గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే...

0 comments
ఒక నీలి నీడ మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతోంది... స్థిమితంగా ఉండనివ్వకుండా కేకలు పెడుతోంది... ఏదో చేసేస్తానంటూ అరుస్తోంది.. నిలుచున్నా, నడుస్తున్నా, కూచున్నా, లేచినా, నిద్రపోతున్నా, కళ్లు తెరిచి ఉన్నా.. వేధిస్తూనే ఉంది.. దాన్ని చూస్తేనే ఉలికిపాటు.. తలుచుకుంటే గగుర్పాటు.. ఆలోచనల్లో అదురుపాటు.. శరీరం చెమటలు కక్కుతోంది.. ఒళ్లు వణికిపోతోంది.. గుండె తన వేగాన్ని పెంచేసింది.. ఊపిరి భారంగా మారిపోయింది.. ఆర్చేవారు లేరు.. తీర్చేవారు లేరు.. ఆ నీడను తరిమేసే వారు లేరు.. అది నీడ కాదు.. దాని పేరు భయం..

మానవాళి నెత్తిపై ఇప్పుడు భయం మరో శత్రువుగా రాజ్యమేలుతోంది... ఇది మానసిక శత్రువు.. ఈ తరాన్ని అదే పనిగా వేధిస్తున్న శత్రువు.. ధైర్యం, సాహసం, నమ్మకం లాంటి పదాలకు చోటు లేని లోకంలో మనుషుల్ని ఆమాంతంగా మింగేస్తోంది.. చిన్నతనంలోనే చిదిమేస్తోంది.. అర్థం లేని కారణాలతో జీవితాల్ని అనర్థంగా నాశనం చేసేస్తోంది...
--------------1----------------
అమ్మ కడుపులో ఆటలాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందం...
ఆందోళన అంటే ఏమిటో తెలియని ఒక అద్భుతమైన లోకం అమ్మ కడుపు..
ఆ కడుపులోంచి బయట పడినప్పుడు
సడన్‌గా ఏదో శత్రులోకంలోకి వచ్చిన ఫీలింగ్‌
అప్పుడు శిశువు మొదలు పెట్టే ఏడుపు పేరు భయం..

అన్నం తిననంటూ మారాం చేస్తుంటే..
అమ్మ చూపించే బూచీ పేరు భయం..

స్కూలుకు ఎగ్గొట్టినప్పుడు
నాన్న కోపంగా చూసే చూపు పేరు భయం..

హోం వర్క్‌ చేయకపోతే..
మాస్టారు చూపే బెత్తం పేరు భయం..

ఇంటర్‌లో మార్కులు సరిగా రాకపోతే..
అంతా ఏమంటారో అన్న ఆందోళన పేరు భయం...

పెండింగ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేయకపోతే
ఆఫీస్‌లో బాస్‌ ఇచ్చే వార్నింగ్‌ పేరు భయం..

అజ్ఞానం, అమాయకత్వం జతకడితే
వెంటాడే అతీంద్రియ శక్తుల పేరు భయం..

వెంటాడే జ్ఞాపకాల నీడ భయం..
చెట్టు భయం..
పుట్ట భయం..
పురుగు భయం..
నీడను చూసినా భయం..
మనిషి మనిషిని చూస్తే భయం...
-----------2-----------
భయం అన్న పదాన్ని కొంత పాలిష్డ్‌గా వాడితే దానిపేరు ఫోబియా... ప్రతి మనిషి మనసు లోపలి పొరల్లో ఈ ఫోబియా ఏదోరకంగా మనిషిని వెంటాడుతూనే ఉంది.. కారణాలు ఉండవు.. అర్థం ఉండదు.. ఏదో ఆలోచన.. ఏదో సంఘటన... ఒక ఓటమి.. ఈ ఫోబియాను సృష్టిస్తుంది.. పెను భూతంగా మార్చేస్తోంది.. ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది రకరకాల ఫోబియాలతో బాధపడుతున్నారట.
ఊహ తెలియని రోజుల్లో ఏదో చిన్న ఘటన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.. పెరిగిన కొద్దీ ఆ ఘటన మర్చిపోతాం.. ఏం జరిగిందో కూడా మనకు గుర్తుండదు.. కానీ దాని ఛాయలు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా రూపాల్లో వేటాడుతుంది..

కొందరికి కొన్ని రూపాలను చూస్తే భయం.. కొందరికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయం.. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా భయం కలుగుతుంది.. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? మెదడులో జరిగే రసాయనిక ప్రక్రియలో సంతులనం తప్పితే వచ్చే అనర్థాలివి...

ప్రతి వాళ్లలోనూ భయం ఛాయలు ఉంటాయి.. ఎవరూ బయటపడరు.. ఎప్పుడూ అవి కనిపించవు.. ఇవి ఉన్నట్లు కూడా వారికి తెలియదు.. చిన్న విషయం పెద్దదై... చూస్తుండగానే భయంకరమైందిగా మారిపోతుంది..

పాలుగారే పిల్లవాడు పరుగులు పెట్టి డాలర్లు సంపాదించాలనే ట్రెండ్‌ ఉన్న సొసైటీ మనది.. ఈ ఒత్తిడి పిల్లలపై పడి.. నూటికి నూరుశాతం మార్కులు రాకపోతే ఏమవుతుందోనన్న టెన్షన్‌ భయంగా మారి డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాలు ఎన్నెన్నో.. సరదాగా చదువుకోవాల్సిన పిల్లలు భయంతో చదువుతున్నారు.. ఈ భయం వాళ్లను బలవన్మరణానికి పురికొల్పుతోంది..

నిజానికి ఈ భయం అనవసరమైంది.. కానీ, దీన్ని సృష్టించింది మన సొసైటీయే.. పసివాళ్ల లేత నరాలను చదువు పేరుతో పట్టి పిండేస్తున్నదీ సొసైటీ..

ఆడపిల్లల్లో ఈ ఫోబియా మరీ దారుణం.. చిన్నప్పుడు కుటుంబంలో.. పెద్దయిన కొద్దీ స్కూల్‌లో, ఉద్యోగంలో.. లైంగిక వేధింపులు వాళ్ల మానసిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది.. ఇది పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్‌లోకి మారుతుంది.. అర్థంతరంగా జీవితాన్ని ముగించాలన్న భయంకరమైన నిర్ణయాన్ని తీసుకునే స్థితిని కలిపిస్తుంది...
భయం చిన్నగానే మొదలవుతుంది.. అది పెద్దగా మారుతున్నప్పుడే మెదడులో టెన్షన్‌ పెరుగుతుంది.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు.
----------------3----------------------
ఏ రకమైన భయం ఎందుకు కలుగుతుందో తెలియని పరిస్థితి... ఈ భయాలు ఎలా ఉంటాయంటే వినటానికి సిల్లీగా.. మనకే నవ్వు వచ్చేలా ఉంటాయి.. కానీ, భయపడుతున్న వ్యక్తికి మాత్రం అది ఒక పెను ముప్పుగా కనిపిస్తుంది.. ప్రపంచంలో ఎన్ని రకాల భయాలు జనాలను వేధిస్తున్నాయో మీకు తెలుసా.. పదివేల వరకూ ఉన్నాయిట..
ఫోబియా అనేది విచిత్రం.. దానికి ఎలాంటి కారణాలు ఉండవు.. ఎందుకు కలుగుతుందో తెలియదు.. దానికి చిన్నాపెద్దా తేడా ఉండదు.. ఊహ తెలియని రోజుల్లో ఎప్పుడో ఏదో రకంగా పుట్టిన భయం.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది..
మాడొన్నా.. ఆ వంపులు వయ్యారంగా సయ్యాటలాడుతుంటే, కళ్లల్లో కసి రేపుతుంటే, కనుగుడ్డు కదిలించకుండా చూడని వాడు ఈ తరంలో ఎవరుంటారు చెప్పండి...
ఇంతటి మడొన్నాకు ఓ ఫోబియా ఉంది.. పది కిలోమీటర్ల దూరంలో పిడుగు పడిన శబ్దం వినిపించినా ఇంతే సంగతులు.. బెడ్‌పై ఎగిరి గంతేసి భయంతో దుప్పటి కప్పేసుకుంటుంది..
నికొల్‌ కిడ్‌మాన్‌..... నాలుగేళ్ల క్రితం ఆస్కార్‌లో హల్‌చల్‌ సృష్టించిన లేడీ బాస్‌.. హాలీవుడ్‌ను ఒక ఊపేసిన బ్యూటీస్టార్‌...
ఈ హాలీవుడ్‌ బ్యూటీకి నేచర్‌లో ఈమెతో పోటీ పడుతున్న బ్యూటీ బటర్‌ఫ్లైస్‌ అంటే చాలా భయం..షూటింగ్‌ స్పాట్‌లో ఒక బటర్‌ఫ్లై కనిపించినా ప్యాకప్పే...
స్కార్లెట్‌ జాన్సన్‌... అమెరికన్‌ బ్యూటీ.. నటి.. సింగర్‌.. ఈ న్యూయార్క్‌ బేబీ అమెరికన్లనే కాదు.. ప్రపంచ ఇంగ్లీష్‌ మూవీ వ్యూయర్స్‌ మనసుల్ని ఇట్టే కొల్లగొట్టేసింది..
ఇంతటి పుత్తడి బొమ్మ దేన్ని చూస్తే భయపడుతుందో తెలుసా.. కాక్రోచెస్‌.. సింపుల్‌గా బొద్దింక.. అది ఏమీ చేయదని తెలుసు.. కానీ, అదంటే మాత్రం ఏదో తెలియని భయం..
బాలీవుడ్‌ సెక్సీగాళ్‌.. కంగనా రనౌత్‌ ... కళ్లతోనే కైపెక్కించే ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే....
ఇంత గొప్ప స్టార్‌కు కార్‌ లేకుండా ఎలా ఉంటుంది? కానీ, ఆమెకు కారు నడపాలంటే భయం.. కనీసం ముంబైలోని తన ఫ్లాట్‌ ఆవరణలో నడపాలన్నా గువ్వలా వణికిపోతుంది..
బిపాషా బసు.. బాలీవుడ్‌లో సెక్సీలెగ్‌ సుందరి.. ఈ అమ్మడితో నటించేందుకు బాలీవుడ్‌ హీరోలు క్యూ కట్టేస్తారు..
ఈమెకు ఉన్న ఫోబియా ఏంటో తెలుసా... సెల్‌ఫోన్‌లో మాట్లాడటం.. సెల్‌ఫోన్‌ను ముట్టుకోవటం.. ఎవరైనా ఫోన్‌ చేస్తే.. ఎస్‌ఎంఎస్‌ ఇవ్వండి అంటుందిట.. ఆ ఎస్‌ఎంఎస్‌ను సెక్రటరీ చదివి చెప్తే.. అవసరమైతే, ల్యాండ్‌లైన్‌ నుంచి కాల్‌ చేసి జవాబిస్తుందిట..
----------------------4---------
అసలు ఇవన్నీ భయాలేనా? బొద్దింకల్ని, సీతాకోక చిలుకల్ని చూస్తే భయపడటం ఏమిటి? అదే విచిత్రం.. వీటినే ఫోబియాలంటారు... ఎవరికి, దేన్ని చూస్తే, ఎందుకు భయమో అర్థం కాదు.. వారికే తెలియదు.. కారణాలు ఉండవు.. మనసులో ఏదో మూలన నక్కి ఉన్న గుబులు.. ఒక్కసారిగా బయటపడుతుంది.. శరీరంలోని అన్ని నరాలను కుదిపేస్తుంది. బ్రెయిన్‌ను ఇన్‌బ్యాలెన్స్‌ చేస్తుంది.
ఇరవై ఏళ్ల పాటు ఏ అలజడీ తెలియని ఓ అమ్మాయికి ఒక్కసారిగా ఉలికిపాటు మొదలవుతుంది.. టెలివిజన్‌లో మూవీ మసాలా వస్తోంది. అంతలోనే ఆందోళన.. తన వెనుక ఎవరో ఉన్నారన్న భ్రమ.. వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది.
ప్రియుడితో సరదాగా కబుర్లు చెప్తుంటే ఏదో దయ్యం తననే చూస్తున్నదన్న ఆలోచన ప్రియురాలికి చెమటలు పట్టిస్తుంది..
ఒకటి కాదు.. రెండు కాదు.. వేల రకాల భయాలు.. ఫోబియాలు ప్రజల్ని చిత్తడి చేస్తున్నాయి. తన భయానికి పరిష్కారమే లేదన్న ఆందోళన, జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.. తమలో కలుగుతున్న ఆందోళన ఏమిటని విశ్లేషించుకోలేరు.. తాము ఊహించుకున్నదే కరెక్టని అనుకుంటారు.. ఎవరితోనూ తమ భయాన్ని పంచుకోరు.. ఒకవేళ ఎవరికైనా చెప్పినా.. వారు చెప్పే మంచి మాటలకు అంత తేలిగ్గా కన్విన్స్‌ కారు. ఆ క్షణం వరకు కాస్త కన్విన్స్‌ అయినట్లు కనిపించినా.. లోలోపల గుబులు వెంటాడుతూనే ఉంటుంది.రకరకాల ఫోబియాలతో బాధ పడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే దాదాపు ఆరు కోట్ల మంది దాకా ఉందంట.. అన్నీ ఉన్న అమెరికాలాంటి అగ్రదేశంలోనే ౫౦ లక్షల మంది ఈ ఫోబియాలతో అల్లాడిపోతుంటే ఇక మన దేశం సంగతి చెప్పేదేముంది?
ఆడపిల్లల్లో చిన్ననాట లైంగిక వేధింపులకు గురైతే.. దాని భయం.. పెద్దయ్యాక పడకగదిలో కూడా వెంటాడుతుంది..వింత వింతగా ప్రవర్తిస్తారు.. కారణాలు తెలియక, సరైన కౌన్సిలింగ్‌ చేయలేకపోవటం మహిళల పట్ల సమస్యాత్మకంగా మారుతోంది..
ఫోబియా.. భయం.. ఇదేమీ చిన్న విషయం కాదు.. అలా అని నిజంగా భయపడి పారిపోయేంత పెద్ద విషయమూ కాదు.. మనిషి లోపలి పొరల్లో దాక్కున్న దౌర్బల్యం అతణ్ణి ఫోబియా ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తోంది.. అందుకే గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే............అదే భయం..

నాగా-వారు ఎవరికీ అర్థం కారు..

4 comments
వారు ఎవరికీ అర్థం కారు..
ఎవరి అపార్థాలతో వారికి పని లేదు..
అలంకారాలు అక్కర లేదు..
జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు.
ఆహార్యం ప్రధానం కాదు..
నగ్నత్వమే వారి వేషం..
ఆహారం ముఖ్యం కాదు..
దొరికిందే తింటే చాలు..
రుచితో పనిలేదు..
శరీరంపై మోహం లేదు..
మృత్యువంటే భయం లేదు..
హిమాలయ సానువుల్లో నివాసం...
పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం..
అడుక్కునే వాళ్లంటూ తిట్టేవాళ్లున్నారు..
అవధూతలని అర్చించేవారూ ఉన్నారు..
ఎవరితోనూ వారికి అవసరం లేదు..
వారు ఎవరికీ అర్థం కారు..
ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు.

ఏమైనా అనుకోండి.. పిచ్చివాళ్లని నిందించుకోండి... వెర్రిబాగుల వాళ్లని వెక్కిరించండి... వంటిమీద నూలుపోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి... శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకొండి.. హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి... వారికి మీ ఊసులు అక్కర లేదు.. వారికి మీ అభిప్రాయాలతో పని లేదు.. వారికి లోకంతో పని లేదు.. లోకం తమ గురించి ఎన్ని అనుకున్నా వారికి అవసరం లేదు.. ఎవరు వారు..? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు?
ఇంటి నుంచి బయటకు కాలు మోపితే, అంతా మనల్నే చూడాలని ఎంత తాపత్రయ పడతాం? ఆడామగా తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవటం తెలిసిందే.. ఒంటి అలంకారం కోసం వాడే కాస్మోటిక్స్‌ అన్నీ ఇన్నీ కావు.. పర్‌ఫ్యూమ్స్‌ గురించయితే చెప్పనే అక్కర్లేదు.. వంద గ్రాముల పర్‌ఫ్యూమ్‌ను వంద పదులైనా సరే కొనటానికి వెనుకాడం... కానీ, ఇవన్నీ అక్కరలేని జాతి ఒకటి ఉంది.. మన దేశంలోనే ఉంది..మన మధ్యలోనే ఉంది.. ఆ జాతికి వీటితో పనే లేదు.. ఎవరితోనూ ఆ జాతికి సంబంధమూ లేదు..
2
ఎందుకిలా ఉంటారు? మామూలుగా ప్రపంచం అంతా తమను చూస్తున్నదన్న జిజ్ఞాస వీరికెందుకు ఉండదు? ఎందుకు పట్టదు..? మనకు తెలిసిన సిగ్గు, అభిమానం, మానావమానాలు వీరికి ఉండవా? కనీసం కౌపీనం కూడా లేకుండా వీళ్లిలా ఉండటానికి కారణం ఏమిటి?
సాధారణంగా మనం నిత్యం చూసే సాధు సంతులకు కాషాయం, కమండలం, దండం అస్తిత్వాలు.. మిగతా రెంటి మాటెలా ఉన్నా, కాషాయం సన్యాసానికి ఒక విధంగా యూనిఫామ్‌ లాంటిది.. ఎందుకంటే కాషాయం త్యాగానికి చిహ్నం.. సన్యాసులూ అన్నింటినీ త్యాగం చేసి వెళ్తారు కాబట్టి, సాధారణంగా వారు కాషాయాన్నే ధరిస్తారు..
ఇది కామన్‌ ఎలిమెంట్‌.. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు..కానీ ఎవరికీ అంతుపట్టని సాధువుల సమాజం ఒకటుంది.. అది అత్యంత రహస్య సమాజం.. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో తెలియని అఖారాల్లో ఉండే సాధు జాతి.. దాని పేరు నాగా.. ఆ సన్యాసులే నాగా సాధువులు.
మిగతా సొసైటీతో వీరికి ఎలాంటి సంబంధం లేదు.. తమ లోకంలోనే వారు జీవిస్తుంటారు.. అన్నింటినీ వదిలిపెట్టేసిన వారు.. చివరకు శరీరంపై బట్టల్నీ విడిచిపెట్టిన వాళ్లు.. నాగా సాధువులు
వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు.. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తికాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్లిపోతారు..
అంతే కాదు.. జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి.. విడ్డూరంగా కనిపిస్తాయి..
త్రిశూలాలు ధరిస్తారు.. కత్తులు పట్టుకుంటారు.. వాటితో వీరంగం వేస్తారు.. వీరనాట్యాలు చేస్తారు.. కర్రసాము చేస్తారు..
హుక్కా, చిలుమ్‌ వంటి వాటి ద్వారా పొగాకు, నార్కొటిక్స్‌ వంటివి పీలుస్తారు..
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులని పిలవటం ఏమిటి? అదే మిస్టరీ... అతి కఠినమైన యోగ సాధనకు పరాకాష్ట..
3
సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో...అవన్నీ వారు చేస్తారు.. బట్టలు ధరించకపోవటమే ఒక సమస్య అనుకుంటే, హుక్కా, చిలుమ్‌ పీల్చటం, ఏది పడితే అది తినేయటం.. ఒంటిని కనీసం శుభ్రంగా కూడా ఉంచుకోకపోవటం.. ఇవన్నీ నిజంగా సాధు లక్షణాలేనా? అన్నీ నెగెటివ్‌ షేడ్సే.. ఏమిటీ రహస్యం? వాట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌ ఆఫ్‌ నాగాస్‌..
పవిత్ర గంగానదీ తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు, మహా కుంభమేళా జరుగుతుంది.. ఆ కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగా సాధువులే. వేల సంఖ్యలో దిగంబర సాధువులు విభూతి అలంకారాలతో శివ పంచాక్షరి నినదిస్తూ రావడం ఒక అపురూప సన్నివేశం..
నాగా సాధువులు పుష్కరాల సమయంలోనే జనంలోకి వస్తారు.. జనానికి కనిపిస్తారు.. పుష్కరాలకు ముందు కానీ, తరువాత కానీ, వారు బయటి ప్రపంచానికి కనిపించరు..
వారి చర్యలు విచిత్రం.. వారి చేష్టలు విచిత్రం. అందుకే వారిది అత్యంత అరుదైన సమాజం.. హిమాలయాలు.. దేవతల ఆవాసాలంటారు.. నాగా సాధువులు ఉండేది కూడా ఈ హిమాలయాల పర్వత శ్రేణుల్లోనే.. కాకపోతే బయటి ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను ఏరి కోరి ఎంచుకుని మరీ తమ మెడిటేషన్‌ను కొనసాగిస్తారు.
వారికి ఎండ లేదు.. వాన లేదు.. చలి లేదు.. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచీ కాపాడుతుంది. చిలుమ్‌, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి.. మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయి..
వారు శివుడిని, అగ్నిని ఆరాధిస్తారు.. మిగతా దేవుళ్లందరినీ పూజిస్తే వాళ్లు స్పందించే సరికి చాలా సమయం పడుతుందిట.. అగ్నిని ఆరాధిస్తే.. ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట.. ఆ విభూతే నాగా సాధువులకు సర్వస్వం అవుతోంది..
4
విభూతి అంటే ఐశ్వర్యం.. నాగా సాధువులకు ఈ విభూతే ఐశ్వర్యం.. సర్వ సంపదలూ ఈ విభూతే.. పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూతే వారికి సర్వాలంకారం. చూసే మనబోటి వాళ్లకు విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, వారికి అది అవసరం లేదు.. అత్యంత కఠినమైన యోగసాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివసైనికులు వీరు.
ఉజ్జయిని.. మహా కాళేశ్వరుడిగా శివుడు పూజలందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడ ఒకటి.. దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది.. ప్రతి రోజూ రాత్రి పూట ఉజ్జయిని స్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుంచి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు.. భస్మరాశి విభూతిగా మారిపోతుంది... మన శరీరమే విభూతి అని చెప్పటానికి ప్రతీక ఈ అభిషేకం..
నాగా సాధువులు తమ శరీరానికి రాసుకునే విభూతి కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుందనటాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయటమే దీని ఉద్దేశం.
సాధువుల్లో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని చెప్తారు. ఎప్పుడు, ఎలా సృష్టించిందీ ఎవరికీ తెలియదు.. సనాతన ఆధ్యాత్మిక ధర్మాన్ని రక్షించేందుకు అదిశంకరాచార్య నాగా సాధువులందరినీ ఒకటి చేశారని అంటారు..
మనం ఉంటున్న ఈ మెటీరియలిస్టిక్‌ వరల్డ్‌ను వీరు కేర్‌ చేయరు. . ఆర్మీలో ఓ రెజిమెంట్‌లాగా నాగా సాధువులు ఉంటారు. వీళ్లు శివుడికి సైనికుల్లా వ్యవహరిస్తారు..ఎవరినీ దగ్గరకు రానివ్వరు.. అఘోరాల్లా అతి తీవ్రంగా లేకపోయినా, వీరి దారి వేరు.. చాలా ఆవేశపరులు.. వారి ఆగ్రహం ప్రదర్శించటానికి బెస్ట్‌ ఆప్షన్‌గా పరిగెడ్తారు.. ఇంకొందరు హింసాత్మకంగా కూడా మారతారు..
అఖారాలని పిలిచే వారి ఆశ్రమాల్లోకి కూడా ఎవరినీ రానివ్వరు.. ఎవరైనా చొచ్చుకుని పోతే అక్కడ మరింత విచిత్రమైన చర్యలు కనిపిస్తాయి. సామాన్యులకు అసాధారాణమైన యోగాసనాల్లో నాగా సాధువులు కనిపిస్తారు.. ఆశ్రమంలోకి వచ్చిన వారిపై ముందు ఆగ్రహించినా తరువాత అనుగ్రహిస్తారు.. సామాన్యంగా కనిపించే సన్యాసులకు, వీరికి అదే తేడా... అందుకే వీరిని నాగాలన్నారు..
-5-
సాధువులుగా మారటం తేలికే.. సన్యాసం తీసుకోవటమే కష్టం. అన్ని సుఖాలను వదిలేసి ఆశ్రమ జీవితం గడపటం ఇంకా కష్టం. కానీ ఈ ఆశ్రమ జీవితాన్నీ వదిలేసి, శరీరాన్ని గాలికి వదిలేసి, నిద్ర, ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి పూర్తిగా నాగాలుగా మారటం ఊహించినంత తేలిక కాదు.. చాలా, చాలా కష్టపడ్డ తరువాత కానీ, నాగాలుగా మారటం కుదరనే కుదరదు..
నాగా సాధువులు అంటే ప్రధానంగా దిగంబరులు.. ఇదెలా సాధ్యం? జీవితాంతం ఇలా ఉండటం ఎలా వీలవుతుంది? అదీ మంచు కొండల్లో.. గడ్డకట్టే చలిలో నూలుపోగైనా లేని ఒంటిని కేవలం విభూతి ఎలా రక్షిస్తుంది.. కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏమూలకు పనికి వస్తాయి? మరి వీళ్లెలా ఉండగలుగుతున్నారు?
నిజం.. ఇలా ఉండటం సామాన్యుడికైతే క్షణమైనా సాధ్యం కాదు.. నాగాలుగా మారేందుకు ఈ సాధువులు చాలా హార్డ్‌వర్క్‌ చేయాల్సి ఉంటుంది.
సర్వస్వం త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్న వారు ముందుగా ఇల్లూ వాకిలీ వదిలేసి సాధారణ సన్యాసం స్వీకరించాలి.
ఆరు సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి.
అన్ని రుచులను వదిలేయాలి.
అన్ని వాసనలకూ దూరంగా ఉండాలి.
అన్ని సుఖాలను త్యాగం చేయాలి.
అన్ని మోహాలను వదిలిపెట్టాలి.
చివరకు వస్త్రాల్నీ వదిలేయాలి.
ఇవన్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు.. ప్రతి విషయంపైనా ఏకాగ్రత సాధించటానికి చాలానే కష్టపడతారు.. ఆ తరువాత అయిదుగురు గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవలసి ఉంటుంది. ఆరు సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కౌపీనం అంటే లంగోటీ ధరించి ఉంటారు.. ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు.. అంటే ఈ మెటీరియలిస్టిక్‌ వరల్డ్‌లోని సంసారం నుంచి తనను తాను నాగా సాధువు వేరు చేసుకున్నట్లని అర్థం.
నేను అనే ఈగోను విడిచేయడమే నాగా సాధువుల్లోని ప్రత్యేకత. బయటి శరీరం కంటే, లోపల ఆత్మ అన్నది ఒకటుందని వీరు గాఢంగా నమ్ముతారు.. ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు.. మిగతా శరీరంతో వారికి పని లేదు. కాబట్టి దాని గురించి పట్టించుకోరు.. మిగతా ప్రపంచం కంటే చాలా పరిశుభ్రమైన జీవనం తమదని నాగాలంటారు.
నాగా సాధువులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు.. ఎక్కడికీ వెళ్లరు.. కేవలం కుంభమేళాలు జరిగినప్పుడే ఆ నదీతీరానికి వాళ్లు వస్తారు.. పవిత్ర స్నానాలు చేసి వెళ్లిపోతారు.. ఈ లోకంలో ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు నాగాలు..

దేవుడు శరీరాన్ని త్యాగం చేస్తాడా?

3 comments
దేవుడికి మరణమా? అసలు ఉన్నాడో, లేడో అన్న వాదోపవాదాలు జరిగే దేవుడికి చావు ఉండటం ఏమిటి? మన వేదాల ప్రకారం పుట్టుకే లేని భగవంతునికి మృత్యువు ఎక్కడిది..? చావు పుట్టుకలకు అతీతమైన దేవుడు శరీరాన్ని త్యాగం చేస్తాడా? ఆ శరీరానికి అంత్యక్రియలు జరుగుతాయా? అదీ మనుషులు అంతిమ సంస్కారం చేస్తారా? ఇది వింతా? విచిత్రమా? విడ్డూరమా? లేక వాస్తవమా?

అవును.. ఇది నిజం... ఈ భూమ్మీదే జరుగుతోంది. మన దేశంలోనే జరుగుతోంది.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దేవుడికి జరుగుతున్న కార్యక్రమం ఇది.. మనుషులే చేస్తున్న అద్భుతమైన సంస్కారం ఇది. ఎందుకిలా చేస్తారు? దేవుడికి పార్థివ శరీరం ఉండటం ఎలా సాధ్యపడుతుంది? అంటే దేవుడు ఉన్నాడన్నది వాస్తవమేనా? కేవలం విశ్వాసం కాదా?

మన పురాణాల ప్రకారం దేవుడు నిరాకారుడు.. అంటే ఆకారం అంటూ లేని వాడు.. అందుకే మన వాళు్ల భూమిని కొలుస్తారు.. ఆకాశాన్ని కొలుస్తారు.. రాయి, రప్పను కొలుస్తారు.. పామును కొలుస్తారు.. గోవును కొలుస్తారు.. ఒక ఇటుకకు పసుపు కుంకుమ పెట్టి దాన్ని దేవతగా కొలుస్తారు.. దేనికీ ఆకారమే ఉండదు.. తమకు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలో దేవుళ్లను కొలుస్తారు..

మరి ఓ స్పెసిఫిక్‌ ఆకారమే లేని దేవుడికి శరీరం మాత్రం ఎలా ఉంటుంది? అదే దేవ రహస్యం.. దేవుడికి రూపం అనేది ఓ పదార్థం. అంటే మెటీరియల్‌.. ఈ మెటీరియల్‌ లోపల ఉండే చైతన్యమే దైవత్వం అని మనవారి గాఢ విశ్వాసం..

సైన్‌‌స ఎప్పుడూ మెటీరియలిస్టిక్‌గా ఆలోచిస్తుంది.. ఇదిగో ఈ దేవుడు ఆ మెటీరియల్‌ ఏమిటో మనకు చూపిస్తున్నాడు.. దాని రహస్యాన్ని వివరిస్తున్నాడు. మెటీరియల్‌లో చైతన్యం ఎలా ఉంటుందో.. ఆ చైతన్యం లేనప్పుడు ఎలా నిర్జీవంగా మారుతుందో రుజువు చేస్తున్నాడు..

మనం బట్టల్ని మార్చినట్లు ఈ దేవుడు తరచూ తన శరీరాన్ని మార్చేస్తున్నాడు..ఇది మన కళ్ల ముందు జరుగుతున్న ప్రక్రియ.. ప్రజలు ఒక పండుగలాగా చేసుకునే అద్భుతమైన కార్యక్రమం ఇది.. ఇదెలా జరుగుతోంది?

2

పూరీ జగన్నాథుడు.. అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రథయాత్ర... ప్రపంచంలో మరెక్కడా లేని అతి పెద్ద రథయాత్ర... లక్షలాది ప్రజలు అతి పెద్ద రథాలను లాగే అపురూప ఉత్సవం.. ప్రతి ఏడాది ప్రపంచంలోని లక్షలాది ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూసే వేడుక... కానీ, రథయాత్రను మించిన ఎన్నో ప్రత్యేకతలు మనకు ఇక్కడ కనిపిస్తాయి... అందులో ఒకటి జగన్నాథుడు తన శరీరాన్ని విడిచిపెట్టడం..

పూరీలో జగన్నాథ రథచక్రాలు మరోసారి కదిలాయి..

జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు మూడు రథాలపై పూరీలో తిరుగుతున్నారు..

ఈ రథయాత్రను చూసేందుకే లక్షలాది ప్రజలు తరలి వస్తారు.

రోజుల తరబడి వేచి చూస్తారు..

రథాన్ని లాగడానికి ఉత్సాహపడతారు..

మూడు కిలోమీటర్ల పొడవైన తాడును ఎన్ని వేల మంది లాగుతారో మీరే ఊహించుకోండి...

మామూలుగా దేవుళ్లకు రథోత్సవం జరుగుతుంది. కానీ, రథంలో ఊరేగే దేవుడు ఉత్సవ మూర్తే...

కానీ, పూరీలో సాక్షాత్తూ మూల విరాట్టే వీధిలోకి వచ్చి రథంపై కూర్చొని ఊరేగుతాడు..

ఇది విచిత్రం ఏం కాదు.. ఇక్కడి ప్రత్యేకతే అది..

గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు మూర్తులను కదిలించి బయటకు తీసుకువచ్చి రథంపై కూర్చోబెట్టి పది రోజుల పాటు రథయాత్ర నిర్వహించటం ఇక్కడ మాత్రమే కనిపించే సంప్రదాయం..

జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఊరేగే రథాలు ఏ యేటికాయేడు కొత్తగా తయారు చేసేవే. ఒకసారి ఉపయోగించిన రథాన్ని మళ్లీ ఉపయోగించరు.. పోనీ ఆ రథం మామూలుగా ఉంటుందా అంటీ అదీ లేదు.. ఒక్క జగన్నాథుడి రథమే 45 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏకంగా పదహారు రథచక్రాలు ఉంటాయి. ఇది నందఘోష రథం. ఇక బలభద్రుడి రథం ఒక అడుగు తక్కువ ఉంటుంది. ఇదీ 14 రథచక్రాలతో నడుస్తుంది. మూడోరథం ఇంకో అడుగు తక్కువతో తయారు చేస్తారు.. ఇవన్నీ పూర్తిగా కలపతో చేసినవే.. ప్రత్యేకంగా పెంచిన చెట్ల కలపను వాడి తయారు చేసినవే.

ప్రతి ఏడూ కొత్త రథాన్ని తయారు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు.. అంత ఈజీ కూడా కాదు.. కానీ, పూరీలో మాత్రం ఇది సాధ్యమవుతోంది. వందల సంవత్సరాలుగా ఈ రథయాత్ర ఆగకుండా సాగుతోంది..

3

రథయాత్ర ఓకే.. చాలా గొప్పగా జరుగుతుంది.. యాత్ర పూర్తి కాగానే రథాల్ని పూర్తిగా ఏ భాగానికి ఆ భాగం విడగొడతారు.. మళ్లీ ఏడాది కాగానే కొత్త రథాలు తయారవుతాయి. పూరీలో ఇదొక్కటే విచిత్రం కాదు.. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.. ఇక్కడి జగన్నాథుడు మనలో ఒకరుగానే ఉన్నట్లుగా ఇక్కడి ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగమేనా అంతిమ సంస్కారం.. ? ఇదేం విడ్డూరం?

ప్రపంచంలో పూరీలోని ఆలయమే ఒక విచిత్రమైన ఆలయం.. సాధారణంగా ఆలయాల్లో లక్ష్మీ నారాయణులో, సీతారాములో, శ్రీనివాస పద్మావతులో, శివ పార్వతులో ఇలా జంటలుగానే దేవతా మూర్తులు కనిపిస్తారు.. కానీ, పూరీలోని ఆలయంలో అన్నా చెల్లెళు్ల ఉంటారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, వాళ్ల చెల్లెలు సుభద్రలు ఇక్కడ ప్రధాన దేవతలు. ఈ మూల విగ్రహాలను సైతం కలపతోనే తయారు చేస్తారు..

ఇక్కడ ఇంకో విచిత్రమూ ఉంది..ఇక్కడ కనిపించే జగన్నాథ స్వామి మొండి చేతుల వాడు.. ఈ మూర్తికి చేతులు పూర్తిగా ఉండవు. ఈ విగ్రహాన్ని తొలిసారి విశ్వకర్మ రూపొందిస్తున్నప్పుడు ఒరిస్సా రాజు ఇంద్రద్యుము్నడు ఆటంకం కలిగించటం వల్ల విగ్రహం పూర్తి కాకుండానే విశ్వకర్మ వెళ్లిపోయాడట.. అప్పటి నుంచీ జగన్నాథ స్వామి మొండి చేతుల వాడిగానే భక్తులకు దర్శనమిస్తున్నాడు.

స్వామి వారి విగ్రహమైనా సాధారణంగా ఉంటుందా అంటే అదీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటుంది.. పెద్ద పెద్ద గుండ్రని కళు్ల జగన్నాథుడికి ఉంటే, బలభద్రుడికేమో ఓవెల్‌షేప్‌లో కళు్ల ఉంటాయి. వీటికి కింది నుంచే కాస్తంత ఉన్న మొండి చేతులు ఉంటాయి. విగ్రహాన్ని చూడగానే ప్రత్యేక ఆసక్తి కలుగుతుంది.

వీటన్నింటినీ ఓ ప్రత్యేకమైన కలపతోనే తయారు చేస్తారు.. వీటికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.. మరి అలాంటి విగ్రహాలకు కాలనుగుణంగా కొన్ని నియమిత సంవత్సరాలకు అంతిమ సంస్కారం జరగటం వెనుక పెద్ద రహస్యమే దాగి ఉంది.. అదే పూరీలోని పరమ అద్భుతమైన విశేషం...

4

ఇంతటి విశిష్ఠత కలిగిన జగద్గురువుకు అంతిమ సంస్కారం చేయటం ఏమిటి? ఇలాంటి విశేషమైన ఉత్సవం అన్నది ప్రపంచంలో పూరీలో తప్ప మరెక్కడా జరగదు.. ఇది అంతిమ సంస్కారం కాదు.. కొత్త శరీరంలోకి భగవంతుడు మారటం.. అవును.. జగన్నాథుడు పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు.. అదే పూరీలో జరిగే నవ కళేవర ఉత్సవం...

మనం మాసిన బట్టలను వదిలేసి ఉతికిన బట్టలను రోజూ మార్చుకుంటాం.. పూరీలో జగన్నాథుడు పాత శరీరాన్ని విడిచిపెట్టి, సరికొత్త శరీరాన్ని ధరిస్తాడు.. దీన్ని నవ కళేవర ఉత్సవంగా పిలుస్తారు.. ఇది దాదాపు రెండు మాసాల పాటు సాగే అతి పెద్ద కార్యక్రమం..

ఖగోళ శాస్త్రం పద్ధతులను అనుసరించి ప్రతి 8, 11, 19 సంవత్సరాలకు ఒకసారి పూరీ జగన్నాథుడికి నవ కళేవర ఉత్సవాన్ని నిర్వహిస్తారు.. ఇది అంత ఈజీగా జరిగే తంతు కాదు.. మూల విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించటం.. ఇందుకోసం చాలా పెద్ద కసరత్తే చేస్తారు...విగ్రహాల తయారీ అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు..

నవ కళేవర ఉత్సవాలు ప్రారంభం కాగానే ఆలయ ప్రధానార్చక కుటుంబీకులు పూరీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కకట్‌పూర్‌కు వెళ్తారు.. అక్కడ ప్రాచీ నదిలో స్నానం చేసి పక్కనే ఉన్న మంగళాదేవి ఆలయంలోకి వెళ్లి అక్కడే నిద్రిస్తారు.. అమ్మవారు వారి కలలో కనిపించి జగన్నాథ స్వామి వారి విగ్రహానికి కావలసిన చెట్టు ఎక్కడుందో చెప్తుంది..

పూజారులు అక్కడి నుంచి అమ్మవారు చెప్పిన దిశలో కాలినడకన బయలు దేరి వెళ్తారు.. కొన్ని ప్రత్యేకతలు కలిగిన వేప వృక్షాలను కనుగొంటారు..

ఈ చెట్లకు ఖచ్చితమైన గుర్తులు కనిపించి తీరాలి..

జగన్నాథుడి విగ్రహం తయారు కావలసిన చెట్టు కాండంపై సుదర్శన చక్రం గుర్తు...


బలభద్రుడి విగ్రహ తయారీకి వాడే చెట్టుపై గద గుర్తు


సుభద్ర విగ్రహం కోసం వినియోగించే చెట్టుపై కమలం గుర్తు


ఆ చెట్ల నీడలో విషపాములు కనిపించాలి


దగ్గరలో తప్పనిసరిగా ఓ చింత చెట్టు ఉండాలి...




విగ్రహాల తయారీకి ఉపయోగించే చెట్టు కాండం నిటారుగా పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తుకు ఎదిగి ఉండాలి..
కాండం నాలుగు నుంచి ఏడు భాగాలుగా విస్తరించి ఉండాలి

చెట్లకు సమీపంలో ఒక స్మశానం, నీటి వనరు, శివాలయం ఉండి తీరాలి.

ఇన్ని రకాలుగా అన్నీ కుదిరిన తరువాత ఎంపిక చేసుకున్న చెట్లకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు.. ఆ తరువాత ఆ చెట్లను కొట్టేస్తారు.. వాటిని చెక్కతో తయారు చేసిన బండ్లపై ఎక్కించి పూరీ ఆలయానికి తీసుకువస్తారు.. ఉత్తర ద్వారం గుండా వాటిని ఆలయంలోకి తీసుకెళ్లి కోయిల్‌ వైకుంఠం ప్రాంగణంలో ఉంచుతారు.. అక్కడే విగ్రహాల తయారీ జరుగుతుంది. ఇది అత్యంత రహస్యంగా జరుగుతుంది.. సదరు శిల్పికి తప్ప ఎవరికీ అనుమతి ఉండదు.. చైత్ర మాసంలో మొదలయి, సరిగ్గా ఆషాఢ శుద్ధ చతుర్థి నాటికి విగ్రహాల తయారీ పూర్తవుతుంది.

అదే రోజు రాత్రి బ్రహ్మ ముహూర్తంలో పాత విగ్రహాలలోపల ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉన్న బ్రహ్మ పదార్థాన్ని ప్రధాన పూజారి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు.. దీంతో కొత్త విగ్రహాలకు చైతన్యం వస్తుంది. ఈ పదార్థాన్ని ఆ ముగ్గురు దేవతల అస్థికలని కొందరంటారు..మరికొందరు సాలగ్రామాలని పిలుస్తారు.. బౌద్ధులు బుద్ధుడి పన్ను అంటారు..శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం ఆయన అస్థికను ఈ విగ్రహాల్లో ఉంచారట.. అదే విధంగా సముద్రంలో శరీర త్యాగం చేసిన బలరాముడు, సుభద్రల అస్థికలనూ ఇందులో ఉంచారట.. వీటిని మారుస్తున్నప్పుడు పూజారి సైతం కళ్లకు గంతలు కట్టుకుంటారు..

కొత్త విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పాత విగ్రహాలను అత్యంత శాసో్తక్త్రంగా గుడిలోనే కోయిల్‌ వైకుంఠం అన్న ప్రాంగణంలో ఖననం చేస్తారు.. ఇక్కడ స్వామి తన పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి ప్రవేశించాడు..ఇది దేవుడికి మరణం కాదు.. జీవుడు తన దేహాన్ని మార్చుకోవటమే ఈ నవకళేవరలోని ప్రధాన అంశం.. ఇప్పటి వరకు 17సార్లు పూరీలో నవ కళేవర కార్యక్రమం జరిగింది. చివరి సారి 1996లో జరిగింది. రథయాత్ర కంటే ఈ కార్యక్రమానికి లెక్కించలేనంత మంది భక్తులు హాజరవుతారు.. శరీరంలో జీవుడు ప్రవేశించి, ఆ తరువాత బయటకు వచ్చి మరో శరీరంలో ఎలా ప్రవేశిస్తాడో.. జగద్గురువు ఇక్కడ బోధిస్తున్నాడు.. పునరపి జననం.. పునరపి మరణం లోని రహస్యార్థం ఇదే. ఆయన రథంపై స్థిరంగా కూర్చుని తిరగడం కూడా ఇలాంటిదే.. జీవుడిలోపల గూడు కట్టుకుని ఉండిపోయి, అతనికి మార్గదర్శనం చేస్తున్నాడు.. రాముడు తానుగా చేసి చూపించాడు.. కృష్ణుడు చెప్పి చేయించాడు.. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు.. పూరీలో ఆయన చూపించిందీ, చూపిస్తున్నదీ అంతా జీవ రహస్యమే.. కృష్ణం వందే జగద్గురుమ్‌.

కైలాసం నుంచి అమర్‌నాథ్‌ దాకా....

1 comments
ప్రకృతిలో పరమశివుడు..
అమర్‌నాథ్‌లో మంచు లింగం ఎలా ఏర్పడుతోంది?
కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్నదా? సహజంగా ఏర్పడుతోందా?
కొండ గుహలో ఒక్క చోటనే హిమ లింగం ఎలా వస్తోంది?
ప్రతి ఏడాది..
ఒకే సమయం..
ఒకే ఎత్తు..
ఒకే ఆకారంలో
శివలింగం ఏర్పడటంలో మర్మం ఏమిటి?
కైలాస పర్వతం నుంచి అమర్‌నాథ్‌కు శివుడు రావటం వాస్తవమేనా?

లయకారకుడి నిజరూపం శివలింగమేనా?

చావుకీ శివుడికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
1
ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి.. అని ఋగ్వేదం చెప్పింది. వస్తువు ఒక్కటే ఉంటుంది.. కానీ, అది అనేక పేర్లతో పిలువబడుతుంది..అని దీని అర్థం. ఈశ్వరుడు కూడా ఒక్కడే. కానీ ఆయన సహస్ర నామాంకితుడు. ఆయన త్రిమూర్తి స్వరూపుడు. సృష్టికార్యం నిర్వహించేప్పుడు ఆయన బ్రహ్మ అవుతాడు. లోకాల్ని పాలించినప్పుడు విష్ణువుగా ఉంటాడు. లయకారుడుగా మారినప్పుడు ఆయన శివుడవుతాడు. శివుడు దుష్టశక్తుల వినాశకారుడు. అందుకే ఋగ్వేదం శివుడిని రుద్రుడని సంబోధించింది. మనం త్రయంబకేశ్వరుని (రుద్రుని) పూజిస్తాం. ఆతడు పరిమళ భరితమైన ఓషధి వంటి వాడు ఆ ఓషధి మాకు బలమును కలిగిస్తున్నది. ఆతని వల్ల శ్రమ లేకుండా తొడిమ నుండి ఊడిపడిన దోసపండు వలె మృత్యువు నుంచి మేము విడిపోవుదము.''(ఋగ్వేదం).
యజుర్వేదం శివుడిని వీర యోగిగా అభివర్ణిస్తుంది. ఆయన జింకచర్మం ధరించి త్రిశూలధారియై, వీరాసనంలో కనిపిస్తాడని యజుర్వేదం చెప్తుంది. పరమేశ్వరుడి నివాస స్థానం కైలాస పర్వతం కాగా.. ప్రకృతిలో మమేకమైన పురుషుడు కాబట్టి ఆయన మనకు అనేక ప్రాంతాల్లో బహు రూపాలలో సహజసిద్ధంగా దర్శనమిస్తాడు. ప్రకృతిలోని అనేక రూపాలలో మనకు శివదర్శనం కలుగుతుంటుంది. మానస సరోవరం సమీపంలోని కైలాసంతో పాటు, గంగోత్రి సమీపంలో మరో కైలాస శిఖరం ఉంది. అంతే కాకుండా హిమాచల్‌ ప్రదేశ్‌లో కిన్నెర కైలాసం, బద్రీనాథ్‌లో నీలకంఠ శిఖరం, నేపాల్‌లోని ధౌలగిరి, బెంగుళూరులో నంది కొండలు.. ఇవన్నీ ఈశ్వర స్వరూపాలే.
అంతే కాకుండా టిబెట్‌లోని కైలాస్‌ ప్రభాత్‌ సమీపంలో పార్వతి కుండ్‌, కేదార్‌నాథ్‌లోని గౌరి కుండ్‌, గర్‌వాల్‌ దగ్గర కేదార్‌ తాళ్‌ సరస్సులు, కులు వాలీ మీదుగా ప్రవహించే పార్వతి నది, గంగోత్రి పట్టణంలోని కేదార్‌ గంగ, గర్‌వాల్‌లోని రుద్రప్రయాగ నది ప్రకృతిలోని మహాదేవుని రూపాలు.
కుమావ్‌ ప్రాంతంలో పాతాళ్‌ భువనేశ్వర్‌ గుహ, మధ్యప్రదేశ్‌లోని పాచ్‌మడి లోని జఠా శంకర్‌ గుహ, మహాదేవ గుహలు కూడా శివ తేజస్సుతో ఉట్టిపడుతుంటాయి.
2
చుట్టూ ఎతె్తైన కొండలు.. కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు.. పైకి వెళు్తన్న కొద్దీ ఆక్సీజన్‌ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్‌ డీగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా అంతే సంగతులు.. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళు్తంది.. ఒకే ఒక్క మంత్రం అంతటి దుర్భర వాతావరణాన్ని సైతం సానుకూలంగా మారుస్తుంది.. అదే పంచాక్షరి.. ఓం నమఃశివాయ.. మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది.. ఏడాదిలో కేవలం 45రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది..ఎందుకీ ఆరాటం? అమర్‌నాథ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు మంచు లింగం ఏర్పడటం, కరిగిపోవటం ఎలా జరుగుతోంది.. జ్యోతిర్లింగం అని చెప్పుకునే అమర్‌నాథుడు కొన్ని రోజులు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు? అమర్‌నాథ్‌లో పరమేశ్వరుని ఉనికి ఏమిటి?
3
జూలై మాసం వచ్చిందంటే అమర్‌నాథ్‌కు భక్తుల యాత్ర మొదలవుతుంది.. ప్రపంచంలోనే అతి కష్టమైంది.. తిరిగి వస్తామో, రామో అన్నంత కఠినమైన ట్రెకింగ్‌.. ఇరుకైన దారి... ఇరుపక్కలా లోయలు.. కళు్ల తెరిస్తే గిర్రున తిరిగి ఎక్కడ పడిపోతామో అన్నంత భయం.. తెరవకపోతే ఎలా వెళు్తన్నామో తెలియని అయోమయం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన వెనకే మృత్యువు నడుస్తుంటే... దాని బారిన పడకుండా వెళ్లటమే అమర్‌నాథ్‌ యాత్ర...
కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు కేవలం 145 కిలోమీటర్ల దూరం..కానీ, ఎత్తులో మాత్రం ఎవరికీ అందనంత..... సముద్రమట్టానికి అక్షరాలా 13, 700 అడుగుల హైట్‌లో అమర్‌నాథ్‌ గు„హ ఉన్నది.. ఇది సాదా సీదా గుహ కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి.. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ.. ఇది మానవనిర్మితం ఎంతమాత్రం కాదు..
ప్రతి ఏటా జూలై నుంచి ఆగస్టు చివరి వరకు అమర్‌నాథ్‌ గుహలో శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. కేవలం 45రోజులు మాత్రమే ఈ శివలింగం కనిపిస్తుంది. ఆ తరువాత క్రమంగా కరిగి, కరిగి అంతర్థానమవుతుంది.. ఈ శివలింగం సగటు మనిషి ఎత్తులో ఏర్పడుతుంది.. జాగ్రత్తగా పరికిస్తే మనిషి ఆకారం ఇందులో గోచరిస్తుంది కూడా..
అమర్‌నాథ్‌ గుహలో సహజంగా ఏర్పడే జ్యోతిర్లింగంతో పాటు, మరో రెండు చిన్న మంచు మూర్తులు కూడా కనిపిస్తాయి.. వీటిని పార్వతి, గణపతులంటూ భక్తులు కొలుస్తారు.. విచిత్రమేమంటే ఈ మూర్తులకు ప్రత్యేక ఆకారాలు ఉండవు.. మంచు ముక్కల్లా మాత్రమే కనిపిస్తాయి. కాకపోతే.. మహాదేవుని లింగరూపం ఏర్పడిన సమయంలో మాత్రమే ఈ రెండు మంచు మూర్తులు కనిపిస్తాయి. ఆ తరువాత ఇవీ ఉండవు..
ఏడాదిలో రెండు మాసాలు మాత్రమే తెరిచి ఉండే ఈ గుహకు వ్యయప్రయాలకు ఓర్చి భక్తులు వేల సంఖ్యలో వెళ్తారు.. ఇది మామూలు ప్రయాణం కాదు.. ఇంత కష్టపడి అంత దూరం వెళ్లటానికి ఎవరూ సంకోచించకపోవటం విచిత్రం.. ఓ పక్క జారిపడితే ఆనవాళు్ల సైతం చిక్కనంత లోతైన లోయలు.. మరోపక్క ఊపిరితిత్తులు బిగిసిపోయేలా ఆక్సీజన్‌ లేకపోవటం...సన్నటి దారులు.. గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం.. అయినా భక్తులు ఆగిపోరు.. వాళు్ల ముందు వెళు్తంటారు..చావు వాళ్ల వెంటే వస్తూందా అనిపిస్తుంది.. మనం ఒక సెకన్‌ తప్పటడుగు వేస్తే అది వాళ్లను దాటి మింగేస్తుంది.. ఇంత టెన్షన్‌లోనూ అమర్‌నాథ్‌ యాత్రకు అపూర్వంగా వెళు్తంటారు భక్తులు..
4
ఎందుకింత క్రేజి.. ప్రమాదమని తెలిసినా ఎందుకీ యాత్ర.. పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నా ఎందుకీ డిమాండ్‌.. అమర్‌నాథ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు మంచు శివలింగం ఎలా ఏర్పడుతోంది.. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి?
పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అమర్‌నాథ్‌ ఒకటి.. సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభువుగా వెలిస్తే ఒకేసారి అవతరిస్తాడు.. కానీ, అమర్‌నాథ్‌లో ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నాడు.. అంటే ఏర్పడుతున్నాడు.. అదీ మంచుతో.. శివలింగ రూపంలో.. ఇది ఎలా సాధ్యమవుతోంది..?
అమర్‌నాథ్‌ గుహ ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది.. ఆ సమయంలో మైనస్‌ అయిదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.. గుహను చేరుకోవటం అసాధ్యం... జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది.. మంచు విచ్చుకుంటుంది.. గుహ స్పష్టంగా కనిపిస్తుంది.. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది.. అందువల్లే 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది..
విచిత్రమేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది.. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుందన్నది ప్రశ్న.. సంవత్సరమంతా గడ్డకట్టుకుపోయిన అమర్‌నాథ్‌ గుహ క్రమంగా తేటపడుతున్న సమయంలో జ్యోతిర్లింగం ఏర్పడే చోట గుహ పైభాగం నుంచి ఒక్కొక్కటిగా నీటి చుక్క కింద పడుతూ ఉంటుంది.. సుమారు 45 రోజుల పాటు ఈ నీటిబొట్లు పడుతూనే ఉంటాయి.. ఈ నీటి బొట్లు క్రమంగా మంచుగా మారి, లింగరూపంగా ట్రాన్‌‌సఫామ్‌ చెందుతాయి.
భక్తులు ఈశ్వరుని సందర్శించుకునే 45 రోజులు కూడా నీటి బిందువులు పడుతూనే ఉంటాయి. అయితే శివలింగం గుహ పై భాగాన్ని తాకి ఉండటం వల్ల అవి మామూలుగా కనిపించవు.
భక్తులు చూసే 45 రోజుల తరువాత గుహను మంచు పూర్తిగా కప్పేసినప్పటికీ, శివలింగం ఉండాల్సిన ప్రాంతం నుంచి ఒకరకమైన తేజస్సు స్పష్టంగా కనిపిస్తుందని భక్తులను గుహదాకా తీసుకువచ్చి, మళ్లీ కిందకు తీసుకువెళ్లే స్థానికులు అంటారు.. అందుకే దాన్ని జ్యోతిర్లింగమని చెప్తారు.
5
అమర్‌నాథ్‌లో జ్యోతిర్లింగం మామూలుగా ఏర్పడుతున్నదేనా? లేదా నిజంగానే శివుడు కైలాసం నుంచి దిగి వచ్చి రెండు మాసాల పాటు భక్తులకు కనువిందు చేస్తున్నాడా? దేవుడే ఒక మిథ్‌ అని భావించే వాళు్ల కొల్లలుగా ఉన్నప్పుడు ఇక కైలాసం నుంచి శివుడు రావడమేమిటని అనుకుంటున్నారా? మరదే విచిత్రమంటే..
పరమేశ్వరుడు కైలాసం నుంచి అమర్‌నాథ్‌కు ప్రతి ఏటా బయలు దేరి వస్తున్నాడట.. ? విస్తు పోకండి.. ఆశ్చర్యం అసలే అక్కర్లేదు.. అర్థం లేని ఈ వాదన ఏమిటని నిలదీయకండి..పరమేశ్వరుడు ఈ భూమ్మీదే నడయాడుతున్నాడని అమర్‌నాథ్‌ ప్రజల విశ్వాసం.. హిమాలయాల్లో మరింత ఎతె్తైన కైలాస పర్వతంపైనే మహాదేవుడు ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన అమర్‌నాథ్‌కు తన మందీ మార్బలంతో తరలి వచ్చాడట. మార్గమధ్యంలో ఆయన ఎక్కడెక్కడ ఆగిందీ, ఏం చేసిందీ కూడా వీళు్ల వివరిస్తారు..
మృత్యువు గురించి పార్వతీదేవికి వచ్చిన సందేహాన్ని తీర్చేందుకు శివుడు ఆమెను అమర్‌నాథ్‌కు తీసుకువచ్చాడు.. ఈ దారి కైలాస్‌ మానస్‌ సరోవర్‌ నుంచి నేపాల్‌ మీదుగా కాశ్మీర్‌లోకి ప్రవేశించి అమర్‌నాథ్‌ దగ్గర ముగుస్తుంది.
కైలాసం నుంచి బయలు దేరిన శివుడు దారిలో బైల్‌గావ్‌ దగ్గర తన వాహనాన్ని అదే నందీశ్వరుని వదిలేశాడట.. ఈ బైల్‌గావే.. కాశ్మీర్‌లో ఇవాళ ఉన్న పహల్‌గామ్‌. ఆ తరువాత మరికొంత దూరంలో చందన్‌ వాడి దగ్గర చంద్రుని, మహాగణేశ్‌ గుహ దగ్గర గణపతిని విడిచిపెట్టాడు.. అక్కడి నుంచి అమర్‌నాథ్‌ దగ్గరలోని పంచతరణి ప్రాంతాల్లో పంచభూతాలను వదిలేశాడు. ఈ ప్రాంతాలన్నీ ఇప్పటికీ పవిత్ర శివ క్షేత్రాలుగా ఉన్నాయి.
అమర్‌నాథ్‌ గుహలోనే పార్వతీదేవికి మృత్యురహస్యం చెప్పాడని స్థానిక కథనం.. ఇదంతా పుక్కిటి పురాణంగా కొందరు కొట్టి పారేయవచ్చు. కానీ, ఇక్కడ టెక్నికల్‌ లాజిక్‌ ఉంది.. అమర్‌నాథ్‌ గుహ 13,700 అడుగుల ఎత్తున ఉంది. ఇరుకుదారిలో ప్రాణంతో చెలగాటమాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి.. ఊపిరి తిత్తులకు ఆక్సీజన్‌ సక్రమంగా అందదు.. మృత్యు బాధ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్లిన వారికి ఈజీగా అర్థమైపోతుంది.. పార్వతికి, శివుడు మృత్యురహస్యం చెప్పాడన్న కథలోని అంతరార్థం ఇదే.
భక్తులు ఒక్కసారి గుహ దగ్గరకు చేరుకున్నాక కూల్‌ అయిపోతారు. అక్కడి వాతావరణం అలాంటిది.. మంచులింగం ఒకవిధంగా భక్తులను మెస్మరైజ్‌ చేస్తుంది.. జీవితంలో చాలా కష్టమైన దారిలోనే సక్సెస్‌ఫుల్‌గా వెళ్లిన తరువాత మిగతా దారులన్నీ చిన్నగానే కనిపించేలా సైకలాజికల్‌ అనుభూతిని కలిగిస్తుంది.
మరి ఇంతటి అనుగ్రహాన్నిచ్చే మహాదేవునికి ఆగ్రహం ఎందుకు వచ్చింది.. ముక్కంటి తన మూడో కంటిని ఎందుకు తెరుస్తున్నాడు..భక్తులను ఆదరించకుండానే ఎందుకు అంతర్థానమైపోతున్నాడు?
ఏదైనా ఒక పని చేయాలంటే దానికి కొన్ని పద్ధతులుంటాయి... ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే దానికి కొన్ని మార్గాలుంటాయి.. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటే గమ్యం చేరుకుంటారే కానీ, లక్ష్యం నెరవేరదు.. అమర్‌నాథ్‌ విషయంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇలాంటిదే..
అమర్‌నాథ్‌ గుహ సముద్ర మట్టానికి చాలా ఎతె్తైన ప్రాంతంలో ఉంది. ఉష్ణోగ్రత పూర్తిగా మైనస్‌ డిగ్రీల్లో ఉంటుంది. దర్శనం చేసుకోవలసిన ఈశ్వరుడూ మంచు రూపంలో ఉంటాడు.. అలాంటి చోటికి హెలికాప్టర్‌లలో వెళ్లటం, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవటం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా చెడగొడుతోంది.. చల్లగా ఉండాల్సిన చోటును వేడిమయం చేస్తోంది. చలిగా ఉండాల్సిన ప్రాంతంలో వెచ్చదనాన్ని కృత్రిమంగా సృష్టిస్తోంది.
ప్రశాంతంగా ఉన్న అమర్‌నాథ్‌ గుహకూ గ్లోబల్‌ వార్మింగ్‌ అంటుకునే ప్రమాదం మన వాళ్ల వల్లే ఏర్పడుతోంది.. దీనికి తోడు గుహలోకి పూలు, పండ్లు విసిరేయటం, వేలాది అగర్‌బత్తీలు వెలిగించటం అక్కడి విధానానికి వ్యతిరేకం..
ఏదైనా సరే ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే, ఆది విపత్తు సృష్టిస్తుంది.. అమర్‌నాథ్‌లో 2007 నుంచి జరుగుతున్న తంతు ఇలాంటిదే.. హెలికాప్టర్లు.. ఇతర ప్రత్యామ్నాయ దారుల్లో వివివిఐపిలు ఇలా వచ్చి అలా వెళ్లేందుకు చేసిన ఏర్పాట్లు మంచు లింగం త్వరగా అంతర్థానమవటానికి కారణమైంది.. వేలాది భక్తులు అమర్‌నాథ్‌కు చేరుకోకుండానే వెనక్కి తిరిగివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది..
మంచుకొండల్లో మహాదేవుని దర్శనం సామాన్యమైంది కాదు.. ఎంతో శ్రమిస్తే తప్ప ఆయన దర్శనం లభించదు.. సహజంగా ఉన్న వ్యవస్థను అసహజంగా మారిస్తే ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. భారతదేశానికి ఉన్నవి సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదలే.. వీటికి కూడా అస్తిత్వం లేకుండా చేసుకుంటామంటే, జవాబు చెప్పేదేముంటుంది?

రావణ రహస్యం -3

6 comments
ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..



పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్‌ ఖరుడు పరిపాలన సాగించాడు.. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు..

పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్‌ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్‌లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్‌వెయిట్‌ స్టోన్స్‌, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది..
శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్‌ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది..
నీలవరై పుత్తుర్‌ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్‌ రాక్‌ అని అర్థం.. ఈ పర్వత పై భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎతెユ్తన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్‌ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్‌ చేసేవాడు..

ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫ సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు...

రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు..
రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు..
వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది.. రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు... చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు..
పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది..

రావణ రహస్యం -2

2 comments
రావణుడు.. రామాయణం... భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి... లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం..

మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే...ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది..
రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్‌ వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్‌ తోటలోని తన ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్‌ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్‌ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు..
అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్‌ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రెユ అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది..
.. ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్‌ వుమెన్‌ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్‌ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది...
ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే... ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు..

2
లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి...

లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం...ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు..
రావణుడి కొడుకు ఇంద్రజిత్‌.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్నాయి.

రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్‌లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం.

తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్‌.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్‌ హౌస్‌ కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్‌ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్‌ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్‌ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు..

రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి..

రావణుడు ఆర్కిటెక్ట్‌
రావణుడు ఏరోనాటికల్‌ ఇంజనీర్‌
రావణుడు డాక్టర్‌
రావణుడు వార్‌ఫేర్‌ టెక్నాలజిస్ట్‌
రావణుడు నిత్య పరిశోధకుడు
రావణుడు గొప్ప సంగీతవేత్త

ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్‌ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం.

రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట.

లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్‌ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్‌ కలిపే నెట్‌వర్క్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి,

రావణ రహస్యం

14 comments
రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..

ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం... ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం..
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళు్ల శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి.
ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం.. ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి.
అశోక వాటిక సమీపంలో మొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు...
2
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళు్ల కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్‌ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది..
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్‌ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్‌... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్‌ పారమల్‌ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్‌గా కనిపిస్తుంది...
3
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిక్తా్వలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా..
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది..
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక రీసర్‌‌చ టీమ్‌ నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి ట్రాన్‌‌సపోర్‌‌ట సిస్టమ్‌ను, కము్యనికేషన్‌ వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
4
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్‌ రామచరిత మానస్‌లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.

కెలీనియా.. రావణుడి తము్మడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది...

ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్‌ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్‌కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది.
రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎతె్తైతే, అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ.
లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్‌లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ..

శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎతె్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.

రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నము్మతున్నారు.. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి.

గ్రహాంతర వాసులే దేవతలా?-2

0 comments


దేవతలంటే గ్రహాంతర వాసులని అనుకుంటున్నాం.. అలాంటి గ్రహాంతరవాసులు మొదట్నుంచీ భూమితో చెలిమి చేస్తూ వచ్చారా? వాళ్ల జీవిత కాలానికీ, మన జీవిత కాలానికీ ఏదైనా తేడా ఉందా? వారికి ఉన్న అపురూపమైన శక్తి సామర్థా్యలను, టెక్నాలజీని మనుషులతో పంచుకున్నారా? అవుననే అనిపిస్తుంది.. ఎందుకంటే రామాయణ, భారత, క్రీస్తు కాలాలలో మన సమాజంలో కనిపించే అపూర్వ టెక్నాలజీకి, ఏలియన్‌‌స టెక్నాలజీకి దగ్గరి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆనాటి విమానాలు కానీ, ఆయుధాలు కానీ, మన కాలానికి ఎన్నో రెట్లు అడ్వాన్‌‌సడ్‌ స్టేజిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఏమిటీ ఆయుధాలు.. ఎక్కడ ఆ విమానాలు.

మన పురాణాల్లో ఖగోళంలో ఏ గ్రహం ఎంతకాలానికి ఎంత దూరం ఏ విధంగా ప్రయాణం చేస్తుందో లెక్కించారు.. సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా చెప్పగలిగారు..అంతే కాదు.. దేవతలకూ, మనుషుల జీవిత కాలాలకు సంబంధించిన లెక్కలు కట్టారు..ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఏ ప్రాతిపదికన మన వాళు్ల ఈ లెక్కలు వేయగలిగారు? ఇదో అంతుపట్టని మిస్టరీ..

భాగవత పురాణంలో బ్రహ్మ జీవిత కాలాన్ని మనుషుల జీవిత కాలంతో పోలుస్తూ వ్యాసుడు కట్టిన లెక్కలు మనకు కనిపిస్తాయి. దీని ప్రకారం

360 మనిషి సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం


12 వేల దేవతల సంవత్సరాలు ఒక చతుర్యుగం.


అంటే కృత, త్రేత, ద్వాపర కలియుగాలన్నమాట.


మన మనుషుల లెక్క ప్రకారం ఒక చతుర్యుగం అంటే 4లక్షల 32 వేల సంవత్సరాలన్నమాట.


ఇలాంటి చతుర్యుగాలు 2000 పూర్తయితే బ్రహ్మకు ఒక రాత్రి,పగలు అన్నమాట.. అంటే ఒక రోజు గడిచినట్లు.


బ్రహ్మకు ఇలాంటి రోజులు 360 గడిస్తే ఒక సంవత్సరం అయినట్లు.


ఇలాంటి సంవత్సరాలు వంద పూర్తయితే బ్రహ్మ జీవిత కాలం ముగిసినట్లు..


అంటే మన మనుష్యుల కాలమానం ప్రకారం బ్రహ్మ జీవించే కాలం అక్షరాలా 3,11,040,000,000 రోజులన్నమాట.


దీని తరువాత ప్రళయం వస్తుందని, ఆ తరువాత మళ్లీ సృష్టి మొదలవుతుందని భాగవతం చెప్తోంది..
ఈ లెక్కల ప్రకారం దేవతలు అమరులనటంలో ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే మనతో పోలిస్తే 36వేల సంవత్సరాలు గడిస్తే తప్ప వాళ్లకు వందేళు్ల పూర్తి కావు.. అయితే

ఈ కాలమానాన్ని మన వాళు్ల ఎలా లెక్క కట్టగలిగారు అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభించకపోవచ్చు. కానీ ఖగోళ శాసా్తన్న్రి, నక్షత్రాల కదలికలను అంచనా వేయటంలో ఆరితేరిన వారు కాబట్టి ఇతర గ్రహాలలో ఉండే జీవరాశుల జీవిత కాలాన్ని ఈ విధంగా లెక్కించి ఉండవచ్చు..
పురాణాల్లో చెప్పినట్లు భూమికి ఎగువన ఉన్న లోకాల్లో సత్యలోకం అన్నింటి కంటే పైన ఉన్నది.. బ్రహ్మ ఉండేది కూడా సత్యలోకంలోనే. అంటే భూమి నుంచి ఎగువన ఉన్న గ్రహాల వైపు వెళు్తన్న కొద్దీ కాల గమనంలో మార్పు వస్తుందన్న మాట..
------
రోదసి.. అనంతమైన విశ్వం.. మొదలెక్కడో తెలియదు.. తుది ఏమిటో అంతకంటే తెలియదు.. ఈ విశ్వాంతరాలంలో భూమి పరిమాణం చాలా చాలా చాలా చిన్నది.. దీనికి ఎన్నో రెట్లు పెద్ద వైన గ్రహాలు రోదసిలో కోట్ల సంఖ్యలో ఉన్నాయి.. వీటిలో ఎక్కడో భూమి లాంటి గ్రహం ఉండి ఉండవచ్చు. అక్కడా మనలాగే జీవరాశి ఉండనూ వచ్చు.. స్పేస్‌లో పాలపుంతలు ఒకటి కాదు..వేల సంఖ్యలో ఉన్నాయి. సౌరమండలాలకు లెక్కలేదు.. దూరాలకు అంతే లేదు.

మన సౌర మండలమే దాదాపు 14 వందల కోట్ల మైళ్ల మేర ఉంది. దాని తరువాత మిల్కీ వే ల గురించి చెప్పేదేముంది.. భూమి కంటే ఎంతో పెద్ద వైన గ్రహాలు మన సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దవైన సూర్యుల చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు.. అందుకే దేవతల కాలమానానికి, మన కాలమానానికి తేడా ఉంది. ఒక దేశానికి, ఇంకో దేశానికీ మధ్యనే టైమ్‌లో చాలా తేడా కనిపిస్తుంది మనకు. ఇక రోదసిలో గ్రహాల మధ్య కాలంలో డిఫరెన్‌‌స ఉండటంలో ఆశ్చర్యమేముంది.?
2

గ్రహాల మధ్య దూరం, గ్రహాల మధ్య భ్రమణాన్ని బట్టి ఆయా గ్రహాలలో ఉండే జీవరాశుల జీవిత కాలాన్ని మన వాళు్ల అంచనా వేశారు.. ఈ విధంగానే వారి శక్తి సామర్థా్యలనూ ఏ స్థాయిలో ఉంటాయో రుచి చూశారు.. ఇదిగో ఇవాళ ఏలియన్‌ తిరుగుతున్నదంటున్న యుఎఫ్‌ఓలు, నాడు దేవతలు తిరిగారంటున్న పుష్పక విమానం ఒకటే కావచ్చని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల్లో కొందరి అభిప్రాయం.

ఈజిప్‌‌ట... ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత ఉన్న దేశం.. ఇక్కడ బయటపడ్డ పిరమిడ్‌లు అనేక చారిత్రక రహస్యాలను విప్పి చెప్తాయి. ఇక్కడి కింగ్‌ జోసెఫ్‌ పిరమిడ్‌ నాలుగు వేల సంవత్సరాల నాటిది.. ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చిన్న చెక్కతో తయారు చేసిన పక్షి బొమ్మ దొరికింది. అక్కడ కనిపించిన రాతల్లో ఐ వాంట్‌ టు ఫై్ల అన్న మాటలూ ఉన్నాయి. అక్కడ తవ్వకాల్లో దొరికిన ఓ పక్షి బొమ్మను నిశితంగా గమనిస్తే, దానికి పక్షిలాగా కళు్ల రెక్కలు ఉన్నాయి. కానీ, రెక్కలు సాధారణ పక్షికి ఉన్నట్లు కాకుండా విమానపు రెక్కలను తలపిస్తున్నాయి. ఆధునిక ఎయిర్‌క్రాఫ్‌‌టకు ఇది నమూనాలాగా ఉంది.

అటు కొలంబియాలో దొరికిన ప్రాచీన ఆనవాళ్లలో సైతం చేప ఆకారంలో ఉన్న అనేక వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ మోడ్రన్‌ ఎయిర్‌ షిప్‌కు సంకేతంగా భావిస్తున్నారు..



మన దేశంలో సంస్కృత గ్రంథాల్లో, శాసనాల్లో విమాన శాస్త్రం ఉంది.. క్రీస్తుకు పూర్వం దాదాపు 6వేల సంవత్సరాల క్రితమే భారతీయులు విమానాన్ని తయారు చేసే ప్రక్రియను కనుక్కున్నారు. ఈ విమానాల్లో కొన్ని ఒక విధమైన జెట్‌ ఇంజన్‌తో నడిచేవని శాస్త్రవేత్తలు చెప్తారు.. ఈ విమానాలు గాల్లోకి ఎగిరే సమయంలో తీవ్ర వేగంతో, భారీ ఇంధన వినియోగంతో, పేలుళు్ల జరిగేవని అంటారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక యుగంలో అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహ వాహక నౌకల్లాంటివే ఇవి.

ఈ విమానాల్లో ఎలక్ట్రిసిటీ పవర్‌ ఉండేదిట.. ఇందుకోసం మెర్కు్యరీని ఇంధనంగా వాడేవారు.. ఇందులో ప్రయాణికులకు చోటు ఉన్నట్లే.. వార్‌హెడ్‌ కూడా ఉండేది. ఈ విమానం ద్వారా ఆయుధాన్ని కూడా ప్రయోగించే వీలుంది.. ఆధునిక మిలటరీ విమానానికి భారతీయ విమాన శాస్త్రంలో చెప్పిన విమానాలు ఎంతమాత్రం తీసిపోవని శాస్త్రవేత్తలే అంటున్నారు..

పుష్పక విమానం కూడా ఇలాంటిదే.. రెండు అంతస్థుల్లో ప్రయాణికులను తీసుకుని వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న అతి పెద్ద విమానం ఇది.. రావణ వధ తరువాత రాముడు ఇదే విమానంలో అయోధ్యకు లంక నుంచి వెళ్లాడట.



ఇంత టెక్నాలజీ మన వారికి అంత ప్రాచీన కాలంలో ఎలా లభించింది..అన్న ప్రశ్నకు జవాబే ఫై్లయింగ్‌ సాసర్‌.. ఎలియాస్‌ యుఎఫ్‌ఓ.. గత అర్థ శతాబ్దంలో ప్రపంచంలో చాలా చోట్ల లిప్తపాటులో కనిపించి వెళ్లిపోతున్న ఫై్లయింగ్‌ సాసర్‌లోని టెక్నాలజీ, మన విమానాల్లో వినియోగించిన పరిజ్ఞానమూ దాదాపు ఒకటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.. ఇది పూర్తిగా నిర్థారణ కాకపోయినప్పటికీ ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి రెండు ఒకటే అయితే, గ్రహాంతర వాసులతో మన ప్రాచీనులకు ఉన్న అనుబంధం స్పష్టమవుతుంది..

3

దేవతలు అనగానే మనకు గుర్తొచ్చేది వారి చేతుల్లో ఉండే వివిధ ఆయుధాలు.. కత్తులు, గదలు, బాణాలు, ఇంకా రకరకాలు.. ఈ అసా్తల్ర తోనే దేవతలు బీభత్సాన్ని సృష్టించారా? అవును.. ఇవి సాధారణ ఆయుధాలు కావు.. సామూహిక జనహననాన్ని సృష్టించే భయానక అసా్తల్రు..

1945 జూలై 16 మెక్సికో సరిహద్దుల్లో అమెరికా అణ్వస్త్ర ప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా జరిపింది. దాదాపు వంద మైళ్ల ఎత్తున అణు రేడియో ధార్మికత ఎగిసిపడింది.
అమెరికా అణ్వసా్తన్న్రి 1945లో ప్రయోగించింది. కానీ, దానికంటే ఎన్నో ఏళ్ల క్రితం అంటే ప్రాచీన కాలంలోనే, ముఖ్యంగా భారత దేశంలో అణ్వసా్తల్రు ఉన్నాయనటానికి ఆధారాలు ఉన్నాయి. కృత యుగంలో జరిగిన రామాయణంలో రావణుడితో యుద్ధం చేసిన రాముడు అతనిపై రామ బాణాన్ని ప్రయోగించి వధించాడు.. అది న్యూక్లియర్‌ పవర్‌ ఉన్న బాంబుగా భావిస్తున్నారు.. ఎందుకంటే లంకలో రామ రావణ యుద్ధం ఎక్కడైతే జరిగిందని భావిస్తున్నారో, అక్కడ ఇవాళ్టికీ గడ్డి పరక కూడా మొలవదు.. అంతే కాదు.. దాదాపు నాలుగు వేల ఏళ్ల క్రితం జరిగిన మహాభారత యుద్ధంలో మన వారి చేతుల్లో బ్రహ్మాస్త్రం ఉండేది.. అదే అణ్వస్త్రమని ఇప్పటి శాస్త్రవేత్తల అభిప్రాయం..
కురుక్షేత్రంలో కూడా కొంతమేర రేడియేషన్‌ ఆనవాళు్ల ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మహా భారత కాలంలో అణ్వస్త్రం ఉన్నదన్న అభిప్రాయాన్ని అంతా ఒప్పుకోకపోవచ్చు. కానీ మహాభారత యుద్ధంలో భారీ ఎత్తున పేలుళు్ల జరిగాయని మాత్రం అంతా అంగీకరిస్తున్నారు.. భారీ విధ్వంసాన్ని సృష్టించిన పేలుళ్ళే ఇవి..
మెసపటోమియా, మొహంజదారో ఆనవాళు్ల లభించిన ప్రదేశాల్లో కూడా రేడియేషన్‌ ప్రభావం కనిపిస్తోంది. భారత ఇతిహాసాల్లో ఎగిరే రథాలు కనిపిస్తాయి. వాటిపై యుద్ధం చేస్తున్నవారి చేతుల్లో అపూర్వమైన ఆయుధాలు కనిపిస్తాయి. అటు క్రిస్టియానిటీ ప్రాచీన గ్రంథాల్లోనూ, బైబిల్లోనూ ఈ న్యూక్లియర్‌ పవర్‌ గురించిన ప్రస్తావన కనిపిస్తుంది..
మహాభారత యుద్ధాన్ని నడిపించింది శ్రీకృష్ణుడు.. అర్జునుడికి గీతోపదేశం చేసి సంహారకాండను అంతా తానే అయి నడిపించింది కృష్ణుడు.. ఈయన దేవుడు.. దివి నుంచి భువికి దిగి వచ్చిన వాడు.. ఆయన అందించిన టెక్నాలజీతోనే, విజ్ఞానంతోనే మహాభారత పర్వం కొనసాగింది.. పైలోకాల్లో ఉన్న పరమాత్ములతో మనకున్న చెలిమికి ఇవి తార్కాణాలు.. ఈ పరమాత్ములు ఎవరు? దేవతలా? ఏలియన్సా? పరిశోధనలు తేల్చాలి.

గ్రహాంతర వాసులే దేవతలా?

6 comments
దేవతలు ఎవరు? మనల్ని ఈ భూమ్మీద సృష్టించింది వాళ్లేనా? నిజంగా మన సృష్టి కర్తలు దేవతలే అయితే... వాళు్ల ఎలా ఉంటారు? వాళ్ల ఉనికి ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ ఎవరికీ అర్థం కాని ఓ పే..ద్ద బ్రహ్మపదార్థం లాంటివి... అన్ని దేశాల్లో అన్ని మతాల్లో రోజూ ఎక్కడో ఓ చోట.. ఏదో రకంగా జరుగుతున్న చర్చ ఇదే.. మిగతా మతాల మాటెలా ఉన్నా.. మన దేవతల తీరే వేరు.. అనేక రకాల రూపాలు.. అర్థం కాని వాహనాలు.. అసాధారణమైన ఆయుధాలు.. అపూర్వమైన శక్తియుక్తులు.. చిత్రవిచిత్రమైన కథనాలతో కనిపిస్తారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముక్కోటి మంది దేవతలు ఉన్నారని చెప్తారే.. వీళ్లంతా ఎక్కడ ఉన్నారు? అసలు ఈ మాటల్లో , పురాణాల్లో, కథనాల్లో వాస్తవం ఉందా? ఉంటే అదేమిటి?

-----------
భూమ్మీద మనిషి జీవితం మొదలైనప్పటి నుంచీ దేవతల గురించిన వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి చాలా యుగాల క్రితమే మన పురాణాల్లో గ్రహాంతరాలల్లో వేరే లోకాలు ఉన్నాయని, అందులో జీవులు ఉంటున్నారన్న ప్రస్తావన ఉంది.. వారి గురించి పరిశోధన చేసినట్లూ, వారితో మనుషులు కలిసినట్లూ ఉంది... వాళ్లందరూ మనకన్నా చాలా రెట్లు శక్తి మంతులు.. వాళ్ల అనుగ్రహం మనపై ఉంటే మనకు అంతా మంచి జరుగుతుందని భావిస్తూవస్తున్నాం.... వీళ్లే దేవతలా?
------------------------------------
భూమి... లేదా భూగోళం.. ఇంకా చెప్పాలంటే భూలోకం. మనం ఉంటున్న లోకం ఇది.. ఈ లోకానికి కింది భాగాన ఏడు లోకాలు.. పై భాగాన మరో ఆరు లోకాలు ఉన్నట్లు మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి..
భూమికి దిగువన అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఉంటే, ఎగువన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఉన్నాయని భావిస్తున్నాం..పై లోకాల్లో యక్ష, రాక్షస, గరుడ, గంధర్వ, కింపురుష, విద్యాధర, మహర్షి గణం ఉన్నదని, సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడని చెప్తారు.. బ్రహ్మ దేవుడి పైన క్షీరసాగరం, వైకుంఠం, కైలాసాదులు ఉన్నాయంటారు..భూమ్మీద తపస్సు చేసిన వారికి దేవతలు ఆకాశం నుంచి ప్రత్యక్షమవుతారు.. కోరిన వరాలిచ్చి ఆదుకుంటారు.. గంధర్వులు, దేవ కన్యలు దివి నుంచి భువికి దిగివస్తారు.

వీళ్లను మనం పూజిస్తున్నాం.. ఆలయాలను నిర్మించి ఆరాధనలు చేస్తున్నాం.. హోమాలు చేస్తున్నాం.. వీళు్ల మనను అనుగ్రహిస్తున్నారని విశ్వసిస్తున్నాం.. అయితే ఎక్కడి నుంచి మనల్ని చూస్తున్నారు.. ఎలా అనుగ్రహిస్తున్నారు.. ?
బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడు.. అక్కడి నుంచి ఆయన ఈ భూమ్మీద జీవులను సృష్టిస్తుంటాడు.. వాళ్లను పరిపాలించే బాధ్యత.. ఆ బ్రహ్మపైన ఉన్న విష్ణుమూర్తిది.. ఆయన వైకుంఠంలో పాల సముద్రంలో లక్ష్మీదేవి చెంతన ఉంటాడు..
అందరి జీవితాలు ముగిసిపోయిన తరువాత తనలో లయం చేసుకునే దేవుడు పరమ శివుడు.. ఆయన కైలాసంలో ఉంటాడు..అదొక వెండి కొండ... స్వర్గం, నరకం ఇవన్నీ భూమికి ఎగువన ఉన్నాయంటున్న అనేక లోకాలు.. ఈ లోకాల్లో ఈ దేవీ దేవతల ఆవాసం నిజమేనా? అక్కడి నుంచే భూమిని వీరు పరిపాలిస్తున్నారా?
2
దేవుడు లేనే లేనప్పుడు డిస్కషనే వేస్టంటారు హేతువాదులు.. వాస్తవమే.. కానీ, తనకు ఊహకైనా తెలియకుండా ఒక విషయం గురించి మనిషి ఆలోచించటం సాధ్యం కాదు.. ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నాడంటే, చర్చిస్తున్నాడంటే.. అందుకు సంబంధించి ఏదో ఒక చిన్న ఘటన తనకు అనుభవంలోకి వచ్చి ఉండాలి.. దాన్నుంచే తన సృష్టికి కారణం ఎవరన్న దానిపై మనిషి తపన మొదలై ఉండాలి. మనిషి మేధస్సును తొలిచి వేస్తున్న దేవతల గురించిన ఆలోచన కూడా ఈ విధంగా వచ్చిందే కావచ్చు.
దేవతలకు సంబంధించిన కథలు, బొమ్మలు హిందూ పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఆలయాల పైనా చాలానే కనిపిస్తాయి.. వేల ఏళ్ల నాటి నిర్మాణాలపైనా చిత్రాల రూపంలో దేవీ దేవతల కథలు ఉంటాయి.. రకరకాల రూపాల్లో, రథాలపైనా, గుర్రాల పైనా, యుద్ధం చేసుకుంటున్న బొమ్మలు ఎన్నెన్నో ఉన్నాయి.. మన ఇతిహాసాల్లో
ఆకాశ వాణి పలుకుతుంది.. భవిష్యవాణి చెప్తుంది.. దేవుడు ఆగ్రహిస్తే, మబ్బులు ఉరుముతాయి.. మెరుపులు మెరుస్తాయి.. దివి నుంచి గంగ భువికి దిగి వస్తుంది.. భూమి సస్యశ్యామలమవుతుంది.. ఇవన్నీ ఆకాశం నుంచే జరుగుతున్నాయి. అంటే భూమికి ఎగువన ఉన్న లోకాల నుంచి..
ఇలాంటి కథనాలు మన హిందూయిజం లో మాత్రమే లేదు.. క్రైస్తవ చరిత్రలోనూ ఇది మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.. అతీంద్రియ శక్తులు ఉన్నట్లు క్రిస్టియానిటీకి చెందిన ప్రాచీన పెయింటింగ్‌లలో మనకు కనిపిస్తుంది. ఏసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న సందర్భంలో ఆకాశం నుంచి దివ్యమైన వెలుగు ఆయనపై ప్రసరించినట్లు కథనం ఉంది..
అంతే కాదు క్రీస్తును శిలువ వేస్తున్న సందర్భంలో దేవతలు భూమి పైకి వచ్చి ఆ సన్నివేశానికి సాక్షులుగా నిలిచినట్లూ చెప్తారు.. ఈ కథలు, కథనాలన్నీ కూడా దేవీ దేవతల మూలాలను చెప్తున్నాయి.
ఈ కథలన్నింటికీ ఆధారాలు ఏమున్నాయి..? అంటే ఇవాళ ఆధునికంగా సైన్‌‌స పరిశోధిస్తున్న, ప్రస్తావిస్తున్న ఏలియన్‌‌స ఈ కథనాలకు మూలమేమో..
విశ్వంలో ఎక్కడో ఏదో ఒక చోట ఉన్నారని భావిస్తున్న గ్రహాంతర వాసులే మతాలు నము్మతున్న దేవీ దేవతలా? వీళ్లనే, అంటే ఈ గ్రహాంతర వాసులనే మన ప్రాచీనులు దేవతలుగా భావించి ఉండవచ్చు. స్టీఫెన్‌ హాకిన్‌‌స వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చెప్తున్నట్లుగా ఏలియన్‌‌స ఉన్నాయన్న మాటే వాస్తవమైతే వీళ్లను మన పూర్వీకులు చూసి ఉంటారా? వీళ్లు మనకన్నా శక్తిమంతులై వాళ్ల నుంచి మేలును పొందారా?
గ్రహాంతర వాసులు ఎలా ఉండవచ్చన్నదానికి ఆధారాలు మనకు స్పష్టంగానే లభిస్తున్నాయి. ఏసుక్రీస్తుకు పూర్వం అయిదు వేల ఏళ్ల సంవత్సరాలకు పూర్వమే గ్రహాంతర వాసులను నాటి ప్రజలు గుర్తించారు. వాళ్లరూపు రేఖలను భావితరానికి అందించారు ఇరాన్‌లో కొంతకాలం క్రితం తవ్వకాల్లో బయట పడ్డ విగ్రహాలు ఇవే. ఈజిప్‌‌ట పిరమిడ్లలోనూ ఇలాంటి బొమ్మలు మనకు కనిపిస్తాయి...
మన దేశంలోనూ, మొహంజదారో ప్రాంతంలోనూ ఇలాంటి చిత్రవిచిత్రమైన వేషాలు ఉన్న విగ్రహాలు, చిత్రాలు కనిపిస్తాయి. ఈ బొమ్మల్లో కనిపించేది ఏలియన్సే అయితే, వీళు్ల మానవాళికి మేలు చేయటం కోసమే భూమి మీదకు మరో గ్రహం నుంచి వచ్చి ఉంటే, వారిని మన వాళు్ల దేవతలుగా భావించి ఉండవచ్చు. వాళు్ల మనకన్నా శక్తిమంతులు కావటం వల్ల వారిని పూజించి ఉండవచ్చు.
3
దేవతలు ఉన్నారా, లేరా అన్న వాదనల మాదిరిగానే గ్రహాంతర వాసులు ఉన్నారనటానికి ఆధారాల విషయంలోనూ రెండు రకాల వాదనలున్నాయి. కానీ వీటిపై పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు మాత్రం ఏలియన్‌‌స ఉన్నాయని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు.. సైంటిస్టుల వాదనలకు మన పురాణాలు, క్రిస్టియానిటీలోని చిత్రాలు ఆధారాలు కాకపోవచ్చు. కానీ, ఎగిరే పళ్లాల రూపంలో చాలా చోట్ల కనిపించిన స్పేస్‌ షిప్‌లు ఇందుకు మూలం..
ఇలాంటి ఎగిరే పళ్లాలను ప్రపంచంలో చాలా మంది చాలా చోట్ల చూశారు.. రెండు మూడేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దీనిపై కలకలమే రేగింది.. మన దేశంలోనూ కొన్ని నగరాల్లో ఫై్లయింగ్‌ సాసర్లు కనిపించాయి. ఇవి నిజంగా గ్రహాంతరవాసుల వాహనాలేనా అన్నది తేలనైతే తేలలేదు. కానీ, లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి కనురెప్ప పాటులో మాయమై పోయే ఈ వస్తువులను యుఎఫ్‌ఓ లని పేరు పెట్టారు.. వీటిపైన తీవ్రస్థాయిలోనే పరిశోధనలు జరుగుతున్నాయి. చివరకు నాసా ప్రయోగించిన చాలా ఉపగ్రహాల చుట్టూ గ్రహాంతర వాసులు తిరుగుతున్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు అవే ఉపగ్రహాలు తీసిన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి 1947 జూలైలో మెక్సికోలో జరిగిన ఓ విచిత్రమైన విమాన ప్రమాదం ఫై్లయింగ్‌ సాసర్లపై పరిశోధనలకు నాంది పలికింది.. రాస్‌వెల్‌ సమీపంలో గుండ్రని స్పేస్‌షిప్‌ కూలిపోవటం, నాలుగు వింతజీవుల మృతదేహాలు అందులో ఉన్నట్లు యుఎఫాలజిస్టుల వాదన.. అదే విమానమని, మృతదేహాలు గ్రహాంతర వాసులవనీ వారి వాదన.. దీనిపై అమెరికా సర్కారు ఇప్పటికీ పెదవి విప్పలేదు..
రాస్వెల్‌ ఘటనతో ప్రపంచంలో ఎగిరే పళ్లాల గురించిన చర్చ మొదలైంది కానీ, వీటి లింక్‌ మన పురాణాల్లోనూ కనిపిస్తుంది. విష్ణుమూర్తిని అత్యంత వేగంగా తీసుకుపోగల వాహనం గరుత్మంతుడు.. అలాగే మిగతా దేవతలకూ రకరకాల వాహనాలు ఉన్నాయి. దేవతలు ఏదో ఒక వాహనంలో తిరిగే వారన్నది స్పష్టమయింది..అంతెందుకు ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటునిచ్చే పుష్పక విమానమూ దేవతల దగ్గర ఉంది..
.
ఈ వాహనాలను, పుష్పక విమానాన్ని ఎగిరే పళ్లాలు అదే యుఎఫ్‌ఓలతో పోల్చుకోవచ్చా? కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే ఇదీ వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతర గ్రహాలకు చెందిన వాళు్ల మనకంటే చాలా చాలా తెలివైన వాళు్ల, శక్తిమంతులు కదా.. పైలోకాల్లో ఉన్న దేవతలు టెక్నికల్‌గా మన గ్రహానికి చెందిన వాళు్ల కాదు కాబట్టి వాళు్ల కూడా గ్రహాంతర వాసులే.. అందుకే వాళ్ల వాహనాలు యుఎఫ్‌లు అయ్యే అవకాశం ఉంది..
మన దగ్గరే కాదు.. బాల యేసుతో మేరీమాత ఉన్నట్లుగా వేసిన చిత్రపటాల్లోనూ ఎగిరే పళ్లాలు కనిపిస్తాయి. ఇంతెందుకు.. ఏసుక్రీస్తుకు సంబంధించిన ప్రతి చిత్రపటంలోనూ గాల్లో తేలే వింత వస్తువులు ఉంటాయి. క్రీస్తును శిలువ వేస్తున్న సందర్భంలో దేవతలు వచ్చింది ఫ్లయింగ్‌ సాసర్లలోనే అని మనం గమనించవచ్చు.
ఇప్పటి పరిశోధనలు గ్రహాంతర వాసుల ఉనికిని స్పష్టం చేస్తున్నాయి.. నాటి చిత్రపటాలు, శిల్పాలు, విగ్రహాలు దేవతల ఉనికిని చాటి చెప్తున్నాయి.. ఈ రెండింటి మధ్య లంకె ఏమిటి? ఆ నాటి దేవతలనే ఇప్పుడు గ్రహాంతర వాసులుగా, ఏలియన్‌‌సగా మనం భావిస్తున్నామా?
4
గ్రహాంతర వాసులను దేవతలుగా అనుకోవటానికి ఇంకా చాలా ఆధారాలే ఉన్నాయి.. పురాతన కాలానికి చెందిన చిత్రాలు, కథనాలు మనం వాళ్లతో చెలిమి చేసినట్లుగా కూడా చెప్తున్నాయి.. ఇది వాస్తవమేనా? అదే జరిగితే ఆ చెలిమి ఇప్పుడెందుకు లేదు.. వాళ్ల ఉనికి ఉన్నట్లు కూడా తెలియనంతగా ఆ స్నేహం ఎలా మాయమైంది?
రావణుడితో యుద్ధం చేస్తున్న రాముడు నేలపై నిలబడి ఉంటే, దేవతలు రథాన్ని పంపించారట..
ధృవుడు శరీరంతో సహా నక్షత్ర మండలానికి వెళ్లి దిక్సూచిగా మారాడు..

నక్షత్ర మండలంలో సప్తర్షి మండలం అపురూపమైంది..

దేవతలకు కష్టమొస్తే భరత మహారాజు పై లోకాలకు వెళ్లి వారికి సహాయం చేసి తిరిగి వచ్చాడట.. అతని పేరు మీదే మన దేశం ఏర్పడింది..

పై లోకాల్లో ఉన్న వారితో మనకు ఏదోరకంగా సంబంధాలు ఉన్నాయనే ఈ కథలు చెప్తాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు సహాయం చేసి ఉండవచ్చు. టెక్నాలజీలో మనకన్నా వాళు్ల ఎంతో ముందంజలో ఉంటారు కాబట్టి ఆ టెక్నాలజీతో మనకు మేలు చేసి ఉండవచ్చన్న ఊహకు బలం పెరుగుతుంది.

మన గుహల్లో గోడలపైనా, స్తంభాలపైనా కనిపించే మనలా లేని వింతరూపాలు ఎన్నో ఉన్నాయి..వాటిని చూసి ఉండటం వల్లనే చిత్రించటం సాధ్యమవుతుంది.. కేవలం ఊహా జనితంగా వింత రూపాల చిత్రీకరించారని గుడ్డిగా భావించలేం. ఏదో ఒక ఆకారాన్ని చూడటం వల్లనే ఆ బొమ్మలు చిత్రించి ఉండవచ్చు.

మరి గ్రహాంతర వాసులతో ఇంతగా స్నేహం భూలోకానికి ఉందన్న మాట వాస్తవమే అయితే ఇప్పుడెందుకు లేదు.. ఇప్పటి మనుషులకీ, అప్పటికీ ఉన్న తేడా ఏమిటి? గ్రహాంతర వాసులు ఈ లోకానికి దూరంగా ఎందుకు వెళ్లిపోయారు.. అన్న ప్రశ్నలకు జవాబులు అన్వేషించాల్సి ఉంటుంది.

దేవతలు మనకన్నా శక్తిమంతులనటానికి పురాణాలే ఆధారం.. వారే గ్రహాంతర వాసులైతే.. ఇంతకాలం బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయిన ఓ మహా రహస్యాన్ని ఛేదించేందుకు వీలవుతుంది.. పురాణాలనైనా, క్రిస్టియానిటీనైనా గుడ్డిగా కొట్టిపారేయకుండా వాటిలోని అంశాలను, ఇప్పుడు ఏలియన్‌‌సపై చేస్తున్న పరిశోధనల్లో తేలిన అంశాలతో పోల్చుకుని విశ్లేషిస్తే ఈ దిశగా గొప్ప విజయం సాధ్యమవుతుంది.

ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?

0 comments
జీవితం మీద విసుగు... లోకం మీద ఆగ్రహం.. అంతా ఉండి ఎవరూ లేనితనం.. చీకటి తప్ప వెలుతురు కనపడని భవిష్యత్తు.. ఒకే ఒక్క క్షణం.. నిస్సహాయత ఆవరిస్తుంది... వ్యక్తిత్వాన్ని నిర్వీర్యం చేస్తుంది.. ఆలోచనలని చంపేస్తుంది.. బలవంతంగా లోకం నుంచి వెళ్లిపోవాలన్న నిర్ణయానికి ఉసికొల్పుతుంది.. ఆ క్షణం ఎంత భయంకరం?


చేతికొచ్చిన పంట వరదల పాలైన క్షణం... ముప్పిరిగొన్న అప్పులు.. రైతు మెడకు ఉరిగా మారింది...

ప్రియుడి వంచనను తట్టుకోలేక ప్రేయసి మనసు నిస్తేజమైపోయింది..

కార్పొరేట్‌ చదువుల ఒత్తిడిని భరించలేని పసి హృదయం వికలమైపోయింది.

ఆర్థిక బాధలు కుటుంబ పెద్దను పిల్లలకు దూరం చేశాయి.

చుట్టూ సమస్యలు.. కనిపించని పరిష్కారం.. సాయం చేయని చేతులు.. జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు.... భవిష్యత్తు ఏమిటో అంతుపట్టదు..ప్రపంచం అంత కుటుంబం ఉన్నా... ఒంటరితనం నీడలా వెంటాడుతుంది...నరాలు తెగిపోయేంత టెన్షన్‌... ఇక ఈ ప్రపంచంలో తనకేమీ మిగల్లేదు.. తాను బతికి ఉన్నా, లేకపోయినా ఒకటే... ఇక చావును ఆశ్రయించటమొక్కటే మార్గం... అదొక్కటే దారి.. చివరకు మిగిలేది ఈ చావే... చావే..

ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణం జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం. జీవితాన్ని నిలువునా దహించి వేసే క్షణం.. ఏం ఆలోచించినా చావే పరిష్కారంగా తోస్తుంది.. ఏ పని చేసినా నీరసం ఆవహిస్తుంది.. అనుక్షణం అదే ఆలోచన వెంటాడి వేధిస్తుంటుంది.. ఎవరితో ఏమీ చెప్పుకోలేని దారుణమైన నిశ్శబ్దం బలవన్మరణం వైపు లాక్కుపోతుంది...
ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం కోసం ఒకే ఒక్క క్షణం చాలు.. ఆ ఒక్క క్షణం ఆ ఒక్క ఆలోచన మెదడును పనిచేయకుండా అడ్డుకుంటుంది.. ముందుగా మెదడును చంపేస్తుంది.. ఆ తరువాత మనిషిని హతమారుస్తుంది...

మనిషిని శాశ్వతంగా మాయం చేసేది ఆ క్షణం.. ఆ ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చేందుకు తోడెవరూ ఉండరు.. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వ్యక్తి తనంత తానుగా ఒంటరితనంలోకి జారుకుంటాడు.. ఆ ఒంటరితనాన్నే నిరంతరం వెంటబెట్టుకుంటాడు.. నీడలా వెంటాడే ఆ ఒంటరితనం కొంత కాలానికి వ్యక్తిని పూర్తిగా కమ్మేస్తుంది.. చివరకు అదే డామినేట్‌ చేస్తుంది.. తన వెంటబెట్టుకుని కానరాని లోకాలకు తీసుకువెళ్తుంది..
-----2------
ఒక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన వచ్చిన తరువాత మనిషి పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు.. ఎవరితోనూ మాట్లాడడు.. మనసులో చెలరేగుతున్న కల్లోలాన్ని ఏ ఒక్కరితోనూ పంచుకోడు.. చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి చనిపోవటానికి పూనుకునేంత వరకు మనసు అల్లకల్లోలంగా ఉంటుంది.. మానసిక వేదన అంతుపట్టని తీరులో ఊహకందదు... చివరకు ఉరి వేసుకోవటమో.. పురుగు మందు తాగిన తరువాతో ఒక్కుదుటున మనసులో మార్పు కనిపిస్తుంది.. అప్పుడు బతకాలన్నా బతకలేని పరిస్థితి.. ఎవరూ వచ్చి కాపాడలేని దుస్థితి.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?
అదొక విచిత్రమైన పరిస్థితి... మానసికంగా కృంగిపోయిన మనిషి.. తనను తాను అంతం చేసుకుంటున్న దుస్థితి.. బలవన్మరణానికి పూనుకునేందుకు కొద్ది నిమిషాల ముందు మనిషి ఆలోచనలు చాలా ఆవేశంగా ఉంటాయి.. కూల్‌గా ఆలోచించే పరిస్థితి ఉండదు.. మెదడులోని అన్ని నరాలు ఎప్పుడు తెగిపోదామా అన్న స్థాయిలో కదిలిపోతుంటాయి.. బాధల్లోంచి కమ్ముకొచ్చిన డిప్రెషన్‌ కనీవినీ ఎరుగని దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది.. ఆ కొద్ది నిమిషాల్లో ఎన్నో ఆలోచనలు.. ఎంతో ఆవేదన.. ఎవరికీ ఏమీ చేయలేకపోయానన్న బాధ.. ఏమీ సాధించలేకపోయానన్న ఆందోళన.. అన్నీ కలిపి వ్యక్తిని చావు వైపు బలవంతంగా లాక్కుపోతుంది...

చనిపోదామని నిర్ణయించుకున్న తరువాత అందరికీ దూరంగా ఉండటం సహజంగానే జరుగుతుంది.. ఒంటరిగా, దూరంగా ఎవరికీ చెప్పకుండా బలవంతంగా మరణాన్ని కొని తెచ్చుకుంటారు.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?

మెడకు ఉరి బిగుసుకుంది.. ఇక చావు ఎంతో దూరంలో లేదు.. అయిదు సెకన్లో.. ఆరో సెకన్లో... లేక పది సెకన్లు మాత్రమే మిగిలి ఉంది...
పురుగుల మందు, లేక విషం గొంతులోకి దిగింది.. ఒక్కో బొట్టు నరనరాల్లోకి పాకుతోంది.. ముందుగా మెదడులోకి ప్రసరిస్తుంది... చావు దగ్గర పడింది.. ముఫ్ఫై సెకన్లో, నలభై సెకన్లో మిగిలి ఉంది.. శరీరం దృఢమైంది అయితే, రెండు మూడు నిమిషాల సమయం మిగులుతుంది..

యాభై నిద్రమాత్రలు శరీరంలోకి ఒకేసారి వెళ్లిపోయాయి... ఒక్కో మాత్ర రక్తంలో కరిగిపోతోంది.. శరీరంపైకి నిద్ర కమ్ముకుంటూ వస్తోంది.. క్రమంగా మగతలోకి జారుకుంటున్న పరిస్థితి.. అయిదారు నిమిషాల్లో అంతా అయిపోతుంది....

ఆ కొద్ది క్షణాల్లో.. కొన్ని నిమిషాల్లో బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఆలోచనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేస్తుంది.. తాను తొందరపడ్డానన్న భావన ఒంట్లో గగుర్పాటు కలిగిస్తుంది.. ఎన్నెన్ని ఆలోచనలు ఒక్కసారిగా కమ్ముకుంటూ వచ్చేస్తాయి.. తన కుటుంబం గుర్తుకు వస్తుంది.. బంధువులు గుర్తుకు వస్తారు.. మిత్రులు గుర్తుకువస్తారు..
ఎలా.. ఏం చేయాలి.. ఒకే ఒక్క క్షణంలో తాను బతకాలి.. బతికి తీరాలి...అన్న ఆలోచన వచ్చేస్తుంది.. కానీ, ఎవరు కాపాడగలరు? బతకాలన్నా బ్రతికేది ఎలా? తాను ఒంటరిగా ఉన్నాడు.. చుట్టూ ఎవరూ లేరు.. కొన్నే కొన్ని క్షణాలు.. వేగంగా గడిచిపోతుంటే శరీరం నిస్తేజమైపోతుంటే.. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండునన్న ఆలోచన కలచివేస్తూనే హృదయ స్పందన ఆగిపోతుంది..
ఎంత భయంకరమైన పరిస్థితి. శత్రువుకైనా రాకూడదనుకునే క్షణాలివి.. ఆ క్షణంలో బలవన్మరణానికి పూనుకోక ముందు ఒక్కరితో తన భావాలను ఒక్కసారి పంచుకున్నా, వ్యక్తిలో మార్పు వస్తుంది.. ఆ ఒక్క క్షణం కూల్‌గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు..?
--------3--------
అవును ఎందుకు అలోచించలేకపోతున్నారు..? చనిపోవాలనుకున్నప్పుడు క్షణికంగా నిర్ణయం తీసుకున్న వాళ్లు విషం లోపలికి దిగుతున్నప్పటి నుంచి ఏదో తప్పు చేశామన్న భావనలో కుమిలిపోవటం ప్రారంభిస్తారు.. అదృష్టవశాత్తూ బతికి బట్టకడితే అప్పుడు వాళ్ల మానసిక పరిస్థితిని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు.. ఇందుకు ఓ ఉదాహరణ చూడండి.. కడప జిల్లాలో రమేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు..అతని పరిస్థితి ఏమిటో చూడండి..

రమేశ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లు రాస్తాడు...

అప్పులు.. ఆర్థిక బాధలు అతన్ని చిత్రహింసలకు గురి చేశాయి..

చావు తప్ప గత్యంతరం కనిపించలేదు..

ఆలోచనలు మరిచాడు..

విషం తీసుకున్నాడు

ఒంట్లో నరనరాల్లో మంట రేగినప్పుడు మొదలైంది పశ్చాత్తాపం..

భార్యాపిల్లల కోసమైనా బతకాలని, ఎవరైనా బతికించాలని కోరుకున్నాడు..

ఆ బాధ అతనికి తప్ప మరెవరికీ అర్థంకానిది..చెప్పటానికి కూడా శక్యం కానిది..

అదృష్టవశాత్తూ సమయానికి వైద్యం అందడంతో బతికాడు..
దగ్గరకు తెచ్చుకున్న చావును దూరం తరిమాడు..

ఇతను కేవలం ఒక ఉదాహరణ.. ఇలాంటి వారిలో బతికి బట్టకట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మహత్యకు పూనుకున్నప్పుడు ఉండే సమయం తక్కువ.. రక్షించే అవకాశాలు తక్కువ.. ఇలాంటి తక్కువ అవకాశాల్లో ప్రాణాలతో బయటపడిన వాళ్లు నిజంగా కోరుకునేది ఒక్కటే.. తనలాగా ఎవరికీ చావు రాకూడదని.. ఎవరూ తనలాగా బతికుండగానే నరకం అనుభవించరాదని...
------------4--------------
పురుగుల మందు తాగితే, విషం మింగితే, ఆ క్షణంలో ఏం జరుగుతుంది.. ఎలా ఉంటుంది.. పరిస్థితి తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చివరి నిమిషంలో ఎవరైనా గుర్తించి ఆసుపత్రికి తరలించి బతికించగలిగితే.. అప్పటికైతే బయటపడవచ్చు.. కానీ, ప్రాణాపాయం తప్పినట్లేనా? కాదు.. అపాయం నీడలా వెంటాడుతూనే ఉంటుంది.. స్లో పాయిజన్‌ మృత్యువును తోడు తీసుకుని కబళించేందుకు సిద్ధంగా ఉంటుంది..

గాఢమైన సాంద్రత కలిగిన రసాయనాలు కలిసిన పురుగుల మందులు, పేస్మాల్‌, హెయిర్‌ డై, ఇతర విష వస్తువులు తాగిన వారికి చాలా తక్కువ సమయం ఉంటుంది. శరీరంలో నరనరానా ప్రసరిస్తున్నప్పుడు వెయ్యి తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. ఎందుకు మందు తాగానురా అని అనిపిస్తుంది.. భయమేస్తుంది. దీన్నుంచి ఎలా బయటపడాలా అని ఆరాటం మొదలవుతుంది..

ఆ క్షణాల్లో పరిస్థితి చెప్పనలవి కానిది.. ఆవేశంగానో, అనాలోచితంగానో చావాలనే నిర్ణయం తీసకున్న అజ్ఞానులు విషపూరిత రసాయనాలు సేవిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.. పురుగు మందుల కంటే హెయిర్‌డై చాలా డేంజర్‌, దాని కంటే పెస్మాల్‌ చావక ముందే నరకాన్ని చూపిస్తుంది.

ఈ విష రసాయనాలు సేవించిన వాళ్లకు మొట్టమొదట గొంతువాపు వస్తుంది.
తరువాత నాలుక పిడచకట్టుకుపోతుంది.
క్రమంగా గొంతులోపలికి దిగిపోతుంది..
రక్తకణాల్లోకి ప్రసరిస్తుంది..
గుండెకు, కిడ్నీలను వెంటనే ప్రభావితం చేస్తుంది.
ఇంకేం.. ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారుతుంది..
వెంటనే ఆపరేషన్‌ చేయకపోతే అంతే సంగతులు..ఆసుపత్రిలో ట్యూబ్‌ ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తారు.. అయితే మోతాదుకు మించి పురుగుమందులు తాగినా, బలహీనమైన శరీరం ఉన్నా.. వైరస్‌ అటాక్‌ తప్పదు.
ఈ విష ప్రభావం వల్ల యూరిన్‌ రంగు మారుతుంది. తొందరగా చనిపోయే అవకాశం ఉంది.. విషం తీసుకున్న వెంటనే ఆసుపత్రికి తరలిస్తే బతికించేందుకు అవకాశాలు ఉండవచ్చు. వైద్యులు రకరకాల ప్రయత్నాలు చేసి తాగిన విషాన్ని కక్కిస్తారు.. ప్రాణాలను దక్కిస్తారు..
కానీ, అలా బతికినంత మాత్రాన ఆ తరువాత అంతా సవ్యంగా సాగుతుందా? అంటే అదీ లేదు.. ఒకసారి విషం శరీరంలోకి వెళ్లిన తరువాత దాన్ని ఎంత వెలుపలికి తీసినా, చివరలో ఒక్క కణమైనా శరీరంలో ఉండిపోతుంది.. దాని ప్రభావం జీవించి ఉన్నంత కాలం వెంటాడుతూనే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో క్రమంగా విస్తరించి శరీరంలోని ఒక్కోభాగంపై ఎఫెక్ట్‌ చూపడం మొదలు పెడుతుంది.. చివరకు ప్రాణాంతకంగా మారుతుంది.. బతికున్నన్నాళ్లూ నరకయాతన పడాల్సి వస్తుంది..
---------------5-------------
చావాలని ఒకే ఒక్క క్షణంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కొన్నే కొన్ని క్షణాల్లో అంతులేని నరకాన్ని చూపిస్తుంది. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని అంతం చేయటమే కాదు.. దానిపై ఆధారపడ్డ మరి కొన్ని జీవితాలకు అర్థమే లేకుండా చేస్తుంది.
చనిపోయే ఘడియల్లో అనుభవించే బాధ.. అంతకు ముందు ఆత్మహత్యకు పురికొల్పిన బాధల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది.. ఇంత తీవ్రమైన బాధను అనుభవించటం, జీవితాన్ని అర్ధాంతరంగా ముగించటం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి..
ఆత్మహత్య అన్న ఆలోచన ఎందుకు వస్తుంది?
నిర్హేతుకమైన సుఖాల కోసం ఆలోచించినప్పుడు..
బాధ్యతలు భారంగా మారినప్పుడు..
అవసరం వేరు.. సుఖం వేరు..బాధ్యత వేరు.. బరువు వేరు..
సమస్యలు లేకుండా.. కష్టాలు రాకుండా.. జీవితం గడవాలంటే సాధ్యం కాదు..
ఒక సమస్య పరిష్కారమైతే.. దాడి చేసేందుకు మరో సమస్య ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. వాటి నుంచి పారిపోవాలనుకోవటం వెర్రితనం తప్ప ఇంకోటి కాదు. ఇలా పారిపోవాలనుకున్నప్పుడే, విరక్తి పెరిగిపోతుంది..
మనకు ఉన్నది ఒకే ఒక్క జీవితం.. ఇంకో జన్మ ఉన్నదనో.. వస్తుందనో ఆలోచించటం.. విశ్వసించటం కంటే, ఉన్న జీవితంలోనే ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నించటం అవసరం.. ఇప్పుడు చావాలని అనుకునే వాళ్లు, అదే క్షణంలో ఎందుకు చావాలి అని ఒక్కసారి ఆలోచిస్తే.. జీవితం సమూలంగా మారిపోతుంది.. ఆ ఒక్క క్షణమే.. జీవితాన్ని ముగించటానికో, కొనసాగించటానికో కారణమవుతుంది.
ఒక్కసారి ఆలోచించండి.. జీవితం ఒకేఒక్కసారి వస్తుంది.. ఆ జీవితాన్ని పూర్తిగా యుటిలైజ్‌ చేసుకోవటం ముఖ్యం.. సుఖంగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు.. ఆ సుఖాన్ని సాధించటం కోసం ప్రయత్నించాలి.. పోరాడాలి కానీ, సుఖం దక్కలేదని లోకం నుంచే మాయమైపోతానంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు..చావు కోసం మనల్ని నిర్వీర్యం చేసే క్షణాన్ని మనమే పూర్తిగా డామినేట్‌ చేయాలి.. అర్థం లేని ఆత్మహత్యలను దూరంగా తరిమికొట్టాలి..