31, జులై 2009, శుక్రవారం
ప్రజారాజ్యం కనుమరుగు అవుతున్నదా?
మెగాస్టార్... ఏడాది క్రితం వరకు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్త ఒక ఉత్కంఠను సృష్టించింది. ఆయన ఎన్నికల ప్రచారంలోకి కదిలితే జనం ఆయన వెంట పరిగెత్తింది. సరిగ్గా ఏడాది కాలం పూర్తయింది. ఇంకో ఇరవై ఆరు రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ తొలి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోబోతోంది. అదే సమయంలో అస్తిత్వం కోసం పోరాడుతోంది....ఉన్న వాళ్లంతా వెళ్లిపోతుంటే.. మిగతా వారిని కాపాడుకోవటానికి ఏం చేయాలో తోచక అయోమయంలో ఉంది.
పోయినోళు్ల పోతే పోనీ... ఉన్నోళ్లే చాలు... నా ఇమేజీ ఒక్కటే చాలు.. అన్నీ నేనే... అంతా నేనే.. నా సభలకు ప్రభంజనంలా వచ్చిన జనమే నేనేమిటో నిరూపిస్తున్నారు... ఇక అధికారంలోకి రావటమే తరువాయి....2009 ఎన్నికలకు ముందు చిరంజీవి చెప్పిన మాటలు.. నిజం.. ఇందులో ఎలాంటి అసత్యం లేదు. ఎన్నికలకు ముందు చిరంజీవికి ఉన్న అంచనాలు ఇవి. ఆయన తనను తాను అమితంగా విశ్వసించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. చిరు అంచనాలకు మీడియా హైప్ బాగా తోడయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల దాకా ఆయన చేసిన ప్రచారానికి వచ్చిన జనం మరే రాజకీయ పార్టీ నాయకుడికీ రాలేదు.. మరి ఈ జనం అంతా ఏమయ్యారు. వీరంతా ఓట్ల రూపంలో ఎందుకు మారలేదు... తన సభలకు వస్తున్న వారు ఓట్లుగా మారటం లేదని ఎన్నికలు జరుగుతున్నప్పుడే చిరంజీవికి అర్థమయింది. కానీ, అప్పటికే జరగాల్సిన ఆలస్యమంతా అయిపోయింది. చివరకు 17శాతం ఓట్లతో, 18 సీట్లతో అసెంబ్లీలో మెగాస్టార్ అడుగుపెట్టారు. ఆ తరువాతైనా పార్టీని పటిష్ఠం చేసే దిశగా ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. దాని ఫలితం... పార్టీ క్రమంగా అనాధగా మారిపోతుండటం... రంగస్థలం మించి ఒక్కరొక్కరుగా తప్పుకుంటుండటం... కొందరు చిరంజీవిని నిందించి బయటకు వెళ్తే.. మరికొందరు ఇమడలేకపోతున్నామంటూ వెళ్లిపోయారు.. ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు... మెగాస్టార్ రాజకీయ ప్రవేశంలో కీలక పాత్ర పోషించిన మిత్రా దగ్గర నుంచి ఒకే ఊరు.. కోస్టార్ అయిన కృష్ణంరాజు వరకూ అంతా చిరంజీవిని వదిలేశారు..
ఇలా ఎందుకు జరిగింది? ప్రజారాజ్యం పార్టీలో ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న పరిణామాలకు కారణమేమిటి? పార్టీని ఇంతకాలం ముందుండి నడిపించిన మహామహులంతా ఏమైపోయారు..? ఎక్కడ ఉన్నారు..? ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి ఇప్పుడు ఒంటరి అయిపోయారు.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన పార్టీ అస్తిత్వం ప్రశ్నార్థకంలో పడిపోయింది. పార్టీని వదిలిపెట్టి వెళ్లే వారే తప్ప.. వచ్చేవారు ఒక్కరూ కనిపించటం లేదు.. దీనికంతటికీ మూలం ఎక్కడ ఉందో.. అధినేత చిరంజీవికే అర్థం కాని పరిస్థితి ఉంటే.. ఇక మిగతా కేడర్‌కు ఎలా ఉంటుంది?
ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి మరో ఇరవై ఆరు రోజుల్లో ఏడాది పూర్తి చేసుకోబోతోంది. ఏడాదిలోనే ఎన్ని ఒడిదుడుకులు...పార్టీ ప్రారంభించినప్పుడు తిరుపతిలో జరిగిన బహిరంగ సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూడగానే చిరంజీవితో పాటు ఆయన కోటరీలో విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరిగింది. మెగాస్టార్‌ను అన్నీ తానే అయి నడిపించిన అల్లు అరవింద్ అయితే.. దూకుడుగా వ్యవహరించారు. వైఎస్, చంద్రబాబులు పోటీ చేసే రెండు స్థానాలు తప్ప 292 స్థానాలూ మావేనన్నారు.. అడుగడుగునా సర్వే చేసి గెలుపు గుర్రాలకే టిక్కెట్లిచ్చామన్నారు.. తీరా చూస్తే.. ఆయనే గెలవలేదు... ఆయన సొంత ఊళ్లో బావగారిని గెలిపించుకోలేదు.. పిఆర్‌పి ఎన్నికల వూ్యహం ఎంత పేలవంగా ఉందో అధినేత ఓటమితోనే తేలిపోయింది. సేఫ్‌గా రెండో స్థానంలో పోటీ చేసి గెలిచారు కాబట్టి చిరంజీవి ప్రతిష్ఠ ఆ మాత్రమైనా నిలబడింది. ఇక ఆ తరువాత అసలు కథ ప్రారంభమైంది.. ఒక్కరొక్కరూ నెమ్మది నెమ్మదిగా జారుకోవటం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కొందరు జారుకుంటే, ఫలితాల తరువాత మిగతా వాళు్ల ఆ బాట పట్టారు. మిత్రా, వినయ్, శివశంకర్, బండి రమేశ్, కనకారెడ్డి, కృష్ణంరాజు.. చివరకు రాష్ట్ర చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్లారు. ఇక కెఎస్‌ఆర్ మూర్తి, దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి, నర్రా రవికుమార్‌లు తమకు ఇబ్బంది లేకుండా వెళ్లే దారిని వెతుక్కుంటున్నారు. మరో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను దేవేందర్ తనతో పాటు తీసుకెళు్తన్నారని వార్తలు.. ఇదే నిజమైతే... ప్రజారాజ్యం పతనం అంచుకు చేరుకున్నట్లే....
ఒక నిర్దిష్టమైన అజెండా ఏమీ లేకుండా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. దాని పరిస్థితి ఎలా ఉంటుందనేందుకు ప్రజారాజ్యం ఒక ఉదాహరణ...ప్రజారాజ్యం ఏర్పాటు హడావుడిగానే సాగింది. కానీ, దాని ప్రస్థానమే పడుతూ లేస్తూ సాగుతోంది. పార్టీ పెట్టిన సంవత్సర కాలంలో ఒకే ఒక్కసారి ఒక్క గంట పాటు కందిపప్పు ధరపై రోడ్డుపై కూర్చోవటం తప్ప చిరంజీవి నేరుగా ప్రజాందోళనల్లో ఏనాడూ పాల్గొనలేదు. పార్టీ పెట్టిన తరువాత కొంతకాలానికి సామాజిక న్యాయం సిద్ధాంతం మొగ్గ తొడిగింది. కనీసం పార్టీలోకి యువరక్తాన్ని తీసుకువచ్చారా అంటే అదీ లేదు. సీనియర్లయినా, రాజకీయ వూ్యహరచన చేయగల సమర్థులనైనా తీసుకున్నారా అంటే దానికీ జవాబు లేదు. ఇవాళ్టి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపని వృద్ధబృందాన్ని పార్టీలోకి తీసుకువచ్చి, దాన్ని ఓ వృద్ధాశ్రమం చేశారు. వైఎస్, చంద్రబాబు లాంటి వాళ్లను ఎదుర్కొనే శక్తిసామర్థా్యలు వారికెక్కడివి? వాళ్ల సలహాలతో ముందుకు వెళ్లితే బోల్తా పడటం తప్ప సాధించేమేముంటుంది? చిరంజీవి విషయంలో అక్షరాలా జరిగింది ఇదే... దీనికి తోడు.. ప్రజారాజ్యం యూత్‌వింగ్ అధ్యక్షుడుగా కొరి పదవి తీసుకున్న తము్మడు పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ఆ విభాగాన్ని గాలికొదిలేసి సినిమాల వెంట వెళ్లిపోయారు.. ఇక అల్లుఅరవింద్ జాడే లేకుండా పోయారు.. నాగబాబు సంగతి చెప్పేదేముంది.. వెరసి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ఒంటరి అయిపోయారు... ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
12 కామెంట్‌లు:
తిరుపతి ఎన్నికలప్పుడు కాంగ్రెసోళ్ళ నిర్వాకం వల్ల చిరంజీవికి సానుభూతి ఓట్లు పడి అక్కడయినా చిరంజీవి గెలిచారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెసు కార్యకర్తలు తిరుపతిలో మగధీర సినిమా మీద హడావిడి చేసి దానికి మాంఛి ప్రచారం తెచ్చారు.
good analysis
అసలు అభిమానులని నమ్ముకోకుండా వలస పక్షులని చేరనివ్వడమే చిరంజీవి చేసిన తప్పు. What's going on right now is imminent.
చిరంజీవి మంచి నటుడే కానీ మంచి నాయకుడు కాదు. As an actor, he always played safe. వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హిట్ కోసం రీమేకుల మీద ఆధారపడటం, కొత్తవారికి అవకాశాలివ్వకుండా అనుభవజ్ఞులైన నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల మీదనే ఆధారపడటం .. ఇవన్నీ మంచి ఉదాహరణలు - చిరంజీవిలో సాహసం తక్కువనేదానికి. అదే ఆయనకీ ఎన్టీయార్‌కీ ప్రధానమైన తేడా. ఎన్టీయార్ లా తనకీ విశేషమైన ప్రజాభిమానం ఉన్నదన్న ఒక్క విషయాన్నే ఆయన చూసుకున్నాడు కానీ తమ ఇద్దరిలో ఉన్న మిగతా తేడాలు గమనించి వాటిని భర్తీ చేసుకోటంపై దృష్టి పెట్టలేదు. అసమర్ధ నాయకుడికన్నా తప్పులు చేసే నాయకుడికే విలువెక్కువ. చిరంజీవి తప్పులు చేస్తూనైనా నేర్చుకోవలసింది. దానికి బదులు అరవింద్ నీడలో మిగిలిపోయాడు, ఫలితం అనుభవిస్తున్నాడు. చేతులు పూర్తిగా కాలాయి. ఇప్పుడు ఏం పట్టుకున్నా ఫలితం ఉండదు.
చిరంజీవి సినిమా హీరోగా గొప్పవాడే కావచ్చు కానీ సినిమా గ్లామర్ రాజకీయాలకి సరిపోదు. సినిమాలు (తెలుగు సినిమాలు కూడా) చాలా వరకు నిజజీవితానికి దూరంగానే ఉంటాయి. ఈ సినిమాల వల్ల జనం మరీ అంతగా ప్రభావితం అవుతారనుకుంటే భ్రమే. చిరంజీవి అభిమానుల్లో కూడా అవకాశవాదులు ఉన్నారు. వాళ్ళు కూడా టికెట్ల కోసం గొడవలు చేశారు. అయినా ప్రజారాజ్యం పార్టీకి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఆ పార్టీ కొన్ని అసెంబ్లీ సీట్లైనా గెలిచింది కదా. తమిళనాడులో విజయ్ కాంత్ పెట్టిన పార్టీ ఒక్క సీట్ మాత్రమే గెలిచినా ఆ పార్టీ మూత పడలేదు. పైగా ముంబైలో తమిళులు ఎక్కువగా ఉన్న ధరవి మురికివాడలో కూడా ఆ పార్టీకి శాఖ పెట్టాలనుకున్నారు.
చిరంజీవి బాడీలాంగ్వేజ్ లో నిబద్ధత ఎప్పుడూ కనిపించలేదు. ఇక్కడా నటించి నెగ్గుకురావాలంటే ఎట్లా!
తెలుగు దేశం నుంచి వలస వచ్చిన చాలా మంది నాయకులకి ప్రజారాజ్యం టికెట్లు ఇవ్వడం వల్ల తెలుగు దేశం సిద్ధాంతాలూ, ప్రజారాజ్యం సిద్ధాంతాలూ ఒకటే అనుకుని జనం ప్రజారాజ్యానికి వోట్లు వెయ్యకపోయి ఉండొచ్చు.
ఇప్పటికైనా మించిపోయిందిలేదు.
చిరంజీవి మొహమాటాలు, అపోహలు పక్కనపెట్టి ప్రజారాజ్యాన్ని బి జె పి లో విలీనం చేయవచ్చు.
రాష్ట్రంలో బి జె పి ని బలోపేతం చేయడం వలన ఆయనకీ, బి జె పి కి కూడా లాభం.
ప్రజలకి కూడా మూడో ప్రత్యామ్నాయం దొరుకుతుంది.
మీ అభిప్రాయాలలో కొన్ని నిజాలు ఉన్నా, కొన్ని wrong assumptions ఉన్నాయి అనిపిస్తుంది. చిరంజీవి ఎప్పుడు అయితే Tickets కోసం, ఎదో సమాజానికి సేవ చేయాలన్న ఆశయంతో, వెళ్లిన వాళ్లను డబ్బులు అడగటమో, లేక అరవింద్ తో అడిగించిటమో చేసాడో, అప్పుడే అర్ధం అయ్యింది, తనకు ఆడాలనుకొంటున్నది safe గేం కాని, లేక డబ్బులు సంపాదించుకొనే ప్లానే కాని, సమాజానికి ఎదో చేద్దామన్న ఆశయం మాత్రం కాదు అని. పాత కాపులు ఎలా ఉన్నా, క్రొత్త నాయకుడు నుండి ప్రజలు, ఆవేశం తో కూడిన ఆశయాలు ఆశిస్తారు, కాకపోతే ఒక్క సారి కూడా ఎన్నికలలో పోటీ చేయకుండానే 100 ఏళ్లలో మురికి కూపంగా మారిన కాంగ్రెస్ లాగే, ఎన్నికలలో పోటీ చేయకుండానే మురికి కూపం గా మారి, ఓట్లు వేద్దామన్నా వద్దు అని తానే చెప్పాడు.
దానికి తోడు, ఇప్పటివరకూ, కాంగ్రెస్స్, తెలుగుదేశాలు దబ్బులు తీసుకొని ఎంతో కొంత టికెట్లు ఇస్తారనుకొంటే, తాను అవతలి పార్టీ వాళ్లతో కుమ్మక్కు అయ్యి, పనికి మాలిన వాళ్లను తన పార్టీ తరుపునే నిలబట్టే మొగాడిని అని ౠజువు చేసుకొన్నాడు. ఇలా కాంగ్రెస్స్ వాళ్లనో, లేక కాపులనో అభిమానం వలనో, అంతకంటే rate fix అవటం వలనో, జాగ్గయ్యపేట లో, ఉదయ భాను మీద, వెతికి వెతికి మూడు నియోజకవర్గాల అవతలనుండి ఓ గోట్టాం ను తీసుకొచ్చి నిలబెట్టాడు అంటే, ఎంత దిగజారుడు తనమో అర్దం అవుతుంది. పోరబాటున ప్రచారానికి వేలితే ఎక్కడ కుమ్మాక్కు అయిన ఉదయభానుకు వోట్లు తగ్గుతాయ్యో అని, జగ్గయ్యపేట నియోజక వరగం చుట్టూ తిరిగినా, అక్కడకు మాట్రం, అది highway మెదే ఉన్నా, పెద్ద పులులు ఏమి ఖర్మ, చిర్త పులులు కూడా ఒక్క సారి కూడా ఆగలేదు.
ఇక అల్లుఅరవింద్ జాడే లేకుండా పోయారు అంటున్నరు, అది మీ అపోహే, రాజా, చిన రాజా వారు చూపిన మార్గం లో, డబ్బులు మలేసియా పంపి, అక్కడ నుండి రాజ మార్గం లో, white గా తీసుకొచ్చే పనిలో ఉన్నారు అని అభిజ్ఞవర్గాల భొగట్టా. పోరపాటున రేపొద్దున HYD ఎన్నికలలోనో, లేక వెరే ఎన్నికలలోనో, టికెట్ కు, ఓ వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్లు ఉన్నరు అంటే చూడండి, accountant గారు ఎలా ఎగురుకుంటూ వచ్చి వాలిపోతారో.
రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది అంటున్నారు, అది కూడా తప్పే, తన భవిష్యత్తు మాత్రం బ్రహ్మాండమనే అనుకోవాలి. సుబ్బరంగా కాంగ్రెస్స్ కు వత్తాసుగా బ్రతికెస్తూ, ఎటువంటీ సీకు సికాకులు లేకుండా, కాలు మీద కాలు వేసుకొని బండి లాగించేస్తారు.
ఏమయినా అనుమానం ఉంటే , ఒక్కసారి అలోచించండి, కన్నా లాంటి చోటా నాయకుడుకు ఎదురు నిలబడినందుకు తులసి సీడ్స్ నే మూయించిన ధెరమప్రభువులు శామ్యుల్ గారు, సెంట్రల్ లో, స్టేట్ లో అధికారం లో ఉంటూ ఇంతవరకూ, ఒక్కసారి కూడ చిరు &కంపెనీ మీద ఓ బుల్లి ఇంకంటాక్స్ దాడి కూడ చేయించలేదంటె అర్ధం కావటం లేదా!!. సివరాఖరకు క్రిష్ణ పెద్దకోడుకు రమేష్ బాబు మీద, పద్మాలయ మీద కూడా దాడులు చేయించిన (కాంగ్రెస్స్ లోకి వస్తారో, రారో నని) వాళ్లు చిరు & కంపెనీ ని తాకలేదంటే అర్దం కావటంలా ఎంత మాచ్ ఫిక్సింగో.
సివరాఖరుగా, A2Z గారేమంటారో వినాలని ఉంది. ఇంకా మేగా జోకర్, మీ @!~ వెంకమాలే మేము ఉన్నము పదండి పదండి ముందుకు కాంగ్రెస్స్ సంక నాకటానికి అని ఇంకా అంటున్నారా?
తెలుగు దేశం పార్టీ ప్రపంచ బ్యాంక్ కి నం 1 పెంపుడు తోడేలు అయితే కాంగ్రెస్ పార్టీ నం 2 పెంపుడు తోడేలు. మూడవ ప్రత్యామ్నాయం లేకపోతే మన రాష్ట్రానికి ఆర్థికంగా చాలా నష్టమే.
ofcourse..!this is not a right time to travel in steam engine.the reson,it is outdated-when party has chosen a sun to show the light and to reach people bright way,finally the sunlight helped all unhappy leaders inthe party to migrate other party!
tail peice:chiru is suffering with 'sun' stroke in mansoon.
Read this link: http://www.apallround.com/loadart.php?id=2009080102
కామెంట్‌ను పోస్ట్ చేయండి