6, ఏప్రిల్ 2010, మంగళవారం

బెట్టింగ్‌ పెళ్లి

సానియా, షోయబ్‌ల పెళ్లి జరుగుతుందో లేదో అన్నది పెద్ద పజిల్‌లాగా మారింది. ఒకటొకటిగా పడ్డ చిక్కుముళ్లు ఎలా వీడతాయి? అసలు పెళ్లి జరుగుతుందా? లేక షోయబ్‌ పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడా? హైదరాబాద్‌ సహా ప్రపంచమంతటా తెగ ఉత్కంఠ రేగుతోంది.. చాలాకాలంగా ఖాళీగా ఉన్న బెట్టింగ్‌ రాయళ్లకైతే పండగే మొదలైంది..

భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటేనే తెగ టెన్షన్‌గా ఉంటుంది..

అలాంటిది ఇరుదేశాల మధ్య పెళ్లి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటే ఇంకెంత ఉత్కంఠ ఉండాలి?

అది కూడా ఇరు దేశాల సెలబ్రిటీల వివాహం అనేసరికి ఇక అందరి దృష్టీ ఆ పెళ్లిపైనే ఉంటుందనటంలో సందేహమా?

ఒకరు క్రికెట్‌ స్టార్‌ షోయబ్‌ మాలిక్‌.. మరొకరు గ్లామర్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా...
ఇంకేం మీడియా తన సైన్యాన్ని అక్కడే మోహరించింది.. వార్తల్లో మరో వార్త లేనంతగా ఆసక్తి పెరిగిపోయింది..

ఇక్కడే చిన్న ట్విస్ట్‌... అది వివాహానికి ముందు వివాదం రేగటం...
షోయబ్‌ మాలిక్‌కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని ఆరోపణ రావటం.. ఆ అమ్మాయి హైదరాబాదీయే కావటం.. పోలీసు కేసులు.. పాస్‌పోర్ట్‌ సీజింగ్‌... దర్యాప్తు బృందాల విచారణలు...
అక్కడి నుంచి అసలు కథ మొదలైంది.. చాలా కాలంగా పెద్ద వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న ఓ సీక్రేట్‌ వ్యాపారం తెరమీదకు వచ్చింది.. అదే బెట్టింగ్‌...
హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి అన్ని నగరాల్లో బెట్టింగ్‌ ఊపందుకుంది.. షోయబ్‌, సానియా పెళ్లి వివాదాన్ని సొమ్ము చేసుకునేందుకు బుకీలు బిజినెస్‌ మొదలు పెట్టారు.. సానియా వివాహం వాళ్లు ప్రకటించినట్లుగా ఏప్రిల్‌ ౧౫న జరుగుతుందా? అన్న విషయంపైనే బెట్టింగ్‌ సాగుతోంది.. ప్రతి రూపాయికి, రూపాయి ఇరవై అయిదు పైసల బెట్టింగ్‌ కూడా నడుస్తోంది.. ఒకవేళ పెళ్లి జరగకపోతే రూపాయికి ౩ రూపాయల ౫౦ పైసలు ఇస్తారన్నమాట.. బుకీల సెంటిమెంట్‌ ప్రకారం ఏప్రిల్‌ ౧౫న ఖచ్చితంగా సానియా, షోయబ్‌ల పెళ్లి జరుగుతుంది.. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బెట్టింగ్‌ రేట్లు పెరిగినా పెరగవచ్చు. పాకిస్తాన్‌లో కూడా ఈ రకమైన బెట్టింగ్‌లు కొనసాగుతుండటం విశేషం.. ఇరుదేశాల బుకీల సరిహద్దుల మధ్య ఎప్పటికప్పుడు సంప్రతింపులు కూడా జరుగుతున్నాయని సమాచారం.. మొత్తం మీద షోయబ్‌ వివాదం బెట్టింగ్‌ ఇండస్ట్రీకి మంచి డిమాండ్‌ను తెచ్చిపెట్టింది..మరో విశేషం ఏమంటే బెట్టింగ్‌ సొమ్ము ఎటువైపు ఎక్కువగా ముడితే అంటే.. పెళ్లి అవుతుందని ఎక్కువ మంది బెట్‌ చేస్తే... పెళ్లి ఆపేందుకు బుకీలు ప్రయత్నిస్తారు.. కాదని ఎక్కువ మంది బెట్‌ చేస్తే పెళ్లి చేసేస్తారు.. ఎందుకంటే బెట్టింగ్‌ బిజినెస్‌లో కూడా దావూద్‌ టీమ్‌ జోక్యం చేసుకున్నట్లు సమాచారం ఉంది కాబట్టి..


4 కామెంట్‌లు:

Nrahamthulla చెప్పారు...

ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని ఖురాన్,హదీసులు ఘోషిస్తున్నా ఈ నిషిద్ధ రంగాలన్నిటిలో లక్షలాది ముస్లిం నిపుణులున్నారు

అజ్ఞాత చెప్పారు...

Your post is funny. It is so sad that in 1 billion plus people of India our Tennis Queen cannot find a SINGLE muslim suitable for her!! Amazing people.

My respect for Tendulkar keeps doubling whenever I see news like this Sania-Shoaib and other mess. Compared to these, SRT is just light years ahead of them in manners, humiliy, family relations etc. Hats off to him.

Nrahamthulla చెప్పారు...

ఇండియా వరుడి సంగతి అల్లా ఎరుగు.పెళ్ళికి ముందే వీధుల్లో షికార్లు చేసిన ఈ ప్రేమ జంట పెళ్ళికి కూడా ముస్లిములెవరూ వెళ్ళొద్దని ఫత్వాజారీచేశారట.ప్రేమ,మతం,దేశం,విడాకులులాంటి సమశ్యలను నానా కష్టాలూ పడి దాటుకొస్తే పాపం మతపెద్దలు కులపెద్దల స్థాయికి దిగజారి వారిని వెలివేశారు.
ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని మతపెద్దలు ఎంతగా చెప్పినా వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో పాతుకుపోయిన లక్షలాది ముస్లింలను ఆదరించి పెళ్ళిళ్ళు అంత్యక్రియలు నట్లుగానే ఈ ఖిలాడీలను కూడా ఆదరించాలి.అన్నిరకాల జనాన్ని మతం కలుపుకుపోకపోతే ఆ మతంలో మిగిలేది ఎందరు?

Nrahamthulla చెప్పారు...

ఇండియా వరుడి సంగతి అల్లా
ఎరుగు.పెళ్ళికి ముందే
వీధుల్లో షికార్లు చేసిన ఒక
ప్రేమ జంట పెళ్ళికి కూడా
ముస్లిములెవరూ వెళ్ళొద్దని
ఫత్వాజారీచేశారట.ప్రేమ,మతం,దేశం,విడాకులులాంటి సమశ్యలను
నానా కష్టాలూ పడి దాటుకొస్తే
పాపం మతపెద్దలు కులపెద్దల
స్థాయికి దిగజారి వారిని
వెలివేశారు.
ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్ లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు
...లాంటివన్నీ నిషిద్ధమని
మతపెద్దలు ఎంతగా చెప్పినా
వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో
పాతుకుపోయిన లక్షలాది
ముస్లింలను ఆదరించి
పెళ్ళిళ్ళు అంత్యక్రియలు
నట్లుగానే ఈ ఖిలాడీలను కూడా
ఆదరించాలి.అన్నిరకాల జనాన్ని
మతం
కలుపుకుపోకపోతే ఆ మతంలో
మిగిలేది ఎందరు?