2, జులై 2009, గురువారం

మన ఎంపిలు మహా....................నుభావులు

రైల్వే బడ్జెట్‌ సీజన్‌ వచ్చిన ప్రతిసారీ మనకు అన్యాయం జరుగుతోందని వాపోవటం.. రైల్వే మంత్రిని నిందించటం.. రెండు రోజులు హడావుడి చేయటం.. ఆ తరువాత యథావిధిగా మరచిపోవటం ఎప్పుడూ జరుగుతున్న తంతే ఇది. ఒకటి కాదు. రెండు కాదు.. దశాబ్దాలుగా మనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎవరూ ఏనాడూ ప్రశ్నించింది లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో చక్రం తిప్పినా, మన… వాడు ప్రధానమంత్రి అయినా, మన రాషా్టన్రికి రైల్వే ఎప్పుడూ న్యాయం అన్న మాట లేదు. ఇందుకు కారణం ఏమిటి?
రైల్వేలకు మన రాషా్టన్రికీ దూరం చాలా ఎక్కువ... రైల్వే మంత్రులకు మన రాష్టం అంటూ ఒకటున్నదన్న స్పృహ కూడా ఉండదు.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ప్రతిసారీ, అన్ని ప్రాంతాలతో పాటు మన రాషా్టన్రికీ ఏవో కొన్ని అరకొర కేటాయింపులను విదిలిస్తారు. అంతటితో ఆ సంవత్సరం గడిచిపోతుంది. ఘనత వహించిన మన పార్లమెంటు సభ్యులకు మాత్రం వీటి గురించి పట్టదు.. కనీసం అవగాహనైనా ఉండదు.. విచిత్రమేమిటంటే ఈ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో ప్రభుత్వానికి దన్నుగా ఎంపిలను ఇక్కడి ప్రజలు గెలిపిస్తారు. ఇక్కడా, అక్కడా ఒకే పార్టీ రాజ్యమేలుతుంటుంది. అయినా మన వాళు్ల నోరు తెరిచి మాకివి కావాలని అడిగే సాహసం చేయలేరు. ఇవ్వకపోతే ఇదేమని అడిగే ధైర్యమూ వారికి లేదు. 2004 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ ఎంపిలు 29 మంది ఎన్నికయ్యారు. అప్పటికి మిత్రపక్షంగా ఉండటం వల్ల టిఆర్‌ఎస్‌ నుంచి మరో ుగురు ఎంపిలు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు కేంద్రమంత్రి పదవులనూ దక్కించుకున్నారు. అక్షరాలా 34 మంది ఎంపిలను మనం పాలక పక్షానికి అందించాం... అయినా మనకు రైల్వేల పరంగా ఒరిగిందేమీ లేదు. గత కేబినెట్‌లో రైల్వే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ఎంపిలు అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను నిలదీశారు. ఆయన వారిపై చిరాకు ప్రదర్శించి మీ మేడమ్‌తో చెప్పుకోపొండంటూ చీదరించుకున్నా, మనవాళు్ల చేసిందేమీ లేదు. ఇప్పుడు సైతం 33మంది ఎంపిలు కాంగ్రెస్‌ తరపున ఎన్నికయ్యారు. దేశంలో ఇంతఎక్కువ స్థాయిలో కాంగ్రెస్‌కు ఎంపిలను అందించిన రాష్ట్రం మరొకటి లేదు. ఇలాంటి రాషా్టన్రికి కీలకమైన ఏ ఒక్క శాఖ కూడా మంత్రివర్గంలో దక్కలేదు. పనికిమాలిన సహాయమంత్రి పదవులను అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖలు రెండూ బెంగాలీలు దక్కించుకున్నారు. పదవుల కోసం పట్టుబడలేదు.. సరికదా... కనీసం నిధులు, పథకాలనైనా సాధించుకొస్తారా అంటే ఆ నమ్మకమూ లేదు. మనకు అవి కావాలి.. ఇవి కావాలి అని మాత్రం మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి తనయుడు కడప ఎంపి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో కొందరు ఎంపిలు వెళ్లి రైల్వే మంత్రి మమతా బెనర్జీని కలిసి మెమొరాండం సమర్పించారు. అపరిష్కృతంగా ఉన్న కొన్ని డిమాండ్లను పరిష్కరించాలంటూ వేడుకున్నారు. కానీ, ఆ వేడుకోళ్లను ఆమె ఎంతవరకు వింటారనేది అనుమానమే.
ఎందుకంటే ప్రతి సంవత్సరం మన పార్లమెంటు సభ్యులు రైళ్ల మంత్రిని కలవటం, కొన్ని డిమాండ్లను సమర్పించటం.... వాటిని వారు పట్టించుకోకపోవటం రెగ్యులర్‌గా జరుగుతున్న వ్యవహారమే... ఒకటీ, అరా తప్ప వాస్తవంగా మన అవసరాలను తీర్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. 40 ఏళ్ల కాలంలో కేవలం 440 కిలోమీటర్ల రైలు మార్గమే పూర్తయిందంటే మన రాష్ట్రం రైల్వేల విషయంలో ఎంత దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన ఎంపిలు తమ అధిష్ఠానానికి వారి బలాన్ని, ఇక్కడి ప్రజల అవసరాల్ని గుర్తించే విధంగా కార్యాచరణకు పూనుకోనంత వరకు ఈ పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదు...

1 కామెంట్‌:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మనవాళ్ళు ఇంత ఘనులు కాబట్టే ఎప్పుడో 80దశకంలో ప్రారంభమయిన రేణిగుంట గుంతకల్ మధ్య డబుల్ లైను ఇంతవరకూ పూర్తికాలేదు ఇంకా ఎన్ని శతాబ్దాలు పట్టాలో పూర్తికావడానికి.