30, సెప్టెంబర్ 2010, గురువారం

వివాదాస్పద స్థలం రాముడిదే-ఇవిగో తీర్పు కాపీలు

రామజన్మభూమి పై అలహాబాద్‌ హైకోర్టు ఊహించిన తీర్పునే వెలువరించింది.. అన్ని పక్షాలను కొంత వరకు సంతృప్తి పరిచే విధంగా ఉండేలా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. అత్యంత కీలకమైన అంశం ఏమంటే, రామ్‌లల్లా విగ్రహాలు ఉన్న వివాదాస్పద స్థలాన్ని రాముడు జన్మించిన భూమిగా న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకరించటం. కోట్లాది హిందువుల విశ్వాసాన్ని అలహాబాద్‌ హైకోర్టు నిర్ద్వంద్వంగా బలపరిచింది. వివాదాస్పద స్థలంలో రామ్‌లల్లా విగ్రహాలను తొలగించకూడదంటూనే, వివాదంలో ఉన్న ౨ ఎకరాల ౭౨ గుంటల స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలంటూ తీర్పు చెప్పింది.. సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవటానికి మరో మూడు నెలలు గడువిచ్చింది. ఈ మూడు నెలలు అయోధ్యలో స్టేటస్‌కో ఉండాలని తీర్పు చెప్పింది.
ఇవిగో తీర్పు కాపీలు
అయోధ్య తీర్పు హైలైట్స్
బ్రీఫ్ జడ్జిమెంట్ కాపీ

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నాకె౦దుకో ఈ తీర్పు మరిన్ని సమస్యలను కొనితెస్తు౦దని గాభరాగా వు౦ది. మరేదో ఉద్దేశ్య౦ ఉన్నట్లనిపిస్తో౦ది. తీర్పు సారా౦శ౦ హి౦దూ మనోభావాలకు అనుగుణ౦గా తుది నిర్ణయ౦ తీసుకోబడి౦దని చెబుతో౦ది. మనోభావాలు, నమ్మకాలు కోర్టు తీర్పులకు ప్రామాణిక౦ కారాదు. అది చిచ్చుని రేపుతు౦దే తప్ప చల్లార్చదు. అదే గాలాన్ని వేసి, విచ్చిన్నకర శక్తులు మరి౦త పెద్ద లక్శ్యాన్ని పడగొట్టే ఆలోచి౦చ వచ్చు. పురాతత్వ శాఖ నివేదికను ప్రామాణిక౦గా తీసుకు౦టే, దాన్ని ఆధార౦గా తీసుకుని తీర్పు ఇవ్వాలి కాని, హి౦దూ మనోభావాలను, నమ్మకాల ఆధార౦గా ఇచ్చినట్లు పేర్కొనట౦ ఖచ్చిత౦గా తప్పే.

మరి హి౦దూ నమ్మకాలను కోర్టు గౌరవి౦చేటట్లయితే, రామసేతు విషయ౦లో కూడా ఇటువ౦టి నిర్ణయమే తీసుకోగలరా? తీసుకున్నారా?