రాష్ట్ర రాజ`దాని భాగ్యనగరం... ఒకప్పుడు దేశంలోనే ఎలాంటి అలజడులు ఎరుగని సుర`ిత ప్రాంతంగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు కూడా సుర`ిత ప్రాంతంగానే ఉంది. కానీ, అది సామాన్యులకు కాదు... రౌడీ షీటర్లకు.. దొంగచాటుగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన వారికి... మాఫియా గ్యాంగ్‌లకు, ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు తిరుగులేని అడ్డాగా మారిపోయింది. ఏ ఒక్క నేరంలోనూ నేరగాడు ఎవరన్నది బయటపడలేదు. చివరకు ఇక్కడ జరిగిన మారణకాండల వెనుక కుట్రలను సైతం పోలీసులు ఛేదించింది లేదు.. ఏం చేసినా తప్పించుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇక ఈ నగరంలో సామాన్యుడికి భద్రత జాడ దొరికేదెలా?
పవిత్ర ప్రార్థనాలయం మక్కా మసీదులో `ాంబు పేలుడు జరిగి ఏడాది దాటిపోయి మూడు నెలలు కావస్తున్నది. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరో పోలీసులకు ఇంతవరకూ కనీసం క్లూ కూడా దొరకలేదు. మొ`ైల్ ఫోన్ ద్వారా `ాంబును పేల్చారని చెప్పటమే తప్ప, ఈ మిస్టరీని ఛేదించటం మన వారి వల్ల కానే లేదు. ఇక ఆ తరువాత గోకుల్‌చాట్, లుంబినీపార్‌కల్లో ఇక జంట పేలుళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. మక్కామసీదు పేలుడు సందర్భంలోనే కాదు.. ఈ జంట పేలుళ్ల సమయంలోనూ పోలీసులు ప్రాథమిక సమాచారం అంటూ ముందుగా వెల్లడించేది బంగ్లాదేశ్‌కు చెందిన హుజీ, పాకిస్తాన్‌కు చెందిన లష్కర్, జైష్ తీవ్రవాదుల కుట్ర ఫలితమే ఈ ఘటనలని... అంతటితో వ్యవహారం ముగిసిపోతుంది. ఆ తరువాత విచారణ ఏమేరకు పురోగతి సా`దిస్తుందన్నది ఎవరికీ తెలియదు.. మక్కామసీదు పేలుడు కేసులో ముపై్ఫ మందిని అరెస్టు చేసినట్లు గతంలో అ`దికారులు చెప్పారు. చివరకు వారిలో ఒక్కరు కూడా నేరంతో సంబం`దం ఉన్నవారు కాదని తేలింది. చివరకు ఈ కేసుతో షాహిద్ బిలాల్ అనే తీవ్రవాదికి పాత్ర ఉందన్నారు. అతను కాస్తా పాకిస్తాన్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఇక కేసు కథ కంచికిపోయినట్లే అయిందనుకున్నాం. ఇక ఇప్పుడు మాలేగావ్ పేలుళ్లలో నిందితులైన కల్నల్ పురోహిత్, సా`ద్వి ప్రజ్ఞాసింగ్, దయానంద్ పాండేలకు సంబం`దం ఉన్నదని అనుమానిస్తున్నారు. వారి కోసం ముంబయి వెళ్లి విచారణ చేస్తున్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు సంబం`దించిన ప్రతి కేసు విషయంలోనూ పోలీసులు వైఫల్యం చెందుతూనే ఉన్నారన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఈ వైఫల్యం వల్లనే దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా దాని మూలాలు హైదరా`ాద్‌లో తేలుతున్నాయి. `ెంగుళూరు ఐఐఎం పేలుడు కానీ, కాన్పూర్ అల్లర్లు కానీ, వారణాసి పేలుళ్ల వెనుక కూడా హైదరా`ాద్‌లో తీగలు బయటపడుతున్నాయి. ఒక ముజి`్.. టెరర్రిస్టు.. ఒక అజీజ్ రెడ్డి.. మాఫియా, ఒక అయూ`్‌ఖాన్.. గ్యాంగ్‌స్టర్.. ఒక నయూమ్.. మాజీ నక్సల్.. ఒక డిజెఎస్.. మతోన్మాద సంస్థ.. ఇలాంటి వారందరికీ భాగ్యనగరం సౌభాగ్యనగరంగా మారింది. ఇందుకు రాజకీయ నాయకుల అండ కూడా కొండంత ఉంది. టెరర్రిస్టు సానుభూతిపరుల ఇళ్లకు సా`ాత్తూ రాష్ట్ర మంత్రులే వెళ్లి పరామర్శిస్తారు.. కరడుగట్టిన ఉగ్రవాదికి సత్ప్రవర్తన సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వమే `ƒమాభి`ƒ ప్రసాదిస్తుంది... మక్కామసీదు పేలుడైనా, దిల్‌సుఖ్‌నగర్ సాయి`ా`ా గుడి పేలుడైనా, గోకుల్‌చాట్‌పేలుడైనా.. ఒకటే.. పోలీసుల చేతులకే రాజకీయ సంకెళు్ల పడితే.. నేరగాళ్లకు `ేడీలు వేసేదెవరు? టెరర్రిస్టులకు మతోన్మాదమే తప్ప మతం ఉండదని మన రాజకీయ నాయకులు గ్రహించి, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తేనే టెరర్రిస్టులను వెంటాడి వేటాడటం సా`ద్యపడుతుంది.
1 కామెంట్:
mee articles chadutunte Bhayam kalugutondi annaya.
కామెంట్‌ను పోస్ట్ చేయండి