1, జనవరి 2010, శుక్రవారం

చరిత మరువాడు నీ చతురత

చరిత్రను మార్చలేం.. ఒక్కసారి మాట బయటకు వచ్చిన తర్వాత దాన్ని కూడా మార్చలేం. అందుకు ఇదిగో.. ఇదే ఓ నిదర్శనం. కర్నూలులో ఆంధ్ర రాష్ట్ర శాసన సభలో.. రాష్ట్ర విలీనంపై..నీలం సంజీవరెడ్డి ఇచ్చిన హామీని.. ఆయన మాటల్లోనే..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆవిర్భావానికి నాందిగా, ‘విశాలాంధ్ర ఏర్పాటు’ తీర్మానాన్ని 1956 ఫిబ్రవరి 1వ తేదీన కర్నూలు కేంద్రంగా ఉన్న ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడుతూ 1956 ఫిబ్రవరి 1న చేసిన ప్రసంగ భాగం

ఇది ఆంధ్రదేశానికి, విశాలాంధ్ర రాష్ట్రానికి సంబంధించిన తీర్మానం. అతి ముఖ్యమైనది. ఇప్పటి పరిస్థితులలో దీన్ని రెండోసారి మన అసెంబ్లీ ముందుకు తీసుకురావాలసిన ఆగత్యం కలిగినందుకు విచారిస్తున్నాను. భారత దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ప్రభుత్వం వారు తమ తీర్మానాలే మిటో తెలియజేశారు. పంజాబ్‌ విషయంలో మాత్రం ఏవో చర్చ లు జరుగుతూఉన్నాయి.

అక్కడున్న పరిస్థితులను బట్టి హిమాచ ల్‌ప్రదేశ్‌ను కలపడమా లేదా అనే విషయం గురించి, తరువాత పంజాబీ, హిందీ- ఇలాంటి రెండు మూడు భాషలు కలిగిన భాషాసమస్యల గురించి పరిశీలన చేస్తున్నారు.అది పరిశీలనకు అవసరమైన సమస్యే అనుకుంటున్నాను. చాలా ఇబ్బందులున్నా యి, నాకు తెలుసును. కానీ తెలుగువారికి సంబంధించినంత వరకు ఎంత ఆలోచించినా సరే అట్టి ప్రధానమైన పరిస్థితులు కనబడలేదు. కాబట్టే ఈ విశాలాంధ్రను గురించిన సమస్య ఎం దుకు వాయిదా వేస్తున్నారో ఎంత అర్థం చేసుకోవాలని ప్రయ త్నం చేసినా అర్థం కావడం లేదు. ఇది చిన్న సమస్య. మలయాళం మాట్లాడే వారికి మలయాళ రాష్ట్రం ఇచ్చినట్లు ప్రకటన జరిగింది. కర్ణాటకులకు అన్ని రాష్ట్రాలలో ఉన్న భాగాలను చేర్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.

కర్ణాటక ప్రాంతం, బొంబాయిలో ఉన్న కొద్ది కన్నడ ప్రాంతం ఇవన్నీ కలిపి మైసూరు రాష్ట్రంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించడం, ఆ ప్రకటన తర్వాత అన్ని ప్రాంతాలోని ప్రజలూ ఉత్సాహపూరితంగా స్వీకరించి కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆలోచించుకొని తమ భవిష్యత్తు గురించి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ మధ్య ఢిల్లీ పోతుంటే ముఖ్యమంత్రి హనుమంతయ్యగారు హైదరాబాదుకు వచ్చి అక్కడి కర్ణాటక మిత్రులను, ఉద్యోగులను కలసుకొని వారి అభిప్రాయాలు తెలుసు కొని రానున్న మైసూరు రాష్ట్రంలో ఏ రకం గా వారి సహకారం పొందాలా అని ఆలో చిస్తున్నారు.

ఇతర రాష్ట్రాలవారు, మహారా ష్ట్రులు మొదలైనవారందరూ తమ రాష్ట్రా లకు సం బంధించుకొని తమ శ్రేయస్సు, భావి భాగ్యోదయం అలోచించుకుంటూ ఉంటే, ఈనాడు ఆంధ్రులకు మాత్రం మా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, భవిష్యత్తులో కలిసి ఉంటామా, లేక ఆంధ్రులలో చీలికలుంటాయా అని ఆందో ళన చెందుతున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రులకు మాత్రమే ఈ సమ స్య ఎందుకు వచ్చింది అని ఆతృత పడుతున్నారు. ఇంత ఆల స్యం చేయడా నికి కారణం ఏమిటి? ఇది మనకు దురదుష్టకరం. చిన్న సమస్య ను పెద్ద సమస్యగా మార్చి, గోరుతో పోవలసినది గొడ్డలితో కొట్ట వలసిన పరిస్థితి కావడం మన దురదుష్టం అనే అనుకుంటు న్నాను. ఇప్పటికైనా ఈ విషయం త్వరగా తేల్చమని చెబుతున్నా ను. ఈ సమస్య అంత బ్రహ్మాండమైన సమస్యకాదు అని మాత్రం మనం ఢిల్లీ ప్రభుత్వానికి తెలియజేసేనిమిత్తం ప్రత్యేకంగా ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నాం.

ప్రత్యేకంగా, తెలంగాణ మిగులు రాష్ట్రం అనుకుంటు న్నారు తెలంగాణ వాదులు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కలి స్తే ఆదాయం తగ్గిపోతుందంటున్నారు. దీంట్లో ఏ మాత్రం అర్థం ఉన్నదని అనుకోవడానికి అవకాశం కనబడలేదు.ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా సరే మిగులు రాష్ట్రం అన డానికి వీలున్నదా అనే సమస్య అర్థం కాకుండా ఉన్నది. అలాంటప్పుడు భారతదేశ రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కూడా ఉన్నాయి.కావలసిన విద్య లేదు. ఆరోగ్య సదుపాయాలు లేవు. కాబట్టి ఆంధ్రరాష్ట్రం ఈనాడు నాలుగు కోట్ల తరుగులో ఉన్నదన్నా నేను గర్విస్తున్నాను. మన అభివృద్ధి చూస్తే, మద్రాసు రాష్ట్రాన్ని మించిన పథకాలున్నాయి. ఇలాంటివి ఆదాయాన్ని గురించి అలోచించకుండా, ఎంత నష్టం వస్తుందని ఆలోచిం చకుండా, స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించడాన్ని బట్టి లోటు రాష్ట్రంగా ఉన్నాం.

ఇక ఇప్పుడు ‘ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా పెడతాం, 5 ఏండ్ల తర్వాత అలోచిస్తాం’ అనే సమస్యను కొందరు లేవదీస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులున్నాయో హైదరాబాద్‌లోని మన మిత్రులకు తెలియకపోలేదు. మద్రాసులో మన ఆఫీసులు, ఇంకో చోట కొన్ని ఆఫీసులు చిందర వంద రగా ఉండటం వల్ల, మద్రాసులోని మన ఆఫీసుతో ప్రభుత్వానికి సంబం ధం లేకుండా ఇప్పటికి రెండున్నర సంవత్సరాలనుండి ఎన్నో ఇబ్బందు లకు గురయ్యాం. ఇప్పటికిప్పుడే ఈ కర్నూలు పట్టణంలో రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 5 ఏళ్ల వరకూ మన ఆఫీసులన్నీ మద్రాసులో ఉంచుకొని, ఈ కర్నూలులో ఉండి ఈ ప్రభుత్వం ఈ రకంగా అవకతవకలుగా ఉండడమేనా? ఈ ప్రభుత్వం ఆంధ్రుల శ్రేయస్సుకోసం అంతా కలిసి ఒకే చోట ఉంటే, మన ప్రభుత్వం నడుపుకోడానికి విశాలాంధ్ర రాష్ట్రం త్వరగా రావడం ఎంత మంచిదో ఆలోచించుకోమని కోరుతున్నాను.

ఐదు ఏళ్ల పాటు ఇక్కడ ఉండవలసి వస్తే, మరొక మూడు కోట్లు ఖర్చుపెట్టి, అనవసరంగా వృధాగా ఖర్చుపెట్టి 5, 6 ఏళ్ల తర్వాత మూట ముల్లె కట్టుకొని హైదరాబాద్‌ పోవడం ఎవరికి వచ్చిన లాభమో ఆలోచించమని అడుగుతున్నాను. ఈ రెండున్నర ఏళ్లు ఇక్కడ ఇసుక, సున్నంకు ఖర్చు పెట్టే మూడు కోట్లు హైదరాబాద్‌లో వెనుకబడిన ప్రాంతంలో వంద స్కూళ్ల ప్రారంభించడానికి ఉపయోగపడితే ఎంత శ్రేయస్సో ఆలోచించమని ప్రార్థిస్తు న్నాను.

ఇది స్వార్థంతో చెప్పినది కాదు, మన తరుగు తీసుకు వెళ్లి, వాళ్లకు అంటగట్టి వాళ్ల మిగులు తెచ్చి మనం ఉపయో గించుకోవాలని కాని, వాళ్ల మిగులు తెచ్చుకొని విద్యతో అభివృద్ధి పొందిన ప్రాంతాలలో ఇంకా బడులు పెట్టాలని కాని, ఈ ప్రాంతం వారు దురాశతో విశాలాంధ్రను కోరుకోవడం లేదు- అని ప్రేమ పూర్వకంగా ఈ అసెంబ్లీ ద్వారా మనవి చేస్తున్నాను. వారు తెచ్చినటువంటి ఇలాంటి అభ్యంతరాలను ఢిల్లీ ప్రభుత్వం గమనించకూడదని, పాటించకూగదని మరొక పర్యాయం ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాల విషయంలో ఎక్కువ విద్యాధికులుగా ఉన్న ఈ ప్రాంతవాసులు ఉద్యోగాలన్నీ తీసుకుపోతారని, తమకు లభించవని కొంత ప్రచారం జరుగుతూ ఉన్నట్టూ విన్నాను. ఈ ప్రచారానికి తావులేదు. ‘మీ ఉద్యోగాలు మాకు అవసరం లేదు. మీ 1‚‚‚‚/3వ వంతు మేము తీసుకోబోమని హామీ ఇస్తున్నాం’ అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినారు.

ఏ ప్రాంతంలో ఎంత దూరంలో ఉన్నా ఆంధ్రులు అంతా ఒక్కటే. మనం అంతా కలిసి ఉంటే కష్ట సుఖాలు సమానంగా పంచుకుంటాం. తెలంగాణ వెనుక ఉంటే సంతోషించము. ముందుకు తీసుకపోయి సౌష్టవంగా బాగుపరచుకోవడానికి వీలు పడువుతుంది. టెక్కలి, శ్రీకాకుళం నుంచి హిందుపురం వరకు ఒకే అభిప్రాయపడటం చాలా సంతోషకరం. ఇదంతా గమనించి హైదరాబాదు మిత్రులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారని అనుకుంటున్నాం. ఎందుకో అనుమానాలు తొలగించలేకుండా ఉన్నాం. మన శక్తి లోపం అయినా కావచ్చు, అర్థం చేసుకునే శక్తి వారిలో లోపించి ఉండవచ్చు, ఈ రెండింటిలో ఏదైనా ఉండవచ్చు!

కామెంట్‌లు లేవు: