6, ఆగస్టు 2009, గురువారం

మగధీర పాట వివాదాస్పదమైంది

మగధీర సినిమా లో ఒక పాట వివాదాస్పదమైంది. రాష్ట్రంలో నక్సల్ ఉద్యమానికి నాలుగు దశాబ్దాల పాటు ఉపిరులూదిన పాటల్లో ఒకటైన ఏం పిల్లడో ఎల్దమొస్తవ అన్న గేయాన్ని మగధీర లో ఒక ఐటం సాంగ్ లో వాడుకున్నారు.. ప్రముఖ ప్రజాకవి వంగపండు కు మనస్తాపాన్ని కలిగించింది. విప్లవ గీతాలను సినిమాల్లో ఉపయోగించుకోవటం కొత్త కాదు.. కానీ ఏ రోజూ వాటి గౌరవాన్ని తగ్గించలేదు. అర్ధ రాత్రి స్వతంత్రం లో కాని.. ఠాగూర్ లో మహాప్రస్థానం వాడుకున్న వాటి స్ఫూర్తి దెబ్బ తినలేదు.. కానీ ఈ పాట పల్లవిని మాత్రం అశ్లీల పదాల మధ్య చొప్పించి అవహేళన చేసారని వంగపండు ఆవేదన చెందుతున్నారు.. నక్సల్ ఉద్యమం లో నిజాయతీగా ఉన్న కొద్ది మందిలో వంగపండు ఒకరు.. అలంటి వ్యక్తీ పాటను ఇలా వాడుకోవటం నిర్మాతలకు తగునా? అటు బందరు లో లాయర్లు ఈ సినిమాను నిషేధించాలని కేసు వేసారు.. సినిమాలో లాయర్లను కించ పరిచారని వారి అభియోగం...



13 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

కోట శ్రీనివాసరావు చేత "నీ అమ్మ కడుపు మాడ" లాంటి డైలాగులు పలికించినపుడే మన తెలుగు సినిమావాళ్ళ దివాలాకోరుతనం బయట పడింది.

Bolloju Baba చెప్పారు...

వంగపండు గారి ఆవేదనలో అర్ధం ఉంది.

మగధీరలోని ఒక పాటలో ఏంపిల్లడో ఎల్దమొస్తవా అన్న గీతం లోని ఆ నాలుగు పదాలను ఇమిడ్చిన సందర్భం అనుచితంగానే ఉంది. (సృజనాత్మకంగా ఉండి ఉండవచ్చుగాక)

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వ్రాయబడ్డ ఒక పాటలోని పదాల్ని, ఆ ట్యూను ని, అది వ్రాయబడ్డ సందర్భాన్ని గౌరవించకపోవటం ఒకరకంగా తెంపరితనమే. గర్హనీయమే.

సినిమాలపై వచ్చే వివాదాల పట్ల నాకు సదభిప్రాయం లేక పోయినా, వంగపడు గారు లేవనెత్తిన ఈ అంశం లో మాత్రం నాకు నిజాయితీ కనిపిస్తున్నది.

ఇలాంటి చవకబారు ప్రచారానికి సిద్దపడేటి వ్యక్తిత్వం ఆయనకు లేదని నమ్ముతున్నాను.

బొల్లోజు బాబా

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

one of the worrest argument.......adi...........aayanaraasina daanini use chesukunte tappugani.em pillada veldam vastava anedi general telugu paddaalu... ayana emina aa padaalaku patent teesukunnada...artham lekunda argue chestaaru enti...asalu......

intp asalu manishi toka anta samasyani maree buffelo toka anta chestunnaru........

Bolloju Baba చెప్పారు...

what about tune.
the tune with the same words makes a sense isnt it?

Anil Dasari చెప్పారు...

ఆర్పీ పట్నాయక్ చేసిన హిట్ పాటలన్నీ ప్రజా బాణీలకి కాపీలే కదా (ఉదా. 'గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా' అనేది 'కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగినోడా'కి కాపీ) బాణీలు కాపీ కొడితే ఎవరూ అభ్యంతరం పెట్టిన గుర్తు లేదు. పాటలో రెండు పదాలు ఎత్తేస్తే అభ్యంతరమెందుకు? ఇక అశ్లీలం సంగతంటారా .. వంగపండులాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు తమ సొత్తు కాజేయబడిందనుకున్నప్పుడే కాకుండా ఇతర సందర్భాల్లోనూ సినిమాల్లో అశ్లీలంపై పోరాడితే బాగుంటుంది.

అజ్ఞాత చెప్పారు...

వంగపండు రాసిన బుచికి బుచికి పాటను lime light లోకి తెచ్చినందుకు he should be grateful in fact. వంగపండు ఇప్పుడు వచ్చి లొల్లి పెట్టడం హాస్యాస్పదం.

Praveen Mandangi చెప్పారు...

వంగపండు గారు నాకు వ్యక్తిగతంగా తెలుగు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో లూథరన్ చర్చి వీధి అవతల ఉన్న మరో వీధిలో అతని ఇల్లు ఉంది. నేను అతనితో మాట్లాడాను కూడా. బూతు పాటల్లో హిందూ దేవుళ్ళ పేర్లు వాడితే హిందువులు ఊరుకుంటారా? ముహమ్మద్, జీసస్ ల పేర్లు వాడితే ముస్లింలు, క్రైస్తవులు ఊరుకుంటారా? మరి విప్లవ పాటల నుంచి సేకరించిన వచనాలని బూతు పాటల్లో పెడితే విప్లవకారులు ఎలా ఊరుకుంటారు?

Praveen Mandangi చెప్పారు...

>>>>>
వంగపండులాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు తమ సొత్తు కాజేయబడిందనుకున్నప్పుడే కాకుండా ఇతర సందర్భాల్లోనూ సినిమాల్లో అశ్లీలంపై పోరాడితే బాగుంటుంది.
>>>>>
బావా-మరదలు పెళ్ళికి ముందు సరసాలాడుకోవడం పేరుతో మసాలా చూపించే సినిమాలు నాలుగేళ్ళ వయసులో ఉన్నప్పుడు కూడా నాకు కనిపించాయి. బూతు పిల్లల్ని పాడు చేస్తుందని తెలిసి కూడా బూతు సినిమాలకి వ్యతిరేకంగా గలం విప్పరేం. ఇంకా నయం, ఈ సినిమాలు చూసి నేను చెడిపోలేదు. ఎందుకంటే నా మరదళ్ళు అప్పట్లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉండేవాళ్ళు. మేము వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలలో ఉండేవాళ్ళం. ఒకే ఊర్లో కాకుండా దూరంగా ఉండడం వల్ల మేము సినిమాల ప్రభావంతో చెడిపోలేదు.

అజ్ఞాత చెప్పారు...

"వంగపండు రాసిన బుచికి బుచికి పాటను lime light లోకి తెచ్చినందుకు he should be grateful in fact. వంగపండు ఇప్పుడు వచ్చి లొల్లి పెట్టడం హాస్యాస్పదం."

I think these are Babu Mohan style dialogues.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత garu vanga pandu raasina aaa paata inkaa janam notlo ne vundhi inko konni savstharalu poyeena aa paata aalage vuntundhi .....mee magadheera pata enni rojulu vuntundhi anukutunnaru

pata raasina vadiki aa pata meedha sahaja maina hakkulu vuntai dhani ekkada vadalo adhi athani istam ..

kovela santosh kumar చెప్పారు...

vangapandupai abhandalu vese vaaru gamaninchalsindi... ayana pataloni pallavini vadataanni tappu pattaledu.. vaadina sandarbham abhyantarakaramani antunnaru.. deenipai godava cheste ayanaku origedem ledu... paiga aa cinimake uchita publicity. ikkada kathala paina vivadaanni ragilcharu.. kaani vangapandu vaadanaloni nijayitini gurtinchadam avasaram.

Praveen Mandangi చెప్పారు...

ఈ సినిమా వాళ్ళకి అంత ధైర్యం ఉంటే బూతు పాటల్లో బైబిల్, ఖురాన్ ప్రవచనాలు పెట్టి చూడాలి, అప్పుడు ఎంత పెద్ద వివాదం అవుతుందో.

Praveen Mandangi చెప్పారు...

బ్లాగుల్లో కూడా బూతు బాష వాడే వాళ్ళు ఉన్నారు http://webhosting4india.net/images/bharadwaja_language.png గాలి నా కొడుకు (తండ్రి లేకుండా పుట్టినవాడు) అని తోటి బ్లాగర్లని తిట్టే లెవెల్ లో ఉన్నారు.