ఎన్నికల రుతువు ప్రవేశించడంతోనే, తనతో పాటు ఓటు బ్యాంకు రాజకీయాలను, కుల మత సమీకరణాలను వెంటబెట్టుకువస్తుంది. జమాఖర్చుల గురించి చర్చ పెడుతుంది. ఈ లెక్కల సమీకరణాలను బట్టే రాజకీయ పార్టీలు గెలుపోటముల లెక్కలు వేసుకుంటాయి. పొత్తులు పెట్టుకుంటాయి. కుల, మత వర్గాలను దువ్వుతుంటాయి. అభ్యర్థులను ఎంచుకొంటాయి. వూ్యహరచన చేసుకుంటాయి. అయితే ఇంతకు ముందు 14 సార్లు జరిగిన ఎన్నికలకూ ఈసారికీ చాలా తేడా ఉంది. గతంలో కూడా ఎన్ని లెక్కలు వేసుకున్నా పైకి మాత్రం హుందాగా నైతిక విలువల గురించి మాట్లాడే వారు. ప్రచారంలో సెక్యులరిజాన్ని ప్రస్తుతించేవారు. ఈ ఎన్నికల్లో మాత్రం అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా కులాలు, మతాల వారిగా ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రధానంగా అందరి దృష్టీ మెజార్టీ ఓటు బ్యాంకును వదిలి పెట్టి మైనారిటీ ఓట్లపైనే పడింది. మైనార్టీ ఓటరు దేవుళ్ల అనుగ్రహం కోసం అన్ని పార్టీలూ వెంపరా్లడుతున్నాయి.
దేశంలోని మొత్తం ఓటర్లలో పదిహేను శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. మరో అయిదు శాతం క్రైస్తవ ఓట్లు ఉంటాయి. దళితులు, ఇతర వెనుకబడిన వరా్గల ఓట్లు దాదాపు ముపై ్ఫ శాతం ఉన్నాయి. అన్ని పార్టీలూ, అధినాయకులూ సామూహికంగా ఏ వర్గం నుంచి ఓట్లు పడతాయో అంచనా వేసుకుని ఆ వర్గ నాయకులతో మంతనాలు జరుపుతుంటారు. తాయిలాలు ప్రకటిస్తారు. ఈ విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. కాంగ్రెస్, బిజెపి, లెఫ్‌ట, ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మైనారిటీ అనుకూల వైఖరితోనే ప్రచారం చేసే పరిస్థితి. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి అద్వానీ పార్టీ కార్యవర్గ సమావేశాల్లో బిజెపి పట్ల ముస్లింలు అనుకూలంగానే ఉన్నారన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామంటూనే ముస్లింల సహకారంతోనే అది పూర్తవుతుందని ఢంకా బజాయించారు. మందిర నిర్మాణం ముస్లింలతో సామరస్య పూర్వక వాతావరణంలోనే జరుగుతుందని పదే పదే చెప్పటమూ మైనారిటీలను దువ్వటంలో భాగమే.. గత ఎన్నికల సందర్భంలో రథయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆయన ముస్లిం మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై మంచి చెడులు విచారించారు... ఇప్పుడు ప్రతి బిజెపి నేతా అదే పోకడలు పోతున్నారు. జాతీయ స్థాయిలో సీనియర్ ముస్లిం నేతలు ఆరిఫ్ మహ్మద్ ఖాన్, నజ్మా హెఫ్తుల్లా వంటి నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం వూ్యహాత్మకం. బిజెపి మైనారిటీ అనుకూల విధానంపై విశ్వహిందూ పరిషత్ వంటి అనుబంధ హిందూ సంస్థలు సైతం అడ్డు చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. బిజెపి అధికారంలోకి రావాలంటే రాజకీయాల్లో ఎత్తుగడలు తప్పవు మరి.
ఈ విషయంలో కాంగ్రెస్ కూడా ఏం తక్కువ తినలేదు. టిక్కెట్ల పంపిణీలో మైనార్టీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే వ్యవహరించింది. జార్ఖండ్‌లో శిబుసొరేన్‌ను సమర్థించడం వెనుక అక్కడి గిరిజన ఓట్లు దక్కించుకోవడానికి ప్రయత్నించింది. ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రంలో తాను గతంలో పోగొట్టుకున్న దళిత, ముస్లిం ఓట్లను తిరిగి దక్కించుకోవడానికి బిఎస్‌పి, ఎస్‌పితో పొత్తులకు ప్రయత్నించింది. అయితే తన ఓట్లు ఎక్కడ చేజారిపోతుందోనన్న భయం మాయావతిని కాంగ్రెస్‌కు దూరం చేసింది. సమాజ్‌వాది పార్టీ అందినట్లే అంది జారి పోయింది. ముందునుంచి వెనుక బడిన వరా్గల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పక్షాన ఎలాగూ ఉంది. ప్రాంతీయ పార్టీల మూలంగా తన గుప్పిటినుంచి చేజారిపోయిన ఓట్లను తిరిగి దక్కించుకోవడం ప్రస్తుతం ఆ పార్టీ ముందున్న లక్ష్యం.
రాష్ట్రాల్లో మిగతా ప్రాంతీయ పార్టీలు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే క్రైస్తవ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేసింది. కెఎ పాల్ వంటి మత ప్రవక్తలు రాజకీయాల్లోకి రావటం విపక్ష కూటమిని కొంత సంతృప్తి పరుస్తోంది. తమతో జత కట్టకపోయినా కాంగ్రెస్ ఓట్లు చీలవచ్చన్నది మహాకూటమి అభిప్రాయం. అటు ముఖ్యమంత్రి వైఎస్ సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్తూనే ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత ఎన్నికల్లో తాము వాగ్దానం చేసినట్లుగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వటానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని వైఎస్, డిఎస్ భాష్యం చెప్తున్నారు... అక్కడే వారికి ఓ చిన్న క్లాజ్ దొరికింది... అదీ న్యాయస్థానం నిర్ణయం... పార్లమెంటులో రాజ్యాంగ సవరణ.. అవి రెండూ జరగవు.. వీళు్ల అమలు చేయరు.. వాగ్దానానికి మాత్రం కట్టుబడే ఉంటారు.. ఓటు బ్యాంకును పదిలంగా కాపాడుకుంటూ ఉంటారు.
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నక్సలైట్ భార్యకు గతంలో చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో పార్టీలు పంచి పెట్టిన టిక్కెట్లన్నీ కుల సమీకరణాల ప్రాతిపదికపైనే .. ఎప్పుడైతే చిరంజీవి సామాజిక న్యాయం నినాదాన్ని రాజకీయ రంగంపైకి తీసుకువచ్చారో.. అప్పటి నుంచి అన్ని పార్టీలు కూడా ఆ నినాదాన్ని భుజాన మోయక తప్పటం లేదు. మునుపెన్నడూ లేని విధంగా అన్ని పార్టీలూ తాము కేటాయించిన టిక్కెట్లలో ఏ కులానికి ఎన్నెన్ని ఇచ్చామో విడమర్చి లెక్కలతో సహా చెప్పాల్సిన రాజకీయ అవసరం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. కేరళలో కమూ్యనిస్టు పార్టీలు పంచిచ్చిన సీట్లన్నీ కులాల ప్రాతిపదికనేనని స్పష్టం. గుజరాత్‌లో బిజెపి కాంగ్రెస్‌లు సాధు సంతులపై దృష్టి పెట్టాయి. రాజస్థాన్‌లో ప్రధానమైన జాట్ల ఓట్లను దృష్టిలో ఉంచుకునే రెండు పార్టీలూ టిక్కెట్లు పంచిపెట్టాయి. బిజెపి ఏకంగా బాలీవుడ్ స్టార్ ధర్మేంద్రనే రంగంలోకి దింపింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ఓట్లు చేజారిపోకుండా ఉండేందుకు అజిత్ జోగి వంటి వారి అవసరం కాంగ్రెస్‌కు ఎంతో ఉంది. బీహార్‌లో దళితుల ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు రాంవిలాస్ పాశా్వన్‌తో జతకట్టి లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. మాయావతి, ములాయంసింగ్, లాలూ, సొరేన్ వంటి నాయకులు, గోండ్వానా పీపుల్‌స పార్టీ వంటివవన్నీ మైనార్టీల ఓట్లపైనే ఆధారపడి మనుగడ సాగించడం వాస్తవం. అందుకే చిన్నవైనా వీటి ప్రాపకం కోసం జాతీయ పార్టీలు తాపత్రయపడటం. దేశంలో మెజార్టీ ఓటర్ల గురించి ఎవరూ బాధపడటం లేదు. ఆ ఓట్లు ఎలాగూ పార్టీల వారిగా నిర్ణయమై ఉంటాయి కాబట్టి వాటి గురించి చింతించనవసరం లేదన్నది అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా తమకు పడితే చాలు.. ఖచ్చితంగా అధికార పీఠం దక్కినట్లేనన్నది రాజకీయ పక్షాల అంచనా. ఇందువల్లే పార్టీల నోటి వెంట సెక్యులరిజం నినాదాలు. మైనార్టీలకు తాయిలాలు. బుజ్జగింపులు.. వగైరాలన్నీ.. మైనార్టీలు ఎప్పటికీ మైనార్టీలుగా ఉంటేనే ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి, ఓట్లు చీల్చడానికి, మార్చడానికి అవకాశం. వెరసి అన్ని పార్టీలకూ ప్రస్తుతం మైనారిటీ ఓటరే దేవుడు. మరి ఆ దేవుడు కరుణిస్తాడంటారా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి