4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

ఈ లోటు పూడ్చేదెవరు?

ఒక మహా నేత అర్ధంతరంగా నిష్ర్కమించినప్పుడు ఆ నష్టాన్ని భరించటం అంత సామాన్యమేం కాదు.. జనం గుండెల్లో గూడుకట్టుకునే నాయకులు నూటికో కోటికో ఒక్కరు పుడతారు.. వన్‌మ్యాన్‌ ఆర్మీలాగా తన పని తాను వేగంగా చేసుకుని వెళ్లిపోతారు.. ఒక ఎన్టీరామారావు, ఒక పి.జనార్ధన్‌రెడ్డి.. ఒక వైఎస్‌ఆర్‌. ఇలాంటి వాళు్ల చాలా అరుదుగా చరిత్రలో కనిపిస్తారు..
జనం కోసమే తానుగా.. తానే జనంగా జీవించిన మనీషి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఎవరేమన్నా లెక్కచేయని మనస్తత్వం ఆయనది.. తాను నమ్మిన వాళ్లను ఎలాంటి వారైనా సరే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అక్కున చేర్చుకునే అరుదైన నేత... కాంగ్రెస్‌ పార్టీకే కాదు.. రాషా్టన్రికి లభించిన అపర భగీరథుడాయన... ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను లేకుండా రాషా్టన్న్రి ఊహించుకునే స్థితిలో తెలుగు ప్రజ లేదు.. మరి ఆ లోటు పూడ్చేదెవరు..? అలాంటి నాయకత్వం మళ్లీ సాధ్యమేనా?
================

దాదాపు దశాబ్దం క్రితం మాట.. కాంగ్రెస్‌ పార్టీలో సోనియాగాంధీ విదేశీయతను వ్యతిరేకిస్తూ... కొత్త కుంపటి పెట్టుకున్న శరద్‌పవార్‌ ప్రజాదరణ అపారంగా ఉన్న నాయకులకు కాంగ్రెస్‌లో స్థానం లేనే లేదని వాపోయారు... పదేళ్ల కాలచక్రం గిర్రున తిరిగింది. నాడు పవార్‌ అన్న మాటల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే అవి ఎంత అబద్దాలో ఇవాళ వైఎస్‌ఆర్‌ స్థాయిని, ప్రతిష్ఠను చూస్తే అర్థం అవుతుంది. ప్రాంతీయంగా, అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడుగా, కాంగ్రెస్‌ అధిష్ఠానాన్నే శాసించగలిగే స్థాయిలో ఎదిగిన నాయకుడు వైఎస్‌ఆర్‌...అలాంటి నాయకుడిని ఎదిగేలా చేసిన పార్టీ.. అంతటి నాయకత్వాన్ని తిరిగి సాధించటం తేలికేమీ కాదు...
1.
మహానేత మహాభినిష్ర్కమణం జరిగిపోయింది. ఎవరు ఆపాలనుకున్నా అందనంత దూరానికి జన హృదయనేత వెళ్లిపోయాడు.. ప్రతి కుటుంబం శోకతప్త హృదయంతో తపించిపోతున్నది. తమ అభిమాన నేత ఇక లేరని తెలిసి 68 హృదయాలు స్పందించటం మానేశాయి. నేల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయింది. అగాధం ఏర్పడింది. ఈ అగాధాన్ని ఇక పూడ్చేదెవరు? అంతటి జననేతను సమీకరించుకోవటం రాషా్టన్రికి, కాంగ్రెస్‌ పార్టీకి సాధ్యమేనా? ఒంటిగా ముందుకు వెళ్లి ముపై్ఫమూడు మంది ఎంపిలను గెలిపించిన బలమైన నాయకుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇంకెవరున్నారు? ఇప్పుడు అధిష్ఠానాన్ని, రాష్ట్ర పార్టీని అమితంగా వేధిస్తున్న ప్రశ్న... ఎవరికి వారు అప్పుడే వైఎస్‌ఆర్‌ వారసత్వంపై తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు.. రకరకాల పేర్లు ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు.. మహానాయకుడికి నివాళులు అర్పిస్తూనే, తరువాత ఎవరు? అన్న దానిపై చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఎందుకిలా? పార్టీలో, ప్రజల్లో వైఎస్‌ వారసత్వంపై ఇంత ఆందోళన అవసరమా?

2004కు ముందు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో వరుసగా విఫలమవుతున్న నాయకుడు.. 1994లో ఆయన నేతృత్వంలో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్‌ ఘోరంగా పరాజయం పాలైంది. కేవలం 26 సీట్లే గెలుచుకోగలిగింది. 99లోనూ పెద్దగా సాధించింది ఏమీ లేదు.. 2004లోనూ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వైఎస్‌పై పెద్దగా నమ్మకం లేదు.. దీనికి తోడు రాష్ట్ర పార్టీలో ఆయన మూటగట్టుకున్న వ్యతిరేకత అంతా ఇంతాకాదు..
2003 నాటికి పరిస్థితి క్రమంగా వైఎస్‌కు అనుకూలంగా మారుతూ వచ్చింది.. 68 రోజుల పాటు వందలాది కిలోమీటర్లు నిర్వహించిన పాదయాత్ర వైఎస్‌ను అమాంతంగా జననేతగా మలచింది. కాంగ్రెస్‌లో ఆయన స్థాయి పెరుగుతూ వచ్చింది. మౌనంగానే ఆయన ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చారు.. 2004 ఎన్నికల్లో లెఫ్‌‌ట, టిఆర్‌ఎస్‌లతో పొత్తు పెట్టుకుని గెలిచిన తరువాత వైఎస్‌ నాయకత్వానికి తిరుగులేకుండా పోయింది. అప్పుడంతా పొత్తువల్లే గెలుపు సాధ్యమైందనుకున్నారు... తరువాత పార్టీలో ప్రతిఒక్కరిపైనా పట్టు సాధించారు.. 2008 ఉప ఎన్నికల తరువాత పరిస్థితి అంతా మారిపోయింది. టిఆర్‌ఎస్‌ను మట్టి కరిపించి ఆరు సీట్లు గెలుచుకోవటంతో వైఎస్‌ను సోనియా పూర్తిగా విశ్వసించారు.. 2009 ఎన్నికల్లో అంతా ఆయన కోరుకున్నట్లే జరిగింది. మాటిచ్చిన మేరకు 33 మంది ఎంపిలను గెలిపించుకొచ్చారు. కాంగ్రెస్‌లో అధిష్ఠానానికి విధేయులుగా ఉండే నాయకులే అందరికీ తెలుసు. కానీ, అధిష్ఠానాన్ని సైతం శాసించగల నేతగా వైఎస్‌ ఎదగడం ఒక చరిత్ర..

వైఎస్‌ కంటే ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులది మూ్యజికల్‌ చైర్‌ టైప్‌ రాజకీయాలు.. సిఎంలను తరచూ మార్చే అరాచక రాజకీయానికి నాటి కాంగ్రెస్‌ పెట్టింది పేరు.. వైఎస్‌ ఆ చరిత్రనే మార్చేశారు.. వన్‌మ్యాన్‌ ఆర్మీలాగా అన్నీ తానే అయి నడిపించారు.. చివరకు అధిష్ఠానానికి వైఎస్‌తో రాజకీయంగా వ్యవహరించటం కంటే ఆయన మానాన ఆయన్ను వదిలేయటమే మంచిదన్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించటమే కాకుండా, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఆర్థికంగా, సంఖ్యాపరంగా కూడా బలోపేతం చేసిన నేత వైఎస్‌.

మరో కోణంలో ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి.. ఎన్టీయార్‌లో ఉన్న ఆకర్షణ వైఎస్‌కు లేకపోవచ్చు... కానీ సంక్షేమ దృక్పథంలో వైఎస్‌కు సాటిరాగల వారు లేరు.. ఆమ్‌ ఆద్మీ మద్దతును దృష్టిలో ఉంచుకుని నడిపించిన రాజకీయం ఆయన్ను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు అలాంటి నాయకుడు కాంగ్రెస్‌కు దొరకటం కష్టం. వైఎస్‌ వచ్చాక కాంగ్రెస్‌లోని సీనియర్‌ తరం అంతా స్తబ్దుగా ఉండిపోయింది. వైఎస్‌ స్థాయిలో కాంగ్రెస్‌కు బలాన్నివ్వగల వారు ఎవరన్నది అంతుపట్టనిది. ఆయన వారసుడిగా జగన్‌ను రంగం మీదకు అప్పుడే ఒక లాబీ తీసుకువచ్చింది. ఒక బలహీనమైన నాయకుడిని అకస్మాత్తుగా తెరమీదకు తెచ్చి సిఎం కుర్చీపై కూర్చోబెట్టే పరిస్థితి గతంలో ఉండేదేమో కానీ, ఇప్పటి కాంగ్రెస్‌కు లేదు. యువకుడైన జగన్‌ను వారసుడిగా చేస్తే, వైఎస్‌ స్థాయికి ఎదగ గలరా అన్నది మరో ప్రశ్న.. ఆయనకున్న రాజకీయ అనుభవం కేవలం వంద రోజులే.. కొద్ది రోజుల్లో గ్రేటర్‌ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాయకుడిని చేస్తే ఎంతవరకు లబ్ది పొందగలరన్నది అనుమానం.. ఇంకోవైపు 2014 నాటికి కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ గాంధీని ఇప్పటినుంచే ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాషా్టల్ల్రో యువ నాయకత్వాన్ని ఎదగనివ్వటం రాహుల్‌కు అవసరం. మరి కాంగ్రెస్‌ అధిష్ఠానం వూ్యహం ఎలా ఉంటుందో వేచి చూడాలి...

కామెంట్‌లు లేవు: