ఫలితాల తరువాత హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చనే అనుమానాలు అన్ని పార్టీల్లో బలపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా దానిలో పిఆర్‌పి కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.. అయితే ఫలితాల తరువాత పిఆర్‌పి ఎటువైపు మొగ్గు చూపుతుంది? అధికార ప్రస్థానంలో సీఎం సీటును సాధిస్తుందా? ఒకవేళ పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాకపోతే.. ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటి? ఎన్నికల సంఘం దగ్గర కేవలం రిజిష్టర్ అయిన పార్టీ పిఆర్‌పి ఎమ్మెల్యేలకు ఫిరాయింపు నిరోధ చట్టం వర్తిస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది. 2004 తరువాత టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి మొన్న మొన్నటి వరకు పెండింగ్‌లో పెట్టినట్లే ఈ సారి కూడా అలాగే చేసే అవకాశం ఉందా?
వాస్తవానికి పిఆర్‌పికి ఫిరాయింపుల నిరోధ చట్టం వర్తిస్తుంది. 2003 ఫిరాయింపుల నిరోధ చట్టంలో చేసిన సవరణ ప్రకారం ఎన్నికల ద్వారా చట్టసభలో ప్రవేశించిన ప్రతి ఒక్క సభ్యుడికి ఫిరాయింపు చట్టం వర్తిస్తుంది. స్వతంత్ర సభ్యుడు సైతం ఒక పార్టీలో చేరేటట్లయితే, అతను సభ్యత్వాన్ని కోల్పోతాడు.. కాబట్టి పిఆర్‌పి సభ్యులకు కూడా చట్టం వర్తిస్తుంది. ఫలితాల తరువాత పిఆర్‌పికి ఆరుశాతం ఓట్లు పోలయితే ఎన్నికల సంఘం సహజంగానే ప్రాంతీయ పార్టీగా గుర్తింపునిస్తుంది. ఆ తరువాత విప్ కూడా వర్తిస్తుంది. మూడింట రెండొంతులు చీలితేనే పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది. మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన మరుసటి సంవత్సరం 1948 నుంచే పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు(ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి), పట్టంతానుపిళై్ల(ట్రావన్‌కోర్ ముఖ్యమంత్రి).. తొలి ఫిరాయింపు దారుల్లో ఒకరు...ఢిల్లీ మొదలుకుని గ్రామ పంచాయితీల దాకా అడ్డగోలుగా, యథేచ్చగా ఫిరాయింపులు జరిగాయి.
ఫిరాయింపుల చట్టం ఉండాలంటూ 1968లో తొలుత ప్రతిపాదించింది తెలుగువాడైన పెండేకంటి వెంకటసుబ్బయ్య...ఆ తరువాత అప్పటి హోం మంత్రి వైబి చవాన్ కమిటీ ఇందుకు అనుకూలంగా నివేదిక సమర్పించింది. 1978లో మురార్జీ దేశాయ్ టైమ్‌లో ఫిరాయింపుల నిరోధ బిల్లును సభ తిరస్కరించింది. 1985లో రాజీవ్ గాంధీ హయాంలో బిల్లు ఆమోదం పొందింది....చట్టంలోని లొసుగులు ఫిరాయింపులను నిరోధించలేకపోయాయి. 2003లో చట్టాన్ని మళ్లీ సవరించారు....వన్ థర్‌డ అన్న నిబంధనను తొలగించారు.. అయితే ఫిరాయింపులపై అంతిమ నిర్ణయం తీసుకోవలసింది స్పీకరే.. స్పీకర్ నిర్ణయాన్ని సభ్యుడు కోర్టులో సవాలు చేయవచ్చు. అయితే కోర్టు ఆ అప్పీలును విచారించి తన అభిప్రాయాన్ని చెప్తుందే కానీ, తిరిగి అంతిమ నిర్ణయం కోసం తిరిగి స్పీకర్ కోర్టులోకే బంతిని నెడుతుంది. మొత్తం మీద శాసన సభకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అన్నీ సభ పరిధిలోనే జరగాలని సుప్రీం కోర్టు గతంలోనే పలు సందర్భాల్లో స్పష్టం చేసింది కూడా....రాష్ట్రంలో గత అసెంబ్లీలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ సురేశ్ రెడ్డి వ్యవహరించిన తీరు తిరుగుబాటు ఎమ్మెల్యేలను కాపాడిన వైనం పునరావృతం అయితే ఎమ్మెల్యేలు ఫిరాయించినా ఒరిగేదేం ఉండదు... చిరంజీవి మద్దతు కోసం ముందుకు రాకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ శిబిరంలోకి లాక్కోవటానికి ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఎర వేస్తున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీల నుంచి చివరి నిమిషంలో పిఆర్‌పిలోకి దూకి టిక్కెట్లు సంపాదించుకున్న వారు గెలిచిన తరువాత సొంతగూటికి వెళ్లే అవకాశం ఉన్నట్లు పిఆర్‌పి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అదే జరిగితే పిఆర్‌పి బలహీనపడే అవకాశం ఉంది..పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి వూ్యహాత్మకంగా తప్పటడుగులు వేస్తూ వచ్చిన పిఆర్‌పి అధిష్ఠానం... ఫలితాల తరువాత జాగ్రత్త పడకపోతే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుంది. పిఆర్‌పి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది....సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది... ఎంపి సీట్లు ఎక్కువగా వస్తే దాన్ని ఎరగా చూపి రాష్ట్రంలో బేరం ఆడాలని పిఆర్‌పి ప్రయత్నిస్తోంది... అధికారంలోకి వచ్చేటట్లయితే తొలి డిమాండ్ చిరంజీవికి సీయం సీటు ఇవ్వాలన్నదే.... ఒకవేళ అధికారాన్ని పంచుకోవలసి వచ్చినా అందుకు పిఆర్‌పి సుముఖంగానే ఉంది. అలాంటి పరిస్థితే ఉత్పన్నమవుతే సిఎంగా తొలిచాన్‌స తమకే ఇవ్వాలని కూడా డిమాండ్ చేయాలని భావిస్తోంది...కనీసం తొలి అర్థభాగం అయినా చిరంజీవి ముఖ్యమంత్రి అయితే ఆ తరువాత చక్రం తిప్పవచ్చని పిఆర్‌పి భావన... మొత్తం మీద ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వకపోతే.. రాష్ట్రంలో సంకీర్ణ రాజకీయాలకు మెగా పార్టీ కేంద్రబిందువు అవుతుందనటంలో సందేహం లేదు....మరి చిరంజీవి గెలిచే తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటారా లేదా అన్నది చూడాలి....
7, మే 2009, గురువారం
ఫలితాల తర్వాత పిఆర్‌పీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి