11, ఫిబ్రవరి 2009, బుధవారం

క్రెడిట్ కార్డు కష్టాలు

క్రెడిట్‌ కార్డు ఒకసారి తీసుకున్నారంటే దాని వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కస్టమర్లతో తెలివిగా మాట్లాడి ఊబిలోకి దించడంలో బ్యాంకు ఏజెంట్ల సమర్థతకు సాటి లేదు. ఆ తరువాత కష్టాలన్నీ మొదలయ్యేది. అడక్కుండానే కార్డు జారీ చేసేయడం, టెలిఫోన్‌ ద్వారా కస్టమర్లను ఇబ్బందులకు గురి చేయడం దారుణం. వినియోగదారులకు ప్రధానంగా బ్యాంకు నుంచి ఎదురయ్యే సమస్య నెలవారీ బిల్లులేనని స్పష్టం. బ్యాంకులు కానీ, బ్యాకింగేతర కార్యకలాపాలు నిర్వహించే ఆర్థిక సంస్థలు(ఎన్‌బిఎఫ్‌సి) కానీ వడ్డీ రేటును వార్షిక పద్ధతిన మాత్రమే విధించాలన్నది చట్టం స్పష్టంగా చెప్తోంది. కానీ క్రెడిట్‌ కార్డులు జారీ చేసే కంపెనీలు 2.99 శాతం వడ్డీ రేటును నెలవారీ పద్ధతిన అత్యంత దారుణంగా వసూలు చేస్తున్నాయి. ఎన్‌బిఎఫ్‌సి ప్రకారం వార్షిక పద్ధతిన లెక్కిస్తే ఈ వడ్డీ రేటు సుమారు 35 శాతం ఉండటం నిష్ఠురసత్యం. వడ్డీ రేటుకు మరో 12 శాతం సర్వీసు చార్జీగా వసూలు చేయడం గోరు చుట్టుపై రోకటి పోటు లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్‌ కార్డు కంపెనీలు, బ్యాంకులు లైసెన్‌‌సడ్‌ దోపిడి దొంగల్లా వ్యవహరిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. ఈ వడ్డీ రేటు వ్యవహారంలో మరో మోసమూ దాగుంది. వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలు పైనా 50 రోజుల దాకా వడ్డీ ఉండదని బ్యాంకులు చెప్పేదంతా కూడా పచ్చి బూటకం. స్టేట్‌మెంట్‌ తయారు చేసే నాటికి ఉన్న కొనుగోళ్లన్నింటికీ కలిపి వడ్డీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు వినియోగదారుడి బిల్లు డేటు పదిహేను అయితే, పధ్నాలుగో తేదీన చేసిన కొనుగోలు కూడా స్టేట్‌మెంట్‌లో కలిసి చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీ లెక్కగడతారు. అంటే 50 రోజుల దాకా వడ్డీ ఉండదన్న క్రెడిట్‌ కార్డు సంస్థ వారి తాయిలం, ఆ కొనుగోలుకు వర్తించదన్నమాట. ఇలాంటి చిత్రవిచిత్ర లీలలను దృష్టిలో ఉంచుకునే క్రెడిట్‌ కార్డు సంస్థలు తమ వార్షిక పర్సంటేజీలు, జమాఖర్చుల వ్యవహారంలో మరింత పారదర్శకత ప్రదర్శించాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది.
కార్డులు జారీ చేసే ముందు తీయగా మాట్లాడే బ్యాంకు ఏజెంట్ల విశ్వరూపం బకాయిల వసూలు దగ్గర కానీ బయటపడదు. అడక్కుండానే బలవంతంగా అప్పుల్ని అంటగట్టే బ్యాంకులు ఆ తరువాత బకాయిలను వసూలు చేయడానికి అనేక వేధింపులకు పాల్పడటం అమానుషం. కొన్ని బహుళ జాతి సంస్థలైతే ఏకంగా ఏజెంట్ల పేరుతో ప్రైవేటు సైన్యానే్న నిర్వహిస్తుండటం నిజం. బకాయిల వసూలుకు వినియోగదారులు ఎక్కడ ఉంటే అక్కడికి చొరబడి అప్పు తీర్చే దాకా నక్షత్రకుడిలా వెంటబడటం భరించరాని స్థాయికి చేరుకున్నాయనడానికి దేశంలోని బాంబే హైకోర్టులో నమోదైన కేసులు ప్రత్యక్ష తారా్కణం. వ్యక్తిగత స్వేచ్ఛ అన్నది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని హరించే అధికారం ఎవరికీ లేదు. కానీ, క్రెడిట్‌ కార్డు సంస్థలు మాత్రం నిర్నిరోధంగా ఈ హక్కును హరిస్తున్నాయి. ఒక విధంగా ప్రయివేటు వడ్డీ వ్యాపారులకంటే హేయంగా ఈ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. దేశంలోని అనేక చోట్ల ఏజెంట్లు రౌడీలను, గూండాలను కూడా పెంచి పోషిస్తున్నారంటేనే పరిస్థితి ఏమిటన్నది తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. వీరి కారణంగా కస్టమర్లు శారీరకంగా దాడులను కూడా ఎదుర్కొంటున్న సందరా్భలున్నాయి. ఇలాంటి వేధింపులను అరికట్టాలని కస్టమర్ల డిమాండ్‌ ఇంతకాలానికి రిజర్వుబ్యాంకు దృష్టికి రావడం మంచి సంకేతం. ఈ అంశంపై రిజర్వు బ్యాంకు తీవ్రంగానే స్పందించింది. కస్టమర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని రిజర్వుబ్యాంకు తన మార్గదర్శక సూత్రాల్లో ఖచ్చితంగా పేర్కొనడం క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు పూర్తిగా కాకున్నా, కొంతైనా ఊరట కలుగుతుంది. కనీసం నెలవారీ స్టేట్‌మెంట్లయినా సరిగ్గా సమయానికి అందుతాయా అంటే అదీ లేదు. గడువు తేదీ వరకూ స్టేట్‌మెంట్లు వినియోగదారుడి చేతికి అందని సందరా్భలు కోకొల్లలు. సమయానికి స్టేట్‌మెంట్‌ పంపకుండా, గడువులోగా చెల్లింపు జరగలేదని పెనాల్టీని వేసి వినియోగదారుల ముక్కుపిండి వసూలు చేసే విధానానికి కూడా స్వస్తి పలకాలని ఆర్బీఐ ఆదేశాలు ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాలి. క్రెడిట్‌ కార్డు సంస్థల ఆగడాల్లో అన్నింటికీ మించింది అడక్కుండానే కార్డు ఇవ్వడం... వినియోగదారుడి అనుమతి లేకుండానే కార్డును ఆక్టివేట్‌ చేసి నెల కాగానే బిల్లు పంపించడం... ఇటువంటి చర్యల ద్వారా బలవంతంగా జనాల్ని రొంపిలోకి దింపుతున్నాయి. ఇలాంటి చర్యలు ఇక ముందు చేయడానికి వీల్లేదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. వినియోగదారుడి అనుమతి లేకుండా అతనికి బిల్లు పంపించి బలవంతంగా వసూలు చేసినట్లయితే, సదరు సంస్థ అంతకు రెట్టింపు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం వల్ల వినియోగదారులకు ఈ ఫోన్ల బెడద కాస్తంతైనా తప్పుతుంది. ఆర్‌బిఐ జారీ చేసిన ఈ మార్గదర్శక సూత్రాలతో క్రెడిట్‌* కష్టాలు పూర్తిగా తీరుతాయనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు. ఈ ఆదేశాలు కేవలం ఉపశమనం కలిగించేవి మాత్రమే. అవసరమున్నా లేకుండా స్టేటస్‌ కోసం క్రెడిట్‌ కార్డు తీసుకుని, అనవసర ఖర్చులు చేసి అంతులేని ఆర్థిక చిక్కుల్లో చిక్కుకోకుండా తన్ను తాను కాపాడుకోవలసింది అంతిమంగా వినియోగదారుడేనన్నది కఠిన సత్యం.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వ్యాసవిలాపం బాగుంది. చిన్న సవరణ: వడ్డీ రేటు లెక్కించేది నెలవారీగా కాదు. రోజు వారీగా..!!

అరిపిరాల

cbrao చెప్పారు...

Nice article.In the case of credit cards they are not following daily interest principle of commercial banks. Credit card companies are charging for silly mistakes like paying bills in cash. SCB charges penalty for paying credit card bills in cash.

అజ్ఞాత చెప్పారు...

idi marI chOdyam. kharchu peTTakunTE, nelavAri bills enduku pamputAru. kharchu peTTEsi, bill vachchAka, tIrchakunDA, high interest rates vEstArani complaint cheyyaDam dAruNam. UrikE andarikI 40 days interest free appu ivvAlsina avasaram credit card companies endukunTundi.

O bank lO appu kAvAlanTE, savA laksha formalities unTAyi. tIrchE stOmatha unnA, evaDO guarantee istE gAni ivvaru. adE E mArvADi daggarikainA veLtE, avEm lEkunDA istADu. kAni, vaDDI tO bAdutADu. same principle ikkaDa kUDA.

lAbhAniki taggaTTu risk unTundi. okavELa monthly bill pay chESinA, EdO mistake vallA, pay chEyanaTTugA chUpinchi, CC company vADu himsistE, adi vErE vishayam.