8, జనవరి 2009, గురువారం

మన మీడియా వెళ్తున్న దారి సరైనదేనా?

మన మీడియా వెళ్తున్న దారి సరైనదేనా? అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ప్రస్తావిస్తున్నా. మీడియా పారదర్శకత సమాజంలో దాని భూమికను మీరే నిర్ధారించండి.

* 26/11 దాడులకు సంబం`దించి భారతీయ మీడియా తీసుకున్న స్టాండ్‌(వైఖరి) కూడా చర్చనీయాంశమైంది. రెండు మాసాలుగా  ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ తీరుపై దేశ వ్యాప్తంగా విస్తతంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సందర్భంలో  ప్రజల మనోభావాలను ప్రతిబింబించే వి`దంగా చర్చ చేసిన చానళు్ల చాలా తక్కువ. ఇలాంటి వాటిలో  టైమ్‌‌సనౌ చానల్‌ అగ్రస్థానంలో ఉంది.  pakistan is our enemy అని ముందుగా వ్యాఖ్యానించింది టైమ్‌‌సనౌ... పాకిస్తాన్‌ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారంటూ చెప్తున్న మాటలన్నీ బూటకమేనని స్పష్టం చేసింది. పాలకులను ఎన్నుకున్నది ప్రజలే అయినప్పుడు జరుగుతున్న పరిణామాలకు వారూ `ా`ద్యత వహించాల్సిందేనన్న టైమ్‌‌స వాదన సమంజసమైంది. పాకిస్తాన్‌లోని ప్రతి ప్రాంతం ఉగ్రవాదానికి ఆలవాలమైంది.వారికి  వెన్నుదన్నుగా నిలుస్తున్నది అక్కడి ప్రభుత్వ యంత్రాంగం.. అక్కడి మదరసాల్లో ఉగ్గుపాలతోనే భారత వ్యతిరేక విషబీజాలను పసివాళ్లలో నాటుతున్నారు. ఇంత తీవ్రస్థాయిలో భారత వ్యతిరేకత అక్కడి ప్రజల్లో, పాలకుల్లో  ఉన్నప్పుడు పాకిస్తాన్‌ను శత్రువనకపోతే ఇంకేమంటాం... ``పాకిస్తాన్‌ మారాలనుకుంటోంది.. అందుకు అవకాశం ఇవ్వాలంటూ'' రాం జెత్మలానీ వంటి మూర్ఖ లాయర్లు చేసే వాదన అర్థరహితమైందని టైమ్‌‌స స్పష్టం చేసింది. అరవై ఏళు్లగా పాకిస్తాన్‌ మారుతుందనే ఎదురు చూశాం.. ఇంకా మార్పు సా`ద్యమేనని పేర్కొనటం మన చేతకాని తనమే అవుతుంది.

* ' 2008  నవంబర్‌ 26న ముంబయిపై టెరర్రిస్టుల దాడి దేశంపైనే పాక్‌ శ్రత్రువులు ప్రకటించిన యుద్ధం. కొత్త దారులు వెతుక్కుని వాణిజ్య రాజ`దానికి ప్రతీకలుగా నిలిచిన సంస్థలపై ఉగ్రవాదులు దాడులు జరిపితే...భారతీయ మీడియా కనపరచిన అత్యుత్సాహం `ƒమించరానిది. టెలివిజన్‌ చానళు్ల పోటీలు పడి ప్రత్య`ƒ ప్రసారాలు చేయటం వల్ల ఉగ్రవాదుల ఏరివేత ఆలస్యం కావటమే కాక, మరింత ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించింది. తాజ్‌, ఓ`ెరాయ్‌ హోటళ్లలో దాగి ఉన్న టెరర్రిస్టులకు పాకిస్తాన్‌లో ఉన్న వారి `ాస్‌లు మన టెలివిజన్‌ చానళ్లలో వస్తున్న సమాచారం ఆ`దారంగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేశారంటేనే మీడియా వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. హోటళ్లలో మంత్రులు ఉన్న సంగతి, సైనికులు ప్రవేశించిన విషయాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌లోని `ాస్‌లు తమ వారికి సాటిలైట్‌ ఫోన్‌ల ద్వారా చెప్తూ వీలైనంత అ`దిక నష్టాన్ని చేసేందుకు ప్రయత్నించారు. తాజ్‌ హోటల్‌ ముందు మూడు వందల మీటర్ల దూరంలో  కొందరు పాత్రికేయులు చేసిన డ్రామా పిటుసిలు సర్వత్రా విమర్శలకు దారి తీశాయి.

* ' కార్గిల్‌ యుద్ధం సమయంలో ఎన్‌డిటివి పొలిటికల్‌ ఎడిటర్‌ బర్ఖాదత్‌  యుద్ధభూమి నుంచి వార్తలను ప్రసారం చేసింది. ఆ సమయంలో   ఆమె సాహసానికి ప్రశంసల వర్షం కురిసింది. ఆ వార్తల కవరేజీలో ఆమె పెను ప్రమాదం నుంచి తప్పించుకుందన్న వార్తలూ వెలువడ్డాయి. కానీ, నిజం వేరేలా ఉంది. కార్గిల్‌ ప్రాంతానికి వెళ్లిన బర్ఖాదత్‌ కెమెరా చిత్రీకరణకు అనువుగా ఉండేలా శతఘు్నలను పేల్చాలంటూ అ`దికారులను అడిగిందిట. అందుకు అ`దికారులూ సరేనన్నారట. ఈ దశ్యాలకు సంబం`దించి, ప్రసారం చేసే విషయాన్ని చర్చించేందుకు బర్ఖా సెల్‌ఫోన్‌ను ఉపయోగించిందట. ఈ సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆ`దారంగా పాకిస్తాన్‌ సైనికులు దాడి చేస్తే, ముగ్గురు భారతీయ సైనికులు, శక్తిమంతమైన తుపాకులు, బంకరు నాశనమై పోయాయట. 
* ' 2006 సెప్టెంబర్‌ మొదటి వారంలో ఉజ్జయిని మా`దవ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ హెచ్‌. ఎస్‌. సభర్వాల్‌పై ఎబివిపి కార్యకర్తలు దాడి చేసి హతమార్చారు. విద్యార్థి సంఘం ఎన్నికలను పర్యవే`ిస్తున్న ఆయనపై దాడి చేసే విషయాన్ని ముందుగానే ఎబివిపి కార్యకర్తలు మీడియాకు వెల్లడించారు. ఈ దాడిని కవర్‌ చేసేందుకు ఎబివిపి కార్యకర్తలు చేరకముందే వివి`ద చానళ్ల కెమెరాలు సభర్వాల్‌ ఇంటికి చేరుకున్నాయి. ఆ తరువాత ఎబివిపి గూండా విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి ప్రొఫెసర్‌ను కొడుతుంటే ఆయనపై కెమెరాలు ఉంచి షూట్‌ చేశారే తప్ప ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం మీడియా ప్రతిని`దులు చేయలేదు. ప్రొఫెసర్‌  దాహం దాహం అన్నా ఆయన మంచినీళు్ల కొరుతున్నారంటూ ప్రత్య`ƒ ప్రసారం చేశారు కానీ, ఆయన్ను ఆదుకునే ప్రయత్నం మీడియా చేయలేదు. దాని పర్యవసానం సభర్వాల్‌ మరణం..

* ' మూడున్నర సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లాలో ఒక ఘటన జరిగింది. ఒక వ్యక్తి ఓ భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకోవటానికి ముందే ఈటీవీ, టివి9 చానళు్ల అక్కడికి చేరుకున్నాయి. అతను భవంతి పైనుంచి డిమాండ్లు చేస్తున్నప్పటి నుంచి అతను పై నుంచి దూకి చనిపోయేంత వరకు కూడా ప్రతి `ƒణం రికార్డు చేశాయి. ఆ తరువాత ఆ రోజంతా ఆ సన్నివేశాన్ని జూమ్‌ ఇన్‌లు, జూమ్‌ అవుట్‌లు, స్లో మోషన్‌.. ఇలా రక రకాలుగా ప్రసారం చేశారు. ఒళు్ల గగుర్పొడిచే, సున్నిత మనస్సులను తీవ్రంగా గాయపరిచే ఇలాంటి ఘటనలను ప్రసారం చేయటం వల్ల సమాజంలో ఎలాంటి మార్పును మీడియా కోరుకుందో అర్థం కాదు.. దీని తరువాత ఇలాంటి ఘటనలు మరో రెండు జరిగాయి. అంతే కాదు... సెల్‌ఫోన్‌ టవర్‌లపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ `ెదిరించిన ఘటనలూ ఆ తరువాత రొటీన్‌గా మారిపోయాయి. 
* ' 2008 డిసెంబర్‌ 10వ తేదీన  వరంగల్‌ లో ఇద్దరు బిటెక్‌ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతలపై ముగ్గురు విద్యార్థులు యాసిడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిలో స్వప్నిక ఇరవై రోజులు ఆసుపత్రిలో మత్యువుతో  పోరాడి చనిపోయింది. యాసిడ్‌ దాడి చేసిన ముగ్గురు దోషులను ఇరవై నాలుగు గంటలు తిరక్కుండానే వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. పదకొండో తేదీ మ`ద్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇంతవరకు `ాగానే ఉంది. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి సా`ా్య`దారాలతో నేరం రుజువు చేసి వారికి శి`ƒపడేలా చేయటం పోలీసులు ఆ తరువాత నిర్వర్తించాల్సిన వి`ది. కానీ, పోలీసులు సత్వర న్యాయం కోసం ఉరకలు వేశారు. ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన కొద్ది గంటలకే వరంగల్‌ శివార్లలో దారుణంగా ఎన్‌కౌంటర్‌ చేసేశారు. నేరం చేసిన కొద్ది గంటల్లోనే వారికి తగిన శి`ƒ పడిందని అంతా సంతోషించారు. శి`ƒ పడటం `ాగానే ఉంది. కానీ న్యాయస్థానం మెట్లు నిందితులు ఎక్కకుండానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులు శి`ƒను అమలు చేసిన తీరు ఆ`ేపణీయం. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు కాబట్టి పోలీసులు తాము చేసిన పనిని సమర్థించుకోవచ్చు. కానీ, రాజ్యాంగ పరంగా పోలీసులు ఈ కేసును పరిష్కరించిన తీరు గర్హనీయం. న్యాయాన్ని అన్యాయంగా చేయటాన్ని ఒకసారి ఆమోదిస్తే.. భవిష్యత్తులో పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే ప్రమాదం ఉంటుంది. అమ్మాయిలకు భద్రత చట్టాన్ని చేసినట్లయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదు.. దోషులు చట్టం నుంచి తప్పించుకునే వాళు్ల కారు..నేర వార్తను వివరిస్తూనే... పోలీసుల నిర్ణయాన్ని విశ్లేషించటం, అమ్మాయిల ర`ƒణకు ప్రభుత్వాలు తీసుకోవలసిన త`ƒణ చర్యల గురించి చర్చిస్తూ... నిష్పా`ికంగా వార్తను రాయటం ప్రొఫెషనల్‌ జర్నలిస్టు కర్తవ్యం. 

* ' ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక అమ్మాయిని గ్యాంగ్‌ రేప్‌ చేసిన వ్యవహారంలో పోలీసులు నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోకుండా ఆ వ్యవహారానికి సంబం`దించిన అశ్లీల సిడిలను లోపాయికారిగా మీడియాకు విడుదల చేయటం అనైతికం. పోలీసులు తాము విడుదల చేయలేదని చెప్తున్నా.. అక్కడి నుంచే లీకయిందన్న వార్తలు కొట్టిపారేయలేం. ఇలాంటి సున్నితమైన కేసుల విషయంలో పోలీసులు మహిళల ప్రాథమిక హక్కుల్ని, సున్నితత్వాన్ని గ్రహించి మెలగటం అవసరం. పోలీసులు  ఆ పని చేయలేకపోయారు. కనీసం మీడియా అయినా సరిగ్గా వ్యవహరించిందా అంటే అదీ లేదు.. `ా`దితురాలి పేరు చెప్పకుండా  ముఖంపై మాస్‌‌క వేసినంత మాత్రాన గోప్యతను పాటించినట్లు ఎలా అవుతుంది? ఘటన జరిగిన స్థలాన్ని పేర్కొని, `ా`దితురాలి తల్లిదండ్రుల పేర్లు చెప్పటం ద్వారా అమ్మాయి అస్తిత్వాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి దశ్యాలను రోజంతా అటు తిప్పి, ఇటు తిప్పి చూపించటం వల్ల ఆ అమ్మాయి కుటుం`ానికి నష్టం చేసినట్లే కానీ, మేలు చేసిందేమీ లేదు... అదష్ట వశాత్తూ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయకుండా, రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. 

* ' 2003 మార్చిలో ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేస్తే  మీడియా లైవ్‌ కవరేజి ఇవ్వలేదు.. అమెరికా అనుమతించిన మేరకే విజువల్‌‌స రికార్డు చేసి ఆ తరువాత చూపించారు. తమ దేశ ప్రయోజనాలకు భగం కలిగించే ఏ ఒక్క సన్నివేశాన్నీ మీడియాలో ప్రసారం కాకుండా అమెరికా నియంత్రించగలిగింది. అదే 26/11  2008 టెరర్రిస్టుల దాడిని మీడియా అత్యుత్సాహంతో ప్రత్య`ƒ కవరేజీ చేస్తుంటే సర్కారు ఏ వి`దంగానూ నియంత్రించలేకపోయింది. ఈ అలసత్వాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. 

* '   పత్రికాస్వేచ్ఛ పేరుతో మీడియా అనుభవిస్తున్న స్వాతంత్య్రానికి పరిమితులు లేకుండా పోయింది. వాస్తవానికి పత్రికా స్వేచ్ఛ అన్న పదానికి ఎక్కడా చట్టబద్ధత లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడా పత్రికాస్వేచ్ఛ గురించి పేర్కొనలేదు. 19వ అ`దికరణంలోని భావప్రకటనా స్వేచ్ఛనే పత్రికా స్వేచ్ఛగా పేర్కొంటూ మీడియా తన అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నది.  సమాజంలో అది నిర్వహించే కీలక భూమికను దష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలూ దీన్ని పట్టించుకోవటం లేదు. స్వయం నిర్దేషిత స్వేచ్ఛను కూడా మీడియా దుర్వినియోగం చేయటం వల్ల ఎవరికీ మేలు జరగకపోగా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళు్తన్నాయి. 

3 కామెంట్‌లు:

krishna rao jallipalli చెప్పారు...

అదష్ట వశాత్తూ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయకుండా, రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు....తప్పు పని చేసారు. రోడ్డు మీదనే ఎన్కౌంటర్ చేయాల్సింది.

రాధిక చెప్పారు...

చాలా వివరంగా రాసారు.అగ్రీ విత్ యూ.

అజ్ఞాత చెప్పారు...

ilaa entha kaalam vimarsisthu koorchuntam, dheeniki ending ledha, veray vaalla personal life ni publish cheyyadam pathrika swecha etla avuthundhi