4, మార్చి 2011, శుక్రవారం

నేతలు దగా చేసినా ఊరుకునే నాటి రోజులు కావివి.

Written by Manchala Srinivasa Rao 9:29am Mar 4
విడిపోవాలనే కోరికకు లక్ష కారణాలున్నై, అడుగడుగునా జరిగిన దగాకు లక్షల ఆనవాళ్లున్నై, దీనిపై వాదనలే వేస్ట్. ఇప్పుడు ఊళ్లలో చిన్న పోరడిని అడిగినా చెబుతడు దగా ఏమిటో? ఇన్నిరోజులూ తెలివిలేదు గనుకే దగాను అర్థం చేసుకోలేదు, తెలివి లేదు గనుకే ఎంటబడి తరమలేకపోయిండు... నిజంగానే ఈ ప్రజల కోరికలో డొల్లతనమే ఉంటే, నేతల స్వార్థమే దీనికి కారణమైతే, ఈ కోరికలు ఇలా సజీవంగా 60 యేళ్లు బతికి ఉంటదా?
కలిసి ఉందామనేటోడు కారణం చెప్పలేడు, ఎందుకంటే ఇంకా దోపిడీ చేస్తానూ, మనం కలిసే ఉందామంటూ నిజాన్ని చెప్పలేడు కదా.... పనికిమాలిని కబుర్లతో ఉమ్మడిగానే ఉందామని కథలు చెబుతడు! ద్రోహివి నువ్వు, మోసగాడివి నువ్వు అని తిట్టినా కలిసే ఉందామంటున్నాడంటే అర్థం ఏమిటీ? ద్రోహాన్ని అంగీకరిస్తున్నట్టే కదా...
మీరన్నట్టే తెలంగాణా వాళ్లకు తెలివి లేదు, వాళ్లు ఉన్మాదంలో ఉన్నారు, చెప్పినా అర్థమయ్యే స్థితిలో లేరు... మరింకేం ఈ వెధవలతో మీకెందుకు, వదిలేసి మీరైనా "అభివృద్ది" చెందొచ్చు కదా...? తెలివిలేని ఈ తెలంగాణా వాళ్లూ మా తెలుగువాళ్లే అని చెప్పుకుని సిగ్గుపడే ఖర్మ మీకెందుకు?
మద్రాసుతో విడిపోయే ఉద్యమం తెచ్చి దానికి వీరోచిత హోదా ఇచ్చుకుంటరు. వీడు విడిపోతానంటే వేర్పాటువాదమంటవు... వాడెవడో ఏకంగా ఇది జాతీయ సమైఖ్యతకే ముప్పు అంటడు... వాడి తెలివి మోకాళ్లలో ఉందా? రియల్ ఫెడరల్ స్పిరిట్ తెలియని "తెలివి" మీది. చిన్న రాష్ట్రాలైతే వచ్చిన ఉపద్రవం ఏమిటో ఒక్కడూ చెప్పి ఏడ్వడు. పోనీ నష్టపోయేది వీడే కదా, మీకెందుకు బాధ?
ఒక కేసీఆర్ చెప్పగానే జనం అకస్మాత్తుగా రెచ్చిపోయి వీధుల్లోకి రారు. ఎన్నాళ్లుగానో రగులుతున్న ఆగ్రహం ఎవరో పిలుపు ఇచ్చినప్పుడే బద్దలైతది. ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, అధికారులు, బుద్దిజీవులు, జర్నలిస్టులు, ప్రవాసులు... చివరకు న్యాయమూర్తులూ ఇవ్వాళ నోళ్లు విప్పుతున్నారంటే అందరూ మీ దృష్టిలో పిచ్చోళ్ళేనా? అందరూ ఉన్మాదులేనా?
కలిసి ఉండటానికి ఒక్క కారణమూ చెప్పకుండానే ఇంకా అణిచేద్దామనీ, ఇంకా వీలైనన్ని తరాలు దోపిడీ చేద్దామని చూసే తెలివి నిజంగా తెలివే... ఆ తెలివి తెలంగాణవాడికి ఎక్కడిది... వాడు తెలివిహీనుడే...
కొన్ని నిజాల్ని ఒక ప్రాంతం కోణం నుంచి గాకుండా ఇటువైపు నుంచీ చూడగలగాలి. ఒక ఈజిప్టులో ఉద్యమం ఆహా, ఇక్కడ ఉద్యమం వినాశకరమా? ఎక్కడ విముక్తి పోరాటం జరిగినా అభినందిస్తారు, మరి దీన్నెందుకు తిట్టిపోస్తరు...? ఎగుస్తున్న కోపాగ్నికి పెద్ద పెద్ద గడాఫీలే కొట్టుకుపోతున్నరు, తరాలపాటు అణిగి ఉన్నవాడే అలిగితే ఆ సునామీకి అరబ్ దేశాలే గడగడమంటున్నయ్... ఆఫ్టరాల్ ఇదెంత?
మీ చెప్పుల కింద నలిగిన నాటి తెలంగాణ కాదిది...
నేతలు దగా చేసినా ఊరుకునే నాటి రోజులు కావివి...
లక్ష మందుపాతరల విముక్తి యుద్ద క్షేత్రం ఇది...
ఎన్నేళ్లయినా ఈ కోరికలు సజీవంగనే ఉంటయ్...
ద్రోహుల కాళ్ళ కింద అవి బద్దలవుతూనే ఉంటయ్...
వాడు మావోడైనా సరే.... వాడు అవతలోడైనా సరే...!

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాసారు.
స్వార్ధానికి నీతీ న్యాయం వుండవు. అణచివేత, దోపిడీ దాని నైజం.
స్వాభిమానానికి అలుపు, మరపు వుండవు.
ప్రాణాలకు తెగించి ఎంతకాలమైనా పోరాడటం దాని స్వభావం
అంతిమ విజయం సత్యానిదే.
ఇప్పటికైనా కళ్ళు తెరచి సత్యానికి, ఒక ప్రాంత ప్రగాఢ అకాన్క్షకీ
సీమాన్ధ్రులు సహకరిస్తే మంచిది.
దివాందుల్లా మిగిలి పోయి తోటి సోదరాలు చీత్కారానికి ఇంకా గురికాకూడదు.
- కలం కుమార్

Unknown చెప్పారు...

chapter 8 meeda oka post rayandi .durmarganiki "tera"teese vallani bharinchadam kastanga undi .