ప్రభాకరన్ క్షమాభిక్షకు శ్రీలంక నో
Posted by Kovela santosh kumar at 12:07 ఉ
ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌కు క్షమాభిక్ష ప్రకటించే ప్రసక్తే లేదని శ్రీలంక స్పష్టం చేసింది. అయితే ప్రభాకరన్‌ను పట్టుకునే విషయంలో తాము అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్టీటీఈ చెరలో ఉన్న పౌరులను విడిపించేందుకు తాము అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని శ్రీలంక మిలిటరీ అధికార ప్రతినిధి ఉదయ నానక్కర తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వస్తున్న తమిళులకు తాము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఎల్‌టీటీఈ వద్ద బందీగా అనేక మంది పౌరులు ఉన్నారని వారిని సురక్షితంగా విడిపించేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని ఉదయ నానక్కర స్పష్టం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)










0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి