10, నవంబర్ 2010, బుధవారం

వైట్‌హౌస్‌ అలియాస్‌ రెసిడెన్సీ

కోఠీ రెసిడెన్సీ.. ఒకప్పుడు నిజాం వైభవానికి నిలువెత్తు నిదర్శనం... ఇప్పుడు అగ్రరాజ్యం అధిపతి నివాసంగా మారింది. మన రెసిడెన్సీని ప్రపంచ పోలీసు ఎత్తుకెళ్లిపోయాడు.. అక్కడి నుంచే అధికారాన్నంతా చెలాయిస్తున్నాడు.. ఒకప్పటి మన రెసిడెన్సీ.. బ్రిటిష్‌ వారి మెప్పు కోసం, మెహర్బానీ కోసం నిజాం నిర్మించి ఇచ్చిన గొప్ప ప్యాలెస్‌ ఇప్పుడు పేరు మార్చుకుని వాషింగ్టన్‌ డిసికి తరలిపోయింది.. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసంగా మారిపోయింది. ఇది వింతవార్త కాదు.. పుకారు కాదు.. విచిత్రం కాదు.. నిజం..
1
ఇదేమీ కట్టుకథ కాదు.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే వాస్తవం.. మనకు తెలియకుండానే మన భవనం అమెరికా అధ్యక్షుడి నివాసమైపోయింది. ఇదెలా జరిగింది? ఇప్పుడు యావత్ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రశ్న. హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న వాస్తవం.. రెసిడెన్సీ ఏ విధంగా తరలిపోయింది? ఎలా పేరు మార్చుకుంది? అంతటి అగ్రరాజ్యానికి మన రెసిడెన్సీయే ఎందుకు కావలసి వచ్చింది? వినడానికి విచిత్రంగానే ఉండొచ్చు.. కానీ, ఇది వాస్తవం..  
మనకు తెలిసిన అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్‌.. రాజధాని వాషింగ్టన్‌ డిసిలో కొలువై ఉన్న శ్వేత సౌధం.. కనుసైగతో ప్రపంచాన్ని శాసించే అత్యంత శక్తిమంతమైన రాజ్యాధిపతి అధికార దర్పానికి నిలువుటద్దం. శ్వేతసౌధంలో అధికార లాంఛనాలతో రెడ్‌కార్పెట్‌ స్వాగతం స్వీకరించేందుకు ఉబలాటపడని ప్రపంచదేశాధి నేతలు ఉండరు.. మన మన్మోహన్‌ సింగ్‌ సైతం జార్జిబుష్‌ ఇచ్చిన విందుకు సంబరపడే అణు ఒప్పందంపై రాజీ లేకుండా సంతకం చేసేశారు..
ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా మొట్టమొదటి సమాచారం వైట్‌హౌస్‌కు చేరుతుంది. ఏ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చూసేందుకు వేలాది డేగకళ్లకు శ్వేతసౌధం నివాసం. ఒక్క మీట నొక్కితే మూడు వేల సార్లు భూమిని నాశనం చేసే అణ్వసా్తల్రను పేల్చే బ్లాక్‌ బాక్‌‌స భద్రంగా ఉన్న భవనం.
అమెరికా సంయుక్తరాషా్టల్ర అధ్యక్షుడి నివాసంతో పాటు ఆయన పరిపాలనా విభాగాలన్నీ వైట్‌హౌస్‌లోనే కొలువై ఉంటాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయమైనా ఈ భవనంలోనే రూపొందుతుంది.. ఇక్కడే అమలు జరుగుతుంది. తాను కావాలనుకుంటే యుద్ధం.. వద్దనుకుంటే శాంతి.. వార్‌కైనా, పీస్‌ కైనా ఇక్కడే నాంది పలుకుతుంది.. ఇక్కడి నుంచే ఆపరేషన్‌ స్టార్‌‌ట అవుతుంది..
అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకునే నియంతృత్వ అమెరికాకు శ్వేతసౌధం కేంద్రకం. ఇందులో ఎవరికీ ఆక్షేపణ లేదు.. అభ్యంతరం అంతకంటే లేదు.. మరి ఎక్కడో భారత్‌లో ఓ మూలన హైదరాబాద్‌లో ఉన్న కోఠీ రెసిడెన్సీకి, వైట్‌హౌస్‌కి ఉన్న సంబంధం ఏమిటి? రెసిడెన్సీ వైట్‌హౌస్‌గా ఎలా మారిపోయింది? ఎవరు మార్చాల్సి వచ్చింది. వైట్‌హౌస్‌ను అలియాస్‌ రెసిడెన్సీగా ఎందుకు పిలవాలి? వాట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌?

2
అంతా అయోమయంగా ఉందని అనుకోకండి.. ఇందులో విశేషమే ఉంది. మన కోఠీ రెసిడెన్సీని, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను ఒక్కసారి నిశితంగా గమనించండి.. పరిశీలించండి.. అణువణువూ పరికించండి.. మర్మం ఏమిటో మీకే తెలుస్తుంది. కోఠీ రెసిడెన్సీకి, వైట్‌హౌస్‌కి అణువంతైనా తేడా లేదని.. అచ్చంగా మన రెసిడెన్సీకి కవల పిల్లలా ఉందని మీకే అర్థమవుతుంది.              
మనలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది.. భారతీయులందరిలోనూ ఉన్న లక్షణమే అది.. ఏమంటే.. మనకు ఎలాంటి తెలివీ లేదని.. ఎవడో బయటివాడు వచ్చి మనకు నేర్పితే కొని తెచ్చుకున్న కొంచెపు తెలివే తప్ప.. మనకంటూ సహజంగా ఉన్నది సున్నాయేనని ఓ గట్టి నమ్మకం. అమెరికా వోడు ఆరోగ్యానికి పెరుగన్నం తినమంటే ఆహా, ఓహో అంటూ తినేస్తాం... వైట్‌హౌస్‌ నుంచి కూచోమని ఆదేశమొస్తే కూచుంటాం.. నిలుచోమంటే నిలుచుంటాం.. మన మంచి మనకంటే వాడికే ఎక్కువ తెలుసని మనమే దబాయించి వాదిస్తాం మరి..
కానీ, ఇదిగో ఒక్కసారి ఆలోచించండి.. మన వారికి ఉన్న తెలివేంటో తెలుసుకోండి.. మన వారిని మనం వదిలేసుకున్నాం.. కానీ, అదే అమెరికావోడు తెలివిగా పట్టేసుకున్నాడు.. మనకున్న నైపుణ్యాన్ని వాళు్ల నిస్సిగ్గుగా తమ దగ్గరకు తీసుకెళ్లిపోయారు.. అందుకు ఉదాహరణే హైదరాబాద్‌ కోఠీలోని ఒకప్పటి బ్రిటిష్‌ రెసిడెన్సీ.. ఇప్పటి వుమెన్‌‌స కాలేజి. జస్‌‌ట లుక్‌ ఇన్‌టు ఇట్‌..
కోఠీ రెసిడెన్సీ, వైట్‌హౌస్‌ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటాయి.. ఉన్నాయి. ముఖద్వారం నుంచి, వెనుక ఉన్న ఫౌంటెన్‌ దాకా, స్తంభాల దగ్గరి నుంచి వాటిపై ఏర్పరిచిన అలంకారాల దాకా కోఠీ రెసిడెన్సీకి ఓ కార్బన్‌ కాపీలా వైట్‌హౌస్‌ ఉంటుంది.
కొద్దిగా కూడా తేడా కనిపించదు.. ఒకే ముఖం.. ఒకే ఎత్తు.. ఒకే శిల్పం.. ఒకే నిర్మాణ రీతి.. చూస్తుంటే ఒంట్లో ఒక రకమైన కదలిక వచ్చేస్తుంది.. ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి.. ఇది ఎలా సాధ్యపడింది? కోఠీలో బ్రిటిష్‌ వారి రెసిడెన్సీ ఆర్కిటెక్చర్‌ను వైట్‌హౌస్‌ అనుకరించిందా? వైట్‌హౌస్‌ ఆర్కిటెక్చర్‌ను నాటి నిజాం అనుకరించాడా?
అవును.. మీ అనుమానం నిజమే.. మన నైపుణ్యాన్నే వైట్‌హౌస్‌ నిర్మాతలు తేలిగ్గా కొట్టేశారు.. హాలీవుడ్‌ సినిమాల్లో సీన్లను కాపీ కొట్టి తెలుగు సినిమాల్లో యథాతథంగా వాడుకున్నట్లే.. మన రెసిడెన్సీ నిర్మాణశైలిని ఉన్నది ఉన్నట్లుగా అగ్రరాజ్యం కాపీ కొట్టింది..
3
ఎక్కడి వైట్‌ హౌస్‌.. ఎక్కడి కోఠీ రెసిడెన్సీ.. రెండూ ఒకే లాగా ఎలా నిర్మించారు.. రెండింటి ఆర్కిటెక్‌‌ట ఒక్కరేనా? లేక ఒకదాని నమూనాతో మరొకటి నిర్మించారా? ఇన్నాళూ్ల బయటి ప్రపంచానికి తెలియని ఓ పెద్ద మిస్టరీ.. రెండూ ఒకే రీతిలో నిర్మాణం జరగడానికి వెనుక కారకులెవరైనా ఉన్నారా?
వైట్‌ హౌస్‌.. కోఠీ రెసిడెన్సీ.. ఒకటి అగ్రరాజ్యం అధినేత నివాసం.. మరొకటి ఒకనాటి బ్రిటిషర్లు, నిజాం నవాబు వైభవానికి నిదర్శనం.. ఒకటి తూర్పు.. మరొకటి పడమర.. రెండూ ఒకేలాగా ఉండటం ఎలా సాధ్యపడింది? ఒకటి కాదు.. రెండు కాదు.. రెంటికీ బోలెడు పోలికలు ఉన్నాయి...
రెండింటినీ దక్షిణాభిముఖంగానే నిర్మించారు.

రెండింటి ఫ్రంటల్‌ వూ్య ఒకే విధంగా ఉంటుంది.

రెండింటికీ సెమీ సర్కిల్‌ పోర్టికో ఉంది.

ఈ పోర్టికోలో నిలుచునే అమెరికా అధ్యక్షుడు ప్రసంగం చేసే సంప్రదాయం ఉంది. బ్రిటిష్‌ రెసిడెన్సీలోనూ గవర్నర్‌ జనరల్‌ ఇదే పోర్టికోలో నిలుచుని ప్రజలను అడ్రస్‌ చేసేవారు.

సెమిసర్కిల్‌ పోర్టికోలో ఉన్న స్తంభాలు రెండింటిలోనూ ఒకే ఎత్తులో ఉంటాయి

రెండింటి పునాది ఒకే ఎత్తులో ఉంది.

రెండింటికీ సెల్లార్‌లో నిర్మాణం జరిగింది.

వైట్‌ హౌస్‌లో మొత్తం సెల్లార్‌ నుంచి పై వరకు మొత్తం ఆరు అంతస్థులు ఉంటే, కోఠీ రెసిడెన్సీలో  సెల్లార్‌, గ్రౌండ్‌, ఫస్‌‌ట ఫ్లోర్లు ఉన్నాయి.

బయటినుంచి చూస్తే రెండు భవనాలు ఒకే విధంగా కనిపిస్తాయి.

భవనాలకు ఉత్తరాభిముఖంలో కనిపించే ట్రయాంగిల్‌  పోర్టికో కూడా ఒకే విధంగా ఉంటుంది.

స్తంభాల అంచుల్లో డిజైనింగ్‌ అచ్చుగుద్దినట్లే ఉంటుంది.

లోపల తలుపులపై వెంటిలేటర్ల నిర్మాణం కానీ, రూఫ్‌ డిజైనింగ్‌లో కూడా తేడా ఇసుమంతైనా కనిపించదు..

సీలింగ్‌, పిల్లర్లు మాత్రమే కాదు.. లోపల దర్బార్‌ హాల్‌ నిర్మాణం కూడా రెండింటిలోనూ ఒకే రకంగా కనిపిస్తుంది.

భవనం లోపలి భాగంలో పిల్లర్ల ఏర్పాటులో కూడా ఏక రూపత కనిపిస్తుంది. ఒక పిల్లర్‌ దాని తరువాత రెండు పిల్లర్లు ఆ తరువాత ఒక పిల్లర్లను ఏర్పాటు చేయటం రెట్టింపు ఎత్తులో ఉన్న సీలింగ్‌కు భద్రత కల్పించటం కోసం ఈ రకమైన స్తంభాల ఏర్పాటు చేశారు.
రెండు భవనాల్లోనూ ఉత్తరం వైపు పెద్ద గార్డెన్‌ ఉంది.. ఈ రెండు తోటల్లోనూ వలయాకారంలో ఉన్న ఫౌంటెన్‌లను చూడవచ్చు.
వైట్‌హౌస్‌లో మెట్లు బయటి నుంచి ఉంటే, కోఠీ రెసిడెన్సీలో మెట్లు లోపలి నుంచి కనిపిస్తాయి. రెయిలింగ్‌ డిజైనింగ్‌ ఒకే రకంగా ఉంటుంది.
రెండు భవనాలకు రెండువైపులా అదనపు నిర్మాణాలు జరిగాయి.
కిటికీల డిజైనింగ్‌ కానీ, బాల్కనీ అంచులపై ఉన్న డిజైనింగ్‌ కానీ రెండింటిలోనూ ఒకేరకంగా ఉంటుంది.
4
వైట్‌హౌస్‌, కోఠీ రెసిడెన్సీలు రెంటిలోనూ ఇన్ని కామన్‌ ఎలిమెంట్లు ఎలా సాధ్యమైందన్నది ఇప్పటివరకూ అంతుపట్టని విషయం.. కోఠీ రెసిడెన్సీని చూసి వైట్‌హౌస్‌ను నిర్మించారా? లేక సొంత డిజైనింగేనా? సొంతంగా అగ్రరాజ్యం డిజైన్‌ చేయించినట్లయితే ఇన్ని సిమిలారిటీస్‌ కనిపించటం అసాధ్యమైన పని. కానీ, ఎలా సాధ్యపడింది?
వైట్‌హౌస్‌ను మొట్టమొదట నిర్మించింది 1792లో.. అమెరికా అప్పటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ ఈ భవంతికి రూపకర్త.. ఐరిష్‌కు చెందిన జేమ్‌‌స హోబన్‌ ఈ భవనానికి డిజైన్‌ చేశాడు.. జాన్‌ ఆడమ్‌‌స అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు అందరు ప్రెసిడెంట్లకూ ఇది అధికార నివాసంగా ఉంటూ వచ్చింది. 1792లో ఈ బిల్డింగ్‌ను నిర్మించినప్పుడు ఆక్వా సాండ్‌ స్టోన్‌ వాడారు.. అప్పుడు దీన్ని వైట్‌ హౌస్‌ అని పిలవలేదు. ఎగ్గిక్యూటివ్‌ మాన్హన్‌ అని, మరి కొన్ని పేర్లతో దీన్ని పిలిచారు. 1801లో థామస్‌ జెఫర్‌సన్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక దీని బయటి వైపు విస్తరించాడు.
1814లో బ్రిటిష్‌ ఆర్మీతో యుద్ధం జరిగిన సమయంలో ఈ భవంతి పూర్తిగా కాలిపోయింది. బ్రిటిష్‌ సైన్యం పూర్తిగా దీన్ని ధ్వంసం చేసింది.  ఆ తరువాత దీన్ని మళ్లీ నిర్మించారు.. పాత డిజైన్‌లోనే మళ్లీ నిర్మించినా, ఇంటీరియర్‌, ఎక్సీ్టరియర్‌ డిజైనింగ్‌లో మార్పు వచ్చింది. 1829 నాటికి సౌత్‌ పోర్టికో వచ్చేసింది. తూర్పు, పడమరల వైపు విస్తరణ జరిగింది. ఈ ఆల్టరేషన్‌‌స 1948 దాకా జరుగుతూనే వచ్చాయి.  అధ్యక్షుడు మారుతున్న కొద్దీ ఒక్కో మార్పు జరుగుతూ వచ్చింది. 1948 నాటికి కానీ, ఇవాళ మనం చూస్తున్న వైట్‌హౌస్‌ ఒక రూపానికి రాలేదు..

శాండ్‌స్టోన్‌ బిల్డింగ్‌కు 1829లో పునర్నిర్మాణం జరిగిన తరువాత వైట్‌పెయింట్‌ వేశారు. అప్పటి నుంచీ దీన్ని వైట్‌హౌస్‌గా పిలవటం ప్రారంభించారు.
ఇక కోఠీ రెసిడెన్సీ విషయానికి వస్తే, 1798లో హైదరాబాద్‌ కోఠీలో నిర్మించారు. ఇప్పటి వరకూ అందరికీ తెలిసినట్లుగా బ్రిటిష్‌ రెసిడెంట్‌ గవర్నర్‌ జేమ్‌‌స కిర్‌‌కపాట్రిక్‌ తన భార్య ఖైరున్నీసా కోసం నిర్మించారన్నది పచ్చి అబద్ధం.. నిజాం రాజు బ్రిటిష్‌ వాళ్ల దగ్గర తన ప్రాపకాన్ని పెంచుకునేందుకు, వారి నుంచి తన అధికారానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు తానే భూమిని సమకూర్చి, తన నిధులతో, తన మనుషులతో  అద్భుతమైన రెసిడెన్సీని నిర్మించి ఇచ్చాడు. దీన్ని ఆ తరువాత బ్రిటిష్‌ రెసిడెన్సీగా పిలిచారు.
నిజానికి వైట్‌హౌస్‌ కోఠీ రెసిడెన్సీ కంటే  ముందే నిర్మించారు. కానీ, మొదట నిర్మించినప్పుడు వైట్‌హౌస్‌ డిజైన్‌ వేరు.. దాని నిర్మాణంలోని తీరు వేరు. 1814లో అది పూర్తిగా తగలబడిపోయిన తరువాత దాని డిజైన్‌ మారిపోయింది. మార్పులు, చేర్పులతో పూర్తిగా కోఠీ రెసిడెన్సీకి కవలగా రూపు మార్చుకుంది.

రెండు నిర్మాణాలకు ఎందుకింత సారూప్యం ఉందంటే అందుకు రీజన్‌ లేకపోలేదు.. మన నిర్మాణ రీతులను అప్పటికే ఐరోపా దేశాలు అనుకరిస్తూ వస్తున్నాయి. చాలా దేశాల్లో ప్రెసిడెన్షియల్‌ భవనాలు కానీ, ఇతర పెద్ద భవనాలు కానీ, భారతీయ నిర్మాణాన్ని పోలి ఉండటం గమనించవచ్చు. బ్రిటిష్‌ రెసిడెన్సీ దగ్గరకు వచ్చేసరికి దీని డిజైనింగ్‌ లండన్‌లో జరిగింది. విచిత్రమేమంటే, ఇక్కడి నిర్మాణశైలిని వంటబట్టించుకున్న తెల్లవాడు, అదే డిజైనింగ్‌ను మళ్లీ నిజాంకు ఇచ్చాడు. అదే శైలిలో రెసిడెన్సీ కట్టారు..

ఇదే సమయంలో వైట్‌హౌస్‌ నిర్మాణానికీ ఐరోపాకు చెందిన డిజైనరే, అంటే ఐరిష్‌ ఆర్కిటెక్‌‌ట హోబన్‌ ప్లాన్‌ వేశారు. దీని రూపురేఖలను మార్చిన థామస్‌ జెఫర్‌సన్‌ అంతకు ముందు ఫ్రాన్‌‌స మినిస్టర్‌గా పనిచేశారు కూడా.. అందుకే వారిపై భారతీయ నిర్మాణాల ప్రభావం ఎక్కువగా పడింది. వైట్‌హౌస్‌ ఆ ప్రభావానికి లోనైన నిర్మాణమే. అచ్చంగా మన రెసిడెన్సీకి కాపీయే. కాకపోతే మన రెసిడెన్సీ ఇవాళ ఓ మహిళా కళాశాలగా మాత్రమే అందరికీ తెలుసు.. సర్కార్లు కళు్ల తెరిస్తే, దాని గొప్పతనం జనం ముందుకు వస్తుంది.

కామెంట్‌లు లేవు: