1, జులై 2009, బుధవారం
textail కు దిక్కేది? దక్కేదేమిటి?
బడ్టెట్ నుంచి రాయితీలు దండిగా ఆశిస్తున్న శాఖ textail... గత రెండుమూడేళు్లగా textail ఇండస్ట్రీకి బడ్జెట్‌లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఈసారి ఈ మంత్రిత్వ శాఖ దయానిధి మారన్ చేతుల్లోకి వెళ్లటంతో ఆయన అనేక ప్రతిపాదనలు చేస్తున్నారు. మరి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వస్త్ర రంగంపై వరాలు కురిపిస్తారా? నిరాశ పరుస్తారా? ఎందుకంటే బడ్జెట్ సీజన్ వచ్చిందంటేనే మిగతా రంగాలతో పాటు వస్త్ర పరిశ్రమ ఆశలు పెట్టుకోవటం సహజం...కానీ ప్రతిసారీ వస్త్ర ప్రరిశ్రమకు మొండిచెయ్యే మిగులుతోంది. దేశంలో వ్యవసాయం తరువాత అతి పెద్ద రంగం వస్త్ర పరిశ్రమ. విదేశాలకు మనం చేస్తున్న ఎగుమతుల్లో textail రంగానిదే పెద్ద పీట. స్థూల జాతీయోత్పత్తిలో textail నాలుగు శాతం అందిస్తోంది. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తిలో 14 శాతం ఈ రంగానిదే. దేశంలోని కార్మిక వర్గంలోనూ 21 శాతం వసా్తల్ర తయారీలోనే ఉన్నారు. ఇక ఎగుమతుల ఆదాయంలో 17 శాతం ఈ రంగం నుంచే మనకు లభిస్తోంది. జూట్ ఉత్పత్తితో కలిసి ప్రపంచ వస్త్ర ఉత్పత్తిలో మన వాటా 12శాతం. ఇంత కీలకమైన శాఖకు ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తుందంటే మాత్రం అంతంత మాత్రమేనని చెప్పాలి. అందునా చేనేత పరిశ్రమలో భారత దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 4.6 మిలియన్ల హాండ్‌లూమ్‌స ఉంటే అందులో 3.9 మిలియన్లు.. అంటే 85 శాంతం మన దేశంలోనే ఉన్నాయి. అత్యధిక మగ్గాలు కూడా కుటీర పరిశ్రమల్లోనే ఉన్నాయి. కార్మికులు కూడా చిన్న మగ్గాలపై నేసేవారి సంఖ్య లక్షల సంఖ్యల్లో ఉంటుంది. ఉదాహరణకు మన రాష్ట్రంలోనే చేనేత కార్మికుల సంఖ్య అధికం. ఒక్క సిరిసిల్లలోనే లక్షమంది జనాభా ఉంటే, అందులో 90 శాతం మంది చేనేత మగ్గాలపైనే జీవితాల్ని గడుపుతున్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు ప్రారంభమైన తరువాత అప్పటిదాకా ఎగుమతుల విషయంలో అప్పటిదాకా అమల్లో ఉన్న కోటా పద్ధతిని ఎత్తివేశారు. అప్పటి నుంచి కొంత వరకు textail ఎగుమతులు మెరుగుపడిన మాట వాస్తవమే. ప్రత్యేకించి చేనేత వసా్తల్ర ఎగుమతులు 3.17 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రెడీమెడ్ వసా్తల్ర ఎగుమతులూ పెరిగాయి. దాదాపు 15 బిలియన్ డాలర్ల వ్యాపారం వస్త్ర రంగం విదేశాలతో చేస్తోంది. కానీ, ఆసియా మార్కెట్ వాటాలో చైనా సింహభాగాన్ని కొట్టేసింది. దీనికి తోడు ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం దేశంలో వస్త్ర పరిశ్రమను కునారిల్లేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమను ప్రణబ్ ముఖర్జీ ఏ విధంగా ఆదుకుంటారో చూడాలి. వాస్తవానికి గత ఫిబ్రవరిలోనే కొన్ని పన్నులు తగ్గించాలంటూ టెక్సటైల్ ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని కోరింది. కానీ మన్మోహన్ సర్కారు అంతగా కనికరించలేదు. అప్పుడు ఓట్ ఆన్ అక్కౌంట్ అని సర్దిపెట్టుకున్నా, ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి ప్రణబ్ బాబూ కొన్ని వరాలైనా ఇస్తారని ఇండస్ట్రీ కోరుకుంటోంది. డ్యూటీ డ్రా బ్యాక్.. డిడిబి, డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్ పాస్‌బుక్ రేట్లను పునరుద్ధరించాలని textail ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. ఎగుమతి సంబంధిత సేవలపై సర్వీసు టాక్‌సను వెనక్కి చెల్లించాలని textail ఎక్‌సపోర్‌ట కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. దేశంలో కొత్త ఫైబర్ పాలసీని రూపొందించాలని జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్ భావిస్తున్నారు. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. అంతర్జాతీయ మార్కెట్ షేర్‌లో చైనా వాటా 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగితే, మన వాటా తగ్గిపోతోంది. అటు పాకిస్తాన్ కూడా మనతో పోటీ పడుతోంది. ఆర్ అండ్ డి రిబేట్ 7.5 శాతం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎగుమతుల ద్వారా గ్లోబల్ మార్కెట్ వాటాను పెంచుకోవటానికి ప్రణబ్ ఎలాంటి ఉపాయాలు సూచిస్తారో తెలియదు..అంతే కాకుండా డొమెస్టిక్ మార్కెట్‌లో కూడా వాణిజ్యాన్ని పెంచటం కూడా ప్రణబ్ ముందున్న పెద్ద సవాలు.. అంతకు మించి మన రాష్ట్రంతో పాటు దేశంలో చితికి పోతున్న చేనేత కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకోవటానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కూడా చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న డిమాండ్.... దీన్ని ఎంతవరకు తీరుస్తారో చూడాలి. జౌళి మంత్రి దయానిధి మారన్ మాత్రం ఆర్థికమంత్రి ప్రణబ్‌పై బోలెడు ఆశలు పెట్టుకుని వందరోజుల అజెండాను కూడా ప్రకటించేశారు..మరి...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి