3, ఫిబ్రవరి 2010, బుధవారం

తెలంగాణాపై కమిటీ ఏర్పాటు

తెలంగాణాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొత్తం మీద కమిటీని ఏర్పాటు చేసింది. ఏ వర్గానికీ ఇబ్బంది లేకుండా, విధి విధానాలను ఖరారు చేయకుండానే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ దీనికి నేతృత్వం వహిస్తారు.. ఈయనతో పాటు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ రీసర్చ్‌ ఫెలో డాక్టర్‌ అబు సలీం షరీఫ్‌, ఢిల్లీ ఐఐటిలో హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌ కౌర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు..
కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి వినోద్‌ కె.దుగ్గల్‌ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు..
డిసెంబర్‌ 9, 23౩న కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనలు, జనవరి 5న ఎనిమిది రాజకీయ పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హోం శాఖ ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు, ప్రజలతో విస్తృతమైన చర్చలు జరుపుతుందని మాత్రమే వెల్లడించింది. ఈ ప్రకటనలో హోం శాఖ ఎక్కడా తెలంగాణా ఊసు ఎత్తలేదు.. కమిటీ చైర్మన్‌తో చర్చించిన తరువాతే విధి విధానాలను ఖరారు చేస్తారని పేర్కొంది..వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి