉద్యమ స్ఫూర్తి మరోసారి రగలటం ప్రారంభించింది. అమాయకులైన మేధావులు కెసిఆర్‌ అని పొట్టి అక్షరాలతో పిలిచే చంద్రశేఖర్‌రావుకు వెనుక నుంచి వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ ప్రాంతంలోని విద్యావంతులు ఇంకోవైపు నుంచి అండగా నిలబడ్డారు. ఇక సాంస్కృతిక కళాకారుల బృందం కెసిఆర్‌కు ముందుండి పార్టీని ముందుకు నడిపించింది. అక్షరాలా ఎనిమిది సంవత్సరాలు.. తెలంగాణకు ప్రతినిధినని చెప్పుకున్న, చెప్పుకుంటున్న కెసిఆర్‌ను ఇక్కడి ప్రజలు మన్నిస్తూనే వచ్చారు. తాను ఓడిపోతే తెలంగాణ ఉద్యమమే కనుమరుగైపోతుందని చెప్తే.. అయ్యో తెలంగాణ గురించి మాట్లాడుతున్న ఒక్కడు కూడా ఓడితే ఎట్లా అని గెలిపించారు. శిశుపాలుడిని వంద తప్పులు కాసినట్లుగా కెసిఆర్‌ను ఏ రకంగా వ్యవహరించినా ప్రజలు మాట్లాడలేదు. చివరకు కెసిఆర్‌ శరీరం లాగానే, ఆయన మాటలు కూడా ఒట్టి డొల్లేనని తెలుసుకున్నారు. ఇక చాలు పొమ్మంటూ పంపించారు. పంపే ముందు కూడా తెలంగాణ ప్రజలు తమ ఔదార్యాన్ని వీడలేదు. నియోజక వర్గం మార్చినా, దక్షిణ తెలంగాణకు వెళ్లినా, పాపం పోనీమంటూ బొటాబొటి మార్కులతో పాస్‌ చేశారు. మరోసారి రాజకీయుల చేతుల్లో పడి తెలంగాణ అభాసుపాలైంది. అవమానం పాలైంది. ఆందోళనకరమైంది. సమర్థుడైన నాయకుడు లేక అనాధగా మిగిలిపోయింది. నిజంగా కెసిఆర్‌కు తెలంగాణపై కించిత్‌ అభిమానం ఉన్నా.. తెలంగాణ రాషా్టన్న్రి తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఏ మూలన ఏ కాస్త మిగిలి ఉన్నా.. ఒకసారి తాను తీసుకున్న నిర్ణయాలు, చేసిన చర్యలు, దూరమైన ఆప్తులు.. ఓటమికి కారణాలను నిష్పాక్షికంగా విశ్లేషించటం అవసరం. కెసిఆర్‌ జర సోచియే....1. కెసిఆర్‌పై ఒత్తి డి తీసుకు వచ్చి ఆయనతో పార్టీ పెట్టించిన వాళు్ల ఇప్పుడు ఆయనతో ఉన్నారా? 2. ఇన్నయ్య, కెకె మహేందర్‌ రెడ్డి, వి. ప్రకాశ్‌ లాంటి ఎందరో నాయకులు, మేధావులు ఇప్పుడు కెసిఆర్‌తో ఎందుకు కలిసి లేరు?3. 2001 ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌ జల దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది. ఇది ఉద్యమ పార్టీ అని.. ఎట్టి పరిస్థితిలో రాజకీయ పార్టీ కాదని ఆరోజు కెసిఆర్‌ ఖరాఖండిగా చెప్పారు. (రికార్డుల్లో చూసుకోవచ్చు.). ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైంది? ఉద్యమం పోయింది.. ఫక్తు రాజకీయ పార్టీగా మిగిలిపోయింది. దీనికేమని జవాబు చెప్తారు?4. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ కెసిఆర్‌ తెగ తిరిగారు. తెలంగాణ మాండలికంలో తెగ మాట్లాడేశారు. ప్రజలను ఉద్విగ్నులను చేశారు. ఉత్తేజపరిచారు. ఉత్సాహాన్ని రేకెత్తించారు. తెలంగాణ సాధనే తప్ప తమ లక్ష్యం మరేమీ కాదన్నారు. అదివో అల్లదివో అని అన్నమాచార్య అన్నట్లే.. ఇదిగో, ఇల్లిదిగో తెలంగాణ అన్నారు. సోనియమ్మ ఇచ్చిందన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ ఇచ్చేస్తున్నారన్నారు. పార్టీలన్నీ మద్దతు పలికాయన్నారు. చివరకు వాళ్లనే తిట్టిపోశారు. ఎవరిని విడిచి వచ్చారో వారి పంచనే చేరి ఎన్నికల్లో పోటీ చేశారు.. ఇంత చేసీ కెసిఆర్‌ సాధించింది ఏమిటి? సున్నా....5. ఉద్యమ సంస్థను రాజకీయ పార్టీగా మార్చినప్పుడు, అందుకు అనుగుణంగా తెలంగాణ అజెండాను ఎందుకు మలచుకోలేకపోయారు?6. బహిరంగ సభల్లో అహో తెలంగాణ, ఒహో తెలంగాణ అనటం తప్ప ఇక్కడి ప్రజల సమస్యలపైన, ప్రాంత సమస్యలపైన నిర్మాణాత్మకంగా ఏనాడైనా పోరాడారా?7. ఫలానా సమస్యపై ఉద్యమించాం.. ఫలానా సమస్యను పరిష్కరించగలిగాం.. లేదా.. పరిష్కారం దాకా తీసుకురాగలిగాం అని చెప్పుకోవటానికి ఏ ఒక్క అంశమైనా ఉందా?8. ఎత్తుల జిత్తుల మారి అని చెప్పుకోవటమే తప్ప.. కెసిఆర్‌ వేసిన ఎత్తుల్లో చిత్తయినవే ఎక్కువ కాదా?9. తెలంగాణ ప్రజలకు, మేధావులకు, కళాకారులకు, విద్యావంతులకు మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టే కెసిఆర్‌ ఆడింది ఆట, పాడింది పాటగా మారలేదా?10. తాను కేంద్రంగా తెలంగాణ నడవాలని కేసీఆర్‌ అనుకున్నారే తప్ప, తెలంగాణ కేంద్రంగా తాను నడవాలనుకోలేదు.. కాబట్టే లక్ష్యం నెరవేరలేదన్నది నిజం కాదా?11. తన నిరంకుశత్వం వల్లనే శత్రువులు పెరిగిన మాట వాస్తవం కాదా?12. చెప్పింది చేయకపోవటం కెసిఆర్‌ నైజం...ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు...13. తన మాటలో, చేతలో నిజాయితీ లేకపోవటం కెసిఆర్‌లో ప్రధాన లోపం14. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక మేనిఫెస్టో ఉంటుందని చెప్పింది కెసిఆరే... కులాల వారిగా గొప్పగా సదస్సులు నిర్వహించింది కూడా కెసిఆరే. ముసాయిదాలనూ సిద్ధం చేయించింది కెసిఆరే.. సరిగ్గా ఎన్నికలు ముంచుకు వచ్చిన తరువాత అసలు మేనిఫెస్టోయే లేని పార్టీగా ఎన్నికల్లోకి దిగిన ఏకైక పార్టీ కెసిఆర్‌ పెట్టిన టిఆర్‌ఎస్సే...15. ఎన్నికల్లో గెలిచారు సరే.. మెదక్‌ నుంచి కెసిఆర్‌ ఎంపిగా ఎన్నికయ్యారు.. తరువాత అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో చేరి ఆబగా అధికారాన్ని అనుభవించింది కెసిఆరే...16. పార్టీ పెట్టినప్పుడు మియాబీవీ తప్ప పిల్లలంతా అమెరికాలోనే ఉన్నారన్నారు.. పార్టీతో, రాజకీయాలతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవన్నారు.. ఆ డైలాగు ఇప్పుడేమైంది... టిఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీగా మారలేదా?17. ఎమ్మెల్యే కాకుండానే మేనల్లుడు హరీశ్‌రావుకు మంత్రి పదవిని ఇప్పించాల్సిన ఆగత్యం ఎందుకు వచ్చింది. కుటుంబ పార్టీగా మార్చాలన్న ఆలోచన లేకపోతే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది.18.అమెరికాలో నెలకు నాలుగు లక్షల రూపాయల జీతంతో సాఫ్‌‌టవేర్‌ ఉద్యోగం చేస్తున్నాడన్న కొడుకు రామారావును ఉద్యోగం మాన్పించి దేశానికి రప్పించి రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావలసి వచ్చింది. 19. చివరకు కూతురు కవితను కూడా రంగంలోకి దింపే ప్రయత్నం చేసింది కెసిఆర్‌ కాదా?20. తన కుటుంబ సభ్యులను బలవంతంగా పార్టీపై రుద్దింది ఎవరు?21. తెలంగాణ వచ్చేసింది.. ఇక సరిహద్దులు గీయడమే తరువాయి. ఆస్తుల పంపకం చేసుకోవటమే మిగిలింది అని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు... అవన్నీ ఒఠ్ణి మాటలేనని తేలిపోయాయి. 22. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పులిచింతల ప్రాజెక్టును నిర్మిస్తే రక్తం ఏరులై పారుతుందని బీరాలు పలికారు. కానీ, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వైఎస్‌ కేబినెట్‌లో ఉన్నప్పుడే పులిచింతల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. పనులు మొదలయ్యాయి. ఈ మంత్రులంతా అప్పుడు ఏం చేస్తున్నారు?23. మేధావులు గగ్గోలు పెడితే కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగారు.. బాగానే ఉంది. అక్కడి నుంచి నేరుగా డిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గరకు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. కనీసం ఆ దీక్ష అయినా నిబద్ధతతో చేశారా అంటే అదీ లేదు. గంటల్లోనే విరమించారు. అదేమంటే లోక్‌సభ స్పీకర్‌ చెప్పారని చెప్పారు. నిజానికి లోక్‌సభ స్పీకర్‌ ఏమీ చెప్పకున్నా, ఎలాంటి హామీ ఇవ్వకున్నా ఆయన పేరుతో అబద్ధం చెప్పి దీక్షను విరమించింది కెసిఆరే...24. మొట్ట మొదట టిర్‌ఎస్‌కు మద్దతును ఇచ్చింది స్థానిక సంస్థలే.. అలాంటిది ఆ తరువాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సిద్దిపేట తప్ప మరెక్కడా ఎందుకు గెలవలేకపోయారు?25. బిసిలను సైతం నిర్లక్ష్యం చేశారు.. వైఎస్‌ సర్కారులో బిసి సంక్షేమ శాఖ టిఆర్‌ఎస్‌కు లభిస్తే.. అది కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుకు ఇప్పించారు.26. ప్రతి పనికీ మేధావుల సలహాలను తీసుకుంటానని కెసిఆర్‌ ప్రతి చోటా చెప్పుకొస్తారు. నిజానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తప్ప ఆయన వెంట ఉన్న మేధావుల లిస్‌‌ట ఏది?27. చేసిన ప్రతి తప్పుకూ జయశంకర్‌ ఆమోదం ఉందని చెప్పి, ఆయన ప్రతిష్ఠను దారుణంగా దెబ్బ తీసింది కెసిఆర్‌ కాదా?28. 2006 కరీంనగర్‌ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కెసిఆర్‌ ఆ ఊపును ఉద్దేశ పూర్వకంగానే కొనసాగించలేకపోయారన్నది నిజం కాదా?29. నిష్కారణంగా ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలతో రాజీనామాలు చేయించి ఘోర పరాజయం పాలయింది వాస్తవం.30. ఉపఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత రాజీనామా డ్రామా ఆడారు.. మేధోమధనం నిర్వహించారు. తప్పొప్పులు సమీక్షించుకున్నారు..తాను మారతానన్నారు. నిజంగా మారారా? మారితే ఆ జాడేది? మారిన ఫలితం ఏది?31. ఒక రాజకీయ పార్టీ అన్నాక దానికి ఓ పొలిట్‌ బ్యూరోనో, రాజకీయ వ్యవహారాల కమిటీ లాంటివో ఉంటాయి. టిఆర్‌ఎస్‌కు అలాంటివి ఏవీ లేవు. అన్నీ ఆయనే... ఆయన కుటుంబ సభ్యులే... 32. బిసి ముసాయిదా ప్రకటిస్తానన్నారు.. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదే...33. చంద్రబాబును అడ్డగోలుగా తిట్టిన కెసిఆర్‌, వైఎస్‌ఆర్‌ను ఓడించటం కోసం తెలుగుదేశంతో జత కట్టారు. దీని వల్ల తెలంగాణలో వ్యతిరేకత మూట కట్టుకోలేదా?34. టిక్కెట్ల పంపిణీ సమయంలో అజ్ఞాత ప్రదేశాల్లో ఉండటం, అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించటం, సీనియర్లకు కూడా అందకుండా మంత్రాంగం నడపడం ఒక రాజకీయ పార్టీకి, నాయకత్వానికి సబబైన విషయమేనా?35. 2004లో టిడిపి మంత్రులను ఓడిస్తామని చెప్పి వారి స్థానాల్లో టికెట్లు తీసుకున్న కెసిఆర్‌.. ఈసారి తనపై తిరుగుబాటు చేసి, తాను ద్రోహులుగా ముద్ర వేసిన రెబల్‌‌స విషయంలో ఆ సూత్రాన్ని ఎందుకు పాటించలేకపోయారు?36. సంగారెడ్డిలో కెసిఆర్‌ తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసిన జగ్గారెడ్డి గెలిచారు.. కెసిఆర్‌ నిలబెట్టిన అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.. ఇది దేనికి సంకేతం?37. సిరిసిల్లలో కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ రెండువందల లోపు ఓట్ల మెజారిటీతో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచారు. దీన్ని ఒక గెలుపుగానే భావిస్తారా?38. దక్షిణ తెలంగాణాలో అసెంబ్లీ సీట్లకు బోణీయే చేయలేదు. దీనికి ఏమని జవాబు చెప్తారు?39. 13 చోట్ల టిఆర్‌ఎస్‌ డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయింది. కెసిఆర్‌ ఇమేజి పడిపోయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?40. టిడిపి కేడర్‌ టిఆర్‌ఎస్‌కు పనిచేయలేదని అందువల్లే ఆ పార్టీ ఓట్లు తమకు బదిలీ కాకపోవటం వల్లనే టిఆర్‌ఎస్‌ పరాజయం పాలయిందంటున్నారు. దీనికి ఆధారాల్లేవు. టిడిపి ఓట్లు బదిలీ కాకపోతే, మహబూబ్‌ నగర్‌లో కెసిఆర్‌ ఎలా గెలిచారు?41. టిఆర్‌ఎస్‌పై బరిలో నిలిచిన ఇద్దరు టిడిపి అభ్యర్థులు, ఒక టిడిపి రెబల్‌ గెలవటానికి ఎవరు కారణం?42. కెసిఆర్‌కు తన కేడర్‌పైనే నమ్మకం లేదు... ఏ ఒక్క దశలోనూ కేడర్‌ను విశ్వాసంలోకి తీసుకోలేదు. నాయకులనే నమ్మని వారు కేడర్‌ను ఏం నము్మతారు?43. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నగదు బదిలీ, కలర్‌ టివిల గురించి అదే పనిగా ప్రచారం చేసిన కెసిఆర్‌, తన అసలైన అజెండా అయిన తెలంగాణాను ఉద్దేశ పూర్వకంగా మరవలేదా?44. టిఆర్‌ఎస్‌ సభలకు అయిదారు గంటల పాటు ప్రజలను కట్టిపడేలా చేసిన తెలంగాణ ధూంధాంను, రసమయి బాలకృష్ణ లాంటి వాళ్లను దూరం చేసుకోవటం కేసిఆర్‌ చేసిన చారిత్రక తప్పిదం.45. తెలంగాణాకు కట్టుబడి పార్టీ పెట్టుకున్న దేవేందర్‌గౌడ్‌ను, తెలంగాణ ఇస్తానన్న బిజెపిని పూర్తిగా పక్కన పెట్టి వాస్తవంగా తెలంగాణ అనుకూల ఓటును దూరం చేసుకున్నది కెసిఆర్‌.46.2009 ఎన్నికలు తెలంగాణకు అంతిమ యుద్ధం అని ప్రకటించింది కెసిఆర్‌. ఇప్పుడు ఓడిపోయింది కెసిఆర్‌.. ఇప్పుడేమంటారు?47. ముందు నుంచి సమైక్యవాదాన్ని మోస్తున్న సిపిఎంతో పొత్తు పెట్టుకోవటం ద్వారా టిఆర్‌ఎస్‌ మౌలిక డిమాండ్‌కు తూట్లు పొడిచింది కెసిఆర్‌ కాదా?48. ఎన్నికల ఫలితాలు రాకముందే అద్వానీ ప్రధానమంత్రి అయిపోతారని గుడ్డిగా నమ్మి, టిఆర్‌ఎస్‌ను తీసుకుపోయి ఎన్‌డిఎలో కలపటం సొంత ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం కాదా?49. తెలంగాణ ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని ఇప్పుడు ఎలా పునరుద్ధరిస్తారు?50. పార్టీ నాయకత్వాన్ని మారుస్తారా? నాయకుడుగా కెసిఆర్‌ మారుతారా?కెసిఆర్‌ గారూ... డిసైడ్‌ యువర్‌ సెల్‌‌ఫ....

20, మే 2009, బుధవారం

ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఓడిపోయింది? సంపూర్ణ విశ్లేషణ

ప్రజారాజ్యం ఎందుకు ఓడి పోయింది? ఎవరైనా నిశితంగా ఆలోచిస్తున్నారా? మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ చరిత్రలో మకుటం లేని మహారాజుగా వెలిగిన మెగాస్టార్‌ ప్రారంభించిన రాజకీయ ప్రస్థానానికి ప్రజలు ఆదిలోనే ఎందుకు అడ్డుకట్ట వేశారు...? కారణం ఏమిటి? నిష్పాక్షికంగా విశ్లేషిస్తే కారణాలు స్పష్టంగానే కనిపిస్తాయి. చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించటం దగ్గర నుంచి 2009 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకునేంత దాకా జరిగిన పరిణామాలను ఒక్కటొక్కటిగా విశ్లేషిస్తే అన్నీ వాటంతట అవే అవగతమవుతాయి.*నేపథ్యంచిరంజీవి రాజకీయాల్లోకి రావటం అనేది ఒక డ్రమాటిక్‌గా జరిగింది. వాస్తవానికి ముఠామేస్త్రీ సినిమా తీసినప్పటి నుంచే ఆయనలో రాజకీయాల్లోకి రావాలన్న బీజం పడింది కానీ, అది బీజంగా ఉండిపోయింది. అడపా దడపా సినిమా శతదినోత్సవాల్లో పలువురు ప్రముఖులు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా చిరంజీవి మాత్రం సున్నితంగా తోసిపుచ్చుతూనే వచ్చారు. సాక్షాత్తూ దాసరి నారాయణ రావు సైతం ఓ సినిమా పండుగలో చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలంటూ కోరారు. ఆప్పుడూ ఆయన తిరస్కరించారు. ఆ సభలో సినీ నటి శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్‌ కూడా పాల్గొన్నట్లు గుర్తు.రాజకీయాల్లోకి రావాలని మనసులో ఉన్నా చిరంజీవికి ఏదో బెరుకు చాలాకాలం పాటు ఆ కోరికను బలవంతంగా అణచివేస్తూ వచ్చింది. చివరకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం నాటకీయంగా అనేక అంకాలు మారుతూ వచ్చింది. ఒక దశలో గత రెండు మూడేళ్లలో ఆయన సినిమాలు వేళ్లపైన లెక్కించినన్ని మాత్రమే విడుదలయ్యాయి. వాటిలో సక్సెస్‌ రేటు సాధించినవి చాలా తక్కువే. ఈ దశలో ఆయనలోని రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కోరిక క్రమంగా అధికమవుతూ వచ్చింది. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ప్రజల్లో ఏ విధమైన రియాక్షన్‌ ఉంటుందో తెలుసుకోవాలని ముందు జాగ్రత్తలు చాలానే తీసుకున్నారు. మొదట తన సన్నిహిత మిత్రుడు డాక్టర్‌ ప్రసాద్‌ రాజుతో ఫీలర్‌ వదిలిపెట్టారు.. ఒక అయిదు నక్షత్రాల హోటల్‌లో నలుగురే నలుగురు పాత్రికేయులను పిలిపించి వారి ద్వారా సమాచారాన్ని బయటకు పంపించారు... ఈ ఫీలర్‌ రాష్ర్ట మంతా బాగానే పాకింది. మీడియాకు ఇది తీపి మిఠాయిలా అంది వచ్చింది. చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి అప్పటి నుంచి వాస్తవాలకు ఊహలు కొన్ని, కల్లలు మరి కొన్ని జోడించి చిలువలు, పలువలను ప్రసారం చేశారు. కనుసైగ చేస్తే చాలు రక్తం ధార పోసే చిరంజీవి అభిమాన బృందాల్లో ఇది భరించలేని వేడి రగిల్చింది. ఈ వేడి సెగలు జూబ్లీహిల్‌‌సలో 14 అడుగుల ఎత్తులో ప్రహారీతో నిర్మించిన దుర్భేద్యమైన చిరంజీవి కోటను బద్దలు కొట్టి మరీ మెగాస్టార్‌ను, ఆయన బృందాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒక విధంగా చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా ఆగలేని అనివార్య పరిస్థితి ఒకటి నెలకొంది. అప్పటి నుంచి ఇక అసలు కథ మొదలైంది... మొదట చిరంజీవిని ఆయన కుటుంబ సభ్యులు ప్రభావితం చేస్తూ వచ్చారు. ఆ తరువాత అభిమాన సంఘాలు ఆయన్ను ప్రభావితం చేశాయి. చిరంజీవిని ఇంద్రుడు, చంద్రుడు అన్నారు.. నాడు ఎన్టీయార్‌, నేడు చిరంజీవి అన్నారు. కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి మీ ముందు ఎన్టీయార్‌ దిగదుడుపే అన్న స్థాయిలో పొగుడుతూ వచ్చారు. మీరు కాలు బయట పెడితే చాలు... జనం నీరాజనాలు పలుకుతారు అన్నారు... మిమ్మల్ని దేవుడి కంటే ఎక్కువగా భావిస్తారు అన్నారు. చిరంజీవికి సాటి రాగల వారు ఆంధ్ర ప్రదేశంలో ఎవరూ లేరన్నారు...ఇవన్నీ చిరంజీవి మైండ్‌ సెట్‌ను మారుస్తూ వచ్చాయి. మనసులోని కోరిక బలవత్తరమవుతూ వచ్చింది. (ఒక దశలో తనను కలిసిన పాత్రికేయ మిత్రులతో ``నేను బయటకు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందేమో.. ఈ పోలీసులకు జనాన్ని నియంత్రించటం కష్టమేమో'' అని కూడా ఆఫ్‌ది రికార్డుగా అన్నట్లు సమాచారం) ఇంకేం ధీమా పెరిగింది. ఇక వెనక్కి తగ్గే సమస్యే లేదన్నారు.. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం అయింది.సినిమాల్లో సర్వం తానే అయి నడిపించిన బావమరిది అల్లు అరవిందే రాజకీయ పార్టీ కీ శ్రీకారం చుట్టారు.. తము్మళు్ల నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌లు రంగంలోకి దిగారు... మొదట అభిమాన సంఘాలను చేరదీశారు.. ఇక నుంచి మీరు అభిమానులు కారు.. పార్టీ కార్యకర్తలన్నారు.. మీరే నాయకులన్నారు... వారు ఏమేం చేయాలో.. ఎలా వ్యవహరించాలో చెప్పారు.. అయితే చిరంజీవి పార్టీ అనౌన్‌‌స చేసే దాకా అంతా సీక్రేట్‌గా ఉంచాలని స్ట్రిక్‌‌టగా చెప్పుకొచ్చారు...వాళు్ల ఒకవేళ నోరు జారే ప్రమాదం ఉందన్న అనుమానంతో అన్ని వివరాలూ వారికీ తెలియనివ్వలేదు.. మరో పక్క కమూ్యనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వారసుడు డాక్టర్‌ మిత్రాను రాజకీయ సలహాదారుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సారథ్యంలో `వారధి' అన్న పేరుతో సదస్సులు నిర్వహించారు... మహిళలను సమీకరించి వారితో సమావేశాలు నిర్వహించారు. మరో పక్క అభిమాన సంఘాలు.. వారధి టీంలు కలిసి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాయి. పార్టీ పేరు ఏమిటి? జండా ఏమిటి? దానిపై ఉండాల్సిన గుర్తు ఏమిటి? దానికో గీతం ఎలా ఉండాలి? దాని మూ్యజిక్‌ ఎలా ఉండాలి? అన్న అంశాలపై రోజుల తరబడి చర్చలు జరిగాయి. చిరంజీవి, ఆయన సోదరులు, బావమరిది కోర్‌ కమిటీగా ఏర్పడి ఈ వ్యవహారాలన్నీ కార్పోరేట్‌ తరహాలో చక్కబెట్టారు. మల్టీ మీడియా ఎఫెక్‌‌ట్సతో పార్టీ జెండా, దాని పాట తయారైంది. తనకు మీడియా సలహాదారుగా ఓ పాత్రికేయుని తీసుకువచ్చి నియమించుకున్నారు. చివరి నిమిషం వరకు అంతా రహస్యంగానే జరుగుతూ వచ్చింది. ఆ నలుగురే అంతా చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో అత్యాధునిక వసతులతో పార్టీ కార్యాలయాన్నీ నిర్మించేశారు..ఇదీ రహస్యంగానే జరిగింది. ఆయన ప్రచారానికి ఉపయోగించే వాహనం రూపుదిద్దుకోవటాన్నీ రహస్యంగానే చేశారు.. అంతా రహస్యం... నిజానికి ఎప్పటికప్పుడు గుట్టు రట్టవుతున్నా... రహస్యమనే.. చెప్పుకున్నారు... ఇది అది కాదు.. అది ఇది కాదు.. అంటూ వచ్చారు... ఈ లోగా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల్లో ఒకరిద్దరు వూ్యహాత్మకంగా రాజీనామాలు చేశారు... చివరకు అసలైన రోజు రానే వచ్చింది. 2008 ఆగస్టు 17న చిరంజీవి తన కొత్త పార్టీ కార్యాలయంలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌, మదర్‌ థెరెస్సాల ఫోటోలు పెట్టుకున్నారు. అబ్దుల్‌ కలాంను స్ఫూర్తిగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు బలంగా తనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు కాబట్టే రాజకీయ ప్రవేశం చేస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. `సామాజిక న్యాయం' అన్న మాట ఆరోజు చిరంజీవి ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావనకు రాలేదు...అప్పటి పరిస్థితిలో చిరంజీవితో పొత్తు పెట్టుకోవటానికి వామపక్షాలు ఆసక్తి చూపాయి. అయితే ఆయన తన సిద్ధాంతం ఏమిటో చెప్తే కానీ, తాము ముందడుగు వేయలేమని చెప్పుకుంటూ వచ్చాయి. కానీ, చిరంజీవి నోటి వెంట కానీ, ఆయన కోటరీ నోటి వెంట కానీ ఎలాంటి సమాధానం రాలేదు.. వాళు్ల తమను ప్రశ్నించేదేమిటంటూ ఎదురుప్రశ్న వేశారు... చివరకు ఆగస్టు 26, 2008న పార్టీ ప్రకటన జరిగింది. జెండా ఆవిష్కారం. పాటలు అంతా ధూం ధాంగా నిర్వహించారు. తిరుపతి బహిరంగ సభలో దాదాపు పది లక్షల మంది సమక్షంలో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం ఆవిష్కృతమైంది. సామాజిక న్యాయం తమ సిద్ధాంతం అన్న మాట అప్పటికి కానీ వెలుగు చూడలేదు... తెల్లవారే సరికి ప్రజారాజ్యం అన్న పేరుతో మరొకరు పార్టీ నమోదు కోస ం ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసింది. పేరు ఆలోచిస్తున్న తరుణంలోనే ముందుగా విచారణ చేయకపోవటం ముందు చూపు లేని తనం, వూ్యహాత్మక లోపం బయటపడిన తొలి సందర్భం ఇది. అప్పటికి ఆ సమస్యను ఏదో విధంగా చక్క బెట్టుకున్నారు. కానీ, ఆ తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న లోపాలను సవరించుకుపోగా మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఒకరిద్దరు అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేస్తూ ముందుకు వెళూ్త పోయారు. తాను నిర్వహిస్తున్న సభలు, సమావేశాలకు, తన తము్మడు నిర్వహించిన ప్రచారానికి జనం తండోప తండాలుగా రావటంతో వారందరినీ తన ఓటర్లుగానే భావిస్తూ వచ్చారు. తానే తన పార్టీకి సింబల్‌ అన్నారు. తన పేరు చెప్తేనే చాలు.. ఓట్లు వాటంతటవే వచ్చేస్తాయన్నారు. సర్వేలు చేశామన్నారు. అభ్యర్థులు వచ్చి టిక్కెట్‌ అడిగితే పార్టీ ఫండ్‌ అడిగారు. పార్టీ నిర్వహణకు ఫండ్‌ తీసుకుంటే తప్పేమిటని మీడియాలో పిఆర్‌పి నేత ఒకరు బహిరంగంగానే సమర్థించుకొచ్చారు. అధినేతకు అన్నీ సవ్యంగా జరుగుతున్నట్లే చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముంచుకొచ్చిన తరువాత కూడా అధినేత అదే భ్రమలో ఉండిపోయారు. చివరకు ఎన్నికలు ముంచుకువచ్చిన తరువాత దిద్దుకోవటానికి సమయం చాలని పరిస్థితి నెలకొన్నాక చేసేదేమీ లేకుండా పోయింది. పర్యవసానం సాక్షాత్తూ తానే ఎన్నికల్లో ఓడిపోవటం. అదీ తన సొంత జిల్లాలో... రాష్ట్రంలో, ఒకప్పుడు దేశంలోనే అత్యధిక రెము్యనరేషన్‌ తీసుకున్న నటుడికి ఎదురవాల్సిన చేదు అనుభవం కాదు ఇది. *దీనికి కారణాలు అన్వేషిస్తే చిరంజీవి వేసిన ప్రతి అడుగూ తప్పేనని స్పష్టమవుతుంది.1. రాజకీయాల్లోకి వచ్చే ముందు నాటి ఎన్టీయార్‌తో తనను తాను పోల్చుకున్నారు. 1982లో ఎన్టీరామారావు పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆయన కంటే తక్కువ సమయంలో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి రికార్డు నెలకొల్పాలని చిరంజీవి భావించి ఉండవచ్చు. లేదా ఆయన అభిమానులు ఆయన్ను ఆ విధంగా భ్రమల్లో ముంచి ఉండవచ్చు. అందుకే రాజకీయాల్లోకి రావాలని ముందుగానే అనుకున్నా, పార్టీ ప్రకటన ఆలస్యంగా చేశారు. అందుకనే సమయం చాలలేదు.... ఎన్టీరామారావు కంటే తనకు పాపులారిటీ ఎక్కువగా ఉందని చిరంజీవి అనుకున్నారు. వాస్తవానికి ఎన్టీరామారావుకు వయోభేదం లేకుండా పిల్లవాళ్ల దగ్గరి నుంచి ముదుసలి ఒగ్గు వరకు అంతా అభిమానులే. నాడు ఎన్టీయార్‌ రైతులకు రైతు, కార్మికులకు కార్మికుడు.. రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు... సమాజ సేవకుడు, కథా నాయకుడు.. ఇలా అనేక పాత్రల ద్వారా ప్రజల్లో వారి సమస్యలను పరిష్కరించే వేషధారణల్లో రాష్ట్ర మంతటికీ సుపరిచితమైన వ్యక్తి. చిరంజీవి మెగాస్టార్‌. 30 ఏళ్ల సినీజీవితంలో ఆయన అభిమానుల్లో ఎక్కువగా మాస్‌ ప్రేక్షకులే ఉన్నారు. వీరిలో పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువ. వీరిలోనూ యువతను ఎక్కువగా చిరంజీవి ఆకర్షించారు. అంటే 35 ఏళ్ల లోపు వారిలో ఎక్కువగా చిరంజీవి అభిమానులు ఉన్నారు. అందులో చిన్న పిల్లలకు చిరంజీవి అంటే యమ క్రేజీ. ఇందులో సందేహం లేదు. అయితే వీరంతా ఓటర్లు కారు. వీరిని ఓటర్లుగా నమోదు చేయించటం కోసమే వారధి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. యువకులంతా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రచారం చేసింది. అభిమానుల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. అనుకున్నట్లుగానే యువతీయువకులు ఎక్కువ మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లలో ఎక్కువ మంది ఓటు వేయటానికి విముఖత చూపిస్తారన్న గత అనుభవాలను కాదని, అదృష్టవశాత్తూ ఈసారి ఓట్ల శాతం గతంలో కంటే బాగానే పెరిగినా, ఆ ఓట్లు చిరంజీవికి ట్రాన్‌‌సఫర్‌ కాలేదు. ఇక సినిమాల్లో సమాజంతో మమేకమైన పాత్రలు వేసిన సందర్భాలు వేళ్ల పైన లెక్కించదగినవి మాత్రమే ఉన్నాయి .అవీ సినిమాల నుంచి రిటైర్‌ అవటానికి ముందు తీసిన ఒకటి రెండిటిని మాత్రమే చెప్పుకోవచ్చు. అందువల్ల ఎన్టీయార్‌కు, చిరంజీవికి హస్తిమశకాంతరం ఉన్నది. ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి కాలానికి అధికార కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత గూడుకట్టుకుని ఉంది. ప్రత్యామ్నాయం కోసం జనం ఆవురావురుమని ఎదురు చూస్తున్న సందర్భం అది. అప్పటికి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏర్పడి రెండు సంవత్సరాలు కావొస్తోంది. అయినా సంస్థాగతంగా అది దక్షిణ భారత దేశంలో పెద్దగా నిలదొక్కుకోలేదు. రాష్ట్రంలో వెంకయ్య నాయుడు పార్టీ విస్తరణకు కొంత ప్రయత్నం చేస్తున్నా, అంతగా ఫలించలేదు. అదే సమయంలో ఎన్టీయార్‌ పార్టీని ప్రకటించారు. ఆయనకు ఈనాడు పత్రిక అండదండలు పుష్కలంగా అందాయి. యాంటీ కాంగ్రెస్‌ ప్రచారాన్ని ఈనాడు కంకణం కట్టుకుని నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ జెండా, దాని రూపు రేఖలు ఈనాడు కార్యాలయంలోనే రూపుదిద్దుకున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసే నేతలకు ఈనాడులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రసంగ పాఠాలు రాసిచ్చారు. కాంగ్రెస్‌ను ఓడించాలంటూ ఏకపక్ష అజెండాతో నాడు ఈనాడు (ఈనాటికీ) పని చేసింది. సంపాదకీయాలు రాసింది. మరో పక్క వామపక్ష పార్టీలు పరోక్షంగా ఎన్టీయార్‌కు అన్ని విధాలా సహకరిస్తూ వచ్చాయి. ఎన్టీయార్‌ సభలకు జనసమీకరణ కూడా చేసాయి. తొమ్మిది నెలల పాటు ఎన్టీయార్‌ ఒక కార్మికుడి వేషం వేసుకుని రాష్ట్రం నలు చెరుగులా కలియతిరిగారు. రోడ్డు మీద తిన్నారు.. రోడ్డు మీద పడుకున్నారు.. అక్కడే స్నానం చేశారు.. వీటన్నింటికీ ఈనాడు ప్రచారం కల్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే యాంటీ ఇంకంబన్సీతో పాటు అన్ని రకాలుగా కలిసివచ్చింది కాబట్టే నాడు ఎన్టీయార్‌ గెలువగలిగారు. 1982 నాటి రాజకీయ వాతావరణాన్ని గురించి చిరంజీవి పూర్తిగా అధ్యయనం చేయలేదు. 1982 నాటికి, ఇప్పటికీ ఉన్న రాజకీయ వాతావరణంలో ఎంత మాత్రం పోలిక లేదు. ఆనాటి రాజకీయ క్రియాశూన్యత ఇవాళ రాష్ట్రంలో లేదు. ఇవాళ రాజకీయ క్రియాశీలతే ఎక్కువగా ఉంది. నాడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదు.. ఈనాడు తెలుగుదేశం బలమైన పార్టీ ఉంది. దీనికి తోడు అత్యంత క్రియాశీలంగా పనిచేస్తున్న శక్తిమంతమైన మీడియా ఉంది. రెండు రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న రాజకీయ నేతలు అనామకులు కాదు.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో మదపుటేనుగుల వంటి వారు. మదించిన ఏనుగులను ఎదుర్కోవటం అంటే మృగరాజుకైనా అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. కుంభస్థలాన్ని బద్దలు కొట్టినప్పుడే ఏనుగు నిస్తేజమవుతుంది. ఇందుకు సింహమైనా సరే ఒడుపుగా ఏనుగుపైకి ఎక్కి కుంభస్థల భేదన చేయాల్సి ఉంటుంది. ఈ మౌలిక సూత్రాన్ని చిరంజీవి అసలు పట్టించుకునే లేదు. వైఎస్‌ఆర్‌, చంద్రబాబుల రాజనీతిజ్ఞతను ఆయన చాలా చాలా తక్కువ అంచనా వేశారు. తన రంగప్రవేశంతో రాజకీయ ముఖచిత్రం అంతా తనతోనే నిండిపోతుందని ఆశించారు. మితిమీరిన ఆ ఆత్మవిశ్వాసం.. ఆయన్ను అప్పుడే ఓటమి పాలు చేసింది. వైఎస్‌ను గద్దె దింపటానికి చంద్రబాబు నాయుడే మూడు పార్టీలను కలుపుకుని కూటమిని ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. ఎందుకంటే వైఎస్‌ తన అయిదేళ్ల పదవీ కాలంలో తనదైన ఓటు బ్యాంకును సంక్షేమ పథకాల ద్వారా నిర్మించుకున్నారు. ఇందిరమ్మ ఇళు్ల కానీ, పెన్షన్లు కానీ, రాజీవ్‌ స్వగృహ కానీ, పావలా వడ్డీలు కానీ, రుణాల మాఫీ కానీ.. ఆరోగ్యశ్రీలు, 108, 104 సర్వీసులు.. జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల ద్వారా బలమైన ఓటుబ్యాంకును వైఎస్‌ సమీకరించుకున్నారు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ముపై్ఫ ఏళ్ల నిరీక్షణ ద్వారా తాను సాధించుకున్న అధికారాన్ని కాపాడుకోవటానికి వైఎస్‌కు ప్రజల సంక్షేమ పథకాలే మార్గమయ్యాయి. వీటిని ఎదుర్కోవటానికి వీటన్నింటినీ మించిన పథకాలను చంద్రబాబు నగదు బదిలీ వంటి వాటి రూపంలో ప్రకటించాల్సి వచ్చింది. అయినా ఆయన లక్ష్యం సాధించలేకపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో వీరిద్దరూ ఒకరిని మించిన వారు ఇంకొకరు. తమ పార్టీలో తమకు పోటీయే లేకుండా చేసుకున్న నేతలు. జాతీయ స్థాయి రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సమర్థులు ఈ ఇద్దరు నాయకులు. ఆధిపత్యం కోసం ఇంత హోరాహోరీగా ఇద్దరి మధ్య సాగుతున్న పోరులో మధ్యలో ప్రవేశించాలనుకునే వ్యక్తి తానెంత బలంగా రావాలి? ఎన్ని అస్త్ర శసా్తల్రను పట్టుకుని యుద్ధరంగంలోకి దిగాలి? కానీ చిరంజీవి చేతిలో ప్రత్యర్థులపై సంధించటానికి ఒక్కటంటే ఒక్క అస్త్రమైనా లేకుండా పోయింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు స్పష్టత లేదు. మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. కానీ, తాను తీసుకురాదలిచిన మార్పు ఏమిటన్నది ఆయనకే తెలియదు. రెండవది పాజిటివ్‌ రాజకీయాలు చేస్తానన్నారు. ఎవరినీ నిందించేది లేదన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి నిందారోపణలతోనే అంతా గడిచిపోయింది. ఆగస్టు 26 వచ్చేసరికి వివిధ రంగాలను ఎంపిక చేసుకుని వాటిపై తన అభిప్రాయాలేమిటో చెప్పుకొచ్చారు. అంతిమంగా తమ పార్టీ విధానం `సామాజిక న్యాయం' అని తేల్చారు. ఇక ఈ సామాజిక న్యాయం అంటే ఏమిటి? చిరంజీవి పార్టీ పెట్టడానికి ముందే ఆయన పార్టీ ఒక కులానికి మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ కమ్మ వర్గానికి, కాంగ్రెస్‌ పార్టీ రెడ్డి వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోందని, కాపులకు ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేదు కాబట్టి ఆ వర్గానికి మేలు చేసేందుకే చిరంజీవి పార్టీ పెడుతున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని గురించి చిరంజీవికి తెలియకుండా ఉండదు. కానీ, చిరంజీవి మాత్రం ఈ ప్రచారాన్ని సమర్థించలేదు..సరికదా ఖండిచనూ లేదు.. చివరకు ప్రజారాజ్యం పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగా సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళు్తన్నప్పుడు నష్టనివారణ చర్యలు తీసుకోవలసిన ప్రజారాజ్యం అధినాయకత్వం కిమ్మనకుండా కూర్చుంది. సామాజిక న్యాయం అంటే తన సామాజిక వర్గానికి న్యాయం చేయటమే కావచ్చన్న సందేహాలు కూడా కలిగాయి. ఫలితం.. మొన్నటి ఎన్నికల రిజల్‌‌ట్స. ఎన్నికల్లో కులం కార్డు పని చేయదని మరోసారి ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ప్రజల్లో కులం స్పృహ ఉంది కానీ, ఎన్నికల్లో కేవలం తమ కులం వాడు కాబట్టి అభ్యర్థి ఎలాంటి వాడైనా సరే ఓట్లేయాలన్న ఆలోచన ఓటర్లకు లేదు. ఓటర్లు చాలా తెలివైన వారు. కాబట్టే విస్పష్టమైన తీర్పు చెప్పారు. ప్రజారాజ్యం తరపున మిగతా పార్టీల కంటే కొద్దిగా ఎక్కువ సీట్లు బిసిలకు కేటాయించారు తప్ప, వాటికంటే ఈ పార్టీ భిన్నంగా వ్యవహరించింది ఏమీ లేదు. ప్రజారాజ్యం తరపున ఎన్నికైన 18 మందిలో తొమ్మిది మంది చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన కాపు వర్గీయులే ఉన్నారు. కానీ, అదే సమయంలో ఓడిపోయిన వారిలో అదే వర్గానికి చెందిన వారు అంతకంటే మూడు రెట్లు ఉన్నారు. తెలుగుదేశం కాంగ్రెస్‌ నాయకులపై ఆయా కులాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వుండవచ్చు. కానీ, ఆ పార్టీలు అంతకు మించిన రాజకీయ సమీకరణాలు సామాజికంగా అవలంబిస్తున్నవి. కానీ, ప్రజారాజ్యం పార్టీ ప్రారంభం నుంచి కులం ముద్ర బలంగా వేసుకుని మరీ ముందుకు వచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు (చిరంజీవితో సహా) తమ కులానికి సంబంధించిన ఓట్లు సాలిడ్‌గా, గంపగుత్తగా పిఆర్‌పికి బదిలీ అవుతాయని బలంగా విశ్వసించారు. ఇంకా చెప్పాలంటే గుడ్డిగా విశ్వసించారు. పిఆర్‌పిని సమర్థించిన వాళు్ల, చిరంజీవి అధికారంలోకి రావాలని కోరుకున్న వారు, విశ్లేషకులు సైతం ఇదే భ్రమలో ఉన్నారు. కులం స్పృహ రాష్ట్ర ప్రజల్లో మునుపెన్నడూ లేని విధంగా వచ్చిందని, ఏ కులం వాళు్ల ఆ కులానికి ఓట్లేస్తారని బలంగా ప్రచారం చేశారు. ఒక నియోజక వర్గంలో ఒక కులం వాళ్లే ముగ్గురు పోటీ లో ఉంటే కులం అభ్యర్థి కంటే కులం పార్టీకే ఓట్లు పడతాయని కూడా బల్లగుద్ది వాదించారు. చిరంజీవి దగ్గరకు వచ్చి ఆయన చెవుల్లో ఇదే అంశాన్ని ఊదరగొట్టి మరీ వచ్చారు. కులం స్పృహ ఉండటం వేరు.. ఓటేయటం వేరు.. కులం ఫ్యాక్టర్‌ పనిచేసేది కొంత శాతం మాత్రమే. అది కూడా చాలా తక్కువ శాతం పని చేస్తుంది. ఎన్నికల్లో ఓటు వేసే దగ్గరకు వచ్చేసరికి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వంపై అనుకూలతలు, వ్యతిరేకతలు... అభ్యర్థి వ్యక్తిత్వం, ఆర్థిక, హార్థిక, అంగ బలాబలాలు, గుణగణాలు, అభివృద్ధి, స్థానిక అంశాలు, సమస్యలు, ఓటరు వ్యక్తిగత లాభనష్టాలు, తరువాత పార్టీ అధినేతపై విశ్వసనీయత, ఆయన చేసే వాగ్దానాలపై నమ్మకం ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి. చివరకు ప్రలోభాలు చూపే ప్రభావమూ కొంత ఉంటుంది. ఒక అభ్యర్థి గెలుస్తారా లేదా అని సర్వే చేసేందుకు ఈ అంశాలన్నీ పరిగణించాల్సి ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ కూడా సర్వేలు చేసింది(ట) లెక్కలు కట్టుకుంది(అరవింద్‌ చెప్పారు) ఆ లెక్కలు, సర్వేల ప్రకారమే గెలిచే గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చామన్నారు. తీరా చూస్తే సాక్షాత్తూ అరవిందే ఓడిపోయారు. అధినేతకే సురక్షిత నియోజకవర్గాన్ని ఎంపిక చేయలేని దురదృష్టకరమైన స్థితిలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నదంటే, ఆ పార్టీ లెక్కలు ఎంత తప్పుడు లెక్కలో విడమర్చి చెప్పనవసరం లేదు.ఇక ప్రచారం విషయానికి వస్తే.. చిరంజీవి మంచి ప్రసంగ కర్త కాదు.. ఆయన సినిమాల్లో గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలరేమో కానీ, వాస్తవ ప్రపంచంలో అనర్గళంగా మాట్లాడలేరు. తన మాటలతో, చేతలతో ప్రజలను ఉత్తేజితులను చేయగలిగే సమ్మోహన శక్తి చిరంజీవికి లేదు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 1400 కిలోమీటర్లు కాలినడకన నడిచి, ప్రజలతో మమేకమయ్యారు. నారా చంద్రబాబు నాయుడు మీకోసం యాత్రతో రాషా్టన్న్రి రెండుసార్లు చుట్టి వచ్చారు. కె.చంద్రశేఖర్‌ రావు తన ప్రసంగాలతోనే తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోగలిగారు. చివరకు ప్రజారాజ్యంలో విలీనమైన నవతెలంగాణ పార్టీ నేత దేవేందర్‌ గౌడ్‌ కూడా పాదయాత్ర నిర్వహించి తన సామర్థా్యన్ని నిరూపించుకున్నారు. చిరంజీవి మాత్రం ముచ్చటగా మూడు రోజులు తిరిగే సరికి గొంతు పడిపోయింది. అర్ధంతరంగా తొలి విడత పర్యటనను ముగించుకుని వెనక్కి వచ్చారు. అప్పటి నుంచి ఆయన గొంతు మంద్ర స్థాయి నుంచి ఎప్పుడూ పెరగలేదు. ప్రజల్లో ఎమోషన్‌ను ఆయన క్రియేట్‌ చేయలేకపోయారు. ఆయన ప్రసంగాలన్నీ చప్పగా సాగిపోయాయి. ఆయన రాష్టమ్రంతటా తిరగలేదు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. 18 డిగ్రీల ఏసి వాతావరణం నుంచి బయటపడి ఎండల్లో తిరగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారు. ఆ కష్టం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ఆయనకు తోడుగా రంగంలోకి దిగిన ఆయన కుటుంబ సభ్యులకైతే ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ఓనమాలు కూడా తెలియవు.కనీసం చేస్తున్న ప్రచారం అయినా వూ్యహాత్మకంగా చేశారా అంటే అదీ లేదు. ఓ వైపు తొలి దశ ఎన్నికల కోసం తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మిగతా పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తుంటే చిరంజీవి మాత్రం రెండో దశ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తూ పోయారు. ఇక నేడో, రేపో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచారం చేశారు .నల్గొండ జిల్లా భువనగిరిలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ బహిరంగ సభను కాంగ్రెస్‌ నిర్వహిస్తుంటే, అదే జిల్లాలో మరో ప్రాంతంలో చిరంజీవి ప్రచార సభ ఏర్పాటు చేయటం ఏ విధంగా వూ్యహాత్మకమో ఆ పార్టీ నేతలకే తెలియాలి. ఇక అభ్యర్థుల ఎంపిక కూడా గుడ్డిగా జరిగింది. ఎవరు పార్టీ ఫండ్‌ ఇచ్చారో.. మరో రకంగా ప్రభావితం చేశారో వారికి అడిగిన చోట అడిగినట్లుగా టిక్కెట్లు ఇచ్చారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో ముందుగా అనుకున్న వారిని మరో స్థానానికి మార్చేశారు కూడా. రాజంపేట నుంచి పోటీ చేద్దామనుకున్న సి.రామచంద్రయ్యను తీసుకువచ్చి మచిలీపట్నం నుంచి బరిలోకి దింపటం ఇందుకు ఒక ఉదాహరణ. కనీసం పొత్తుల విషయంలోనైనా సరిగా వ్యవహరించారా అంటే అదీ లేదు. మొదట్లో కమూ్యనిస్టులు చిరంజీవితో పొత్తుకు సరేనందామనుకున్నారు. ఆయన సిద్ధాంతం ఏమిటో తెలిస్తే పొత్తు పెట్టుకుందామనుకున్నారు. కానీ, చిరంజీవి కానీ, ఇతర వందిమాగధ బృందం కానీ, తమ బలాన్ని, బలగాల్ని మితిమీరి అంచనా వేశాయి. అన్ని పార్టీలు తమ దగ్గరకు వచ్చి బతిమాలాలే తప్ప, తాము ఎవరి దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదన్నట్లుగా వ్యవహరించాయి. చివరకు దేవేందర్‌, జ్ఞానేశ్వర్‌ తప్ప ఎవరూ చిరంజీవి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. అన్నింటికంటే మించి పార్టీ నిర్మాణంలో చిరంజీవి దారుణంగా విఫలమయ్యారు. ఆయన పార్టీ ఏర్పాటుకు ముందు తన రాజకీయ సలహాదారుగా డాక్టర్‌ మిత్రాను నియమించుకున్నారు. ఆయన దివంగత కమూ్యనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య మనుమడు. ఆయన చిరంజీవి తోనే రాష్ట్ర రాజకీయాలకు పరిచయమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల పట్ల ఆయన ఎంతవరకు అధ్యయనం చేశారు? ఎంతవరకు అవగాహన ఉంది? వైఎస్‌, చంద్రబాబు లాంటి దిగ్గజాల ఎత్తులకు పై ఎత్తులు వేయగల సామర్థ్యం ఎంత ఉంది అంటే సంతృప్తి కరమైన జవాబు దొరకడం కష్టమేనేమో.. ఇక పార్టీ అదికార ప్రతినిధుల్లో మరొకరుగా పరకాల ప్రభాకర్‌ను నియమించారు. రాజకీయాల్లో పెద్దగా సక్సెస్‌ కాని వ్యక్తి ఆయన. ఈనాడు టెలివిజన్‌లో ప్రతిధ్వని కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ మాజీ బిజెపి ప్రతినిధి చాలా ఏళ్ల తరువాత పిఆర్‌పిలో చేరితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని ఆశించారో చిరంజీవికే తెలియాలి. ప్రభాకర్‌ తనతో పాటు కొందరు బిజెపి కార్యకర్తలను, చోటామోటా నాయకులను పిఆర్‌పి వైపు తీసుకువచ్చారే తప్ప, ఆయన వల్ల పార్టీకి ఒక మంచి ప్రవక్త దొరికాడే కానీ, ఇతరత్రా ప్రయోజనం ఏమీ కలుగలేదు. కొంతకాలం తరువాత ఆయనే వీరికి శత్రువయ్యాడనుకొండి... అది వేరే సంగతి...ఇక ప్రజారాజ్యం ఏర్పాటు చేయడంతోనే అందులో చేరిన కొందరు నాయకులు...చేగొండి హరిరామజోగయ్య, భూమా నాగిరెడ్డి దంపతులు, తమ్మినేని సీతారాం, పి.శివశంకర్‌, పర్వతనేని ఉపేంద్ర, సి.రామచంద్రయ్య వంటివారు... మరికొందరు...వీరిలో జోగయ్య, శివశంకర్‌, ఉపేంద్ర వంటి వారు వృద్ధ నాయకులు.. ఇప్పటి రాజకీయాలకు ఒక విధంగా ఔట్‌ డేటెడ్‌ రాజకీయ నేతలు. భూమా దంపతులు, తమ్మినేని సీతారాం వంటి వారు గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వారు. వీరిలో భూమా దంపతులకు తప్ప మిగతా నేతలు ఎవరూ కనీసం తాము సొంతంగా నిలబడి నాలుగు ఓట్లు సంపాదించే శక్తి ఉన్నవారు కారు. ఇలాంటి వాళ్లను చుట్టూ పెట్టుకుని చంద్రబాబు, వైఎస్‌ లను ఎలా ఎదుర్కోగలనని చిరంజీవి భావించారో ఆయనకే తెలియాలి. మొదటి నుంచి అభిమానులకు కీలక భూమికను కట్టబెడతామన్న చిరంజీవి, ఆ పనిని వేళ్లపై లెక్కించదగిన ప్రాంతాల్లోనే చేశారు. చాలా ప్రాంతాల్లో అభిమానుల ఆగ్రహం అభ్యర్థుల ఎంపిక సమయంలో, పార్టీ పదవుల పంపకం సమయంలో బయటపడటం బహిరంగ రహస్యమే. ఇలా లోతుగా విశ్లేషిస్తూ పోతే లోటుపాటులు ఎన్నో బయటపడతాయి. ఇప్పటికి చిరంజీవి గెలిచిన 18 స్థానాలు కేవలం ఆయనపై అభిమానంతో వచ్చిన సీట్లే కానీ, ఆయన అజెండాకు, పార్టీకి పడినవి మాత్రం కావు. తమ పరాజయానికి, ఇతరుల విజయానికి గల కారణాలను, అభిమాన, అహంభావాలకు అతీతంగా కోటరీని పక్కన పెట్టి పరిశీలన చేసుకోవటం చిరంజీవికి అత్యవసరం. గ్లామర్‌ మాయ పొరలను చీల్చుకుని బయటకు వచ్చి నిష్కర్షగా తన పనితీరును బేరీజు వేసుకోవాలి. ముందుగా పార్టీని పటిష్ఠంగా నిర్మాణం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలి. గ్రామీణ స్థాయి నుంచి కేడర్‌ను అంచెలంచెలుగా నిర్మించుకుంటూ రావాలి. ప్రజలు, వారి సమస్యలను కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా అర్థం చేసుకుని పట్టించుకుని వాటి పరిష్కారం కోసం తనకున్న 18 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రయత్నించాలి. అయిదేళు్ల చిరంజీవికి పరిపూర్ణ రాజకీయ నాయకుడుగా ఎదిగేందుకు మంచి అవకాశం. ఈ కాలంలో పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికలు వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే గ్రౌండ్‌లెవల్‌లో పునాదులు గట్టి పడతాయి. లేకపోతే చిరంజీవి కలల సౌధం కూకటి వేళ్లతో కూలిపోవటానికి ఎంతో కాలం పట్టదు.

10, మే 2009, ఆదివారం

సమరం రచనలు విశృంఖల శృంగారాన్ని ప్రోత్సహిస్తున్నాయా?

లైంగిక విజ్ఞానం శాస్త్రీయమా కాదా అన్న విషయంపై మరోసారి వివాదం ప్రారంభమైంది. లైంగిక విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన వైద్యుల్లో డాక్టర్‌ సమరం అగ్రగణ్యుడు... తెలుగునాట మధ్యతరగతి కుటుంబాల్లో లైంగిక విజ్ఞానాన్ని గురించి సంప్రదాయ సంకెళ్లను ఛేదించి కొద్దో గొప్పో మాట్లాడుకోగలుగుతున్నారంటే... అందులో సమరం పాత్ర కీలకమైంది. ఆయన వైద్య విధానాన్ని, కౌన్సిలింగ్‌లపై చాలా వివాదాలు వచ్చాయి. ఆయనపై కోర్టులో వ్యాజ్యాలు కూడా జరిగాయి. ఏ ఒక్క కేసు కూడా ఆయనకు వ్యతిరేకంగా నిలవలేదు... సంవత్సరాల తరబడి ప్రజల సమస్యలకు పత్రికల ద్వారా, మ్యాగజైన్ల ద్వారా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు.....ఇప్పుడు ఆయన రచనలపైన, కౌన్సిలింగ్‌ విధానాలపైనా దుమారం రేగుతోంది. మానసిక విజ్ఞానం పేరుతో ఆయన ప్రచారం చేస్తున్నదంతా బూతు పురాణమని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సమరంపై అశ్లీల ప్రతిఘటన వేదిక యుద్ధం ప్రకటించింది. ఈదర గోపీచంద్‌ అనే రిటైర్‌‌డ ఎల్‌ఐసి ఉద్యోగి ఇరవై ఏళ్లుగా ఈ సంస్థను నడుపుతున్నారు.. సమరంపై యుద్ధం పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేయటంతో వివాదం మొదలైంది. గోపీచంద్‌ గతంలో కొన్ని పుస్తకాలు రచించారు. అశ్లీలానికి వ్యతిరేకంగా కూడా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు... సమరం రచనల వల్ల పసి పిల్లలు చెడిపోతున్నారని ఈయన వాదన.. సమరం పుస్తకాలను నిషేధించి, సమాజానికి అన్యాయం చేస్తున్న ఆయన్ను అరెస్టు చేయాలని గోపీచంద్‌ డిమాండ్‌ చేస్తున్నారు. సమరంకు వ్యతిరేకంగా గతంలో కూడా ఉద్యమించారు. సదస్సులు నిర్వహించారు. ఫాంటసీ పేరుతో సమరం బూతు కథలను ప్రచారంలోకి తెస్తున్నారని గోపీచంద్‌ వాదన. సంస్కార వంతమైన సమాజంలో ఎప్పుడు ఎలాంటివి బోధించాలో.. అప్పుడే చెప్పాలనీ, కానీ, సమరం బట్టబయలు చేశారని ఆరోపిస్తున్నారు..
సమరం ఈ వాదనల్ని కొట్టి పారేస్తున్నారు. సనాతన వాదులు చేస్తున్న వితండ వాదంగా ఆయన చెప్తున్నారు... మూఢ నమ్మకాల నుంచి బయటపడాలని ఆయన చెప్తున్నారు. పిల్లలకు లైంగిక విద్యను చూపించకూడదనుకుంటే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, అంతే కానీ, యువతకు అత్యంత అవసరమైన లైంగిక విజ్ఞానాన్ని అందించడం తప్పనిసరి అని సమరం అంటున్నారు....
లైంగిక విద్యపై, విజ్ఞానంపై దేశంలో మొదట్నుంచీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది సైన్‌‌స అని కొందరు.. అసభ్యమని మరికొందరి మధ్య నలుగుతోంది. సంప్రదాయం, ఆచారాల నడుమ సెక్‌‌స గురించి మాట్లాడటం మన దేశంలో తక్కువే.. అయితే దేవాలయాలపైన శృంగార శిల్పాలు, సెక్‌‌స భంగిమలు,, వాత్సా్యయనుడు కామసూత్రాలను రచించటం మన దేశంలోనే జరిగిందంటే పూర్వకాలంలో ఈ విధమైన నిర్బంధాలు లేకపోవచ్చు. లేదా జీవితంలో అభిన్న అంగంగా దీన్ని భావించి ఉండవచ్చు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో లైంగిక విద్యను బోధించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. తీవ్రంగా నిరసనలు వ్యక్తం కావటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
హేతువాదులు కూడా గోపీచంద్‌ వాదనను కొట్టిపారేస్తున్నారు. సమరాన్ని విమర్శించేముందు అశ్లీలతకు అసలైన అర్థం ఏమిటో చెప్పమంటున్నారు. అసభ్యత లేనంతవరకు ఏదీ అశ్లీలం అనిపించుకోదని హేతువాదుల అభిప్రాయం....మన దేశం ఉన్నతమైన సంస్కారాన్ని సమాజానికి అందించింది. ప్రజలు ఎప్పుడు ఏది తెలుసుకోవాలో అప్పుడు ఆ విజ్ఞానాన్ని అందిస్తూ వచ్చింది. దీనివల్లే మన దేశం ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా పరిఢవిల్లింది. పరిమితులు లేకుండా పిల్లలను పెంచటం వల్ల వాళు్ల ఎంతగా చెడిపోతున్నదీ మనకు తెలియంది కాదు.. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మృగ్యమైనాయి. జ్ఞానం ఎంతగా కావాలో అంతే అందివ్వాలి. కొంచెం తెలివికి, అతి తెలివికీ ఉన్న తేడాను పెద్దలు గమనించాలి.. స్వేచ్ఛ విశృంఖలమైవ ఎంతో ప్రమాదకరం. అలా అని మానసిక విజ్ఞానం అవసరానికి తగ్గట్టుగా అందకపోతే అదీ సమస్యే. సెక్‌‌సకు సంబంధించి కేవలం సమరం పుస్తకాల వల్లనే అంతా రట్టయిపోతుందనుకుంటే పొరపాటే... ఇంటర్‌నెట్‌లు వచ్చాయి. సినిమాలు పిచ్చెక్కిస్తున్నాయి. అలాంటప్పుడు కేవలం సమరంను నిందించి మాత్రం ప్రయోజనం ఏమిటి? అందుకే దేనై్ననా గుడ్డిగా సమర్థించటం కానీ, వ్యతిరేకించటం కానీ తగని పని. గోపీచంద్‌ సమరం చేసినట్లయితే, లైంగిక విజ్ఞానం పేరుతో పెచ్చరిల్లుతున్న శృంగారంపై యుద్ధం చేయాలి... ఇందుకు ఉపకరిస్తున్న అన్ని రంగాలపైనా పోరాడాలి. అంతే కానీ, కేవలం ఒక వ్యక్తిని మాత్రమే బోనులో నిలబెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? అందులో డాక్టర్‌ సమరం చేస్తున్న కౌన్సిలింగ్‌ను కానీ, రచనలను కానీ, ఏకపక్షంగా ఆయన్ను నిందించటం సరికాదు...

7, మే 2009, గురువారం

ఫలితాల తర్వాత పిఆర్‌పీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారా?

ఫలితాల తరువాత హంగ్‌ అసెంబ్లీ ఏర్పడవచ్చనే అనుమానాలు అన్ని పార్టీల్లో బలపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా దానిలో పిఆర్‌పి కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.. అయితే ఫలితాల తరువాత పిఆర్‌పి ఎటువైపు మొగ్గు చూపుతుంది? అధికార ప్రస్థానంలో సీఎం సీటును సాధిస్తుందా? ఒకవేళ పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాకపోతే.. ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటి? ఎన్నికల సంఘం దగ్గర కేవలం రిజిష్టర్‌ అయిన పార్టీ పిఆర్‌పి ఎమ్మెల్యేలకు ఫిరాయింపు నిరోధ చట్టం వర్తిస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది. 2004 తరువాత టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చీల్చి మొన్న మొన్నటి వరకు పెండింగ్‌లో పెట్టినట్లే ఈ సారి కూడా అలాగే చేసే అవకాశం ఉందా?
వాస్తవానికి పిఆర్‌పికి ఫిరాయింపుల నిరోధ చట్టం వర్తిస్తుంది. 2003 ఫిరాయింపుల నిరోధ చట్టంలో చేసిన సవరణ ప్రకారం ఎన్నికల ద్వారా చట్టసభలో ప్రవేశించిన ప్రతి ఒక్క సభ్యుడికి ఫిరాయింపు చట్టం వర్తిస్తుంది. స్వతంత్ర సభ్యుడు సైతం ఒక పార్టీలో చేరేటట్లయితే, అతను సభ్యత్వాన్ని కోల్పోతాడు.. కాబట్టి పిఆర్‌పి సభ్యులకు కూడా చట్టం వర్తిస్తుంది. ఫలితాల తరువాత పిఆర్‌పికి ఆరుశాతం ఓట్లు పోలయితే ఎన్నికల సంఘం సహజంగానే ప్రాంతీయ పార్టీగా గుర్తింపునిస్తుంది. ఆ తరువాత విప్‌ కూడా వర్తిస్తుంది. మూడింట రెండొంతులు చీలితేనే పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది. మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన మరుసటి సంవత్సరం 1948 నుంచే పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు(ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి), పట్టంతానుపిళై్ల(ట్రావన్‌కోర్‌ ముఖ్యమంత్రి).. తొలి ఫిరాయింపు దారుల్లో ఒకరు...ఢిల్లీ మొదలుకుని గ్రామ పంచాయితీల దాకా అడ్డగోలుగా, యథేచ్చగా ఫిరాయింపులు జరిగాయి.
ఫిరాయింపుల చట్టం ఉండాలంటూ 1968లో తొలుత ప్రతిపాదించింది తెలుగువాడైన పెండేకంటి వెంకటసుబ్బయ్య...ఆ తరువాత అప్పటి హోం మంత్రి వైబి చవాన్‌ కమిటీ ఇందుకు అనుకూలంగా నివేదికƒ సమర్పించింది. 1978లో మురార్జీ దేశాయ్‌ టైమ్‌లో ఫిరాయింపుల నిరోధ బిల్లును సభ తిరస్కరించింది. 1985లో రాజీవ్‌ గాంధీ హయాంలో బిల్లు ఆమోదం పొందింది....చట్టంలోని లొసుగులు ఫిరాయింపులను నిరోధించలేకపోయాయి. 2003లో చట్టాన్ని మళ్లీ సవరించారు....వన్‌ థర్‌‌డ అన్న నిబంధనను తొలగించారు.. అయితే ఫిరాయింపులపై అంతిమ నిర్ణయం తీసుకోవలసింది స్పీకరే.. స్పీకర్‌ నిర్ణయాన్ని సభ్యుడు కోర్టులో సవాలు చేయవచ్చు. అయితే కోర్టు ఆ అప్పీలును విచారించి తన అభిప్రాయాన్ని చెప్తుందే కానీ, తిరిగి అంతిమ నిర్ణయం కోసం తిరిగి స్పీకర్‌ కోర్టులోకే బంతిని నెడుతుంది. మొత్తం మీద శాసన సభకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అన్నీ సభ పరిధిలోనే జరగాలని సుప్రీం కోర్టు గతంలోనే పలు సందర్భాల్లో స్పష్టం చేసింది కూడా....రాష్ట్రంలో గత అసెంబ్లీలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి వ్యవహరించిన తీరు తిరుగుబాటు ఎమ్మెల్యేలను కాపాడిన వైనం పునరావృతం అయితే ఎమ్మెల్యేలు ఫిరాయించినా ఒరిగేదేం ఉండదు... చిరంజీవి మద్దతు కోసం ముందుకు రాకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ శిబిరంలోకి లాక్కోవటానికి ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఎర వేస్తున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీల నుంచి చివరి నిమిషంలో పిఆర్‌పిలోకి దూకి టిక్కెట్లు సంపాదించుకున్న వారు గెలిచిన తరువాత సొంతగూటికి వెళ్లే అవకాశం ఉన్నట్లు పిఆర్‌పి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అదే జరిగితే పిఆర్‌పి బలహీనపడే అవకాశం ఉంది..పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి వూ్యహాత్మకంగా తప్పటడుగులు వేస్తూ వచ్చిన పిఆర్‌పి అధిష్ఠానం... ఫలితాల తరువాత జాగ్రత్త పడకపోతే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుంది. పిఆర్‌పి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది....సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది... ఎంపి సీట్లు ఎక్కువగా వస్తే దాన్ని ఎరగా చూపి రాష్ట్రంలో బేరం ఆడాలని పిఆర్‌పి ప్రయత్నిస్తోంది... అధికారంలోకి వచ్చేటట్లయితే తొలి డిమాండ్‌ చిరంజీవికి సీయం సీటు ఇవ్వాలన్నదే.... ఒకవేళ అధికారాన్ని పంచుకోవలసి వచ్చినా అందుకు పిఆర్‌పి సుముఖంగానే ఉంది. అలాంటి పరిస్థితే ఉత్పన్నమవుతే సిఎంగా తొలిచాన్‌‌స తమకే ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేయాలని భావిస్తోంది...కనీసం తొలి అర్థభాగం అయినా చిరంజీవి ముఖ్యమంత్రి అయితే ఆ తరువాత చక్రం తిప్పవచ్చని పిఆర్‌పి భావన... మొత్తం మీద ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వకపోతే.. రాష్ట్రంలో సంకీర్ణ రాజకీయాలకు మెగా పార్టీ కేంద్రబిందువు అవుతుందనటంలో సందేహం లేదు....మరి చిరంజీవి గెలిచే తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటారా లేదా అన్నది చూడాలి....

6, మే 2009, బుధవారం

స్తంభించిన పరిపాలన - విహార యాత్రల్లో నేతలు

రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే తరువాత అధికారం తమదేనని అధికారపక్షం, ప్రతిపక్షాలు ఊహాలోకాల్లో విహరిస్తూ ప్రజల బాగోగులను పట్టించుకోవటం మానేశాయి. పరిపాలన సజావుగా సాగించాల్సిన పాలక వర్గం, అధికార యంత్రాంగం తమ బాధ్యతను పక్కనపెట్టాయి. ముఖ్యమంత్రి సిమ్లాలో సేదతీరటానికి విహారయాత్రకు వెళ్లారు... మంత్రులు తమ తమ స్థాయిల్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు... ఇక అధికార యంత్రాంగం పరిస్థితి సరే సరి....స్రజలకు కావలసిన మౌలిక అంశాల విషయంలో ఎవరికీ పట్టింపు లేదు....ప్రతి పక్ష నేత చంద్రబాబు విదేశాల్లో ఆరామ్‌గా ఉన్నారు.. అక్కడి నుంచే పార్టీనీ, రాషా్టన్న్రి గమనిస్తున్నారు... రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల పట్ల ఆవేదననూ అక్కడి నుంచే వ్యక్తం చేస్తున్నారు..కరెంటు కోత దారుణంగా పెరిగిపోయింది. రాష్ట్ర మంతటా నిప్పుల కుంపటిలా మండిపోతుంటే గంటల తరబడి కరెంటు కోత ప్రజలను అల్లలాడిస్తోంది. తాగునీరు సరిగా రాక, మురికినీళు్ల కాలువల్లోంచి ఉప్పొంగిపోయి, నల్లా నీళ్లల్లో కలిసిపోతున్నాయి. దీని పర్యవసానం అంటువ్యాధులు ప్రబలటం... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌ ప్రాంతంలో డయేరియా ప్రబలి నలుగురు చనిపోయారు... వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. గాంధీ ఆసుపత్రి అంతా రోగులతో నిండిపోయింది. చేతులు కాలాక చేసేదేమీ లేకపోయినా, రాజకీయ నాయకుల పరామర్శలు... ప్రజల నిరసనలు యథావిధిగా జరిగిపోయాయి.....ఓ వైపు ప్రచండ భానుప్రతాపం పంటపొలాలను సైతం ఎండగడుతోంది. పొలాలకు సాగునీరు అందించటంలో అధికార యంత్రాంగం ప్రదర్శించిన అలసత్వానికి దాదాపు రెండు వందల ఎకరాల్లో పంట నాశనమైపోయింది. నీళ్లివ్వమని అడిగితే పలికే నాథుడే ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించటం లేదు. ఇక గిట్టుబాటు ధర ఎలాగూ రాదనుకున్న రైతులు 30 ఎకరాల్లో తమ పంటను తామే తగులబెట్టుకున్నారు... నిత్యావసర వస్తువుల ధరలు సైతం అనూహ్యంగా పెరిగిపోయాయి. బియ్యం ధర 35 రూపాయలకు చేరుకుంది. చెక్కెర, నూనె, ఇతర వస్తువులన్నింటి ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. వీళ్లను నియంత్రించే బాధ్యత ఉన్న మంత్రులు ఎన్నికలు అయిపోయాయని ఆరామ్‌ తీసుకుంటున్నారు....అక్రమార్కుల భరతం పడతామని మాత్రం ఆర్థిక మంత్రి రోశయ్య అప్పుడప్పుడూ మీడియాలో ప్రకటిస్తున్నారు...ముఖ్యమంత్రి వైఎస్‌ సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారు.. మున్సిపల్‌ మంత్రి కోనేరు రంగారావు తనకు టికెట్‌ ఇవ్వలేదు కాబట్టి ఎలాగూ తనకు తిరిగి మంత్రి అయ్యే చాన్‌‌స లేదు కాబట్టి ముందే మంత్రిపదవి పగ్గాలు వదిలేసినట్టున్నారు....ఇక మిగిలిన మంత్రుల పరిస్థితీ అంతే....అంతా జరిగాక ముఖ్యమంత్రి సిమ్లా నుంచి సమీక్షా సమావేశాలు.. మంత్రులకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు..వెంటనే నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు...అధికారులూ పొలోమంటూ అంటురోగాలు ప్రబలిన ప్రాంతాల్లో చెకప్‌ల కోసం పర్యటనలూ ప్రారంభించారు... ముందే జాగ్రత్త పడి ఉంటే ఆ నాలుగు ప్రాణాలు కూడా కాపాడగలిగే వారు.. కానీ, మన వాళ్లకు ఏదో జరిగిన తరువాత కానీ, చలించే తత్త్వం లేదు.. ఇక పరిపాలన మాత్రం ఏం చక్కగా సాగుతుంది?మన నాయకులకు ఫలితాల తరువాత తాము చేపట్టబోయే అధికారం గురించిన యావ తప్ప, ప్రజలు ప్రస్తుతం పడుతున్న బాధల గురించిన పట్టింపు లేదు.. ఇప్పుడే వీరు ఇట్లా ఉంటే రేపు ఫలితాల తరువాత ఎలా ఉంటారో ఊహించనవసరం లేదు...

1, మే 2009, శుక్రవారం

బ్యూరోక్రసీలో చీడపురుగుల్ని ఏరివేయటం ఏసిబికి తేలిక కాదు

అవినీతి... ఇది ఈ దేశంలో ఒక అభిన్న అంగంగా మారిపోయింది. అటెండర్‌ దగ్గరి నుంచి ఉన్నత అధికారి దాకా అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో, అన్ని ప్రదేశాల్లో సర్వాంతర్యామిగా మారిపోయింది. శరీరంలో రక్తం మాదిరిగా కలిసిపోయింది. అవినీతిని లీగల్‌గా అంగీకరించే పరిస్థితి ఉత్పన్నమైంది. అన్ని కార్యాలయాల్లో, అన్ని సర్వీసులకూ ఎంతో కొంత అధికారుల చేతులు తడపందే పని కాదు... ఎంతో కొంత ఇచ్చి తమ పని కానిచ్చేసుకోవటమూ జనానికి అలవాటైంది. కానిస్టేబుల్‌ దగ్గర నుంచి కలెక్టర్‌ దాకా ఎవరి స్థాయిలో వారు, వారి వారి హోదాలకు తగ్గట్లుగా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు... అక్రమార్జన చేస్తూనే ఉన్నారు... చివరకు దేవుడి గుళ్లలో తీర్థం పెట్టే అర్చకుడు... శఠగోపం పెట్టే పూజారి... ప్రసాదం ఇచ్చే అయ్యవారు.. ఇలా అందరూ చేతులు జాచేవారే తయారయ్యారు... భక్తి కోసం, ప్రశాంతత కోసం గుడికి వచ్చే భక్తులు అక్కడ ప్రశాంతత పొందడం దేవుడెరుగు... నిలువు దోపిడీకి గురవుతున్నారు...అంతా కమర్షియల్‌... కాంక్రీటు గోడల మధ్య జీవితాలు... మనుషుల మనసులను కూడా కాంక్రీటుగా మార్చేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయటానికి, అధికారంలో ఉన్న పార్టీలను నిందించటానికి అవినీతి అన్నది రాజకీయ పార్టీలకు, నేతలకు బ్రహ్మాస్త్రం లాంటిది....అంతకు మించి అవినీతిని గురించి ప్రభుత్వాలు పట్టించుకునేది లేదు... ప్రభుత్వాలు పట్టించుకునేది అంతకంటే లేదు.. పాలకులకు ఆ అవసరమే లేదు... పార్టీల నిఘంటువుల్లో ఆ పదమే మచ్చుకు కూడా కనిపించదు... అన్నింటికంటే ప్రజలే ఈ విషయాన్ని పట్టించుకోవటం మానేశారు.. అవినీతి నిర్మూలన కోసం `అవినీతి నిరోధక శాఖ' పేరుతో ఓ సంస్థ ఉంది. అవినీతి వ్యవహారాలపై నిఘా ఉంచటానికి సెంట్రల్‌ విజిలెన్‌‌స కమిషన్‌ అన్నదీ ఉంది. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవకతవకలు.. అడ్డగోలు ఖర్చులు, దుబారా వ్యవహారాలను బయట పెట్టడానికి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వ్యవస్థా ఒకటి ఉంది. సివిసి అవినీతి పరుల చిట్టా బయటపెడుతుంది. కాగ్‌ ఏటా నివేదికలు వెలువరిస్తుంది. ఇక ఎసిబి ఫిర్యాదులు అందటంతోనే సదరు అధికారులపై దాడులను నిర్వహిస్తుంది. అక్రమార్జనను సీజ్‌ చేస్తుంది. కేసులు నమోదు చేస్తుంది. సివిసి సిఫార్సులను ఎవరు చూడను కూడా చూడరు.. కాగ్‌ నివేదికను సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి డస్‌‌టబిన్‌లో పడేస్తుంది. ఇక ఎసిబి నమోదు చేసిన కేసుల్లో ఎన్ని రుజువయ్యాయి? ఎందరికి శిక్ష పడిందంటే చెప్పటానికి ఒక్క కేసు కూడా కనిపించదు.. ఏఇలు, డిఇల స్థాయిని మించి ఐఏఎస్‌లు, ఐపిఎస్‌ల వంక కన్నెత్తి చూసే సాహసం అయినా ఏసిబి చేయలేదు... ప్రభుత్వంలో ఐఏఎస్‌, ఐపిఎస్‌ల లాబీయింగ్‌ సామాన్యమైంది కాదు... ఉన్నతాధికారుల అవినీతి ప్రస్తావన వచ్చినంతనే... వారిపై దాడులు చేయటానికైనా, విచారించటానికైనా ముఖ్యమంత్రి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ ప్రభుత్వం చేత పదిహేనేళ్ల క్రితమే ఓ మెమోను జారీ చేయించుకోగల సమర్థులు వాళు్ల... కేవలం ఈ ఒక్క మెమో(నెంబర్‌404) గత ఒకటిన్నర దశాబ్దంగా దాదాపు 200 మంది ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లపై ఆరోపణలు వచ్చినా ఏసిబి చేతులు ముడుచుకునేట్లు చేసింది. వీరిని విచారించటానికి అనుమతించాలంటూ ప్రభుత్వానికి ఏసిబి వారు పెట్టుకున్న దరఖాస్తులు లక్షలాది పెండింగ్‌ ఫైళ్ల మధ్య బూజు పట్టిపోయాయో, చెదలు పట్టి పోయాయో తెలియదు... 2009, ఏప్రిల్‌లో రాష్ట్ర హైకోర్టు సదరు మెమో చెల్లదని, ఎవరినైనా ఏసిబి నేరుగా విచారించవచ్చంటూ తీర్పు చెప్పింది...ఈ తీర్పుతో ఏసిబి రెచ్చిపోతుందని, అక్రమార్కులైన ఉన్నతాధికారుల భరతం పడుతుందని అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు... ప్రభుత్వంలో బ్యూరోక్రసీ బలం ముందు రాజకీయుల బలం తక్కువే... తిమ్మిని బమ్మిని చేయగల బ్యూరోక్రసీలో చీడపురుగుల్ని ఏరివేయటం ఏసిబికి అంత తేలిక కాదు.. పైగా దానికి ఉన్న పరిమిత అధికారాలతో ఆ సంస్థ పెద్దగా ఒరగపెట్టేది కూడా ఏమీ లేదు...ఇది మనదేశం, దీని అభివృద్ధి మనందరి బాధ్యత.. ఇందుకోసం మన వంతు ప్రయత్నం మనం చేయాలి అన్న స్పృహ ఎవరికీ లేనప్పుడు అవినీతి నిర్మూలన అన్నది అందని ద్రాక్షే... శాసన వ్యవస్థలో భాగస్థులు కావటానికి, ఎమ్మెల్యేలు, ఎంపిలుగా ఎన్నిక కావటానికి పార్టీల దగ్గర కోట్లు పోసి టిక్కెట్లు కొనుక్కున్న ప్రతినిధులు అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవ చేస్తారంటే, మార్పు తీసుకువస్తామంటే నమ్మేదెవరు? అందుకే పలు చోట్ల ఓటరు కూడా ఓటును గిట్టుబాటైన ధరకు అము్మకుంటున్నాడు.. ఇలాంటి వాతావరణంలో దేశం, జాతి, సమాజం, అభివృద్ధి అన్నది ఎవరికి కావాలి?