12, అక్టోబర్ 2011, బుధవారం

లగడపాటి ఇప్పుడేమంటారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామంటేనే గుండె రెండుగా చీలిపోయినట్లుగా లగడపాటి రాజగోపాల్‌ తెగ బాధపడిపోయారు.. దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లిపోయిందని బాధపడిపోయారు.. ఇప్పుడు ప్రశాంత్‌భూషణ్‌ ఏకంగా కాశ్మీర్‌నే పాకిస్తాన్‌కు ఇచ్చేయమని సలహా ఇస్తున్నారు.. ఈ మాట విని లగడపాటి గుండె తట్టుకుంటుందా? ఇప్పుడు కెసిఆర్‌కు పంపించినట్లుగా సీడీలు, పుస్తకాలు ప్రశాంత్‌భూషణ్‌కు కూడా పంపిస్తారా?

8 కామెంట్‌లు:

John చెప్పారు...

లగడపాటికి ఏమో గానీ...వేర్పాటువాదులకు ( ముఖ్యంగా పాకిస్తానీ సంబంధం గల వేర్పాటువాదులకు ) ఇది పండగే...

Sravya V చెప్పారు...

లగడపాటి ఏమి చేస్తారో బహుసా మీ లాంటి మీడియా లో పని చేసేవారు ఎవరో ఆయన్ని డైరెక్ట్ అడిగితె తెలిసి పోతుంది .

ఇంతకీ ప్రశాంత్ భూషణ్ గారి అభిప్రాయం మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చా ?

అజ్ఞాత చెప్పారు...

ఏకంగా కాశ్మీర్‌నే పాకిస్తాన్‌కు ఇచ్చేయమని సలహా ఇస్తున్నారు.
లగడపాటి సంగతేమో కానీ, ఆ కుహనా మేధావిని తలుచుకొంటే అసహ్యం వేస్తోంది.

Praveen Mandangi చెప్పారు...

పెద్ద సమైక్యత గురించి మాట్లాడే పోటుగాళ్ళు. కాకినాడ సభలో బిజెపి ఒక వోటు, రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసినప్పుడు బిజెపిని ఎవరూ విమర్శించలేదు కానీ హైదరాబాద్ విషయానికొచ్చేసరికి తెలంగాణావాదులని తెలబాన్‌లు అని తిడుతున్నారు.

అజ్ఞాత చెప్పారు...

ఏమీ అనడు. ఎందుకంటే కాశ్మీర్ లో ఆయనకు కానీ, ఇతర ఆంధ్రోల్లకు కానీ కబ్జా భూములు లేవు, ప్రభుత్వ కాంట్రాక్ట్లు లేవు, పైగా అక్కడ వక్ఫు భూముల జోలికి పొతే మక్కెలిరగదీస్తారు.

శ్యామలీయం చెప్పారు...

మేధావులు రెండు రకాలు. ఒకటి. మంచి కోసం తాపత్రయ పడేవారు. రెండు. పేరుకోసం తాపత్రయ పడేవారు.

తల్లికోసం జీవితాంతం కృషిచేసిన వాళ్ళెందరో ఉంటారు కాని వాళ్ళెవరూ పత్రికలకు తెలియదు.

ఒకడు తల్లిని పొడిచి చంపుతాడు - పత్రికలు వాడి ఫోటో వేస్తాయి, వాడి ఇంటర్వ్యూ కోసం యెగబడతాయి.

ఇదీ ప్రపంచం.

Praveen Mandangi చెప్పారు...

కాశ్మీర్ పాకిస్తాన్‌కి పరాధీనమైనా, ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక దేశాలుగా ఏర్పడినా లగడపాటికి వచ్చే నష్టం ఏమీ లేదు. హైదరాబాద్ ఒక్కటే ముఖ్యం అనుకున్నప్పుడు దేశం ఎలా పోయినా అతనికేం?

రాకుమార చెప్పారు...

సంతోష్ గారు! మీరు లగడపాటి మనసును అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనడానికి మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలే తార్కాణం. ఇక్కడ హైదరాబాదంటే ఆయనగారి బంగారు గుడ్లు పెట్టే "లాంకో"డి పెట్ట." కాశ్మీర్ లో ఏముందండీ, "తీవ్ర"పుమంచుకు వణకడం తప్ప. లగడపాటి, రాయపాటి, వీళ్ల ఏకైక గమ్యం వ్యాపారం, కాకపోతే అందుకు వాళ్లకు నచ్చిన, అచ్చొచ్చిన వయా రూటు రాజకీయం.