8, ఫిబ్రవరి 2010, సోమవారం

బిరుదురాజు రామరాజు కన్నుమూశారు


ప్రముఖ సాహిత్య వేత్త, జానపదాల పరిశోధకులు ఆచార్య బిరుదురాజు రామరాజు ఈ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.. ఆయన వయస్సు ౮౬ సంవత్సరాలు.. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. తెలుగు సాహిత్యంలో మరుగున పడిపోతున్న జానపద సాహిత్యాన్ని, గేయాలను పరిశోధించి వెలుగులోకి తీసుకువచ్చిన మేధావి ఆయన.. జానపదాలలోని అనేక ప్రక్రియలను తెలుగు ప్రపంచానికి మరోసారి పరిచయం చేసిన సాహిత్యవేత్త రామరాజు.. దీంతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యోగుల గురించి ఆరు సంపుటాల్లో పరిశోధనాత్మక గ్రంథాలను వెలువరించారు.. జాతీయ ప్రొఫెసర్‌గా అరుదైన గౌరవం పొందిన ఆచార్యులు బి.రామరాజు... ఆయన మృతికి ప్రజాకవి, అందశ్రీ, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు..వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి