29, నవంబర్ 2014, శనివారం

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించారు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని ఆశిస్తున్నా. సభలో  శ్రీ కే వీ రమణ, మన కాలపు మార్గదర్శక పాత్రికేయులు శ్రీ రామచంద్రమూర్తి , శ్రీ శైలేష్ రెడ్డి, శ్రీ దేవులపల్లి అమర్, శ్రీ దిలీప్ రెడ్డి, ఉన్నారు.

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ | Studio N

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించరు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని ఆశిస్తున్నా

12, నవంబర్ 2014, బుధవారం

దేవరహస్యం తొలి కాపీ

పుస్తకం రాయడం ఒక ఎత్తు. ప్రచురణ కావడం ఒక ఎత్తు. అచ్చయిన తొలి పుస్తకాన్ని కౌగిట్లోకి తీసుకోవడం.. రచయితకు అతి అందమైన అనుభవం. తొలి కాపీని అదే సందర్భంలో.. అదే ఆనంద క్షణాల్లో.. రచయిత చేతుల మీదుగా పాఠకులు అందుకోవడం మరింత అరుదైన దృశ్యం. ఈ ఆనందమయ క్షణాలన్నీ.. నా కంటిముందు చకచకా జరిగిపోవడం.. నాకు కలిగిన యోగం.
తొలికాపీ అందుకోవడంకోసం శంషాబాద్ నుంచి రెక్కలు కట్టుకొని వచ్చిన అను చిరు గారికి, ఆ అరుదైన క్షణం నాదేనన్నట్టు నారపల్లినుంచి విచ్చేసిన Kovela Santoshkumar గారికి.. మరీ మరీ ధన్యవాదాలు.
—వాసిరెడ్డి వేణుగోపాల్ - వాసిరెడ్డి ప్రచురణలు

కినిగే లో ‘దేవ రహస్యం’.

ఇలాంటి పుస్తకం తెలుగులో ఇదే మొదటిసారి...
విశ్వంలో తొలి సర్జన్ ఎవరు?
 మహాభారత యుద్ధంలో భారీ పేలుళ్లు జరిగాయా?
 కైలాసంలో శివుడున్నాడా?
రామబాణంలో న్యూక్లియర్ పవర్ వుందా?
దేవతల కాలమానానికి, మన కాలమానానికి తేడా ఏమిటి?
 నాటి పుష్పక విమానమే.. ఇవాల్టి ఎగిరే పళ్లెమా?
శ్రీకృష్ణుడు నిజమా? అబద్ధమా?
శివుడికి కైలాసాలు ఎన్ని వున్నాయి?
కురుక్షేత్రంలో రేడియేషన్ ఆనవాళ్లు ఎక్కడివి?
 భూతాలకూ లిపి వుందా? బ్రహ్మాస్త్రం అణ్వస్త్రమేనా?
ఇలాంటి అనేకానేక సందేహాలకు సమాధానం ఇచ్చే పుస్తకం.. సీనియర్ జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్ రాసిన ‘దేవ రహస్యం’.
కినిగే లో చూడండి .. కొనండి