29, మే 2010, శనివారం

కూలిందా? కూల్చారా? రాజగోపుర రహస్యం


శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయింది. అయిదు శతాబ్దాల చరిత్ర అంతా చూస్తుండగానే నిట్టనిలువునా సమాధి అయిపోయింది. విజయనగర సామ్రాజ్య విజయ పతాక పతనమైపోయింది.. ఎందుకిలా జరిగింది? అత్యంత పురాతనమైన నిర్మాణం ఎలా కూలిపోయింది? అది సహజంగా కూలిపోయిందా? అసహజంగా కూల్చేశారా? రాజగోపురం కూలిపోవటానికి ముందు ఏం జరిగింది? అన్నీ అనుమానాలే.. అన్నీ సందేహాలే.. లోగుట్టు తెలిసేదెవరికి.. సాక్షాత్తూ వాయులింగేశ్వరునికైనా తెలుసా?

శ్రీకాళహస్తి రాజగోపురం ఎలా కూలిపోయింది?
కూలిందా? కూల్చేశారా?
ఒకవైపు మాత్రమే బీటలు వారిన గోపురం నిట్టనిలువునా ఎలా కూలింది?
గోపురం కూలిపోవటానికి పదిహేను నిమిషాలకు ముందు దానిపైకి ఎక్కిన ఇద్దరు ఎవరు?
గోపురం రెండో అంతస్థులోకి ప్రవేశించిన ఆ ఇద్దరు అక్కడ ఏం చేశారు?
గోపురం రెండో అంతస్థులో జరిగింది ఏమిటి?
గోపురం కూలేముందు ఎలాంటి శబ్దాలు వచ్చాయి?
గోపురంలో సౌండ్‌ప్రూఫ్‌ బాంబులు పెట్టి పేల్చారా?
శిథిలాల తొలగింపునకు అప్పటికప్పుడు చెనై్న నుంచి వాహనాలు ఎలా వచ్చాయి?
అంతా పథకం ప్రకారమే జరిగిందా?
కూల్చివేత పథకానికి సూత్రధారులు ఎవరు?

part-1
నిజం.. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని రాజగోపురం కూలిపోవటంపై అనుమానాలు తీవ్రమవుతూనే ఉన్నాయి.. దేవాలయ అధికారులు.. దేవాదాయశాఖ అధికారులు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అనుసరించిన విధానం గోపురాన్ని అసహజంగా కూల్చివేశారనే వాదనలకే బలం చేకూరుతోంది.. దీనికి ఎవరు బాధ్యులు.. ? ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందెవరు?

శ్రీకాళహస్తి పవిత్ర రాజగోపురం నిట్టనిలువునా కూలిపోవటానికి కారకులు ఎవరు? రాష్ర్టంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులను తొలుస్తున్న ప్రశ్న.. రాజగోపురం ఒక్కసారిగా కుప్పకూలటం సంచలనం సృష్టించింది.. ఎందుకు, ఎలా కూలిపోయింది? పరిరక్షించే ప్రయత్నాలు ఎందుకు జరగలేదన్నది జవాబులు దొరకని ప్రశ్నలు...

1517 తొలినాళ్లలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయలు గజపతులపై తన సమరాంగణ విజయ చిహ్నంగా కాళహస్తీశ్వరునికి కట్టిచ్చిన రాజగోపురం ఇది. ఇందులోని తొలి రెండు ప్రాకారాలు రాతితో నిర్మించినా.. మిగతా అయిదు ప్రాకారాలు ఇటుకతో నిర్మించారు.. 1979లోనే తొలిసారి రాజగోపురంపై పగుళ్లను గుర్తించారు.. దీన్ని పరిరక్షించే విషయంలో దేవాదాయ శాఖలో ఫైలు అటూ ఇటూ తెగ తిరిగింది.. 1990లలో మరోసారి దీనిపై పగుళ్లను పరిశీలించారు.. గోపురం కుడివైపు నెరల్రు వాచిన ప్రాంతంలో కొన్ని మరమ్మతులైతే చేశారు.. కానీ, గోపురాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ ఏనాడూ వహించలేదు..

గోపురం గురించి కొన్నాళ్ల క్రితం ప్రస్తుత ఇఓ ఎంతో గొప్పలు చెప్పారు.. పురాతన స్మృతి చిహ్నమైన కాళహస్తి రాజగోపురాన్ని కాపాడుకునేందుకు ఎంతో చేస్తున్నట్లు భుజాలు తడుముకున్నారు..
ఇదే పెద్ద మనిషి, వీర శివ భక్తుడు.. గోపురం కూలిన తరువాత వేదాంతం మాట్లాడటం మొదలు పెట్టారు..ఏ కట్టడానికైనా అంతం తప్పదంటున్నారు..కానీ, తమిళనాడులో వేల ఏళ్ల నాటి గుళు్ల, చారిత్రక ఆనవాళు్ల ఎలా పరిరక్షింపబడుతున్నాయో ఈయనగారికి కాస్తంతైనా తెలియదు..
ఇఓ మాటల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యమే రాజగోపురం కూలిపోవటానికి కారణం. గోపురాన్ని ఎలా రక్షించాలో తెలియక, దాని గురించి ఆలోచించనైనా ఆలోచించక నిష్కర్షగా కూల్చివేశారా? ఇది ప్రజల భావోద్వేగంతో ఆడుకున్నట్లు కాదా?
part-2

రాజగోపురాన్ని కూలిపోకముందే కూల్చేశారన్న వాదన ఎందుకు పెరుగుతోంది? దీని వెనుక వాస్తవాలు ఏమిటి? కూలిపోవటానికి ముందు కాళహస్తిలో ఏం జరిగింది? కేవలం ఒక వైపు మాత్రమే నెరల్రు వాచిన గోపురం మొత్తంగా కుప్పకూలటం సహజంగా జరిగిందేనా?
మే 26 న రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి రాజగోపురం నిట్టనిలువునా కూలిపోయింది? అంతకు ముందు నాలుగు రోజుల నుంచి రాజగోపురం శిథిలావస్థపై కథనాలు వినవస్తూనే ఉన్నాయి. ఐఐటి నిపుణులు, పురావస్తుశాఖ నిపుణులు వచ్చి పరిశీలించి మరీ వెళ్లారు.. ఏ క్షణానై్ననా కూలే అవకాశం ఉందంటూ నిపుణులు అప్పుడే చెప్పారు.
నిపుణులు హెచ్చరించిన మర్నాడే రాజగోపురం కూలిపోయింది.. మట్టిదిబ్బలా మారిపోయింది.. ఎలా సాధ్యమైందన్నదే అంతుపట్టని ప్రశ్న.. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి..
(అనుమానం నెం1)
రాజగోపురానికి కుడివైపున మూడు ఫీట్ల విస్తీర్ణంలో నిట్టనిలువునా పగులు ఏర్పడింది.. ఎడమ వైపున 75 శాతం గోపురం అంతా బాగానే ఉంది.. ఒకవేళ పగులు ఏర్పడిన భాగానికి ప్రధాన భాగానికి దూరం పెరిగితే కుడివైపు మొత్తం పడిపోవాలి. కానీ, గోపురం మొత్తం కూలిపోయింది.. ఇదెలా జరిగింది..?
కుడివైపున మాత్రమే పునాదులు కదిలినట్లు అధికారులే స్పష్టంగా చెప్తున్నారు..
(అనుమానం నెం2)
ఎడమ వైపు పటిష్ఠంగానే ఉందని చెప్పకనే చెప్తున్నారు.. అలాంటప్పుడు గోపురం మొత్తంగా నిట్టనిలువునా కూలే అవకాశాలు చాలా తక్కువని ఇంజనీర్లే అంటున్నారు.. కానీ, గోపురం పూర్తిగా పేకమేడలా ఎలా కూలిపోయింది?
(అనుమానం నెం.3)
రెండో అంతస్థు వరకు రాతికట్టడం ఉంది.. ఆ తరువాత ఇటుక కట్టడం ఉంది.. రెండో అంతస్థు పైనుంచి మిగతా గోపుర ప్రాకారాలన్నీ నిట్ట నిలువునా కూలిపోయింది...ఏం జరిగింది?
(అనుమానం నెం.4)
గోపురం కూలిపోవటానికి సరిగ్గా పదిహేను నిమిషాలకు ముందు ఇద్దరు వ్యక్తులు గోపురంలోని రెండో అంతస్థు లోకి వెళ్లి దాదాపు పదిహేను నిమిషాలు గడిపి వచ్చారు.. వారిద్దరు ఎవరు? రెండో అంతస్థులో వారేం చేశారు?

(అనుమానం నెం.5)
ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సెక్యూరిటీ చీఫ్‌లు ఇద్దరే లోపలికి వెళ్లి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షు్యల వాదన.. వాళ్లిద్దరు కానీ, ఇతర అధికారులు కానీ, ఎందుకు మౌనంగా ఉన్నారు?

(అనుమానం నెం. 6)
గోపురం కూలిపోయిన తరువాత తెల్లవారి ఉదయం దాకా శిథిలాలను తొలగించేందుకు ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు.. దేవాదాయ శాఖ కమిషనర్‌ వచ్చాక కానీ, తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేది లేదని అధికారులు చెప్పారు.. కమిషనర్‌ మధ్యాహ్నం రెండు గంటలకు కానీ రాలేదు.. కానీ, శిథిలాల తొలగింపును ఉదయం పదకొండు గంటలకు గుడి వెనుక వైపు నుంచి రహస్యంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమాన్ని కూడా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..?

(అనుమానం నెం.7)

దేవాదాయ శాఖ కమిషనర్‌ వచ్చి వెళ్లిన కొద్ది సేపటికే చెనై్న నుంచి మూడు పొక్లయినర్లు, 12 ట్రక్కులు వచ్చేశాయి.. ఎలాంటి పక్కా ప్రణాళిక లేకుండా ఇవి కాళహస్తికి ఎలా చేరుకున్నాయి..
గోపురం కూలినప్పుడు పిడుగులాంటి శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.. ఇది బాంబు పేల్చిన శబ్దమా? చారిత్రక ఆనవాలును ఎంతో అపురూపంగా కాపాడుకోవలసిన జాతి, బ్యూరోక్రసీ నిర్లక్ష్యానికి సమాధి అవుతున్న శిథిల చరిత్రను మౌనంగా చూసి రోదించాల్సిన స్థితి నెలకొంది..
part-3
శ్రీకాళహస్తి రాజగోపురం సహజంగా కూలిపోలేదనటానికి మరో బలమైన ఆధారం ఉంది.. గోపురం కూలిపోయిన నాటి నుంచి ముగ్గురు వ్యక్తుల జాడ తెలియటం లేదు.. శిథిలాల కింది నుంచి దుర్వాసన కూడా వస్తోంది.. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఎవరి దగ్గరా లేదు.. దీని వెనుక మతలబు ఏమిటి? అధికారులు ఏదైనా వ్యవహారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాళహస్తి రాజగోపురానికి అతి దగ్గరలో న్యూ గణేశ్‌ హోటల్‌ ఉంది.. ఈ హోటల్‌లో ఉన్న పనిచేసే రాజా అనే కార్మికుడు గోపురం కూలిన రాత్రి నుంచి కనిపించటం లేదు. అన్న జాడ వెతుక్కుంటూ రాజా తము్మడు రమేశ్‌ నెల్లూరు నుంచి కాళహస్తికి వచ్చి వాకబు చేస్తే, హోటల్‌ యజమాని తనకేం తెలియదన్నాడు.. మధ్యాహ్నమే వెళ్లిపోయాడన్నాడు..

నిజానికి హోటల్‌ వెనుక భాగంలో ఒక రేకుల షెడ్డు ఉంది.. గోపురం కూలినప్పుడు అది కూడా పూర్తిగా నేలమట్టమైంది.. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ముక్కు పుటాలు అదిరేలా దుర్గంధ వాసన బయటకు వస్తోంది.. ఈ శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు సమాధి అయినట్లు ప్రచారం జరిగింది.. అంతే కాదు.. అక్కడే ఉన్న స్టేట్‌బ్యాంక్‌ పరిసరాల నుంచి కూడా ఇదే రకమైన వాసన వస్తోంది. కానీ, అధికారులు మాత్రం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.. కారణం మాత్రం తెలియదు.. జాడ తెలియకుండా పోయిన వారిలో ఆలయ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నట్లు సమాచారం వస్తోంది.. వీరికి సంబంధించిన అన్ని రికార్డులనూ మాయం చేసినట్లు తెలుస్తోంది.. అధికారులు ఎందుకిలా చేశారు.? కారణం ఏమిటి? ఆలయ గోపురం ప్రమాద వశాత్తు కూలిపోవటం వాస్తవమే అయితే దుర్గంధం వస్తున్న చోట శిథిలాలను ఇంకా ఎందుకు తొలగించటం లేదు..? జాడ తెలియకుండా పోయిన వారి వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు?

గోపుర శిథిలాల కింద ఎవరైనా చనిపోవటం అంటూ జరిగితే అందుకు ఎవరు బాధ్యులు..? గోపురాన్ని అధికారులు కావాలనే కూల్చి వేసినట్లయితే, చుట్టుపక్కల ఎవరూ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తీరాలి... అలా కాకుండా అన్నీ చూసుకోకుండా తొందరపడి ఉంటే, ఎలాంటి అనర్థం జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. ప్రజల నుంచి, మిస్సింగ్‌ అయిన వారి బంధువుల నుంచి వెల్లువెత్తుతున్న అనుమానాలకు, ఆరోపణలకు జవాబు ఇవ్వలేని అధికార గణం రాజగోపుర రహస్యాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి