కష్ణమ్మ తన తీర ప్రాంతంలో మిగిల్చి పోయిన కడగండ్లు ఇప్పుడప్పుడే తీరేవి కావు... కానీ ఈ విపత్తు ప్రభావం పరోక్షంగా రాష్టమ్రంతటా కనిపించబోతోంది. రాష్ట్రంలో అత్యంత క్రేజ్ ఉన్న కర్నూల్ రైస్ వచ్చే సీజన్‌లో మార్కెట్లో కనిపించబోవటం లేదా? వరద సష్టించిన బీభత్సం దాదాపుగా అవుననే చెప్తోంది...
వరదలు మనకు కొత్త కావు.. తుపానులూ మనకు తెలియనివి కావు.. చిన్న చిన్న వాటి నుంచి భారీ విపత్తులను సైతం మనం ఎదుర్కొన్నాం.. ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్నీ అనుభవించాం.. కానీ, దాదాపు వందేళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో కష్ణమ్మలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది.. ఈ వరదలకు తక్షణం ప్రభావితం అయిన ప్రాంతాల బాధ తీవ్రమైతే.... పరోక్షంగా ఇబ్బంది పడబోయే మిగతా ప్రాంతాల పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజల్లో అత్యంత క్రేజ్ ఉన్న కర్నూల్ రైస్ వచ్చే సీజన్‌లో మార్కెట్‌లో కనపడుతుందా? అన్న అనుమానం కలుగుతోంది. కష్ణానది వరద కెసి కెనాల్ పరిధిలోని వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నాశనమైంది... హాట్ హాట్ డిమాండ్ ఉన్న కర్నూలు రైస్ ప్రధానంగా పండే ప్రాంతం ఇది కావటంతో ఈసారి ఈ ఫేవరేట్ రైస్ కొరతను ఎదుర్కోవలసి వస్తోంది..
కర్నూలు, నెల్లూరు, వరంగల్ జిల్లాలు నాణ్యమైన సోనా మసూరీ బియ్యానికి ప్రసిద్ధి... నాణ్యత, రుచి పరంగా ఈ ప్రాంతాల బియ్యానికి భలే డిమాండ్ ఉంటుంది. అందులోనూ కర్నూలు రైస్ ప్రత్యేకత వేరు... రాజధాని హైదరాబాద్‌లో అయితే కర్నూలు రైస్ ఓ బ్రాండ్ నేమ్.. ధర ఎంతైనా సరే... హైదరాబాదీల ఫస్‌ట ప్రయారిటీ కర్నూలు రైసే... వేరే ప్రాంతాల నుంచి వచ్చిన బియ్యానికి కూడా కర్నూలు రైస్ పేరు తగిలించి దొంగతనంగా వ్యాపారులు అము్మకుంటారంటే దానికున్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కష్ణమ్మ వరద అటు పండించిన రైతులు, తినే ప్రజల నోళ్లల్లో మట్టి కొట్టింది. ఈ సీజన్‌లో దాదాపు మార్కెట్లో కర్నూలు రైస్ 60శాతం తగ్గిపోనుంది.. పర్యవసానంగా పెరిగే ధరల సంగతి తలచుకుంటే ఇప్పటి నుంచే వినియోగదారుల్లో గుబులు పట్టుకుంది..
వాస్తవానికి బియ్యం కొరత అన్న భయం భవిష్యత్తుది.. ప్రస్తుతానికి బియ్యం నిల్వలు తగినంత ఉన్నాయి. అయినా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వ్యాపారులు భావిస్తున్నట్టున్నారు.. క్వింటాలుకు 200 రూపాయలు పెంచేందుకు సిద్ధమయ్యారు...
వరద తాకిడికి పొలాలపై ఇసుక మేట వేసింది. బురద పేరుకుపోయింది. ఎక్కడలేని చెత్తాచెదారమూ వచ్చి చేరింది. మరుభూమిగా మారిన వేలాది ఎకరాలు మళ్లీ పంటపొలాలుగా మారటానికి శ్రమించాల్సింది చాలానే ఉంది. వరద నీరు సులభంగా వెళ్లిపోయే పంట క్షేత్రాల్లో మాత్రం మళ్లీ పంట వేసుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు... రిజర్వాయర్లలో నీళు్ల పుష్కలంగా ఉండటంతో పరిస్థితి త్వరగా మెరుగుపడే అవకాశం ఉంటుందంటున్నారు వ్యవసాయ నిపుణులు.
మొత్తానికి రాబోయే బియ్యం కొరతకు తోడు, ప్రస్తుతం పెరిగే ధరలు రాజధాని వాసుల పాలిటి శాపంగా మారాయి. ప్రభుత్వం ముందే మేల్కొని వ్యాపారులను, దళారులను నియంత్రించకపోతే పరిస్థితి అదుపు తప్పటం ఖాయం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి