5, డిసెంబర్ 2019, గురువారం

సాక్షాత్ సరస్వతి.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గతంలో ఎవరూ వినని ...

స్వాధ్యాయ సగర్వంగా సమర్పిస్తున్న మరో అపూర్వ గళం .. సాక్షాత్తు సరస్వతి.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్వగతమిది. మునుపెన్నడూ వినని అంశాలు ఆయన స్వరంలో అరుదైన చిత్రాలతో సహా కనీ వినవచ్చు. తమవంటి శిష్యుడు చెళ్లపిళ్ల వారికి దక్కడం నన్నయ్యకు.. తిక్కనకు కూడా లేదని చెప్పగలిగిన మహాపురుషుడు. వారి తండ్రిగారు భూమిని ఎలా దానధర్మాలు చేసింది.. ఆ తర్వాత కిన్నెరసాని వాగును ఆయన ఎప్పుడు ఎలా చూశారు.. దాన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతి.. వీటన్నింటి గురించి సవివరంగా ఆయన ప్రఖ్యాత సాహితీమూర్తులు శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, వేలూరి సహజానంద చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని విడి విడి అంశాల సమాహారం ఐదు నిమిషాల నిడివిలో... తప్పకుండా పూర్తిగా వినండి..

మన మార్గదర్శకులు వీరు. ఇంతటి మహాపురుషుల మరిన్ని స్వరాలను మీకు  అందిస్తుంది సాధ్యాయ. ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి స్వాధ్యాయ చానల్ను. 

కామెంట్‌లు లేవు: