28, డిసెంబర్ 2023, గురువారం

సృజనస్వరం- బొందల నాగేశ్వరరావు ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ #కవిత #కథల...



స్వాధ్యాయ చానల్ అందిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం సృజనస్వరం.. ప్రఖ్యాత భారతీయ సాహిత్యవేత్త, చారిత్రక నవలా సమ్రాట్టు.. కథారచయిత.. శ్రీ కస్తూరి మురళీకృష్ణ.. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలతో వారి సృజనాత్మక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంపై ప్రత్యేకంగాచేసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రముఖ కథా, నాటక రచయిత బొందల నాగేశ్వరరావు అంతరంగం మీకోసం.. ఇది స్వాధ్యాయ సమర్పణ. తప్పక వినండి.

27, డిసెంబర్ 2023, బుధవారం

krishnaghattam movie riview: కృష్ణఘట్టం సినిమా సమీక్ష

6 healthy rice varieties: జస్ట్ ఈ రకాల బియ్యం తినండి.. ఇక హాస్పిటల్ ఖర్...


6 healthy rice varieties: జస్ట్ ఈ రకాల బియ్యం తినండి.. ఇక హాస్పిటల్ ఖర్చు జీరోయే.. అవును.. కొన్ని రకాల బియ్యం. రోజుకోరకం.. ఒక పూట తింటే చాలు.. మీరు హాస్పిటల్ కు పోయే అవసరమే ఉండదు. అన్ని జబ్బులకూ మనం తినే తిండి.. జీవన శైలే కారణాలు.. వీటిని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉన్నది. ఒక్కసారి ఈ రైతు మాటల్ని వినండి.. మిమ్మల్ని మీరు మార్చుకొండి.. పది మందిని మార్చండి.

cotton famer msp: పత్తి.. రైతుకు పుత్తడా? పచ్చడా?

cotton famer msp: పత్తి.. రైతుకు పుత్తడా? పచ్చడా?


మార్కెట్లలోకి పత్తి పోటెత్తుతున్నది. దేశంలోనే అత్యధికంగా పత్తి పండించిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నిరుడు పత్తి లాభదాయకం కాలేదు. ఈ సారైనా పత్తి.. రైతు ఇండ్లల్లో పుత్తడి కురిపిస్తుందా? పచ్చడి మెతుకులే మిగులుస్తుందా? ఖర్చు, దిగుబడి కూలీలు పోనూ రైతుకు మిగిలేదెంత? తగిలేదెంత? పత్తి రైతుల మాటల్లోనే వినండి..

unforgettable history distortion: ఖాసిం గొప్పవాడు.. రాజా దాహిరే దుర్మార్...



సామ్రాజ్యవాద దమనకాండలో ముఖ్యమైన పని.. ప్రజలు చెప్పినట్టు వినేలా.. లొంగిపోయి ఉండేలా చేసుకోవడం. అప్పుడే తాము అనుకొన్నది సులువుగా సాధించుకోవచ్చు. అది క్రిస్టియానిటీ అయినా.. ఇస్లామీకరణ అయినా.. లక్షణం ఒక్కటే. మహమ్మద్‌ బిన్‌ ఖాసిం చేసిన పని కూడా అదే. అతి దారుణంగా ఊచకోత కోయడం, వేలమందిని బానిసలుగా తరలించడం ద్వారా ముందుగా సమాజంలో అంతులేని భయాన్ని కల్పించడం. మతం మారితే తప్ప ప్రాణాలకు రక్షణ ఉండదనే దశకు మొత్తం సమాజాన్ని తీసుకొని రావడం. మతం మారిన తరువాత పూర్వపు మతంతో కానీ, మతావలంబులతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా చూడటం.. దీంతో అంతకు ముందున్న వాళ్ల దేవుడు వాళ్లకు కాకుండా పోతాడు. కొత్త దేవుడు పుట్టుకొస్తాడు. అతను అక్కడెక్కడో.. మక్కాలోనో.. జెరూసలేంలోనో ఉంటాడు. తమ ఆస్తి తమది కాదు. తమ సంపద తమది కాదు. తమ గుడులను తామే కూలగొడతారు. తామే మసీదులు నిర్మిస్తారు. సంపత్తినంతా తామే దోచి పెడతారు. దోపిడి దొంగలకు ఇంతకంటే సులువైన మార్గం ఏముంటుంది? kovela santosh kumar, vibhajana vishavruksham

24, డిసెంబర్ 2023, ఆదివారం

nehru policy on Tibet: నాకేం తెలియదు.. చైనా ఇలా చేస్తుందనుకోలేదు. #nehru...


nehru policy on Tibet: నాకేం తెలియదు.. చైనా ఇలా చేస్తుందనుకోలేదు. హిందీ చీనీ భాయీ భాయీ అని మొత్తుకొన్నాను కదా.. అయినా వినలేదు.. ఆ పాపం నాది కాదు.. రామం భజే శ్యామలం 12 

22, డిసెంబర్ 2023, శుక్రవారం

we have 40,000 varieties: దేశంలో వడ్ల రకాలు 40,000, మిగిలినవి 10 వేలు. ...



we have 40,000 varieties: భారతదేశంలో ఒకనాడు ఎన్ని రకాల వడ్లు పండించే వారో మీకు తెలుసా? దాదాపు 40 వేల రకాలు. మీరు విన్నది నిజమే అక్షరాలా 40 వేల రకాలు. కాలానుగుణంగా పోయినవి పోగా.. దాదాపు పదివేల రకాల వడ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు 1500 రకాల వడ్లు మనుగడలోనే ఉన్నాయి. అక్కడి ప్రజలు అత్యధికశాతం కుండల్లోనే ఈ నాటు రకాలను వండుకొని తింటారు. ఏయే రకాలు తింటే.. ఏ జబ్బులు పోతాయో తరువాతి భాగంలో తెలుసుకొందాం.. please share, subscribe, like it.

gujarat travelvlog: కంకారియా లేక్ చూసొద్దాం రండి.. పాణ్యం దత్తశర్మ గుజరా...

19, డిసెంబర్ 2023, మంగళవారం

destruction of indian culture: మనం పోగొట్టుకొన్నాం.. వాళ్లు ధ్వంసం చేశార...



destruction of indian culture: మనం పోగొట్టుకొన్నాం.. వాళ్లు ధ్వంసం చేశారు తక్షశిల మనది.. తక్షకుడు పాకిస్తాన్.. చరిత్ర మనది.. దేశం వాళ్లది.. సంస్కృతి మనది.. సర్వనాశనం చేయడం వాళ్లది.. మనకు కావలసిన మన చరిత్ర మనదగ్గర లేదు. మన నాగరికత, సంస్కృతి పాకిస్తాన్ కు అక్కర లేదు. ఉన్నదాన్ని పోగొట్టుకోవడం మన నైజం.. పాతర పెట్టడం పాకిస్తాన్ కు అవసరం. #partitionofindia #విభజన విషవృక్షం #దేశ విభజన విషవృక్షం 5 వ ప్రసంగం

18, డిసెంబర్ 2023, సోమవారం

sonia contesting from telangana: నాడు ఇందిర.. నేడు సోనియా #telanganacong...


sonia contesting from telangana: నాడు ఇందిర.. నేడు సోనియా

6guarantees: ఆరు.. కేసీఆర్ కు లక్కీ.. రేవంత్ కు తలనొప్పి..



6guarantees: ఆరు.. కేసీఆర్ కు లక్కీ.. రేవంత్ కు తలనొప్పి.. ఆరు గ్యారంటీలు ఆరు మంత్రి పదవులు ఆరు ఎమ్మెల్సీలు.. ఎలా చేస్తారు? ఎవరిని ఒప్పిస్తారు? ఎవరిని తప్పిస్తారు?

punjab agriculture: విరామ కాలంలోనూ ప్రత్యామ్నాయ పంటలు.. పంజాబ్ రైతులకే స...

16, డిసెంబర్ 2023, శనివారం

6 guarantees: అప్పుల బూచీ.. హామీలు గాలికి.. ? ఆరు గ్యారెంటీల మాటేమిటి? ...

6 guarantees: అప్పుల బూచీ.. హామీలు గాలికి.. ? ఆరు గ్యారెంటీల మాటేమిటి? ...

6 guarantees: అప్పుల బూచీ.. హామీలు గాలికి.. ? ఆరు గ్యారెంటీల మాటేమిటి?

astronauts or gods గరుడ, డ్రాగన్, బాంబర్ జెట్లుఒకటేనా, దేవతల వాహనాలపై ఆస...


astronauts or gods: గరుడ, డ్రాగన్, బాంబర్ జెట్లు ఒకటేనా? దేవతల వాహనాలపై ఆస్ట్రోనాట్ మేధావులేమంటున్నారు? పక్షులు, జంతువులు మనుషులను మోసుకుపోగలవా? దేవతల వాహనాల వెనుక రహస్యమేమిటి? ఇవాళ భారతీయ ఆధ్యాత్మిక ఫిలాసఫీయే విశ్వమంతా అంగీకరించాల్సిన పరిస్థితి. #secrets of gods

14, డిసెంబర్ 2023, గురువారం

13, డిసెంబర్ 2023, బుధవారం

defence system in ayodhya: రాముడి అయోధ్యలో డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉండేది?


అయోధ్య అంటే యుద్దం చేయడానికి శక్యం కానిది. నగరం తొమ్మిది వైపులా తొమ్మిది ద్వారాలున్నాయంట. అయోధ్య సరిహద్దు గోడపైన అన్ని వైపుల్లో.. అన్ని కోణాలు.. అన్ని దిక్కులను కవర్ చేసేలా వందల సంఖ్యలో శతఘ్నులు ఏర్పాటుచేశారు. చుట్టూ ఉన్నతమైన ప్రాకారం అయోధ్యకు వడ్డాణంలా ఉన్నదిట. నగరం చుట్టూ లోతుగా అగడ్త ఉన్నది. ఈ అగడ్త ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలతో నిండి ఉన్నది. ఈ అగడ్తను దాటి శత్రువు అనేవాడు ఎవరూ అయోధ్యలోకి ప్రవేశించలేరు. నగరంలో అస్త్రాలతోనూ.. అస్త్రాలు లేకుండా కూడా యుద్ధం చేయగల అసాధారణ వీరులున్నారు. నగరానికి బయటివైపు.. వర్తులాకారంగా దాదాపు 24 కిలోమీటర్లదాకా సెక్యూరిటీ వ్యవస్థను అత్యంత పటిష్ఠంగా ఏర్పాటు చేశారు. శత్రువు అనేవాడు ఇన్ని అంచెల రక్షణ వలయాలను దాటుకొని నగరంలోకి ప్రవేశించడం దుస్సాధ్యం.

12, డిసెంబర్ 2023, మంగళవారం

kcr request: నాకు మంచిగైనంక కలుస్తా.. ఇప్పుడు ఇళ్లకు వెళ్లిపొండి.. ప్రజల...



kcr request: నాకు మంచిగైనంక కలుస్తా.. ఇప్పుడు ఇళ్లకు వెళ్లిపొండి.. ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి

dhwajastambh: ధ్వజస్తంభాన్నిఎలా నిర్మిస్తారు? ఎంత వయసున్న ఏ కలపను వాడతార...


dhwajastambh: నారవేపి కలపతో ధ్వజస్తంభాన్నిఎలా నిర్మిస్తారు? 42 అడుగులు.. 70 ఏండ్ల వయసున్న ఏకాండం.. ఒక పరమాద్భుత నిర్మాణం.. ధ్వజస్తంభం తయారు చేస్తున్న తీరును కండ్లారా చూడండి.. రూపశిల్పుల మాటలు వినండి.

9, డిసెంబర్ 2023, శనివారం

muslims coined word hindu: హిందూ పదం పుట్టించిందెవరు? మూలమేమిటి? #partit...


ఒక్కటి సుస్పష్టం. మనది భారతవర్షం. ఆర్యావర్తం. జంబూద్వీపం. మనం భారతీయులం మాత్రమే. ఇక్కడ ఎవరి మతాలు వాళ్లకున్నాయి. శైవం ఒక మతం, వైష్ణవం ఒక మతం, శాక్తేయం ఒక మతం, బౌద్ధం ఒక మతం, జైనం ఒక మతం, సిక్కు ఒక మతం.. చివరకు చార్వాకం (నాస్తికత్వం) కూడా ఒక మతమే. అంతేకాదు. ఆది శంకరులకు షణ్మతస్థాపకులు అని పేరు. ఆ షణ్మతాలు ఆనాటికే ప్రసిద్ధిలో ఉన్నాయి. శైవము, వైష్ణవము, శాక్తము, సౌరము, కౌమారము, గాణాపత్యము. ఈ దేశంలో ప్రాథమికంగా ఉన్న మతాలు ఇవే. ఆ తరువాతే బౌద్ధం, జైనం వచ్చాయి. ఇంత ఫ్లెక్సిబులిటీ ఉన్న సాంఘిక ధార్మిక సమాజ జీవనంలో హిందూ అనే మాటకు అస్తిత్వం ఎక్కడున్నది? ఎవడో బయటినుంచి వచ్చి నోరు తిరక్క.. ఏదో ఒక నది కనిపిస్తే.. దాని పేరును జాతి నామవాచకంగా మార్చి పిలిస్తే.. దాన్ని మనం మతవాచకంగా మార్చుకొని జీవిస్తున్నామంటే.. ఇంతకంటే దురదృష్టం ఏమున్నది? విభజన విషవృక్షం 4 వ ప్రసంగం వినండి..

6, డిసెంబర్ 2023, బుధవారం

revanth first sign.. dsc: తొలి సంతకం ఉద్యోగాలకే.. మెగా డీఎస్సీ ప్రకటన



revanth first sign.. dsc: తొలి సంతకం ఉద్యోగాలకే.. మెగా డీఎస్సీ ప్రకటన.. జిల్లాలు, జోన్లు, శాఖల వారీగా కొత్త ప్రభుత్వం భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు జాబితా మొత్తం మీకోసం..

indian elections in pok soon: పీఓకేలో త్వరలోొ మన జెండా.. ఆ వెంటనే 24 సీట...


indian elections in pok soon: పీఓకేలో త్వరలోొ మన జెండా.. ఆ వెంటనే 24 సీట్లకు ఎన్నికలు..

5, డిసెంబర్ 2023, మంగళవారం

telangana power issue: పథకాలకు పైసలు కావాలె.. అదనపు ఆర్థిక వనరుల కోసం మో...



telangana power issue: పథకాలకు పైసలు కావాలె.. అదనపు ఆర్థిక వనరుల కోసం మోటర్లకు మీటర్లు పెట్టక తప్పదు

who will get rythubharosa:రైతు భరోసా ఎవరికి? యజమానులకా? కౌలు రైతులకా? కొ...


who will get rythubharosa:రైతు భరోసా ఎవరికి? యజమానులకా? కౌలు రైతులకా? కొత్త ప్రభుత్వం చేయబోయేదేమిటి?

history of lac.. nehru blunder: మరో వాస్తవాధీన రేఖ గీస్తున్నా.. చాలా బాధ...

swathitirunal kriti: స్వాతి తిరునాళ్ కీర్తన గోపాల కృష్ణ పాహిమాం: గాత్రం ...

29, నవంబర్ 2023, బుధవారం

25, నవంబర్ 2023, శనివారం

ghazwa e hind: గజ్వా ఏ హింద్.. హిందుస్తాన్ పై దాడులు ఎప్పుడు మొదలయ్యాయి....

ghazwa e hind: గజ్వా ఏ హింద్.. హిందుస్తాన్ పై దాడులు ఎప్పుడు మొదలయ్యాయి.. విభజన విషవృక్షం 2 వ భాగం.. 
 622లో ప్రవక్త సైన్యం గజ్వా ఏ బదర్‌ ద్వారా అరేబియాలోని మక్కాను స్వాధీనం చేసుకొన్నది. అప్పటినుంచి అరేబియా ఇస్లామీకరణ జరిగిపోయింది. ఎంతగా అంటే.. ఇస్లాం రావడానికి ముందు అరేబియాలో ఏ రకమైన సంప్రదాయ భావనలు ఉన్నాయి? ఏ రకమైన జీవన విధానం ఉన్నది.. అన్న విషయాలన్నీ మరచిపోయేంతగా.. ఒక రకంగా చెప్పాలంటే ఏ రకమైన ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాయి. ఇప్పుడు అరేబియన్ల చరిత్ర అంటే.. 610 సంవత్సరం నుంచే అని చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత పర్షియాది అదే పరిస్థితి.. 

rythubandhu politics: తెలంగాణలో రైతుబంధు రాజకీయం #congresstelangana #brs...

14, నవంబర్ 2023, మంగళవారం

AUDIO DEBATE: తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తున్నదా? లేక బీఆర్ఎస...



AUDIO DEBATE: తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తున్నదా? లేక బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా?

REVANTH ADVERSE COMMENTS HARMS FOR CONGRESS రేవంత్ కు రివర్స్.. కాంగ్రె...


REVANTH ADVERSE COMMENTS HARMS FOR CONGRESS రేవంత్ కు రివర్స్.. కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ కానుందా?

indian kings and administration: మౌర్యుల నుంచి బహుమనీల దాకా.. రాజ్య వ్యవ...


మౌర్యుల నుంచి బహుమనీల దాకా.. దాదాపు 14 రాజ్య వ్యవస్థలు.. వాటి పరిపాలన తీరు తెన్నులను మొట్ట మొదటి సారి సవివరంగా.. అన్ని అంశాలతో మీ ముందుంచుతున్నాం. ఇది బృహత్ప్రయత్నం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ రాజ్య వ్యవస్థలను.. పరిపాలన తీరు తెన్నులను పరిశీలిస్తే అనేక అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాజరికంలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అమలయిందో అర్థమవుతుంది. కేంద్రీకృత పాలన, వికేంద్రీకృత పరిపాలన వ్యవస్థలు కనిపిస్తాయి. అనేక రూపాల్లో సైనిక వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అధికారాల విభజన ఎట్లా ఉన్నదో స్పష్టంగానే తెలుస్తుంది. ప్రపంచంలోనే బృహత్తరమైన రాజ్యాంగాన్ని రచించిన నిర్మాతలకు సరిహద్దులకు ఆవల కనిపించిన మంచి, ప్రామాణిక అంశాలు.. అమలు చేయదగ్గ విషయాలు.. దేశంలో అంతర్గతంగా ఉన్న ఈ వ్యవస్థల్లో ఒక్కటి కూడా కనిపించలేదా? అని కూడాఅనిపిస్తుంది.

10, నవంబర్ 2023, శుక్రవారం

బీజేపీ ఓటు ఎవరికి లాభం? తెలంగాణలో ముఖాముఖి పోటీ ఎవరికి? #brs #bjptelanga...


బీజేపీ ఓటు ఎవరికి లాభం? తెలంగాణలో ముఖాముఖి పోటీ ఎవరికి? #brs #bjptelangana #congresstelangana

mim limited to old city: పాతబస్తీ దాటొద్దుః ఒవైసీకి హెచ్చరిక #aimim #con...

ద్విజావంతి రాగంః కర్ణాటకసంగీతంలో ద్విజావంతి రాగంపై శ్రీ రాళ్లపల్లి అనంతక...

8, నవంబర్ 2023, బుధవారం

బీఆర్ఎస్ కు అదేనా శాపం? #brs #congresstelangana #bjptelangana

తెలంగాణలో బీసీ కృష్ణుడు ఎవరు? #brs #bjptelangana #congresstelangana #ban...

పోతన భాగవతం: రుక్మిణీ కల్యాణం పద్యగానం శ్రీజువ్వాడి గౌతమరావు మలిభాగం #te...



పోతన భాగవతం: రుక్మిణీ కల్యాణం పద్యగానం శ్రీజువ్వాడి గౌతమరావు మలిభాగం #teluguliterature #telugu #కవిత

సుప్రసన్న లోతైన కవి.. ఎత్తైన విమర్శకుడు.. ఓరుగల్లు సాహితీ కీర్తి పతాకల అ...



సుప్రసన్న లోతైన కవి.. ఎత్తైన విమర్శకుడు.. ఓరుగల్లు సాహితీ కీర్తి పతాకల అవార్డుల కార్యక్రమంలో వక్తలు . 5-11-2023న వరంగల్లో జరిగిన ఓరుగల్లు సాహితీ కీర్తి పతాకల అవార్డుల కార్యక్రమం.

ఓరుగల్లు సాహితీ కీర్తి పతాకల అవార్డుల ప్రదానం.. వరంగల్లు.. 5-11-2023


ఓరుగల్లు సాహితీ కీర్తి పతాకల అవార్డుల ప్రదానం.. వరంగల్లు.. 5-11-2023 5-11-2023న వరంగల్లో జరిగిన ఓరుగల్లు సాహితీ కీర్తి పతాకల అవార్డుల కార్యక్రమం.

సుప్రసన్న ఒక విజ్ఞాన సర్వస్వం.. నాకు ప్రేరణ డాక్టర్ జీవీ రత్నం ప్రసంగం

సుప్రసన్న కవిత్వం.. మల్లావఝల నారాయణ శర్మ ప్రసంగం


సుప్రసన్న కవిత్వం.. మల్లావఝల నారాయణ శర్మ ప్రసంగం .. 5-12-2023న వరంగల్లో జరిగిన ఓరుగల్లు సాహితీ కీర్తి పతాకల అవార్డుల కార్యక్రమంలో మహాకవి సుప్రసన్న కవిత్వంపై శ్రీ మల్లావఝల నారాయణ శర్మగారి ప్రసంగం.

వరంగల్లులో సాహితీ బంధు బృందం ఎలా ఏర్పడింది? అది అచ్చు వేసిన పుస్తకాలేవి?...


వరంగల్లులో సాహితీ బంధు బృందం ఎలా ఏర్పడింది? అది అచ్చు వేసిన పుస్తకాలేవి? ప్రొ. బన్న ఐలయ్య విశ్లేషణ.. 5-12-2023న వరంగల్లో జరిగిన ఓరుగల్లు సాహితీ కీర్తి పతాకల అవార్డుల కార్యక్రమంలో బన్న ఐలయ్యగారి ప్రారంభోపన్యాసం

7, నవంబర్ 2023, మంగళవారం

తెలంగాణ సీఎం సీటుపై పవన్ కన్ను #congresstelangana #bjptelangana #brs

తెలంగాణ సీఎం సీటుపై పవన్ కన్ను #congresstelangana #bjptelangana #brs



తెలంగాణ సీఎం సీటుపై పవన్ కన్ను

కేసీఆర్, రేవంత్ లకు కామారెడ్డి ప్రజల షాక్..!! #brs #kcrlive #revanthredd...

తెలంగాణలో కారెక్కిన కమలం!? #brsparty #bjptelangana #congresstelangana #b...


తెలంగాణలో కారెక్కిన కమలం!? #brsparty #bjptelangana #congresstelangana #bandisanjay #revanthreddy

3, నవంబర్ 2023, శుక్రవారం

2, నవంబర్ 2023, గురువారం

జగన్ చెంతకు తల్లీ కూతుళ్లు.. అన్న దగ్గరికే షర్మిల.. త్వరలోనే..#ysrcp #ys...


జగన్ చెంతకు తల్లీ కూతుళ్లు.. అన్న దగ్గరికే షర్మిల.. తెలంగాణ ఎన్నికల తరువాత ముహూర్తం

పోతన భాగవతం.. రుక్మిణీ కల్యాణం పద్యగానం.. శ్రీ జువ్వాడి గౌతమరావు తొలిభాగం



పోతన భాగవతం.. రుక్మిణీ కల్యాణం పద్యగానం.. శ్రీ జువ్వాడి గౌతమరావు తొలిభాగం

మీరు ఇలా చేస్తే నేను రాను.. టీబీజేపీ నేతలకు మోడీ వార్నింగ్ #bjptelangana...


మీరు ఇలా చేస్తే నేను రాను.. టీబీజేపీ నేతలకు మోడీ వార్నింగ్

30, అక్టోబర్ 2023, సోమవారం

ఈ దాడి దేనికి సంకేతం.. తెలంగాణ ఎన్నికలు కలుషితం అవుతున్నాయా?


ఈ దాడి దేనికి సంకేతం.. తెలంగాణ ఎన్నికలు కలుషితం అవుతున్నాయా?.. బెంగాల్, యూపీ, బీహార్ ల సంస్కృతి తెలంగాణ రాజకీయ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయా? తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి..

29, అక్టోబర్ 2023, ఆదివారం

తెలంగాణ విజేత ఎవరు? ENTV, V PULSE ప్రత్యేక సర్వే..


వచ్చే తెలంగాణ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ హాట్రిక్ సాధిస్తుందా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా. ? బీజేపీ కి అందలం ఎక్కే అదృష్టం ఉందా? వీటికి సమాధానం చెప్పేదే తెలంగాణ ప్రజలు మాత్రమే. తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికలలో ఏ అంశం ప్రాతిపదికన ఓటేయాలని అనుకుంటున్నారో తెలుసుకునేందుకు వి పల్స్ సర్వే చేపట్టింది. రాజకీయ పార్టీల అనుకూల ప్రతికూల అంశాలు, బలాబలాలు, జిల్లాల వారీగా పార్టీలు గెలిచే సీట్లు తదితర కీలక అంశాలపై తొలిసారిగా ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించడమే కాకుండా, 119 నియోజకవర్గాల్లో స్థానికంగా పోలింగ్ బూత్ స్థాయిలో దాదాపు 125 మంది సిబ్బందితో సర్వే నిర్వహించింది. వి పల్స్ సర్వే ఫలితాలను సమగ్రంగా ఈఎన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. చూడండి

27, అక్టోబర్ 2023, శుక్రవారం

సృజనస్వరం- బీవీఎన్ స్వామి ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ #కవిత #కథలు #...



తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలతో వారి సృజనాత్మక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంపై ప్రత్యేకంగాచేసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రముఖ రచయిత బీవీఎన్ స్వామి అంతరంగం మీకోసం..

ఆ మంత్రులకు గండమేనా? #congresstelangana #brs


ఆ మంత్రులకు గండమేనా? తెలంగాణలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు గట్టి పోటీని ఎదుర్కోనున్నారు. వారిలో కొందరు మంత్రులు ఓటమి అంచున ఉన్నట్టు కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

26, అక్టోబర్ 2023, గురువారం

25, అక్టోబర్ 2023, బుధవారం

24, అక్టోబర్ 2023, మంగళవారం

కాళిదాసు దశశ్లోకి.. అశ్వధాటి వృత్తం.. గానం:పమిడికాల్వ మధుసూదన్



కాళిదాసు దశశ్లోకి.. అశ్వధాటి వృత్తం.. గానం:పమిడికాల్వ మధుసూదన్.. కవికుల గురువు కాళిదాసు రచించిన దశశ్లోకి.. అశ్వధాటి వృత్తంలో ఉన్న వైవిధ్యమైనదీ ఈ దశశ్లోకి స్తోత్రం.. పేరుకు తగినట్టుగా గుర్రపు వేగంతో సాగే ఛందము ఇది. పదం చివర ఏ అక్షరం ఉన్నదో అదే ప్రాసగా వస్తుంది. ఇది దీని ప్రత్యేకత. వినండి.

18, అక్టోబర్ 2023, బుధవారం

17, అక్టోబర్ 2023, మంగళవారం

భీష్మ పరశురామ యుద్ధం.. పద్యనాటకం రెండవ రంగం


పాణ్యం లక్ష్మీనరసింహ శాస్త్రి గారి రచన.. భీష్మ పరశురామ యుద్ధం.. పద్యనాటకం.. రెండవ రంగం..

నాలుగు దశాబ్దాల క్రితం, శతా వధాని, పౌరాణిక రత్న, బ్రహ్మశ్రీ, పాణ్యం లక్ష్మీ నరసింహ శా స్త్రి గారు రచించిన పద్య నాటకం " భీష్మ పరశురామ యుద్ధము ". దీనిని వారి కుమారులు, ప్రముఖ పండిత కవి, రచయిత, విమర్శకులు, గాయకులు శ్రీ పాణ్యం దత్తశర్మ, భీష్మ పాత్రను, వారి తమ్ముడు, వేద పండితులు, శ్రీ దుర్గా పరమేశ్వరీ పీఠం స్థా పకులు, శ్రీ శంకర కుమార శర్మ, పరశురామ పాత్రలో, మిమ్ము అలరిస్తూ ఉన్నారు., శ్రవణ పేయముగా! ఆలకించి పులకించండి

15, అక్టోబర్ 2023, ఆదివారం

భీష్మ పరుశురామ యుద్ధం.. పద్యనాటకం


నాలుగు దశాబ్దాల క్రితం, శతా వధాని, పౌరాణిక రత్న, బ్రహ్మశ్రీ, పాణ్యం లక్ష్మీ నరసింహ శా స్త్రి గారు రచించిన పద్య నాటకం " భీష్మ పరశురామ యుద్ధము ". దీనిని వారి కుమారులు, ప్రముఖ పండిత కవి, రచయిత, విమర్శకులు, గాయకులు శ్రీ పాణ్యం దత్తశర్మ, భీష్మ పాత్రను, వారి తమ్ముడు, వేద పండితులు, శ్రీ దుర్గా పరమేశ్వరీ పీఠం స్థా పకులు, శ్రీ శంకర కుమార శర్మ, పరశురామ పాత్రలో, మిమ్ము అలరిస్తూ ఉన్నారు., శ్రవణ పేయముగా! ఆలకించి పులకించండి 

29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

GRAMPHONE: HOW IT WORKS LIVE DEMO PRITHVI THEATRE (గ్రామ్ ఫోన్ రికార్డు...



GRAMPHONE: HOW IT WORKS LIVE DEMO PRITHVI THEATRE (గ్రామ్ ఫోన్ రికార్డు ఎలా పనిచేస్తుందో తెలుసా?) a Talk in Prithvi theater Bombay- on gramophones & records by Dr. Suresh Chandvankar

28, సెప్టెంబర్ 2023, గురువారం

సృజనస్వరం- భోగరాజు సూర్యలక్ష్మి.. ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ #కవి...



తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలతో వారి సృజనాత్మక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంపై ప్రత్యేకంగాచేసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రముఖ రచయిత్రి భోగరాజు సూర్యలక్ష్మి అంతరంగం మీకోసం..

25, సెప్టెంబర్ 2023, సోమవారం

కస్తూరి రంగ రంగా... పాట.. 1930 నాటి రేడియో రికార్డు..



కస్తూరి రంగ రంగా.. మా యన్న కావేటి రంగ రంగా.. అన్న పాట చిన్నప్పుడు మన నానమ్మలు, అమ్మమ్మల నోట వినని వారు బహుశా అరుదు... ఆ పాట బహుశా మొట్టమొదట 1930లో జీ సుబ్బులు అనే గాయని స్వరంలో రేడియో వారు రికార్డు చేశారు. ఈ సుబ్బులు గారు గుంటూరు, ప్రకాశం ప్రాంతాలకు చెందిన వారని కొంత సమాచారం. వారి గురించి పూర్తి వివరాలు మద్రాసు ఆకాశవాణి రికార్డుల్లో ఉన్నదని తెలుస్తున్నది. చాలా సంప్రదాయమైన, హార్మోనియంపై వినసొంపుగా ఉన్న ఈ పాటను వీనుల విందుగా వినండి..

21, సెప్టెంబర్ 2023, గురువారం

బాబు అరెస్టు.. టీడీపీ నాయకత్వం విఫలమైందా? #tdpnews #tdpvsycp #naralokes...


చంద్రబాబును అరెస్టు చేస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఒక రాజకీయ ఆరోపణగా మాత్రమే చూశారు తప్ప అరెస్టు చేస్తే ఆ తరువాత ఏం చేయాలన్న దానిపై ఆలోచించడంలో విఫలమయ్యారు. అరెస్టు అయిన తరువాత కూడా పార్టీ ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నారా లోకేశ్.. యువగళం పాదయాత్రను పూర్తిగా ఆపివేసి.. రాజమహేంద్ర వరానికి పరిమితమయ్యారని విశ్లేషకులు అంటున్నారు.

14, సెప్టెంబర్ 2023, గురువారం

బాబుకు పవనే దిక్కా? #telugudesampartyofficial @pawankalyanfans2524 #jana...



చంద్రబాబునాయుడు అరెస్టు.. అనంతర పరిణామాలు ఒక్కసారిగా పవన్ కల్యాణ్ కు కలిసి వచ్చినట్టయింది. రెండు పార్టీల ఉమ్మడి పోరాటానికి పవన్ కల్యాణే నాయకత్వం వహిస్తారా? అంటే అవుననే అంతా భావిస్తున్నారు.

సత్యహరిశ్చంద్ర పద్యాలు.. గానం: శ్రీ పాణ్యం దత్తశర్మ.. #telugu #telugulit...



శ్రీ కౌతా పూర్ణా నంద కళా వేదిక, గాంధీ నగర్, విజయవాడలో సత్య హరిశ్చంద్ర నాటకాలు పద్య గానపోటీలు జరిగాయి. ఆ సందర్భంగా ప్రముఖ రచయిత, గాయకుడు హరిశ్చంద్ర పద్యాలు గానం చేశారు. వారికి విశిష్ట ప్రత్యేక పురస్కారం, ప్రశంసా పత్రం, జ్ఞాపికను నిర్వాహకులు అందజేశారు. దత్త శర్మ గారు గానం చేసిన పద్యాలు.. వారి స్వరంలోనే విని ఆనందించండి.

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

పారిశ్రామిక వేత్తల లాగే వ్యవసాయ వేత్తలు.. మహాభారతం రైతులకు ఇచ్చిన గౌరవమిది.



పారిశ్రామిక వేత్తల లాగే వ్యవసాయ వేత్తలు.. మహాభారతం రైతులకు ఇచ్చిన గౌరవమిది. మరి మనం ఏం చేస్తున్నాం. 80 శాతం మంది ఆధారపడిన వ్యవసాయానికి రాజ్యాంగంలో ఎంత చోటు కల్పించాం?

11, సెప్టెంబర్ 2023, సోమవారం

భారతీయ చింతన గ్రంథావిష్కరణ.. ప్రఖ్యాత రచయిత దహగాం సాంబమూర్తి గారి అశీతి...



భారతీయ చింతన గ్రంథావిష్కరణ.. ప్రఖ్యాత రచయిత దహగాం సాంబమూర్తి గారి అశీతి మహోత్సవం.. వరంగల్ లో జరిగిన కార్యక్రమం సమగ్ర కథనం.

7, సెప్టెంబర్ 2023, గురువారం

ఇక అఖండ భారత కూటమి...? #bjptelangana #bjpandhrapradesh #congresstelangan...

రామాయణంలో.. పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది.. అయినా మనం ఎందుకు అరువు తెచ్చుకొ...



రామాయణం అంటే కేవలం సీతను ఎత్తుకుపోవడమో.. లేక రావణుణ్ణి చంపడమో కాదు.. అంతకు మించి. రామరాజ్యం అంటే ఏమిటో వాల్మీకి రామాయణం ఏం చెప్పుతున్నదో చూడండి. అయినా మనం బయటి నుంచి అరువు తెచ్చుకొన్నాం. సూపర్.. ఉదాహరణకు ఒకటి రెండు పాయింట్లు.. మీకోసం..మొత్తం వీడియో చూడండి.. చాలా విషయాలు అర్థమవుతాయి. రాజు నిద్రమత్తులో ఉండకూడదు. తెల్లవారుజామునే లేచి ఆ రోజు చేయాల్సిన పనులను గురించి ఆలోచించాలి. • తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం వచ్చే పనిని చేపట్టి.. దాన్ని కూడా ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. • రాజు పూర్తిచేసిన పనులు మాత్రమే ఇతరులకు తెలియాలి. ముందుముందు చేయతలపెట్టిన పనులు బయటకు తెలియకూడదు. • ఇతరులు లేదా ప్రత్యర్థులు తమ తెలివితో.. లేక ఇతర అడ్డదారుల్లో మన రహస్యాలను తెలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రామం భజే శ్యామలం- కోవెల సంతోష్ కుమార్ 8వ అధ్యాయంలో రెండోభాగం

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

దేశం పేరు మార్పు.. గుట్టు రట్టు #congresstelangana #bjptelangana #brs



ఇండియా పేరును తొలగిస్తూ.. కేవలం భారత్ అని ఒకటే పేరు ఉండేలా పేరు మార్పు ప్రక్రియకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. దీని వెనుక నేపథ్యం ఏమిటి? హఠాత్తుగా దేశం పేర్లలో ఒకదాన్ని మాత్రమే ఎందుకు ఉంచుతున్నారు?

4, సెప్టెంబర్ 2023, సోమవారం

వేదాలు చెత్త పుస్తకాలా? #vedamu #ramayan #ramambhajeshyamalam #kovelasan...



వేదాల్లో అన్నీ ఉన్నాయిష అని వెటకారం చేసిన వాడెవడికీ వేదాలు తెలియవు. సంస్కృత భాషే రాదు. ఇక అర్థమేం తెలుస్తుంది. ఎవడో చెప్పిన నాలుగు ముక్కలను పట్టుకొని.. ఎద్దేవాలు చేస్తుంటారు. ముందు చదివి అర్థం చేసుకుంటే కదా.. అందులో ఏమున్నదో తెలిసేది. ఆ తరువాత తిట్టినా అర్థం ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనట్టు.. ఒక్కో దేశం నుంచి అరువు తెచ్చుకొని ఓహో అన్నట్టు పే...ద్ద ఉద్గ్రంథం రాసుకొని ఊరేగుతున్నాం. ఇక్కడ ఉన్నవేవో తెలుసుకొని అందులో పనికొచ్చేవాటిని తీసుకొని రాసుకొని ఉంటే.. ఇంతకంటే పెద్ద గ్రంథమే అయ్యేది కాదా.. ?

28, ఆగస్టు 2023, సోమవారం

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్య కాదా? #ycp #lakshmiparvathi #ntr #seniornt...



లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్య కాదా? #ycp #lakshmiparvathi #ntr #seniorntr #ntrfamily

అభ్యర్థులేరి? కిషన్ ఈటలపై అమిత్ షా సీరియస్ #bjptelangana #congresstelang...


అభ్యర్థులే లేరు అధికారం ఎలా? తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అగ్రనేత అమిత్ షా పైకి ఎంత ధీమా వ్యక్తం చేసినా లోలోపల ఆయనకు కూడా తెలుసు తాము అధికారంలోకి రావడానికి ఎంత దూరంలో ఉన్నామో... అధికారంలోకి రావాలంటే కిందిస్థాయి నుంచి ఎలాంటి పోరాటం చేయాలో ఆయనకు తెలియనిది కాదు. ఆ స్థాయి పోరాటం ఇక్కడి బీజేపీ నేతలు చేయలేకపోయారని షాకు కూడా అర్థమై ఉంటుంది.

26, ఆగస్టు 2023, శనివారం

రేవంత్ కు ఆ ఇద్దరి నుంచి లొల్లి తప్పదా? #brsparty #congresstelangana #re...



తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఆ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఈ విషయంలో తాము వెనకబడినట్టు కనిపించవద్దన్న అభిప్రాయం పార్టీలో ఉంది. అందుకే  వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు. కనీసం సెప్టెంబర్ మొదటివారంలోనైనా ఫస్ట్ లిస్ట్ విడుదల చేయాలని అనుకుంటున్నారు.

చంద్రుడిపై శివశక్తి రహస్యాన్ని బయటపెట్టిన రోవర్ #shortsfeed #shorts #sho...

ఖమ్మంలో బీఆర్ ఎస్ కు దక్కేది ఆ ఒక్కటేనా? #brs #brsparty #brsleader #kcr ...


ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తప్పదా? లేకుంటే సీఎం కేసీఆర్ ముందే  ఖమ్మం పై పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారా? మొదట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇపుడు తుమ్మల నాగేశ్వర రావును దూరం చేసుకోవడం చూస్తే బీఆర్ ఎస్ అధినేత అన్నింటికీ సిద్దపడినట్టే కనిపిస్తోంది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం వల్లే బీఆర్ఎస్ కు నష్టం కలుగుతుందని భావిస్తున్న సమయంలో తుమ్మల విషయంలో జాగ్రత్త పడతారని అంతా ఆశించారు. కానీ తుమ్మలకు టికెట్ నిరాకరించడం ద్వారా కేసీఆర్ ఎవరికీ అంతు చిక్కని వ్యూహంతో వెళుతున్నారని అనిపిస్తోంది.

24, ఆగస్టు 2023, గురువారం

తెలుగులో మొదటిసారి జాతీయ ఉత్తమనటుడి అవార్డు.. పుష్ప సినిమాకు అల్లు అర్జు...



తెలుగులో మొదటిసారి జాతీయ ఉత్తమనటుడి అవార్డు.. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు దక్కిన కీర్తి.. 1967 లో ఉత్తమనటుడి అవార్డు ఇవ్వటం ప్రారంభించిన తరువాత తెలుగు నటులలో మొదటిసారి ఉత్తమనటుడి పురస్కారం అల్లు అర్జున్ కు లభించింది. తెలుగు సినిమా చరిత్రలో ఇది మరో కలికితురాయి. ఉత్తమ నటిగా శారద, విజయశాంతి తదితరులు గతంలో అవార్డులు సాధించినా నటులలో మొదటి సారి ఈ గౌరవం దక్కిందనే చెప్పాలి.

celebrations at national best actor allu arjun residence బన్నీ ఇంట సంబరా...

పుల్లట్టు.. పులస చేప తినని వాళ్లు ఎవరైనా ఉన్నారా? ఈ కథనం చూడండి..

23, ఆగస్టు 2023, బుధవారం

next ఏమిటి? 14 రోజులు కీలకం.. #chandrayaan3 #india on moon #isro

మనం బిచ్చగాళ్లమా? are we beggars? #telugu #ramambhajeshyamalam #kovela s...


ఘజ్‌నీ మహమ్మద్ అనేవాడు డబ్బుకోసం ఒకే ఒక్క గుడిపై అన్నిసార్లు దాడిచేశాడంటే.. ఆ గుడిలో ఎంత సంపద ఉండవచ్చు. గుడితోపాటు ఆనాటి ఆ సమాజంలో ఎంత సంపత్తి పోగుపడి ఉండవచ్చు.. రాజు దగ్గర ఎంత ఉండవచ్చు. ప్రజల దగ్గర ఎంత ఉండవచ్చు. ఎంత సంపదవుంటే భారతదేశాన్ని రత్నగర్భ అంటారు? ఈరకంగా దేశంలోని చాలాచోట్ల సంపద పోగుపడింది కాబట్టే ఘజ్‌నీ మహమ్మద్ నుంచి ఎలిబెత్ దాకా ఉరుకురికి వచ్చారు. నీదగ్గర ఏమైనా ఉన్నదంటేనే కదా.. దొంగోడైనా వచ్చి దోచుకొనేది. నీ దగ్గర ఏ కాణీ కూడా లేనప్పుడు ఎవరైనా నీదగ్గరకు ఎందుకొస్తారు? అయో.. మీ దగ్గర ఏమీ లేదు.. మీకు బతకడమెట్లాగో చేతకాదు.. మేం వచ్చి మీకు ఎట్లా బతకాలో చెప్తాం.. అన్నం తినడం నేర్పిస్తాం.. ఆవకాయ రుచి చూపిస్తామని వచ్చారా తెల్లవాళ్లు? రామం భజే శ్యామలం ఏడవ భాగం చూడండి

18, ఆగస్టు 2023, శుక్రవారం

రాజన్న బిడ్డ మడమ తిప్పిందా? #sharmila #congresstelangana #brs #bjptelangana



వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారా అంటే నిన్న మొన్నటి వరకూ ఏవేవో ఊహాగానాలు వినిపించాయి. షర్మిల పార్టీ విలీనానికి సిద్ధమే  కానీ ఆమె రాజకీయాలు తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను ఏపీకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ, కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

12, ఆగస్టు 2023, శనివారం

పద్యాల రూపంలో సత్యనారాయణ వ్రత కథలు: రచన:రామక విఠలశర్మ, గానం కుందావఝల కృష...



తెలుగు సాహిత్యంలో ఇలాంటి ప్రయోగం మునుపెన్నడూ జరుగలేదు. సత్యనారాయణ వ్రతం గురించి తెలియని వారెవరు.. వ్రతం చేసుకోనివారూ చాలా అరుదే.. వ్రతకథలను కథలుగా వినడమే మనకు ఇప్పటివరకు తెలిసింది. కానీ.. పద్యాల రూపంలో.. వీనులకు విందుగా.. వినసొంపుగా.. మనసుకు హాయినిచ్చేలా రాగయుక్తంగా స్వరపరచి గానం చేస్తే.. ఊహించడానికే హాయిగా ఉంది కదూ.. మీ ఊహల్ని నిజం చేయడం కోసం శ్రీ రామక విఠల శర్మ శ్రీ సత్యనారాయణస్వామి వ్రతకథలను పద్యాల రూపంలో అత్యంత అలతి పదాలతో అద్భుతంగా రచించారు. వాటిని ప్రఖ్యాత సాహిత్యవేత్త, గాయకుడు శ్రీ కుందావఝల కృష్ణమూర్తి అపూర్వంగా రాగం కట్టి ఆలపించి వ్యాఖ్యానం కూడా చేశారు. తప్పక వినండి. తరించండి. పది మందికి వినిపించండి..

నేను.. నా రైలు బండి.. సికిందరాబాద్ నుంచి అహమ్మదాబాద్ దాకా.. దత్తశర్మ ట్ర...



ప్రముఖ పండిత రచయిత, గాయకుడు పాణ్యం దత్తశర్మ గుజరాత్ రాజస్థాన్ ట్రావెలాగ్ లో రెండవభాగం.. నేను.. నా రైలు బండి.. అటుకులు, పల్లీలు, వాముకారాలు, తప్పేలాంట్లు, పప్పుచెక్కలతో సహా ప్రయాణం.. వినండి.. #telugu #కథలు #travelvlog

28, జులై 2023, శుక్రవారం

26, జులై 2023, బుధవారం

యాత్రలో చిత్రాలు! ప్రయాణం లో ప ద ని సలు!.. దత్తశర్మ ట్రావెలాగ్.. గుజరాత్...



యాత్ర అంటే ఆత్రం గా చేసేది కాదు! చేయడం ఒ కె త్తు అయితే దాన్ని రాయడం ఇంకో ఎ త్తు! ట్రావెలాగ్ లో డైలాగు లు, పంచ్ లు, మానవ సంబంధాల మంద హాసాలు, దొరికే తిండి, దాని వివరాలు, పర్యాటక సమాచారానికి కొంచెం ఫిక్షన్ ను, మరికొంచెం హాస్యాన్ని అద్ది, ఇద్దరు మిత్రులు, టూర్ లో ఎలా షికారు చేశారో, ఎంజాయ్ మెంట్ కు ఏజ్ అడ్డురాదని, ఏక బిగిన వినిపించే కథనం! ఫొటోస్, వీడియోస్ తో కనువిందు. దత్తశర్మ గారి నారేషన్ చెవులకు విందు. దత్తశర్మ ట్రావెలాగ్ చూడండి.. వినండి..

23, జులై 2023, ఆదివారం

22, జులై 2023, శనివారం

అమెరికాలో అన్నమో రామచంద్రా.. #america #teluguamericanews #americantelugu...



మన దేశం నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులను నిషేధించడం అమెరికాలోని దక్షిణ భారతీయులకు  శాపంలా మారింది. ముఖ్యంగా మన తెలుగోళ్లకు మరీ ఇబ్బందిగా మారింది.  ఒక్కసారిగా బియ్యం ధరలకు రెక్కలు రావడంతో చాలా మంది సూపర్ మార్కెట్ ల వద్ద క్యూలు కడుతున్నారు. 

తెలుగు నందనవనంలోొ వలపు కోయిల వానమామలైౌ.. పంచమీ విభక్తి పద్యాలు.. గానం:పా...


తెలుగు నందనవనంలోొ వలపు కోయిల వానమామలైౌ.. పంచమీ విభక్తి పద్యాలు.. గానం:పాణ్యం దత్తశర్మ #సాహితీ #కవిత

21, జులై 2023, శుక్రవారం

దేశాన్ని రక్షించాడు.. భార్యను కాపాడుకోలేకపోయాడు.. #bjptelangana #congres...


దేశాన్ని రక్షించాడు.. భార్యను కాపాడుకోలేకపోయాడు.. #bjptelangana #congresstelangana #manipur

మీ స్వాతంత్య్రం మేం పెట్టిన భిక్ష.. ఆయన చేసిందేమీ లేదు.. #ramambhajeshya...



ఆధునిక పాశ్చాత్య ఔదార్యవాదము.. పాశ్చాత్య దేశాలు ఆధునిక ప్రపంచానికి పెట్టిన భిక్ష. నా దేశీయులు భారతదేశంపై తమ పరిపాలనాధిపత్యాన్ని వదులుకొని భారత ప్రభుత్వ యంత్రాంగాన్ని భారత ప్రజలు ఎన్నుకొన్న నాయకుల ఆధీనంచేసి తరలిపోవడమనేది ఔదార్యవాదము యొక్క పర్యవసానమే. ఏ నాయకులకు తాము ప్రభుత్వాన్ని అప్పగింత పెట్టారో.. వారినే ఒకప్పుడు కారాగారాలలో బంధించారు. తిరిగి వారికే అధికారమార్పిడి జరిగింది. పాశ్చాత్య ఔదార్యవాదం యొక్క ఈ పర్యవసానానికి నేను మిక్కిలి గర్విస్తున్నాను. అంతేకాదు.. మీరు మీ రాజకీయ స్వాతంత్ర్యం పొందిన పిమ్మట మీ దేశ పరిపాలన నిమిత్తం పాశ్యాత్య విధానపు పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్థను స్వీకరించవలెనన్న నిర్ణయం గైకొని తద్వారా పాశ్చాత్య ఔదార్యవాదంపై మీకుగల ఆదరాభిమానాలను వ్యక్తంచేశారు. ఇదికూడా పాశ్చాత్య ఔదార్యవాద ఫలితమే. రామం భజే శ్యామలం 6వ భాగం. ramam bhaje shyamalam 6

అనుముల కృష్ణమూర్తి సరస్వతీ సాక్షాత్కారం: గానం: కుందావఝల కృష్ణమూర్తి #సా...


అనుముల కృష్ణమూర్తి సరస్వతీ సాక్షాత్కారం: గానం: కుందావఝల కృష్ణమూర్తి #సాహితీ #teluguliterature

45 మంది కవుల పేర్లతో ఛందస్సు చెడిపోకుండా పద్యం రాయవచ్చా? వరదాచార్యోదాహర...



45 మంది కవుల పేర్లతో ఛందస్సు చెడిపోకుండా పద్యం రాయవచ్చా?  వరదాచార్యోదాహరణం నుంచి చతర్థీ విభక్తి పద్యాల్లో అరుదైన ప్రయోగం.. పాణ్యం దత్తశర్మ స్వరం నుంచి వినండి....

17, జులై 2023, సోమవారం

16, జులై 2023, ఆదివారం

15, జులై 2023, శనివారం

సర్వ విభక్తి పద్యాలు.. ఇప్పటి వరకు వినని.. కనుమరుగవుతున్న అరుదైన పద్యాలు..



అభినవ పోతన.. మహాకవి వానమామలై వరదాచార్యుల వారిపై అన్ని విభక్తులలో ప్రథమా విభక్తి నుంచి సంబోధనా ప్రథమా విభక్తి వరకు శ్రీ గణపతి రామచంద్రరావు సర్వ విభక్తికము అన్న పద్యమాల రాశారు. వరదాచార్యోదాహరణం లోనివీ పద్యాలు. అన్ని విభక్తులను ప్రత్యేకంగా ఎంచుకొని పద్యాలు రాయడం అద్బుత ప్రయోగం. అత్యంత అరుదైన.. ఆధునిక కాలంలో కనుమరుగవుతున్న ఈ పద్యాలను ప్రఖ్యాత కథా రచయిత, కవి, విమర్శకుడు పాణ్యం దత్తశర్మ రాగయుక్తంగా మీకు అందిస్తున్నారు. ఈ పద్యాలు వరుసగా మీకు అందుతాయి. అన్నింటినీ వినడం కోసం ఈ చానల్ ను సబ్ స్క్రయిబ్ చేయండి..

ఆద్యంతాలను ముడివేసిన వాల్మీకి: కల్పవృక్ష వ్యాఖ్యానం, కోవెల సుప్రసన్న #te...



ఆద్యంతాలను ముడివేసిన వాల్మీకి: కల్పవృక్ష వ్యాఖ్యానం, కోవెల సుప్రసన్న #teluguliterature #telugu

12, జులై 2023, బుధవారం

బీజేపీతో అందుకే చెడిందా? #chandrababunaidu #chandrababu #tdpnews



ఏపీలో పొత్తుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిలో మార్పు వస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో జనసేన, బీజేపీలతో పొత్తుకు ఉవ్విళ్లూరిన చంద్రబాబు ఇపుడు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టీడీపీ పొత్తు కోసం ఇతర పార్టీల వెంటపడితే అది తమ బలహీనతగా భావిస్తారన్న అంచనాకు వచ్చినట్టున్నారు.

వారసుడు వచ్చాడు #himanshurao #kcr #ktr #brs




 ఇపుడు ఈ కుటుంబం నుంచి ఇంకో వారసుడొచ్చాడు. ఆయనే కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. తాత, తండ్రిలాగే తానూ స్పీచ్ లు ఇవ్వగలనని హిమాన్షు  నిరూపించుకుంటున్నాడు. తన మొదటి ప్రసంగంలోనే అదరగొట్టాడు.   

11, జులై 2023, మంగళవారం

కేసీఆర్ కు రేవంత్ ఇలా దొరికాడేమిటి? #congresstelangana #brs #bjptelangana



ఎన్నికల వేళ పార్టీల నేతలు ఏ మాత్రం అటూ ఇటూ మాట్లాడినా ప్రత్యర్థి పార్టీలు దానిని అస్త్రంగా చేసుకుంటాయి. అది కూడా ప్రజాకర్శక పథకాల గురించి ఏ మాత్రం నోరు జారినా ఒక్కోసారి రివర్స్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో ఇలాగే జరుగుతోంది. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు బీఆర్ఎస్ కు ఆయుధంగా మారాయి. 

కేసీఆర్ జీ ఇలా అయ్యిందేమిటి? #brs #bjptelangana #congresstelangana #eeta...



తెలంగాణ లో బీజేపీ డిఫెన్స్ లో పడినట్టు కనిపిస్తోంది. ఎంత సేపూ బీఆర్ఎస్ తో తమకు అవగాహన లేదని చెప్పడానికే నేతల సమయమంతా సరిపోతోంది. కొంతకాలం కిందట బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై పోరాడిన పార్టీనేనా ఇది అని అంతా ఆశ్చర్చపోయే పరిస్థితి వచ్చింది. 

6, జులై 2023, గురువారం

ఇదే జరిగితే.. బీజేపీ కి సున్నాయే.. #bjptelangana #congresstelangana



బీజేపీ సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్,  కరీంనగర్, నిజామాబాద్,  ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మంట్ లలో కాషాయపార్టీ కొంత మాత్రమే   బలహీనపడితే అక్కడ బీఆర్ఎస్ కే లాభం కలగొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. అదే  బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన  చేవెళ్ల, జహీరాబాద్ లలో బీజేపీ బలహీనపడితే  కాంగ్రెస్ కు లాభం కలగవచ్చు. ఎందుకంటే గత ఎన్నికలలో  బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో ఉంది. ఇక  బీజేపీ రెండో స్థానంలో ఉన్న మహబూబ్ నగర్ లో ఈ సారి కూడా గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. బీజేపీ పూర్తిగా బలహీనపడితే కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం ఉంటుంది.  అంటే ఇపుడు వచ్చే ఎన్నికలలో ఫలితాలను ఒక రకంగా బీజేపీ డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు.

రావణ లంకలో అంతా రామమయం..కల్పవృక్ష వ్యాఖ్యానం-సుప్రసన్న #telugu #కవిత #సా...



రావణ లంకలో అంతా రామమయం.. ఆచార్య కోవెల సుప్రసన్న రామాయణ కల్పవృక్ష వ్యాఖ్యానం

3, జులై 2023, సోమవారం

తరువాతి టార్గెట్ నితిశ్ కుమారే.. #bjptelangana #brs #congresstelangana


బీజేపీ వ్యూహమేంటో విపక్షాలకు ఇపుడిపుడే అర్థమవుతోంది. ఓవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న సమయంలోనే మహారాష్ట్రలో ఎన్సీపీను చీల్చిన కాషాయపార్టీ విపక్ష కూటమికి పెద్ద షాకే ఇచ్చింది. బీజేపీ దూకుడు ఇంతటితో ఆగదని కూడా  అనుకుంటున్నారు. విపక్షాలు ఏకమయ్యేమాట అటుంచితే ఇపుడు అవి తమ సొంత పార్టీలను కాపాడుకునే పనిలో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. 

ఉమ్మడి పౌరస్మృతి పై వివాదం దేనికి? తెలుగు మీడియాలో తొలిసారి సమగ్ర విశ్లే...


 మళ్లీ ఇప్పుడు యూసీసీ చర్చ మొదలైంది. యూసీసీ బిల్లు తీసుకురావడం వల్ల కేవలం ముస్లింలపైనే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన పర్సనల్ చట్టాలలో మార్పులు వస్తాయి. హిందూ అవిభాజ్య కుటుంబాలకు సంబంధించిన చట్టాలతోపాటు, సిక్కులు, పార్శీలు, జైనులు, క్రైస్తవులకు చెందిన పలు చట్టాలనూ సవరించాల్సి వస్తుంది.  యూసీసీ పై తెలుగు మీడియాలో తొలిసారి సమగ్రంగా విశ్లేషించిన కథనం.. 

1, జులై 2023, శనివారం

ఇలా అయితే వచ్చేది లేదు.. తెలంగాణ బీజేపీ నేతలకు మోడీ హెచ్చరిక #bjptelanga...



తెలంగాణ బీజేపీ తీవ్ర అయోమయంలో పడింది. బయటి నుంచి వచ్చిన నాయకులు.. లోపల ముందు నుంచి ఉన్న నాయకుల మధ్య పొసగడం లేదు. ఈ పరిస్థితి ప్రధాని మోడీ సహా, జాతీయ నాయకత్వానికి తీవ్ర సమస్యగా మారింది.