రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువు అన్నది రోజు రోజుకూ డబ్బున్నోళ్ల చదువుగా మారిపోతోంది. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు దొరికే విద్యార్థుల మాటెలా ఉన్నప్పటికీ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల నుంచి ఏ యేటికాయేడు ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులే దాదాపు 30 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అదే యాజమాన్యం కోటా పరిధిలో చేరిన విద్యార్థులు ఇక నుంచి ఏకంగా బాటా లెక్క ప్రకారం లక్షకు ఒక రూపాయి తక్కువ అన్నట్లే ఉంటుంది. దీనికి అదనంగా కము్యనికేషన్‌స స్కిల్‌స అనో, సాఫ్‌ట స్కిల్‌స అనో, కాషన్ డిపాజిట్ అనో రకరకాల పేర్లతో మరో పది వేల రూపాయలు యాజమాన్యాలు గుంజుకుంటాయి. ఇక ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీటు సంగతి చెప్పనే అక్కర్లేదు. కాలేజీకి చెల్లించే డబ్బులు కాకుండా విద్యార్థులకు పుస్తకాలకు.. ఇతరత్రా విడిగా అయ్యే డబ్బులకు లెక్కే ఉండదు. ఇప్పుడున్న ఫీజులతోనే యాజమాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు దండుకుంటున్నాయన్నది నిష్ఠురసత్యం. గత కొనే్నళు్లగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న సీట్లన్నీ భర్తీయే కావడం లేదు. సుమారు పదిహేను వేల సీట్లు ఏటా మిగిలిపోతున్నాయన్నది నిష్ఠుర సత్యం. ఆ ఖాళీ సీట్ల వల్ల నష్టపోతున్న ఆదాయాన్ని ఫీజు పెంపు ద్వారా భర్తీ చేసుకోవాలన్నది యాజమాన్యాల ఊహ కావచ్చు. అయితే ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా స్పందించడం ఆశ్చర్యమేం కాదు. ఇవాళ రేపు ఇంటర్మీడియట్ చదువులకే 40 నుంచి 45 వేల రూపాయల దాకా ఖర్చవుతున్నప్పుడు, ఇంజనీరింగ్‌కు ఆ మాత్రం ఫీజు లేకుండా ఉంటే ఎలా అన్న వాదనకు జవాబు ఉండదు.
రాష్ట్రంలో ప్రస్తుతం 262 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అడ్మిషన్ల కౌన్సిలింగ్ నాటికి మరో పదమూడు కళాశాలలు కొత్తవి రానున్నాయి. మొత్తం కళాశాలల్లో ఇప్పటికి తొంభై రెండు వేల సీట్లు ఉన్నాయి. అయితే చాలా యాజమాన్యాలు తమ కళాశాలలకు సంబంధించిన సౌకరా్యలు, పనితీరుకు సంబంధించిన నివేదికలు సమర్పించకపోవడంతో ఏఐసిటిఇ ఇప్పటికే పదివేల సీట్లను తెగ్గోసింది. వీటికి సంబంధించిన దిగులు యాజమాన్యానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే కౌన్సిలింగ్ నాటికి ఏదో నివేదిక పంపించి ఏఐసిటిఇ ఆమోదం పొందడం వాటికి కష్టమైన పనేం కాదు. ఇక కొత్త కళాశాలలు కూడా తోడైతే మొత్తం సీట్లు అక్షరాలా లక్ష దాటుతాయి. వీటిలో ఇరవై శాతం అంటే సుమారు ఇరవై వేల సీట్లు యాజమాన్యం కోటా(దీనే్న ఎన్‌ఆర్‌ఐ కోటాగా ఇటీవలే మారా్చరు)లో భర్తీ చేస్తారు. ఈ కోటా కింద ఒక్కో విద్యార్థి సుమారు లక్ష రూపాయల దాకా చెల్లించుకోవలసి ఉంటుంది. అంటే యాజమాన్యాలకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం అన్నమాట. కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే సీట్ల ద్వారా మరో మూడు వందల కోట్ల రూపాయల మేర ఆదాయం సుమారుగా వస్తుంది. వెరసి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం అయిదు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందన్నమాట. ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ, అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫ్యాకల్టీలు ఉండవు. వలిక సౌకరా్యల జాడే ఉండదు. నిపుణులైన అధ్యాపకుల నియామకమే జరగదు. మొక్కుబడిగా చదువులు చెప్పి, ఓ పట్టాను చేతిలో పెట్టి వీధుల్లోకి పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పట్టభద్రులైన విద్యార్థుల్లో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ప్రామాణికతను కలిగి ఉంటున్నారని, మిగతా 96 శాతం మంది సగటు విద్యార్థులేనని, వారిలో వృత్తి నైపుణ్యం ఎంతమాత్రం లేదని నాస్‌కామ్ ఓ సర్వేలో తేల్చింది. మరి ఎలాంటి ప్రమాణాలు లేని ఈ చదువులను ఇంతింత ఫీజులు చెల్లించి చదవటం దేనికి?
ఇంజనీరింగ్ విద్యలో ఉన్నత స్థాయి ప్రమాణాలను సాధించేందుకు రకరకాల చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం చాలా ఏళు్లగా చెప్తూనే ఉంది. వాస్తవంగా జరుగుతున్నది మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. నిజం చెప్పాలంటే వృత్తి విద్యకు సంబంధించి ప్రభుత్వానికి ఒక విధానమన్నదే లేదు. ఇంజనీరింగ్, ఎంబిఏ, ఎంసిఏ, బిఇడి వంటి వృత్తివిద్యాకోర్సులకు సంబంధించి సంయుక్తంగా ఒక సమగ్ర విధానాన్ని అనుసరిస్తే ఇన్ని రకాల సమస్యలు వచ్చేవి కావు. కళాశాలల గుర్తింపు, రిజిస్ట్రేషన్, అడ్మిషన్లు, మైనారిటీ కాలేజీలు... ఇలా ఒక్కో అంశానికి ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ పోవడం... ఒక్కో వృత్తి విద్యకు ఒక్కో విధానాన్ని అవలంబించడం లేని పోని గందరగోళానికి దారితీస్తోంది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్తగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న నియమాలను లొసుగులకు తావివ్వకుండా చక్కదిద్దితే చాలు. నియమాలను పటిష్ఠం చేస్తే యాజమాన్యాలకు ఇబ్బంది. అలాంటి ఇబ్బంది కలిగించే పనులను ప్రభుత్వం సహజంగానే చేయదు. పర్యవసానం ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సమయంలో అయోమయం.. సీట్లను భర్తీ చేసే సరికే సగం విద్యాసంవత్సరం పూర్తయిపోతుంది. ఒకటికి రెండుసార్లు.. మూడు సార్లు కౌన్సిలింగ్ జరిగిన సందరా్భలు గతంలో కొల్లలు. గత సంవత్సరం కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత ఓ కళాశాలకు అకస్మాత్తుగా మైనారిటీ హోదా కట్టబెట్టడం వల్ల విద్యార్థులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేయడం కోసం కాకుండా, వారికి ఇంజనీరింగ్ పట్టాలను అము్మకోవడం కోసమన్నట్లుగా కళాశాలల పనితీరు నడుస్తోంది. ఇలాంటి చదువులు చదివినా, చదవకపోయినా ఒకటే. ఇప్పటికైనా ప్రభుత్వం వృత్తివిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే, రాను రాను రాష్ట్ర ఇంజనీర్లకు ఎక్కడా ఉపాధి దొరకని పరిస్థితి తలెత్తినా ఆశ్చర్యపోనవసరం లేదు.
2 కామెంట్‌లు:
అసలు సమస్య సదరు ఇంజనీరింగ్ కళాశాలలకి అనుమతి ఇచ్చే దగ్గర మొదలవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సానుభూతిపరులకి కళాశాలలు పెట్టుకునే పర్మిట్లు పంచేస్తారు .. ఊరికే కాదు, పెద్ద పెద్ద మొత్తాలకి. అంత డబ్బు పెట్టుబడిగా పెట్టి కాలేజీ పెట్టిన వాడి ధ్యేయం వ్యాపారం కాక మరేమవుతుంది? అలా మొదలయ్యేవి మేధావులనందించే కాలేజీలు కావు - పట్టభద్రులనుత్పత్తి చేసే కార్ఖానాలు.
రూల్స్ ప్రకారం ఇంజినీరింగ్ కాలేజిలలో ప్రతి పదిహేను మంది స్టూడెంట్స్ కి ఒక ఫేకల్టీ ఉండాలి. కానీ చాలా ఇంజినీరింగ్ కాలేజిలలో యాభై మంది స్టూడెంట్స్ కి ఒక ఫేకల్టీ ఉండడం కనిపిస్తోంది. ఇంజినీరింగ్ కాలేజిలలో బోధన పద్దతులు నాసిరకంగా ఉన్నాయని తెలిసినా గ్లోబలైజేషన్ కాలంలో ఉద్యోగాలు వస్తాయని భ్రమపడి ఇంజినీరింగ్ కాలేజిలలో చేరడం జరుగుతోంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల గ్లోబలైజేషన్ పై భ్రమలు తగ్గాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళి ఎమ్.ఎన్.సి.లో ఉద్యోగానికి ప్రయత్నించడం కంటే ఉన్న ఊర్లోనే వ్యాపారం పెట్టుకోవడం మంచిది. మిడిల్ క్లాస్ వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోగలరు సరే. మరి పేద వాళ్ళ పిల్లలు సంగతి ఏమిటి? ఉద్యోగం దొరక్కపోతే బైరాగుల మఠాలలో చేరిపోవడమే ఫైనల్ డెస్టినేషనా? డబ్బున్న వాళ్ళ పిల్లలు ఇంజీనీరింగ్ చదువుతుండగా పేదవాళ్ళ పిల్లలు ఇంకా తెలుగు మీడియం స్కూళ్ళలోనే చదువుకునే స్థితిలో ఉన్నారు. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళ కంటే ఇంగ్లిష్ మీడియంలో చదివిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. డబ్బున్న వాళ్ళ పిల్లలు ప్రతిభని కొనుక్కునే స్థితిలో ఉన్నారు కానీ పేదవాళ్ళ పిల్లలకి ప్రతిభ అనేది అందని ద్రాక్ష పండే. ఇప్పుడు ప్రతి చిన్న పట్టణంలోనూ ఇంజినీరింగ్ కాలేజిలు పెట్టిస్తున్నారు. ఆ కాలేజిలలో చదువుకునేది డబ్బున్న వాళ్ళు, హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలేనని అందరికీ తెలుసు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి