రామజన్మభూమి పై అలహాబాద్ హైకోర్టు ఊహించిన తీర్పునే వెలువరించింది.. అన్ని పక్షాలను కొంత వరకు సంతృప్తి పరిచే విధంగా ఉండేలా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. అత్యంత కీలకమైన అంశం ఏమంటే, రామ్‌లల్లా విగ్రహాలు ఉన్న వివాదాస్పద స్థలాన్ని రాముడు జన్మించిన భూమిగా న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకరించటం. కోట్లాది హిందువుల విశ్వాసాన్ని అలహాబాద్ హైకోర్టు నిర్ద్వంద్వంగా బలపరిచింది. వివాదాస్పద స్థలంలో రామ్‌లల్లా విగ్రహాలను తొలగించకూడదంటూనే, వివాదంలో ఉన్న ౨ ఎకరాల ౭౨ గుంటల స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలంటూ తీర్పు చెప్పింది.. సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవటానికి మరో మూడు నెలలు గడువిచ్చింది. ఈ మూడు నెలలు అయోధ్యలో స్టేటస్కో ఉండాలని తీర్పు చెప్పింది.
ఇవిగో తీర్పు కాపీలు
అయోధ్య తీర్పు హైలైట్స్
బ్రీఫ్ జడ్జిమెంట్ కాపీ