27, జులై 2011, బుధవారం

వేములవాడ భీమకవిని అణగదొక్కిన నన్నయ

by- వి.ఆర్.తూములూరి
courtesy.. namasthe telangana e-paper
రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవును అణగదొక్కి పైకి వచ్చాడు, చివరికి వారి గ్రంథాలు చించి వేయడం, తగుల పెట్టటం చేశాడు.

ఆధునిక , సమకాలీన తెలంగాణ సాహిత్య చరిత్ర మొత్తం అణిచివేతల లేదంటే అవహేళనల మయం. ఇందుకు ప్రాచీన సాహిత్య చరిత్ర మినహాయింపేమి కాదన్నది వెలుగులోకి వస్తోన్న వాస్తవం. ఇందుకు బీజాలు ఆదికవిగా ప్రచారం చేయబడిన నన్నయ చేతనే నాటబడడం గమనార్హం. క్రీ. శ 11 వ శతాబ్దిలో రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాణుక్య రాజైన రాజరాజ నరేంవూదుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడని, చివరికి వారి గంథ్రాలు చించివేయడం, తగుల పెట్టటం చేశాడని ఆధునిక యుగ సంస్కర్తగా పేరొందిన కందుకూరి వీరేశ లింగం తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’ లో విస్పష్టంగా రాశాడు.

తెలంగాణలోని వేములవాడకు చెందిన భీమ కవి, నన్నయ కన్నా ముందుగానే’ రాఘవ పాండవీయము అనే గ్రంథం రాసి, దానిని రాజైన రాజరాజనరేంవూదునికి చూపించి రాజ సన్మానం పొందడం కోసం రాజమహేంవూదవరం చేరాడు. విష్ణు వర్ధనుడిగా పేరొందిన రాజరాజ నరేంవూదుని ఆస్థాన కవి నన్నయ. రాజసన్మానం పొందకోరిన ఏ కవి అయినా నన్నయ ద్వారా రాజుకు పరిచయం కావలసిందే. దానితో వేములవాడ భీమకవి తన రచన అయిన ‘రాఘవ పాండవీయము’ ను నన్నయకు అప్పగించారు. ఆది చదివిన నన్నయ భీమకవి కవిత్వం అమోఘంగా ఉండటం, అది వెలుగులోకి వస్తే తన ప్రాభవం తగ్గుతుందని భావించి ఆ గ్రంథాన్ని తగుల బెట్టించాడని వీరేశ లింగం వివరించాడు.కందుకూరి వీరేశ లింగం రాసిన ‘ ఆంధ్ర కవుల చరిత్ర’ నుండి ఈ ఉటంకింపును చూడండి.


‘‘నన్నయ భట్టారకుడు తాను రచియింప నారంభించిన శ్రీ మహాభారతమును సంపూర్ణముగా నాంధ్రీకరింపలేక పోవుటకు కారణములు పలువురు పలు విధముగా చెప్పుదురు. కొందరు వేములవాడ భీమకవి శాపము చేత గలిగిన మరణము కారణమందురు. మరి కొందరు యధర్వాణాచార్యులు తెలిగించుచుండిన భారతమును తగుల బెట్టించుట చేత గలిగిన చిత్త చాంచల్యము కారణమందురు. ఈ రెండు కారణములో నేది నిజమైనను ఈ కవి పరోత్కర్షమును సహింపజాలని దుస్స్వభావము కలవాడయినట్టూ హింపదగియున్నది.

ఈయన తోడి సమకాలినుడైన వేముల వాడ భీమకవి రాఘవపాండవీయమును కవిజనాక్షిశయములో జేర్చి యొక్క వ్యాకరణ మును చేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంవూదపురమునకు దెచ్చి విష్ణువర్ధనుని యాస్థాన పండితుండయి యున్న నన్నయ భట్టునకు జూపగా నతడా కవిత్వ ము మిక్కిలి శ్లాఘ పాత్రముగా నుండుట చూచి యోర్వలేక యా పుస్తకములు లోకములో వ్యాపించిన యెడల దన పుస్తకములకు బ్రసిద్ధి రానేరదని యెంచి వానిని తగులబెట్టించినట్లును, అటు మీదట నతడింట లేనప్పుడు భీమకవి వచ్చి అతని భార్యను నీ భర్త ఏమి చేయుచున్నాడని యడిగి యామె తన భర్త రహస్య స్థలమున ఉండి యరణ్య పర్వం రచించుచున్నాడని చెప్పిన మీదట యతనింకను నరణ్యములోనే ఉన్నాడా యట్లే యుండునుగాక అని శపించి తన పుస్తకముల నణగదొక్కేనన్న కోపము చేత నన్నయభట్టు రచించిన ఛందస్సును వ్యాకరణమును భార్య నడిగి పుచ్చుకొని దానిని చించి గోదావరి లో గలిపివేసి తాను చిరకాలము కష్టపడి చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖము చేత బెంగపెట్టుకొని కాలధర్మము నొందినట్లును, అతని శాపము తగిలి నన్నయ భట్టు వనములో మృతి నొందినట్లును, అట్లు నశించిన వ్యాకరణము సిద్ధులలో గలిసిన సారంగధరుడు తన చిన్నతనములో నేర్చుకొని యుండుట చేత మల బాల సరస్వతి యను బ్రహ్మణునకు జెప్పి నట్లును లోక ప్రవాదము కలిగి యున్నది.

తన కాలం నాటికి బహుళ ప్రచారంలో ఉన్న విషయాన్ని కందుకూరి వీరేశలింగం తన ‘ ఆంధ్ర కవుల చరిత్ర’ లో ఉటంకించారు. ఈ కథనం మీద చారివూతక చర్చ జరగవలసి ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ప్రసిద్ధి పొందకుండా, తొలి గ్రంథంగా భావించబడిన తన రచన మహాభారత ఆంధ్రీకరణ కన్నా మరో రచన ముందు వెలుగు చూడకుండా చేసిన కుట్ర ఇందులో దాగి ఉంది. ఆంధ్రుల ఆధిపత్య అభిజాత్యం ఆది కవిగా పిలవబడిన నన్నయ నుంచే ఆరంభమైందని ఈ ఘటన రుజువు చేస్తోంది

4 కామెంట్‌లు:

Kumar చెప్పారు...

ఇది మనిషికి సహజంగా వుండే అసుయాని సుచిస్తుంది కాని, నన్నయకి "Hidden Agenda" వున్నది అని నెను అనుకొను. మనము ప్రతి విషయాన్ని తెలంగాణ అజెండా లొ చుస్తె మనకు అన్ని అలగె కనిపిస్తాయీ.

SHANKAR.S చెప్పారు...

తూములూరి గారు తెలంగాణా వాళ్లకు అన్యాయం జరిగిందని చాటే ఉద్దేశ్యం లో కొన్ని వాస్తవాలను మర్చిపోయారు.
వేములవాడ అనేది ఒక వంశం పేరండీ. ప్రాంతం పేరు కాదు. తెలుగువారిలో ఊరిపేర్లు ఇంటి పేర్లు గా ఉండటం మనకు తెలిసిందే. పోనీ వారి పూర్వీకులు వేములవాడ గ్రామానికి చెందిన వారు అనుకున్నా తూర్పుగోదావరి జిల్లాలో కూడా వేములవాడ పేరుతో ఒక గ్రామం ఉందన్న విషయం తెలుసుకోవాలి. ఇది ద్రాక్షారామం పక్కన ఉంది. అంతెందుకు స్వయంగా వేములవాడ భీమకవి తన గురించి పరిచయం చేసుకున్నట్టుగా చెప్పబడే ఈ పద్యం గురించి తెలుసుకోకుండా ఆయనేదో తెలంగాణా వాడని, ఆంధ్రోల్లు తోక్కేసారని విషం చిమ్మడం భావ్యం కాదు. ఇదిగో వేములవాడ భీమ కవి పద్యం. ఇప్పుడు చెప్పండి.

ఘనుడన్ వేముల వాడ వంశజుడ దాక్షారామ భీమేశ నందనుడన్ దివ్య విషామృత ప్రకట నానాకావ్యధుర్యుండ ,భీమన నా పేరు వినంగ జెప్పితి తెలుంగాధీశ ! కస్తూరికా ఘనసారాది సుగంధ వస్తువులు వేగంబిచ్చి లాలింపురా !


ఆయనది ఏ వేములవాడో? ఆయన ఏ ప్రాంతం వాడో? ఇది మీకు వివరణ ఇవ్వడం కోసం చెప్పాను తప్ప మహాకవులకు కూడా ప్రాంతీయత అంటగట్టడం భావ్యం కాదు.

Unknown చెప్పారు...

వేములవాడ భీమకవి జన్మవృత్తాంతం:

తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామమునకు 12 కిలోమీటర్ల దూరాన వేములవాడ అనే గ్రామము ఉంది. ఆ గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడుండెను. ఎంతకాలానికీ ఇతనికి సంతానము కలుగలేదు. సంతానము కోసం ఇతను ఐదుగురిని పెళ్ళాడాడు. శివభక్తిపరాయణుడై యజ్ఞయాగాలను చేస్తూ, ఎన్నో విధాలుగా పరమేశ్వరున్ని ఆరాధించాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. అయినా పుత్రలేమి బాధ మాత్రం తప్పలేదు ఇతనికి. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాటిరాత్రి పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ మరణం తర్వాత నీకు పుత్రుడు కలుగుతాడు. అతని వల్ల నీకు పుణ్యలోకసిద్ధి కలుగుతుంది” అని చెప్పాడు. ఆనాటి నుంచి దిగులు మానేసి, సంతోషంగా కాలం గడిపి మరణించాడు. ఇతని ఐదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. అమాయకురాలు. నిష్కల్మషమైన మనసు కలది, భర్తలాగా పరమేశ్వరుని మీద అపారమైన భక్తి కలది.

మరింత సమాచరం కోసం: http://shribheemalingeswaraswamy.blogspot.in/

Unknown చెప్పారు...

శ్రీ వేములవాడ భీమకవి జన్మవృత్తాంతం:
తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామమునకు 12 కిలోమీటర్ల దూరాన వేములవాడ అనే గ్రామము ఉంది. ఆ గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడుండెను. ఎంతకాలానికీ ఇతనికి సంతానము కలుగలేదు. సంతానము కోసం ఇతను ఐదుగురిని పెళ్ళాడాడు. శివభక్తిపరాయణుడై యజ్ఞయాగాలను చేస్తూ, ఎన్నో విధాలుగా పరమేశ్వరున్ని ఆరాధించాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. అయినా పుత్రలేమి బాధ మాత్రం తప్పలేదు ఇతనికి. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాటిరాత్రి పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ మరణం తర్వాత నీకు పుత్రుడు కలుగుతాడు. అతని వల్ల నీకు పుణ్యలోకసిద్ధి కలుగుతుంది” అని చెప్పాడు. ఆనాటి నుంచి దిగులు మానేసి, సంతోషంగా కాలం గడిపి మరణించాడు. ఇతని ఐదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. అమాయకురాలు. నిష్కల్మషమైన మనసు కలది, భర్తలాగా పరమేశ్వరుని మీద అపారమైన భక్తి కలది.
మరింత సమాచరం కోసం: http://shribheemalingeswaraswamy.blogspot.in/