11, జనవరి 2010, సోమవారం

ద్రౌపది అగ్ని సంభవ

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రచించిన ద్రౌపది నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన వార్త తెలుగు సాహిత్య లోకంలో అపూర్వమైన కల్లోలాన్ని రేపింది. పురాణ ఇతీహాసాల్లోంచి పాత్రలను తీసుకుని మానవతా దృక్పథంతో ఆధునిక జీవన చైతన్యంతో చిత్రించటం ఈనాడు జరుగుతున్నదే. కెఎం మున్షీ కృష్ణావతారం సంపుటాలు మహాభారతానికి ఆధునిక కథారూప కల్పన. దీంతో ఎవరికీ పేచీ లేదు. ఇట్లా అనేక భారతీయ భాషల్లో ప్రాచీన గాథల్ని మళ్లీ కొత్తగా చెప్పటం మనకు కనిపిస్తుంది. రసోచితంగా పూర్వ ఇతివృత్తాన్ని మార్చ వచ్చని ఆలంకారికులు చెప్పారు.. కాళిదాసు శాకుంతలంలో మహాభారతంలో లేని కల్పనలు చేశాడు. ఈ మార్పులని భారత జాతీయ జనుల మౌళిక విశ్వాసాలకు అనుగుణంగా ఉన్నవే. మౌలిక విశ్వాసాలకు భంగం కలిగించే మార్పులు ఏ సమాజమూ హర్షించదు. ఆ మార్పులు ఆ పాత్రల స్థాయిని అత్యంతమూ, అధోభూమికలోకి లాగినప్పుడు ప్రజల హృదయాలు గాయపడి సంక్షోభం చెలరేగుతుంది. లక్ష్మీ ప్రసాద్‌ నవల వల్ల ఇవాళ జరుగుతున్న అల్లకల్లోలం అలాంటిదే.

ద్రౌపది పాత్ర ప్రధానంగా నిర్మింపబడ్డ ఈ నవల పురాగాధకు కొత్తరూపమే. అయితే, మహాభారత రచనలోని పాత్రల మూల స్వభావాలకు, లక్ష్యాలకు ఈ రచన భిన్నంగా, విరుద్ధంగా పాత్రల నిర్మాణం చేసింది. ద్రౌపది అగ్ని సంభవ. అయోనిజ. ఈ రెండు లక్షణాలు ఆమెలోని ఈశ్వరాభిముఖంలో ఉన్న చైతన్యానికి ప్రతీకలు. అగ్ని జ్వాల ఎప్పుడూ ఊర్థ్వ ముఖంగానే ఉంటుంది. కామ భావం ఎప్పుడూ అథోముఖంగా ఉంటుంది. ద్రౌపది పుట్టుక వెనుక, ఒక మహావీరుడి గాయపడ్డ అభిమానం తపోరూపంలో వరంగా ఆమెను పొందిన అంశం వ్యక్తమవుతుంది. ఈ పుట్టుక నాటి నుంచి మత్స్య యంత్ర భేదన వేళలోనూ, వసా్తప్రహరణ వేళలోనూ, ఆమె ధీర యువతిలాగా ఎవరై్ననా, ఎంత పెద్దలైనా ప్రశ్నించగలదిగా కనిపిస్తుంది. ఆ క్రమంలో కామ చేష్ట ద్వారా పిలిచినందుకే దుర్యోధనుణికి ఊరు భంగం కలిగించింది. జుట్టు పట్టి లాగినందుకు దుశ్శాసనుణ్ణి రొము్మ చీలేట్లు చేసింది. కామంతో తన వెంటపట్ట సైంధవుణ్ణి అవమానింపజేసింది. కీచకుణ్ణి మట్టి కరిపించింది. భారత యుద్ధ సందర్భంలోనూ ఆమె సందేశం ప్రతీకారమే. తిక్కన `ఈ వెండ్రుకలు పట్టిన ఆ చేయి' మొదలైన పద్యాలు ఆమె తత్తా్వన్ని ప్రకటింప చేస్తాయి. శ్రీకృష్ణుని ఆమె భగవద్భావంతో ఆరాధించింది కానీ, రాధ వలెనో, గోపిక వలెనో మధుర భక్తి మార్గంలో ప్రయాణించలేదు. అందువల్ల ద్రౌపదిశ్రీకృష్ణ సంబంధాన్ని జయదేవుని గీతగోవిందంతో పోల్చి చూడమనటం హేతు విరుద్ధమైన అంశం. ద్రౌపది ఉజ్జ్వలమైన పాత్ర చిత్రణం భట్టనారాయణుని వేణీ సంహారంలో కనిపిస్తుంది. ఈ భూమిక మీద ఆలోచిస్తే, లక్ష్మీ ప్రసాద్‌ నవలలోని ద్రౌపది పాత్ర చిత్రణ, సన్నివేశాల వివరణ అంతా, ఆమె యందున్న పూజ్యమైన మాతృభావనను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం కనిపిస్తుంది. నెల్లూరు ప్రాంతంలో ద్రౌపది తిరునాళు్ల అనే పేర ఇప్పటికీ ఆమెను ఆదిశక్తిగా ఆరాధించే జానపద సంప్రదాయం ఉంది.
ఈ నవలలో ద్రౌపదిని కామాతురగా చిత్రించటం పెద్ద దోషం.. పంచ భర్తృక అనే భావం ఒక ప్రతీకాత్మకమైందే తప్ప, కామ భావానికి సంబంధించింది కాదు.. కుంతి సంతానమందు ఆరాధించిన ఇంద్ర, యమ, వాయు, అశ్వినీ దేవతల అంశలు, శక్తులు ఆవరించి ఉన్నవనే తప్ప, మానుషమైన శృంగారం ప్రధానాంశం కాదు.. ఎక్కడైనా హిమాచల ప్రాంతంలో ప్రాచీన కాలంలో బహు భర్తృత్వం అనే ఆచారం ఉన్నదని పేర్కొన్నా, ఆ సమాజం ఆనాడు విధించుకున్న ధర్మమే తప్ప, కామ అతిచారం కాదు. అలా వ్యాఖ్యానిస్తే, ఆ గిరిజన సంస్కృతిని మనం అవమానించినట్లే. ద్రౌపదీ దేవి సౌందర్యం లోకోత్తరమైందనీ, ధృతరాష్రు్టని కోడళు్ల ఆ సౌందర్యానికి ముగ్ధలైనారని వ్యాసుడు చెప్పటం, ఆమె శరీరంలో అంతర్గతంగా లీనమై ఉన్న అగ్ని హోతృని ప్రకాశమే తప్ప, సర్వ పురుషాకర్షకమైన తక్కువ స్థాయి అందం కాదు. ఈ నవలలో చిత్రించిన ద్రౌపది కామాతుర. ఆమె యందు భర్తలు కామోల్బణం కలవారే. భీష్మ ద్రోణాదులు కూడా ఆమె శారీరక సౌందర్యం యెడల లాలస ఉన్న వాళు్లగా చెప్పబడ్డారు.. అన్నింటికంటే ఆశ్చర్యం సాక్షాత్తూ భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా ఆమె యందు కామలోలకుడైనట్లుగా వర్ణించటం. ఈ అంశాలన్నీ వ్యాసుని భారత తాత్పర్యానికి, కావ్య పరమార్థానికి విరుద్ధమైన అంశాలు.. అతిలోకమైన ఆ వ్యక్తిత్వాన్ని తలక్రిందులుగా చేసి చిత్రించటం. ఈ పని ఏదో అప్రసిద్ధమైన రచన విషయంలో జరగలేదు. భారతీయులు అయిదు వేల సంవత్సరాలుగా ఆరాధించే మహాభారత విషయంలో జరగటం అత్యంత శోచనీయమైంది. ఖండించదగింది.

9 కామెంట్‌లు:

సురేష్ - మ్యూజింగ్స చెప్పారు...

నేనైతే ఈ పుస్తకము చదవలేదండి. కానీ ఆ పుస్తకములోని సారము మీరు చెప్పినట్టు ఉంటే మాత్రము చాలా అభ్యంతరకరము. మునుపు భారత ప్రభుత్వము ban చేసిన పుస్తకాల నేపథ్యములో చూస్తే ఇది మరింత అభ్యంతరకరము.

కొత్త పాళీ చెప్పారు...

అసలే కొంచెం పైత్యం.
ఆ పైన ప్రకోపించింది.
అటుపైన ఎవార్డు కూడా దొరికింది.
ఇహనేం?

Indian Minerva చెప్పారు...

కొంపదీసి ఇదిగానీ కొన్నేళ్ళక్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చిన ధారావాహిక కాదు కద...! దాని పై నాకునాలుగైదు అభిప్రాయాలున్నాయి (దాన్నే మిశ్రమాభిప్రాయం అంటారనుకుంటా :) ). అప్పట్లో నానా రభస జరగడంతో ఆరచయితను ఆపించేసి దాన్ని యాజమాన్యం వాళ్ళే తిరగరాశారనుకుంటా.

"అలా వ్యాఖ్యానిస్తే, ఆ గిరిజన సంస్కృతిని మనం అవమానించినట్లే." perfect మరిక్కడ అవమానకర దృక్కోణం ఎవరిదంటారు? (ఎలాచెప్పాలబ్బా...? )మనమే అప్పటి విలువలూ (భారతాన్ని చదివేటప్పుడు), ఇప్పటి విలువల (ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు) మధ్య ఊగిసలాడుతున్నారేమో అని నాకనిపిస్తుంది.

"ఆమె యందు భర్తలు కామోల్బణం కలవారే."
ఇక భర్తలు కూడా ఈ so called కామోల్బణం(?) కలగకుండా ఎలా వుంటారో నాకర్ధం కావట్లేదు. అయినా అదేమీ తప్పుకాదే. బహుశా మీ వుద్దేశ్యం అది తప్ప ఇంకేమీ కలిగిన వారు కాదు అనేమో.

"భీష్మ ద్రోణాదులు కూడా ఆమె శారీరక సౌందర్యం యెడల లాలస ఉన్న వాళు్లగా చెప్పబడ్డారు.. అన్నింటికంటే ఆశ్చర్యం సాక్షాత్తూ భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా ఆమె యందు కామలోలకుడైనట్లుగా వర్ణించటం."
Agreed. భీష్మ ద్రోణుల పాత్రల స్వభావాన్ని దృష్టిలోపెట్టుకున్నట్లైతే ఇది బొత్తిగా మింగుడు పడదు. కృష్ణుడి గురించి అలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చటానికి అవకాశంలేదు (అది రచయిత తను చెప్పిన దాన్ని తనే ఖండించడమవుతుంది రచయిత రాసినంతవరకూ చదివిన నాకు ఇలా రాశాడంటే నమ్మశక్యంగాలేదు).

kovela santosh kumar చెప్పారు...

minerva gaaru... kamolbanam kaligina vaaru annadi sadaru navalalo chitrinchina droupadi paatrala chitreekarana gurinchi... bharatam loni droupadi bhartala patrala vaikhari gurinchi kaadu

kovela santosh kumar చెప్పారు...

maroo maata minervaa gariki... kaamolbanam ante kamam adhikamga unna vaaru ani artham.. ulbanam ante pongokoni vache laava laaga korika untundi...meerannadi nijame

VENKATA SUBA RAO KAVURI చెప్పారు...

yaarlagadda drowpadiki saahitya akaadami award istea tappeamito. vandalaadi bharataallo idee okati. ramaayanaaloo vandalaadi vunnaayanitelusaa? ramuduki sita yeamavutundi? aanna prasnaloonea raamaayanamloni vievidhaaniki addam padutomdi. ayinaa awardu vilakhkanatakea kadaa ivvaalisimdi. paata kadhaku yekkadayinaa award istaaraa? ivvaalamtaaraa?

రవి చెప్పారు...

పైన కొత్తపాళీ గారి మాటే నాదికూడా.

Indian Minerva చెప్పారు...

ఈ నవల గురించి నేను వెలిబుచ్చిన నా అభిప్రాయాన్ని ఉపసంహరించుకుంటున్నాను. ఆ నాడు నేను చదివిన ధారావాహిక కొంచెం వైవిధ్యంగా వున్నప్పటికీ అందులో అసభ్యత, అశ్లీలత మాత్రం లేవు (అలావున్నట్లు నాకనిపించలేదు). వీలైతె ఇది చదివి మరోసారి నా అభిప్రాయాన్ని తెలియజేసుకుంటాను.

చదువరి చెప్పారు...

ప్రసిద్ధమైన పౌరాణిక పాత్రలను, కావ్యాలనూ మూల చిత్రణలకు వ్యతిరేకంగా - ముఖ్యంగా అసభ్యంగా - చిత్రించే చాంచల్యం కొందరు సాహితీకారులు, కళాకారులు ప్రదర్శించడం చూస్తున్నాం. బహుశా ఇదొక మానసిక దౌర్బల్యం కావచ్చు.