9, సెప్టెంబర్ 2009, బుధవారం

సంకుల సమరం

కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు తలపండిన రాజకీయ విశ్లేషకుడికైనా ఒక పట్టాన అర్థం కావు... జాతీయ రాజకీయ సమీకరణల చట్రంలోనే ప్రాంతీయ రాజకీయాలను బేరీజు వేసుకుంటుంది. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎప్పుడు అధికారం అప్పజెప్పాలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం నిర్ణయానికి ఎవరైనా తలొగ్గాల్సిందే... ఒత్తిళు్ల వచ్చినా, లాబీయింగ్‌ జరిపినా.. కాంగ్రెస్‌ నేతృత్వం తాను అనుకున్నదే చేస్తుంది... అయితే మన రాష్ట్రంలో వైఎస్‌ ఈ పద్ధతిని సమూలంగా మార్చేశారు.. తానే అధిష్ఠానం అన్నంతగా ఎదిగిపోయారు.. ఇప్పుడాయన లేరు.. ఆయన ఉన్నప్పుడు ఓ పక్కగా ఒదిగి ఉన్న పాములన్నీ ఇప్పుడు బుసలు కొడుతున్నాయి... ఈ పరిస్థితిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎలా హ్యాండిల్‌ చేస్తారు?

.....
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీది ఓ విభిన్నమైన సంస్కృతి...ఏ చిన్న నిర్ణయానై్ననా అధిష్ఠానం ఆమోద ముద్ర లేకుండా రాష్ట్ర స్థాయిలో తీసుకోవటం ఏ నాయకుడికీ సాధ్యం కాని విషయం... రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే పనిని మరో రాషా్టన్రికి చెందిన నాయకుడికి అప్పజెప్తారు.. నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతాయి.. ఎవరెన్ని లాబీలు నడిపినా అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే సుప్రీం... అసమ్మతులు... అసంతుష్ఠులనూ ఓ పక్క ప్రోత్సహిస్తూనే.. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు చెక్‌ పెట్టి నడిపించటం కాంగ్రెస్‌ ప్రత్యేక సై్టల్‌...
2.
కాంగ్రెస్‌ పార్టీ అంటే ఓ మహా సముద్రం.. సముద్రంలో అనేక జీవరాశులు ఉన్నట్లే... కాంగ్రెస్‌లోనూ రకరకాల మనస్తత్వాలున్న నేతలు ఉంటారు.. అధికారం, లాబీయింగ్‌, ముఠాలు, గ్రూపులు, కొట్లాటలు... ఆందోళనలు కాంగ్రెస్‌ రక్తంలో జీర్ణించుకుపోయిన పదాలు.. అవి లేకుండా ప్రశాంతంగా రాజకీయం నడపడం కాంగ్రెస్‌ నేతల వల్ల అయ్యేపనే కాదు.. ఏ నాయకుడైనా, ఏదైనా మాట్లాడవచ్చు. ఎవరినైనా నిందించవచ్చు. ఎవరికి వ్యతిరేకంగానైనా గ్రూపులు కట్టవచ్చు... ప్రతి నాయకుడికీ ఆ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది. కుము్మలాటలు ఎనై్ననా అధిష్ఠానం పట్టించుకోదు.. కాంగ్రెస్‌లో ఉండేందుకు ఎవరికైనా ఉండాల్సిన అర్హత ఒక్కటే.. అది నెహ్రూ కుటుంబం పట్ల అపారమైన విధేయత... లాయల్టీ అన్నదే కాంగ్రెస్‌లో నాయకుడు కావటానికి ఏకైక ప్రాతిపదిక... నెహ్రూ కుటుంబం పట్ల, వారి వారసుల పట్ల విధేయంగా ఉంటూనే కాంగ్రెస్‌లో రాజకీయాలు నడపవచ్చు. పార్టీలోని నేతలంతా ఈ రకమైన ధోరణికి అలవాటు పడే ఉంటారు..
అధిష్ఠానం కూడా ప్రాంతీయ స్థాయిలో నాయకులపై ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతూనే ఉంటుంది. మన రాష్ట్ర పార్టీ వ్యవహారాలను కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీనో.. అంతకు ముందు దిగ్విజయ్‌ సింగ్‌ చూసినట్లే.... మరో రాష్ట్రంలో మరొకరు ఆధిపత్యం చెలాయిస్తారు...నేతలంతా పార్టీ అధ్యక్షురాలికో... మొయిలీకో విధేయంగా ఉంటారు తప్ప... పిసిసి అధ్యక్షుడికి ఎంతమాత్రం ఉండరు.. అవసరమైతే ఆయనకే వ్యతిరేకంగా డౌన్‌డౌన్‌ నినాదాలు చేసేస్తుంటారు..

ఇందిరా గాంధీ హయాం నుంచీ కాంగ్రెస్‌లో ఈ రకమైన సంస్కృతి అధికమైంది... ఆమె అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి కాంగ్రెస్‌లో కుము్మలాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్‌ రెండుగా చీలిక కావటమూ అప్పుడే జరిగింది. పార్టీని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవటానికి ఇందిరాగాంధీ చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచీ పార్టీని తనదైన సై్టల్‌లో చక్కబెట్టుకొచ్చారు.. తాను తప్ప మరో వాయిస్‌ లేకుండా చేసుకోగలిగారు.. రాషా్టల్ల్రో ప్రజాదరణ ఉన్న మరో నాయకుడు శక్తిమంతుడు కాకుండా చూడటంలో ఆమె సక్సెస్‌ అయ్యారు.. రాషా్టల్ల్రో తరచూ ముఖ్యమంత్రులను మార్చే పద్ధతీ ఆమే ప్రారంభించారు.. ఏ ముఖ్యమంత్రి ఎంతకాలం ఆ పదవిలో ఉంటారో తెలియని అభద్రతాభావాన్ని కల్పించి అధిష్ఠానానికి విధేయులుగా ఉండేట్లు చేసుకున్నారు.. పివి నరసింహరావు, జలగం వెంగళరావు, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్థనరెడ్డి ఎవరూ కూడా పూర్తికాలం ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన వారు కారు.. రాజీవ్‌ గాంధీ కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తూ వచ్చారు.. ఓ మూ్యజికల్‌ చైర్‌ ఆట లాగా సిఎంల మార్పిడి జరుగుతూ వచ్చింది.

కాంగ్రెస్‌ రాజకీయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరిని ఎలా ఎంపిక చేసుకుంటారో.. ఎలాంటి సమీకణాలను అంచనా వేసుకుంటారో ఒక పట్టాన విశ్లేషించటం సాధ్యం కాదు... మహారాష్టన్రే ఉదాహరణగా తీసుకుంటే... అయిదేళ్ల క్రితం సుశీల్‌కుమార్‌ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లారు.. తీరా ఎన్నికలు ముగిసి కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చాక విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ను ముఖ్యమంత్రిని చేశారు.. నిరుడు ముంబైపై టెరర్రిస్టుల దాడి అనంతరం అప్పటివరకు ఒక సామాన్య మంత్రిగా ఉన్న అశోక్‌చౌహాన్‌ను అనూహ్యంగా తెరమీదకు తీసుకువచ్చి ముఖ్యమంత్రి సీటుపై కూర్చోబెట్టారు.... అశోక్‌చౌహాన్‌ సిఎం అవుతారని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు... అంతెందుకు రాష్టప్రతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనుకున్నప్పుడు ప్రతిభాపాటిల్‌ పేరును ఎవరైనా ఊహించారా? లేదు.. అంతెందుకు.. గత ఎన్నికలకు ముందు మన పిసిసి అధ్యక్షుడుగా డి.శ్రీనివాస్‌ను నియమించటం కూడా అనూహ్యమే... ఆయన సోనియాను కలిసి వచ్చేంత వరకూ కూడా ఎవరికీ సమాచారం లేదు.. కాంగ్రెస్‌ అధిష్ఠానం రాజకీయం సై్టలే అంత...
అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందన్నది ఎలాగూ అనూహ్యం... రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయాలు ముళ్ల పొదలా సంక్లిష్టంగా ఉంటాయి. ముల్లు గుచ్చుకోకుండా లోపలికి చొచ్చుకుపోవటం అసాధ్యమైన పని... అందితే జుట్టు.. అందకపోతే కాళు్ల అన్నట్లుగా కాంగ్రెస్‌లో అనేక మంది నాయకుల తీరు ఉంటుంది. ప్రత్యర్థిని ఎదురుదెబ్బతీయటానికి కాంగ్రెస్‌లో నాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.. కేంద్రంలో రాజకీయాలను చక్కబెట్టడం ఒక ఎతె్తైతే... మన రాష్ర్ట రాజకీయాలను గాడిలో ఉంచటం అధిష్ఠానానికి పెద్ద సవాలు... వైఎస్‌ అంత్యక్రియలకు ముందే పార్టీలో ప్రారంభమైన సంక్షోభం ఇందుకు తార్కాణం.
కాంగ్రెస్‌లో అధిష్ఠానం సర్వాంతర్యామి అనీ, అధినేత్రిని ఎవరూ సవాలు చేయలేరన్న విషయంలో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు... ఏ నిర్ణయమైనా కాంగ్రెస్‌లో అధినేత్రి ఇష్టానుసారమే జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఇందిరాగాంధీ కాలం నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాలు నిత్యం సంకుల సమరంలాగా ఉండేవి... ఒకరు ఓ మెట్టు ఎక్కితే రెండు మెట్లు కిందకు లాగే వాళు్ల కొల్లలు.. కోరిన నేతకు ప్రాధాన్యం ఇవ్వలేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌నే తగులబెట్టిన ప్రబుద్ధులు కాంగ్రెస్‌లో ఉన్నారు.. తమ పార్టీ కార్యాలయాన్ని తామే విధ్వంసం చేసిన కార్యకర్తలున్న కాంగ్రెస్‌ ఇది.

1989లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి కాంగ్రెస్‌ మూ్యజికల్‌ చైర్‌ రాజకీయాలకు పరాకాష్ట. 1989లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తరువాత రెండేళ్లయినా ఆయన్ను అధికారంలో ఉండనివ్వలేదు.. ఆ తరువాత నేదురుమిల్లి జనార్ధనరెడ్డి సిఎం అయినా అదే పరిస్థితి.. చివరి దశలో కోట్ల విజయభాస్కరరెడ్డి తన చేతుల మీదుగా ఎన్టీరామారావుకు అధికార పీఠాన్ని అప్పజెప్పారు.. అప్పుడు కాంగ్రెస్‌లో అతి పెద్ద అసమ్మతి వాదిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరుమోశారు కూడా..... కాంగ్రెస్‌ యంగ్‌టర్‌‌కలతో ప్రత్యేక వర్గం ఏర్పాటైంది... పివి నరసింహరావు లాంటి వ్యక్తి కూడా ఆయన్ను పక్కన పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు... అంతకుముందు 1978లో కూడా అయిదేళ్లలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు.. చివరకు కాంగ్రెస్‌ అంటేనే ముఖ్యమంత్రులను మార్చే పార్టీగా ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. ప్రభుత్వంలో నిత్యం అస్థిరత నెలకొని ఉండటం, ముఖ్యమంత్రుల్లో అభద్రతాభావం ఉండటం తెలుగుదేశం పార్టీ కి వరంగా మారింది. కాంగ్రెస్‌లో అస్థిరత్వం తెలుగుదేశానికి అప్పనంగా అధికారం వచ్చేలా చేసింది.

వైఎస్‌ పాదయాత్రతో పదేళ్ల విరామం తరువాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చాలా ఆవేశంతోనే ఉన్నారు.. వెనుకటి దూకుడును కొనసాగించారు..ముఖ్యమంత్రి పదవికి వైఎస్‌తో నాడు పోటీపడిన వారు చాలా మందే ఉన్నారు... అప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడుగా ఉన్న డిఎస్‌కూడా రేసులో చాలా దూరమే దూసుకుపోయారు.. కానీ.. వైఎస్‌ వూ్యహం ఆయన్ను తిరుగులేని నాయకుడుగా నిలబెట్టింది. వైఎస్‌ తానే అధిష్ఠానం అన్నట్లుగా రాష్ట్రంలో వ్యవహరించారు.. ఆరేళ్ల పాటు అన్నీ తానే అయి నడిపించారు కూడా... అయితే ఇక్కడా అధిష్ఠానం ఆయనకు చెక్‌ పెట్టిన సందర్భాలు లేకపోలేదు.. అధిష్టానానికి తన వూ్యహాల్ని, ఎత్తుగడలని చెప్పి కన్విన్‌‌స చేసుకున్న సందర్భాల్లో ఆయన మాట చెల్లింది. అయితే అన్ని సందర్భాల్లో అది జరగలేదన్నది మాత్రం నిర్వివాదం... తన ప్రాణస్నేహితుడు కెవిపి రామచంద్రరావుకు రాజ్యసభ టిక్కెట్‌ ఇప్పించుకోవటానికి వైఎస్‌ నాలుగేళు్ల వేచి చూడాల్సి వచ్చింది... ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ అధిష్ఠానంతో వ్యవహరించటం ఎంతటి నాయకుడికైనా అంత తేలిక కాదు.. అధినేత్రి సోనియాను కలవటమే మహద్భాగ్యంగా భావించే వ్యవస్థ అది. అలాంటి అధినేత్రిని ఒప్పించి, మెప్పించి అధికారాన్ని అందుకోవటం ఆ పార్టీలో ఏ నాయకుడికైనా గొప్ప విజయమే....
3
వైఎస్‌ జీవించి ఉన్నంత కాలం అధిష్ఠానానికి ఎలాంటి సందిగ్ధత ఎదురుకాలేదు.. వైఎస్‌ పై పూర్తి నమ్మకంతో రాష్ట్ర రాజకీయాలను అంతగా పట్టించుకోలేదు. వైఎస్‌ మాటపైనే అంతా నడిచింది. ఇప్పుడు ఇంత సంక్షోభ పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటోంది..? వైఎస్‌ వారసుడి ఎంపిక చేయటం అధిష్ఠానానికి తలబొప్పి కట్టించటానికి కారణం ఏమిటి?
2004లో వైఎస్‌ ఓ యుద్ధభూమిలో అడుగుపెట్టినట్లు అధికారంలోకి వచ్చారు.. అప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్‌, జూనియర్‌ తరమంతా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నది. అలాంటి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటానికి వైఎస్‌ చాలానే శ్రమించాల్సి వచ్చింది. ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ చివరకు రాష్ర్టంలో ప్రత్యామ్నాయమే లేకుండా చేశారు.. ఇప్పుడు అకస్మాత్తుగా వైఎస్‌ మరణించటంతో కాంగ్రెస్‌ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో వైఎస్‌కు దీటైన నాయకుడు దొరుకుతారా అన్నది కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వాన్ని ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న... ఎవరికి వారు సిఎం కుర్చీకోసం లాబీయింగ్‌ నడుపుకుంటున్నా.. అధ్యక్షురాలు మాత్రం ప్రస్తుతం మౌనాన్నే ఆశ్రయించారు.. ఆమెను కలిసిన నేతలు మాత్రం అంతా అమ్మ ఆదేశాల ప్రకారమే జరుగుతుందని చెప్పుతున్నారు..

వైఎస్‌ భౌతిక దేహం ఇంకా ఆయన నివాసానికి చేరుకోకముందే వారసుడిగా జగన్‌ను ఎంపిక చేయాలంటూ ఆందోళన ప్రారంభమైందంటే... వైఎస్‌ అనుచరగణం ఎంత అభద్రతాభావానికి గురైందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు వైఎస్‌ పార్థివ దేహాన్ని తీసుకువస్తున్న సందర్భంలోనే ఎమ్మెల్యేలు, ఎంపిలు లేక్‌వూ్య గెస్‌‌టహౌస్‌లో సమావేశాలు పెట్టుకున్నారు.. సంతకాల ఉద్యమం చేపట్టారు.. జగనే మా నాయకుడన్నారు.. ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలన్నారు..

ఓ పక్క క్యాంపు కార్యాలయంలో నివాళులర్పిస్తూనే సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ వ్యవహారంపై పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ వ్యతిరేకంగా వ్యాఖ్యానించినందుకు ఆయనపై కార్యకర్తలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు...గాంధీభవన్‌లో సంతాపసభ జరిగినప్పుడు వీరంగం సృష్టించారు.. డిఎస్‌ మైకు వదిలి వెళ్లిపోయేంతవరకు వదిలిపెట్టలేదు.. దీంతో ఆయన, జానారెడ్డి కలిసి క్యాంప్‌ ఆఫీసుకు వెళ్లి జగన్‌ను పరామర్శించి రావలసి వచ్చింది. జానారెడ్డి మరో అడుగు ముందుకేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ లేఖ కూడా రాశారు.. జగన్‌కు అనుకూలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇప్పటికే బలంగా వాదిస్తూ వస్తున్నారు.. సోనియాగాంధీని కలిసి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు....అమ్మదే తుది నిర్ణయమంటూనే... జగన్‌ను సిఎం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు...
జగన్‌ను ఎంపిక చేయడమా లేదా అన్నది ఇప్పుడు అధిష్ఠానం ముందున్న రాజకీయ సమీకరణలపై ఆధారపడి ఉంటుంది. సమీప భవిష్యత్తులో గ్రేటర్‌ ఎన్నికలు జరుగనున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలూ ముంచుకు వస్తున్నాయి... ఈ నేపథ్యంలో జగన్‌ను సిఎంను చేయటం వల్ల పార్టీకి ఎంతవరకు ప్రయోజనం అన్నది అధినేత్రి ఆలోచిస్తున్న అంశం.. జగన్‌ను కాకుండా మరొకర్ని ఎంపిక చేస్తే... అన్ని వర్గాలను కలుపుకుని పోయి, ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టగల సామర్థ్యం ఎవరికైనా ఉందా? జగన్‌ను సిఎంగా ఎంపిక చేయకపోతే.. తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంతమంది ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సపోర్‌‌ట చేస్తున్న తరుణంలో జగన్‌ను కాదంటే పార్టీలో చీలిక ఏర్పడే ప్రమాదాన్నీ అధిష్ఠానం సంకోచిస్తోంది. అన్ని పరిణామాలను అంచనా వేసుకున్న తరువాతే సోనియా తుది నిర్ణయానికి రావచ్చని కాంగ్రెస్‌ నేతలు ఊహిస్తున్నారు.. పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, సోనియా నిర్ణయమే తుది నిర్ణయం.. ఆమె నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్లే సాహసం చేయగల సమర్థులు ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో లేరనే చెప్పాలి...

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

జగన్ C.M కావదం అన్నది ఆంధ్రప్రదేశ్ కి అవసరం లేదేమో కాని కంత్రి పార్టి లాంటి కాంగ్రెస్ కి అలానే Y.S.R నమ్మిన బంటులకు , వారసులకు చాల అవసరం. Y.S.R అమలు చెసిన పథకాలు రోశయ్య గారు ఎలాను continue చేస్థారు. అందులో ఇసుమంతైన doubt లెదు. మరి అలంతప్పుదు పిల్లకాయ జగన్ C.M అవడం ఎందుకో??

raviteja చెప్పారు...

చాలా బాగా విశ్లేషించారు.. ముఖ్యంగా 1989లో జరిగినవాటితో ముడిపెట్టినప్పుడు.. :) !

letz hope 4 a better andhra :) !!

SURESH చెప్పారు...

CAHLA BAAGUNDI