14, జూన్ 2011, మంగళవారం

తెలంగాణ హుళక్కే...హ్యాట్సాఫ్‌ టు ఎస్‌ఏ

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇక రానట్టేనా? అధిష్ఠానంపై ఎస్‌.ఏ. లాబీయింగ్‌ బలంగా పనిచేసినట్టు స్పష్టం అవుతోంది.. కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం ప్రస్తుత పోకడలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతోంది. యుపిఏ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాందీని కానీ మేనేజ్‌ చేయటంలో ఎస్‌ఏ పూర్తిగా సక్సెస్‌ అయింది. అటూఇటూ తిరిగి నికృష్ట కమిటీ చేత ఎస్‌ఏ రాయించుకున్న నివేదికలోని ఆరో సిఫార్సునే అమలు చేయబోతోంది.. ఇప్పుడు కేంద్రంలో డార్జిలింగ్‌ తరహా పరిష్కారాన్ని తెలంగాణాకు అపెユ్ల చేయటం.. గూర్ఖాలాండ్‌ తరహాలో ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి మండలిని విస్తృత అధికారాలతో.. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించటం ద్వారా టి.కాంగ్రెస్‌ నేతల నోళ్లు మూయించాలని కాంగ్రెస్‌ డిసైడ్‌ అయిపోయింది.. గులాంనబీ ఆజాద్‌ విదేశాల నుంచి తిరిగి రాగానే వచ్చే వారంలో ఈ ప్రతిపాదనను వాళ్లకు చెప్పి ఒప్పిస్తారు.. వీళ్లు గొర్రెలు కాబట్టి మెడలూపి వచ్చేస్తారు. నికృష్ట కమిటీ తన ఆరో ప్రతిపాదనలోనూ చెప్పింది ఇదే.. ఓ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం.. దానికి రాజ్యాంగబద్ధత కల్పించటం.. దానికో చైర్మన్‌ను కేబినెట్‌ హోదాతో నియమించటం.. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందాన్ని పక్కాగా అమలు చేయటం..ఇవన్నీ ఆరో ప్రతిపాదనలో చక్కగా ఉన్నవే..

1956 ఫిబ్రవరిలోనే పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.. అప్పటికి ఇంకా రెండు రాష్ట్రాలు విలీనం కాలేదు.. నవంబర్‌ లో రెండు రాష్ట్రాలు విలీనమయ్యాయి. కానీ, ఆగస్టు నాటికే.. అంటే ఆంధ్రప్రదేశమనేది ఏర్పాటు కావటానికి ముందే ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కేశారు. ఇక రీజనల్‌ మండలి.. దానికి ఓ చట్టబద్ధత కల్పిస్తారట.. ఆ చట్టబద్దత ఎలాంటిదంటే.. తెలంగాణాకు ఏం కావాలో అది సమైక్యరాష్ట్ర శాసనసభకు సిఫార్సులు చేయవచ్చంట.. ఆ సిఫార్సులను సభ చర్చించి ఆమోదిస్తే అమలవుతాయి.. లేకపోతే లేదు.. సభలో మెజార్టీ ఎవరుంటారు? ఎస్‌ఏ.. ఆమోదించాల్సింది ఎస్‌ఏ.. వాళ్లు ఆమోదించరు.. అవి అమలు కావు.. వివాదం ఏర్పడితే.. రీజనల్‌ మండలి చైర్మన్‌ ముఖ్యమంత్రి, స్పీకర్‌, గవర్నర్‌ అధ్యక్షతన ఉన్న కమిటీ పరిష్కరిస్తుంది.. ఇది తెలంగాణా అభివృద్ధికి వర్కవుట్‌ అయ్యే ఫార్ములా.. ఆహా.. ఎంత గొప్ప సిఫార్సు.. ? ఈ మండలి ప్రయోగం ఇప్పటిది కాదు. రాష్ట్రం ఏర్పాటుకు ముందే మండలి ఏర్పాటు జరిగింది.. దానికి ఇవాళ్టికీ దిక్కూమొక్కూలేదు..ఈ ప్రయోగాలన్నీ విఫలమైన తరువాతే రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం రంగంమీదకు వచ్చింది. పి.చిదంబరం పెద్ద పోటుగాడిలాగా యూనియన్‌ హోం మినిస్టర్‌ హోదాలో డిసెంబర్‌ 9న ప్రకటన చేసేశారు. . తెల్లవారి ట్రబుల్‌ షూటర్‌ అని పేరుపెట్టుకున్న ప్రణబ్‌ పార్లమెంటులో హామీ ఇచ్చేశారు.. తీరా ఎస్‌ఏ సూట్‌కేసులు వచ్చేసరికి అంతా ముఖం యుటర్న్‌ తీసుకున్నారు.. గొప్ప నిజాయితీపరుడని తెగ పొగిడేసిన శ్రీకృష్ణ లాంటివాడే నికృష్టంగా కవర్లను అందుకున్నప్పుడు వీళ్లెంత? ఇక లోకల్‌ తెలంగాణ లీడర్లను మేనేజ్‌ చేయటం పెద్ద కష్టమా? తెలంగాణ నాయకత్వాన్ని అవసరార్థం ఆందోళనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చేశారు. తెలంగాణ నాయకత్వంతోనే ఉద్యమంపై నివురు కప్పేలా చేశారు.. అది అందులోనే చల్లారేలా చేసేందుకు తెగ కష్టపడుతున్నారు. నివురు చాటున ఉద్యమం ఉక్కిరిబిక్కిరవుతోంది.. నీచమైన నాయకత్వం ఉద్యమాన్ని హైజాక్‌ చేసుకున్నంతకాలం ఇలాగే సాగుతుంది. ఆ నాయకత్వం కబంధ హస్తాల నుంచి అది బయటపడ్డప్పుడు.. జన ప్రళయం తప్పదు.. గతంలో ఇడ్లీసాంబార్‌ గోబ్యాక్‌ అన్న నినాదం విధ్వంసాన్ని సృష్టించింది.. ఇప్పుడు ఆంధ్రాగోబ్యాక్‌ అన్న నినాదమే తలెత్తితే ఆ సంక్షోభాన్ని నియంత్రించటం ఈ నాయకత్వం వల్ల అయ్యే పనేనా?

31 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

నికృష్ట కమిటీని టి‌ఆర్‌ఎస్ నమ్మడమే అతి పెద్ద తప్పు. పాలక వర్గం ఇచ్చే రెమ్యూనరేషన్ తీసుకుని పని చేసే కమిటీ పాలక వర్గానికి అనుకూలంగానే నివేధిక వ్రాస్తుందని ఏడాది క్రితం నేను చెప్పినప్పుడు జడ్జిగా పని చేసిన అనుభవం ఉన్న శ్రీకృష్ణ మీదే నీకు అనుమానమా అని కొందరు నన్ను తిట్టారు. కానీ నేను చెప్పినదే నిజమయ్యింది.

అజ్ఞాత చెప్పారు...

"గొప్ప నిజాయితీపరుడని తెగ పొగిడేసిన శ్రీకృష్ణ లాంటివాడే నికృష్టంగా కవర్లను అందుకున్నప్పుడు వీళ్లెంత?"

అవునవును మనక్కావలసినట్టు నివేదిక రాకపోతే వాడు లంచగొండే. తెలంగాణా వాడైనా సమైక్యాన్ధ్రకి మద్దతు తెలిపితే వాడు ద్రోహే. వాడికి స్వంత అభిప్రాయాలు ఉండకూడదు. ఆంధ్రా గో బ్యాక్ నినాదమా? గుడ్ జోక్.

అజ్ఞాత చెప్పారు...

>> నికృష్ట కమిటీని టి‌ఆర్‌ఎస్ నమ్మడమే అతి పెద్ద తప్పు>

ప్రవీణు , తెలంగాణా అంటే టిఆర్ఎస్ , టిఆర్ఎస్ అంటే తెలంగాణా అనుకుంటున్నావా ఏందీ ?

అజ్ఞాత చెప్పారు...

కోవెల సంతోష్ కుమార్,

మీరు తగ్గొద్దు. ప్రత్యేక తెలంగాణ దేశం కావాల్సిందే, గిచ్చుడో సచ్చుడో, గౌరవాలు దెబ్బతిన్నాయ్ , మనస్థాపాల్ దెబ్బతిన్నాయ్, మా యాస వేరు, మేము కాఫీ తాగం ఇరాని చాయ్ తాగుతం, గాబట్టి మా సంస్కృతి వేరే .. లాంటి 'న్యాయబద్దమైన', 'నిజాయతీతో' కూడిన, గొంతెమ్మ కోర్కెలతో పోరాటం చేయున్రి. ఆంధ్రోళ్ళం మద్దతిస్తాం. తెలంగాన వస్తే మేము పక్కలోనే ఫారిన్ వెళ్ళి రావచ్చు. :)) :P

అజ్ఞాత చెప్పారు...

ఆరెంటికీ తేడా తెలిస్తే ఇట్లెందుకుంటడు? ఎప్పుడో పిచ్చికుదిరి పెళ్ళి అయిపోయేటిది.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు. వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం. ప్రైవేట్ ఇనీషియెటివ్ పెంపొందడం. తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం. తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి. ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు. ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే. ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు.

తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది.

Praveen Mandangi చెప్పారు...

వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చెయ్యకుండా అలా మిగిలిన డబ్బులతోనే హైదరాబాద్‌ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసినది వెనుకబడిన ప్రాంతాలని దోచుకున్న డబ్బుతోనే కానీ దోచుకుని కట్టిన కోటని త్యజించడం కోస్తా ఆంధ్ర నాయకులకి ఇష్టం లేదు. అందుకే తెలంగాణా రాకుండా అంత లాబీయింగ్ చేస్తున్నారు.

Unknown చెప్పారు...

@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు

http://telangaanaa.blogspot.com/2011/06/blog-post_15.html

kovela santosh kumar చెప్పారు...

this is mr.srikanta chary's comment.. chary garu.. thank u very much
ఎంత దారుణమైన ఆరోపణలో చూడున్రి. ఈ వ్యాఖ్యలు సదరు వ్యాఖ్యాత అభిప్రాయాలే కాదు దాదాపు అందరు సమైక్యవాదుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నయి. వాల్లేందో చాలా గొప్ప వాళ్ళని, తెలంగాణా పౌరులు రెండో జాతికి చెందిన వాళ్ళని, విడిపోతే వీళ్ళకి పరిపాలించుకోవడం రాదనీ, ప్రజాస్వామిక భావాలు లేవని, మొబిలిటీ లేదని, వగైరా వగైరా...


ఇవన్నీ ఎంతవరకు నిజాలో పరిశీలించి చూద్దం.


విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదట! ఏంది మారేది? కులతత్వం నేర్చుకోవల్నా, ఫాక్షనిజం నేర్చుకోవల్నా? ఏం నేరుచుకోవాలే మీ లెక్క మారుతందుకు?


ఇక్కడ పని సంస్కృతి లేదట! ఒక వైపు వీళ్ళే చెప్పుతారు, తెలంగాణాల వ్యసాయం పెరిగింది, జీడీపీ పెరిగింది అని. మరి ఆయకట్టు ప్రాంతాలు లేక, బోర్లకిండా అష్ట కష్టాలు పడుకుంట కూడా వ్యవసాయం ఎట్ల పెరిగింది సారూ పని సంస్కృతి లేక పొతే? డబ్బులున్నోడు AC రూముల కూచొని వ్యాపారం చేసుడేనా పని సంస్కృతి అంటే? పాలమూరు కార్మికులు చూపెత్తేది పని సంస్కృతి కాదా? ఫ్లోరీన్ విషాన్ని తాగుతూ నరనరాన నిస్సత్తువని నింపుకొని కూడా జీవన్మరణ యుద్ధం చేస్తున్న నల్లగొండ జిల్లా ప్రజలల్ల పని సంస్కృతి కనిపించ లేదా? రాష్ట్రానికే రైస్ బౌల్ గా మారిన కరీంనగర్ బిడ్డలది పని సంస్కృతి అనిపించా లేదా? వివక్ష గురించి మాట్లాడితే మీరే అభివృద్ధి చెందిన్రంటరు. మా ఉద్యోగాలు కబలిస్తున్నారంటే మీకు పని సంస్కృతి లేదంటరు.


ప్రైవేట్ ఇనీషియేటివ్ ఎక్కడికెళ్ళి పెరుగుతది? ప్రైవేట్ వ్యాపారాలకి డబ్బులు కావాలె. తెరగా వస్తున్నా నీల్లతోటి మూడు పంటలు పండుతలేవు మాకు డబ్బులు ఇండ్లల్ల మూలిగేటందుకు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటే బతుకుదెరువు, వచ్చే కారుకు పంట. ఉన్న ప్రాజెక్టులు పూర్తిగాక పాయె, రావలసిన ప్రాజెక్టులు రాకపాయె, ఇంకా వ్యాపారాలు ఎక్కడ పెట్టక పోతిమి సామీ?


అక్షరాస్యత గురించి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. తిండికి లేకపోయినా, సదువులు బాగనే సదివించు కుంటున్నరు వావాళ్ళు. కాకపొతే మీలెక్క కార్పోరేట్ స్కూళ్ళల్ల చదివే స్తోమత లేకపోవచ్చు.


ఏందీ, తెలంగాణాల ప్రజాస్వామిక భావాలు లేవా? TRS గెలిస్తే ప్రజాస్వామిక భావాలు లేనట్టు, తెలుగుదేశం, కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామిక భావాలు ఉన్నట్టా? వారసత్వం పేరు జెప్పి కదపల అవినీతి సామ్రాట్టును గెలిపిచ్చుడు ప్రజాస్వామ్య భావాలా? కులానికో పార్టీ పెట్టుకొని రాష్ట్రాన్ని రెండు మూడు కులాల కుమ్ములాట కింద మార్చుడు ప్రజాస్వామ్యమా? గదేందో సరింగ చెప్పితే అర్థం చేసుకుంటం సారూ. ప్రజాస్వామ్యం కోసం ఆనాడే నిజాం సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన గడ్డ ఇది, మరువకండి.


అయితే కొందరు నాయకులు ప్రజా ప్రయోజనాలను అటక ఎక్కించి ఆంధ్రా పాలకుల తొత్తులు లెక్క మారింది మాత్రం నిజమే. దానికి కారణం అధికారబలం, సూట్ కేసుల బలంతో సిసలైన నాయకులను తొక్కేసి, మీ మోచేతి నీళ్ళు తాగే చేమ్చాలకు పదవులు ఇచ్చి కృత్రిమ నాయకత్వాన్ని పెంచి పోషించుడు. అప్పుడు KCR ని తోక్కిపట్టినా, ఇప్పుడు నాగం ని ఈడ్చి తన్నినా అదే కారణం. కాని ఇప్పుడు రోజులు మారినాయి అని గుర్తు పెట్టుకోండి. మీరు తొక్కిన నాయకులే రేపు చండ్రనిప్పు లైతరు.


అవతలి వాళ్ళ అభిప్రాయాలను వినిపించుకోవాలెనా? 'నాయింటికొస్తే నాకేమిస్తావ్, నీయింటికోస్తే నువ్వేమిస్తవ్' అనే అభిప్రాయాలా? మేం ఎందుకు విడిపొవాలను కుంటున్నాం, మా బాధలు ఏంటివి అని ఒక్క సారి గూడ వినిపిచుకోరు మీరు. పైనించి 'మీరు చాల బాగా ఉన్నరు మా పాలనల, మీకు ఇష్టం ఉన్నా లేక పోయినా మిమ్ముల మాత్రం వదలం' అని మాట్లాడుతరు. న్యాయమేందో ఒకసారి ఆలోచించండి. ఇక మీదపడి కొట్టుడు మాట మీకే తెల్వాలె. ఇది ఒకసారి చూసి ఎవరు ప్రశ్నిస్తే కొడుతరో తెలుసుకోండి.


ఆయా తెలంగాణా ప్రజల మొబిలిటీ గురించి మీరు అస్సలు దిగులు పడే అవసరం లేదు. రెండు మూడు భాషలు మాట్లాడ గలిగినోల్లు తెలంగానోళ్ళు. పాలకుల పుణ్యమా అని గవర్నమెంటు ఉద్యోగాలు మాత్రం వాళ్లకు దొరుకవు గని ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంట లక్షలాది మంది వేరే రాష్ట్రాలల్ల బతుకుతున్రు. ఒక్క మహారాష్ట్రలనే యాభై లక్షల మంది తెలుగోళ్ళు ఉంటె వాళ్ళల్ల ఎక్కువ శాతం మంది తెలంగాణా వాళ్ళే. ఇంకా గుజరాత్ సంగతి సరేసరి. సాఫ్టువేరు పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంల వాళ్ళు తిరుగని జాగలేదు. ఒక్క సీమాంధ్ర తప్ప. ఎందుకో మరి తోటి తెలుగోళ్ళ దగ్గరికి పోవ్వాలే నంటే మావోల్లకు అంత అదురు, మీరే జెప్పాలె.


మీరు రాసిన మూడు నాలుగు వ్యాక్యాలల్ల తెలంగాణా మీద మీకున్న అభిప్రాయాన్ని దాపరికం లేకుండ చెప్పినందుకు చాలా సంతోషం సారూ. మీలాంటి వాళ్ళ మాటలు విని మాకు ఉద్యమావేశం మరింత ఎక్కువైతది. మా మీద ఇటువంటి అభిప్రాయాలు ఏర్పరచు కున్నోల్ల తోటి ఎందుకు కలిసుండాలే అని ప్రశ్న మరింత ఎక్కువైతది. రాష్ట్రం కోసం మా ఆరాటం పోరాటం లెక్క రూపు దిద్దుకుంటది.

Posted by శ్రీకాంతాచారి at 2:21 AM

విశ్వరూప్ చెప్పారు...

@tadepalli

http://kotiratanalu.blogspot.com/2011/06/blog-post_15.html

తాడేపల్లి చెప్పారు...

చూశాను విశ్వరూప్ గారూ ! నేను ఏదైతే కాదో అవన్నీ నాకు అంటగడుతూ మీరు వ్రాశారు. నేను ఏదైతే అనలేదో అవన్నీ నాకు ఆపాదించారు. మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించారు. హేళన చేశారు. అంతే తప్ప తెలంగాణ శ్రేయస్సు కోసం నేను చెప్పినవి ఎలా తప్పవుతాయో హేతుబద్ధంగా చెప్పలేకపోయారు. తెలంగాణ all-perfect గా లేదు. అది మీకూ తెలుసు. నాకూ తెలుసు.

నేనొక కొలబద్దని మీ చేతికిస్తాను. దాన్నుంచి మీరు మీ వ్రాతని అంచనా వేసుకోండి. ఱేపెప్పుడైనా మీరు మీ బ్లాగుటపాల్ని ఒక పుస్తకంగా అచ్చువేస్తే ఈ వ్రాతని ధైర్యంగా అచ్చువేయగలరా ? మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి. ఇక్కడ ప్రజాస్వామ్య భావనలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని నేనన్నది నా కంటే బాగా మీరు చేతల్లో నిరూపించారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు కావు. Accommodative spirit. అంతే !

అయ్యా ! నేను 28 ఏళ్ళ నుంచీ ఇక్కడే ఉంటున్నాను. ఏం చేస్తే తెలంగాణ బాగుపడుతుందో నాకు కొంత తెలుసు. బహుశా మీకంటే బాగా తెలుసు.

Unknown చెప్పారు...

తాడేపల్లి గారు,

>>>తెలంగాణ అల్ల్-పెర్ఫెచ్త్ గా లేదు. అది మీకూ తెలుసు. నాకూ తెలుసు.

మరి ఆంధ్రా ఉందా all-perfect గా? పోనీ భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఉందా?

అసలు స్వాతంత్రం రాకముందు గానీ, ఇప్పుడు గానీ మనదేశం ఉందా all-perfect గా?

పై ప్రశ్నలకు మీరు మనస్పూర్తిగ సమాధానం చెప్పగలితె అప్పుడు వ్యతిరేకించండి తెలంగాణా ఏర్పాటును.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీకాంతాచారిగారూ !

వేఱే ప్రాంతాల గుఱించి ఉద్యమం జఱగడం లేదు కదా, అవి పెర్ఫెక్టో కాదో మనం చర్చించడానికి ! ప్రస్తుతం ఉద్యమం జఱుగుతున్నది తెలంగాణ గుఱించి ! ఎందుకు జఱుగుతోంది ? అంటే వెనకబాటు వలన ! ఆ వెనకబాటుకు మీరు చెబుతున్న కారణాలు కొన్ని ఉన్నాయి. సరే ! మీ కారణాల్ని నేను పూర్తిగా త్రోసిపుచ్చడం లేదు. వాటితో పాటు నేననుకుంటున్న అత్యంత ప్రధాన కారణాలు కూడా ఇంకొన్ని ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా బాగాలేదంటే, వెనకబడిందంటే దానిక్కారణం - చరిత్రతో పాటు ఆ ప్రాంతప్రజల ప్రయత్నలోపం కూడా అనేది ప్రాథమింగా నా అవగాహన. ఆ అవగాహనలోంచే నేను వ్రాశాను. తెలంగాణయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంవారు ఇలాంటి ఉద్యమాల్ని లేవదీసినా దాని పట్ల నా అవగాహనాకోణం ఇదే. వారికి నేను చెప్పేది ఇదే.

నా దృష్టిలో - అసలు దేశంలో అభివృద్ధి అనేదే లేకుండా పోతే, మనమంతా అన్నివిధాలా వెనకబడితేనే బావుంటుంది. కానీ నా ఆలోచనాస్థాయికి ఈ జనం ఇంకా ఎదగలేదు గనుక ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.

విశ్వరూప్ చెప్పారు...

తాడేపల్లి,

మీరు ఏది అవునో ఏది కాదు బహుషా మీకు అవగాహన ఉన్నట్లు లేదు. మిమ్మల్ని హేళన చేశానని ఫీలవుతున్నట్లున్నారు, మీరు నాలుగు కోట్ల మందిని హేళన చేశారు మీరాతలతో. పైగా ఇది మొదటి సారి కాదు, కుక్కతోక వంకరన్నట్లు తమచేతినుంచి ఎప్పుడూ ఇలాంటి కుళ్ళురాతలే వస్తాయి. perfection ఎక్కడా ఉండదని మీకూ తెలుసు, కాకపోతే గురివిందగింజలాగా మీకు మీప్రాంతపు నలుపు కనబడదు గానీ మీకు నచ్చని ప్రాంతానికి లేని మచ్చలు ఆపాదించగలరు.

మీరిచ్చిన కొలబద్ద బాగుంది. నాతపాలో ప్రచురనార్హం కానిదేమయినా ఉంటే అది పైన యధాతధంగా రాసిన మీ కామెంటు. Accomodative spirit మాకుంది గనకే ఇక్కడ భిన్న జాతుల ప్రజలు ఎక్కడినుండో వచ్చి స్వేచ్చగా బతుకుతారు, మాతో మమేకమవుతారు. అదిమీదగ్గరే లేదనేది మీకు తెలిసిన విషయమే. ఇకపోతే బావిలో కప్పకూడా మీలాగే నాకంతా తెలుసనుకుంటుంది, అది దాని తప్పుకాదు కేవలం బలహీనత.

నేనూ ఆంధ్ర ప్రాంతంలో ఉండి స్వయంగా అక్కడి అవలక్షణాలు అన్నీ చూశాను, కానీ ఎప్పుడూ వాటిని మీప్రాంతాన్ని, అక్కడి సామాన్య ప్రజలను హేళన చెయ్యడానికి వాడను, కేవలం కొందరు మీబోటి దురహంకారులకు సమాధానాలు చెప్పడం కోసం తప్ప.

విశ్వరూప్ చెప్పారు...

తాడేపల్లి,

ఏదో హేతుబద్దంగా చెప్పలేదు అని రాశారు, అసలు హేతువు అంటే కూడా తెలుసా తమరికి? తమరెంత హేతుబద్దంగా తమరి అవాకులు పేల్చారేమిటి?

అజ్ఞాత చెప్పారు...

తాడేపల్లి గారు బాగా చెప్పారు. ఈళ్ళ వాదన చూడండి, పర్ఫెక్ట్ గాలేకపోతే తెలంగాన ఇయ్యున్రి, వుంటే కూడా ఇయ్యున్రి ఇంకా పర్ఫెక్ట్ గా చేస్తం. ఇలాంటి తింగరి వాదనలకు తమిల్నాడు-కేరళ పోలీసులే తగిన సమాధానం ఇవ్వగలరు. ఆంద్రా పోలీసులు ఇంకా బాగా ఇవ్వగలరు, కాని ఇంటి చెట్టు వైద్యానికి పనికి రాదంటారు కదా. :))

అజ్ఞాత చెప్పారు...

తాడేపల్లి గారు బాగా చెప్పారు. ఈళ్ళ వాదన చూడండి, పర్ఫెక్ట్ గాలేకపోతే తెలంగాన ఇయ్యున్రి, వుంటే కూడా ఇయ్యున్రి ఇంకా పర్ఫెక్ట్ గా చేస్తం. ఇలాంటి తింగరి వాదనలకు తమిల్నాడు-కేరళ పోలీసులే తగిన సమాధానం ఇవ్వగలరు. ఆంద్రా పోలీసులు ఇంకా బాగా ఇవ్వగలరు, కాని ఇంటి చెట్టు వైద్యానికి పనికి రాదంటారు కదా. :))

అజ్ఞాత చెప్పారు...

నంగా స్వరూప్ కూడా హేతువు గురించి తీతువులా అరిచేవాడే.

అజ్ఞాత చెప్పారు...

@విశ్వరూప్ గారు,
తెలంగాణా వారి మీద తాడేపల్లి గారు రాసినపుడు, మాకు చేప్పొచ్చే వారా మీరు అని మండిపడ్డారు. 4 కోట్ల మందిని అవమానిస్తున్నారు అని మాట్లాడారు. వారి సంగతి అటుంచి ఎంతో చదువుకొన్న వారైన మీరు కనీస మర్యద లేకుండా "తాడేపల్లి" అని సంబోధించటం ఎమీ బాగా లేదు. ఇంటి పేరుతో సంబోధించేటప్పుడు అది వారి వంశాన్ని సూచిస్తుంది కనుక "+గారు" అని మర్యాదస్తులు వాడుతారు.
-----------------------------------
ఇక తాడేపల్లి గారు మీరు మీ అభిప్రాయాన్ని నిక్కచిగా చెప్పినందుకు అభినందిస్తున్నాను. కాని మీరు మీపరిధిని తెలుసుకోవాలి. నేను మీలాగే ఒకసారి నా మిత్రుడితో ఆంధ్రా తరపున గంటల కొలది వాదించి, వాదించి చివరికి ఆ విషయం ఒక కులం వద్దకు వచ్చి ఆగిపోయింది. అతను ఆంధ్రా కు చెందిన వారు ఎలా ఆస్తులు చేసుకొన్నారు అని చెప్పుకొంట్టు వేళ్లాడు. అతను చెప్పె వన్ని నిజాలే. మీ బ్రహ్మణులకు (అతను బి.సి.) అందరితోను మంచి గా సర్దుకు పోదాం అని అనుకొంటారు. ఇప్పుడు రాష్ట్రాన్ని బూర్గుల రామకృష్ణారవు కాదు పాలించేది. గత 25సం|| లు గా కొన్ని వర్గాలు అధికార బలం తో వేల కోట్లు జుర్రుకొని తింట్టుంటే మేము నోట్లో వేలు వేసుకొని సమైఖ్యాంద్రా జిందాబాద్ అనాలా? ఒకప్పుడు కృష్ణా, గోదావరి జిల్లాల వారు, ఇప్పుడు సీమ వారు ముఠాలు కట్టి అధికారం తో డబ్బులు సంపాదించుకొంట్టుంటే మేము చూస్తూ ఉర్కొనాలా? ఆ వర్గాల వారికి ఉన్నంత పొగరు, అహంకారం, డబ్బు పిచ్చి, ఇతరులను పైకి రానికుండా వారి వర్గం వారికే సహాయం చేసుకొంట్టు నిక్కుతూంటె మేము ఈ తెలంగాణా వాదం తో నైన వారి బారి నుంచి బయటపడకుండా, కలసి ఉండి ఇంకా దోపిడికి గురి కావాలా అని అడిగాడు.
-----------------------------------------------------------------
ఇక్కడ అంతా పైకి తెలంగాణా అని మాట్లాడు తున్నా, అసలికి వారికి ఆంధ్రా వర్గాలు గ్లోబలైసేషన్ తరువాత వ్యాపారం పేరుతో సంపాదించిన డబ్బులు చూసి కన్నుకుట్టింది. అదికాక కొన్నివర్గాలు ముందూ వేనుక చూడకుండా సంపదను జుర్రుకొన్నారు. జుర్రుకొనే రోజుల్లో ఎవరికి తెలంగాణా పేరు తో ఇలా ప్రజలు ఎదురు తిరుగుతారని ఊహించ లేదు. పిల్లి కళ్ళుమూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదను కొన్నట్లు, వీరు మీడీయాని మేనేజ్ చేసుకొంట్టు గుట్టు చప్పుడు కాకుండా అధికారాన్ని ఉపయోగించు కొని కోట్లు ఎలా సంపాదించింది చిన్న పిల్ల వాడికి కూడా తెలిసి పోయింది. ఆంధ్రా వారు ఇప్పటికైన వాస్తవాన్ని గుర్తించి నడచుకోవాలా. కనుక మీలాంటి (తాడేపల్లి గారు )వారు ఇక నుంచి అభిప్రాయాలు చెప్పటం మానుకోవాలి.మీరెంత మంచి మనసుతో అభిప్రాయలు చెప్పిన ఎవరి ఆశలు, అనుమానాలు వారివి. దృతరాష్ట్రుడు, విదురుడి అభిప్రాయాలను విని, గౌరవించి అమలు జరిపి ఉంటే భారత యుద్దం జరుగక పోవును.

Jayaho

John చెప్పారు...

"గొప్ప నిజాయితీపరుడని తెగ పొగిడేసిన శ్రీకృష్ణ లాంటివాడే నికృష్టంగా కవర్లను అందుకున్నప్పుడు వీళ్లెంత?"

Sour Grapes....!

John చెప్పారు...

"విశ్వరూప్ చెప్పారు...
మీరు నాలుగు కోట్ల మందిని హేళన చేశారు మీరాతలతో."

ఈ నాలుగు కోట్ల లొల్లి ఏందిరా బాబు... Population of telangana is 3.5 crore as per latest census. That includes SA's and other state people.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇక్కడ జనాల సలహాలకీ, దూషణలకీ కృతజ్ఞతలు. నా పరిధి నేను తెలుసుకోవాలని ఒకాయన అంటున్నారు. ధన్యవాదాలు.

One thing is clear. Intellectualism has no room while discussing Telangana. This particular topic is apparently meant for rabble-rousing, mud-slinging and pure beastial emotional outbursts. People with a semblence of level head better not enter this dirty patch. Yes, one should be mindful as to what sort of people he is dealing with. And, now, I can understand why the even Congress high command stands deliberately hand off this issue.

ఆంధ్రప్రదేశ్ దేశపటంలో ఎక్కడుందో, అసలు దీని తలా తోకా ఏంటో తెలీనివాళ్ళంతా హైదరాబాద్ వచ్చేసి ప్రత్యేక తెలంగాణకి మద్దతు పలకడాన్ని, తెలుగువాళ్ళని ముక్కలు చేయందని కోరడాన్ని ఎవఱూ ప్రశ్నించడం లేదు. వాళ్ళ పరిధి వాళ్ళు తెలుసుకోవాలని ఎవఱూ అనడం లేదు. కానీ తోటి తెలుగువాడు తెలంగాణ అభివృద్ధికి సూచనలు చేస్తే భరించలేకపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ తెలంగాణవాళ్ళకి శత్రువు కాడు. తెలంగాణ ప్రజల్ని హీనంగా చూసేవాడూ కాడు. కానీ అలా ప్రచారం చేస్తున్నారు. అలా రెచ్చగొడుతున్నారు. తెలంగాణవాదులు ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సమైక్యవాదాన్ని వినిపించేటప్పుడు ఆ వాదానికి అడ్డం వచ్చేఅలాంటి ప్రచారాల్ని ఖండించక తప్పదు. అందులో తెలంగాణకి లేనివన్నీ ఉన్నాయని చెప్పడం, ఇతర ప్రాంతాల్ని తక్కువ చేసి మాట్లడడం లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ తప్పు కాదట/. అవన్నీ ఉద్యమం ముసుగులో కొనసాగిస్తున్నారు. వాటిని ఖండించేవాడు లేదూ. నాబోటివాడు ఖండిస్తే నేను తెలంగాణశత్రువుని. నా పరిధి నాకు బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ సజీవంగానే ఉంది. నా పరిధి యావద్ ఆంధ్రప్రదేశ్.

మాట మాట్లాడితే నాలుగుకోట్ల తెలంగాణప్రజలూ అదీ, ఇదీ అంటున్నారు. మఱి తమరు అంతకంటే పెద్ద సంఖ్యలో ఉన్న మిహతా తెలుగువాళ్ళని అవమానించడం లేదా ? ఆ నాలుగుకోట్లమందిలో నేను లేనా ?

కాలు లేనివాడికి కాలు లేదని చెబితే అది అతన్ని అవమానించడం అవదు. నిజం చెప్పడం అవుతుంది.

రక్తచరిత్ర చెప్పారు...

కోవెల సంతోష్ కుమార్ గారికి,
ఒక వ్యాఖ్యాత అభిప్రాయాలని సమైఖ్యఆంధ్రప్రజల బావాలకు ఆపాదించిన మీ మేదోసంపత్తికి లాల్ సలాం. సీమాంధ్ర ప్రజలు ఎపుడూ మేం గొప్పవాళ్ళమని ఎక్కడా చెప్పినట్లు నేను ఎపాత్రికలోనూ చదవలేదు మీ నాయకుల విక్రుతవ్యాఖ్యాల్లో తప్ప మిమ్మల్ని మీరు రెందోజాతిగా చిత్రికరించుకొంటూ సానుభూతిపొండడానికి ప్రత్నిస్తూ తిరిగి అదే ఆయుధంగా సీమాంధ్ర ప్రజలపై దాడికి ఉపయోగించే మీ రెండునాల్కల ధోరణికి హాట్స్ ఆఫ్.కులతత్వానికి అరాచాకాలకి ఏప్రాంతం ఎక్కువగా లోనయిందో ప్రజలు దానినుండి బయటకి రావడానికి ఎలా పోరాడారో చరిత్ర తెలిసిన ప్రతీ వారికి తెలుస్తుంది. లేకుంటే ఒక్కసారి మందక్రిష్ణగారిని అడగండి. తెలంగాణలో వ్యసాయం పెరిగిన మాట వస్తామాకాదా అనేది రాష్ట్ర స్టాటస్టిక్స్ చూస్తే తెలుస్తాయి మీ నాయకుల మాటలు కాదు. ఆయకట్టుప్రాంతం అనేది ఆప్రాంత భోగోళికధర్మాలపై ఆధారపడి ఉంటుంది. గోదావరి జిల్లాలు డెల్టా ప్రాంతాలు అవి చదునుగా ఉంటాయి తెలంగాణా ప్రాంతం అంట చదునుగా ఉండదు అందువల్ల తెలంగాణా ప్రాంతానికి కావలసినవి ఎత్తిపోతల పధకాలు. కానీ దానిని కూడా మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించారు. కానీ మీరు రైస్ బౌల్ కరీంనగర్ గురించి చెప్పినపుడు బోర్లకింద పండించారు అని రాసారు. మరి ఎగువ,మధ్య,దిగువ లోనేరు డాములు ,శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏమిచేస్తున్నాయో చెప్పనేలేదు. పని సంస్కృతి గురించి కూడా మీరు విలువైన వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని గొంతుచిన్చుకొంతున్నది మీ నాయకులేతప్ప వేరేవారు కాదు. మరి పొలమూరు కార్మికులు అంత పని చేస్తున్నప్పుడు వారి పని ఎవరూ లాక్కోలేరే? నల్లగొండ ఫ్లోరోసిస్ పాపాన్ని కూడా సీమాంధ్ర ప్రజల మీదికి నెట్టే మీ ప్రయత్నం అనన్యసామాన్యం. ఫ్లోరోసిస్ అనేది మీ నల్లగొందలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇదు జిల్లాలు ఫ్లోరోసిస్ ప్రభావిత జాబితాలో ఉన్నాయి అని మీరు తెలుసుకొని ఉంటె కొంచెం విజ్ఞత అనిపించుకోనేది. వివక్ష గురించి మీరు మాట్లాడడం చాల వింతకదండీ మనం అంటే ఇస్టపదనివాళ్ళు మమ్మల్ని ఎంతసేపు మీరు వేరు అని చెప్పేవాళ్ళు మమ్మల్ని వివక్ష చూపుతున్నారు అనడం ఓహ్....ఏమని రాయాలో తెలియడంలేదు. రైస్ బౌల్ అని, పాలమూరు పని సంస్కృతి అని చెప్పి మళ్ళీ మీకులా మూడుపంటలు పండుతలేదు అని చెప్పడం ఎం న్యాయమో మీరే ఆలోచించాలి. చదువులు గురించి చెప్పారు మరి చదువులు బాగానే చదివిన్చుకొంతున్నపుడు ఇంకా కొలువులగురించి దిగులేల సామీ? ఇది సర్కారీ కొలువులకోసం ఎగబడే కాలం కాదే మరి ఇంకెందుకు ఈ అసంబద్దపు వ్యాఖ్యానాలు. ప్రజాస్వామ్య భావాలు అంటే ఒక వ్యక్తి అతని కుటుంబం పాలిన్చడమా? రెండుకులాల గురించి చెప్పారు మరి మీ ప్రాంతంలో ఎన్ని ఏమ్మేల్యే పదవులు ఒక్క కులం అనుభవిస్తుందో తెలియదా? అదేకులం రాస్త్ర్రాన్ని ఎక్కువకాలం పాలిన్చిందన్న చేదునిజం తెలియదా? మీ ప్రాంతం నుండి కేంద్రంలో ఉన్న ఒక్క కేబినేట్ మంత్రి కూడా అదే కులానికి చెందినవాడు అని,మీకు గుర్తుకురాకపోవడం పెద్ద ఆశ్చర్యం ఏమీకాదు.కులాల సమతుల్యం సీమంధ్రలో ఎక్కువా తెలంగాణలో ఎక్కువో ఒక్కసారి గత నాలుగైదు మంత్రివర్గ కూర్పును చూస్తేమీకే తెలుస్తుంది కాని సీమాంధ్ర మీద విషం జల్లడమే పనిగా పెట్టుకున్న మీబోటి పెద్దలకు అంతతీరిక ఉండకపోవచ్చు. సూట్ కేసులతో అన్నిటినీ కొనగలిగినప్పుడు మీ ఉద్యమం పెరుగుదలకు ఎన్ని సూట్ కేసులు ఎక్కడినుండి వచ్చాయో మీ నాయకుడు దానిని ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టాడో కూడా గద్దర్ లాంటి నాయకులు చాలా బాగా వివరించారు వినండి. మా ఇంటికొస్తే అనే సామెత ఎవరికీ వర్తిస్తుంది సారూ? ఎంతసేపూ మాతెలంగాణా మాగ్గవాలే సీమంద్రోళ్ళు మమల్ని దోచుకొన్నారు జాగో బాగో అనేది ఎవరు? అనడంతప్ప దోచుకోన్నది ఎవరు అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొంటే తెలుస్తుంది మిమ్మల్ని ఇన్నాళ్ళుగా మోసంచ్స్తున్నది మీనాయకులాకాదా అన్నది. continued

రక్తచరిత్ర చెప్పారు...

సూట్ కేసులతో అమ్ముడుపోయేది మీ నాయకులు అయితే ఉమ్మడి రాష్ట్రం అయితే ఏమిటి విడిపోతే ఏమిటి అప్పుడు మీ నాయకులు సూట్ కేసులకు అమ్ముడుపోరనే గ్యారంటీ ఏమైనా ఉందా? రెండు మూడు భాషలు మాట్లాడగలిగే వాళ్ళు చాలా తెలివైనవాళ్ళు అయినపుడు మరి వాళ్ళను ఇలా మోసం చేయడం ఎలాకుడురుతుందో మీరే చెప్పాలి.మహారాష్ట్రల ఉన్న తెలుగోళ్ళు మహారాష్ట్ర మన సరిహద్దు గురించి వెళ్లారు తప్ప మరోటి కాదనే సత్యాన్ని పీకనోక్కి చంపటం, అదే తెలుగోళ్ళు చెన్నైలోనూ, బెంగళూరు లోనూ ఉన్నారని సాఫ్ట్ వేర్ లో ప్రావీణ్యం మీ తెలంగాణా ప్రజల సొత్తుకాదని అమీర్పేట్ సాక్షిగా మీకు చెపుతున్నాను. చెన్నై నాయుళ్ళు బెంగళూరురెడ్లు ఆంధ్రా నుండి వెళ్ళినవాళ్ళేనని వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ రాజ్యాన్ని పాలిస్తున్నారని మీకు తెలియకపోవడంలో వింతలేదు. మీ తెలంగాణా సోదరులు ప్రపంచమంతా తిరుగాడుతున్నారు కాని ఒక సీమాంధ్ర లో తప్ప అన్నారు మరి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లో ఒక్క సాఫ్ట్వేర్ కంపనీ ఎందుకు పెట్టలేదు సారూ? విశాఖపట్నంల మీ తెలంగాణా సాఫ్ట్ వేర్ సోదరులు ఉన్నారని మీకు మీ నాయకులు చెప్పకపోవచ్చు...మీరు కొంచెం తరచి చూస్తె తెలుస్తుంది. పైత్యం తలకెక్కిన మాటలు మాభావాలను దెబ్బతీస్తాయని మీకు తెలుసు అందుకే మరిన్ని మాటల తూటాలు పెలుస్తారు కానీ మాలక్ష్యం మాకు తెలుసు మామాటలు వాదనలు నిజాలు అని కూడా తెలుసు. సత్యమేవ జయతే అనే సూక్తి నిజం ఆ నిజం ఎప్పటికైనా గెలుస్తుంది.
by Annaji Sekhar Gubbala on Saturday, October 22, 2011 at 2:08am
http://www.facebook.com/note.php?note_id=292842364076494

kovela santosh kumar చెప్పారు...

raktacharitra... garu.. me merulone swabhavam kanipistondi.. kasta softga peru marchukondi.. meeru chaala manchivaru.. a peru enduku cheppandi.. ?
sare vishayaniki vaddam.. meeru rasin comment bagundi.. gata 60 elluga seemandhra prajaaneekam okanoka bhramalo undi konni pustakallono.. leka upanyasallono cheppinavi matram talakekkinchukunna sagatu andhrula manastatvaniki saripotayi kani.. mee bontla peddalaku ivi vartinchavemo. ee bloglalo rase seemandhrulanta.. oke matanu pade pade rastuntaru.. rastunnaru.. edo vidhamga janam vatine nammutarane nazi la concept tho ee pani chestaru.. tamu angikarinchalenivi.. Khandinchatam sadhyam kanivi ignore chestaru.. british culture lo bhagamga.. oka dani gurinchi matladite.. maro danni dani placeloki techchi pedataru.. ivalti rajkeeya gelupu vyuham laga.. deniki sutiga spandincharu.. manam adhipatyam chelayinchalanukunna vadu elanti vadaina sare nishkarshaga vaadi vaadanlanni tosipuchi panikiranivadani nirupinchtaniki prayatnam cheyatam nazeela kalam nunchi prapamcha vyaptamga vastunnade. ippudoo jarugutunnadi ade.. rajyam veerabhojyam ani mahabharatamlo bheeshmudu rajadharmanni bodhistu cheppadu.. meeru veerulu.. daani bhoganni anubhavinche hakku meeke undi.. migatavallu meeru cheppinatlu naduchukovalasin dharmam unnadi.. endukante Dharamanni nirnayinchedi meeru. shasanalani rachinchedi meeru.. meeru neellu iste tesukovali.. valasalu pommante povali.. panisamskriti ledante banchan anaali.. mimmalni meme manushulni chesamante avuna dora ani ascharyapovali.. dhanyavadalu...

రక్తచరిత్ర చెప్పారు...

థాంక్స్ కోవెల సంతోష్ కుమార్ గారు..వర్మ గారి రక్తచరిత్ర సినిమా నచ్చి అ పేరు ఉపయోగించు కొంటున్నాను. సాఫ్ట్ గా ఉండే మంచి పేరు దొరకగానే మారుస్తాను. ఇంకొక విషయం పైన నేను రాసినట్లు మీరు బావిస్తున్న కామెంట్ నేను రాసినది కాదు. అన్నాజీ శేఖర్ గారు రాసినది. వారికి బ్లాగ్స్ లో రిప్లై రాయడం తెలవక నా ప్రొఫైల్ తో కామెంట్ చెయ్యడం జరిగింది . వారి facebook ప్రొఫైల్ http://www.facebook.com/annaji.sekhar

నా స్పందన :-
మీరు మీ తెలంగాణా వాదనకు, నేను నా సమైక్యాంధ్ర వాదనకు కట్టుబడి ఉన్నప్పటికీ ఇరు ప్రాంతాల వారికి అన్యాయం జరిగింది అనేది మీరు వోప్పుకోవాలి.ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి శ్రీకృష్ణ కమిటి చేసిన ఆరో సూచన అయిన "రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల ఏర్పాటు" అమలు చెయ్యడం ఒక్కటే మార్గం.దీనిపై ఎవరు ఏకీభవించినా, లేకున్నా ఇదే అత్యుత్తమ మార్గం. ధన్యవాదములు

kovela santosh kumar చెప్పారు...

dhanyavaadalu kaneesam ee vishayam lonaina positivega spandincharu santosham

Annaji చెప్పారు...

డియర్ కోవెల.....మీరు చెప్పింది అక్షరాలా నిజం...మేము చరిత్రని పుస్తకాలలో చదివాం, మహనీయుల ఉపన్యాసాలు విని నేర్చుకోన్నాం. కానీ మీకు చరిత్ర మీ నాయకుల వక్రభాష్యాలతోనే అవగతమైంది. మీకు నిజాలు గ్రహించే సక్తి ఆసక్తి లేవు. మీనాయకులు చెప్పినది(తాలిబాన్లు వారి ముష్కరమూకలకు జీహాద్ గురించి చెప్పినట్లు)మీకు అదిగ్రంధాలు. ఆపై ఎవరు ఏమి చెప్పినా వారు ఆంధ్ర వలసపాలకుల తొత్తులు, వారి మాటలు, చూపించిన ఋజువులు ఆంధ్రపాలకుల/దోపిడీదార్ల మనుషులు రాసిన మనుచారిత్రలు. మేమెప్పుడూ ఒకటే రాస్తాం అని చెప్పారు...అది కూడా నిజమే ఎందుకంటే చరిత్ర మారదుకనుక...మేము రాసేది కూడా మారదు. కానీ మీ నాయకుల నాలుకలు ఎలా తిరిగితే అలా మీ చరిత్రలు, వాటి వాటి భావాలు మారిపోతుంటాయి. అది మాతప్పు కాదు సర్. మేం సూటిగా మాట్లాడం అన్నారు..మా స్పందనలు, మా భావనలు ఒకటే మనం ఒక తల్లి బిడ్డలం....ఆ తల్లి తెలుగు తల్లి. మీకు మాత్రం తెలుగుతల్లి తల్లికాదు.....కాని తెలుగు మాత్రం మాట్లాడతారు. ఏది సూటిగా ఉందొ తెలుసుకొనే భాద్యతను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

kovela santosh kumar చెప్పారు...

మాకు మాత్రమే చరిత్ర ఉంది.. మీకు చరిత్రే లేదని 50 ఏళ్ల నుంచీ చేస్తున్న మెకాలే టైప్‌ ప్రచారాన్ని మీరు మళ్లీ మళ్లీ చేయటంలో ఆశ్చర్యం లేదు.. ఇది మీరు తెల్లవారి రక్తం నుంచి ఒంటబట్టించుకున్న లక్షణం. మీకు మీరు మూర్ఖంగా మాట్లాడటం తా పట్టిన కుందేటికి మూడే కాళ్లనటం.. ఒకసారి చెప్పిందే పదే పదే చెప్తూ గోబెల్స్‌ ప్రచారాలు చేయటం మీకు ఆది నుంచీ అలవాటైందే.. అవును.. మీ చరిత్ర మారదు.. విభజించి పాలించాలనే సూత్రాన్ని అణువణువునా ఆకళింపు చేసుకున్న మీ చరిత్ర, సంస్కృతి అంత తొందరగా మారుతుందని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమ.. మీ భావాలు సూటిగా ఉంటాయనటం కంటే హాస్యాస్పదం మరొకటి లేదు.. చెప్పేది మనం అంతా ఒక తల్లిబిడ్డలం అని.. చేసేది సవతి తల్లి వ్యవహారం.. మీకు ఒక అంశాన్ని సూటిగా తీసుకుని నేరుగా సమాధానం చెప్పటం చేతకాక కాదు.. చెప్పటం ఇష్టం లేక.. తెలంగాణాలో సమస్యలను నిజమైనా సరే అంగీకరించాల్సి వస్తే భరించటం మీకు కష్టం.
అందుకే ఇక్కడి సమస్యలను ఇగ్నోర్‌ చేస్తారు..ఒక విషయాన్ని ఇగ్నోర్‌ చేసి సదరు అంశాన్ని గురించి మాత్రం మాట్లాడకుండా.. దారి మళ్లించి దుర్మార్గపు ప్రచారం చేయటం మీకు మాత్రం తగింది.. మీరన్నట్లు తెలంగాణాలో ప్రజలు నాయకుల మాటలు మాత్రమే నమ్మి ఉంటే ఇవాళ ఉద్యమం జరిగేదే కాదు. గుణాఢ్యుడి కాలం నుంచీ ఇక్కడ తప్పు చేసిన వాడిని నిలదీసే లక్షణం ఉంది. గుణాఢ్యుడు ఎవరంటే ఇప్పుడు అదో చరిత్ర.. మీరు మాకు లేదనే చరిత్రలోని తొలి పుటల్లో ఉన్నవాడు లెండి.. అది మీకు అవగతం కాదు.. మీ స్పందనలు.. భావనలు ఎప్పుడూ ఒకటిగానే ఉంటాయి. ఇందులో ఇసుమంతైనా సందేహం తెలంగాణాలో ఏ ఒక్కరికీ లేదు. అందరిదీ ఒకే లక్ష్యం.. అది ఆధిపత్యం. ఇందుకోసం ఒకే తీరులో ఒకే విధంగా ఒకే లక్షణంతో ఒకే పద్ధతిలో.. ఒక సంవిధానంతో ఒక జాతిని సమూలంగా నిర్వీర్యం చేయటం కోసం ప్రణాళికా బద్ధంగా దాడి చేయటం మీకు మాత్రం సాధ్యమైంది. ఈస్టిండియా కంపెనీ ౧౬౦౦ సంవత్సరంలో భారత దేశాన్ని ఆక్రమించటానికి ఏ విధంగా ప్రయత్నించిందో... దాని అంతేవాసులుగా మీరూ అదే పని చేస్తున్నారు.. మీరు ఇలా చేయకపోతే ఆశ్చర్యం కానీ, చేస్తే ఆశ్చర్యపోవాల్సిందేముంటుంది?
తెలంగాణా ఉద్యమం ఎందుకు వస్తున్నదో.. ఎందుకు జరుగుతున్నదో మీకు అర్థం కాదు.. తెలంగాణా గురించి అనుకూలంగా ఎవరు మాట్లాడినా వాళ్లు మీకు తాలిబన్ల మాదిరి కనిపిస్తుంటారు.. తెలంగాణా అంటేనే బద్ధశత్రువుగా భావించే స్థితిలో మీరున్నారు.. ఆ పేరు చెప్తేనే అగ్గిమీద గుగ్గిలమయ్యే మీలాంటి వారికి తెలంగాణా గురించి ఏ చిన్న అనుకూలమైన అంశాన్ని గురించి ప్రస్తావించినా భరించటం సాధ్యం కాదు. ఫలానా సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని అంటే.. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీ నాయకులను అడగండి అంటారు? మేము ఇప్పటి వరకూ అడిగిందీ.. అడుగుతున్నదీ, నిలదీస్తున్నదీ మా నాయకులను మాత్రమే..
ఇక మీరు మధ్యలో చెప్పిన అంశాలు,.. మీరు చూపించిన రుజువులు ... ఏం రుజువులు చూపించారు? సూటిగా అడుగుతున్నా? నేరుగా జవాబు చెప్పండి...స్పష్టంగా జవాబివ్వండి? తెలంగాణా ఉద్యమం ఎందుకోసం ప్రారంభమైంది? ప్రజలు ఎందుకు ఇంతగా స్పందిస్తున్నారు? మీకు కనీస పరిజ్ఞానం ఉందా?
తెలంగాణాలో నీటి పారుదల ఎందుకు శూన్యమైంది? పీఠభూమి ప్రాంతంలో ౧౯౫౬కు ముందు నిండుగా పారుతున్న గొలుసుకట్టు చెరువులను ఎందుకు కొరగాకుండా చేశారు.. ఇక్కడ వ్యవసాయానికి అవసరమైన ఎత్తిపోతల పథకాలలో ఏ ఒక్కటి కూడా ఎందుకు పూర్తిచేయలేదు.. ? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు.. ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారు? కాకతీయులు నిర్మించిన చెరువులు కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత తెలంగాణా ప్రాంతంలో నీటిపారుదల కోసం ప్రభుత్వాలు చేసిన గొప్ప మేలేమిటి?
చెరువుల్లో నీరు లేక.. నీటి ప్రాజెక్టులు లేక బోర్లు వేసుకుంటే పడక.. పడిన వాటికి విద్యుత్తు వాడుకుంటే అది సరిగా రాక.. రాత్రిపూట షాక్‌ కొట్టి చచ్చిపోతే.. దీనికి పరిష్కారం చూపకుండా.. అదిగో మీరే విద్యుత్తును గొప్పగా వాడేసుకుంటున్నారని లెక్కలు చెప్పి.. తెగ అభివృద్ధి చెందేశారంటూ మాట్లాడటం దేనికి సంకేతం..
నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు ఎందుకు నీరు ఇవ్వటం లేదు? ఎందుకు ఎత్తిపోతల పథకాన్ని సమర్థంగా పనిచేసేలా చేయటం లేదు? జీవో నెంబర్‌ 36(కాసుబ్రహ్మానందరెడ్డి), జీవో నెంబర్‌ 610(ఎన్టీయార్‌) 86వేల ఉద్యోగాలు మీ ప్రాంతం వాళ్లు అన్యాయంగా తీసుకున్నారని స్పష్టం చేసిన తరువాత కూడా ఈ తప్పుల్ని ఎందుకు రెక్టిఫై చేయలేదు. 1969లో జీవో నెంబర్‌ 36ను సమర్థంగా అమలు చేసి ఉంటే ఇవాళ ఉద్యమం వచ్చేదే కాదు. ప్రభుత్వోద్యోగాల కోసం వెంపర్లాడే రోజులు కావంటూ మరో పీటముడి.. అవును.. అది ఇవాళ్టి పరిస్థితి. 50 ఏళ్లుగా మీరు ప్రభుత్వోద్యోగాలను అక్రమంగా, దుర్మార్గంగా దొడ్డిదారిలో .. (ఈ మాటలు అనటానికి పైన చెప్పిన రెండు జీఓలు ఆంధ్రపాలకులు జారీ చేసినవే....ఆధారాలు.. ) ఆనుభవించినప్పుడు లేని వెంపర్లాట.. మాకు అన్యాయం జరిగిందనే సరికి వచ్చేస్తుంది....ఈ ఉద్యోగాలు లాక్కోకపోతే ఇవాళ ఉద్యమం ఉండేదే కాదు..
continued

kovela santosh kumar చెప్పారు...

రాష్ట్రాన్ని విలీనం చేయటానికి ముందు రెండు ప్రాంతాల మధ్య జరిగిన ఆర్థిక ఒప్పందాలను తుంగలో తొక్కి ఉండకపోతే ఉద్యమం ఇంతగా పెచ్చరిల్లేదే కాదు.
ఆ తరువాత కూడా చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి ఉండకపోతే మా రాష్ట్రం మాకు కావాలంటూ ఎవరూ అడిగే వారు కాదు..
బాసరలో ఐఐటి ప్రతిపాదన వస్తే.. సౌకర్యాలు లేవంటూ దాన్ని రాకుండా చేసిన ఘనత ఎవరిది.. సౌకర్యాలు లేకపోతే.. కల్పించాలి.. ఒక ఉత్తమమైన విద్యాసంస్థ అంటూ ఏర్పడితే.. ఆ ప్రాంతం అంతా దాని ఆధారభూమికను చేసుకుని అభివృద్ధి చెందుతున్న కనీస న్యాయాన్ని సైతం పాటించని కూటనీతి పాలకవర్గం ఇప్పుడు ఏలుతున్నవాళ్లు.. ఆనాడు బాసరలో ఐఐటిని మన్నించి ఉంటే.. వచ్చేందుకు కృషి చేసి ఉంటే ఆ ప్రాంతానికి పెద్ద ఆలంబన అయ్యేది. దానికోసం అక్కడ మౌలిక సౌకర్యాలు వచ్చేవి.. ఆదిలాబాద్‌ జిల్లా అంతా అభివృద్ధి పథాన నడిచేది.. అక్కడ మా రాష్ట్రం మాకు కావాలంటూ ఏ ఒక్కరూ నినదించే వాళ్లు కారు.
తెలంగాణా ప్రజలతో మీతో సహా ఏ ఒక్కరూ సామరస్యానికి, సమరస భావానికి, సౌభ్రాతృత్వానికి ప్రయత్నించలేదు. తెలంగాణ ప్రజలతో మిగతా సీమాంధ్ర ప్రజానీకానికి మధ్య ఇంటిగ్రీటీ కోసం ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. ఇక్కడ తెలంగాణా ప్రజానీకానికి పది జిల్లాలతో, సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి. మిగతా ఆంధ్రప్రాంతంలో అలాంటి సంబంధాలు మృగ్యం. గ్రావిటీతో మూడు నాలుగు పంటలు పండించుకుని అదనపు ఆదాయాన్ని తెచ్చి హైదరాబాద్‌లో భూములన్నీ అడ్డికి పావుసేరు చొప్పున లాగేసుకుని ఇంకా మిగిలిన ఆదాయాన్ని ఏమి చేయాలో తోచక కోటప్పకొండల్లో అమ్మాయిలను అంగడి సరుకు చేసి నగ్ననృత్యాలతో విశృంఖలంగా నాట్యం చేయించి ఆనందించే పైశాచిక తత్త్వం ఉన్న నాయకగణం, పెట్టుబడిదారీ, పెత్తందారీ వ్యవస్థ చేతిలో సీమాంధ్ర ప్రజానీకం ఒక భ్రమలో మునిగిపోయి ఉన్నది.. continued

kovela santosh kumar చెప్పారు...

5౦ సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ విలీనంలో సంపూర్ణంగా
అభివృద్ధి చెందింది కేవలం అయిదు జిల్లాలు మాత్రమేనన్నది నిష్ఠుర సత్యం. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, కొండొకచో ప్రకాశం.. ఇంతకు మించి ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ఇది వాస్తవం. ఆయా ప్రాంతాల వారికీ ఈ సత్యం తెలుసు.. కానీ, వాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి.. భౌగోళికంగా వారికి ఎంతో కొంత అవసరం ఈ జిల్లాలతో ముడిపడి ఉంది.. తెలంగాణా మొదటి నుంచీ వేరుగానే ఉంది.. విలీనం తరువాత కూడా వేరుగానే చూడబడింది. అందుకే ఈ ఉద్యమం..
మీకు అర్థం కావటం లేదు..తెలంగాణా ఉద్యమం మరికొంతకాలం కొనసాగితే దాని వల్ల నష్టం ఆంధ్రప్రాంతానికేనన్నది ఖచ్చితమైన వాస్తవం. ఇప్పటికే రియల్‌ మాఫియా ఆంధ్రాపై కన్ను వేసింది. తెలంగాణా పేరు చెప్పి భూముల రేట్లు విపరీతంగా పెంచి వేస్తున్నారు.. ఇవాళ సాధారణ భూములు అమ్ముతున్నారు.. క్రమంగా వ్యవసాయ భూముల్ని అమ్మేస్తారు.. ఇవాళ ఈ దృశ్యం మీకు కనిపించదు. మేము అనుభవించాం.. మీకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నది.. ఒక్కసారి ఈ నాలుగు జిల్లాల్లో గత రెండు సంవత్సరాలలో పెరిగిన భూముల రేట్లను గమనించండి.. భోగభాగ్యాలకు అలవాటుపడిన వాళ్లు మీరు.. చిలకలూరిపేటలు.. హంసమేడల్లో ఆనందకేళిల్లో మునిగిపోయిన వాళ్లు మీరు.. రాత్రికి రాత్రి భూములతో కోట్లకు కోట్లు వచ్చేస్తే.. ఆ తరువాత ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి.. మీకు ఆధారం వ్యవసాయం.. అది కుంటుపడితే..భూముల్లో భవనాలు వస్తే.. తరువాత ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాను ఆంధ్ర పెట్టుబడిదారులు ఏ విధంగా వ్యవసాయ శూన్యం చేసి ఇక్కడి ప్రజల్ని బికారులను చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి.. మీ భవిష్యత్తు మీకు కనిపిస్తుంది.