ప్రధాన నగరాల్లో సామాన్యులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారీ దేశమంతటా తలెత్తే ప్రశ్న ఒకటే.. టెరర్రిజాన్ని అణచివేసేందుకు సమర్థమైన చట్టం అవసరం లేదా? అని... చట్టం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోతాయి. ఒకరు చట్టం అవసరం.. మరొకరికి అనవసరం.. ఇందులో ఎలాంటి లాజిక్ ఉండదు. వాళు్ల కావాలన్నారు కాబట్టి వీళు్ల వద్దంటారు. అంతకు మించి ఓట్ల లెక్కలు కీలకమవుతాయి. ఒకవేళ చట్టం అంటూ చేస్తే ప్రస్తుత కాలానికి ఇలాంటి చట్టాలు పనికిరావన్న వాదనా చేస్తారు? దీనికీ లాజిక్ ఉండదు. ప్రపంచంలో అన్ని దేశాలూ చట్టాల్ని చేసుకుంటాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాయి. అయినా మన దేశంలో మాత్రం చట్టం అంటూ చేస్తే.. అది ఏ అంశానికి సంబంధించినదైనా సరే.. ఉల్లంఘనకు అవకాశం లేకుండా రూపొందదు. ఉల్లంఘనకు గురికాని చట్టం అంటూ ఉండదు. రూపకల్పన దశలోనే రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని `జాగ్రత్తలు' తీసుకుంటారు. టెరర్రిజం విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్నది ఇవాళ్టికీ మన రాజకీయ నాయకులకు అర్థం కావటం లేదు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏర్పాటు చేస్తామంటున్నారు.. నాలుగు దిక్కులా జాతీయ భద్రతా గార్డుల బలగాలను మోహరిస్తామంటున్నారు. కానీ చట్టం ప్రస్తావన మాత్రం చేయటం లేదు. చట్టం అంటూ ఒకటి ఉంటే కదా.. విచారణ సంస్థలు ఏవైనా ముందుకు పోగలవు! కఠిన చట్టం లేకుండా ఎఫ్‌బిఐని ఏర్పాటు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇందుకు కారణం.. మరో పార్టీ చేసిన చట్టాన్ని ఈ పార్టీ రద్దు చేసింది కాబట్టి తిరిగి చట్టం చేయటం అంటే అది ప్రతిష్ఠకు భంగం కలిగినట్లే అవుతుంది కనుక.. రేపు ఆ పార్టీ వస్తే వారు ఓ చట్టాన్ని చేస్తారు... ఇంతే తప్ప ఈ దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి ఏ విధంగా రాజకీయాలకు అతీతంగా ఎలాంటి విధానం అనుసరించాలో ఏ రాజకీయ పార్టీకీ అవగాహన లేదు... అర్థమూ కాదు.. కనీసం ఆ దిశగా ఆలోచించనైనా ఆలోచించరు...ఇందుకు కారణాలు, భ్రమలు అనేకం ఉన్నాయి.
1.
మన దేశంలో ఉగ్రవాదం పట్ల ప్రభుత్వ వర్గాలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, విశ్లేషకులకు కానీ ఒక స్పష్టమైన దృష్టికోణం లేదు. ఒకరి దృష్టిలో టెరర్రిస్టు అయిన వాడు.. మరొకరి దృష్టిలో ఫ్రీడం ఫైటర్‌గా మారుతున్నాడు. పవిత్ర యుద్ధం చేస్తున్న యోధుడుగా కీర్తి పొందుతున్నాడు.. అంతే కానీ, ఉగ్రవాదంపై ఈ దేశంలో ఖచ్చితమైన నిర్వచనం అంటూ ఏమీ లేదు. మన రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ధోరణులు ఇందుకు స్పష్టమైన ఉదాహరణలు. జాతీయ ప్రయోజనాల గురించి రాజకీయ పార్టీలు ఒక్క క్షణం అయినా సమష్టిగా, ఒకటిగా ఆలోచించవు. ఆందుకు అంగీకరించవు...
కానీ, కాస్త ఆలోచించండి.. విచక్షణ లేకుండా మానవ సమూహాన్ని హననం చేస్తున్న మూకను యోధులుగా నిర్వచించటం నాగరిక సమాజంలో సాధ్యమేనా? మారణకాండ సృష్టించే లక్ష్యంతో, ఒక పథకం ప్రకారం రక్తపుటేరులను పారించేవారిని ఏమనాలి? మార్కెట్‌లలో, షాపింగ్ మాల్‌లలో బాంబులు పెట్టడం, విద్యార్థులు ఉన్న బస్సులను కిడ్నాప్ చేయటం, థియేటర్లలోకి చొరబడి కుటుంబాలకు కుటుంబాలనే అంతం చేసేవారి వారి పట్ల ఎవరైనా ఎలా వ్యవహరించాలి? చివరకు ఫిదాయూలు చొరబడి అత్యాధునిక ఆయుధాలతో మారణ కాండ చేయటం జిహాద్ అనటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. మతం పేరుతో, రాజకీయం „పేరుతో, దేవుడిపేరుతో, భయోత్పాతాన్ని సృష్టించే క్షుద్ర హవనం ఇది. ఇది ఉద్యమం కాదు.. సిద్ధాంతం అంతకన్నా కాదు.. ఇది ఒక ఉన్మాదం.. ఒక దేశం మరో దేశంపై పరోక్షంగా చేస్తున్న యుద్ధం..
2
9/11 తరువాత అమెరికాలో కానీ, ఆ మరుసటి సంవత్సరం రష్యా థియేటర్‌లో చెచెన్ ఉగ్రవాదుల దాడుల తరువాత కానీ ఆయా దేశాల్లో దాడులు జరగలేదంటే అందుకు కారణాలు వేరు. అక్కడ ఉన్నది పరిమిత వర్గాలు..., పరిమిత జాతులు..అన్నింటికీ మించి అక్కడి రాజకీయ వ్యవస్థ వేరు. అమెరికాలోనైనా, రష్యాలోనైనా అడ్డగోలుగా ప్రభుత్వాలు పడిపోవు. ఒకసారి ఎన్నికలు పూర్తయితే, మళ్లీ నాలుగేళ్ల దాకా రాజకీయ పార్టీల మధ్య అనారోగ్యకరమైన స్పర్థలు ఉండవు. అత్యున్నత అధికార పీఠం ఎక్కే అర్హత ఎవరికైనా రెండే సార్లు దక్కుతుంది. రష్యా అధ్యక్షుడుగా పుతిన్ ఎంత సమర్థంగా పని చేసినప్పటికీ, పరిమిత కాలం తరువాత అధికారం నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకోవటం అక్కడి రాజకీయ వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనం. మన దేశంలో ఉన్న పరిస్థితులు ఇందుకు భిన్నం. ఇక్కడ కొల్లల కొద్దీ పార్టీలు.. అన్నీ పుట్టగొడుగులు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎప్పుడు ఏ పార్టీ కుర్చీకిందకు నీళు్ల తెస్తాయా అన్న ఆందోళనే ప్రధాని పీఠంపై కూర్చున్నాయనను పట్టి పీడిస్తుంది. చిన్న, చితక పార్టీల గొంతెమ్మ కోర్కెలను `సంకీర్ణ ధర్మాన్ని' పాటించే పేరుతో తీర్చటంతోనే దొరవారి పుణ్యకాలం అంతా గడిచిపోతుంటే ప్రజల సమస్యలను పట్టించుకోవటం ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ అధికారం అనుభవించటానికి పరిమితి అంటూ ఉండదు. ముదిమి వయసు మీదపడుతున్నా.. మోకాలి చిప్పలు అరిగిపోయినా, కళు్ల కనిపించకున్నా, కాళు్ల సహకరించకున్నా పదవి మాత్రం భేషుగ్గా అనుభవించవచ్చు. హత్యానేరం లాంటి తీవ్రమైన నేరాభియోగాలు నమోదయి, క్రిమినల్ కేసు విచారణలను ఎదుర్కొంటున్న వాళు్ల కూడా `నేరం రుజువు కానంతవరకు దోషి కాదన్న' న్యాయ సూత్రాన్ని అనుసరించి ఎంపిలుగా ఎన్నికవుతారు. ఇలాంటి అస్తవ్యస్త రాజకీయ వ్యవస్థ నుంచి ఉగ్రవాదానికే కాదు.. మరే సమస్యకైనా పరిష్కారాన్ని ఎలా ఆశించగలం?
3
మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడి సమాజంలోని వర్గాలు అనేకం. వాటి మధ్య వ్యత్యాసం అనంతం. ఆర్థిక, హార్థిక వ్యత్యాసాలు ఇక్కడ ఉన్నన్ని మరెక్కడా కనిపించవు. ఇందులో కొన్ని వర్గాల పట్ల పాలకవర్గాలు చూపించినఉదాసీనత తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నది. ఈ అసంతృప్తిని ప్రత్యర్థి దేశ ఉగ్రవాద మూకలు సొము్మ చేసుకుంటున్నాయి. అణగారిన వర్గాల ఆర్థిక బలహీనతలను టెరర్రిస్టు, మావోయిస్టు సంస్థలు సొము్మ చేసుకుంటున్నాయనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. టెరర్రిస్టు సంస్థలను నిర్వహించేవారు విద్యావంతులైన మేధావులైతే, టెరర్ సృష్టించేవారు మాత్రం ఈ బలహీనులే. కోట్ల కొద్దీ సొము్మలు ఆశచూపి రిక్రూట్ చేసుకుంటారు. ఆ తరువాత అర్థం లేని సిద్ధాంతాలను నూరిపోసి, రెచ్చగొట్టి, మైండ్‌సెట్ మార్చి ఫిదాయూలుగా మార్చి ఉన్మాదానికి రక్తతర్పణం చేస్తున్నారు. మసూద్ అజర్ లాంటి నాయకులు సురక్షితంగానే ఉంటారు. సమిధలవుతున్నది మాత్రం మానవ బాంబులుగా మారిన యువతే. అమాయకుల ప్రాణాలను బలిగొంటూ తాము బలవుతున్నారు. తాము చేస్తున్న పని తప్పు అన్న ఆలోచన కూడా వారికి రానీయకుండా చనిపోయేదాకా పోరాడాలంటూ వాళ్ల మెదళ్లను పురుగు తొలిచినట్లు తొలిచి మనపైకి అసా్తల్రుగా వదులుతున్నారు. ఈ అణగారిన వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం కొంతైనా చిత్తశుద్ధిని పాలకులు ప్రదర్శిస్తే.. యువతను వక్రమార్గం నుంచి తప్పించవచ్చు. దాంతో పాటే ఈ మార్గంలో ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్న సంస్థల కార్యకలాపాలను నిరోధించటానికి పకడ్బందీగా ఉండే చట్టం మనకు కావాలి. అంతే కానీ, ఉత్తుత్తి మాటల చట్టాలు ఎందుకూ కొరగావు.
4.
దాడులు జరిగిన ప్రతిసారీ మీడియాలో బీభత్సమైన దృశ్యాలను ప్రదర్శిస్తారు. మానవీయ కథనాలను ప్రసారం చేస్తారు. తొలి దర్యాప్తు ఏజెన్సీలుగా మీడియాయే వ్యవహరిస్తుంది. వీటన్నిటి కంటే ముందు మీడియాలో వినిపించే ముందుమాట నిఘా వైఫల్యం. మన దేశంలో ప్రత్యేకించి చట్టాలు లేకపోవటం, నిఘా వ్యవస్థ కేంద్రీకృతం కాకపోవటం పెద్ద సమస్య. నిఘా అన్నది కేంద్ర, రాషా్టల్ర మధ్య రెండుగా పనిచేస్తోంది. ఉగ్రవాద వ్యవస్థ ఆనుపానులు కనిపెట్టే సామర్థ్యం రాషా్టల్ర వద్ద లేదు. సూక్ష్మస్థాయిలో పెద్ద ఎత్తున జరిగే రిక్రూట్‌మెంట్‌ను కనిపెట్టడం బొటాబొటి శిక్షణ కలిగిన రాష్రా్టల్ర నిఘా సిబ్బంది వల్ల కాదు. ఇందుకు ఉదాహరణ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వంద అడుగుల దూరంలో ఉన్న టాస్‌కఫోర్‌స కార్యాలయంపై 2006లో మానవబాంబు దాడి. ఏదో భావోద్వేగంతో మాట్లాడటం కాకుండా నిఘా వ్యవస్థను చక్కబెట్టడంపై పూర్తి దృష్టి సారించాలి. ఏ దేశానికైనా నిఘా వ్యవస్థే భద్రతకు, శాంతికి పునాది. ఇది గట్టిగా లేనప్పుడు మరేమీ చేయలేం. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాషా్టల్రు నిరంతరంగా నిఘా ఉంచే విధంగా అన్ని అధికారాలను ఇస్తూ ఒక నిఘా సంస్థను నెలకొల్పటం, దానికి పూర్తి స్వతంత్రత కల్పించటం అవసరం. ఇందుకోసం ఒక చట్టం అవసరం. గుజరాత్ లాంటి రాషా్టల్రు ఏదైనా తీవ్రవాద నిరోధక చట్టాల్ని చేసుకుంటే, అది మోడీ లాంటి వాడు చేశాడు కాబట్టి గుడ్డిగా తొక్కిపెట్టటం సమర్థనీయం కాదు.. అది కాదనుకుంటే మరో మార్గం చూపించటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మనం చేయం.. మరొకరిని చేయనివ్వం అనే ధోరణి భారీ మూల్యానికి దారి తీస్తుంది. జాతీయ స్థాయిలో పటిష్ఠమైన నిఘా వ్యవస్థ.. అందుకు తగిన చట్టం లోప రహితంగా ఉండటం తప్పనిసరి.
5.
టెరర్ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అందుకు పాల్పడిన సంస్థలను గుర్తించటం గొప్పతనం కాదు. దాడులు చేసిన టెరర్రిస్టులను ఎన్‌కౌంటర్ చేయటంతోనే విజయం సాధించినట్లు కాదు.. వారి మూలాలను కూకటి వేళ్లతో సహా పీకినప్పుడే అది నిజమైన విజయం అవుతుంది.
సమర్థమైన చట్టాలు అంటూ ఉండాలనేది ఇందుకోసమే. టెరర్ ఆపరేషన్‌లో పాల్గొనే కిందిస్థాయి వారిపై చర్యలు తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవచ్చు. కానీ, వాళ్లను ప్రేరేపించిన వారి బాస్‌లను ఏరివేయటం కోసం చట్టాలు కావాలి. వారికి నిధులు సమీకరించి ఇస్తున్న సంస్థలను తునుమాడటం కోసం చట్టాలు కావాలి. కూటనీతి రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదులను సమర్థిస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసి, వాటి నేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు కావాలి.
6.
1985లో టెరర్రిస్‌ట్స అండ్ డిస్రప్టివ్‌స ఆక్టివిటీస్ ఆక్‌ట (టాడా) చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి 1987లో సవరణ కూడా జరిగింది. ఈ చట్టాన్ని 1995లో అంటే ముంబయిలో తొలి సారి వరుస పేలుళు్ల జరిగిన రెండేళ్లకు రద్దు చేశారు. ఆ తరువాత 2001లో ప్రివెన్షన్ ఆఫ్ టెరర్రిజం ఆర్డినెన్‌స(పోటో)ను తీసుకువచ్చారు. దీన్నే 2002 మార్చిలో ప్రివెన్షన్ ఆఫ్ టెరర్రిజం ఆక్‌ట(పోటా)గా పార్లమెంటు ఆమోదించింది. ఈ రెండు చట్టాలు కూడా వివిధ అమలు దశల్లో మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఇందుకు సంబంధించి పుష్కలమైన ఆధారాలూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా ఈ చట్టాలు కాలరాచాయి. సంక్షిప్తంగా చెప్పుకుంటే ఈ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని 180 రోజుల పాటు ఎలాంటి నేరాభియోగాలు నమోదు చేయకుండా నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టాల్లో టెరర్రిజం అన్న పదం నిర్వచనంలో అన్ని నేరాలూ కలిసిపోయాయి. చాలా విస్తృత పరిధిలో దీన్ని నిర్వచించారు. సాధారణ పీనల్ కోడ్‌లోని హత్య, దొంగతనం వంటి నేరాలు కూడా ఇందులో మిళితమయ్యాయి. ఈ చట్టాల కింద రాషా్టల్రకు అపరిమిత అధికారాలు లభించాయి. ఇంకేముంది, రాజకీయ కక్ష సాధింపు కోసం పలు రాషా్టల్రు ఈ చట్టాల్ని దారుణంగా దుర్వినియోగం చేశాయి. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వంటివి వీటిలో కొన్ని. ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరులో ఈ చట్టాల్ని అడ్డగోలుగా వాడాయి కాబట్టే తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చివరకు రద్దు అయ్యాయి.
మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్న పేరుతో చట్టాల్ని రద్దు చేస్తే సమస్య పరిష్కారమైందా? కాలేదు. పకడ్బందీగా, ఎలాంటి లొసుగులకు తావు లేకుండా చట్టాల్ని చేసే సామర్థ్యం ప్రభుత్వాలకు లేదా? అంటే అవుననే చెప్పాలి. దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా, పక్షపాతానికి తావు లేకుండా చట్టాన్ని రూపొందించటం తప్పదు. ఎప్పుడో 1935లో బ్రిటిష్‌వాడు చేసిన పాచి పట్టిన పోలీసు చట్టాన్నే ఇవాళ్టికీ మనం అనుసరిస్తున్నాం. వాడి చట్టాల్ని, వాడి సంస్కృతిని, వాడి నాగరికతను యథాతథంగా అనుకరించి, అనుసరించేటట్లయితే, స్వాతంత్య్రోద్యమం చేసిందెందుకో అర్థం కాదు. స్వతంత్రం రాకముందు ఎలా ఉందో.. వచ్చిన తరువాత కూడా అలాగే ఉంది.
ముంబయిలో దాడుల తరువాత దేశ ప్రజలు తీవ్రస్థాయిలో ప్రతిస్పందించటంతో ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. ఇంతకాలం వేచి చూద్దాం అన్న విధానం సమాజాన్ని భయం గుప్పిట్లోకి నెట్టి వేసింది. ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు అవుతున్నది. కానీ, దీనికి ఉండే పరిధి ఏమిటి? పరిమితి ఏమిటి? అధికారం ఏమిటి? బాధ్యత ఏమిటన్న విషయాలపై ప్రభుత్వం నిక్కచ్చిగా మార్గదర్శకాలు జారీ చేయటం అవసరం.
* రూల్ ఆఫ్ లా పరిధిలోనే ఒక శక్తిమంతమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాలి.
* ఈ ఎఫ్‌బిఐ కూడా దీని పరిధిలోనే ఉండాలి. ఉగ్రవాద సంస్థలను, వాటికి నిధులు అందించే సంస్థలను క్రమంగా నిర్వీర్యం చేసే విధంగా ఈ చట్టం రూపకల్పన జరగాలి.
* టెరర్రిస్టు సంస్థల్లో కేడర్ నియామకాలను ఇది నిరోధించగలగాలి.
* నిధుల సమీకరణను ఆపగలగాలి.
* నాయకులు, సభ్యులు, సానుభూతి పరులపై నిరంతరం నిఘా ఉంచేందుకు ఈ చట్టం వీలు కల్పించాలి.
* పక్షపాతం లేకుండా, మినహాయింపులు, రాయితీలు లేకుండా అన్ని వర్గాల, మతాల, జాతుల ప్రజల పట్ల ఒకే విధంగా వ్యవహరించేలా చట్టం ఉండాలి. అందరికీ సమన్యాయం అన్న సూత్రాన్ని అక్షరాలా పాటించాలి.
* విమానాశ్రయాలు, హోటళు్ల, షాపింగ్ మాల్‌లు, మార్కెట్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలి. ప్రైవేటు మాల్‌లకు భద్రత ఏర్పాట్లు నెలకొల్పుకునేలా ఈ చట్టం పరిధిలోనే ఆదేశాలు జారీ చేయాలి. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* తమ తమ రాషా్టల్ల్రో సంఘ విద్రోహ శక్తులను నిర్వీర్యం చేయటం స్థానిక ప్రభుత్వాల బాధ్యత. ఇలాంటి విషయాల్లో అలసత్వానికి తావు లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలి.
* సాధారణ క్రిమినల్ నేరాలకు, దేశద్రోహంతో సమానమైన టెరర్రిజంకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్పష్టంగా నిర్వచించాలి.
* సాక్షుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు కల్పించాలి.
* అన్నింటికంటే మించి ఈ చట్టం అమలు జాతీయ స్థాయిలో ఒకే విధంగా, ఒకే పద్ధతిలో అమలు కావాలి.
* చట్టం అమలుపై జాతీయ స్థాయిలో పర్యవేక్షణ అవసరం. ఇది కేంద్రీకృతమై ఉండాలి.
* ఈ చట్టం పరిధిలో ఏర్పాటు చేసే స్పెషల్ ఏజెన్సీలకు పూర్తి అధికారాలు, నిధుల కేటాయింపు సమృద్ధిగా ఉండాలి.
ఇంత ఖచ్చితంగా చట్టాన్ని రూపొందించి అమలు చేస్తేనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం పడుతుంది. లేకపోతే.. ముంబయి తాజ్‌పై ఫిదాయూల దాడి అనంతరం అప్పటి ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్ పాటిల్ అన్నట్లు `బడే బడే షహరోంమే.. ఐసా ఛోటీ ఛోటీ చీజెస్ హోతే రహతీహై' అనుకుంటూ ఉండాలి.
2 కామెంట్‌లు:
కావాల్సింది కొత్త చట్టాలుకాదు ఉన్నచట్టాల్ని బేషరతుగా అమలు జరిపే వ్యవస్థ.
nelo avesham challa unnadi annya
కామెంట్‌ను పోస్ట్ చేయండి