మొత్తం మీద కాంగ్రెస్ ఇన్నాళూ్ల తొడుక్కున్న చొక్కాలన్నీ విప్పేసి వరిజినల్ వేషంలోకి వచ్చేసింది. ఆరేళ్ల పాటు ఒక్క నాయకుడి మాటపై, ఒక్క తాటిపై నడచిన పార్టీలో అసమ్మతులు, అంతర్గత సంఘర్షణలతో కలకలమంటోంది... వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా కాంగ్రెస్ విడిపోయిందా అన్నంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కొండాసురేఖ రాజీనామా.... పిఆర్‌పితో గ్రేటర్ ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం పార్టీలో గుంభనంగా ఉన్న అసంతృప్తిని ఒక్కసారిగా వెళ్లగక్కింది..
మొన్నటికి మొన్న పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా పెద్ద హైడ్రామాగానే కొనసాగింది. తన రాజీనామా లేఖను నేరుగా ముఖ్యమంత్రికి ఇవ్వకుండా, గవర్నర్‌కు ఇవ్వడం, అందునా ఆరు పేజీల లేఖను ఇవ్వటం విచిత్రం. అందులో పార్టీ వ్యవహారాలన్నీ ఏకరువు పెట్టడం మరో విడ్డూరం. ఇదేమని అడిగితే గవర్నర్ తనకూ అధిష్ఠానానికి మధ్య మీడియేటర్‌గా వ్యవహరిస్తారన్నట్లుగా మాట్లాడటం ఇంకో వింత....గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో కూడా తెలియని వాళు్ల మంత్రి పదవులు ఎలా నిర్వహించారో అర్థం కాదు..
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్‌లోని జగన్‌మోహన్ రెడ్డి వర్గం చాలా వూ్యహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్‌సలో ఆయన తన తదుపరి చర్యను చెప్పకనే చెప్పారు.. ప్రభుత్వంతో ఘర్షణ చేయనంటూనే సవాలుగా మారుతున్న సంకేతాలు పంపించారు...తన తండ్రి ప్రారంభించిన పథకాలు సరిగా అమలు కావటం లేదంటూ నాటి నుంచే ఘర్షణాత్మక వైఖరిని అవలంబించటం ప్రారంభించారు.. ఇక అనుచరగణం జగన్ వెంట వీర విధేయంగా ముందుకు సాగుతోంది. రోశయ్యకు వ్యతిరేకం కాదంటూనే జగన్‌ను సిఎం చేయాలంటారు... అధిష్ఠానం మాటను కాదనమని చెప్తూనే ధిక్కారస్వరాలు వినిపిస్తారు.. కొండా సురేఖ రాజీనామా, ఈ రకమైన ఎత్తుగడల్లో మొదటిది మాత్రమే....
సురేఖ రాజీనామా పత్రాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేశారు.. సిఎల్‌పి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నది అందులో ప్రధాన ఆరోపణ... సిఎల్‌పి సమావేశం ఏర్పాటు చేస్తే జగన్ వర్గీయులు ఖచ్చితంగా గందరగోళం సృష్టిస్తారని అధిష్ఠానం బెంబేలెత్తుతోంది. అందుకనే సిఎల్‌పిని సమావేశ పరచటంలో ఇంత ఆలస్యం.. ఒక్కసారి సిఎల్పీ సమావేశం జరిగిన నాయకుణ్ణి ఎన్నుకుంటే.. ఆ తరువాత అసమ్మతిని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదని అధిష్ఠానం భావిస్తూ ఉండవచ్చు. అందుకనే వ్యవహారాన్ని ఇంతగా తాత్సారం చేయటం.. ఎవరినీ అవుననకుండా, కాదనకుండా వ్యవహారాన్ని వీలైనంత ఎక్కువ కాలం నాన్చటం ద్వారా ఎవరో ఒకరు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది... అప్పుడు అధిష్ఠానానిదే పై చేయి అవుతుంది... రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పూర్తిగా గుప్పెట్లో పెట్టుకుంటే తప్ప ఆధిపత్యాన్ని కొనసాగించటం కేంద్ర నాయకత్వానికి సాధ్యం కాదు...
సురేఖ రాజీనామాలో మరో కీలకాంశం కులం.... జగన్‌ను ముఖ్యమంత్రి కాకుండా కమ్మలాబీ తీవ్రంగా కృషి చేస్తోందని ఆరోపించి సురేఖ సంచలనమే సృష్టించారు... ఈ మాటలు అధికార పార్టీలోనే కాదు.. మిగతా పార్టీల్లోనూ నేతలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. జగన్ వర్గం కావాలనే ఈ పదాన్ని వాడినట్లు అర్థమవుతోంది.
2
సురేఖ రాజీనామా వ్యవహారం పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల్లో పైకి కనపడకపోయినా గుబులు పుట్టించిందన్న మాట వాస్తవం.. ఆమె రాజీనామాను సీనియర్లు తప్పు పడుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని విమర్శించారు. ఈ వ్యవహారంతో జగన్‌కు నష్టమే తప్ప లాభం లేదనీ వ్యాఖ్యానిస్తున్నారు.. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ కుట్ర చేయలేదనీ స్పష్టం చేస్తున్నారు...అలా అంటూనే ఎవరి ఎత్తుగడలు వాళు్ల వేస్తున్నారు..
సురేఖ రాజీనామా వ్యవహారాన్ని జగన్ వ్యతిరేక వర్గం పూర్తిగా తప్పు పట్టింది ఆమె రాజీనామా చేసిన పద్ధతి క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తుందన్నది వారి వాదన. గవర్నర్‌కు నేరుగా రాజీనామా చేయటం పార్టీకి వెన్నుపోటు పొడవటమేనని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు. అయినా ఆమె రాజీనామా చేయటం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని కూడా ధీమాగా ఉన్నారు..
సురేఖ కుల ప్రస్తావన తేవటంపైనా నేతలు సీరియస్ అయ్యారు.. పార్టీలో కుల ప్రభావం ఉండదని వారంటున్నారు..
అయితే జగన్ శిబిరంలో ఉన్న ఇతర నేతలు తాము కూడా సురేఖ బాటలో రాజీనామా చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు చెప్తున్నారు.. జగన్‌కు లాభం కలుగుతుందంటే మంత్రులం అంతా రాజీనామా చేయటానికి సై అని కూడా వారు స్పష్టం చేస్తున్నారు..
సురేఖ రాజీనామా తరువాత కూడా రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండు వర్గాలూ తమ తమ వాదనలను బలంగానే వినిపిస్తున్నాయి.
పిఆర్‌పి పొత్తు వ్యవహారం కూడా ఇలాగే జరిగింది. చివరి నిమిషంలో డిఎస్ చేసిన ప్రయత్నాలపై వీరప్పమొయిలీ నీళు్ల చల్లారు... మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు వేర్వేరు దారుల్లో వెళు్తన్నట్లు స్పష్టంగా బహిర్గతమయింది. ఇక నుంచి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రానున్న నాలుగేళ్లలో మరింత రసవత్తరంగా కొనసాగుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి