6, జనవరి 2010, బుధవారం

పెద్ద మనుషుల ఒప్పందం


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నాయకుల మధ్య 1956లో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే పెద్దమనుషుల ఒప్పందంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఒప్పందంపై ఆంధ్రాప్రాంతం నుంచి అప్పటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు; తెలంగాణ ప్రాంతం నుంచి అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్‌రావులు సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు..

1. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒకే శాసనసభ ఉంటుంది. రాష్ట్రానికి చట్టాలు రూపొందించే వ్యవస్థ ఇదే అవుతుంది. రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. మొత్తం పరిపాలనకు సంబంధించి రాష్ట్ర శాసనసభకు జవాబుదారీగా వ్యవహరించే మంత్రి మండలి గవర్నర్‌కు సహాయకారిగా ఉంటూ సలహాలిస్తుంది.

2. కొన్ని ప్రత్యేక అంశాలకు (స్పెసిఫిక్ మేటర్స్) సంబంధించి ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రదేశాన్ని ఒక ప్రాంతంగా పరిగణిస్తారు.

3. తెలంగాణ ప్రాంతం కోసం రాష్ట్ర శాసనసభకు చెందిన ఒక ప్రాంతీయ స్థాయూసంఘం (రీజనల్ స్టాండిగ్ కమిటీ) ఉంటుంది. ఇందులో ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర శాసనసభ సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రికి ఇందులో స్థానం ఉండదు.

4. ప్రత్యేక అంశాలకు సంబంధించిన చట్టాలను ప్రాంతీయ సంఘం సమాలోచనలకు పంపాలి. ప్రత్యేక అంశాలకు సంబంధించి చట్టం చేయడం కోసం ప్రాంతీయ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయొచ్చు. లేదా ఆర్థిక భారం పడని సాధారణ విధానాలకు సంబంధించి చట్టం చేయడం కోసం ప్రతిపాదనలు చేయొచ్చు.

5. ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ సాధారణంగా ఆమోదించాలి. ఒకవేళ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే గవర్నర్ దృష్టికి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.

6. ప్రాంతీయ సంఘం ఈ కింది విషయానలు పరిశీలిస్తుంది.
- రాష్ట్ర శాసనసభ రూపొందించిన సాధారణ అభివృద్ధి ప్రణాళికల చట్రం పరిధిలో అభివృద్ధి, ఆర్థిక ప్రణాళికలు
- స్థానిక స్వీయ ప్రభుత్వం.. అంటే గ్రామీణ పరిపాలన, స్థానిక పరిపాలన నిమిత్తం పురపాలక సంఘాలు, అభివృద్ధి సంస్థలు, జిల్లా బోర్డులు, జిల్లా సంస్థలకు సంక్రమించే రాజ్యాంగ బద్ధ అధికారాలను పరిశీలిస్తుంది.
- ప్రజారోగ్యం, పారిశుద్ద్యం, స్థానిక ఆస్పత్రులు, వైద్యశాలలు(డిస్పెన్సరీలు)
- ప్రాథమిక, మాధ్యమిక విద్య
- తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థల్లో ప్రవేశాల నియంత్రణ
- మద్యపాన నిషేధం - వ్యవసాయ భూముల విక్రయం
- కుటీర, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం, సహకార సంఘాలు, మార్కెట్లు, సంతలు. ఒప్పందాన్ని ముందుగానే సవరించని పక్షంలో ఈ ఒప్పందాన్ని పదేళ్ల తర్వాత సమీక్షించాలి.

1 కామెంట్‌:

Ravindra Varma PVS చెప్పారు...

FEBRUARY 20th 1956
On this date 62 Years ago "Gentlemen's Agreement"
http://etelangana.org/.../2014-04-07_100158_Gentlemen...
was signed between then Telangana State & Andhra State. One of the Signatories was Late Sri ALLURI SATYANARAYANA RAJU.
Alluri Satyanarayana Raju was a Veteran Indian Freedom Fighter who experienced 11 years of imprisonment and subjected to severe torture brutally beaten up by police in 1932 (Veeravasaram Police Station), he had about deep cuts and puncture on his body. The matter was questioned in Madras Assembly, Parliament in Delhi and the Parliament in London ( British Parliament ). Alluri was the General Secretary of the All India Congress Committee, during the tenure of Pandit Jawaharlal Nehru. Alluri was also President of Andhra Congress in Composite Madras State and also the President of Andhra Pradesh Congress Committee. Alluri Satyanarayana Raju was the Cabinet Minister (PWD) under Damodaram Sanjeevaiah they then Chief Minister.
Alluri Satyanarayana Raju lived for 50 Years, Jailed by British for 11 Years. He was member of the Forward block led by Netaji Subhash Chandra Bose for quiet some time. Alluri was confined to solitary imprisonment in Andaman's Jail for a period of 5 Plus years at a streach. His education was 8th Standard and he used to read, write and speak in 5 Different Languages and translated Rahul Sankrityayan's Volga se ganga tak into Telugu.
A great salute to him from all of us..