10, ఆగస్టు 2010, మంగళవారం

సాగిపోయిన సంపద్విమర్శ..

ప్రముఖ సాహితీ వేత, కవి, విమర్శకుడు ఆచార్య కోవెల సంపత్కుమారా చార్య గత గురువారం కన్నుమూశారు.. ఈ వార్త ఆలస్యంగా చెప్తున్నందుకు మన్నించాలి.. కర్మ, ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల చెప్పలేకపోయాను.. నిన్నటి నుంచే రొటీన్‌ కార్యక్రమాల్లో పడ్డాను.. సంపత్కుమార వయస్సు ౭౭ సంవత్సరాలు.. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.. చిట్టిగూడూరు ప్రాచ్యకళాశాలలో, సంస్కృత ప్రాకృతాలను అధ్యయనం చేసి భాషాప్రవీణ సాధించిన సంపత్కుమార పలు కళాశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారు.. తరువాత కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు.. ౧౯౫౪లో తన అన్నగారి అబ్బాయి, సుప్రసన్నతో కలిసి హృద్గీత కావ్యాన్ని జంటకవులుగా ప్రచురించారు.. దీనికి కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ముందుమాట రాయటం విశేషం.. సుప్రసన్న శ్రీఅరవిందులు, వివేకానందులు, రామకృష్ణులు, రమణ మహర్షి వంటి తాత్త్వికుల కోవలో ముందుకు వెళ్తే.. సంపత్కుమార సంప్రదాయ ఉదార శ్రీవైష్ణవం ద్వారా ముందుకు వెళ్లారు.. అపర్ణ, ఆముక్త వంటి కావ్యాలు ఆయన రచనల్లో ప్రముఖమైనవి.౧౯౬౦లలో ఆంధ్ర సాహిత్య అకాడమీ చందస్సు మీద పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు మూడు గ్రంథాలు వచ్చాయి. అందులో సంపత్కుమార చందో వికాసం ఒకటి.. న్యాయ నిర్ణేతల్లో ఒకరైన అబ్బూరి రామకృష్ణారావుగారికి చందో వికాసం నచ్చినప్పటికీ, అప్పటికే ఈ రంగంలో అద్భుతమైన కృషి చేసిన, వయసులో పెద్దవారైన శ్రీ గిడుగు సీతాపతి గారికి బహుమతిని ఇచ్చారు. అయితే, సంపత్కుమార చందోవికాసాన్ని సాహిత్య అకాడమీ ఆర్థికసాయం చేసి అచ్చు వేయించింది. విశ్వనాథ సాన్నిహిత్యం వీరి సాహిత్యమార్గాన్ని విరిదారిగా మార్చింది.. ఆయన విమర్శ అపురూపం.. అన్ని ప్రక్రియలపైనా  సాధికారికంగా విమర్శించగలిగిన పండితుడు.. అలంకార శాస్త్రం, చందః శాస్త్రంపై సమకాలీనుల్లో  సంపత్కుమారది అగ్రస్థానం. గుప్తాఫౌండేషన్‌ అవార్డు, రాజీవ్‌ ప్రతిభా పురస్కారం, దాశరథి అవార్డు వంటివి ఎన్నెన్నో సంపత్కుమారను వరించాయి. విశ్వనాథ వారి అసంకలిత సాహిత్య రచనలను ఆరు సంపుటాలుగా వెలుగులోకి తీసుకురావటంలో సంపత్కుమార, సుప్రసన్నల కృషి ప్రధానమైంది.. వీరి ప్రయత్నం సాగకపోతే, అమూల్య సాహిత్య భాండాగారం వెలుగులోకి వచ్చేది కాదు..

4 కామెంట్‌లు:

kasturimuralikrishna చెప్పారు...

మీకు, సుప్రసన్న గారికీ, సాహితీ బంధువులకూ నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాను. వారితో నాకు ముఖ పరిచయం లేకున్నా ఫోను పరిచయం వుంది. నా రాజతరంగిణి కథలను ఆయన సాధికారికంగా విమర్శించిన తీరు అద్భుతం. ఆ విమర్శ జాగృతి వార పత్రికలో రెండు భాగాలుగా వచ్చింది. ఇటీవలే నేను వరంగల్ నుండి సౌశీల్య ద్రౌపది సభ జరిగిన తరువాత తిరిగువస్తూండగా వారు ఫోను చేశారు. సౌశీల్య ద్రౌపది గురించి తమ అభిప్రాయాన్ని తెలిపారు.

నిజంగా, మన సాహిత్యంలో రంగుటద్దాలు, ఇజాల అడ్డుగోడలే లేకపోతే, ఆయన స్థాయికి, సహృదయతకు తగ్గ గుర్తింపు లభించివుండేది. కానీ, తెలుగు సాహిత్య చరిత్రలో జాతీయ భావాలను సజీవంగా వుంచటంలో విశ్వనాథ తరం వారి కృషిని కొనసాగించిన వారిగా వారిలో అగ్రతాంబూలాన్ని అందుకుంటారు సంపత్కుమారాచార్య గారు.

కొత్త పాళీ చెప్పారు...

అయ్యో, అలాగా. గొప్ప పండితులు, అలాగే ఆధునిక దృష్టితోనూ చూసినవారు.

Afsar చెప్పారు...

సంతోష్ గారూ:

సంపత్కుమార గారి నిష్క్రమణ ఒక తీరని లోటు. ఆయనతో నాకు 1986 నించీ మంచి పరిచయం వుంది. ఆ పరిచయం గురించి నా బ్లాగులొ రాసాను.

ఆయనకి తెలుగు మీడియా సరయిన నివాళి ఇవ్వలేదని నాకు అనిపించింది.

సంపత్కుమార గారి గురించి రాయాల్సింది చాలా వుంది.

మీ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.

Nagaraju చెప్పారు...

Hi,
Visit my Blog : http://gsystime.blogspot.com/

This is having spiritual and general society information.
The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
I written from 2009 December onwards.
I wtitten in Telugu and English languages (In English few things are wrote).
Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
the title as symbol of '*').
Main Topics are : (Read in order to better understand)
Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
Eng - (Jan, 2010) ' * How Brain Works'
Eng - (Jan, 2010) ' * Where Dream World?'
Eng - (Jan, 2010) ' * Why the Food?'
Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
chendavaa shwaasa neelone kadaa!" '
Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
"Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
These two caption's so many written along with these.
* * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
lines : for Record).

As soon as possible please give reply to my mail, about my Blog.

Regards,
Nagaraju G