10, మే 2009, ఆదివారం

సమరం రచనలు విశృంఖల శృంగారాన్ని ప్రోత్సహిస్తున్నాయా?

లైంగిక విజ్ఞానం శాస్త్రీయమా కాదా అన్న విషయంపై మరోసారి వివాదం ప్రారంభమైంది. లైంగిక విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన వైద్యుల్లో డాక్టర్‌ సమరం అగ్రగణ్యుడు... తెలుగునాట మధ్యతరగతి కుటుంబాల్లో లైంగిక విజ్ఞానాన్ని గురించి సంప్రదాయ సంకెళ్లను ఛేదించి కొద్దో గొప్పో మాట్లాడుకోగలుగుతున్నారంటే... అందులో సమరం పాత్ర కీలకమైంది. ఆయన వైద్య విధానాన్ని, కౌన్సిలింగ్‌లపై చాలా వివాదాలు వచ్చాయి. ఆయనపై కోర్టులో వ్యాజ్యాలు కూడా జరిగాయి. ఏ ఒక్క కేసు కూడా ఆయనకు వ్యతిరేకంగా నిలవలేదు... సంవత్సరాల తరబడి ప్రజల సమస్యలకు పత్రికల ద్వారా, మ్యాగజైన్ల ద్వారా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు.....ఇప్పుడు ఆయన రచనలపైన, కౌన్సిలింగ్‌ విధానాలపైనా దుమారం రేగుతోంది. మానసిక విజ్ఞానం పేరుతో ఆయన ప్రచారం చేస్తున్నదంతా బూతు పురాణమని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సమరంపై అశ్లీల ప్రతిఘటన వేదిక యుద్ధం ప్రకటించింది. ఈదర గోపీచంద్‌ అనే రిటైర్‌‌డ ఎల్‌ఐసి ఉద్యోగి ఇరవై ఏళ్లుగా ఈ సంస్థను నడుపుతున్నారు.. సమరంపై యుద్ధం పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేయటంతో వివాదం మొదలైంది. గోపీచంద్‌ గతంలో కొన్ని పుస్తకాలు రచించారు. అశ్లీలానికి వ్యతిరేకంగా కూడా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు... సమరం రచనల వల్ల పసి పిల్లలు చెడిపోతున్నారని ఈయన వాదన.. సమరం పుస్తకాలను నిషేధించి, సమాజానికి అన్యాయం చేస్తున్న ఆయన్ను అరెస్టు చేయాలని గోపీచంద్‌ డిమాండ్‌ చేస్తున్నారు. సమరంకు వ్యతిరేకంగా గతంలో కూడా ఉద్యమించారు. సదస్సులు నిర్వహించారు. ఫాంటసీ పేరుతో సమరం బూతు కథలను ప్రచారంలోకి తెస్తున్నారని గోపీచంద్‌ వాదన. సంస్కార వంతమైన సమాజంలో ఎప్పుడు ఎలాంటివి బోధించాలో.. అప్పుడే చెప్పాలనీ, కానీ, సమరం బట్టబయలు చేశారని ఆరోపిస్తున్నారు..
సమరం ఈ వాదనల్ని కొట్టి పారేస్తున్నారు. సనాతన వాదులు చేస్తున్న వితండ వాదంగా ఆయన చెప్తున్నారు... మూఢ నమ్మకాల నుంచి బయటపడాలని ఆయన చెప్తున్నారు. పిల్లలకు లైంగిక విద్యను చూపించకూడదనుకుంటే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, అంతే కానీ, యువతకు అత్యంత అవసరమైన లైంగిక విజ్ఞానాన్ని అందించడం తప్పనిసరి అని సమరం అంటున్నారు....
లైంగిక విద్యపై, విజ్ఞానంపై దేశంలో మొదట్నుంచీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది సైన్‌‌స అని కొందరు.. అసభ్యమని మరికొందరి మధ్య నలుగుతోంది. సంప్రదాయం, ఆచారాల నడుమ సెక్‌‌స గురించి మాట్లాడటం మన దేశంలో తక్కువే.. అయితే దేవాలయాలపైన శృంగార శిల్పాలు, సెక్‌‌స భంగిమలు,, వాత్సా్యయనుడు కామసూత్రాలను రచించటం మన దేశంలోనే జరిగిందంటే పూర్వకాలంలో ఈ విధమైన నిర్బంధాలు లేకపోవచ్చు. లేదా జీవితంలో అభిన్న అంగంగా దీన్ని భావించి ఉండవచ్చు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో లైంగిక విద్యను బోధించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. తీవ్రంగా నిరసనలు వ్యక్తం కావటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
హేతువాదులు కూడా గోపీచంద్‌ వాదనను కొట్టిపారేస్తున్నారు. సమరాన్ని విమర్శించేముందు అశ్లీలతకు అసలైన అర్థం ఏమిటో చెప్పమంటున్నారు. అసభ్యత లేనంతవరకు ఏదీ అశ్లీలం అనిపించుకోదని హేతువాదుల అభిప్రాయం....మన దేశం ఉన్నతమైన సంస్కారాన్ని సమాజానికి అందించింది. ప్రజలు ఎప్పుడు ఏది తెలుసుకోవాలో అప్పుడు ఆ విజ్ఞానాన్ని అందిస్తూ వచ్చింది. దీనివల్లే మన దేశం ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా పరిఢవిల్లింది. పరిమితులు లేకుండా పిల్లలను పెంచటం వల్ల వాళు్ల ఎంతగా చెడిపోతున్నదీ మనకు తెలియంది కాదు.. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మృగ్యమైనాయి. జ్ఞానం ఎంతగా కావాలో అంతే అందివ్వాలి. కొంచెం తెలివికి, అతి తెలివికీ ఉన్న తేడాను పెద్దలు గమనించాలి.. స్వేచ్ఛ విశృంఖలమైవ ఎంతో ప్రమాదకరం. అలా అని మానసిక విజ్ఞానం అవసరానికి తగ్గట్టుగా అందకపోతే అదీ సమస్యే. సెక్‌‌సకు సంబంధించి కేవలం సమరం పుస్తకాల వల్లనే అంతా రట్టయిపోతుందనుకుంటే పొరపాటే... ఇంటర్‌నెట్‌లు వచ్చాయి. సినిమాలు పిచ్చెక్కిస్తున్నాయి. అలాంటప్పుడు కేవలం సమరంను నిందించి మాత్రం ప్రయోజనం ఏమిటి? అందుకే దేనై్ననా గుడ్డిగా సమర్థించటం కానీ, వ్యతిరేకించటం కానీ తగని పని. గోపీచంద్‌ సమరం చేసినట్లయితే, లైంగిక విజ్ఞానం పేరుతో పెచ్చరిల్లుతున్న శృంగారంపై యుద్ధం చేయాలి... ఇందుకు ఉపకరిస్తున్న అన్ని రంగాలపైనా పోరాడాలి. అంతే కానీ, కేవలం ఒక వ్యక్తిని మాత్రమే బోనులో నిలబెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? అందులో డాక్టర్‌ సమరం చేస్తున్న కౌన్సిలింగ్‌ను కానీ, రచనలను కానీ, ఏకపక్షంగా ఆయన్ను నిందించటం సరికాదు...

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

జి సమరం గారు తెలుగు పాఠకులకు లైంగిక విజ్ఞానాన్ని అందించడం ద్వారా గొప్ప సేవ చేశారు. అది వెల కట్ట లేనిది. భారత దేశంలో భారత రత్న అనే బిరుదు లాంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రత్న అనే బిరుదు ఒకటి ఉంటే అది సమరం గారికి ఇవ్వవచ్చు.

అయితే సమరం గారు ఫ్యాంటసీ పేరుతో రాసేవి మాత్రం హానికరమని నిర్ద్వందంగా చెప్పొచ్చు.

Praveen Mandangi చెప్పారు...

స్టూడెంట్స్ కి బ్లూ ఫిలింస్ చూడమని సలహా ఇచ్చే సమరం బూతు రచయిత కాకపోతే మరేమిటి? చదువు పూర్తైన తరువాతే సెక్స్ గురించి ఆలోచించాలి. సమరం గారి బూతు రచనలు చదివి కాలేజి వయసులో చదువు పాడు చేసుకోకూడదు. నేను ఈదర గోపీచంద్ గారికి సపోర్ట్ ఇస్తాను.

Unknown చెప్పారు...

PRAVEEN LANTI FOOLS ENTAMANDOCHHINA CLEVERS NU AAPALERU.SAMARAM IS CLEVER IAM PROUD TO SAY THAT AS A CLEVER."INDIAN FOOLS SHOULD COPY THE WESTRENS FOOLS TO BEING CLEVER IN INDIA.LIFE IS NOT A PACKAGE.I CANT WASTE MY TIME AS TALKING TO FOOLS.SILENCE IS RIGHT ANSWER WHILE TALKING TO THE FOOLS