15, మే 2010, శనివారం

టెర్రరిజం పాతబస్తీని క్యాన్సర్‌లా కాల్చేస్తోంది..

పాతబస్తీ... ఈ పేరు చెప్తేనే ఏదో గుబులు పుడుతోంది. శాంతి లేదు.. భద్రత లేదు.. ఎవరైనా.. ఎప్పుడైనా, యథేచ్ఛగా రావచ్చు. ఎన్నాళెユ్లనా ఉండవచ్చు. ఏమైనా చేయవచ్చు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులకు సేఫ్‌ జోన్‌గా మారిపోయింది పాతబస్తీ.. అక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ దాని ఉనికి నామమాత్రమే.. అందుకే టెర్రరిజం పాతబస్తీని క్యాన్సర్‌లా కాల్చేస్తోంది..

ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అమాయక కానిస్టేబుల్‌ అన్యాయంగా చనిపోవటానికి బాధ్యులు ఎవరు? పోలీసుల నిర్లక్ష్యం మాత్రమే కారణమా? టెర్రరిస్టులు పాతబస్తీలో తమ ఇష్టం వచ్చినట్లు మోటార్‌ సైకిళ్లపై తిరుగుతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదు..? అసలు వాళ్లు అలా ఎలా తిరగగలుగుతున్నారు? హుస్సేనీ ఆలం దగ్గర కానిస్టేబుల్‌ రమేశ్‌ను కాల్చి చంపి మహరాజుల్లా టెర్రరిస్టులు వెళ్లిపోయిన తరువాత ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్నలివి....
రాష్ట్ర రాజధానిలో మరెక్కడా లేని నిరంకుశత్వం పాతబస్తీలో రాజ్యమేలుతోంది. రాజధానిలో మరో ప్రాంతంలో ఎవరైనా కాస్త ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు వాళ్ల వెంట బడి తరిమి తరిమి పట్టుకుని జరిమానా విధిస్తారు.. నియమావళిని ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు.. కానీ, పాతబస్తీకి వచ్చేసరికి ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది.. అక్కడ ఏం చేసినా పోలీసులు ప్రశ్నించే సాహసం చేయరు.. నిలువరించే ప్రయత్నం చేయరు.. ఏకాస్త ప్రయత్నం జరిగినా అంతే సంగతులు..
పోలీసులకు కాళ్లూ చేతులూ కట్టేశారు.. నిఘా పూర్తిగా నీరుగారిపోయింది. అందువల్లే స్లీపర్‌సెల్స్‌ విజృంభిస్తున్నా ఏం చేయలేకపోయారు.. మానవబాంబులు ప్రవేశించాయని తెలిసినా ఏం చేయలేకపోయారు.. వీసా గడువు తీరిపోయిన తరువాత కూడా అక్రమంగా ఇక్కడ ఉంటున్న వాళ్ల సంగతి సరేసరి.. సెటిల్మెంట్లకయితే లెక్కే లేదు.. పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా పోలీసులు కానీ, పాలకులు కానీ, సీరియస్‌గా తీసుకోకపోవటానికి కారణం ఒక్కటే... మత సంప్రదాయం మాటున ఉగ్రవాదం పాతబస్తీలో రాజ్యమేలుతోంది. మొదట్నుంచీ పాలకవర్గం ఈ అంశంపై దృష్టి సారించలేకపోవటం వల్లనే ఉగ్రవాదులకు సేఫ్‌ డెన్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఉదారవాదులను ఎవరినీ ఎదగనీయకపోవటం, సంప్రదాయమే డామినేట్‌ చేయటం వల్ల దాని మాటున దాగున్న ఉగ్రవాదాన్ని నియంత్రించటం, నిరోధించటం సాధ్యం కావటం లేదు.. ఉగ్రవాదానికి మతం అంటూ ఉండదన్న వాస్తవాన్ని సామాన్య ప్రజానీకానికి తెలుసు. మతం వేరు.. టెర్రరిజం వేరు.. దురదృష్ట వశాత్తూ మన దేశంలో ఈ రెంటినీ ఒకే గాటన కట్టి చూడటం పాలకులకు, రాజకీయ పార్టీలకు అవసరమైంది కాబట్టే పాతబస్తీ టెర్రరిజం అనే క్యాన్సర్‌ బారిన పడి అల్లాడిపోతోంది.. దీనికి చికిత్స చేసేదెవరు? చేయటం సాధ్యమేనా?

1 కామెంట్‌:

Nrahamthulla చెప్పారు...

ఉగ్రవాదికి మతం ఏంటండీ?వాడు మతాన్ని అడ్డం పెట్టుకున్న హంతకుడు.హంతకుడు పాతబస్తీలోని మదరసాలో ఉన్నా,తిరుపతి పాపనాశనంలో ఉన్నా పట్టుకొని ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించాల్సిందే.బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తున్నారు.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం,మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది.
*ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.హింసకులకు మతం ఒక సాకు మాత్రమే.మానవత్వమే అన్నిటికన్నా మంచి జీవన మార్గం.ఇలాంటి కిరాతకులను తొంభైతొమ్మిది శాతం ప్రజలు సమర్దించరు.ఉగ్ర వాదము , పరమత అసహనం మీద ఎంత చర్చ జరిగితే అంతమేలు.
హంతకులు ఎక్కువ తక్కువగా అన్ని మతాలలో ఉన్నారు.ఇస్లాంమతంలో కూడా నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి.మంచికోసం మనుషులు కదులుతారు కానీ ఎవడో చేసిన పాడుపనుల మచ్చలను ఈనాటి అమాయకులు మోయరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.