శ్రీ తాడేపల్లి లలితా సృబ్రహ్మణ్యం గారు...
నమస్కారం..
మీరు తాజాగా చేసిన వ్యాఖ్య మరోసారి ఆలోచించేదిగా ఉంది. ధన్యవాదములు.. తెలంగాణా కోసం జరుగుతున్న చర్చలో మీరు మేధావి.. నిజమే.. మీ లాంటి వారు ఈ చర్చాకార్యక్రమంలో పాల్గొనటం చాలా అవసరమే.. తెలంగాణా రాకపోవటం ఎందుకు మంచిదో మీరు ముందు నుంచీ వివరిస్తున్నారు.. వీళ్లకే అర్థం కావటం లేదు.. మీరు ప్రస్తావించిన అంశాలనే నేనూ చర్చించదలచుకున్నాను.. అంశాల ప్రాతిపదికన ఒక్కొక్కటే మాట్లాడుకుందాం..వీలైతే.. టైమ్ ఉంటే.. అంశాల వారిగా విడివిడిగా..డొంకతిరుగుడు లేకుండా సూటిగా చర్చించండి..
తెలంగాణా గురించి కాసింత మంచి మాట్లాడే వారందరికీ తలపొగరని మీరు భావిస్తున్నారు.. సంతోషం.. ఇక్కడ మేధావి తనానికి అవకాశం లేదనీ మీరన్నారు. కానీ, మీరు మాట్లాడుతుంటే తెలంగాణా వాదులనుకునే మేతావులంతా వింటున్నారు.. తెలంగాణా భావోద్వేగాలను పనికిమాలినవిగా కొట్టిపారేశారు ధన్యవాదములు.. తెలంగాణా గురించి మాట్లాడే వాళ్లంతా మెదడు లేకుండా.. మాట్లాడుతున్నారనీ ఎద్దేవా చేశారు.. సంతోషం.. మేధావితనం అంటే ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా తాము మాట్లాడేది మాత్రమే సరైనది.. ఇదే కరెక్టని.. దీన్నే ఎదుటివాళ్లు ఇష్టం ఉన్నా..లేకున్నా అంగీకరించాలని భావించటమో.. ఏమో.. చిన్నవాణ్ణి నాకైతే తెలియదు.. నేను మేధావిని కాను.. మీరు చెప్తే తెలుసుకుంటా..
తెలంగాణా రాష్ట్రం ఎందుకు రాకూడదో.. మీరు తొలి కామెంటులో కొన్ని కారణాలు చెప్పారు.. వాటిని గురించి ప్రస్తావించాలి.. తెలంగాణాలో బాగుపడాలంటే ఇక్కడ పని సంస్కృతి మెరుగుపడాలని మీరే చెప్పారు.. మీకు అవగాహన ఎంత వరకు ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇక్కడ ఏసి రూముల్లో కూర్చుని.. ఏసి కార్లలో తిరిగే అలవాటు కానీ, స్థోమత కానీ ఎవరికీ తెలియదు.. ఇక్కడ పని చేస్తేనే గుక్కెడు నీళ్లు.. పిడికెడు కూడు దొరుకుతుంది. (కూడు అన్నది అచ్చమైన తెలుగు పదం.. అన్నం అన్నది సంస్కృతం..) పని చేయటం మాత్రమే ఇక్కడి వాళ్లకు తెలిసిన ఒకే ఒక విద్య.. గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు.. శాతవాహనుల కాలం నుంచి వాళ్లు చేస్తున్నది పనే.. వాళ్లు పని చేయటం వల్లనే ఇక్కడి నుంచి అద్భుతమైన నిర్మాణాలు వెలుగుచూశాయి. దాదాపు 280 కోటలు.. బురుజులు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత నిజాం కాలంలోనూ వాళ్లే పని చేశారు.. ఇప్పుడు దురదృష్టవశాత్తూ తోటి తెలుగువాళ్లమని చెప్పుకునే వారి కాలంలోనూ వాళ్లే పని చేస్తున్నారు.. గతంలో సర్దార్ పాపారాయుడు అని ఎన్టీరామారావుగారు ఒక సినిమా తీశారు 1984లో.. అందులో ఓ కేరెక్టర్ చెప్తుంది.. ‘‘ మా వంటవాడు భారతీయుడు.. మా తోట వాడు భారతీయుడు.. మా పని వాడు భారతీయుడు..’’ అని అంటూనే.. భారతీయులంతా నా సోదరులని చెప్తాడు.. ఇప్పుడు ఉన్నది అచ్చంగా అదే పరిస్థితి..
ఇక రెండవది.. ఇక్కడ అక్షరాస్యత మెరుగుపడటం.. 1956కు ముందు నిజాం కాలంలో ఉన్న చదువు సంధ్యలకు ఇప్పటికి ఉన్న తేడా మీకు తెలియకపోవచ్చు..నిజాం కాలంలో చదువుకుని మేధావులైన మహాపురుషులెందరో అటు నిజాం రాజ్యాన్ని వైభవోపేతం చేశారన్న సంగతి మీకు తెలుసనే అనుకుంటున్నా..వలస వచ్చిన ముస్లిం అధికారులు అధికారాన్ని చెలాయించారే తప్ప.. ఇక్కడ రాజ్యాన్ని సుశ్యామలం చేసి దేశంలోనే సంపన్నతను సాధించి పెట్టిన వాళ్లు తెలంగాణా ప్రజలే. ఇక్కడి వ్యవసాయం.. ఇక్కడి నిర్మాణ నైపుణ్యం.. ఇక్కడి విద్యావైభవంతో నిర్వహించిన పత్రికలు..సెంట్రలైజ్‌డ్ ఏసి వంటి టెక్నాలజీ.. మద్రాసు కంటే ముందు ఇక్కడ జరిగిన విద్యుదుత్పత్తి.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి ఇక్కడ ఉండింది.. కాకపోతే దాన్ని మీరు కప్పిపుచ్చుతున్నారు.. (వాస్తవానికి ఈ వనరుల కోసమే..ఆంధ్ర తెలంగాణాను బలవంతంగా కలుపుకుంది). చదువులో వెనుకబడటానికి కారణం 1956 మెర్జ్ మాత్రమే.. 1956 మెర్జ్ తరువాత ఇక్కడ డెలిబరేట్‌గా విద్యావకాశాలను తొక్కి పారేశారు.. తాము అక్రమంగా ఆక్రమించుకున్న హైదరాబాద్‌లో మాత్రం విద్యకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకుని.. మిగతా తొమ్మిది జిల్లాలకు మొండిచెయ్యి చూపించారు.. తెలంగాణా అంటే హైదరాబాద్ మాత్రమే అని ఒకానొక భావనలో ఉండిపోయారు. కాగితాల్లో లెక్కల్లోకొచ్చేసరికి తెగ చెప్పేస్తారు.. తొమ్మిది జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నదన్నది ఎవరికీ అక్కర్లేదు.. వీటి గురించి మాట్లాడితే మీకు తలపొగరుగా కనిపిస్తుంది.. మెదడు లేని వాళ్లుగా కనిపిస్తారు.. తెలంగాణాలో అక్షరాస్యత పెరగాలన్నారు.. ఎలా చేసే పెరుగుతుందో మీరు చెప్పగలరా? శ్రీచైతన్య, నారాయణ టెక్నోస్కూళ్లు గల్లీకొకొటి కుప్పలు తెప్పలుగా తెచ్చిపోసి ఎల్‌కెజికి 50 వేల చొప్పున నిలువుదోపిడీ చేయించుకోవటం వల్ల పెరుగుతుందా? ఈ స్కూళ్లలో చదువుకోవటమేనా అక్షరాస్యత పెరగటం? తొమ్మిది జిల్లాల్లో అక్షరాస్యత ఎలా పెరుగుతుంది? బాసరలో ఐఐటి పెట్టాలంటే.. దాన్ని దిగ్విజయంగా గండికొట్టి అది కూడా తెచ్చి హైదరాబాద్‌లో పడేసిన మేధావితనం ఎవరిది? ఎయిర్‌పోర్ట్ లేదనో.. మరో కుంటి కారణాలు తెచ్చి చూపి.. అక్కడ ఒక పెద్ద విద్యాసంస్థ రాకుండా చేసిన ఘనత ఎవరిది? ఒక సంస్థను ఏర్పాటు చేయమని ఎందుకు కోరతారో మేధావులైన మీకు తెలియంది కాదనే నేననుకుంటున్నా... ఒక సంస్థను ఏర్పాటు చేయటం వల్ల దానికి అనుబంధంగా ఆ ప్రాంతానికి చాలా సౌకర్యాలు వస్తాయి.. దాని వల్ల మౌలిక వనరులు.. సదుపాయాలు పెరుగుతాయి. దాని వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. అక్కడ ఏమీ లేదనే అది కావాలని అడిగింది.. అది వస్తే అన్నీ వస్తాయని ఆశపడింది.. అది లేకుండా.. రాకుండా చేసిందెవరు? తోటి తెలుగువాడు. తెలంగాణా అభివృద్ధికి ఇది ఒక మచ్చుతునక.
ఇక తరువాతి విషయం.. ఇక్కడ మొబిలిటీ లేదన్నారు.. మొబిలిటీ అంటే కేవలం హైదరాబాద్‌కు మాత్రమే వచ్చి ఉండటం కాదని నేననుకుంటున్నా.. నిజమేమిటో మీరే చెప్పాలి.. మొబిలిటీ అంటే ఇక్కడ ఉపాధి దొరక్కపోతే దొరికిన చోటికి వెళ్లి ఎంత కష్టపడైనా సరే సంపాదించటం.. గల్ఫ్ దేశాలకు వెళ్లటం.. మహారాష్టక్రు వెళ్లటం.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లటం.. పాట్నా వెళ్లటం... ఐరోపా దేశాలకు వెళ్లటం.. రష్యాకు వెళ్లటం.. ఎక్కడైనా.. సరే.. నాలుగు రాళ్లు దొరికితే కుటుంబాన్ని పోషించగలిగితే సంతృప్తి చెందటం..ఇది మాత్రమే వాళ్లకు తెలిసిన విద్య.. దీన్ని ఇంగ్లీషులో సోకుగా మొబిలిటీ అంటారన్న విషయం కూడా వారికి తెలియదు.. పొట్ట కట్టేసుకుని రాత్రికి రాత్రి డాలర్లు సంపాదించి.. ఆ డాలర్లను తల్లిదండ్రులకు పంపించి వాటితో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేసి ఏసి కార్లలో తిరగటం కాదు మొబిలిటీ అంటే... ఎక్కడికైనా వెళ్లి బతకటమే వాళ్లకు తెలిసింది.. తామున్న దగ్గరికే అన్నీ రావాలనుకుంటారనటం తమ ఆలోచనను ఎదుటివాళ్లపై ఆపాదించటమే అవుతుంది. ఇక్కడి వాళ్లు ఎక్కడికైనా వెళ్లి దుకాణాలు పెట్టుకునో.. ఉద్యోగాలు చూసుకునో బతుకుతారు.. కానీ, తోటి తెలుగు ప్రాంతానికి మాత్రం వెళ్లలేరు.. ఎందుకంటే వాళ్లను అక్కడ సహించేవాళ్లే లేరు.. అక్కడ అక్కున చేర్చుకుని సోదరులుగా ఆదరించే వాళ్లు లేరు.. అక్కడ వాళ్లకు మీరు ఇంగ్లీష్‌లో రూమ్ అన్నారే.. అది కూడా దొరకదు.. ఇది నిజం. దీని గురించి మీరు మాట్లాడరు.. ఒప్పుకోరు.. రజాకారులు దుర్మార్గంగా ప్రజలపై దాడి చేస్తున్న కాలంలో ప్రాణాలరచేత పట్టుకుని ఒక్కుదుటున పక్కనున్న విజయవాడకు వెళ్లిన తోటి తెలుగు ప్రజలను ‘గాడిద కొడుకులు ఇక్కడికి వచ్చారు.. మా ప్రాణం మీదకు’’ అని ముఖం మీదే తిట్టిన ఉదారవాద సంస్కృతి నిజంగా మేధావి వర్గానికే సాధ్యమైంది.
ప్రజాస్వామిక భావనలు లేని వారు తెలంగాణ ప్రజలని చెప్పుకొచ్చారు.. ప్రజాస్వామిక భావనలు అంటే ఏమిటి? ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలే లేకపోతే.. 1940లలోనే ఇక్కడికి వలసలు ప్రారంభమయ్యేవి కావు.. అన్ని జిల్లాల్లో రాత్రికి రాత్రి గుంటూరు పల్లెలు పుట్టుకొచ్చేవి కావు. ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలు లేకపోతే.. ఎక్కడికక్కడ మండలాలకు మండలాలే ఇతర ప్రాంతాల వాళ్ల పాలన పడేవి కావు. తోటి తెలుగువారితో ఇంటిగ్రిటీ కోసం ప్రయత్నించే వాళ్లు కారు. తోటి సంస్కృతిని తమదిగా సొంతం చేసుకుని తమలో అబ్సార్బ్ చేసుకునే వాళ్లు కారు. పొరుగు పండుగలను తమవిగా చేసుకుని ఆనందంగా సంబురాలు చేసుకునే వారు కారు. ఆ ఔదార్యం ఇక్కడి సంస్కృతిలో భాగం.. అందరినీ తమవాళ్లని అనుకోవటం ఇక్కడి అమాయకత్వం.. బతుకమ్మ పండుగను మీరు ఎన్నడైనా చేసుకున్నారా? బతుకమ్మ అంటే అదీ ఒక పండుగేనా.. గడ్డిపూలు పెట్టి చుట్టూ తిరుగుళ్లు తిరిగి వెఱ్రి పాటలు పాడుకోవటం కూడా ఓ పండుగేనా అని ఎద్దేవా చేయటం ప్రజాస్వామిక భావనా? తోటి తెలుగువాణ్ణి తమ ప్రాంతంలో అడుగుపెడితే సహించలేకపోవటం.. చాపకింద నీరులా అతణ్ణి వెనక్కి వెళ్లిపోయేలా చేయటం ప్రజాస్వామిక భావనా? స్థానిక ఉద్యోగాలను రాష్ట్ర ఉద్యోగాలుగా జీవోల్లో మార్చేసుకుని స్థానికుల నోట్లో మట్టి కొట్టడమేనా ప్రజాస్వామిక భావన? మీకు తెలుసా? నీటిపారుదల శాఖలో తెలంగాణా అన్న ఒకే ఒక్క కారణం వల్ల దాదాపు రెండు వందల మంది ప్రమోషన్లు ఆగిపోయాయన్న విషయం? జిహెచ్‌ఎంసి అనే ఒక లోకల్ బాడీ సంస్థలో 80శాతంమంది ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లన్న విషయం మీకు తెలుసా? చివరకు అటవీ శాఖలో పూర్తిగా లోకల్ ఉద్యోగాలను భర్తీ చేయమని 152 జివో ఇస్తే.. వాటిని రాత్రికి రాత్రి రాష్ట్ర పోస్టులుగా మార్చి అడవితో సంబంధం లేని విజయవాడ.. గుంటూరు.. రాజమండ్రి వారికి వాటిని కట్టబెట్టిన సంగతి మీకు తెలుసా? 1969లో 24వేల ఉద్యోగాలను తెలంగాణా పొట్ట కొట్టి ఇతర ప్రాంతాల వారికి ఇచ్చారన్న ప్రాతిపదికపై ఆందోళన జరిగితే.. దాన్ని రెక్టిఫై చేసేందుకు కాసుబ్రహ్మానందరెడ్డి జివో నెం.36 రిలీజ్ చేస్తే ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా? 1985లో 58, 962 ఉద్యోగాలు అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇచ్చిన పొరపాటును సవరిస్తూ.. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసైనా సరే తెలంగాణా ప్రాంతం వారికి న్యాయం చేయాలని ఎన్టీరామారావు విడుదల చేసిన జీవో ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా? సాగర్ డామ్ కట్టి గ్రావిటీతో కృష్ణా డెల్టాకు సులభంగా నీళ్లు వదులుకుని నల్గొండకు చుక్క నీరు కూడా వదలకుండా ఆ జిల్లాను ఫ్లోరిన్ బాధితురాలిగా ఎందుకు చేశారో చెప్పగలరా? ఆ జిల్లాలో డ్యామ్ కట్టి ఆ జిల్లా కోసం కట్టిన కెనాల్‌ను ఎందుకు పనిచేయకుండా ఆపేశారు? ఒక్కసారి చెప్పండి? వ్యవసాయానికి చుక్కనీరు రాకుండా చేసి.. బోర్లమీద బోర్లు వేసుకుని దిక్కులేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు కరెంటు వేసుకుని నీళ్లు వాడుకుంటే.. ఓహో.. విద్యుత్తు వినియోగంలో తెలంగాణా నెంబర్ వన్ అంటారు.. 50 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క డ్యామ్ పూర్తి చేయకుండా.. ఎవరి మేలును ఆకాక్షించినట్లు..ఎవరికి సంక్షేమం చేసినట్లు? తోటి తెలుగువాడిగా ఇక్కడే ఉంటున్న వారిగా.. బహుశా మీరు హైదరాబాద్ కావచ్చు.. మిగతా తెలంగాణా గురించి మీకు ఎంత వరకు ఆవేదన ఉందోలేదో నాకైతే తెలియదు..
తెలంగాణాకు లేనివన్నీ ఉన్నాయని చెప్తున్నారన్నారు? ఏవి లేవో మీరు చెప్పలేదు.. మీరు చెప్పినవి అక్షరాస్యత లేదన్నది.. కానీ, ఇక్కడ అక్షరాస్యత ఉంది.. మీరు చెప్పింది మొబిలిటీ లేదన్నది.. ఇక్కడ మాత్రమే మొబిలిటీ ఉంది...మీరు చెప్పింది పని సంస్కృతి లేదన్నది అన్నింటికీ మించి ఇక్కడ మాత్రమే పని సంస్కృతి ఉంది. ఇక్కడ సోమరులు లేరు.. ఎందుకంటే మిగతా చోట్ల పని చేసినా జీవితం నడుస్తుంది.. ఇక్కడ పని చేయకపోతే పూట గడవదు.. ఇక్కడి ప్రజానీకానికి పెరిగిపోయిన సంపన్నతతో ఎంజాయ్ చేయటానికి హంసమేడలు లేవు.. వీరికి తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా మాత్రమే. మీరు చెప్పింది ఇక్కడ ప్రజాస్వామిక భావనలు లేవన్నది ఇక్కడ మాత్రమే ప్రజాస్వామిక భావనలు ఉన్నవి. ఇక్కడ సృజన ఉంది.. అక్షరం రాయటం రాకపోయినా.. అద్భుతమైన సారస్వత పంటను పండించే వేనవేల పోతన్నలు ఉన్నారు..ఇక్కడి పోతన్నను అక్కడికి లాక్కుపోవాలని చూడటం వారికి తెలియదు.. ఇక్కడి కాకతీయులను రాజమండ్రికి పరిమితం చేయటం వీరికి తెలియదు.. ఇక్కడి సోమనాథుని హాల్కురికి తీసుకుపోవటం తెలియదు. మల్లినాథసూరిని.. అప్పకవిని ఎత్తుకుపోవటం వీరికి తెలియదు.. వీరికి తెలిసిందల్లా బుద్ధి కంటే ఎక్కువగా హృదయాన్ని అభిమానించటం. ఇక్కడి సంస్కృతిలో మర్యాదలు, మన్ననలు విశిష్టంగా ఉంటాయి. కులభేదాలకు అతీతంగా ఉంటాయి. గ్రామానికి గ్రామాలు ఒక కుటుంబంగా ఉంటాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, తమ్మలి, దళిత, బేగారె, నీరడి కులాలెన్నో తెలంగాణా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ల మధ్య అనూహ్యమైన అనుబంధాలు, బంధుత్వ పిలుపులు కనిపిస్తాయి. వినిపిస్తాయి. వారిలో ఒకరికి ఒకరు అన్న, మామ, బావ, వదిన, అక్క, ఇలా రకరకాల బంధాలు ప్రజల అనుబంధాలను పెనవేస్తాయి. ఇళ్లల్లో కూడా ఇదే రకమైన విధానం కనిపిస్తుంది. ‘‘ఏందె నాయినా’’ అని పిలవటంలో ఉండే ఆత్మీయత, నాన్నగారూ...వదినగారూ.. మరిదిగారూ.. అని పిలవటంలో ఉండదు. ఎవరినైనా ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటంలో కానీ, సహాయపడటంలో కానీ, తెలంగాణా ప్రజలు ముందుంటారు..
సరే మళ్లీ విషయానికి వద్దాం.. తెలంగాణ ఎందుకు వెనుకబడింది? ఒక్కసారి చెప్పండి? ఆంధ్ర రాష్ట్రంతో మెర్జ్ అయిన సమయానికి తెలంగాణా బడ్జెట్ 63 కోట్ల మిగులు.. ఆంధ్ర బడ్జెట్ మైనస్ 24 కోట్లు.. ఈ డబ్బు కోసమే.. ఈ మౌలిక వనరుల కోసమే.. ఈ మానవ వనరుల కోసమే.. ఆదరాబాదరాగా.. టెంట్ల కింద దిక్కులేకుండా నడుస్తున్న పాలనను చక్కదిద్దుకోవటం కోసమే షరతులతో మెర్జ్ చేసుకున్నారు. అంతే తప్ప తెలుగు వారినంతా ఒక్కటిగా చేయటం కోసం కాదన్నది మీరు గ్రహించాలి.. తెలంగాణాను బేషరతుగా కలుపుకోలేదు.. ఒప్పందం చేసుకుని మరీ కలుపుకున్నారు. ఒప్పందం ఉల్లంఘన జరిగింది కాబట్టే ఉద్యమాలు జరుగుతున్నాయి.
తోటి తెలుగువారు మీరు.. తెలుగువారు సంపూర్ణంగా సమైక్యంగా ఇప్పుడు ఉన్నారా? ఇక్కడ నిజామాబాద్‌లో ఉన్న ప్రజానీకానికి విశాఖపట్నం గురించి ఎంతవరకు తెలుసు.. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక జిల్లాలో ఉన్నవారికి తెలంగాణా జిల్లాల గురించి ఎంతవరకు అవగాహన ఉంది.. రెండు ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ కోసం ఏనాడైనా.. ఎవరైనా ప్రయత్నించారా? ఇంతెందుకు? ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్లు ఎవరైనా తెలంగాణా వారితో మమేకం కావటానికి ఒక్కసారైనా ప్రయత్నించారా? ఇక్కడి సంస్కృతిని తమదిగా చేసుకున్న సందర్భం ఉందా? తెలంగాణాకు సంబంధించిన పండుగలను, పబ్బాలను, పిండి వంటలను ఏనాడైనా తమ ఇళ్లల్లో చేసుకున్నారా? ఇలా ప్రశ్నిస్తే.. మీదీ ఓ పండుగేనా? మీ తిండీ ఓ తిండేనా అంటారు? ఇక్కడి వాళ్లతో కలిసి ఉండరు.. వీళ్లను మాత్రం మీతో కలిసి ఉండాలంటారు.. అసలు మమేకమే కానప్పుడు కలిసి ఉండటం ఎలా సాధ్యమవుతుంది?
మీకు తెలియంది మరొకటుంది.. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరటం లేదు.. ఎనిమిది సంవత్సరాల పాటు సంపన్నంగా విలసిల్లిన రాష్ట్రాన్ని తిరిగి తీసుకోవాలనుకుంటోంది.
చివరగా ఒకటి సుస్పష్టం.. తెలంగాణా, ఆంధ్రా అన్నవి రెండు జాతులు.. రెండు సంస్కృతులు.. రెండు భాషలు.. రెండు జనజీవన విధానాలు.. ఇవి రెండు ఎప్పటికీ కలవవు.. బలవంతంగా రెంటినీ కలిపారు.. ఈ రెండూ కలిసి ఉండటం అసాధ్యం. ఇప్పుడు విడిపోవటాన్ని ఆపవచ్చు. కానీ, మానసికంగా విడిగా ఉన్న జాతులను శాశ్వతంగా కలిపి ఉంచటం ఎవరివల్లా అయ్యేపని కాదు.

42 కామెంట్‌లు:
మా అమ్మానాన్నలు నాలుగేళ్లు కరీంనగర్ లో ఉన్నప్పుడు తెలంగాణా పిండి వంటలు చేసుకుని తిన్నాం. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి తిరిగొచ్చిన తరువాత ఆ వంటలు ఎలా చెయ్యాలో మర్చిపోయాము. సంస్కృతితో పాటు ఆహారపు అలవాట్లలో కూడా తేడా ఉందని ఒప్పుకుంటాను.
సంతోష్ కుమార్ గారు చాలా బాగా అర్థమయ్యే రీతిలో వ్రాశారు. బాగుంది మీ వ్యాసం.. అయితే మీ వ్యాసంలో ఉదహరించిన విషయాలు ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు గాని అన్ని ప్రాంతాలలో జరిగేవే ఉండేవే..ఎందుకంటే అన్ని చోట్ల ఉండేది " మనుషులే " కాబట్టి. నేను కూడ ఇంతకు రెండింతలు వ్యాసం రాయగలను..కాని అదెప్పుడు ఎదుటివారిని మాత్రమే వేలెత్తి చూపే విడంగా వుండకూడదు.. ఎవరో ఒక " అనామకుడు " రాసిన వ్యాసాన్ని అనుసరించి మిగతా ప్రజలంతా ఆయన లాగే ఆలోచిస్తారని అనుకోవచ్చా..?. మరి మీరు చెప్పినవన్ని బాగున్నాయి ఆంద్ర, తెలంగాణ రెండు జాతులు అన్నారు..మరి మాది ఏ జ్యాతి చెప్పగలరా..? " రాయలసీమ " ది ఏ జ్యాతి చెప్పగలరా మిత్రమా..?
కమల్‌గారూ.. ఒక ప్రాంతానికి పరిమితమైనవనో.. ఒకే ప్రాంతంలో ఉన్నాయనో.. ఉంటాయనో.. రాయలేదు.. ఈ ప్రాంతం గురించి చర్చ జరుగుతోంది.. ఈ ప్రాంతాన్ని హీనంగా చూస్తున్నారు.. ఈ ప్రాంత ప్రజలు ఏది మాట్లాడినా తప్పు పడుతున్నారు.. ఈ ప్రాంత ప్రజలకు ఏదీ చేతకాదు.. ఎందుకూ పనికిమాలిన వాళ్లని హేళన చేస్తున్నారు.. చర్చ ఈ ప్రాంతానికి పరిమితమైంది కాబట్టి.. ఈ ప్రాంతం పరిధిలో మాత్రమే వివరించటం జరిగిందే తప్ప నేనెవ్వరినీ వేలెత్తి చూపలేదు.. మీరు నాకంటే బాగా రాయగలరు.. అది నాకు తెలుసు.. అందరూ అనామకుల్లా ఆలోచించరు.. అందరికీ అలాంటి అభిప్రాయాలూ ఉండవు.. నేను కోరేది తోటి తెలుగువాళ్లమని చెప్పుకుంటూ తోటి తెలుగువారిని తమతో కలిసి ఉండమని చెప్పుతూ.. బలవంతం చేస్తూ.. అదే తోటి తెలుగువాళ్లను కించపరచవద్దని మాత్రమే. తాము మాత్రమే మనుషులమని.. వాళ్లనే తోటి తెలుగువాళ్లు మనుషులు కారనే విధానం మంచిది కాదనే నేను కోరేది.. తెలంగాణాలో ఉన్న వారికీ జీవించే హక్కు ఉంటుందన్న విషయాన్ని గ్రహించి.. ఆ హక్కులను కాలరాసే పద్ధతికి స్వస్తి పలకాలనే నేను కోరేది.. అసలు తెలంగాణా అన్న మాట వినటమూ.. మాట్లాడటమే తప్పుగా ఫీలవుతున్న వారు సమైక్యమని వాదించటంలో అర్థాన్నే నేను ప్రశ్నిస్తున్నది..
$Kovela santosh kumar ji
Wow. Very comprehensive article exhibits plight of Telangana people. I second you implies Telangana brothers.
సంతోష్ గారు దయచేసి ఒక మనవి " మీ కంటే రెండితలు ఎక్కువరాయగలను " అని అంటే మీకంటే బాగా అని కాదని అర్థం చేసుకోగలరు. ఇక మీరు చెబుతున్న " తప్పుపడుతున్నారు, హేళన చేస్తున్నారు, ఈ ప్రాంతప్రజలకు ఏదీ చేత కాదు " ఈ విషయాల మీద కాస్త పూర్తిగా లోతుగా చూద్దాం.
మామూలుగా ఒక వూరివారు పక్క ఊరివాడిని లేక పక్క ప్రాంతం వాడిని లేక పక్క కులం వాడిని ఏదో ఒకవిదంగ పరిహాసలాడి..లేక చిన్న చూపు చూసో లేక మీకు సంస్కృతి తెలియదనో దెప్పడం, హేళన చేయడం అన్నది మనుషుల్లో ఉన్న ఒక జాడ్యం. అది చాలా వరకు చాలా మందిలో ఉంటుంది.. అంతెందుకు మా గ్రామం పక్కనే వున్న గ్రామ ప్రజల్ని మా వూరివాళ్ళు ఏదో ఒకటి అంటూనే వుంటారు " అమ్మొ ఆ కొత్తపేటోళ్ళా చాల అతినాయాల్లు..వాళ్ళతో పెట్టుకోకూడదు.." అంటూవుంటారు అదే ఆ కొత్తపేటవాళ్ళు మా వూరివారిని " ఆ వూరోళ్ళకు ఎట్లా మాట్లాడాలో తెలియదు అంతా మొరటు మనుషులు " అని హేళన చేస్తూ వుంటారు..ఇది కేవలం ఒక్క మా వూరికో లేక పక్క వూరికో కాదు రాష్ట్రంలో వున్న అన్ని జిల్లాలోని గ్రామాల జనాలు ఇలానే ఏదో ఒకటి వంక పెట్టి పక్క వూరివారిని హేళన చేస్తూ మాట్లాడుతూనే వుంటారు అదొక జాడ్యం. అలాంటిదే ప్రాంతాల వారిగా విడిపోయి జనాలు హేళన చేసుకుంటున్నారు..! మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడ అంటూనే వున్నారు..నాకే స్వయంగా చాలా అనుభవాలున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో మా పక్కన వున్న తెలంగాణ మిత్రులే " అరె డిగ్రీ ఎట్లా పాసయినవ్..ఎగ్జామ్‌లో టేబుల్ మీద బాంబులు పెట్టి బెదిరించి రాసి పాస్ అయినావా ..? " ఇట్లా హేళన చేసే వాళ్ళు. ఇక కోస్తా తీరప్రాంతాల వారు అయితే ఇంకాస్త ముందుకెళ్ళి " మీకు నరుక్కోవడం తప్ప ఏమి తెలియదు కదా..? మీకు వంట చేసే కూరలు ఎమి తెలియవు, వేపుళ్ళు తెలియవు మమ్మల్ని చూసి తెలుసుకుంటున్నారు, అంతా గొడ్డు కారమే కదా తినేది.. మీది మొరటు తెలుగు యాస " అని ఇట్లా అపహాస్యం చేసే వారు..! ఇవన్ని అన్ని చోట్ల జరిగేవే అతి సహజం కూడ ఎందుకంటే అవన్ని మనుషుల సహజ లక్షణాలు..! అది కూడా అందరూ అలానే మాట్లాడరు..! మరి వీటిని దృష్టిలో పెట్టుకొని నేను కూడ సపరేట్ కావాలని అడిగితే అంతకన్న హాస్యాస్పదం ఏది వుండదు మిత్రమా..!
అయినా ఇక్కడ తెలంగాణ ప్రాంతం వారికి జీవించే హక్కు లేదనీ ఎవరు అంటున్నారు..? అలా అన్నవారిని మధం పట్టిన మనుషులుగా పరగణించాలి అంతే గాని అదే అందరి అభిప్రాయమనే వాదనకు రాకూడదని అనుకుంటాను.
కమల్ గారూ..
మీరు పాజిటివ్‌గా స్పందించినందుకు ధన్యవాదాలు.. కాకపోతే చిన్నమాట.. ఆటపట్టించటానికి, అవహేళన చేయటానికి మధ్య చాలా సన్నని దారమే అడ్డుగోడ.. ఆటపట్టించే ముసుగులో అవహేళన చేయటాన్నే తప్పుపట్టాల్సిన విషయం. రెండోది.. మీరన్న ఆటపట్టించారన్న కారణంతో రాష్ట్రాన్ని కోరుతున్నారనే మాట హాస్యాస్పదం. ఆ మాట అన్నది ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ ఎంతమాత్రం పొసగలేదని చూపించేందుకోసమే. రెండు ప్రాంతాల ప్రజల మధ్య రాష్ట్రం ఏర్పడిన గత యాభై ఏళ్లలో ఇంటిగ్రిటీ కోసం..మమేకం కావటం కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు.. చేయలేదు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్లలో ఏ ఒక్కరూ కూడా ఇక్కడి ప్రజల జీవన విధానంలో కలిసిపోవటానికి ప్రయత్నించలేదు.. దీన్ని కనీసం ఆదరించలేదు. అయితే అదొక్కటే రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమని మీరు అనుకోకున్నా.. దాన్ని మాత్రమే ప్రస్తావించటం ద్వారా విషయాన్ని పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నారని నేననుకుంటున్నా.. రాష్ట్రం కోరటం వెనుక అనేక పార్శ్వాలు దాగి ఉన్నాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ, నీటిపారుదల.. రెవెన్యూ.. న్యాయ, కార్యనిర్వాహక.. అన్ని రంగాల్లో అనంతంగా సాగుతూ వస్తున్న అన్యాయాలపై పెల్లుబుకిన అసహనం నుంచి పుట్టుకొచ్చిన డిమాండ్ తెలంగాణ. ఇది మీకూ తెలుసు. కానీ, దీన్ని మీరు అంగీకరించలేరు. అంతే సంగతులు. ధన్యవాదాలు.
సంతోష్ గారూ,
తాడేపల్లిగారు చెప్పింది తెలంగాణలో "తెలుగు" అక్షరాస్యత పెరగాలని! అంటే తెలంగాణలో తెలుగు బదులు ఉర్దూ, పారసీ చదువుతారని గానీ లేక తెలంగాణ తెలుగు తెలుగు కాదని గానీ ఆయన ఉద్దేషం అయుండొచ్చు.
సంతోష్ గారు,
నా స్పందనను కింద లంకెలో చదువవచ్చు. బ్లాగరు కేవలం 4096 అక్షరాలు మాత్రమే అంగీకరించటంవల్ల పూర్తి వ్యాఖ్యను నా బ్లాగులో ప్రచురించాను.
http://krishnaveniteeram.blogspot.com/2011/06/blog-post_19.html
అద్భుతం సారూ.. తెలంగాణ ఒక వెంకటేష్ సినిమా లాగా ప్రేమ, ఆప్యాయతలతో ఒక అంధమైన కల ల ఉంది.. 100 డేస్ స్క్ర్తిప్ట్.. కానీయండి. మీ సంకర్(వ్యాకరణ దోషం) చేత మరో సినిమా తీయించండి సారూ.. టైటిల్ ఏమైతే బాగుంటుంది.. ఆ(...
తెలంగాణ కి పోదాం రా....
ఏందీ.. బతుకమ్మ చేసుకోవాలా? :)) రాష్ట్రమే కాదు దేశమంతా ఒట్టి బతుక్కేమిటి, సమ్మక్క-సారక్క, కొమొరం భీం, చాకలి ఐలక్క, కెసిఆర్, కవితమ్మ, విజయశాంతి, హరీష్‌రావు, నిజాంల బర్థ్‌డే కూడా చేసుకుంటాం, మీరు రేషన్‌షాపులోంచి 5కెజీల బియ్యం, 2కెజిల చక్కెర, నాలుగు ముంతల గుడుంబ/కల్లు ఉచితంగా ఇప్పించండి మహా ప్రభో! :D
తాడేపల్లి గారు చెప్పింది నిజమే అని, మీ పోస్ట్ చూశాక మరో సారి నిర్ధారణ అయ్యింది.
ఇదీ వీళ్ల ఇంటిగ్రేషన్.. పది జిల్లాల్లో సమష్టిగా నెల రోజుల పాటు జరుపుకునే పండుగ వీళ్లకు పండుగ లాగా కనిపించదు.. ఇది ఆటపట్టింపా.. అవహేళనా? తెలంగాణా ప్రజలంటేనే భగ్గుమనే వాళ్లు ఇంటిగ్రిటీ గురించి మాట్లాడతారు.. మాట మాట్లాడితే అడ్డగోలుగా నిందించేవాళ్లు కలిసి ఉండమంటారు.. ౫౦ ఏళ్లుగా తెలంగాణా గురించి ఒకేవిధంగా.. చేసిన.. చేస్తున్న దుష్ప్రచారాలన్నింటినీ.. పదే పదే ప్రచారం చేయటం బ్రిటిష్ వాడి నుంచి ఒంటపట్టించుకున్న లక్షణం. మీకు ఏం లేదు.. ఏదీ చేతకాదు..మీరెంత.. మీ బతుకెంత? మేమే మీకు తినటం కూడా నేర్పించాం.. అంటూ న్యూనతలోకి నెట్టే ప్రయత్నం చేయటం ద్వారానే అర్ధశతాబ్ది పరిపాలన సాగుతూ వచ్చింది. ఇక ముందూ సాగుతుంది.. తెలివిడి కంటే లౌక్యం తెలిసిన జాతి లక్షణమే ఇది.. ఎదుటి వాడిమీద ఆధారపడి జీవిస్తున్నా..అది బయటపడకూడదంటే.. వాళ్లలో వాళ్లనే న్యూనతకు గురి చేయాలి.. హీనంగా చూడాలి.. వాళ్లను అనాగరిక జాతిగా చిత్రీకరించాలి.. అప్పుడు మెకాలే చేసిన పనినే ఇప్పుడు వీళ్లూ చేస్తున్నారు.. వాళ్లను మించిన వారసులుగా... వీళ్లను చూసి ఎలిజబెత్ రాణి తప్పకుండా సంతోషిస్తుంది.
సంతోష్ గారూ,
ఇక్కడ ఎవ్వరూ మిమ్మల్నో లేదా బతుకమ్మనో ఎవ్వరూ నిందించలేదు. బతుకమ్మ అనేది దసరా పండుగలో భాగంగా ఆడే ఆట. అది ఒక భక్తిభావ ప్రకటనా విధానం. ఇక్కడ వ్యాఖ్యానించిన వారెవ్వరూ బతుకమ్మ పట్ల అమర్యాదగా ప్రవర్తించింది లేదు. కేవలం మీరు బతుకమ్మ ఆడరు కదా అని మాకు రాష్ట్రం ఇచ్చేయాలన్న శుష్క వేదాంతానికి విరుగుడుగా ఇచ్చిన కౌంటర్ అంతే. పనికిమాలిన కారణాలు, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా రాతలూ ఉంటే స్పందనలు ఇలానె ఉంటాయి. మీవి మాత్రమే మనోభావాలు ఇతరులవి కాదన్నట్టు ఇకనైనా తెలంగాణవాదులు వాదించకుండా ఉంటే మంచిది. లేదంటారా ఈ రావణకాష్ట్రం ఇలా రగులుతూనే ఉంటుంది. మీ రాతల మీద ఎక్కుపెట్టిన ప్రశ్నలకి చేతనైతే శాస్త్రీయ ఆధారాలతో సమాధానాలివ్వండి. ఇలాంటి మానసిక బెదిరింపులు కాదు. ఇలాంటివి పదేళ్ళు భరించిన తరువాతే సీమాంధ్ర ప్రజానీకం కౌంటర్ ఇవ్వటం మొదలుపెట్టిందన్న విషయం గుర్తెరిగితే మంచిది.
ఆచంగ గారూ..
పనికి మాలిన కారణాలంటే ఏమిటి? నీటిపారుదల విషయాన్ని మాట్లాడటం పనికిమాలిన కారణమా? నిన్నటికి నిన్న కూడా జూరాల ప్రాజెక్టు నుంచి మహబూబ్ నగర్‌కు నీళ్లు పూర్తిగా నిలిపి వేసి.. పోతిరెడ్డిపాడుకు మాత్రం తరలించటం వివక్ష కాదా? దీన్ని ప్రస్తావించటం శుష్కవేదాంతమా? అంతర్జాతీయ నదీజలాల ఒప్పందం ప్రకారం నదీపరివాహక ప్రాంతంలో సాగునీటి వినియోగం జరగాలి.. దాని తరువాత మిగతా ప్రాంతాలకు తరలించాలి. తెలంగాణాలో గోదావరి ౮౯శాతం పారుతుంది..కృష్ణా ౭౯శాతం పారుతుంది. ఇక్కడ ఎన్ని టిఎంసిల నీళ్లు వస్తున్నాయో.. తెలంగాణేతర ప్రాంతంలో ఎన్ని టిఎంసిలు వస్తున్నాయో ప్రశ్నించటం పనికిమాలిన కారణమా? ఇచ్చంపల్లిని ఆపేసి పోలవరాన్ని నిర్మించటాన్ని అడగటం పనికిమాలిన కారణమా? తెలంగాణాలోని ౪౩ ప్రాజెక్టులను ఎక్కడివక్కడ ఆపేయటాన్ని అడగటం తప్పా? ౧౯౬౯లో తప్పుడు ఉద్యోగాలిచ్చారని కన్‌ఫర్మ్ అయి రెక్టిఫై చేసేందుకు విడుదల చేసిన ౩౨ జీవో, ౫౮వేల పైచిలుకు ఉద్యోగాలను రెక్టిఫై కోసం ౧౯౮౫లో రిలీజ్ చేసిన జీవోలను సవరించి తెలంగాణా వాళ్ల ఉద్యోగాలను వారికే ఇవ్వాలని కోరటం పనికిమాలిన కారణమా? లోకల్ సంస్థ జిహెచ్‌ఎంసిలో సైతం నాన్‌లోకల్ వాళ్లకు ఉద్యోగాలివ్వటాన్ని ప్రశ్నించటం పనికిమాలిన కారణమా? ఇక్కడి ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ మూసేసారని ఆందోళన వ్యక్తం చేయటం పనికిమాలిన కారణమా? ఉపాధి దొరక్క గల్ఫ్‌కు, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్న వారిని ఆపాలనటం పనికి మాలిన కారణమా? అతి దుర్మార్గంగా వీళ్లకు మొబిలిటీ లేదని, ప్రజాస్వామిక భావాలు లేవని వ్యాఖ్యానించటాన్ని అడగటం పనికిమాలిన చర్యా? వీటిలో వేటికీ జవాబులు ఇవ్వకుండా .. ఇక్కడి ఆందోళనలను పట్టించుకోకుండా.. పరిగణలోకి తీసుకోకుండా.. డెలిబరేట్‌గా ఇగ్నోర్ చేయటం ప్రజాస్వామిక భావన అని మీరు భావిస్తున్నారా? రెండు ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ ఎంతవరకు ఉన్నదన్న అంశంలో భాగంగా పండుగలు.. సంస్కృతులు ప్రస్తావనకు వస్తాయి. అంతే తప్ప అదొక్కటే కారణం కాదు.. కానీ, మీరు కావాలనే.. మిగతా అంశాలను పక్కకు నెట్టేసి మరీ ఇందుకోసమే రాష్ట్రాన్ని కోరుతున్నారని మరో ప్రచారాన్ని దుర్మార్గంగా ప్రచారం చేయటం సమంజసం ఎంతమాత్రం కాదు.. మీ తాజా వ్యాఖ్యలోనూ తెలంగాణాను వేరు చేసే మాట్లాడారు.. సీమాంధ్ర.. తెలంగాణా వేరు వేరన్నట్లుగానే మాట్లాడుతున్నప్పుడు ఇక ఇంటిగ్రిటీకి ఆస్కారం ఎక్కడుంది..మీరు తెలంగాణా వాళ్లను మీతో సమానంగా చూడటం లేదని ఈ ఒక్క మాటతోనే అర్థమవుతోంది.. మీ మనోభావాలు మాత్రమే మనోభావాలని.. వాటిని మాత్రమే వినాలని బలవంతంగా రుద్దుతున్నారు.. బాధపడుతున్నవాడు ఏం చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకోదలచుకోలేదు మీరు.. దానికి మందు వెయ్యటం కంటే కారం పూసి.. వాడు మరింత బాధ పడుతుంటే చూసి ఆనందించాలనుకోవటం ఇంటిగ్రిటీ కాదు. ఎన్ని బాధలు పడ్డా సరే.. కలిసే ఉండాలన్నది మీ భావన. మీరు కలిసి ఉండాలని కోరుకోవటం లేదు. బలవంతంగా కలిపి ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. .
ధన్యవాదాలు..
పండుగలు పబ్బాల దగ్గరే ఇంటిగ్రేషన్ లేదని మీరే అంగీకరించారు.. ధన్యవాదాలు.. ఇక్కడే కలిసి ఉండలేని వాళ్లకు సమైక్యమని అనే అర్హతేముంది..
/నీటి పారుదల విషయం/
కృష్ణా నది, గోదావరి నదులపై తొలిసారి కట్టిన ఆనకట్టలు ప్రకాశం బ్యారేజి, ధవళేశ్వరం బ్యారేజి. ఆయా ఆయకట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనేది అంతర్జాతీయ న్యాయ సూత్రమే మరి! మిగిలిన విషయాలకు సమాచార హక్కు చట్టం ఉపయోగించండి మీకే తెలుస్తాయి లెక్కలు. ఎవరు పడితే వారు వండి వార్చే కాకి లెక్కలు కాదు. ఒక ప్రాజెక్టు ఆగితే మీ ఎమ్మెల్యెలని నిలదీయండి. సీమాంధ్ర ప్రజలను కాదు.
/ఉద్యోగాలు/
మా రాష్ట్ర రాజధానిపైనే మాకు హక్కులు లేవనటం ఏమాత్రం ఔదార్యమో! అదలా ఉంచండి. తెలంగాణలో ఆంధ్రప్రాంతీయుల ఉద్యోగాలకు కారణం అప్పట్లో తెలంగాణ అక్షరాస్యత. ఆయా స్థానాలకు స్థానికంగా కాగడాపట్టి వెదకిన తర్వాతే పక్క ప్రాంతాలనుంచి మానవవనరులని రప్పిస్తారు.
ఏ ప్రాంతం నుంచి వచ్చినా తెలంగాణలో పుడితే వారిని తెలంగాణ్యులుగానే పరిగణిస్తారు. అది అంతర్జాతీయ న్యాయ సూత్రమే మరి! ఇక్కడ జనాభా లెక్కలకి సీమాంధ్ర ప్రాంతీయులు కావాలి. ఉద్యోగాల దగ్గరకొచ్చేసరికి మాత్రం దోపిడీదారులు. వాహ్వా తెలంగాణ న్యాయం! (తెలంగాణలో పుట్టినవారంతా తెలంగాణ బిడ్దలే అన్నందుకు కె.సి.ఆర్ మీద వచ్చిన నిరసన మీకు తెలియకున్నా మాకు తెలుసు).
/వలసలు/
లేనిదెక్కడ? దానికి కారణం సీమాంధ్ర ప్రజలా?
నేనే అంశాన్నీ వదల్లేదు. నా బ్లాగులో స్పందన అసలు చదివారా?
/సమైక్యత/
విభజన మీ ధ్యేయం. అందుకు సంతోషించాల్సిందే కదా!
/ సీమాంధ్ర.. తెలంగాణా వేరు వేరన్నట్లుగానే మాట్లాడుతున్నప్పుడు ఇక ఇంటిగ్రిటీకి ఆస్కారం ఎక్కడుంది/
తెలంగాణవాదులు 'ఆంధ్రోల్లు' అంటే లేనిది నేను తెలంగాణవాదులు అంటే వచ్చిందా?
చాలా సంతోషం..
ఒకటి మాట్లాడితే మరొక దాని వైపు తిప్పటం మీకు తెలిసిన విద్య కావచ్చు. రాష్ట్ర రాజధాని మీది మాత్రమే.. మాది కాదన్నమాట.. అసలు నా టపాలో రాజధానిలో ఉద్యోగాల హక్కుల ప్రస్తావన ఎక్కడ వచ్చిందో.. మీకు మాత్రమే కనిపించి ఉండవచ్చు. స్థానిక ఉద్యోగాల్లో స్థానికులు దొరకనప్పుడు అస్థానికులను తీసుకువస్తారన్న మీ వాదన గొప్పదే.. కానీ, స్థానిక ఉద్యోగాలను రాష్ట్ర ఉద్యోగాలుగా మార్చివేసి స్థానికులకు దక్కకుండా చేయటం మీకు మాత్రమే తెలిసిన విద్య.. నేను ప్రస్తావించింది.. ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని ఒప్పుకుని వాటిని రెక్టిఫై చేయమని మీ ఆంధ్ర ముఖ్యమంత్రులు స్వయంగా ఇచ్చిన జీవోల అమలు గురించి.. దాని గురించి కొంచెమైనా మాట్లాడరేం... జవాబు లేదా? కావాలనే కన్వీనియంట్‌గా తప్పించారా?
జూరాల నీళ్లను ఇంత గగ్గోలు జరుగుతున్న టైమ్‌లోనూ ఈ జిల్లాకు చుక్క నీరు కూడా వదలకుండా తరలించటం గురించి మాట్లాడరేం...ఇగ్నోరెన్స్
ఇచ్చంపల్లి గురించి ఎందుకు ఆగిందో..దాన్ని ఆపేసి పోలవరాన్ని మాత్రం ఎందుకు నిర్మిస్తున్నారో... మాకే ఆవకాయ నేర్పిన మీరే చెప్పండి? లెక్కలు బాగా తెలిసిన వాళ్లు కదా..
మేము కోరుతున్నదే విభజన. అందుకే సీమాంధ్ర అంటున్నాం.. మీరు మాతో సమైక్యాన్ని కోరుతున్నారు కదా... ఏదీ సమైక్యం? మాతో కలిసి పోవాలని మీరు రాసిన ఏ ఒక్క మాటలోనైనా ధ్వనించిందా? మా పట్ల మీకు అభిమానం ఎక్కడైనా కనిపించిందా? ఆభిజాత్యం తప్ప.
@సంతోష్
కొంతమంది అచంగులు ఆపిల్ తీయగా ఉందనగానే అబద్దం, ఆరెంజ్ పుల్లగా ఉంటుంది కావాలంటే సాక్ష్యాలు చూసుకోండి, గట్రా అని వాదిస్తారు లెండి. వారికి ఆపిల్‌కూ, ఆరెంజ్‌కూ తేడా తెలియక కాదు, ఎలాగయినా అవతలి వారిపై తమదేపైచేయి కావాలనే ఆరాటంలో ఎవరు గమనిస్తారులే అని అలా చేస్తుంటారు.
ఇంద్రసేన గారు..
తోటి తెలుగువాళ్లను హీనపరచకుండా సోదరుల్లా సంభావించటమే కావలసింది.. అదే జరగటం లేదు. అభివృద్ధి ఫలాలు అన్ని జిల్లాలకు సమాన ప్రాతిపదికన లభించినప్పుడు అసలు ఉద్యమమే వచ్చేది కాదు.. నేను చెప్పింది జీవోల లెక్కలు కాదు.. ఆ మాటే అర్థం లేనిది.. ఆ జీవోలు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. సదరు ఉద్యోగాలన్నీ ప్రతిభ వల్ల కాదనీ, మరో రకంగా నింపబడ్డాయని నాటి ప్రభుత్వాలు స్వయంగా అంగీకరించినవే..వాటిని ఆనాడు రెక్టిఫై చేయలేదు అనటం మీ దృష్టిలో తప్పనిపిస్తే ఏం చేయగలను? దాదాపు ౮౪వేల ఉద్యోగాలు అన్యాయంగా భర్తీ అయ్యాయని అంటుంటే వాటిని కాకి లెక్కలని తోసిపారేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి? తెలంగాణాకు లేనిదంటూ ఏదైనా ఉన్నదంటే అది నాయకత్వమే.. మాకు నాయకత్వం సరిగా ఏడిస్తే ఏ సమస్యా ఉండేది కాదు.. ఆ అసమర్థ నాయకత్వాన్నే ఇప్పుడు నిలదీస్తున్నది? ౪౩ ప్రాజెక్టులకు ఒప్పుకోళ్లు జరిగిన తరువాత కూడా పూర్తి చేయలేని చేతకాని తనాన్ని ప్రశ్నిస్తున్నది..కనీసం రాష్ట్రం విడిపోతే వీళ్లు చచ్చినట్టు కొన్ని నిధులైనా ఈ ప్రాజెక్టులపైనే ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనే ఆశపడుతున్నది.. నేను ఎక్కడా ఆంధ్ర వాళ్లు దోపిడి దొంగలని అనలేదు. మీరు జనరలైజ్ చేయవద్దని మనవి.. పేదరికంపై పోరాటం జరిగితే.. విద్యా, ఉపాధి, నీళ్లు దక్కితే ఉద్యమించాల్సిన అవసరం ఎవరికీ రాదు.. ఉండదు.. మీరు మమ్మల్ని సోదరులుగా చూడండని దేబిరించుకోవాలా? అన్నదమ్ములను సరిసమానంగా చూడటం అందరిబాధ్యత కాదా?
రాష్ట్ర రాజధాని పై తెలంగాణ ప్రాంతీయుల హక్కులని నా టపాలోకానీ, నా వ్యాఖ్యలలో కానీ నేనెక్కడా నిరాకరించలేదే! మా హక్కును గుర్తుచేశాను. రాజధాని ఉద్యోగాల ప్రస్తావన /జిహెచ్‌ఎంసి అనే ఒక లోకల్ బాడీ సంస్థలో 80శాతంమంది ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లన్న విషయం మీకు తెలుసా?/ ఇలా వచ్చింది మరి!
జి.హెచ్.యం.సి ఉద్యోగుల పూర్తి ప్రొఫైళ్ళు మీవద్ద ఉన్నాయా? ఉంటే బయట పెట్టండి ఒక్కొక్కరిగా ప్రాంతీయత లెక్క తేల్చుదాం!
నాకు తెలిసి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆంధ్రరాష్ట్రములో మాత్రమే నియామకాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మాత్రమే ఆంధ్రప్రదేశులో నియామకాలు చేపట్టారు.
జూరాల ప్రాజెక్టు నీటి విడుదల వివరాలు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ వద్ద ఉంటాయి. వారి సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా విడుదల చేయండి. తప్పకుండా చర్చిద్దాం.
ఇచ్చంపల్లి ఎందుకు ఆగిందో మీ ప్రాంత ప్రజాప్రతినిథులని అండగండి. దీనికీ సమాచార హక్కు చట్టమే మంచి ఆయుధం. విచిత్రం ఏమిటంటే ఇచ్చంపల్లి ఆపాలని సీమాంధ్ర ప్రాంతములో ఎటువంటి గోలా లేకపోవటం. పోలవరం ఆపాలని మాత్రం తెలంగాణవాదుల అల్లరి జాతీయ స్థాయిలో ఉండటం!
నేనెక్కడా నా బ్లాగుద్వారా, వ్యాఖ్యలద్వారా లేదా మరే ఇతర మీడియా ద్వారా నేను సమైక్యవాదినని ప్రకటించుకో లేదు. మరి నేను సమైక్యతకు కృషి చేయాల్సిన అవసరం ఉందంటారా?
ముందు మీ రాతలకు (నా బ్లాగులో సుదీర్ఘంగా ప్రశ్నించాను) సమాధానాలు ఇవ్వండి.
(http://krishnaveniteeram.blogspot.com/2011/06/blog-post_19.html)
meeru samaikyavadi kananduku thanks..
@ విశ్వరూప్ గారూ
ఒక వ్యక్తి పేరుని ఆ వ్యక్తి వ్రాసినట్టుగానే వ్రాయటం అలాగే ఉచ్చరించటం మర్యాద. ముందు మీరది తెలుసుకుంటే వాదాల గురించి తర్వాత వాదులాడుకుందాం.
అచంగ గారూ,
ఒకవ్యక్తి ఒక దురహంకారికి సమాధానం చెబుతూ ఒక టపా రాస్తే అతను రాసిన కాంటెక్స్ట్‌నూ, అందుకు ప్రేరేపించినవారి వాఖ్యలనూ కలిపి చర్చించడం విగ్నత. అది వదిలేసి కేవలం సమాధానంలోని కొన్ని ఎంచుకున్న ముక్కలను అవి దేనికి సమాధానంగా రాశారో పట్టించుకోకుండా పట్టుకుని ఈకలు పీకడం విగ్నత కాదు, మీరు ముందా విషయాన్ని తెలుసుకోండి.
@ విశ్వరూప్ గారూ,
నేను లేవనెత్తిన అభ్యంతరానికి సమాధానంగా కనీసం మీ వ్యాఖ్యను సరిచేయటం కానీ, క్షమాపణ అడగటంగానీ లేదు. పైగా విఙ్ఞత గురించి చెబుతున్నారు.
@ సంతోష్ గారూ,
వ్యక్తిగత విమర్శకి, సైద్ధాంతిక విమర్శకి మీకు తేడా తెలుసని అనుకుంటున్నాను. సరే ఈ విషయములో మీకూ ఇటువంటి సందేహమే ఉంటే ఇదీ నా సమాధానం.
నేను మీ టపాపై రాసిన స్పందన లంకె మీకివ్వటం జరిగింది. తెలియజేయటమూ జరిగింది. నా టపా మిమ్మల్ని ఉద్దేశించి రాసిందే అని మీకు ఎరుకపర్చటమూ జరిగింది. మీకివ్వాల్సిన క్రెడిట్ నా బ్లాగులోనూ ఇవ్వటం జరిగింది. మీరెందుకు ఇటువంటి టపారాయాల్సి వచ్చిందో పాఠకులకి సుస్పష్టంగానే తెలుసుకునే అవకాశం నేను కల్పించాను. మీ రాతలో అభ్యంతరకర వ్యాఖ్యానాలనే నేను ప్రశ్నించాను. నా విఙ్ఞత బాగానే పనిచేసింది మరి! తాడేపల్లిగారి వ్యాఖ్య లంకె ఇవ్వాల్సిన బాధ్యత నాది కాదు. అది టపా రచయితగా మీ బాధ్యత.
వ్యాఖ్యలను ప్రచురించేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్త వహిస్తారని ఆశిసున్నాను. చర్చ అవసరములేదు మా వాదాన్ని వినిపించటానికి వ్యక్తిగత విమర్శలకైనా దిగుతాము అంటే శెలవు మరి.
అచంగ గారూ..
ఈ కామెంట్‌లో నన్ను ఉద్దేశించి రాసిన దాంట్లో ఉద్దేశ్యం నాకు అర్థం కాలేదు.. నేను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా దూషించలేదు.. నన్ను పురుగుల పడి చస్తావని ఓ ‘అనామకుడు’ గతంలో నిందించినా మాట్లాడలేదు.. ప్రస్తుత చర్చలో సైతం మిమ్మల్ని కానీ, మిగతా సోదరులను కానీ, (నేను సోదరులని అనుకుంటున్నా) వ్యక్తిగతంగా దూషించలేదు. మీరు ఇలా దూకుడుగా మాట్లాడటం వెనుక ఉన్న సమర్థన మీకే తెలియాలి..తాడేపల్లి గారి లంకెను ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయన నా దాంట్లోనే రాసిన ఓ కామెంట్‌కు జవాబుపై చర్చే మీరు లొల్లి (అనుకోవచ్చు.) ప్రస్తుతం కొనసాగుతున్నది. ఆ టపా మూడింటి కింద ఉంది మీరు చూడవచ్చు. ఇతరులు మాట్లాడినట్టే మిగతా వాళ్లూ మాట్లాడతారు.. వాళ్లకు మాట్లాడే హక్కు లేదనటం..వాటిని ప్రచురించరాదనటం విజ్ఞత కాదేమో.. పెద్దలు మీరే చెప్పాలి..
సంతోష్ గారూ,
చర్చ మీ బ్లాగులో జరుగుతోంది. ఇక్కడ ప్రచురించే ప్రతీ వ్యాఖ్యకూ మీ బాధ్యత ఉంటుంది. విశ్వరూప్ గారి సంధించిన ప్రశ్నకు వారికి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది వారి బ్లాగు కాదు. పాఠకులకి నా గోడు వినిపించాలంటే అది మీ ద్వారానే జరగాలి అందుకే ఆ వ్యాఖ్యలో మిమ్మల్నే ఉద్దేశిస్తూ సమాధానం చెప్పటం జరిగింది.
ఒక వ్యక్తి పేరును తప్పుగా రాయటం, ఉచ్చరించటం అనేది ఆ వ్యక్తికి జరిగిన అవమానంగానే పరిగణిస్తారు సాధారణంగా. అదీ పదిమంది పాల్గొనే చర్చలో అంటే మీరే ఊహించండి. నేను అభ్యంతర పెట్టింది అదే (మీకు లొల్లి అయితె క్షంతవ్యుడను). ఇటువంటి అభ్యంతరం వచ్చినప్పుడు ఆ వ్యాఖ్య రచయిత లేదా చర్చావేదిక నిర్వాహకులు ఆ వ్యాఖ్యను సరిజేయటం పరిపాటి. మీరు (లేదా విశ్వరూప్ గారు) అది ఇంతవరకూ చెయ్యలేదు.
మిమ్మల్ని ఎవరైనా (నేను కాదు) వ్యక్తిగతంగా దూషిస్తే ఎంత ఖండనార్హమో అంతే అప్రస్తుతం నా వరకూ. రాత పరంగా, ఇతర సాంకేతికాంశాల పరంగా, వాడే భాష పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలియజేయటం (నా విఙ్ఞత సరిగానే ఉందనీ) పై వ్యాఖ్య (లొల్లి)కి ఉద్దేశ్యం.
ఇతరుల భావ ప్రకటనకు నేను అభ్యంతరపెట్టలేదు. తగు ఆధారాలను జత చేయమంటున్నాను. నా బ్లాగులో మీ వాదనని విమర్శించినా తగు ఆధారాలు నేను జత చేశాను. పరిశీలించవచ్చు.
తాడేపల్లిగారి వ్యాఖ్య లంకె ఇవ్వటం ఇవ్వకపోవటం పూర్తిగా మీ స్వవిషయం.
విషయాన్ని దారి మళ్లించటంలో మీరు విజయం సాధించారు.. ధన్యవాదాలు
సరే. జరిగిన కాలహరణకు క్షమాపణలు. విఙ్ఞత అంశాన్ని పాఠకులకు వదిలేస్తున్నాను. శెలవు.
కేవలం పేరును బహువచనంలో రాసినందుకు ఇంత హంగామా చేసే పెద్ద మనుషులు తెలంగాణావాదులపై, తెలంగాణ ప్రజలపై వారి బ్లాగులో పబ్లిష్ చేసిన దూషణలకూ, వెక్కిరింతలకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు:
***********
మీరు మరీ అంత లాజికల్గా, నాజూకుగా చెబితే వాళ్ళకు అర్థమవ్వొద్దూ?
/మానసికంగా విడిగా ఉన్న జాతులను శాశ్వతంగా కలిపి ఉంచటం ఎవరివల్లా అయ్యేపని కాదు/
ఎంత మానసికరోగులైనా మిమ్మల్ని కలిపే వుంచాల్సిన గురుతర భాధ్యత మాపై వుంది. :P
తారఖ్యాంధ్రులంటే ఏమిటండీ, బాగో లేదు. తారకాసురుల సంతతివారిలా వుంటుంది పైగా తెలగాణ్యులకు నోరూ తిరగదు. నిజాంతెలంగోళ్ళు అనండి బాగుంటుంది.
**********
మనదాకా వస్తే మర్యాదలు గుర్తుకొస్తాయి, పౌరుషం పొడుచుకొస్తుంది. పక్కోడిపై మాత్రం ఎలాంటి అవాకులైనా పేలొచ్చు. ఇలాంటి డబల్ స్టాండర్డ్స్ వలనే ఇప్పుడీ ఉద్యమం.
పైగా ఈఅయన లింకిచ్చాడు కనుక అందరూ లింకివ్వాలట, అలా చెయ్యకపోతే తప్పట. టపామొదట్లోనే అదెవరిని ఉద్దేషించి రాసిందో కనిపిస్తూనే ఉంది కదా. కిందపడ్డా మీద పడ్డా మనమే నెగ్గాలి, మనం చెప్పిందే రూలు, మనం చేసేదే మర్యాద, మనం మాట్లాడిందే వేదం అని తలచేవారి వాదనలిలాగే ఉంటాయి.
విశ్వరూప్ గారూ,
మీ పరిశోధనా శక్తికి జేజేలు. నా బ్లాగులో పాఠకులు చేసే వ్యాఖ్యలు నావెలా అవుతాయో? ఇతరుల బ్లాగుల్లోనుంచి ఎత్తిరాసేటప్పుడు ఆయా బ్లాగుల లంకె ఇవ్వటం అనేది సార్వత్రిక మర్యాద. అప్పుడే కదా ఆయా వ్యాఖ్యలు ఎందుకు ప్రచురించాల్సి వచ్చిందో పాఠకులకి అర్థం అయ్యేది.
మీరే నా బ్లాగులో అభ్యంతరపెట్టండి తగు వివరణలు, సవరణలు తక్షణం చేయబడతాయి. నా బ్లాగులో తెలంగాణవాదులను విమర్శించానే కానీ తెలంగాణ ప్రజలను విమర్శించలేదు. నా రాతలు అసంబధ్ధమే అని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతాననీ ఆయా టపాలోనే ప్రకటించిన విషయం టోకున మరచిపోండి. నోటికొచ్చిన నాలుగు ముక్కలు రాసేయటం కాదు వాటికి తగు ఆధారాలను చూపించాలి. మీ రాతల్లో ఆధారాలేపాటివో పాఠకులందరికీ తెలుసు.
టపా మొదట్లో ఎవరిని ఉద్దేశించి రాసినా, రాసిన వారు ఏమి రాశారో పాఠకులకు తెలియపర్చటం మర్యాద.
@ అచంగ గారు
"సంతోష్ గారూ,
చర్చ మీ బ్లాగులో జరుగుతోంది. ఇక్కడ ప్రచురించే ప్రతీ వ్యాఖ్యకూ మీ బాధ్యత ఉంటుంది." ఇది మీ వాఖ్య. మరి మీబ్లాగులో ప్రచురించే వాఖ్యలపై మీకు భాధ్యత ఉండదా? లేక అన్నింటిలాగే ఎక్కడ కూడా రూల్సు మీకు, మాకు సపరేట్‌గా ఉంటాయా. మీబ్లాగులో చర్చకు ఎంత అర్ధవంతమయిన వాతావరణం ఉంటుందో ఎవరికి తెలియదు? అక్కడ Snkr గారి అనుచిత వాఖ్యలకు స్థానం ఉంటుంది కానీ, తెలంగాణవాదుల వాదనను ఎంత నిర్లక్ష్యంగా కొట్టిపారేస్తారో తెలియని విషయమా? అందుకే తమరి బ్లాగుకు తమరే పుడుంగని ఎవరో అన్నారు.
ఇంతకూ "తెలగాణ్యులకు నోరూ తిరగదు, మానసిక రోగులు" అని ఒక బ్లాగరు మీబ్లాగులో వాఖ్యానిస్తే అది తెలంగాణవాదులను ఉద్దేషించా, లేక తెలంగాణ ప్రజలను ఉద్దేషించా? ఇంతకూ తెలంగాణవాదులనయితే ఏదయినా తిట్టొచ్చా? తెలంగాణవాదుకు, ప్రజలకు ఎంత తేడా ఉందిప్పుడు? వీటికి సమాధనం ఇవ్వక్కరలేదు, లైట్ తీసుకోండి.
@అచంగ గారు,
ఏమిటి, నేను రాసే రాతలకు ఆధారాలు లేవు, మీరు రాసేవాటికి ఉంటుందా? నాలుగు పటాలు పెట్టగానే ఆధారాలు ఇచ్చినట్టు కాదు, కనీసం మీరిచ్చిన పటాలకు మీరు చేసే కంక్లూజన్‌కూ కూడా ఎప్పుడైనా సంబంధం ఉంటుందా? అసలు ఆధారాలు సరికదా, ఏనాడైనా ఏదైనా తర్కబద్దంగా రాశారా, "మేం జైఆంధ్రా ఉద్యమం చేస్తుంటే మీరు నిద్రపోతున్నారా" లాంటి మూర్ఖపు వాదాలు తప్ప. పైగా పెద్ద పుడింగులాగా ఫీలింగు.
విశ్వరూప్ గారూ,
చక్కగా మీరే పాయింటుకొచ్చారు. ఇక్కడ నేను అభ్యంతరపెడితేనే దిక్కులేదు. ఎవరూ (మీతో సహా) అబ్యంతర పెట్టని నా బ్లాగులో వ్యాఖ్యలు ఎందుకు తీసేయాలి? ఇదే ముక్క నా బ్లాగులో రాయండి.
వ్యాఖ్యలను కొట్టిపారేయటానికీ కారణాలు తగుమాత్రం బాగానే చూపించాను. నేను చూపించిన కారణాలే అబద్ధాలైతే బండబూతులు వచ్చిపడతాయి.
మీరు సీమాంధ్రులను ఏదైనా తిట్టొచ్చా? (లగడపాటి ఓ లంగా పగులుతాది నీ పంగా, సీమాంధ్రులు దోపిడీదారులు, ఆంధ్రా బ్రాహ్మణులకు ఆర్భాటాలెక్కువ, పొమ్మంటె పోవేందిరా పోరా ఓ ఆంధ్ర దొరా) రాస్తే పెద్ద టపా అవుతుందిలెండి. ఇవన్నీ ఒప్పులే అయినప్పుడు అవీ ఒప్పులే అవుతాయి. ఇవి మీకు వేదవాక్కులైనప్పుడు అవి మాకు చెవులకి ఇంపుగానే ఉంటాయి. కనుక వేదాంతాలు కట్టిపెట్టి మీ మీ వ్యాఖ్యను సరిచేసుకోవటం సబబని గుర్తించండి.
మీరన్నారు కదా Double standards అని, నా నిబద్ధత నిరూపించుకోవటానికి ఆయా వ్యాఖ్యలను తక్షణం తీసివేయటం జరుగుతుంది ఈ వ్యాఖ్య ప్రచురించబడగానే నా బ్లాగులో ఎలాంటి అభ్యంతరాలూ రాకున్నా.
అచంగ గారు,
"అచంగులు అన్న పదాన్ని నేను వాడినందుకు మీకు ఈబ్లాగ్ముఖంగా నా బహిరంగ క్షమాపణలు" అది మిమ్మల్ని ఉద్దేషించి అన్నట్లుగా లేకపోయినా సరే, అందులో తప్పేంటో నాకు అర్ధంకాకపోయినాసరే మీమనోభావాలు గాయపడినట్లున్నాయి కనుక. ఇక మీబ్లాగులో తెలంగాణ ప్రజలపై దూషణలు వెక్కిరింతలగురించి, రోజుకు వందసార్లు Snkr అనే వాడు, మరికొందరు బ్లాగుల్లో ఎక్కడో ఒకదగ్గర అత్యంతహేయమయిన భాషలో హేళనచేస్తూనే ఉంతారు, వాటన్నింటికీ నేను కంప్లైంట్ చెయ్యాలంటే రోజుకు ఇరవైనాలుగు గంటలు సరిపోదు. గతంలో కొందరు అత్యంత నీచమయిన బూతులు కూడా రాసి తమ సంస్కృతిని చాటుకున్నారు. నేను మీకవి గుర్తుచెయ్యడానికి కారణం ఒకరికి నీతులు చెప్పేవాడు తానూ పాటించాలనే ఇంగితం గుర్తుచెయ్యడానికి, అది మీరు నేను చెప్పకముందే చేసిఉంటే మీనిజాయితీ తెలిసేది.
దోపిడీదారులను దోపిడీదారులనీ, దొరలను పొమ్మని అంటే తప్పెలాగయ్యిందో? సమైక్యవాదులని గానీ, సీమాంధ్ర ప్రజలని గానీ తిడితే మీఅభ్యంతరాలు చెప్పండి, అలా తిట్టినవారికి.
విశ్వరూప్ గారూ,
"మేం జైఆంధ్రా ఉద్యమం చేస్తుంటే మీరు నిద్రపోతున్నారా" ఈ వ్యాఖ్యలు నేను చేసినట్టు నా టపాలన్నీ వెతికినా నాకు కనిపించలేదు. అసత్యాల ప్రచారంలో మీకు మీరే సాటి. నెనన్నది "జై ఆంధ్ర ఉద్యమం 1972లో జరుగుతూంటే తెలంగాణవాదుల నోళ్ళెందుకు పడిపోయాయి" అని. ఆ వ్యాఖ్యకు ముందు వెనుకా చదివిన ప్రతీ ఒక్కరికీ అర్థం అవుతుంది అది ఎందుకు చేయబడ్డదో.
నా బ్లాగులో వ్యాఖ్యలకు సంబంధించి మరింత జాగరూకతతో వ్యవహరిస్తాను.
నాకు మా యాస కూడా వచ్చు (http://krishnaveniteeram.blogspot.com/2011/06/9.html) ఇక్కడ చూడవచ్చు.
అంశాలవారీగా మీ (తెలంగాణవాదుల) అభాండాలను ఎండగడుతూనే ఉన్నా.... Wait for final conclusion.
సమైక్యవాదులందరూ దోపిడీ దారులేగా మీ దృష్టిలో! నేను దుర్భిణీ వేసి వెదకినా కనబడటం అసాధ్యం మీ నిర్వచనం పరిధిలో. అంతటి సాహసం నేను చేయబోను.
మీ చేత క్షమాపణ చెప్పించటం నా ఉద్దేశ్యంకాదు. మీ వాదనలో లోపాలు చూపించటమే నా ఉద్దేశ్యం. సంతోషం మీ వాదన ద్వారా ఋజువు చేశారు. క్షమాపణ అడిగారు కనుక ఇక దీన్ని పొడిగించదలుచుకోలేదు.
మీకు అక్షరం పొల్లుపోకుండా చెప్పాలి లాగుంది ఏదయినా. పైగా అందరికీ అర్ధం అవుతుందని అందరితరఫునా వకాల్తా పుచ్చుకోవడం, అర్ధం లేని కన్‌క్లూజన్లు చేస్తూ ఆధారాలతో సహా నిరూపించానని చంకలు గుద్దుకోవడం. ఒక వ్యక్తి ఒకరి అహంకారపు కామెంటుకు సమాధానంగా ఒక వాఖ్య చేస్తే దానికి ఈకలు పీకుతూ అసలు దానికి సంబంధం లేని మరో విషయంపై ఒక పెద్ద వాఖ్యానాన్ని రాసి నేను నిరూపించాను అని మీకు మీరే చెప్పుకోవడం.
అసలు మీరిచ్చిన లింకుకు ఏమన్నా అర్ధం ఉందా? నేను కూలిపనులగురించి రాస్తే హైదరాబాదులోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి అని రాస్తూ.. అదికూడా నేను మరోవ్యక్తి రాసిన అనవసర వాఖ్యకు సమాధానంగా ఇచ్చినదానిక్ని పీకుతూ..ఒకవేళ హైదరాబాదులోనే ఉద్యోగాలు ఉంటే దొంగసర్టిఫికెట్లు ఎందుకు, మనకు కోటా ఉందిగదా అని మీనాగులు శీనుగాన్ని అడగలేదెందుకో. పుడింగు ఫోజులు వద్దు. మన పరిణితులు తెలిస్తే మంచిది. మీరింతవరకూ ఏదీ నిరూపించలేదు, మీరీ లైన్లో వెలితే భవిష్యత్లో కూడా ఏదీ ఎన్నటికీ నిరూపించలేరని తెలుసుకోండి. మీరాతల డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ ఎప్పుడో ఒక తపా వేద్దామనుకున్నా, కానీ తమరికి అనవసర ఇంపార్టన్సు ఇవ్వడమెందుకని ఊరుకున్నా .
మీరు ఇదే నిబద్దతతో నేను చూపించిన రెండు మూడు చోట్ల కాకుండా మీబ్లాగులో అన్నిచోట్ల తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదులను చేసిన హేళనలను మీరే తీసేసి, ఇకముందు కూడా అలాంటివి పబ్లిష్ చెయ్యక మీనిబద్దతను నిరూపించుకోండి, ఒకరిని తప్పుపట్టడానికి మాత్రమే కాక నిజాయితీని ఒక అలవాటుగాచేసుకోవాలని తెలుసుకోండి.
తెలంగాణా జీవన పాటలో ఉన్న ఆవేదనని పక్కనబెట్టి కేవలం రెండుమూడు రెచ్చగొట్టే పదప్రయోగాలని పట్టుకుని ఊగులాడే వారికోసం ఇది.
http://www.youtube.com/watch?v=8fef1oKTsjs&feature=related
ఇద్దరం ఇడిపోతే భూమి బద్దలవుతుందా..
రావొచ్చు పోవొచ్చు రొయ్యలమ్ముకోవచ్చు..నువ్వు పద్యం పాడితే మేము వన్స్మోర్ కొట్టొచ్చు..
నీ ఇడ్లిబండి అడ్డజాగా నీవే నిలుపుకోవచ్చు
విశ్వనాధ, శ్రీశ్రీలకు వినమ్రంగా మొక్కొచ్చు.. కానీ దాశరధిని, కాళోజీని దాచిపెడితే కుట్ర కాదా...
పోమ్మంటే పోవెందుకు పోరా ఓ ఆంధ్ర దొరా
ఎడ్డిమీద ఎగలేక పొట్ట సేతపట్టుకుని వచ్చినొల్లని వద్దనుంచుకుంటాము. దోచుకోను వచ్చినోల్లని సూసుకోరా నీ తోవ..
తెలుగుజాతి ఒక్కటని వగలబడి బోతున్నవు.. ఒక్కతల్లి బిడ్డలమని ఒప్పుకుంటమే నిజము..
అన్నదమ్ములు ఇద్దరుంటే ఆస్థి పంచుకోరా జెప్పు..బాధలల్లో మీతో భాగముగా కాలేదా జెప్పు..
యేగలేక ఆగమయ్యి యేరుబడి పోదమంటే ఏర్పాటువాదమని యెక్కి యెక్కి బడి ఏడుసేంటి..
బతకనీకి వచ్చినోడిని భాయి భాయిగా సూస్తం.. దోచుకోను వచ్చినోల్లని సూసుకోరా నీ తోవ..
భాష ఒక్కటైతే బాధా పెట్టాలని ఉందా.. జాతి ఒక్కటైతే నన్ను గోతీలో పెట్టాలా
.....
మా నాటుకోడి పలావుని నీ కేటరింగులో గలిపి.. పచ్చళ్ళ బేరాలు జేసి పత్రికల ఓనర్లయితిరి..పట్నము సివార్లన్నీ పట్ట జేసుకోబడితిరి...
...
అన్నీ మాకుండి చాలా అభివృద్ధిలో తేడా ఏల? నీ చేతికిచ్చి అడుక్కునే ఐక్యతనా..
...
భాషను హీనం జేస్తిరి..బతుకును హీనం జేస్తిరి
..
మీరున్న కాలనీలు రాత్రిపూట పట్టపగలు.. మేమున్న కాలనీలు పట్టపగలే చీకట్లు
..
సాగుభూములేన్ని ఉన్నా ఆకలిసావులే మిన్నా
..
త్యాగాలు మీ చరిత్ర..భోగాలు మీ చరిత్ర
..
విలీనాలు గిలినాలు మా పాలిత విషాదాలు.. విషాదాలకింక స్వస్థి..తెలంగాణ కొరకు కుస్తీ
...
...........................
మనకి సమస్యని సమస్యగా అర్ధం చేసుకుని స్పందించే ఓపికలేదు..నిజాలు తట్టుకునే శక్తి అంతకన్నా లేదు. దానికీ మన సొంత ఇజాలు ఆపాదించి చేతకానితనంతో అసలు సమస్యని తోక్కేయడం మహా సరదా. అందువల్లే అలాంటి అసంబద్ద చర్చలు.
విశ్వరూప్ గారూ,
మీ బ్లాగులో (http://kotiratanalu.blogspot.com/) " పొయ్యి నువ్వు నీపెద్దపురం కొంప పక్కన శివరాత్రి రోజు గంతులేసుకో పైసలొస్తయి"
ఈ ఒక్క మీ వ్యాఖ్య చాలు మీ స్థాయిని నిర్ణయించటానికి.
నా వాదనలో డొల్ల ఎత్తి చూపుతానంటే మీకు సదా స్వాగతం.
అచంగ గారు,
ధన్యవాదాలు. తమరు ఏదో నిరూపించబోయి మల్లీ మల్లీ మీసూక్ష్మబుద్దిని, పక్షపాత ధోరణిని నిరూపించుకుంటున్నారు. నేనది ఎవరిని ఉద్దేషించి అన్నానో అతను మొత్తం తెలంగాణ ప్రజలను ఉద్దేషించి అంతకన్నపెద్దమాటలు అన్నాడు, ఇంతకు మునుపు కూడా అలాంటి మాటలే మాట్లాడినాడు. అయినా మీరు దేనికి సమాధానంగా అన్నానో దాన్ని వదిలేసి నేనన్నది మాత్రం పట్టుకుని ఈకలు పీకే బుద్దిని నిరూపించుకున్నారు. క్షమించాలి, ఇలాంటి పెడవాదనలు చేసేవారితో నేనెక్కువ వాదించలేను. నేనెవరిని ఉద్దేషించి అన్నానో వారొచ్చి అడిగితే సమాధానం ఇస్తాను.
ఇక్కడున్న వ్యాక్యలు చూస్తుంటే అసలు విషయం మరిచిపోయి.." మీరప్పుడు అలా అన్నారు.. లేదు నీవు అలా తిట్టావు..మీదే తప్పు..మీదే అహంకారం " అంటూ ఒకరినొకరు బాగానే దెప్పుకుంటున్నారు..! మొత్తానికి తెలుగు ప్రజలనిపించుకున్నారు..మన మనబతుకులింతే ఎప్పుడు ఒకరినొకరిని దెప్పుకుంటు అవహేళన చేసుకుంటూ.." మనుషలం " అనిపించుకుంటున్నాము..!
అన్నాయ్ ఈ రోజే మీబ్లాగ్ లోకి ఎంటరయ్యా ....పూర్తిగా చదివాక నా అభిప్రాయం చెబుతాను ..అంతా కుశలమేకదా?
అన్నాయ్ ఈ రోజే మీబ్లాగ్ లోకి ఎంటరయ్యా ....పూర్తిగా చదివాక నా అభిప్రాయం చెబుతాను ..అంతా కుశలమేకదా?
సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి