21, జులై 2011, గురువారం

బంద్ అంటే ఇదేనా..?

పార్లమెంటులో తెలంగాణ బిల్లును డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల క్రితం రెండురోజుల పాటు బంద్ నిర్వహించారు. ఇప్పుడు సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలంటూ కడప జిల్లాలో గురువారం (20/07/11)న బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది. అంతా స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొనాలని కోరింది. అంతా బాగానే ఉన్నా, బంద్ పాటించని కొంతమందిపై దాడులు జరగడమే ఆందోళనను కలిగిస్తోంది. సీమాంధ్రలో సాగుతోంది ప్రజా ఉద్యమమని అక్కడి నేతలు చెబుతున్నారు. కానీ, కడప జిల్లాలో ఈ రోజు ఉదయం విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతలు బలవంతంగా బంద్ ను నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లలో వీరంగం సృష్టించారు. బస్సుల టైర్లలో నుంచి గాలి తీసేశారు. అద్దాలు పగలగొట్టారు. ఉదయాన్నే షాపులు తెరిచిన చిన్న చిన్న వ్యాపారులపై దాడులు చేశారు. బలవంతంగా దుకాణాలు మూయించారు. పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. పెట్రోల్ నింపుకుంటున్న వారిని బెదిరించారు. బాటిల్ లో పెట్రోల్ పట్టుకుంటున్ ఓ వ్యక్తి చేతిలో నుంచి దాన్ని లాక్కొని విసిరి పారేశారు. ఆటో డ్రైవర్లను కొట్టారు. చిన్న చిన్న వారిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఇదేనా స్వచ్ఛంద బంద్..? ఇదేనా ప్రజా ఉద్యమం..?

5 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

2009 డిసెంబర్‌లో మా ఊర్లో కూడా షాపులు బలవంతంగా ముయ్యించారు. నా షాప్ మేడ మీద ఉండడంతో లోపలి నుంచి షటర్లు వేసి వర్క్ చేసుకునేవాణ్ణి.

Jai చెప్పారు...

This is not new. Both andha desham (1953) & andhera pradesh (1956) were formed only through liberal dose of violence. Violence is the favored tool of the andha guys for securing steel plant, aolishing Mulki rules, stopping Telangana, settling faction disputes & "teaching" Dalits.

అజ్ఞాత చెప్పారు...

నిజమే రాష్ట్రం ఎమై పోయినా పర్వాలేదు నా వ్యాపారం నాకు ముఖ్యం అనుకునే వెధవల పై బలవంతంగా బంద్ ను రుద్దడం తప్పే...అనుమానం లేదు...

అజ్ఞాత చెప్పారు...

@jai...excellent..

అజ్ఞాత చెప్పారు...

telangana or andhra ekkadi bund ayina anthe, yevaru shops musukundamani anukoru, vachi balavanthamga muyistaru, hyd lo anthe kadha epudu bund ayina, bikes meedha vachi terichina shops muyistaru