రావణ కాష్టాన్ని ఆరిపోకుండా రగిల్చడం ఎట్లాగో చిదంబరంకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.. తెలంగాణాను ఎంత వివాదం చేయాలో.. ఎంత రాద్ధాంతం చేయాలో ఆయనకు చాలా బాగా తెలుసు... సీమాంధ్ర లాబీయింగ్ ఆయనపైనా, అధిష్ఠానంపైనా ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతోందో... ఆయన ప్రకటనలను చూస్తేనే అర్థమవుతుంది. ఉద్యోగులు ఎప్పట్నుంచో కోరుతున్న ౧౪ ఎఫ్‌ను తొలగించటంపై వివాదాస్పద కామెంట్లను చిదంబరం చేశారు.. తీర్మానాన్ని తొలగించటానికి రాష్ట్రపతికి రికమెండ్ చేస్తామంటూనే అందుకు రాష్ట్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేయాలని మెలిక పెట్టారు.. ౨౦౧౦ జనవరిలో అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూనే మరోసారి తీర్మానం చేయాలని సిఎంను కోరినట్లు ప్రకటించారు. ౧౪ ఎఫ్‌పై ఇప్పుడు ఏకాభిప్రాయం ఉందో లేదో తెలుసుకోవటానికే తీర్మానం చేయాలని కోరామన్నారు. సిసిపిఏనే ఈ తీర్మానం చేయాలని కోరిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ౧౪ఎఫ్‌పై తీర్మానం అన్నది సాధ్యం కాదని బుర్ర ఉన్నవాళ్లకెవరికైనా అర్థమవుతుంది.. అంటే ఎస్‌ఐ రాతపరీక్షలకు సంబంధించిన వివాదం ఇప్పట్లో సద్దుమణగదు. ఫ్రీజోన్‌గా హైదరాబాద్‌ను తొలగించాలన్న తెలంగాణా వాదుల డిమాండ్ నెరవేరదు..తెలంగాణ మరోసారి మోసపోవటానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. తెలంగాణా నాయకుల బుద్ధిమాలిన తనం.. ఐక్యత లేని డొల్లతనం.. బలంగా ఏకగళాన్ని వినిపించలేని చేతకానితనం.. టివి గొట్టాల ముందు డాంబికాలు.. లోలోపల సేఫ్ ఫేస్ అవుట్‌కు మంతనాలు జరిపే హీనాతి హీనమైన నాయకత్వం తెలంగాణాకు శాపంగా పరిణమించింది. ఈ నాయకత్వానికి తెలంగాణా తెచ్చే సత్తా లేదు.. వీళ్లు దౌర్భాగ్యులు.. నీచాతి నీచంగా సీమాంధ్ర నాయకత్వం అవహేళన చేస్తున్నా.... వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నా తుడుచుకుపోతున్న పనికిమాలిన వాళ్లు. పైకి రాజీనామాలు చేసి ఇళ్లకు ఫైళ్లు తెప్పించుకుని దొంగచాటుగా సంతకాలు చేస్తూ జీతాలు దండుకుంటున్న నికృష్ట నేతలున్న తెలంగాణాకు ఇక విముక్తి లేదు.. ఇదొక సోమాలియాలాగా తయారవుతుంది.. రానున్న కాలంలో బానిసల కంటే హీనంగా చూడబడతారు.. రోదన తప్ప వీరికి మిగిలేది లేదు.. ఉపాధి ఉండదు.. నీళ్లుండవు.. నిప్పులుండవు.. భాష లేదు.. సంస్కృతి లేదు.. అనాగరిక జాతిగా ఆఖరి శవాన్ని రాబందులు పీక్కుతినేంతదాకా ఈ ప్రాంతం రోదిస్తూ ఉండాల్సిందే.
2 కామెంట్‌లు:
@ఇదొక సోమాలియాలాగా తయారవుతుంది..రానున్న కాలంలో బానిసలకంటే హీనంగా చూడబడతారు....
మరీ అంత ఓవర్ చేయకండి. ఇలా రెచ్చగొట్టబట్టే అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆయనకి పిచ్చా దేశాం లో అందరికి పట్టిస్తుంటే!
http://www.sunday-guardian.com/analysis/friend-father-a-philosopher-of-black-money-is-chidambaram
కామెంట్‌ను పోస్ట్ చేయండి