12, నవంబర్ 2014, బుధవారం

దేవరహస్యం తొలి కాపీ

పుస్తకం రాయడం ఒక ఎత్తు. ప్రచురణ కావడం ఒక ఎత్తు. అచ్చయిన తొలి పుస్తకాన్ని కౌగిట్లోకి తీసుకోవడం.. రచయితకు అతి అందమైన అనుభవం. తొలి కాపీని అదే సందర్భంలో.. అదే ఆనంద క్షణాల్లో.. రచయిత చేతుల మీదుగా పాఠకులు అందుకోవడం మరింత అరుదైన దృశ్యం. ఈ ఆనందమయ క్షణాలన్నీ.. నా కంటిముందు చకచకా జరిగిపోవడం.. నాకు కలిగిన యోగం.
తొలికాపీ అందుకోవడంకోసం శంషాబాద్ నుంచి రెక్కలు కట్టుకొని వచ్చిన అను చిరు గారికి, ఆ అరుదైన క్షణం నాదేనన్నట్టు నారపల్లినుంచి విచ్చేసిన Kovela Santoshkumar గారికి.. మరీ మరీ ధన్యవాదాలు.
—వాసిరెడ్డి వేణుగోపాల్ - వాసిరెడ్డి ప్రచురణలు
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి