12, మార్చి 2010, శుక్రవారం

శాకమూరి అప్పారావు ఎన్‌కౌంటర్‌





ఉన్నత లక్ష్యంతో ప్రారంభమైన మవోయిస్టు ఉద్యమం ఇప్పుడు ఏ దారిన వెళ్తోంది?
ఏం సాధించాలనుకుంటోంది...?
ఒకరి వెంట ఒకరుగా అంతమవుతున్న అగ్రనేతలు..
అనారోగ్యం కారణం చెప్పి లొంగిపోయిన కీలక నాయకులు..
సరిహద్దులు దాటి వెళ్లిపోయిన కేంద్రకమిటీ సభ్యులు..
రాష్ట్రంలో ఇక మిగిలిందెవరు?
మావోయిస్టుల ఉద్యమాన్ని నడిపిస్తున్నదెవరు?
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం.. ఎంతోమంది మావోయిస్టుల హతం.. ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న ఎందరో నేతల మరణం.. ఎదురుదెబ్బలు ఎన్ని ఎదురయ్యాయి. ౨౦౦౪ ఎన్నికల తరువాత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టులను తుడిచిపెట్టేయటంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారు.. కానీ, మావోయిస్టుల ఉనికి పూర్తిగా మాసిపోలేదని శాకమూరి ఎన్‌కౌంటర్‌ స్పష్టం చేసింది...

ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు లో శాకమూరి అప్పారావు ఎన్‌కౌంటర్‌ ఇంతకాలం స్తబ్దంగా ఉన్న ఎన్నో ప్రశ్నలను ఒక్కసారిగా లేవనెత్తింది.. నల్లమల అటవీప్రాంతంలో చివరి మావోయిస్టును సైతం అంతం చేశామని ఇంతకాలం రాష్ట్ర పోలీసులు పదే పదే చెప్తూ వచ్చారు.. కొన్నాళ్ల క్రితంఅయితే రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి దాదాపుగా లేనట్లే అన్నట్లుగా సాక్షాత్తూ పోలీసు బాస్‌ డిజిపి సెలవిచ్చారు. కానీ, మావోయిస్టుల అస్తిత్వం అంత తేలిగ్గా కనుమరుగయ్యేది కాదని శాకమూరి ఎన్‌కౌంటర్‌ తేల్చింది.. ౨౦౦౪ ఎన్నికల తరువాత అధికారం చేపట్టిన వైఎస్‌ నక్సలైట్లను చర్చలకోసం హైదరాబాద్‌కు వచ్చేలా చేశారు.. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించి చర్చలకు రావటం ఆనాడు నక్సల్స్‌కు వ్యూహాత్మక తప్పిదంగానే పరిణమించింది..
చర్చలు విఫలం కావటంతో మావోలుగా రూపాంతరం చెందిన నక్సల్స్‌ను భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. చర్చల్లో పాల్గొన్న రియాజ్‌ అవి విఫలమైన కొన్నాళ్లకే హైదరాబాద్‌లోనే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.. జనశక్తి కార్యదర్శి అమర్‌ లొంగుబాట పట్టాడు.. రామకృష్ణ రాష్ట్రమే వదిలి వెళ్లినట్లు సమాచారం.. ఆయన తరువాత రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన మాధవ్‌ను నల్లమల అడవుల్లోనే పావురాల గుట్టవద్ద గ్రేహౌండ్‌ బలగాలు మట్టుబెట్టాయి. నల్లమలను జల్లెడపట్టి మావోయిస్టుల కదలికలకు పూర్తిగా చెక్‌ పెట్టేసింది.. ఆ తరువాత పటేల్‌ సుధాకర్‌ రెడ్డి ఎన్‌కౌంటర్‌ మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ. మిలిటరీ ప్లాటూన్ల ఏర్పాటులో, వ్యూహాత్మక ఎత్తుగడల రచనలో సమర్థుడైన వ్యక్తిని మావోయిస్టులు పటేల్‌ రూపంలో కోల్పోయారు.. ఇక సాంబశివుడు లాంటి ముఖ్యనాయకులు చివరి నిమిషంలో లొంగుబాట పట్టారు..
చాలాకాలంగా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిపోయాయి. తమ వ్యవస్థను పునర్నిర్మించుకునే దిశలోనే మావోయిస్టులు ముందుకు వెళ్తున్నారు.. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు పూనుకోవటం లేదు.. మరో పక్క దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిషేదించటం, లాల్‌గఢ్‌, అబూజ్‌మడ్‌ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం సాగుతుండటంతో రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన నాయకులంతా ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు.. పోలీసుల దృష్టి కూడా అటువైపే ఉండటంతో రాష్ట్రంలో కార్యకలాపాలు ఊపందుకుని ఉండవచ్చు. దాని ఫలితమే ఇవాళ శాకమూరి హతం..ఈ చర్యతో రాష్ట్రంలో మరోసారి యుద్ధం మొదలైంది.. ఇది ఏ కొత్త చరిత్రను రాస్తుందో చూడాలి..

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Police encountered a thug. So what?

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఇది నిజమైన ఎదురుకాల్పుల సంఘటన కాదు. అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి చంపారని ఎవరికైనా అర్థమౌతోంది. మీ సహానుభూతికి ధన్యవాదాలు. ప్రజలకోసం పనిచేస్తున్న వారు ప్రజలలో మమేకమై వున్నప్పుడు ఎప్పుడో ఒకప్పూడు చనిపోకతప్పదు. అజ్నాతమన్నది మీడియాకు, శతృవుకు మాత్రమే కదా? సమస్యలున్నంతవరకు ప్రజాపోరాటాలు కొనసాగుతూనే వుంటాయి. పాలకవర్గాల మోసకారితనం చర్చలద్వారా బయటపడింది. వారు చూపిన సమస్యల పరిష్కారం తమ ఉనికికే ముప్పుగా భావించి ప్రభుత్వం చర్చలనుండి పక్కదారిపట్టింది. నేతలు ప్రజలనుండే వస్తారు. పోరాటక్రమంలో, యుద్ధంలో మరణం సహజం. వారి పనితీరు మనల్ని ఉత్తేజితులను చేయడంలోనే వారి అమరత్వం ప్రస్ఫుటమవుతుంది.

అజ్ఞాత చెప్పారు...

Good job by the Police. China sponsored Maoists should be eliminated.
They have no peoples support or even sympathy as adamantly claimed by Naxals.