25, నవంబర్ 2008, మంగళవారం

మరో అయిదేళ్లలో భూగోళం విచ్ఛిన్నం కాబోతోందా?

ఈ భూమి వయస్సు ఇంకెన్నాళు్ల? మరో అయిదేళ్లలో భూగోళం విచ్ఛిన్నం కాబోతోందా? కలియుగం అప్పుడే అంతం అవుతోందా? ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు లెక్కలు వేసి తేదీలు చెప్తున్నారు. మత గ్రంథాలు ముహూర్తాలు నిశ్చయించేశాయి. ఈ గణాంకాల ప్రకారం ఈ భూమి మరో అయిదేళ్లలో అంతం కాబోతోంది. రకరకాల కారణాల వల్ల 2012 డిసెంబర్‌ 21 భూమి మనుగడకు ఆఖరు తేదీ కానుందని శాస్త్రవేత్తలంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? 

2012 ప్రస్తుతం హాట్‌ టాపిక్‌.. ప్రపంచమంతా ఇప్పుడు ఈ సంవత్సరం గురించే వేడి వేడిగా చర్చిస్తోంది. 1999లో భూమి అంతం కాబోతోందని లెక్కలు వేసినట్లే, 2012 కూడా భూమి జీవితానికి చివరి సంవత్సరంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఖగోళ శాస్త్రంలో, సంఖ్యాశాస్త్రంలో తలలు పండిన పెద్దలంతా ఇదే మాట చెప్తున్నారు. పవిత్ర గ్రంథం బైబిల్‌లో  భూప్రళయానికి పెట్టిన ముహూర్తం కూడా ఇదే. శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్తున్న ప్రకారం 2012 డిసెంబర్‌ 21న భూమి అంతం అవుతుంది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. డిసెంబర్‌ 21కి మూడు వారాల ముందు ప్రకృతిలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో విపత్తులు భూ వినాశనానికి నాంది పలుకుతాయి. అసంఖ్యాకంగా గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి పరస్పరం ఢీకొనటం వల్ల పర్యావరణంలో అనూహ్యమైన మార్పులు నెలకొంటాయి. ఈ మార్పులు వాతావరణంలో ఆక్సీజన్‌ శాతాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇంతకంటే మించి భూగర్భంలో కేంద్రక స్థానంలో ఉన్న పొరల్లో తీవ్రస్థాయిలో కదలిక మొదలవుతుంది. ఇది భూభ్రమణంపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల భూమి అంతటా భూకంపాలు అధిక సంఖ్యలో వస్తాయి. సముద్ర గర్భంలో భూ పొరల్లో ప్రకంపనలు వచ్చి ఇంతకు ముందు ఎరుగని స్థాయిలో సునామీలు సంభవిస్తాయి. దీంతో అధిక భూభాగాన్ని సముద్రపు నీరు మింగేస్తుంది. సాగరం లోపలి అగ్ని పర్వతాలు బద్దలు అవుతాయి. భూమిపై కరవు కాటకాలు, వరదలు, తుఫానుల సంఖ్య గత పదేళ్లలో పెరగటం ఇందుకు సంకేతం. రానున్న అయిదేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికీ మించి భూగోళపు ఉత్తర దక్షిణ ధృవాలు తమ దిశలను మార్చుకునే దిశగా కదిలిపోతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ కదలిక రానున్న రోజుల్లో మరింత వేగం పుంజుకుంటుంది. అంతే కాకుండా సూర్యుడి అతి నీల లోహిత కిరణాల నుంచి భూమికి రక్షణగా ఉన్న ఓజోన్‌ పొర మరింత బలహీనపడుతుంది. భూమి చుట్టూ ఆవరించి ఉన్న అయస్కాంతపు పొర దక్షిణ అట్లాంటిక్‌ ధృవ సమీపంలో ఇప్పటికే బలహీనపడింది. 780వేల సంవత్సరాల క్రితం భూ అయస్కాంతపొరలో ప్రధానమైన మార్పు సంభవించింది. తిరిగి 2012 నాటికి మరో మార్పు జరుగుతుంది. ఇది భూమికి ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఈ మార్పులన్నీ కూడా సౌర కుంటుంబంలో భూ కక్ష్యను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే, రోదసిలో భూగోళం ఎక్కడో పడిపోయి విధ్వంసం అవుతుంది. అయితే మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకోనవసరం లేదంటున్నారు. సౌరకుటుంబంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు రావటం సహజమేనని, అలాంటివి ఏర్పడినప్పుడల్లా   భూమిని, సౌర కుటుంబాన్ని చక్కదిద్దడానికి రోదసిలో మనకు తెలియని శక్తులు, వ్యవస్థ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే అయిదేళ్లలో భూమి అంతం అవుతుందన్న వాదనలకు బలం ఏమిటి? భారతీయ సిద్ధాంతం ప్రకారం ప్రతి యుగం నాలుగు పాదాలు కొనసాగుతుంది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలియుగంలో ప్రథమ పాదం మాత్రమే ఇంకా కొనసాగుతోంది. మిగతా మూడు పాదాలు ఇంకా మొదలే కాలేదు.. అంటే మరి కొన్ని వేల సంవత్సరాల తరువాత కానీ భూ ప్రళయం సంభవించదు. మరి పాశ్చాత్య శాస్త్రవేత్తలు, సిద్ధాంతాలు, క్యాలెండర్లు ఇందుకు భిన్నంగా చెప్తున్నాయి. బిగ్‌బ్యాంగ్‌ థియరీ తొలిదశ ప్రయోగం జరిగినప్పుడు ఇవే అనుమానాలు వ్యక్తం అవుతే మరి కొన్ని లక్షల సంవత్సరాల దాకా భూమికి విపత్తే లేదన్నారు. అసలు భయపడాల్సిన పనే లేదన్నారు. ఇప్పుడు అబ్బే అదేం లేదు.. ఇక అయిదేళ్లకే మన బతుకులు తెల్లవారుతాయంటున్నారు.. ఇంతకీ ఎవరెవరు ఏమేం కారణాలు చెప్తున్నారు.

నెంబర్‌1

మాయన్‌ క్యాలెండర్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మెక్సికో యుకటన్‌ ద్వీపకల్పంలో  ప్రాచీన నగరం చిచెన్‌ ఇజా నాగరికతకు మాయన్‌ క్యాలెండర్‌ దర్పణం పడుతుంది. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న అనేక క్యాలెండర్లన్నింటికంటే కూడా  తొంభై శాతం వాస్తవానికి దగ్గరగా భవిష్యత్తును చెప్పిన క్యాలెండర్‌ మాయ. మాయలో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు నిజమయ్యాయని అంటారు. అందులో భాగంగానే 2012 డిసెంబర్‌ 21న భూమి అంతం అవుతుందని మాయ రెండు వేల సంవత్సరాల క్రితమే పేర్కొంది. ఇది కూడా నిజమే అవుతుందా? ఈ కాలెండర్‌ ప్రకారం భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3, 29, 53, 20 రోజుల 34 సెకండ్ల దూరం. 2012 డిసెంబర్‌ 21నాటికి ఈ దూరం మరింత దగ్గరకు వస్తుంది. ఇదే భూమి అంతానికి కారణమవుతుంది.
నెంబర్‌2
సూర్య గోళంలో పేలుళు్ల విపరీతమవుతాయి. వాటి వల్ల ఉద్భవించే శక్తి, ఇప్పటికన్నా ఎన్నో వేల రెట్లు అధికంగా ఉంటుంది. ఓ పక్క భూ అయస్కాంత పొర, ఓజోన్‌ పొర బలహీనపడటం, ప్రకృతిలో కలిగే మార్పుల వల్ల భూమి విపరీతమైన రేడియేషన్‌కు గురవుతుంది. ఇది 2012నాటికి భరించలేని స్థాయికి చేరుకుంటుంది.
నెంబర్‌3
ఐరోపాలో 27 కిలోమీటర్ల వ్యాసంతో బిగ్‌బ్యాంగ్‌ ప్రయోగం చివరిదశకు చేరుకునే సరికి భూ ఉపరితలంపై బ్లాక్‌ హోల్‌‌స సంఖ్య పెరుగుతుంది. దీని ప్రభావం 2012నాటికి తీవ్రస్థాయిలో భూగోళంపై పడుతుంది.
నెంబర్‌4
క్రైస్తవ మతగ్రంథం బైబిల్‌ కూడా ఇదే చెప్తోంది. 2012లో మంచికి, చెడుకు మధ్య అంతిమ యుద్ధం జరుగుతుందని బైబిల్‌లో పేర్కొన్నారు. చివరకు దేవుడే భూ భ్రమణానికి స్టాప్‌ బటన్‌ నొక్కుతాడని బైబిల్‌ అంటోంది.
నెంబర్‌5
అమెరికాలోని నేషనల్‌పార్‌‌క ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతం 6లక్షల50వేల సంవత్సరాల తరువాత ఒకసారి బీభత్సంగా బద్దలవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఇదే. ఇది బద్దలవుతే భూ వాతావరణం అంతటా బూడిద ఆవరిస్తుంది. అదే జరిగితే సుమారు 15వేల సంవత్సరాల దాకా భూమి మంచు కప్పినట్లు స్తంభించిపోతుంది. భూగర్భ శాస్త్రవేత్తలు ఈ అగ్నిపర్వతం బద్దలవటానికి కూడా 2012 ను ముహూర్తంగా నిర్ణయించారు.
నెంబర్‌6
భూమి చుట్టూ ఉన్న అయస్కాంతపు పొరలో 7లక్షల 80వేల సంవత్సరాలకు ఒకసారి మార్పులు వస్తాయి. ప్రస్తుతం దక్షిణ ధృవం దగ్గర ఈ పొర బలహీనమయి ఉంది. ఇది క్రమంగా మరింత బలహీన పడి భూ రక్షణకు ముప్పు ఏర్పడవచ్చు.
నెంబర్‌7
బర్‌‌కలీ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్తల గణాంకాలు కూడా డిసెంబర్‌ 21, 2012 భూ ప్రక్షాళన జరుగుతుందని చెప్తున్నాయి. ఒక భారీ కెటాస్క్రోపిక్‌ 
ఘటన జరగవచ్చని ఇది 99శాతం జరిగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.
ఈ ఊహాగానాలు ఎలా ఉన్నా 2010 నాటికి దీని లక్షణాలు కన్పిస్తే, 2012 గురించి కంగారు పడాలని, అలా కానప్పుడు దీన్ని పట్టించుకోనవసరం లేదని నిపుణులు అంటున్నారు. లెట్‌ అజ్‌ వెయిట్‌ ఫర్‌ 2010.

7 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

This is all about upcoming English movie 2012.. all is movie publicity.

KumarN చెప్పారు...

I read everyline in the above article!..and then I read your profile with utmost curiosity!

Now, I am not only speachless, but I am scared too!!

అజ్ఞాత చెప్పారు...

Kumar gaaru I too !

అజ్ఞాత చెప్పారు...

Kumar gaaru I too !

అజ్ఞాత చెప్పారు...

ఏదో సినిమాలో సౌందర్య చెప్పినట్లు ఇ ఓ యబ్బో ఇది నా నిక్కర్లు వేసుకునే రోజులనించి వింటూనే ఉన్నా....

kovela santosh kumar చెప్పారు...

చాల మంచి వ్యాఖ్యలు చేసారు. థాంక్స్.

krishna rao jallipalli చెప్పారు...

కుమార్ గారు... నిజం అని నమ్మి ఉన్నదంతా ఖర్చు చేసుకోకండి. నా చిన్నాప్పటి నుండి ఇటువంటివి చాలా చాలా వింటూనే ఉన్నాను. కొంత మంది పని పాటా లేని సన్నాసులు ఇటువంటివి పుట్టిస్తుంటారు. నమ్మొద్దు.