ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరో సారి బాంబు పేల్చారు. నిన్నటి వరకు యూపీఏ ప్రధాని అభ్యర్ధి మన్మోహన్ సింగే అన్న ఆయన.. ఇవాళ మాట మార్చారు. ఎన్నికల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రధాని అభ్యర్ధిని నిర్ణయిస్తామన్నారు. కూటమిలో కాంగ్రెస్ ఒక్కటే పార్టీ కాదని, చాలా పార్టీలున్నాయని అందరి అభిప్రాయాల ప్రకారమే ప్రధానిని ఎన్నుకుంటామని లాలూ అన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కొంత మంది కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు లాలూ వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. లాలూ ఒక్కడే ప్రభుత్వం ఏర్పాటు చేయలేడన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. |
21, ఏప్రిల్ 2009, మంగళవారం
కాంగ్రెస్ పై లాలూ మరో బాంబు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి